13 మందిని చంపిందన్న ఆరోపణలతో...
పియంబినొ: ఐసీయూలో 13 మంది చావుకు కారణమైందనే ఆరోపణలతో ఇటాలీకి చెందిన ఓ నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసీయూలో రోగులకు ప్రమాదకర ఇంక్షన్ ఇచ్చి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. టస్కార్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఫ్రాస్టా బొనినొ(55)ను బుధవారం అరెస్ట్ చేసినట్టు ఇటలీ ఎన్ఎస్ఏ విభాగం పోలీసులు వెల్లడించారు.
ఎనస్తీషియా, ఐసీయూ యూనిట్ లో పనిచేస్తున్న ఆమె 2014-2015 మధ్యకాలంలో ప్రమాదకర ఇంక్షన్ ఇచ్చి 13 మంది మరణానికి కారకురాలైన్నట్టు అనుమానిస్తున్నారు. వివిధ రకాల రోగాలతో బాధ పడుతున్న వృద్ధులకు ఆమె విషపు ఇంక్షన్లు ఇవ్వడం గమనార్హం. చనిపోయిన 13 మంది 61 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న వారే కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా నిందితురాలిపై నిఘా పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి కేసులో మరో నర్సుకు గత నెలలో కోర్టు జీవితఖైదు విధించింది.