
కోలుకున్న ములాయం
లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోలుకున్నారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు స్వైన్ఫ్లూ సోకినట్లు కూడా అనుమానించారు. ఈ నేపథ్యంలోనే లక్నోలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవడంతో జనరల్ వార్డుకు తరలించినట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు.