న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామన్య ప్రజలు ఎదుర్కొన్న అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్.. బెడ్ల కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, తన ఫౌండేషన్ (YouWeCan Foundation) ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు.
ఈ ఐసీయూ బెడ్లను యువీ నేడు వర్చువల్‌గా ప్రారంభించాడు. కాగా, ఈ సిక్సర్ల వీరుడు.. గతంలో కూడా ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్న కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment