nizmabad
-
డెంగ్యూ డేంజర్..
-
పొలిటికల్ కారిడార్ : నిజామాబాద్ కమలం పార్టీలో కుంపట్లు
-
చనిపోయిన వ్యక్తి లేచొచ్చాడా?
నగరంలోని సర్వే నెం.173లో మూడు ఎకరాలపైనే ఉన్న భూమిని 143 గజాల భూమిగా చూపి రిజిస్ట్రేషన్ చేశారు. గమ్మత్తైన విషయమేమంటే ఆధార్ కార్డులో తండ్రి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పై ఉదంతాలే నిదర్శనం. ముగ్గురు రాజకీయ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ఉద్యోగ సంఘం నాయకుడు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి పేదల భూములకు ఎసరు పెట్టారు. అలాగే, సర్కారు ఆదాయానికి గండి కొట్టారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారే మాఫియా అవతారం ఎత్తి అక్రమాలకు లైసెన్స్ ఇవ్వడం గమనార్హం. సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అక్రమ సంపాదనకు దండిగా అలవాటు పడిన ఆ అధికారి ఏడాది వ్యవధిలోనే రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 50 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడం, లేని వారసులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు ఇతరులకు కట్టుబెట్టిన భారీగా దండుకున్నట్లు తెలిసింది. నగరంలోని కంఠేశ్వర్ ఏరియాలో గల సర్వే నెం.268లో 2.11 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం స్థలాన్ని కేవలం 110 గజాలుగా చూపి ఇటీవల వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. విచిత్రమేమిమంటే ఈ భూమి యజమాని బంటు ఎర్రన్న 1973లో చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు 2004లోనే డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అయితే కొంత మంది అక్రమార్కులు కలిసి 2.11 ఎకరాల భూమిని కాజేయాలని ప్లాన్ చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై బంటు ఎర్రన్న తన భూమిని ఇతరులకు విక్రయించినట్లు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే, 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఎర్రన్న గత సెప్టెంబర్ 3న తన భూమిని ఇతరుల పేరిట ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. విచారణలో నిగ్గుతేలేనా..? సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడిన సదరు అధికారి తనకేమీ తెలియదన్నట్లుగా ఆ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఎదుట అయామక చక్రవర్తిగా నటించినట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, తన సస్పెన్షన్‌ను ఎత్తి వేయించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులతో హైదరాబాద్‌లో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, తన ముఠా సభ్యులు తనను కాపాడతారన్న ధీమాతో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
యువీ దాతృత్వం.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 120 ఐసీయూ బెడ్స్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామన్య ప్రజలు ఎదుర్కొన్న అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్.. బెడ్ల కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, తన ఫౌండేషన్ (YouWeCan Foundation) ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు. ఈ ఐసీయూ బెడ్లను యువీ నేడు వర్చువల్‌గా ప్రారంభించాడు. కాగా, ఈ సిక్సర్ల వీరుడు.. గతంలో కూడా ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్న కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు. -
కూతురు ఆత్మహత్య.. భర్తతో అంత్యక్రియలు
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పెళ్లి చేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య(25) తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోన్న శరణ్య భర్త వేధింపులు తాళలేక ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కూతురు మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకువచ్చి ఆమె భర్త చేత అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా సమయంలో బెంగళూరు నుంచి తమ కూతురి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఎలాంటి బేషజాలకు పోకుండా భర్త రోహిత్ చేత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. శరణ్య మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో.. అల్లుడు రోహిత్ వేధింపుల వల్లనే శరణ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ గొడవలన్నీ పెట్టి సంప్రదాయం ప్రకారం అల్లుడితో కూతురికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి) -
ఆర్మూర్‌లో 6కు చేరిన కరోనా కేసులు
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో కరోనా కేసులు 6కు చేరాయి. కాగా గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామస్థులు బయటి వారు గ్రామంలోకి రాకుండా పొలిమేరలో కంచె ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గ్రామంలోని వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని అధికారులు పిచికారీ చేయిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. (కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే) -
నిజామాబాద్‌లో వాహనాలను తనిఖీ చేసిన సీపీ కార్తికేయ
-
కల్లు ప్రియులకు ఇక్కట్లు
-
ప్రేమిస్తావా.. యాసిడ్ పోయాలా!
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రేమిస్తావా లేక యాసిడ్ పోయాలా అంటూ ఓ యువకుడు నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను నిత్యం వేధించడంతో పాటు బుధవారం రాత్రి ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసులు గురువారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నాగిరెడ్డిపేట ఎస్సై మోహన్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను జలాల్పూర్ గ్రామానికి చెందిన ఎర్ర రవి అనే యువకుడు తనను ప్రేమించాలని నిత్యం వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న రవి బుధవారం రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి సదరు బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇతర కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులు వచ్చి రవిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు రవిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రవి ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. -
తమ్ముడు.. బడికి వెళ్లి చదువుకోరా!!
సాక్షి, బాన్సువాడ టౌన్: పట్టణంలోని మోడల్ స్కూల్ విద్యార్థినులు కొందరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. యాచిస్తున్న బాలుడిని దగ్గరకు తీసుకుని చదుకోవాలని సూచించారు. పట్టణంలోని రాజారాం దుబ్బా కాలనీకి చెందిన ఆరేళ్ల ఘన్‌వీర్ గురువారం ఉదయం యాచిస్తు న్నాడు. అదే సమయంలో మోడ ల్ స్కూల్‌కు చెందిన వర్షిక, శ్రేష్ట, నిఖిత, శృతిక, అక్షర, మమత పాఠశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలుచున్నారు. బాలుడ్ని చూసిన విద్యార్థినులు అతడ్ని ఆపి వివరాలు ఆరా తీశారు. పక్కనే ఇడ్లీ సెంటర్ నుంచి ఇడ్లీలు తీసుకొచ్చి అతడికి తినిపించారు. ‘తమ్ముడు.. ఎందుకు అడుక్కుంటున్నావురా.. ఇలా అడుక్కోమని ఎవరు చెప్పారురా.. మా లాగా బడికి వెళ్లి మంచిగా చదువుకోరా.. బడికి వెళ్తావా.. మేం చేర్పిస్తామని’ చెప్పారు. దీంతో ఆ బాలుడు ఏడుపు మొదలు పెట్టడంతో విద్యార్థునులు తెలిసిన వారి సాయంతో చైల్డ్ లేబర్ ఆఫీసర్‌కు ఫోన్ చేశారు. సదరు అధికారి ఎంతకీ రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రు లకు నచ్చ జెప్పి బాలుడిని బడి లో చేర్పించే ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్పడంతో విద్యార్థి నులు స్కూల్‌కు వెళ్లారు. వారికి వచ్చిన ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే బాల కార్మికులు లేని రాష్ట్రంగా తయారు కావడం ఖాయం. -
ఎర్రజొన్న కొనాల్సిందే
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ఎర్రజొన్న పంటను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ అధికారులు, ఎర్రజొన్న వ్యాపారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులతో నిర్వహించిన సమవేశంలో కలెక్టర్ మాట్లాడారు. రైతుల, వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సాగును మెల్ల మెల్లగా తగ్గించుకోవాలని గతేడాదే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలియజేశామని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే కాల పరిమితి, తక్కువ తడులతో ఈ పంట అనుకూలంగా ఉన్నందున రైతులు దీనినే సాగు చేశారన్నారు. విత్తనాలు సరఫరా చేసే సమయంలో పంటను కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్న వ్యాపారులు ఇప్పుడు దిగుబడి పెరగడంతో ధర తక్కువ ఇస్తామని చెప్ప డం సరికాదన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రైతుబంధు, రైతు బీమా తదితర ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. నోటి మాటలైనా, లిఖిత పూర్వక ఒప్పందమైనా పాటించాల్సిందేనని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చూస్తూ ఊరు కోమన్నారు. రైతులు వ్యాపారుల మోసానికి ప్రతిసారి బలికాకుండా ఇతర పంటల సాగుకు ఆలోచించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. పసుపును మార్కెట్‌కు తెచ్చేముందు బాగా ఆరబెట్టుకొని, తేమను తగ్గించి తేవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియా వెళ్దామనుకుని అనంతలోకాలకు..
మేడ్చల్ రూరల్ : బీటెక్ పూర్తి చేసిన ఓ విద్యార్థి మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన మంగళవారం రాత్రి మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంభవించింది. వివరాల.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఆశిష్(24), సాయి(23) చదువు నిమిత్తం కొంపల్లిలోని సినీప్లానెట్ సమీపంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆశిష్ మండలంలోని కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో 2016లో బీటెక్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయి.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఆశిష్, సాయిలు ఇద్దరు కలిసి తన స్నేహితుడి బైక్‌పై మేడ్చల్‌కు వెళ్తుండగా కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై వీరి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వారు తప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ట్రాలీ ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా సాయి తీవ్ర గాయాలకు గురి కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇస్తారా.. ముంచేస్తారా?!
‘సారు నీ కాళ్లు మొక్కుతా.. పైసాపైసా పోగుచేసుకుని మీ మీద నమ్మకంతో జమచేసిన. రెండెళ్లయింది ఇస్తామని.. ఇంకా ఇస్తలేరు. చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకుంటలేరు. మా బాధను అర్థం చేసుకోండి.. మా డబ్బులు మాకు ఇయ్యుండ్రి’.. అంటూ జిల్లా కేంద్రంలోని వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో నిత్యం బాధితుల మొరలు వినిపిస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి టౌన్/కామారెడ్డి: వందలాది మంది బాధితులు తాము జమ చేసుకున్న డబ్బుల కోసం కంపెనీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ఖాతాదారులకు డబ్బులు చెల్లించాల్సిన సమయం ఏడాది దాటి నా, ఖాతాదారులు కాళ్లవేళ్లా పడినా డబ్బులు ఇవ్వడం లేరు. కంపెనీ పేరు తో మరో చోట పెట్టుబడులు పెట్టామని, డబ్బులు వచ్చాకే ఇస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో తమ డబ్బులు ఇస్తారా.. ముంచేస్తారా.. అన్న సందేహంలో ఖాతాదారులు అందోళనకు గురవుతున్నారు. బారులు తీరుతున్న బాధితులు చిట్టీల పేరుతో వందలాది మంది ఖాతాదారుల నుంచి ఐదేళ్లలో రూ.కోట్ల డబ్బులు కట్టించుకున్న వెల్ఫేర్ కంపెనీ చెల్లింపుల్లో పాల్పడుతున్న మోసాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితులు తమ డబ్బుల కోసం బారు లు తీరడం పెరిగింది. సిబ్బంది మా త్రం తమ దగ్గర డబ్బులు లేవంటున్నా రు. ‘అవసరమైతే తాళం వేసి బయట పంచాయితీ పెట్టుకుందాం.. అప్పుడు మీ డబ్బులు పూర్తిగా రావు మీ ఇష్టం’.. అనే రీతిలో సమాధానాలిస్తున్నారు. మేం ఇచ్చిన్నప్పుడే తీసుకుంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇస్తున్నారని ఖాతాధారులు వాపోతున్నారు. రాసిచ్చిన తేదీల్లోనే రావాలని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకం పేరిట నట్టేట ముంచుతున్నారని ఆగ్రహిస్తున్నారు. పేదలనే టార్గెట్ చేశారు కూలీలు, బీడీ కార్మికులు, చిరుద్యోగులనే కంపెనీ టార్గెట్‌గా చేసుకుంది. భారీ మొత్తంలో కమీషన్లు ఇచ్చి 50కిపైగా ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ ద్వారా 40కి పైగానే కస్టమర్లను రాబట్టారు. మా కంపెనీలో ప్రతి నెల చొప్పున మూడేళ్లు డబ్బులు పోగుచేసి మరో రెండేళ్లు ఆగితే కస్టమర్లకు రెండింతలు ఇస్తామని ఆశ చూపించారు. ఒక్కో కస్టమర్ నుంచి నెలకు కనీసం రూ.300 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు కట్టించుకున్నారు. ఇలా రూ.2.50 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బుతో కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో వెంచర్లు, ఇతర వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టారు. సుమారు 500 మందికిపైగా ఖాతాదారులు కంపెనీకి బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. దీంట్లో ఎక్కువగా నిరుపేదలే ఉన్నారు. కంపెనీ కార్యాలయానికి బాధితులు వస్తుండడంతో వెల్ఫేర్ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయమై కామారెడ్డి బ్రాంచ్ ఏరియా మేనేజర్ లక్ష్మీనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇక్కడి ఇబ్బందులను, ఖాతాదారుల కష్టాలను కంపెనీ ఎండీకి తెలిపామని, పైనుంచి డబ్బులు వస్తేనే చెల్లిస్తామని, మా చేతుల్లో ఏమి లేదని సమాధానమిచ్చారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. మా ఊరి ఏజెంట్ నమ్మించి మూడేళ్లు డబ్బులు కట్టించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇయ్యలే. ఆర్నెళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా. కాళ్లు మొక్కుతా అన్నా కనికరిస్తలేరు. మాలాంటి పేదోళ్లను మోసం చేస్తున్నారు. మా డబ్బులు మాకు వెంటనే ఇయ్యాలే. – బాలవ్వ, రామారెడ్డి మండలం -
చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
-
చెరువులో పడి ఇద్దరు విద్యార్థుల గల్లంతు
మద్నూర్: నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం చిన్నషక్కర్‌గాం చెరువులో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు శుక్రవారం సాయంత్రం చెరువులో ఈతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి కోసం కుటుంబసభ్యులు వెతకగా చెరువు గట్టుపై వారి దుస్తులు, చెప్పులు కనిపించటంతో లోపలికి దిగి ఈత కొట్టే క్రమంలో మునిగి ఉంటారని భావిస్తున్నారు. అయితే, రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో శనివారం ఉదయం వారి కోసం గాలింపు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
20,21 తేదీల్లో జిల్లాకు రాహుల్ దూతలు
సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటకు రంగం సిద్ధమైంది. రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను గుర్తించేందుకు రాహూల్ దూతలు ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ సెగ్మెం ట్లలో అభ్యర్థులను గుర్తించనున్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో ఉండగా, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ లోకసభ పరిధిలో ఉన్నాయి. ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు పెద్దపల్లి లోకసభ స్థానం పరిధిలో ఉన్నాయి. రాహుల్ దూతలుగా వస్తున్న నేతలు ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతోపాటు వివిధ వర్గాలనుంచి సమాచారాన్ని తెలుసుకుంటారు. లోకసభ స్థానంతోపాటు వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విజయావకాశాలున్న ముగ్గురిని గుర్తించి వారి పేర్లను ఏఐసీసీకి అందజేస్తారు. అందులోంచి ఏఐసీసీ ఒకరిని ఎంపికచేసే అవకాశముంటుంది. కరీంనగర్ లోకసభ, దాని పరిధిలోని శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు, ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్, పెద్దపల్లి లోకసభ, దాని పరిధిలోని శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల నుంచి మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విజయ్ వాడేటివార్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల ఆశావాహుల నుంచి మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే యశ్వమతి ఠాకూర్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రాల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఏఐసీసీ సభ్యులు, నామినేటెడ్ సభ్యుల నుంచి పరిశీలకులు అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరాటపడుతున్న నేతలు దాదాపు అన్ని స్థానాల నుంచి పెద్దసంఖ్యలో పరిశీలకులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ బయోడేటా, పార్టీ ఆధ్వర్యంలో తాము చేపట్టిన కార్యక్రమాలు తదితర వివరాలతో వారు సిద్ధంగా ఉన్నారు. -
‘ఫారెస్టు’లో చీకటి దందా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి డివిజన్లున్నాయి. వీటి పరిధిలో నిజామాబా ద్, కమ్మర్పల్లి, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఇందల్వాయి రెంజ్లున్నాయి. జిల్లావ్యాప్తంగా 140 సా మిల్లులు పనిచేస్తుండగా.. ఇందులో టేకు కలపకు సంబంధించిన సామిల్లులు 60 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా 40కిపైగా టేకు కలప సా మిల్లులున్నట్లు తెలుస్తోంది. ఏటా డిసెంబర్లో సామిల్లులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తవాటికీ ఇదే సమయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి పనికో రేటు కొత్తగా సామిల్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారికి అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు చుక్క లు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సామిల్లు అనుమతి కోసం రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే సవాలక్ష కొర్రీలతో అడ్డుకుంటున్నట్లు సమాచారం. రెన్యువల్ కోసం ఒక్కొక్కరి వద్దనుంచి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ‘బీట్’లోనూ.. బీట్ అధికారులు కూడా తక్కువ తినడం లేదన్న ఆరోపణలున్నాయి. కలపతో అక్రమ వ్యాపారం చేస్తున్న సామిల్లు యాజమానుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సామిల్లు యాజమాని వద్ద నుంచి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు నొక్కేస్తున్నట్లు సమాచారం. కలప స్మగ్లర్లతో సంబంధాలు కలప అక్రమ రవాణా చేసే స్మగ్లర్లతోనూ పలువురు సిబ్బంది సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఐదారు గ్రూపులుగా ఏర్పడిన దళారులు కలప అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, చెన్నూరు, ఇచ్చోడ ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్, ఇతరత్రా ప్రదేశాల నుంచి టేకు కలపను అక్రమంగా నిజామాబాద్ తరలిస్తున్నారు. నిజామాబాద్‌లో తమకు సంబంధమున్న సామిల్లుకు గుట్టు చప్పుడు కాకుండా కలపను పంపి, ఫర్నీచర్ తయారు చేయించి, కొనుగోలుదారులకు, దుకాణాలకు పంపిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సహాయానికి కృతజ్ఞతగా స్మగ్లర్లు భారీగానే డబ్బులు అందిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు పర్సంటేజీలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పది రోజుల వ్యవధిలో.. జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే భారీగా కలప పట్టుబడింది. జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్ ప్రాంతంలో ఒక పాత ఇంటిపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులు 22 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం ఎల్లంపేట శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకు దుంగలను పట్టుకున్నారు. మల్కాపూర్ శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకుదుంగలను, భీమ్‌గల్‌లోని ఓ సామిల్లులో అక్రమ కలపతో తయారు చేసిన సోఫాసెట్లు, విలువైన ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న చీకటి దందా విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది. అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కలప అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని, ఇంటిదొంగల పని పట్టాలని ప్రజలు కోరుతున్నారు.