
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పెళ్లి చేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శరణ్య(25) తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోన్న శరణ్య భర్త వేధింపులు తాళలేక ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కూతురు మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకువచ్చి ఆమె భర్త చేత అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా సమయంలో బెంగళూరు నుంచి తమ కూతురి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఎలాంటి బేషజాలకు పోకుండా భర్త రోహిత్ చేత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. శరణ్య మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో.. అల్లుడు రోహిత్ వేధింపుల వల్లనే శరణ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ గొడవలన్నీ పెట్టి సంప్రదాయం ప్రకారం అల్లుడితో కూతురికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి)
Comments
Please login to add a commentAdd a comment