sharanya
-
ఫ్రెండ్లీ స్టయిలిస్ట్ శరణ్యారావు
ఫ్యాషన్ వరల్డ్‌లో తెలుగువాళ్లు తక్కువగా కనిపిస్తారు.కానీ క్రియేటివ్ స్కిల్స్‌తో గట్టిగా నిలబడతారు!వాళ్లలో శరణ్యారావు పేరును చెప్పుకోవచ్చు గొప్పగా!శరణ్య స్వస్థలం విశాఖపట్నం. ముస్తాబు చేయడంలో ముందుండేది చిన్నప్పటి నుంచీ! శరణ్య అలంకరణ, స్టయిలింగ్కి తొలి మోడల్ ఆమె చెల్లెలే! ఇంటి పనుల్లో అమ్మ బిజీగా ఉండి, చెల్లిని రెడీ చేయలేకపోతే ఆ బాధ్యత తను తీసుకునేది! అది క్రమంగా అభిరుచిగా మారింది. తన పాకెట్ మనీతో మేకప్ వస్తువులు కొనేది. ఏ చిన్న ఫంక్షన్ అయినా చెల్లిని చక్కగా ముస్తాబు చేసి మురిసిపోయేది. ఆ అలంకరణను కొన్నిసార్లు అందరూ మెచ్చుకున్నా, చెల్లికి నచ్చేది కాదు. మరికొన్నిసార్లు ఎవ్వరికీ నచ్చకపోయినా, చెల్లికి మాత్రం తెగ నచ్చేది. ఇష్టాయిష్టాల్లో ఒకొక్కరిదీ ఒక్కో టేస్ట్ అని అర్థంచేసుకుంది శరణ్య. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అందరూ మెచ్చే స్టయిలింగ్‌ని చూపించొచ్చు అని తెలుసుకుంది. రానురాను అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఫ్యాషన్ మీదున్న మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్ కోర్సుచేసి, పేరున్న డిజైనర్ దగ్గర కొంతకాలం పనిచేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టయిలింగ్ స్టార్ట్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ, బ్రాండెడ్ దుస్తులతోనే స్టయిలింగ్ అనే ప్రాక్టీస్‌ని మార్చేసింది. పర్సనాలిటీ, బాడీ టైప్, బాడీ టోన్, కంఫర్ట్ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ షాపింగ్ దుస్తులతో స్టయిలింVŠ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించుకోవడం మొదలుపెట్టింది. అలా శరణ్య స్టయిలింగ్కి ఫిదా అయ్యి, ఆమె స్టయిలింగ్‌తో గార్జస్ అనిపించుకున్న వారిలో శ్రీలీల, ఐశ్వర్యా మీనన్, కావ్యా థాపర్, దక్షా నాగర్కర్, అదితీ గౌతమి, మాళవికా నాయర్, మిర్నా మీనన్ ఉన్నారు. రామ్ పోతినేని, సుశాంత్, సత్యదేవ్ లాంటి మేల్ యాక్టర్స్‌కూ శరణ్య స్టయిలింగ్ చేసింది. ‘తిమ్మరుసు’, ‘స్కంద’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది. సినిమా కలర్ పాలెట్‌ను ఫాలో అవుతూ.. లెవెన్త్ అవర్‌లో కూడా కూల్‌గా స్టయిలింగ్ అందించే డైరెక్టర్స్ ఫ్రెండ్లీ స్టయిలిస్ట్‌గా శరణ్యకు మంచి పేరుంది. అలా బోయపాటి, మెహర్ రమేశ్ వంటి డైరెక్టర్లకు ఆమె ఫేవరిట్ స్టయిలిస్ట్ అయింది. -
Sharanya Pradeep: అంబాజీపేటతో ఫిదా చేసిన 'శరణ్య ప్రదీప్' ఫోటోలు వైరల్
-
ఆ సీన్ గురించి తప్పుడు ప్రచారం.. చాలా బాధ పడ్డాను: నటి శరణ్య
శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా సుహాస్‌కు అక్కగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో తన నటనతో విశ్వరూపాన్ని చూపింది. ఈ సినిమాలో సుహాస్‌ను పూర్తిగా శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విలన్ ఆమెను బట్టలు తొలగించి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్లో విలన్‌ను కాలితో తన్నిన సీన్లో గానీ శరణ్య విజృంభించేసింది. శరణ్యతో పాటుగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా నటించాడు. ఈ చిత్రంలో శరణ్యకు ప్రియుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒక యువతిని ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో జగదీశ్ జైలుకు వెళ్లి ఆపై బెయిల్‌పై వచ్చాడు. ఈ అంశం గురించి శరణ్య తాజాగా ఇలా రియాక్ట్ అయింది. 'జగదీస్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటి సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం. అయితే మా సినిమా సెట్లో మాత్రం జగదీశ్ అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడు. నాకు తెలిసినంత వరకు అతడి క్యారెక్టర్లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.' అని శరణ్య పేర్కొంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ఆమెను వివస్త్రను చేసిన సీన్ గురించి ఆమె ఇప్పటికే పంచుకుంది. తన భర్త సపోర్ట్ ద్వారా మాత్రమే ఆ సీన్ చేయగలిగానని చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబ్ వారు తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. సినిమాలో ఎం లేకపోయినా కూడా ఎదో ఉంది అనేలా క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో చాలా వీడియోలకు స్ట్రైక్స్ కొట్టినా ఉపయోగం లేదని శరణ్య వాపోయింది. వాస్తవంగా ఆ సీన్లో ఎలాంటి అసభ్యత లేదు. ఆ సీన్లో నటించాలంటే గట్స్ ఉండాలి. కానీ శరణ్య ఎంతో ధైర్యంగా ఒప్పుకుని ఆ సీన్లో మెప్పించింది. దీంతో తన సినీ కెరియర్లో మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. ఏదేమైనా సరైన కథ,దర్శకుడి చేతిలో శరణ్య పడితే మరోసారి తన నటనతో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. -
ఈమె తెలుగు హిట్ సినిమా హీరోయిన్.. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వెళ్లేటోళ్లు వెళ్లిపోతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు హిట్ మూవీస్ చేసినా సరే కనుమరుగైపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం టాలీవుడ్ హిట్ మూవీలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఎవరో గుర్తొచ్చిందా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు శరణ్య నాగ్. అరె.. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే? ఏ సినిమాలో చేసిందబ్బా అని ఆలోచిస్తున్నారా? కంగారూ పడకండి. 2006లో '10th క్లాస్' అని ఓ సినిమా రిలీజైంది. అందులో హీరోయిన్గా చేసింది ఈమెనే. చెన్నైలో పుట్టి పెరిగిన శరణ్య.. 1998లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'కాదల్ కవితై', 'నీ వరువాయ్ ఎన్న' సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా 'భ్రమయుగం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 2003 నుంచి పూర్తిస్థాయి నటిగా మారింది. ఆ ఏడాదే తెలుగులో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా యాక్ట్ చేసింది. 'ప్రేమిస్తే' సినిమాలోనూ నటించింది. 2006లో రిలీజైన '10th క్లాస్' చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. ఇది హిట్ అయినా సరే ఇక్కడ పెద్దగా అవకాశాలేం రాలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత 'ప్రేమ ఒక మైకం' అనే తెలుగు సినిమాలో ఓ సహాయ పాత్ర చేసింది. 2014 తర్వాత నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయిన శరణ్య.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది. అయితే అప్పట్లో టీనేజ్ బ్యూటీలా ఉన్నప్పుడు చూసి, మళ్లీ ఇప్పుడు చూసేసరికి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆమె ఈమెనా అని తెలిసి అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) View this post on Instagram A post shared by Sharanya Nagh (@sharanya_nagh) -
ఐదుగురి మధ్యలో ఆ సీన్ చేశా.. నా భర్త ప్రోత్సహించాడు: శరణ్య
టాలీవుడ్లో చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. సరైన పాత్ర దొరికితే కానీ వాళ్ల టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలియదు. అలా అని అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తూ కూర్చోలేరు. వచ్చిన పాత్రలు చేస్తూ..నచ్చిన పాత్ర దొరికినప్పుడు రెచ్చిపోయి నటిస్తారు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో నటి శరణ్య అదే పని చేసింది. ఈ సినిమాలో హీరో సుహాస్ అయినప్పటికీ.. సినిమా చూసినవారంతా నటి శరణ్యనే హీరో అని అంటున్నారు. అంతలా తన నటనతో ఆకట్టుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. మొదట్లో న్యూస్ రీడర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శరణ్య. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో సాయి పల్లవి అక్కగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. శరణ్యకు ఆ స్థాయి గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు శరణ్యలోని అసలైన నటిని పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు సినీ ప్రియులు ‘ఫిదా’ అయ్యారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సన్నివేశంతో పాటు స్కూల్లో విలన్‌తో వచ్చే సీన్లో శరణ్య నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాకు ఎంతో కీలకమైన సీన్లో నగ్నంగా నటించి అందరిని షాక్‌కు గురి చేసింది. (చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ) తాజాగా ఆ సన్నివేశం గురించి శరణ్య మాట్లాడుతూ.. ‘ఆ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే కాస్త భయం అనిపించింది. అలాంటి సన్నివేశంలో ఇంతవరకు నటించలేదు. కానీ నా భయాన్ని పోగొట్టి సపోర్ట్‌గా నిలిచింది మాత్రం నా భర్త. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది.. ధైర్యంగా నటించు అని నా భర్త ప్రోత్సహించాడు. అలాగే చిత్ర యూనిట్ కూడా నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఆ సీన్లో నటించేటప్పుడు సెట్లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. డీవోపీ, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి..ఇలా ఐదుగురి సమక్షంలో చాలా కంఫర్టబుల్‌గా ఆ సీన్లో నటించా. టీమ్ సహకారంతోనే ఆ సీన్ అద్భుతంగా వచ్చింది’అని శరణ్య చెప్పుకొచ్చింది. -
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ
టైటిల్: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నటీనటులు:సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్ నిర్మాత: ధీరజ్మొగిలినేని దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్ ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్ విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2007లో సాగుతుంది. అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లీ(సుహాస్), పద్మ(శరణ్య) కవలలు. మల్లీ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ లో పని చేస్తుంటాడు. పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. తండ్రి కనకయ్య సెలూన్ షాప్ రన్ చేస్తుంటాడు. మల్లీకి ఆ ఊరిపెద్ద, ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే వెంకట బాబు(నితిన్ ప్రసన్న) చెల్లెలు లక్ష్మీ(శివానీ నాగారం) అంటే చాలా ఇష్టం. లక్ష్మీకి కూడా మల్లీని ఇష్టపడుతుంది. వీరిద్దరు సెలూన్ షాప్‌నే అడ్డాగా మార్చుకొని రహస్యంగా ప్రేమించుకుంటారు. మరోవైపు వెంకట బాబు, పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊర్లో పుకారు పుడుతుంది. పద్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా పేద పిల్లలకు విద్యను అందిస్తుంది. ఓ సారి వెంకట బాబు తమ్ముడు శ్రీను బాబు (వినయ్ మహాదేవ్), మధ్య మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో పద్మ శ్రీను చెంప పగలగొడుతుంది. అదే సమయంలో మల్లీ తన చెల్లితో ప్రేమలో ఉన్న విషయం వెంకట్‌కి తెలుస్తుంది. దీంతో పద్మను ఒంటరిగా స్కూల్లోకి రప్పించి ఘోరంగా అవమానిస్తాడు వెంకట్. ఈ విషయం మల్లీకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు వెంకటబాబు పద్మను ఏ రకంగా అవమానించాడు? పోలీసు స్టేషన్‌కి వెళ్లిన పద్మకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం కోసం పద్మ ఏం చేసింది? మల్లీకి వెంకట్ ఎందుకు గుండు గీశాడు? అక్క కోసం మల్లీ చేసిన పోరాటం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్ష నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ కూడా అదే. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ దుష్కంత్ కటికనేని రాసుకొన్న స్క్రీన్ ప్లే, కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కులాల పేర్లు ప్రస్తావించకుండా..కులాల మధ్య అంతరాన్ని తెరపై స్పష్టంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమాను సరదాగా ప్రారంభించి.. ఎమోషనల్‌గా ముగించాడు. తక్కువ కులానికి చెందిన హీరో..పెద్ద కులానికి చెందిన హీరోయిన్ని ప్రేమించడం అనే రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే లవ్‌స్టోరీ కొత్తగా అనిపించదు కానీ.. వినోదాన్ని మాత్రం అందిస్తుంది. ఇద్దరూ ప్రతి మంగళవారం సెలూన్ షాపులో కలుసుకోవడం.. ఫోన్లో జరుపుకునే సంభాషణలు, మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్(జగదీష్) వేసే పంచులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉంటాయి. కొన్ని సీన్లు అయితే వాస్తవికానికి దూరంగా అనిపిస్తాయి. ‘ఆధారం లేని ఆక్రమణ సంబంధం ..అవమాన పడ్డ ఆత్మాభిమానం’ అంటూ న్యాయం కోసం పద్మ చేసే న్యాయ పోరాటం మాత్రం ఆకట్టుకుంటుంది. పోలీసు స్టేషన్ సీన్ అయితే అదిరిపోతుంది. కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లోనూ అదే చేశాడు. మల్లీగాడు పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. లవర్‌గా, అక్క కోసం ఎంతకైనా తెగించే తమ్ముడిగా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సన్నీవేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక ఈ సినిమాలో సుహాస్ కంటే బాగా పండిన పాత్ర శరణ్యది. ఇన్నాళ్లు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన శరణ్య.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లో డిఫరెంట్ పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసిన వాళ్లు పద్మ పాత్రను మరిచిపోలేరు. ఆ పాత్రలో అంత గొప్పగా నటించింది శరణ్య. ఆమె నటనకు థియేటర్స్‌లో విజిల్స్ పడడం గ్యారెంటీ. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. లక్ష్మీగా శివానీ నాగారం తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. తెరపై అందంగానూ కనిపించింది. విలన్‌గా నితిన్ ప్రసన్న అదరగొట్టేశాడు. పుష్ప ఫేమ్ జగదీష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, కిట్టయ్య, సురభితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
మేడమ్ అని కాకుండా సార్ అని పిలిచారు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వీకే నరేశ్, శరణ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజా కొల్లూరు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో పూజా కొల్లూరు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పటికీ సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చని సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నాను. తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ నా తొలి సినిమా. కానీ ఈ చిత్రం కంటే ముందు కొన్ని హాలీవుడ్ ్రపాజెక్ట్స్తో అసోసియేషన్ ఉంది. కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ విషయానికి వస్తే.. వై నాట్ స్టూడియోస్ సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ కథను తెలుగులో చె΄్పాలనుకుని, వెంకటేశ్ మహాగారిని సంప్రదించారు. అయితే నిర్మాణంలో భాగమౌతానని, దర్శకత్వం వహించలేనని ఆయన చె΄్పారు. దీంతో నేను దర్శకత్వం వహిస్తానని వెంకటేశ్ మహాగారికి చెప్పడంతో ఆయన వారికి చె΄్పారు. ఓటర్లు వారి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలన్నది ఈ సినిమా థీమ్. ఓ సామాన్యుడు నటిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని సంపూర్ణేష్ని హీరోగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. నేను ఎడిటింగ్ కూడా చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏ భాషలోనైనా మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. నేను లేడీ డైరెక్టర్ని అయినా సెట్స్‌లో చాలాసార్లు ఓకే సార్ అన్నారు కానీ మేడమ్ అనలేదు. అంటే లింగ వివక్ష ఎంతలా నాటుకు΄ోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలున్నప్పటికీ మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. -
శరణ్యా ఎక్కడమ్మా..? అంటూ తల్లి వేదన.. 'పొదల్లో పడేశా.. చెరువులో వేశానంటూ భర్త సమాధానం..!
రంగారెడ్డి: మానవత్వం మంటగలుస్తోంది.. తాగుడు బానిసైన తండ్రిని ఏడాదిన్నర పాప వద్ద ఉంచి పనికి వెళ్తే పాపనే కనపడకుండా చేశాడు ఆ కసాయి. దీంతో ఆతల్లి బిడ్డ ఆచూకీ కోసం తల్లిడిల్లుతోంది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లికి చెందిన పద్మ, బోవయ్య దంపతులకు ఒక బాబు, పాప సంతానం. భర్త తాగుడుకు బానిసవ్వడంతో పద్మ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 4గంటలకు పనికి వెళ్లి రాత్రి ఒంటి గంటకు వస్తుంది. ఆమె ఎప్పటిలాగే మంగళవారం పిల్లల వద్ద తండ్రిని ఉంచి పనికి వెళ్లింది. రాత్రి 11గంటలకు హోటల్ వద్దకు వెళ్లిన బోవయ్య పిల్లలు ఏడుస్తున్నారని పద్మను ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వచ్చిచూస్తే కూతురు శరణ్య(18నెలలు) కనిపించలేదు. దీంతో పాప ఎక్కడని భర్తను నిలదీసింది. బైపాస్ సమీపంలోని చెట్ల పొదల్లో పడవేశా.. చెరువులో వేశా.. అంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పద్మ పోలీసులను ఆశ్రయించింది. భర్తపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు బైపాస్ సమీపంలోని చెట్ల పొదలు, చెరువులో గాలించినా పాప ఆచూకీ లభించలేదు. తాగుడుకు బానిసైన తండ్రి పాప ఎవరికై నా విక్రయించాడా..? హత్యచేసి మరెక్కడైనా పడవేశాడా, భార్యా భర్తలమధ్య కలహాలున్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ రాంరెడ్డి తెలిపారు. -
నరేశ్ అంటే ఎవరు అన్నారు
సంపూర్ణేష్ బాబు హీరోగా వీకే నరేష్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేశ్ మహా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదించడంతో పాటు క్రియేటివ్ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘వినోదం, సందేశం... ఈ రెండు అంశాలు మిళితమై ఉన్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ‘మార్టిన్ లూథర్ కింగ్’లో ఈ రెండూ ఉన్నాయి. ఓ గ్రామంలోని రాజకీయ వర్గానికి నాయకుడిగా నటించాను. తమిళ ‘మండేలా’ సినిమాకు ‘మార్టిన్..’ చిత్రం స్ఫూర్తి మాత్రమే. పూర్తి స్థాయి రీమేక్ కాదు. ఈ సినిమా సంపూర్ణేష్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లా ఉంటుంది. 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల నుంచి ఇండస్ట్రీకి తిరిగొచ్చిన ప్పుడు నరేశ్ అంటే ఎవరు? అని కొందరు అన్నారు. ఎస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. ఈ తరం దర్శకులు నాకోసం పాత్రలు రాయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ మహిళను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి.. రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఈ హత్య జరిగింది. మృతురాలిని గోపాలవాడకు చెందిన శరణ్యగా గుర్తించారు పోలీసులు. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆమెపై ఘాతుకం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ పక్కనే ఆమె మృతదేహాం పడి ఉంది. సమాచారం అందుకున్న డీసీపీ సుధీర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే శరణ్య భర్త సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే.. వాళ్ల ఇద్దరి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ ఆ కోణం నుంచే మొదలైంది. -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
ఘనంగా సీనియర్ నటి కూతురి పెళ్లి..హాజరైన సీఎం
చెన్నై: నటుడు పొనవన్నన్, శరణ్య దంపతుల ఇంట పెళ్లి సందడి నెలకొంది. వీరి కుమార్తె ప్రియదర్శిని, విఘ్నేశ్‌ల వివాహ రిసెప్షన్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్లో ఘనంగా జరిగింది.పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరైన నూతన దంపతులకు శుభాకాంక్షలు అందించారు. అదే విధంగా ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్, పలువురు రాజకీయ ప్రముఖులు వధూదరులను ఆశీర్వదించారు. -
ఘనంగా సీనియర్ నటి శరణ్య కూతురి ఎంగేజ్మెంట్..
-
కూతురు ఆత్మహత్య.. భర్తతో అంత్యక్రియలు
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పెళ్లి చేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య(25) తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోన్న శరణ్య భర్త వేధింపులు తాళలేక ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కూతురు మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకువచ్చి ఆమె భర్త చేత అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా సమయంలో బెంగళూరు నుంచి తమ కూతురి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఎలాంటి బేషజాలకు పోకుండా భర్త రోహిత్ చేత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. శరణ్య మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో.. అల్లుడు రోహిత్ వేధింపుల వల్లనే శరణ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ గొడవలన్నీ పెట్టి సంప్రదాయం ప్రకారం అల్లుడితో కూతురికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి) -
శరణ్య మార్క్
మాస్క్‌లోంచి బన్నీ టీత్ కనిపించేలా నవ్వుతున్న ఈ అమ్మాయి పేరు శరణ్య. కేరళలోని అలప్పుళ ఆమె సొంతూరు. పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె అభిరుచి పెయింటింగ్. ఊహ తెలిసినప్పటి నుంచీ పెయింటింగ్ వేస్తోంది. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌లోనూ ప్రయోగాలు చేస్తోంది. మాస్కుల మీద. కరోనా కష్టం ఎవరినీ గడపదాటనివ్వట్లేదు. అత్యవసరమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చిన నోటికి మాస్కులు, కళ్లల్లో భయం, మనసులో దిగులుతోనే కదలాల్సి వస్తోంది. ఆ పరిస్థితి నచ్చలేదు ఆ అమ్మాయికి. అన్నట్టు శరణ్య వాళ్లమ్మ మాస్కులు కుట్టి పంచుతున్నారు. ఒకరోజు అలా కుట్టిన కొన్ని మాస్కుల మీద ‘స్మైలీ’ని పెయింట్ చేసింది. బన్నీ టీత్‌తో సహా. అందులోంచి ఒక మాస్క్‌ను తను ధరించి బయటకు వెళ్లింది. చూసిన వాళ్ల కళ్లల్లో నవ్వు మెరిసింది. వాళ్లు వెనక్కి తిరిగి మరీ తనను చూడ్డమూ గమనించింది. వర్కవుట్ అవుతోంది అయితే.. అని ఇంటికి వెళ్లి మరిన్ని మాస్కుల మీద స్మైలీలను పెయింట్ చేయడం మొదలుపెట్టింది. అలా శరణ్య మార్క్ మాస్కులకు భలే డిమాండ్ ఏర్పడిందట ఇప్పుడు. దాంతో శరణ్య, వాళ్ల చెల్లి గౌరి ఇద్దరూ కలిసి వాళ్లమ్మ కుట్టే మాస్కుల మీద స్మైలీ బొమ్మలు వేసే పనిలో బిజీ అయిపోయారట. శరణ్య పెయింటింగ్ వర్క్స్ -
వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం
షామీర్పేట(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలంలో వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ... గ్రామానికి చెందిన శరణ్య(17) కేశవరంలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. అయితే, ఆమెను గత కొంతకాలంగా ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. మనస్తాపం చెందిన శరణ్య ఈనెల 2వ తేదీన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. అయితే, ఆమె బలవన్మరణానికి వేధింపులే కారణమని ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.