టాలీవుడ్‌లో చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. సరైన పాత్ర దొరికితే కానీ వాళ్ల టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలియదు. అలా అని అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తూ కూర్చోలేరు. వచ్చిన పాత్రలు చేస్తూ..నచ్చిన పాత్ర దొరికినప్పుడు రెచ్చిపోయి నటిస్తారు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో నటి శరణ్య అదే పని చేసింది. ఈ సినిమాలో హీరో సుహాస్ అయినప్పటికీ.. సినిమా చూసినవారంతా నటి శరణ్యనే హీరో అని అంటున్నారు. అంతలా తన నటనతో ఆకట్టుకుంది ఈ తెలంగాణ అమ్మాయి.
మొదట్లో న్యూస్ రీడర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శరణ్య. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో సాయి పల్లవి అక్కగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. శరణ్యకు ఆ స్థాయి గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు శరణ్యలోని అసలైన నటిని పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు సినీ ప్రియులు ‘ఫిదా’ అయ్యారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సన్నివేశంతో పాటు స్కూల్‌లో విలన్‌తో వచ్చే సీన్‌లో శరణ్య నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాకు ఎంతో కీలకమైన సీన్‌లో నగ్నంగా నటించి అందరిని షాక్‌కు గురి చేసింది.
(చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ)
తాజాగా ఆ సన్నివేశం గురించి శరణ్య మాట్లాడుతూ.. ‘ఆ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే కాస్త భయం అనిపించింది. అలాంటి సన్నివేశంలో ఇంతవరకు నటించలేదు. కానీ నా భయాన్ని పోగొట్టి సపోర్ట్‌గా నిలిచింది మాత్రం నా భర్త. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది.. ధైర్యంగా నటించు అని నా భర్త ప్రోత్సహించాడు. అలాగే చిత్ర యూనిట్ కూడా నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఆ సీన్‌లో నటించేటప్పుడు సెట్‌లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. డీవోపీ, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి..ఇలా ఐదుగురి సమక్షంలో చాలా కంఫర్టబుల్‌గా ఆ సీన్‌లో నటించా. టీమ్ సహకారంతోనే ఆ సీన్ అద్భుతంగా వచ్చింది’అని శరణ్య చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment