Ambajipeta Marriage Band Movie
-
Sharanya Pradeep: అంబాజీపేటతో ఫిదా చేసిన 'శరణ్య ప్రదీప్' ఫోటోలు వైరల్
-
ఆ సీన్ గురించి తప్పుడు ప్రచారం.. చాలా బాధ పడ్డాను: నటి శరణ్య
శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా సుహాస్‌కు అక్కగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో తన నటనతో విశ్వరూపాన్ని చూపింది. ఈ సినిమాలో సుహాస్‌ను పూర్తిగా శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విలన్ ఆమెను బట్టలు తొలగించి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్లో విలన్‌ను కాలితో తన్నిన సీన్లో గానీ శరణ్య విజృంభించేసింది. శరణ్యతో పాటుగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా నటించాడు. ఈ చిత్రంలో శరణ్యకు ప్రియుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒక యువతిని ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో జగదీశ్ జైలుకు వెళ్లి ఆపై బెయిల్‌పై వచ్చాడు. ఈ అంశం గురించి శరణ్య తాజాగా ఇలా రియాక్ట్ అయింది. 'జగదీస్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటి సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం. అయితే మా సినిమా సెట్లో మాత్రం జగదీశ్ అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడు. నాకు తెలిసినంత వరకు అతడి క్యారెక్టర్లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.' అని శరణ్య పేర్కొంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ఆమెను వివస్త్రను చేసిన సీన్ గురించి ఆమె ఇప్పటికే పంచుకుంది. తన భర్త సపోర్ట్ ద్వారా మాత్రమే ఆ సీన్ చేయగలిగానని చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబ్ వారు తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. సినిమాలో ఎం లేకపోయినా కూడా ఎదో ఉంది అనేలా క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో చాలా వీడియోలకు స్ట్రైక్స్ కొట్టినా ఉపయోగం లేదని శరణ్య వాపోయింది. వాస్తవంగా ఆ సీన్లో ఎలాంటి అసభ్యత లేదు. ఆ సీన్లో నటించాలంటే గట్స్ ఉండాలి. కానీ శరణ్య ఎంతో ధైర్యంగా ఒప్పుకుని ఆ సీన్లో మెప్పించింది. దీంతో తన సినీ కెరియర్లో మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. ఏదేమైనా సరైన కథ,దర్శకుడి చేతిలో శరణ్య పడితే మరోసారి తన నటనతో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. -
ఐదుగురి మధ్యలో ఆ సీన్ చేశా.. నా భర్త ప్రోత్సహించాడు: శరణ్య
టాలీవుడ్లో చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. సరైన పాత్ర దొరికితే కానీ వాళ్ల టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలియదు. అలా అని అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తూ కూర్చోలేరు. వచ్చిన పాత్రలు చేస్తూ..నచ్చిన పాత్ర దొరికినప్పుడు రెచ్చిపోయి నటిస్తారు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో నటి శరణ్య అదే పని చేసింది. ఈ సినిమాలో హీరో సుహాస్ అయినప్పటికీ.. సినిమా చూసినవారంతా నటి శరణ్యనే హీరో అని అంటున్నారు. అంతలా తన నటనతో ఆకట్టుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. మొదట్లో న్యూస్ రీడర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శరణ్య. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో సాయి పల్లవి అక్కగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. శరణ్యకు ఆ స్థాయి గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు శరణ్యలోని అసలైన నటిని పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు సినీ ప్రియులు ‘ఫిదా’ అయ్యారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సన్నివేశంతో పాటు స్కూల్లో విలన్‌తో వచ్చే సీన్లో శరణ్య నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాకు ఎంతో కీలకమైన సీన్లో నగ్నంగా నటించి అందరిని షాక్‌కు గురి చేసింది. (చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ) తాజాగా ఆ సన్నివేశం గురించి శరణ్య మాట్లాడుతూ.. ‘ఆ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే కాస్త భయం అనిపించింది. అలాంటి సన్నివేశంలో ఇంతవరకు నటించలేదు. కానీ నా భయాన్ని పోగొట్టి సపోర్ట్‌గా నిలిచింది మాత్రం నా భర్త. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది.. ధైర్యంగా నటించు అని నా భర్త ప్రోత్సహించాడు. అలాగే చిత్ర యూనిట్ కూడా నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఆ సీన్లో నటించేటప్పుడు సెట్లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. డీవోపీ, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి..ఇలా ఐదుగురి సమక్షంలో చాలా కంఫర్టబుల్‌గా ఆ సీన్లో నటించా. టీమ్ సహకారంతోనే ఆ సీన్ అద్భుతంగా వచ్చింది’అని శరణ్య చెప్పుకొచ్చింది. -
గట్టిగానే కొట్టిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కలెక్షన్స్
కలర్‌ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుహాస్. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. తాజగా విడుదలైన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తోనే దూసుకుపోతుంది. సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా దగ్గరైందని చెప్పవచ్చు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్గా మెప్పిస్తే.. హీరో అక్కగా శరణ్య ప్రదీప్ దుమ్మురేపిందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ అయిన మోషన్ పిక్చర్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అందరి అంచనాలకు మించి ఓపెనింగ్స్‌ను సాధించింది. హార్డ్ హిట్టింగ్ బ్లాక్బాస్టర్ అంటూ మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. రెండో రోజు సుమారు రెండున్న కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ.5.16 కోట్లు రాబట్టింది. ఏదేమైనా హీరో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. రాయలసీమకు రానున్న హీరో,హీరోయిన్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రానికి పాజిటివ్ రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు సుహాస్, హీరోయిన్ శివాని నాగరం రాయలసీమలో సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నేడు (ఫిబ్రవరి 4న) మొదటగా కర్నూలులోని ఆనంద్ థియేటర్‌కు మధ్యాహ్నం 12: 30గంటలకు చిత్ర యూనిట్ రానుంది. ఆ తర్వాత కడపలోని రాజా థియేటర్‌కు మధ్యాహ్నం 3:30 గంటలకు వారి షెడ్యూల్ ఉంది. చివరగా తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వద్దకు సాయింత్రం 7 గంటలకు చిత్ర యూనిట్ రానుంది. 🫶 pic.twitter.com/KjPyTtN54o — Suhas 📸 (@ActorSuhas) February 3, 2024 ❤️❤️❤️ pic.twitter.com/pt9TpJGItb — Suhas 📸 (@ActorSuhas) February 4, 2024 -
గుండు గురించి అసలు కథ చెప్పేసిన సుహాస్..!
-
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ
టైటిల్: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నటీనటులు:సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్ నిర్మాత: ధీరజ్మొగిలినేని దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్ ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్ విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2007లో సాగుతుంది. అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లీ(సుహాస్), పద్మ(శరణ్య) కవలలు. మల్లీ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ లో పని చేస్తుంటాడు. పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. తండ్రి కనకయ్య సెలూన్ షాప్ రన్ చేస్తుంటాడు. మల్లీకి ఆ ఊరిపెద్ద, ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే వెంకట బాబు(నితిన్ ప్రసన్న) చెల్లెలు లక్ష్మీ(శివానీ నాగారం) అంటే చాలా ఇష్టం. లక్ష్మీకి కూడా మల్లీని ఇష్టపడుతుంది. వీరిద్దరు సెలూన్ షాప్‌నే అడ్డాగా మార్చుకొని రహస్యంగా ప్రేమించుకుంటారు. మరోవైపు వెంకట బాబు, పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊర్లో పుకారు పుడుతుంది. పద్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా పేద పిల్లలకు విద్యను అందిస్తుంది. ఓ సారి వెంకట బాబు తమ్ముడు శ్రీను బాబు (వినయ్ మహాదేవ్), మధ్య మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో పద్మ శ్రీను చెంప పగలగొడుతుంది. అదే సమయంలో మల్లీ తన చెల్లితో ప్రేమలో ఉన్న విషయం వెంకట్‌కి తెలుస్తుంది. దీంతో పద్మను ఒంటరిగా స్కూల్లోకి రప్పించి ఘోరంగా అవమానిస్తాడు వెంకట్. ఈ విషయం మల్లీకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు వెంకటబాబు పద్మను ఏ రకంగా అవమానించాడు? పోలీసు స్టేషన్‌కి వెళ్లిన పద్మకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం కోసం పద్మ ఏం చేసింది? మల్లీకి వెంకట్ ఎందుకు గుండు గీశాడు? అక్క కోసం మల్లీ చేసిన పోరాటం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్ష నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ కూడా అదే. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ దుష్కంత్ కటికనేని రాసుకొన్న స్క్రీన్ ప్లే, కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కులాల పేర్లు ప్రస్తావించకుండా..కులాల మధ్య అంతరాన్ని తెరపై స్పష్టంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమాను సరదాగా ప్రారంభించి.. ఎమోషనల్‌గా ముగించాడు. తక్కువ కులానికి చెందిన హీరో..పెద్ద కులానికి చెందిన హీరోయిన్ని ప్రేమించడం అనే రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే లవ్‌స్టోరీ కొత్తగా అనిపించదు కానీ.. వినోదాన్ని మాత్రం అందిస్తుంది. ఇద్దరూ ప్రతి మంగళవారం సెలూన్ షాపులో కలుసుకోవడం.. ఫోన్లో జరుపుకునే సంభాషణలు, మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్(జగదీష్) వేసే పంచులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉంటాయి. కొన్ని సీన్లు అయితే వాస్తవికానికి దూరంగా అనిపిస్తాయి. ‘ఆధారం లేని ఆక్రమణ సంబంధం ..అవమాన పడ్డ ఆత్మాభిమానం’ అంటూ న్యాయం కోసం పద్మ చేసే న్యాయ పోరాటం మాత్రం ఆకట్టుకుంటుంది. పోలీసు స్టేషన్ సీన్ అయితే అదిరిపోతుంది. కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లోనూ అదే చేశాడు. మల్లీగాడు పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. లవర్‌గా, అక్క కోసం ఎంతకైనా తెగించే తమ్ముడిగా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సన్నీవేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక ఈ సినిమాలో సుహాస్ కంటే బాగా పండిన పాత్ర శరణ్యది. ఇన్నాళ్లు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన శరణ్య.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లో డిఫరెంట్ పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసిన వాళ్లు పద్మ పాత్రను మరిచిపోలేరు. ఆ పాత్రలో అంత గొప్పగా నటించింది శరణ్య. ఆమె నటనకు థియేటర్స్‌లో విజిల్స్ పడడం గ్యారెంటీ. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. లక్ష్మీగా శివానీ నాగారం తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. తెరపై అందంగానూ కనిపించింది. విలన్‌గా నితిన్ ప్రసన్న అదరగొట్టేశాడు. పుష్ప ఫేమ్ జగదీష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, కిట్టయ్య, సురభితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
రేపు బ్యాండు మోగించాలి : హీరో అడివి శేష్
‘‘చాయ్ బిస్కట్ సంస్థలో సుహాస్ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి ప్రతిభ ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారు. తను ఏ స్థాయికి వెళతాడో ఊహించలేను. ఏదో ఒక రోజు తను నా వేడుకకి అతిథిగా రావాలి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ట్రైలర్ నచ్చడంతో పది సార్లు చూశా. రేపు (శుక్రవారం) మనమంతా ఈ సినిమా బ్యాండ్ మోగించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుహాస్, శివానీ నాగరం జంటగా దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుష్యంత్ కటికనేని మాట్లాడుతూ– ‘‘సుహాస్ లేకుంటే డైరెక్టర్‌గా ఈ వేదికపైకి వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు’’ అన్నారు. ‘‘నేను నిర్మాతగా ఈ వేదికపై నిలబడటానికి అల్లు అరవింద్, అల్లు శిరీష్, ‘బన్నీ’ వాసుగార్లే కారణం. సుహాస్ లేకుంటే ఈ చిత్రం లేదు’’ అన్నారు ధీరజ్ మొగలినేని. -
బ్యాండ్ నేర్చుకున్నా.. రెండు సార్లు గుండు గీయించుకున్నా: సుహాస్
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాకు ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యాం. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథలో బాగా కనెక్ట్ అవ్వాలని అనుకున్న సీన్స్ ప్రాక్టీస్ చేశాం. రెండు సార్లు గుండు గీయించుకున్నా. అలా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని సుహాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని హీరోయిన్. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సుహాస్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు.. ► ఈ కథలో జరిగిన ఇన్సిడెంట్స్ నేను రియల్ లైఫ్ లో చూడలేదు గానీ మా డైరెక్టర్ చూసిన సంఘటనలు కథలో సగం వరకు ఉంటాయి. తను చూసినవి, తనకు లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాల స్ఫూర్తి ఈ కథలో ఉంది. మిగతాది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" 2007 లో జరిగే కథ. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ వరకు చూశాక సినిమా బాగా చేశారని ఫీల్ అవుతారు. ఆ తర్వాత మూవీ ఎమోషనల్ గా ఫీల్ తో సాగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు సరదాగా సాగుతుంటాయి. కలర్ ఫొటోలో ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాలో హై ఎమోషన్ ఉంటుంది. రేపు సినిమా చూశాక ఇంత ఎమోషనల్ గా ఎలా నటించారని మీరే అడుగుతారు. ► నేను షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నప్పటి నుంచి డైరెక్టర్ దుశ్యంత్ తెలుసు. డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా తను వర్క్ చేశాడు. అప్పటి నుంచే నీతో సినిమా చేస్తా అనేవాడు. కలర్ ఫొటో మూవీ వచ్చాక...మీ వాళ్లతోనే హీరోగా చేసుకుంటావా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా కదా అన్నాడు. అప్పుడు వెంటనే ఈ మూవీ స్టార్ట్ చేశాం. ► కలర్ ఫొటో సినిమాకు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీకి ఎలాంటి పోలిక, సంబంధం లేదు. రెండూ వేటికవి భిన్నమైన కథలు. ఊరి నేపథ్యం వల్ల మీకు సిమిలర్ గా అనిపిస్తుంటాయి. ► "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. నేను, శరణ్య కవల పిల్లలం. మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి అనేది ఈ మూవీలో కీలకంగా ఉండే అంశం. ► ఈ స్క్రిప్ట్ చదివేప్పుడు ఉన్న ఎగ్జైట్ మెంట్ మేకింగ్ టైమ్ లో మరింత పెరిగింది. ఇప్పుడు శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎంతో చూసుకున్నప్పుడు మరో లెవెల్ కు వెళ్లింది. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది. మూవీకి హీరోను కాబట్టి రిలీజ్ టైమ్ లో ప్రెజర్ ఫీలవుతాం. నా భుజాల మీదే సినిమాను మోస్తానని అంటారు కదా. ఆ మాట వింటే భయమేస్తుంటుంది. ► టైటిలో మ్యారేజి బ్యాండు అనేది ఉంది. అయితే ఊరు పేర్లు వేరేవి అనుకున్నాం కానీ పలికేందుకు బాగుందని అంబాజీపేట యాడ్ చేశారు. దుశ్యంత్, వెంకటేష్ మహా ఫ్రెండ్స్. దుశ్యంత్ చెప్పిన కథ నచ్చి వెంకటేష్ ధీరజ్ కు, గీతా ఆర్ట్స్ వాళ్లకు వినిపించి ప్రాజెక్ట్ సెట్ చేశాడు. ► అమలాపురంలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి వాళ్లు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. హోటల్ లో టిఫిన్ చేసి డబ్బులు ఇచ్చినా తీసుకునేవారు కాదు. మా ఊళ్లో షూటింగ్ చేస్తూ డబ్బులు ఇస్తారా అనేవారు. వాళ్ల ప్రేమతో మాకు మాటలు రాకుండా చేశారు. ► హీరోయిన్ శివానికి ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది. ఆమె పర్ ఫార్మెన్స్ అంత బాగా చేసింది. శివాని డ్యాన్సర్, సింగర్ కూడా. అక్క క్యారెక్టర్ చేసిన శరణ్య గారు, విలన్ గా చేసిన నితిన్ కూడా ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ► నాకు రొమాంటిక్ సీన్స్ చేయాలంటే సిగ్గు. మా డైరెక్టర్స్ మందలిస్తుంటారు. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు డైరెక్టర్ సందీప్ లాంటి వాళ్లు ఫోన్ చేసి దుశ్యంత్ కు చెప్పారు ఈ సీన్స్ సరిగ్గా చేయడు జాగ్రత్త అని. నీ కెరీర్ లో ఇంకెప్పుడు చేస్తావ్ బ్రో రొమాంటిక్ సీన్స్.. చేయి అని దుశ్యంత్ అనేవాడు. ► రైటర్ పద్మభూషణ్ కు ప్రీమియర్స్ వేయడం వల్ల మంచి టాక్ వచ్చింది. నా సినిమాలకు ప్రీమియర్స్ పడాలి. చూసిన వాళ్లు బాగుందని చెబితే మిగతా వాళ్లు బుకింగ్ చేసుకుని థియేటర్స్ కు వెళ్తారు. నాలాంటి హీరోలకు ప్రీమియర్స్ కు వచ్చే రెస్పాన్స్ చాలా ముఖ్యం. యూఎస్ లో రైటర్ పద్మభూషణ్ సినిమాకు 400 కె కలెక్షన్స్ వచ్చాయి. నా ఫస్ట్ యూఎస్ రిలీజ్ అది. ఇప్పుడు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు 200 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా. ► నేను చేసిన టైప్ కథలు కాకుండా కొత్తగా ఉండాలని కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. వాటిలో నేను నాకు నప్పేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. హీరోగా కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టం. హిట్ 2లో విలన్ గా నటించిన తర్వాత అలాంటివే చాలా ఆఫర్స్ వచ్చాయి. విలన్ రోల్స్ వద్దనుకుని మళ్లీ హీరోగా చేస్తున్నా. నాకు ఇంకొంత వయసు వచ్చాక మరికొన్ని భిన్నమైన క్యారెక్టర్స్ కు సెట్ అవుతా అనిపిస్తోంది. ఇప్పుడు చిన్నగా కనిపించడం వల్ల అన్ని రకాల క్యారెక్టర్స్ కు సెట్ కానేమో అనిపిస్తుంటుంది. ► కలర్ ఫొటో థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుండేది అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. కానీ అప్పుడు అలా జరిగిపోయింది. ఓటీటీ అయినా మనకు మంచి గుర్తింపు వచ్చింది కదా అనిపిస్తుంది. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు మాకు మంచి గుర్తింపు దక్కిందని సంతోషపడ్డాం. ► రైటర్ పద్మభూషణ్ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అని భయపడ్డాం. ఆ మూవీకి లాభాలు వచ్చాయి. ఫర్వాలేదు మన సినిమా కూడా చూస్తున్నారనే సంతృప్తి కలిగింది. ఇంకా మంచి కంటెంట్ చేయాలి, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా. ► కలర్ ఫొటో సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ చెప్పాడు. నెక్ట్ లెవెల్ లో ఉంది. ఆ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సుకుమార్ గారి అసోసియేట్ తో ప్రసన్నవదనం అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. కేబుల్ రెడ్డి అనే మరో మూవీ చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ జరుగుతోంది. -
ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగిసిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతా సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. రిపబ్లిక్ డే కానుకగా తలో డబ్బింగ్, హిందీ మూవీ రిలీజ్ అయ్యాయి గానీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ శుక్రవారం పదికి పైగా తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిలో ఏ మూవీకి హైప్ ఉంది? ఫిబ్రవరి 2న 10 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ మాత్రం ఉన్నవాటిలో కాస్త ఆసక్తి రేపుతోంది. వరసపెట్టి ప్రమోషన్స్ చేస్తున్న చిత్రబృందం.. సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. దీని తర్వాత 'బిగ్‌బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటించి, నిర్మించిన 'బూట్ కట్ బాలరాజు' కూడా ఉన్నంతలో బెటర్ మూవీ. ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బుల్లేవని సొహైల్ చెప్పాడు. పూర్తిగా కామెడీని నమ్ముకుని వస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) పై రెండు సినిమాలతో పాటు కామెడీని నమ్ముకున్న 'కిస్మత్', లక్ష్ చదలవాడ ధీర', థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'గేమ్ ఆన్' రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'హ్యాపీ ఎండింగ్', 'మెకానిక్', 'ఉర్వి', 'చిక్లెట్స్', 'శంకర' చిత్రాలు కూడా ఫిబ్రవరి 2నే బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. అయితే వీటికి థియేటర్ల పరంగా ఇబ్బంది ఉండదు కానీ హిట్ అయ్యే విషయంలోనే అసలు సమస్య ఉంటుంది. ఎందుకంటే మరీ అంత బాగుంటే తప్పితే జనాలు ఈ పది సినిమాల్లో ఒక్కదానిపై అయిన ఆసక్తి చూపించరు. దీనికితోడు వచ్చేవారం థియేటర్లలోకి రవితేజ 'ఈగల్', యాత్ర 2, రజనీకాంత్ 'లాల్ సలామ్' రాబోతున్నాయి. మరి వీటికోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల్ని.. ఈ వారం థియేటర్లలోకి తీసుకొచ్చే సినిమా ఏది? హిట్ అయ్యే మూవీ ఏది అనేది చూడాలి? (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) -
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’లో ఏ కులాన్ని కించపరచలేదు: నిర్మాత
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’సినిమా ట్రైలర్ చూసి ఇందులో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగే కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే గానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు’అని చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మిగిలినేని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ధీరజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు. ► ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు రిలీజ్ చేశాక ఇది లవ్ స్టోరీ కావొచ్చని అన్నారు. ట్రైలర్ చూశాక సీరియస్ సబ్జెక్ట్ అని రివీల్ అయ్యింది. సుహాస్ కలర్ ఫొటో లాంటి మూవీ చేశాడు. పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. తన నెక్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అవ్వాలని సుహాస్ కోరుకున్నాడు. అలాగే ఎంతో కమిట్ మెంట్ తో కష్టపడి నటించాడు. సహాస్ పర్ ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారు. మేము కూడా అతన్ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లోనే చూపించాలని అనుకున్నాం. ► మా సినిమా ద్వారా ఎలాంటి సందేశం చెప్పడం లేదు. ఇలా ఉండాలని సూచించడం లేదు. ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను అలాగే సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం. ఇది మంచీ ఇది చెడు..ఇలా మారిపోండి అని ప్రేక్షకులకు చెప్పాలని అనుకోవడం లేదు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో లవ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సుహాస్ అక్క క్యారెక్టర్ లో స్కూల్ టీచర్ గా శరణ్య ప్రదీప్ నటించింది. ఆమెది కథలో ఒక కీ రోల్. కథలోని ప్రధాన భాగం ఆమె క్యారెక్టర్ చుట్టూ సాగుతుంది. శరణ్య క్యారెక్టర్ ద్వారా స్టోరీలోని కొన్ని అంశాలు చెప్పాం. ►మేము కథ వినే టైమ్ కు సుహాస్ కలర్ ఫొటో రిలీజైంది, రైటర్ పద్మభూషణ్ షూటింగ్ జరుగుతోంది. కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ కు సుహాస్ అయితే యాప్ట్ అవుతాడు అని అనుకున్నాం. తను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ కోసం సుహాస్ గుండుతో కనిపించాలి. సహజంగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దు. అయితే తొలిసారి గుండు చేయించుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలను మాత్రమే షూట్ చేశాం. జుట్టు పెరిగిన తర్వాత మరిన్ని సన్నివేశాలకు గుండుతో కావాల్సి వచ్చింది. దీంతో సుహాస్ వెంటనే రెండో సారి గుండు చేయించుకున్నాడు. సుహాస్ బిజీ ఆర్టిస్ట్. కలర్ ఫొటో తర్వాత హీరోగా ఓ పది మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. వాటి గురించి ఆలోచించకుండా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో గుండు చేసుకుని నటించారు. ఆయన కమిట్ మెంట్ కు మేము సర్ ప్రైజ్ అయ్యాం. ►‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లో హీరోయిన్ గా పేరున్న వారిని తీసుకుంటే కమర్షియల్ ఫీల్ వస్తుందేమో అనుకుని కొత్త వాళ్ల కోసం ఆడిషన్ చేశాం. శివానీ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ కు వచ్చింది. అయితే ఆమె పర్ ఫార్మెన్స్ చూసి హీరోయిన్ గా తీసుకోవచ్చు అని డైరెక్టర్ అన్నారు. అలా మళ్లీ ఆమెను పిలిచి హీరోయిన్ క్యారెక్టర్ కు ఆడిషన్ చేశారు దుశ్యంత్. బాగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ రావడంతో హీరోయిన్ గా తీసుకున్నాం. మేము అనుకున్నట్లే తన రోల్ బాగా ప్లే చేసింది. ►గీతా ఆర్ట్స్ లో చాలా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. మేము ఈ మూవీని డిజైన్ చేసిందే కొత్తదనం కనిపించాలని. గీతా ఆర్ట్స్ గుడ్ విల్ కాపాడేలా ఉంటూనే ఒక ఫ్రెష్ నెస్, కొత్త వాళ్లతో సినిమా చేశాం. శరణ్య క్యారెక్టర్ కు మరో పేరున్న నటిని తీసుకోవచ్చు కానీ కథలోని ఆ ఒరిజినాలిటీ కనిపించాలంటే సీనియర్స్ వద్దనే అనిపించింది. ►అల్లు అరవింద్ గారు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను చూసి సంతోషంతో మమ్మల్ని హగ్ చేసుకున్నారు. చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. సినిమా బాగా నచ్చడంతో రెండోసారి కూడా చూశారు. ►మా సినిమాకు శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. తన సంగీతంతో మా సినిమా ఫీల్ ను రెట్టింపు చేశారు. దర్శకుడు దుశ్యంత్ కథతో పాటే డైలాగ్స్ రాసుకుంటాడు. ఆయన కథ, డైలాగ్స్ లో నేటివిటీ కనిపిస్తుంటుంది. దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా చేయరు. కానీ దుశ్యంత్ కథ చెప్పినంత బాగా మూవీని రూపొందించాడు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. ►ప్రస్తుతం రశ్మిక మందన్నతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తున్నాం. ఈ సినిమా 40 శాతం షూటింగ్ చేశాం. ఈ ఏడాదే విడుదల చేస్తాం. మరో మూడు ప్రాజెక్ట్స్ రెడీ చేసుకుంటున్నాం. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాను. -
‘అంబాజీపేట ..’ కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాను: హీరో
‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ నాకెంతో స్పెషల్. ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాను. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నాను. మా సినిమాకు ప్రేక్షకులు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నా’’ అని హీరో సుహాస్ అన్నారు. దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. (చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా) ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో దుష్యంత్ కటికనేని మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ ఘటనలతో ఈ సినిమా తీశాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా సంస్థకి ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ అందించారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో మరో సూపర్ హిట్ ఇస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు ధీరజ్ మొగిలినేని. -
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలి
-
సినిమా చూశాక మీ గుండె బరువెక్కుతుంది: హీరో సుహాస్
-
అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ ట్రైలర్
-
అంబాజిపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్.. హీరోయిన్ చనిపోతుందా?
కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఓ మెట్టు ఎక్కేశాడు సుహాస్. కమెడియన్‌గా నవ్వులు పూయించడమే కాదు నటుడిగా కన్నీళ్లు పెట్టించగలనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివానీ నాగరం హీరోయిన్గా యాక్ట్ చేసింది. బుధవారం (జనవరి 24న) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. బ్యాండ్ కొట్టే అబ్బాయి ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆమె కోసం ఈ హీరో ఏం చేశాడు? అన్నదే కథ. ప్రేమ, అవమానం, ప్రగ, ప్రతీకారాల సమ్మేళనమే అంబాజీపేట మ్యారేజి బ్యాండు. అయితే ట్రైలర్ చివర్లో చితి ముందు హీరో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో 'మన ప్రేమ నీ ప్రాణం మీదకు తేకూడదు మల్లి' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ వేశారు. అంటే ఈ మూవీలో హీరోయిన్ చనిపోతుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏదైతేనేం.. ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. కలర్ ఫోటో అంత పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతమందించారు. -
కాళభైరవ నోట ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం’ పాట
సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివానీ నాగరం హీరోయిన్గా నటించింది. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ యంగ్ హీరో తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" నుంచి 'మా ఊరు..' లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న తేజ సజ్జ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'మా ఊరు....' సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా...శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. 'రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం...ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..'అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగిందీ పాట. -
సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ఇందులో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి అనే పాత్రని సుహాస్ చేశాడు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఇప్పుడీ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వహకులు షాకింగ్ డెసిషన్) కామెడీ డ్రామా కథతో తీస్తున్న'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో శివాని నాగరం హీరోయిన్ కాగా శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతమందించారు. కొన్నిరోజుల 'గుమ్మ' అనే సాంగ్ రిలీజ్ చేయగా, సంగీత ప్రియుల్ని అది ఆకట్టుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) The Intense & hard-hitting tale of 'Malligadu' is all set to unveil itself on the Big Screens 🔥🥁#AmbajipetaMarriageBand GRAND RELEASE WORLDWIDE ON 2nd FEBRUARY, 2024 ❤️🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/opDxatjM4V — Geetha Arts (@GeethaArts) December 26, 2023 -
‘అంబాజీపేట..’ నటుడిగా సంతృప్తినిచ్చింది: సుహాస్
‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫ్రెష్ సబ్జెక్ట్. సినిమా కొత్తగా ఉంటుంది. నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. ఒక మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అని సుహాస్ అన్నారు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించాయి. ఈ చిత్ర సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరపరచిన ‘గుమ్మా....’ అంటూ సాగే తొలి పాటను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ– ‘‘ఈ పాటకి రెహ్మాన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని పాటలన్నీ బాగుంటాయి’’ అన్నారు. ‘‘జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ధీరజ్ మొగిలినేని. ‘‘మంచి సినిమాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘అంబాజీపేట..’ హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత ఎస్కేఎన్. నటులు జగదీశ్, నితిన్, డ్యాన్స్ మాస్టర్ మోయిన్ తదితరులు మాట్లాడారు.