
‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ నాకెంతో స్పెషల్. ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాను. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నాను. మా సినిమాకు ప్రేక్షకులు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నా’’ అని హీరో సుహాస్ అన్నారు. దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది.
(చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా)
ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో దుష్యంత్ కటికనేని మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ ఘటనలతో ఈ సినిమా తీశాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా సంస్థకి ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ అందించారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో మరో సూపర్ హిట్ ఇస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు ధీరజ్ మొగిలినేని.
Comments
Please login to add a commentAdd a comment