రేపు బ్యాండు మోగించాలి : హీరో అడివి శేష్‌ | Adivi Sesh Comments On Ambajipeta Marriage Band Movie | Sakshi
Sakshi News home page

రేపు బ్యాండు మోగించాలి : హీరో అడివి శేష్‌

Published Thu, Feb 1 2024 10:10 AM | Last Updated on Thu, Feb 1 2024 10:10 AM

Adivi Sesh Comments On Ambajipeta Marriage Band Movie - Sakshi

‘‘చాయ్‌ బిస్కట్‌ సంస్థలో సుహాస్‌ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి ప్రతిభ ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారు. తను ఏ స్థాయికి వెళతాడో ఊహించలేను. ఏదో ఒక రోజు తను నా వేడుకకి అతిథిగా రావాలి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ట్రైలర్‌ నచ్చడంతో పది సార్లు చూశా. రేపు (శుక్రవారం) మనమంతా ఈ సినిమా బ్యాండ్‌ మోగించాలి’’ అని హీరో అడివి శేష్‌ అన్నారు.

సుహాస్, శివానీ నాగరం జంటగా దుష్యంత్‌ కటికినేని దర్శకత్వం వహించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి అడివి శేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుష్యంత్‌ కటికనేని మాట్లాడుతూ– ‘‘సుహాస్‌ లేకుంటే డైరెక్టర్‌గా ఈ వేదికపైకి వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు’’ అన్నారు. ‘‘నేను నిర్మాతగా ఈ వేదికపై నిలబడటానికి అల్లు అరవింద్, అల్లు శిరీష్, ‘బన్నీ’ వాసుగార్లే కారణం. సుహాస్‌ లేకుంటే ఈ చిత్రం లేదు’’ అన్నారు ధీరజ్‌ మొగలినేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement