![Maa Ooru Ambajipeta Song Out From Ambajipeta Marriage Band - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/2/suhas.jpg.webp?itok=MieD-nrZ)
సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివానీ నాగరం హీరోయిన్‌గా నటించింది. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ యంగ్ హీరో తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" నుంచి 'మా ఊరు..' లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న తేజ సజ్జ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
'మా ఊరు....' సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా...శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. 'రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం...ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..'అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగిందీ పాట.
Comments
Please login to add a commentAdd a comment