టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగిసిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతా సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. రిపబ్లిక్ డే కానుకగా తలో డబ్బింగ్, హిందీ మూవీ రిలీజ్ అయ్యాయి గానీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ శుక్రవారం పదికి పైగా తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిలో ఏ మూవీకి హైప్ ఉంది?
ఫిబ్రవరి 2న 10 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ మాత్రం ఉన్నవాటిలో కాస్త ఆసక్తి రేపుతోంది. వరసపెట్టి ప్రమోషన్స్ చేస్తున్న చిత‍్రబృందం.. సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. దీని తర్వాత 'బిగ్‌బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటించి, నిర్మించిన 'బూట్ కట్ బాలరాజు' కూడా ఉన్నంతలో బెటర్ మూవీ. ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బుల్లేవని సొహైల్ చెప్పాడు. పూర్తిగా కామెడీని నమ్ముకుని వస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)
పై రెండు సినిమాలతో పాటు కామెడీని నమ్ముకున్న 'కిస్మత్', లక్ష్ చదలవాడ ధీర', థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'గేమ్ ఆన్' రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'హ్యాపీ ఎండింగ్', 'మెకానిక్', 'ఉర్వి', 'చిక్లెట్స్', 'శంకర' చిత్రాలు కూడా ఫిబ్రవరి 2నే బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. అయితే వీటికి థియేటర్ల పరంగా ఇబ్బంది ఉండదు కానీ హిట్ అయ్యే విషయంలోనే అసలు సమస్య ఉంటుంది.
ఎందుకంటే మరీ అంత బాగుంటే తప్పితే జనాలు ఈ పది సినిమాల్లో ఒక్కదానిపై అయిన ఆసక్తి చూపించరు. దీనికితోడు వచ్చేవారం థియేటర్లలోకి రవితేజ 'ఈగల్', యాత్ర 2, రజనీకాంత్ 'లాల్ సలామ్' రాబోతున్నాయి. మరి వీటికోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల్ని.. ఈ వారం థియేటర్లలోకి తీసుకొచ్చే సినిమా ఏది? హిట్ అయ్యే మూవీ ఏది అనేది చూడాలి?
(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)
Comments
Please login to add a commentAdd a comment