Dheera Movie
-
Dheera Review: ‘ధీర’ మూవీ రివ్యూ
టైటిల్: ధీర నటీనటులు: లక్ష్ చదలవాడ, నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర నిర్మాత: పద్మావతి చదలవాడ రచన, దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్ సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ ఎడిటర్: వినయ్ రామస్వామి విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన రణ్‌ధీర్(లక్ష్ చదలవాడ)కు డబ్బు పిచ్చి ఎక్కువ. ఏ పని ఫ్రీగా చేయడు. మనీ కోసం ఎంతటి సాహసం అయినా చేస్తాడు. అలాంటి వ్యక్తికి ఓ రోజు ప్రముఖ ఆస్పత్రి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రాజ్‌గురు అనే పేషెంట్‌ని అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకెళ్తే.. పాతిక లక్షలు ఇస్తామని చెబుతారు. ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో రణ్‌ధీర్ వెంటనే ఓకే చెబుతాడు. ఆ పేషెంట్‌ని చూసుకోవడానికి డాక్టర్ అమృత(నేహా పఠాన్)వస్తుంది. తోడుగా మరో డాక్టర్ (మిర్చి కిరణ్) వెళ్తాడు. ఈ ముగ్గురితో కలిసి అంబులెన్స్‌లో హైదరబాద్కి బయలుదేరిన రణ్ధీర్పై ఓ ముఠా దాడికి ప్రయత్నిస్తుంది. రాజ్‌గురును ఎలాగైనా హైదరాబాద్‌కు తరలించకుండా చూడడమే ఆ ముఠా టార్గెట్. మరోవైపు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవిలో ఉన్న హంసలేఖ దేవి(హిమజ).. ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలంటూ నమ్మకస్తుడైన పోలీసు అధికారి(భరణి శంకర్)ని పంపిస్తుంది. అసలు రాజ్ గురు ఎవరు? ఓ ముఠా ఎందుకు అతనిపై దాడికి ప్రయత్నిస్తుంది? వారిని రణ్‌ధీర్ ఎలా ఎదుర్కొన్నాడు? రాజ్‌గురును హైదరాబాద్ తరలించారా లేదా? హంసలేఖ ఎవరు? ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలని ఎందుకు ఆదేశించింది? ఆ పాపకు రాజ్‌గురుకు ఉన్న సంబంధం ఏంటి? రాజ్‌గురుకు ముఖ్యమంత్రి(సుమన్)తో ఉన్న సంబంధం ఏంటి? అసలు రాజ్‌గురు ఏ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు? పాప కోసం రణ్‌ధీర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అమృత, మనీషా(సోనియా బన్సాల్)లతో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ధీర’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు.. రెండు డిఫరెంట్ లవ్‌స్టోరీలు, భారీ యాక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్నాయి. అయితే దర్శకుడు పేపర్‌పై బలంగా రాసుకున్న స్టోరీని అంతే బలంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. రాజ్‌గురు స్టోరీ ఏంటనేది మాత్రం చివరి వరకు ప్రేక్షకుడు పసిగట్టకుండా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్గురుని హైదరాబాద్‌కు తరలించేందుకు డాక్టర్లు ప్రయత్నించడం.. మరోవైపు హంసలేఖ ఫోన్ ద్వారా వైద్యులకు సూచనలు ఇవ్వడం..ఇలా చాలా ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. లక్ష్ ఎంట్రీ స్టార్ హీరో రేంజ్లో ఉంటుంది. కారు రేసింగ్ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేశాడు. మీనాక్షితో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హీరో లవ్స్టోరీలోని ట్విస్ట్ రివీల్ అయ్యాక మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓ భారీ యాక్షన్.. రొమాంటిక్ సీన్స్.. ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఒక్కో ట్విస్టు రివీల్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని నడించాడు. పాప ఎవరు? ఆమె కోసం వెతుకుతున్నదెవరు అనేది తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో లక్ష్య్. సినిమా సినిమాకి తన పాత్రలో వేరియష్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ధీరలో కూడా రణ్‌ధీర్ అనే మరో డిఫరెంట్ పాత్రను పోషించి మెప్పించాడు. యాక్షన్ సీన్స్ అయితే అదరగొట్టేశాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. డాక్టర్ అమృతగా నేహా పఠాన్, మనీషాగా సోనియా బన్సాల్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. మిర్చి కిరణ్ కామెడీ సినిమాకు ప్లస్ అయింది. భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. కన్నా పీసీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్సాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘ధీర’ట్రైలర్ బాగుంది.. వారి కష్టానికి ప్రతిఫలం రావాలి: దిల్ రాజు
‘‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తున్నాం. శ్రీనివాస్‌గారు చిన్న నిర్మాతలకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తారు. ఇక లక్ష్ నటించిన ‘ధీర’ట్రైలర్ బాగుంది. తన హార్డ్ వర్క్, చిత్ర యూనిట్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. లక్ష్ చదలవాడ హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధీర’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ మూవీ రేపు (శు క్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ‘దిల్’ రాజు, దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరై, సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎంతో మంది దర్శకులని పరిచయం చేశాను. ‘ధీర’తో విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. లక్ష్ ను చూసి తండ్రిగా గర్విస్తుంటాను. మా ప్రొడక్షన్లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు. ‘‘పక్కోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే వాడికి ఓ మిషన్ అప్పగిస్తే ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యల్ని ‘ధీర’లో చూస్తారు’’ అన్నారు లక్ష్ చదలవాడ. ‘‘ధీర’ చాలా యూనిక్ పాయింట్. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు విక్రాంత్ శ్రీనివాస్. -
ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగిసిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతా సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. రిపబ్లిక్ డే కానుకగా తలో డబ్బింగ్, హిందీ మూవీ రిలీజ్ అయ్యాయి గానీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ శుక్రవారం పదికి పైగా తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిలో ఏ మూవీకి హైప్ ఉంది? ఫిబ్రవరి 2న 10 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ మాత్రం ఉన్నవాటిలో కాస్త ఆసక్తి రేపుతోంది. వరసపెట్టి ప్రమోషన్స్ చేస్తున్న చిత్రబృందం.. సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. దీని తర్వాత 'బిగ్‌బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటించి, నిర్మించిన 'బూట్ కట్ బాలరాజు' కూడా ఉన్నంతలో బెటర్ మూవీ. ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బుల్లేవని సొహైల్ చెప్పాడు. పూర్తిగా కామెడీని నమ్ముకుని వస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) పై రెండు సినిమాలతో పాటు కామెడీని నమ్ముకున్న 'కిస్మత్', లక్ష్ చదలవాడ ధీర', థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'గేమ్ ఆన్' రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'హ్యాపీ ఎండింగ్', 'మెకానిక్', 'ఉర్వి', 'చిక్లెట్స్', 'శంకర' చిత్రాలు కూడా ఫిబ్రవరి 2నే బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. అయితే వీటికి థియేటర్ల పరంగా ఇబ్బంది ఉండదు కానీ హిట్ అయ్యే విషయంలోనే అసలు సమస్య ఉంటుంది. ఎందుకంటే మరీ అంత బాగుంటే తప్పితే జనాలు ఈ పది సినిమాల్లో ఒక్కదానిపై అయిన ఆసక్తి చూపించరు. దీనికితోడు వచ్చేవారం థియేటర్లలోకి రవితేజ 'ఈగల్', యాత్ర 2, రజనీకాంత్ 'లాల్ సలామ్' రాబోతున్నాయి. మరి వీటికోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల్ని.. ఈ వారం థియేటర్లలోకి తీసుకొచ్చే సినిమా ఏది? హిట్ అయ్యే మూవీ ఏది అనేది చూడాలి? (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) -
ఆసక్తికరంగా 'ధీర' ట్రైలర్.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
'వలయం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో లక్ష్ చదలవాడ. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన 'ధీర' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. అలానే చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?) ఈ ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, లవ్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు బాగున్నాయి. 'నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అయితే ఇదే తేదీన తెలుగులోనే పలు స్ట్రెయిట్ మూవీస్ కూడా రానున్నాయి. (ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన) -
ఆకట్టుకుంటోన్న ‘ధీర’ మేకింగ్ వీడియో
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ చదలవాడ నటిస్తున్న తాజా చిత్రం ‘ధీర’. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధీర గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ జానర్ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనే హింట్ ఇచ్చేశారు మేకర్లు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను వదిలారు. షూటింగ్ స్పాట్లో యూనిట్ ఎంత సరదాగా ఉందో.. ఎంత కష్టపడి చిత్రీకరణ చేశారో చూపించేలా వదిలిన ఈ మేకింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.ధీర మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. -
తెలుగు యువ హీరో కొత్త మూవీ.. టీజర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ లేటెస్ట్ మూవీ 'ధీర'. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు తదితర సినిమాల తర్వాత లక్ష్ చేస్తున్న చిత్రమిది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) ఈ టీజర్లో మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ దట్టించారు. దీనిబట్టి చూస్తే సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఉండనుందని తెలుస్తోంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇకపోతే 'ధీర' మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కూడా ముగించుకుని.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) -
లక్ష్ చదలవాడ ‘ ధీర ’ వచ్చేస్తోంది
కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా థియేటర్స్‌కి వస్తున్నారు ప్రేక్షకులు. కథ-కథనంలో కొత్తదనం ఉంటే హీరో హీరోయిన్లు ఎవరనేది కూడా పట్టించుకోవడం లేదు. అందుకే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్, యాక్టర్స్ న్యూ ఏజ్ కంటెంట్‌తో వచ్చి హిట్లు కొడుతున్నారు. అలా టాలీవుడ్ యంగ్ హీరోల్లో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ధీర మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. -
చదలవాడ 'ధీర' గ్లింప్స్ విడుదల
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో లక్ష్ చదలవాడ ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు పూర్తి యాక్షన్ మాస్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ‘ధీర’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి; ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన అరియాన) ఇప్పటికే ధీర నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. నేడు లక్ష్ చదలవాడు పుట్టిన రోజు సందర్భంగా ధీర నుంచి అప్డేట్ ఇచ్చారు. ధీర మూవీ నుంచి గ్లింప్స్‌ను దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లక్ష్ చదలవాడ హీరోయిజం ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్‌లో డైలాగ్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి. 'ఇరవై మంది వెళ్లారు కదరా?.. అవతల వాడు ఒక్కడే.. వార్ ని కూడా వార్మ్ అప్లా చేసేశాడు..' అనే డైలాగ్స్‌తో డైరెక్టర్ విక్రాంత్ లక్ష్ హీరోయిజాన్ని అమాంతం ఎలివేట్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లక్ష్ లుక్స్, మ్యానరిజం అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. త్వరలోనే ఈ మూవీ థియేటర్లోకి రాబోతోంది. -
ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!
రాజుల కాలంలో అంతఃపురం ఎలా ఉండేది అంటే.. ఇలా ఉంటుందేమో అని సినిమాలు చూపించాయి. మరి.. స్వర్గలోకం ఎలా ఉంటుంది? అంటే.. ఈ లోకాన్ని కూడా ఊహించి, సినిమాల్లో చూపించారు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొత్త ప్రపంచాలను చూపించనున్నాయి. ఊహాజనిత కథలతో సాగే ఈ చిత్రాల కోసం భారీ సెట్స్‌తో కొత్త లోకాలను సృష్టిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. స్వర్గం నేపథ్యంలో... ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని ఈ చిత్రంలో కొన్ని సీన్లు స్వర్గం నేపథ్యంలో ఉంటాయి. తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమా మళ్లీ ప్రేక్షకులను స్వర్గలోకంలోకి తీసుకెళ్లనుందని టాక్. గత ఏడాది కల్యాణ్ రామ్‌తో ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘బింబిసార’ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందనుందని టాక్. ‘బింబిసార’ తరహాలోనే ఫ్యాంటసీ జానర్లో ఉండే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఊహాజనిత స్వర్గం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. సాహసాల ధీర ‘ధీర’గా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లనున్నారట అఖిల్. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్‌లో ఒకరైన అనిల్‌కుమార్ ఇటీవల అఖిల్‌కు ఓ కథ చెప్పారు. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని సమాచారం. నాలుగు పేజీల భైరవకోన ప్రేక్షకులను ‘భైరవకోన’కు తీసుకెళ్తామంటున్నారు సందీప్ కిషన్. ‘టైగర్’ (2015) చిత్రం తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. ‘శ్రీకృష్ణదేవరాయల కాలంలోని గరుడ పురాణానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఈ నాలుగు పేజీలే భైరవకోన’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. అంజనాద్రి వీరుడు ‘హను–మాన్’ చిత్రం కోసం ‘అంజనాద్రి’ అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమంతుని శక్తులు పొందిన ఓ యువకుడు ‘అంజనాద్రి’ రక్షణ కోసం ఎలాంటి పోరాటాలు, సాహసాలు చేశాడు అనే అంశాలతో ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. తేజా సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘అధీర’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా కాస్త ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కె. నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. -
ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే!
కేరీర్లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ అక్కినేనికి ప్రతిసారి నిరాశే మిలుగుతుంది. భారీ అంచాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాడు అఖిల్. కానీ ఆయన ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అఖిల్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ మూవీగా ఏజెంట్ నిలిచింది. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి) అయితే సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా.. తన తర్వాత చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ అక్కినేని హీరో. ‘సాహో’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అనిల్ కుమార్ ఇటీవల అఖిల్‌కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లోని ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. (చదవండి: చైతూ నా దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నాడు: వెంకట్ ప్రభు ) అంతేకాదు ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి. -
Dheera : అధరం మధురం.. వదనం మధురం.. నయనం మధురం
కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ.. రీసెంట్ గా 'వలయం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' తో ప్రేక్షకులను అలరించిన ఆయన..ఇప్పుడు అదే జోష్ లో 'ధీర' అనే మరో ప్రాజెక్టులో భాగమవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ యూత్ ఫుల్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అధరం మధురం.. వదనం మధురం.. నయనం మధురం అంటూ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ట్యూన్ తో సాగిపోతున్న ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. ప్రేయసి ఆలోచనలు, జ్ఞాపకాలతో ప్రియుడి ఘాడమైన ప్రేమను వ్యక్తపరుస్తూ బాలాజీ రాసిన లిరిక్స్ బాగున్నాయి. అనురాగ్ కులకర్ణి, ఎమ్ఎల్ శృతి ఆలపించిన తీరు ఎంతో ఆకర్షిస్తోంది. లిరిక్స్‌కి తగ్గట్టుగా సాయి కార్తీక్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవల్ పెంచేశాయి. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ధీర సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న 'ధీర'.. ఫస్ట్ లుక్ రిలీజ్
లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ధీర'. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా విడుదల చేసింది చిత్రబృందం. ఓ సరికొత్త కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ 'ధీర' సినిమాను రూపొందిస్తున్నారు. వలయం సినిమాతో సక్సెస్ అందుకున్న లక్ష్.. 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. పోస్టర్‌ను చూస్తే పూర్తి యాక్షన్ హీరోని తలపించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని, 2023లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
‘ధీర’గా రాబోతున్న లక్ష్ చదలవాడ
వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్.. త్వరలోనే ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలలో ‘ధీర’అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా.. చదలవాడ శ్రీనివాస రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 14 వరకు హైదరాబాద్‌లోనే షూటింగ్ జరగనుంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.