‘ధీర’గా రాబోతున్న లక్ష్‌ చదలవాడ | Laksh Chadalavada Dheera Movie Launched | Sakshi
Sakshi News home page

‘ధీర’గా రాబోతున్న లక్ష్‌ చదలవాడ

Published Sat, Apr 9 2022 3:37 PM | Last Updated on Sat, Apr 9 2022 3:37 PM

Laksh Chadalavada Dheera Movie Launched - Sakshi

వరుస సినిమాలతో కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో లక్ష్‌ చదలవాడ. ‘వలయం’ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్‌.. త్వరలోనే ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్‌ హీరో తాజాగా మరో సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు.

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలలో ‘ధీర’అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ  క్లాప్ ఇవ్వగా.. చదలవాడ శ్రీనివాస రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 14 వరకు హైదరాబాద్‌లోనే షూటింగ్‌ జరగనుంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement