
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(Indian Institute of Science)లో ఓ ప్రొఫెసర్ విషయంలో హనీట్రాప్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
గతంలో.. సంచలన అభియోగాల మీద ప్రొఫెసర్‌గా పని చేసిన దుర్గప్పను ఐఐఎస్సీ(IISc) విధుల నుంచి తొలగించింది. అయితే.. సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్(Senapathy Kris Gopalakrishnan)తో పాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరికొందరు తనపై కుట్ర చేశారని, హనీట్రాప్ కేసులో ఇరికించారని దుర్గప్ప ఆరోపిస్తున్నారు. అంతేకాదు కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు..
సోమవారం కోర్టును ఆశ్రయించారు. దీంతో.. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. బెంగళూరు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ ఆరోపణలపై ఇటు గోపాలకృష్ణన్‌కానీ, అటు ఐఐఎస్ బోర్డుకానీ స్పందించలేదు. ప్రస్తుతం గోపాలకృష్ణన్ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.
1981, జులై 2వ తేదీన ఇన్ఫోసిస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నారాయణమూర్తితో పాటు సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్, మరో ఐదుగురు కలిసి ఈ కంపెనీని పుణే(మహారాష్ట్ర)లో తొలుత ప్రారంభించారు.