atrocities case
-
టీడీపీ నేత బరితెగింపు.. కులం పేరుతో..
పాకాల: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా మండల మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే తహసీల్దార్‌పై దాడికి ప్రయత్నించారు. దళితులైన మహిళా అధికారులను కులం పేరుతో దూషించారు. ఏం జరిగిందంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని శనివారం పాకాల తహసీల్దార్ లోకేశ్వరి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అధికారులే ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నారు. పట్టాలు ఎలా పంపిణీ చేస్తారని నేండ్రగుంటకు చెందిన టీడీపీ పాకాల మండల మాజీ అధ్యక్షుడు నాగరాజునాయుడు తహసీల్దార్‌ను ఫోన్లో దూషించాడు. పట్టాల పంపిణీని నిలిపివేయాలని, లేకుంటే అంతు చూస్తానని బెదిరించాడు. తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి అనుచరులతో వెళ్లి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. దళితురాలైన తహసీల్దార్ లోకేశ్వరిని కులం పేరుతో దూషించాడు. ఆమేరకు లోకేశ్వరి ఆదివారం పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజునాయుడు, మరో ఆరుగురిపై ఐపీసీ 448, 143,506, 509,353, 323 రెడ్‌విత్ 149 ఐపీసీ, 3(1)(యస్) ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పాకాల ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా డీఎస్పీ విజయశేఖర్ విచారణ చేపట్టారు. -
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు
సాక్షి, పటాన్చెరు టౌన్: జర్నలిస్ట్‌ను ఫోన్లో దూషించి, బెదిరించిన ఘటనలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అమీన్పూర్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దినపత్రి కలో వచ్చిన కథనానికి సంబం ధించి జర్నలిస్ట్ సంతోశ్‌ను ఫోన్ చేసి ఎమ్మెల్యే దూషించిన విషయం వైరలైంది. ఎమ్మెల్యే తన ను దూషించాడని తోటి జర్నలిస్టులతో కలిసి సంతోశ్ మంగళవారం డీఎస్పీ భీంరెడ్డి కలిసి, అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై మంగళవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా ఈ మేరకు పోలీసులు 331/2020 అండర్ సెక్షన్ 109, 448, 504, 506–ఐపీసీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. కాగా, తాను ఏనాడూ జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడలేదని, అమర్యాదగా వ్యవహరించలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే కనుక వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒక ప్రటకనలో పేర్కొన్నారు. -
టీడీపీ నేతపై అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సోమవారం ఓ దళిత యువకుడిపై కాకినాడ టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ దాడి చేశారు. ఘటన వివరాలిలా ఉన్నాయి.. జగ్గంపేట–కాకినాడ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనికోసం తవ్విన డ్రైయిన్‌లో వాన నీరు నిలిచిపోయింది. దీంతో ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన రెండు దుకాణాలు పడిపోయాయి. ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న జ్యోతుల నవీన్ ప్రొక్లెయిన్ ఆపరేటర్ చీర ధనకృష్ణతో వాగ్వాదానికి దిగారు. షాపులు పడిపోయేలా మట్టి ఎందుకు తొలగించావని ప్రశ్నించారు. అధికారులు తెలిపిన కొలతల ప్రకారమే తాను మట్టి తొలగించానని చెబుతుండగానే అతడిపై నవీన్ చేయిచేసుకున్నారు. దీంతో బాధితుడు ధనకృష్ణ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు దాడి కేసు కూడా నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం
గుడివాడ : ఓ మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం ఆలస్యంగా వెలుగు చూసింది. దళిత అధికారి అని కూడా చూడకుండా కులం పేరుతో తిట్టిన టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసులు పెడితే కనీసం పట్టించుకోకపోగా ఆమెపై బదిలీ వేటు వేసిన ఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం.. వేలంపాటలో దక్కలేదనే అక్కసుతోనే... గుడివాడ రూరల్ మండలంలోని కూలిపోయిన అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాల తొలగింపునకు వేలం నిర్వహించారు. మోటూరుకు చెందిన టీడీపీ నేత శేషగిరి వేలంలో పాల్గొనగా వేరే వ్యక్తికి దక్కింది. అతను భవనాలు కూల్చే పనిలో ఉండగా శేషగిరి ఫోన్ చేసి పార్టీ ఫండ్‌గా రూ.25 వేలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తనకు ఎంపీడీవో కె. జ్యోతి కాంట్ట్రాక్టు ఇచ్చారని, ఆమెను అడగాలని చెప్పటంతో రెచ్చిపోయిన ఆ నాయకుడు ఎంపీడీవోను తిట్టినట్లు వినికిడి. కులం పేరుతో ధూషించి అనరాని మాటలు అన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఆమె టీడీపీ నాయకుడు శేషగిరి తనను ఏ మని తిట్టాడో కాంట్రాక్టర్‌తో లేఖ రాయించుకున్నారు. టీడీపీలో రెండు వర్గాలుగా విడిపోయి.. విషయం తెలియగానే టీడీపీలోని ఓ వర్గం ఎంపీడీవోకు ఫోన్ చేసి శేషగిరిపై అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పారు. మరోవైపు టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కేసు పెట్టడానికి వీల్లేదని చెప్పినట్లు వినికిడి. అయితే తనకు జరిగిన అవమానంతో ఆమె గుడివాడ రూరల్ స్టేషన్లో శేషగిరిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది. టీడీపీ కార్యాలయంలో పంచాయతీ.. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎంపీడీవోను పిలిపించి పంచాయితీ పెట్టారు. కేసు వెనక్కి తీసుకోవాలని వత్తిడి తెచ్చారు. ఎంత చెప్పినా ఆమె వినకపోవటంతో నీవు వైఎస్సార్ సీపీ నేతలకు పనులు చేస్తున్నావని అభియోగం మోపారు. దీనిపై ఆమె ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. రాజీ కుదరకపోవడంతో బదిలీ వేటు.? రాజీకి రాలేదని ఎంపీడీవోపై బదిలీ వేటు వేశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తో మాట్లాడి ఏ కారణం లేకుండానే ఆమెను పెదపారుపూడి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. -
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
భామిని: ఎస్టీ వివాహితను మోసగించాడన్న ఫిర్యాదుపై పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి దర్యాప్తు చేశారు. భామిని మండలం చిన్నదిమిలి కాలనీలో డీఎస్పీ స్వరూపారాణి, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. వివాహిత ఎడ్ల పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నదిమిలి కాలనీకి చెందిన యువకుడు టి.మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు, వీఆర్ఓ కె.బాలరాజు, వార్డు సభ్యులు ఎ.యశోద, గ్రామస్తులు ఉన్నారు. -
మహిళపై దాడి: పలువురిపై అట్రాసిటీ కేసు
ఓ మహిళపై దాడి చేసిన పలువురిపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లోని సంతోష్‌నగర్‌లో ప్రేమకుమారి నివాసముంటుంది. ఇటీవల ఆమె తన ఇంటి ఆవరణలో నూతన నిర్మాణాలను ప్రారంభించింది. ఈక్రమంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 50 మంది వచ్చి ఆమెపై దాడి చేయడమే కాకుండా నూతన నిర్మాణాన్ని కూల్చివేసి సామగ్రిని చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న సీఐ అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలువురిపై అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.