నాగరాజునాయుడు
పాకాల: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా మండల మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే తహసీల్దార్‌పై దాడికి ప్రయత్నించారు. దళితులైన మహిళా అధికారులను కులం పేరుతో దూషించారు.
ఏం జరిగిందంటే..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని శనివారం పాకాల తహసీల్దార్ లోకేశ్వరి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అధికారులే ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నారు. పట్టాలు ఎలా పంపిణీ చేస్తారని నేండ్రగుంటకు చెందిన టీడీపీ పాకాల మండల మాజీ అధ్యక్షుడు నాగరాజునాయుడు తహసీల్దార్‌ను ఫోన్‌లో దూషించాడు. పట్టాల పంపిణీని నిలిపివేయాలని, లేకుంటే అంతు చూస్తానని బెదిరించాడు. తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి అనుచరులతో వెళ్లి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు.
దళితురాలైన తహసీల్దార్ లోకేశ్వరిని కులం పేరుతో దూషించాడు. ఆమేరకు లోకేశ్వరి ఆదివారం పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజునాయుడు, మరో ఆరుగురిపై ఐపీసీ 448, 143,506, 509,353, 323 రెడ్‌విత్ 149 ఐపీసీ, 3(1)(యస్) ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పాకాల ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా డీఎస్పీ విజయశేఖర్ విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment