
సాక్షి, పటాన్‌చెరు టౌన్: జర్నలిస్ట్‌ను ఫోన్‌లో దూషించి, బెదిరించిన ఘటనలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అమీన్‌పూర్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దినపత్రి కలో వచ్చిన కథనానికి సంబం ధించి జర్నలిస్ట్ సంతోశ్‌ను ఫోన్ చేసి ఎమ్మెల్యే దూషించిన విషయం వైరలైంది. ఎమ్మెల్యే తన ను దూషించాడని తోటి జర్నలిస్టులతో కలిసి సంతోశ్ మంగళవారం డీఎస్పీ భీంరెడ్డి కలిసి, అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై మంగళవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా
ఈ మేరకు పోలీసులు 331/2020 అండర్ సెక్షన్ 109, 448, 504, 506–ఐపీసీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. కాగా, తాను ఏనాడూ జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడలేదని, అమర్యాదగా వ్యవహరించలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే కనుక వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒక ప్రటకనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment