patan cheru
-
హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం ఒక్క రోజే రెండు హత్యలు వెలుగు చూశాయి. పటాన్చెరు పరిధిలోని ఇస్నాపూర్ శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన నదీమ్ అహ్మద్(27)గా గుర్తించారు. టోలిచౌకిలో నివసిస్తున్న నదీమ్.. సంగారెడ్డిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇస్నాపూర్ వద్ద గొడవ జరగడంతో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కొసి చంపినట్లు తేలింది. .మృతుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్ అహ్మద్‌గా గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం జహీరాబాద్‌లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహమ్మద్ నిందితుడిగా ఉన్నాడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా ఏడుగురు నిందితులుగా ఉన్నారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం -
తలపై కట్టెతో దాడి.. తండ్రి చేతిలో కొడుకు హతం
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): మద్యం మత్తులో కన్న కొడుకునే హతమార్చాడు ఓ తండ్రి. ఈ సంఘటన గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిన్నారం సీఐ లాలూనాయక్, ఎస్ఐ విజయకృష్ణ, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది శ్రీనివాస్‌గౌడ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం జరిగింది. కుమారుడు సాయికుమార్‌గౌడ్(25) గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నాడు. శ్రీనివాస్‌గౌడ్ నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. సోమవారం రాత్రి యథావిధిగా మద్యం తాగి ఉన్నాడు. సాయికుమార్‌గౌడ్ కూడా మద్యం తాగాడు. కొడుకు వద్ద ఉన్న కూలి డబ్బులు రూ.7వేలు తనకు ఇవ్వాలని తండ్రి కోరాడు. ఇందుకు కొడుకు ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. శ్రీనివాస్‌గౌడ్ భార్య నివారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్‌గౌడ్ కోపంతో కుమారుడి తలపై కట్టెతో కొట్టాడు. దీంతో సాయికుమార్‌గౌడ్‌కు బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సాయికుమార్‌గౌడ్ మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ విజయకృష్ణ తెలిపారు. చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
ఫోర్జరీ చేసి రూ. 5కోట్ల భూ విక్రయానికి యత్నం
జిన్నారం(పటాన్చెరు): ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చి అమ్మేందుకు ఓ వ్యక్తి తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. నకిలీ పట్టా పాసు పుస్తకాలను సృష్టించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రెవెన్యూ అధికారులు ఈ భూమి పట్టా కాదని, ప్రభుత్వ భూమి అని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లీనగర్ గ్రామ పరిధిలోని 27 సర్వే నంబర్‌గల 1.23 ఎకరాల ప్రభుత్వ భూమిని భూపంపిణీలో భాగంగా గ్రామానికి చెందిన ర్యాకం సుశీలకు గతంలో కేటాయించారు. 2005లో ఈ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాగా గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన శివశంకర్‌యాదవ్ అనే వ్యక్తి ర్యాకం సుశీల నుంచి 1.23 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలను తయారు చేశాడు. 2018లో తహసీల్దార్‌గా ఇక్కడ విధులు నిర్వహించిన శివకుమార్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పట్టా పాసుపుస్తకాలను సృష్టించాడు. ఈ భూమిని విక్రయించేందుకు శివశంకర్‌యాదవ్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇక్కడ ఎకరం స్థలం సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిని విక్రయించి డబ్బులు సంపాదించొచ్చని భావించాడు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తహసీల్దార్ దశరథ్ ఆదేశాల మేరకు గురువారం ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్థలం అని బోర్డు పాతారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దశరథ్ మాట్లాడుతూ శివశంకర్‌యాదవ్ అనే వ్యక్తి అప్పటి తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించాడని స్పష్టం చేశారు. బొల్లారం పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు
సాక్షి, పటాన్చెరు టౌన్: జర్నలిస్ట్‌ను ఫోన్లో దూషించి, బెదిరించిన ఘటనలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అమీన్పూర్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దినపత్రి కలో వచ్చిన కథనానికి సంబం ధించి జర్నలిస్ట్ సంతోశ్‌ను ఫోన్ చేసి ఎమ్మెల్యే దూషించిన విషయం వైరలైంది. ఎమ్మెల్యే తన ను దూషించాడని తోటి జర్నలిస్టులతో కలిసి సంతోశ్ మంగళవారం డీఎస్పీ భీంరెడ్డి కలిసి, అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై మంగళవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా ఈ మేరకు పోలీసులు 331/2020 అండర్ సెక్షన్ 109, 448, 504, 506–ఐపీసీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. కాగా, తాను ఏనాడూ జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడలేదని, అమర్యాదగా వ్యవహరించలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే కనుక వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒక ప్రటకనలో పేర్కొన్నారు. -
574 ప్రమాదాల్లో 273 దుర్మరణం
ఔటర్.. డేంజర్ జిల్లాలోని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డు అంటేనే జిల్లా ప్రజలు అమ్మో.. అంటున్నారు. తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్నారు. నవంబర్ 10వ తేదీన పాటి వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రమాదాలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసినా అవి వేగ నియంత్రణకు ఫలితాలివ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లాలోని జాతీయ రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో జరిగిన 574 ప్రమాదాల్లో 273 మృతి చెందగా 566 మంది క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి అర్బన్: ఔటర్ రింగ్‌రోడ్డుపై లాక్డౌన్లో మినహా తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగమే కారణమని అధికారులు అంచనావేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం కావడం, జిల్లా కేంద్రంతో పాటు ముంబాయి, ఆంధ్రాకు ఔటర్ రింగురోడ్డు మీదుగా లక్షల్లో వాహనాలు వెళ్తుంటాయి. అతివేగంతో కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతుండగా, ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టి మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత శీతాకాలంలో పొగమంచు వల్ల తెల్లవారు జామున, రాత్రుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వేగాన్ని నియత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూచిక బోర్డులూ కరువు.. జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయితీరాజ్ రోడ్లపై మూలమలుపులు ఉండటంతో అతివేగంతో వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. పాదాచారులను, ద్విచక్రవాహనాదారులను ఢీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అకోలా–నాందేడ్ జాతీయరహదారి శివ్వంపేట వద్ద ఉన్న మూల మలుపు వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చౌటకూర్ వద్ద, అన్నాసాగర్ చెరువు సమీపంలో పసల్‌వాదీ, సంగారెడ్డి సమీపంలో మూలమలుపులతో ప్రమాదం పొంచి ఉంది. ఎంఎన్ఆర్ చౌరస్తా నుంచి పటన్‌చెరు మండలం గణేష్‌గడ్డ వరకు సూమారు 10 మూలమలుపులు ఉన్నాయి. ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న ప్రమాదకర మూలమలుపులతో పాదాచారులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఆర్‌అండ్‌రోడ్లు, పంచాయితీరోడ్లపై ఉన్న మూల మలుపుల వద్ద సూచికబోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అసంపూర్తిగా 65వ నంబర్ జాతీయ రహదారి పనులు.. 65వ నంబర్ జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో అతివేగంగా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. మల్కాపూర్ చౌరస్తాలో నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడు ఏళ్లకుపైగా అవుతున్నా పూర్తి కావడం లేదు. మల్లేపల్లి శివారులో ఉన్న బీరు పరిశ్రమల నుంచి ప్రతిరోజు లోడుతో భారీ వాహనాలు వస్తుంటాయి. అసంపూర్తిగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్దాపూర్‌లో సర్వీస్‌రోడ్డు అసంపూ ర్తిగా ఉంది. దీంతో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలి. అతివేగం పనికిరాదు. కోవిడ్–19 కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తగ్గించాం. కొందరు డ్రైవర్లు రోడ్ల వెంబడి వాహనాలను ఇస్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. అతివేగంతో డ్రైవింగ్ చేసే వాహనాలను కట్టడి చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తూన్నాం. అతివేగం, అజాగ్రత్త, డ్రంక్‌అండ్‌డ్రైవ్ చేసి ప్రమాదాలకు కారణం కాకూడదు. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ -
‘రైతుల మేలుకే కొత్త విధానం’
సాక్షి, సంగారెడ్డి: రైతులకు మేలు కలిగించేందుకు కొత్త వ్యవసాయ విధానం అమలు చేస్తున్నామని, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి నిరంజన్ రెడ్డితో పటాన్చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... పదవి రావడం గొప్పకాదు, పదవి నిర్వహించడం గొప్ప. రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయం విధానం అమలు చేస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!) ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ మహానగర అవసరాలు తీర్చేలా పటాన్ చెరువు మార్కెట్‌ను అభివృద్ధి చెయ్యాలి. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్‌గా పటాన్ చెరువు మార్కెట్‌ను మార్చాలి. మార్కెట్ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంట్లో కూర్చొనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతాం. ఆన్లైన్ మార్కెట్ ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తాం. సిద్ధిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయి. సిద్దిపేట మార్కెట్లను చూసే నా నియోజకవర్గంలో మార్కెట్లను అభివృద్ధి చేశాను. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఒకప్పుడు తినడానికి సరిపోయే పంట కూడా పండని పరిస్థితి రాష్టంలో ఉండేది. అరేళ్లలో ఆ పరిస్థితిని అధిగమించాం. ప్రస్తుతం నిల్వ చేయడానికి గోదాముల లేని స్థాయిలో పంటలు పండుతున్నాయి. ఈ సంవత్సరం 39 లక్షల 40 వేల ఎకరాల్లో వరి పంట పండింది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఏ స్థాయిలో అవసరమో, విశ్వవిద్యాలయాలతో సర్వే చేయించాం. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మాత్రమే బియ్యం కోసం మనపై ఆధారపడ్డాయి. కొత్త వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, పండిన పంటకు కొనుగోలుకు హామీ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రావాలి అన్న లక్ష్యంతో కొత్త విధానం రూపొందిస్తున్నాం. ఒక పంట పండిన తర్వాత అది ఆహారంగా మారే వరకు వందల మందికి ఉపాధి దొరుకుతుంది. జిన్నారం, గుమ్మడిదళ గోదాములకు నిధులు మంజూరు చేశాం అని తెలిపారు. (మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు బాలికలు అదృశ్యం
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు బాలికలు కూడా మాయమవడం పోలీసులకు సవాలుగా మారింది. వివరాలు.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని శివానిని.. నిన్న రాత్రి ఆమె స్నేహితుడు పటాన్‌చెరువులోని కృషి డిఫెన్స్ కాలనీలో వదిలివెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఆ తర్వాత నుంచి ఆమె కనబడటం లేదు. అదే విధంగా పటాన్‌చెరువుకు చెందిన ఇద్దరు బాలికలు సోమవారం నుంచి అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో వరుస మిస్సింగ్ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మిస్టరీ ఛేదించే దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మొత్తం 48 మందిని కరిచి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని మూడు కాలనీలవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.కొన్ని గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రాలేకపోయారు. పటాన్చెరు పట్టణంలోని పాత మార్కెట్ రోడ్డు, ముదిరాజ్ బస్తీ, ఎంజీ రోడ్డు, జేపీ కాలనీలో సోమవారం రాత్రి ఓ పిచ్చి కుక్క అకస్మాత్తుగా దారిన పోయేవారిపై దాడి చేసింది. కొందరు ఇంటి ముందుర కూర్చుని ఉండగా దాడి చేసి కరిచింది. ముదిరాజ్ బస్తీలోని ఈశ్వరమ్మ ఉదయం వాకిలి ఊడుస్తున్న సమయంలో ఎడమ కాలుపై కరిచింది. అదే బస్తీలో ఉషారాణి అనే విద్యార్థిని ఇంటి బయట ముగ్గువేస్తున్న సమయంలో కుడి చేతిపై కరిచింది. మొత్తం 48 మంది పిచ్చికుక్క బారినపడి ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. స్థానికులు అందరూ కలిసి మంగళవారం ఉదయం పిచ్చికుక్కను కొట్టి చంపేశారు. -
దోపిడీ కలకలం
పటాన్చెరు టౌన్: అమీన్పూర్ మండలం బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన చోరీ కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించి, దొంగల దాడిలో గాయాలపాలైన షాపు యజమాని జైరాం ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు ఆరు నెలల క్రితం ఒక సారి షాపునకు వచ్చివెళ్లారని చెప్పడంతో పక్కా ప్లాన్ ప్రకారమే దొంగతనం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మంగళవారం రాత్రి 9. 45 సమయంలో బురఖా వేసుకున్న ఓ మహిళ, ఓ వ్యక్తి బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులోకి వచ్చి నగల మోడళ్లను చూపించాలంటూ యజమానిని కోరారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. అనంతరం షాపు యాజమాని జైరాం లోపలికి వెళ్లి సేఫ్ లాకర్లో నగలు పెడుతుండగా పిస్టల్‌తో బెదిరిం చారు. అతను పిస్టల్ గుంజుకోవడానికి యత్నించడంతో బురఖా వేసుకున్న మహిళ అతని కళ్లలో కారం చల్లింది. వెంటనే ఇద్దరు కలసి వెంట తెచ్చుకున్న రాడ్‌తో జైరాం తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలాడు. అతడిని బాత్రూంలోబందించి షాపులో ఉన్న 1 కిలో బంగారు ఆభరణాలు, రూ. 4.5 లక్షల నగదు తీసుకొని పరారయ్యారు. కొద్దిసేపటి అనంతరం తేరుకున్న షాపు యజమాని బాత్రూం తలుపులు పగులగొట్టి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి చోరికి పాల్పడిన నిందితుడి ఫోటోను బుధవారం ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి విడుదల చేశారు. ఎవరైనా నిందితుడిని గుర్తించి సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి అందిస్తామని ప్రకటించారు. -
గేదె మృతి : యువకుడి ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: పాలిచ్చే గేదె కరెంట్ షాక్‌తో మృతి చెందింది. దాన్ని తట్టుకోలేక మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు మండలంలోని లక్డారం గ్రామానికి చెందిన పాశం విజయ్ కుమార్(21) ఐదు ఆవులు, ఐదు పాడి గేదెలు మేపుకుంటూ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆవులను, గేదెలను మేత కోసం రుద్రారం గ్రామ శివారులోని రాంనగర్ ప్రాంతంలోని సాయిపార్థ వెంచర్ భూముల వద్దకు తోలుకువెళ్లాడు. అక్కడ తెగిపడిన విద్యుత్ వైర్ గేదెకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో విజయ్ కుమార్ తన అన్నయ్య అనిల్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకొన్న అనిల్ గేదె మృతి విషయంలో దిగులు పడకు అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రాత్రి విజయ్‌కుమార్ ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బంధువులు, తెలిసినవారి వద్ద వెతికినా లాభం లేకపోయింది. దీంతో శుక్రవారం ఉదయం సాయిపార్థ వెంచర్‌కు వెళ్లి చూడగా విజయ్‌కుమార్ అక్కడ ఓ చెట్టుకు తన వద్ద ఉన్న టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాలు ఇచ్చే గేదె మృతి చెందిందనే మనస్తాపంతో విజయ్ కుమార్(21) ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడని అతడి అన్నయ్య అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బస్సును ఢీకొట్టిన లారీ: 15 మందికి గాయాలు
పటాన్చెరువు: మెదక్ జల్లా పటాన్ చెరు ప్రాంతంలో ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పటాన్చెరు బస్టాండ్ ఎదుట బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో పటాన్ చెరు బస్టాండ్‌లోకి వెళ్లి తిరిగి బయటకు వస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముంబాయి వైపు వెళ్తున్న వేగంగా వచ్చిన లారీ, బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పడు బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనతో పటాన్ చెరు రహదారిపై భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. బస్సులో కూర్చొని క్షణ కాలం కాకముందే జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. -
రాంగ్‌రూట్ లో డ్రైవింగ్: 31 వేల జరిమానా
పటాన్చెరు: ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) జంక్షన్ వద్ద రాంగ్రూట్లో వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు బుధవారం రూ.31,500 జరిమానా విధించారు. జాతీయ రహదారిపై పూర్తిగా తప్పుడు రూట్లో వచ్చే వారిని మాత్రమే గుర్తించి, 31 మందికి జరిమానా విధించినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య తెలిపారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ మంచిది కాదని, అది కూడా జాతీయ రహదారిపై రాంగ్‌సైడ్‌లో నడపడం ప్రమాదకరమని ఆయన వాహనదారులను హెచ్చరించారు.