
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు బాలికలు కూడా మాయమవడం పోలీసులకు సవాలుగా మారింది. వివరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శివానిని.. నిన్న రాత్రి ఆమె స్నేహితుడు పటాన్‌చెరువులోని కృషి డిఫెన్స్ కాలనీలో వదిలివెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఆ తర్వాత నుంచి ఆమె కనబడటం లేదు. అదే విధంగా పటాన్‌చెరువుకు చెందిన ఇద్దరు బాలికలు సోమవారం నుంచి అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో వరుస మిస్సింగ్ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మిస్టరీ ఛేదించే దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment