
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం ఒక్క రోజే రెండు హత్యలు వెలుగు చూశాయి. పటాన్‌చెరు పరిధిలోని ఇస్నాపూర్ శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన నదీమ్ అహ్మద్(27)గా గుర్తించారు.
టోలిచౌకిలో నివసిస్తున్న నదీమ్.. సంగారెడ్డిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇస్నాపూర్ వద్ద గొడవ జరగడంతో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కొసి చంపినట్లు తేలింది. .మృతుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్ అహ్మద్‌గా గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం జహీరాబాద్‌లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహమ్మద్ నిందితుడిగా ఉన్నాడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా ఏడుగురు నిందితులుగా ఉన్నారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment