mahipal reddy
-
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి లాకర్లు తెరిచిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. మైనింగ్ కేసులో మహిపాల్‌రెడ్డి రూ. 300 కోట్ల ఆక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిపాల్‌పాటు రెడ్డితో పాటు, ఆయన సోదరడు మధుసూదన్‌రెడ్డి, కుమారుడిన ఈడీ ప్రశ్నించింది. మహిపాల్‌రెడ్డికి సంబంధించిన 1.2 కేజీల బంగారం, 100 రియల్ ఎస్టేట్ ఆస్తుల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మహిపాల్‌రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్స్‌కు ఎలాంటి రసీదులు, డాక్యుమెంట్స్ లేవని ఈడీ అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ టెస్ట్ కోసం ఎమ్యెల్యే, కుమారుడి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి మైనింగ్ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం పటాన్‌చెరులోని యాక్సిస్, ఎస్బీఐ బ్యాంక్‌లకు మహిపాల్‌రెడ్డినిత తీసుకువెళ్లి లాకర్లు తెరిచి తనిఖీలు చేశారు. యాక్సిస్ బ్యాంక్ లాకర్ నుంచి కీలక పాత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
మైనింగ్ కేసు: ఈడీ ఎదుట హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్,సాక్షి: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో ఈడీ ఆయనపై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. మైనింగ్ కేసులో మహిపాల్‌రెడ్డి రూ. 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. ఇటీవల ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితోపాటు ఆయన సోదురుడి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఆయన ఈడీ ముందుకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈడీ ప్రత్యేక అనుమతితో ఇవాళ హాజరయ్యారు. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేశారు. రూ. 39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. మైనింగ్‌లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్‌తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు సాగిస్తున్నారని ఈడీ గుర్తించింది. సంగారెడ్డి పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ సోదరులు మైనింగ్ నిర్వహించాని ఈడీ తెలిపింది. -
విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. ‘మా పారీ్టలో చేరండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విధంగా వ్యవహరిస్తోంది’అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డిని హరీశ్‌రావు కలిశారు. గురువారం జరిగిన ఈడీ సోదాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వర్తించేలా చట్ట సవరణ చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారన్నారు. ఈడీ దాడుల్లో దొరికిందేమీ లేదు.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ చేపట్టిన సోదాల్లో డబ్బు, బంగారం, ఎలాంటి వస్తువులు అక్రమంగా దొరకలేదని హరీశ్‌రావు చెప్పారు. ఆదాయపన్ను చెల్లిస్తున్న ఎమ్మెల్యే వద్ద ఆదాయ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. లీకేజీకి కారణమైన అధికారులపై ఈడీ, ఐటీ ఎందుకు దాడులు చేయట్లేదని నిలదీశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జెడ్పీ వైస్ చైర్మన్ మంజుశ్రీ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో సోదాలు.. ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని.. అక్రమ మార్గంలో డబ్బు మొత్తం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ తెలిపింది. రూ.300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.‘‘ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించాం. కొన్ని బ్యాంక్ లాకర్స్‌ను ఇంకా తెరవాల్సిఉంది. బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించాం. మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించాం. సంతోష్ స్యాండ్, సంతోష్గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు జరిగాయి. సోదాలు సందర్భంగా రూ.19 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నాం. మధుసూదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారు’’ అని ఈడీ అధికారులు వెల్లడించారు. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్/పటాన్చెరు/పటాన్చెరు టౌన్: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో ఆరా తీస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గురువారం ఉదయాన్నే ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు ప్రారంభించారు. మహిపాల్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డితోపాటు మైనింగ్‌కు సంబంధించి కార్యాలయాలు, బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు హైదరాబాద్, పరిసరాల్లోని మొత్తం ఏడుకు పైగా ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం వరకు దాదాపు 11 గంటలపాటు సాగాయి. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై మధుసూధన్ రెడ్డిపై పటాన్చెరు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మధుసూదన్‌రెడ్డిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను, డిజిటల్ డివైజ్‌లను స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ఇంట్లోని వ్యక్తులు ఎవరినీ బయటికి రానీయలేదు. అలాగే వారి ఫోన్లను కూడా ఈడీ బయటకు అనుమతించలేదు. నివాసాల వద్ద ఉన్న కార్లలో కూడా తనిఖీలు చేసి అధికారులు కొన్ని కాగితాలను తీసుకెళ్లారు. నిబంధనల అతిక్రమణపై కేసు నమోదు కేంద్ర పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు, అనుమతించిన పరిమితికి మించి తవ్వకాలు వంటి ఆరోపణలపై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మధుసూదన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా సంతోష్ గ్రానైట్ మైనింగ్, ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. సంబంధిత అనుమతుల గడువు ముగిసినా కూడా మధుసూదన్‌రెడ్డి మైనింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంటూ ఇటీవల అధికారులు క్రషర్లను స్వాధీనం చేసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ విచారణలో లక్డారంలో మధుసూధన్‌రెడ్డికి చెందిన కంపెనీలు నిర్వహిస్తున్న అనేక అక్రమ మైనింగ్ కార్యకలాపాలు బయటపడ్డాయి. మహిపాల్‌రెడ్డి, మధుసూధన్రెడ్డిలకు సంబంధించిన వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే రూ.3 కోట్లతో మహిపాల్ రెడ్డి అల్లుడు లాండ్‌క్రూజర్ కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి డబ్బు ఎక్కడిది అన్న కోణంలోనూ ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.కొండను తవ్వి ఎలుకను పట్టారు ఈడీ తనిఖీలకు తాము పూర్తిగా సహకరించామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. సోదాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారించుకున్నాక అధికారులు వెళ్లిపోయారన్నారు. కొన్ని దస్తావేజులకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను వెంట తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరిత దాడిగా ఆయన అభివరి్ణంచారు. దేశం యావత్తు ఈడీ అధికారుల తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
-
సీఎం రేవంత్‌తో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీపై పఠాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవానం మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు. ఈ అంశంపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని మహిపాల్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని మహిపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనపై అవాస్తవ ప్రచారాలు, ఊహగానాలకు పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. చదవండి: ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి -
వచ్చే ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గంలో గెలుపొందే అభ్యర్థి ఎవరు?
పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ధిగా రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి కాట శ్రీనివాస గౌడ్‌పై 37799 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. మహీపాల్ రెడ్డికి 116326 ఓట్లు రాగా, శ్రీనివాస గౌడ్‌కు 78572 ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన నేత భూపాల్ రెడ్డి. 2009లో నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడిరది. మొదట బిసి వర్గానికి చెందిన నేత గెలిచినా ఆ తర్వాత రెండుసార్లు రెడ్డి నేతే గెలిచారు. కాగా ఇక్కడ బిజెపి తరపున పోటీచేసిన కరుణాకరరెడ్డికి 7400 పైగా ఓట్లు వచ్చాయి. 2014లో పటాన్ చెరు అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇక్కడ తిరిగి కాంగ్రెస్ తరపున పోటీచేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. నిజానికి ఈయన టిఆర్ఎస్లో చేరడానికి సన్నద్దమై, కెసిఆర్‌ను కూడా కలిసి, చివరి క్షణంలో ఆగిపోయారు. రాహుల్ గాంధీ పోన్ చేసి టిక్కెట్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లోనే కొనసాగారు. కాని ఎన్నికలో మాత్రం 37226 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉండిపోయారు. తదుపరి రాజకీయంగా వెనుకబడి పోయారు. పటాన్ చెరు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పుత్రశోకం
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(35) గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. మూడురోజుల క్రితం గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా కామెర్లు సోకాయి. వైద్యులు డయాలసిస్ కూడా చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు ఆస్పత్రికి చేరుకొని ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. సాయంత్రం ఇక్కడ నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, జగ్గారెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వెన్నవరం భూపాల్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
పుత్రశోకంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. హరీష్‌రావు ఓదార్పు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కొడుకు విష్ణువర్థన్ గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో మూడు రోజుల నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విష్ణు.. గత అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం. పుత్రశోకంతో కుంగిపోయిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు ఓదార్చారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడి మృతితో స్థానికంగా కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. -
కిడ్నీ, కాలేయం దానం: ఏఎస్సై పాడె మోసిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట ఘటనలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఏఎస్సై మహిపాల్ రెడ్డి మృతి కి పోలీస్ శాఖ కన్నీటి నివాళి అర్పించింది. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో మహిపాల్ రెడ్డి కిడ్నీలు, కాలేయం దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయన దానం అనంతరం కిస్మత్‌పూర్‌లోని మహిపాల్ రెడ్డి నివాసం వద్ద అంత్యక్రియలు జరిగాయి. మహిపాల్ రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు, పోలీసులు వచ్చారు. అదనపు డీజీపీ సజ్జనార్ మహిపాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనంతో మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో మహిపాల్ రెడ్డి పాడెను సజ్జనార్ మోశారు. అంత్యక్రియల ఖర్చులకు సజ్జనార్ రూ.50 వేలు వ్యక్తిగత సహాయం చేశారు. మహిపాల్ రెడ్డి జీవితం నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పదేపదే చెప్తున్నా వినడం లేదని, మహిపాల్ రెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి శాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ఏఎస్సై మృతి: కిస్మత్పూర్లో విషాదం
కూకట్పల్లి (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అతివేగంగా కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై మహిపాల్‌రెడ్డి మంగళవారం మృతి చెందారు. గత శనివారం నిజాంపేట్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకువచ్చిన టాక్సీ కారు మహిపాల్‌రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్సకోసం ఆయన్ను కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న మహిపాల్‌రెడ్డి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాలు.. మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న కేపీహెచ్‌బీ ఏఎస్ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ డ్రైవ్ చేపట్టారు. సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్.. పవన్‌తో కలిసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్‌ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయలుదేరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కుమార్ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్ రౌండింగ్ ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్‌రెడ్డి ప్రమాద వివరాలను నోట్ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్‌ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టాడు. కిస్మత్పూర్లో అంత్యక్రియలు: ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి మృతి చెందడంతో ఆయన స్వస్థలం కిస్మత్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మహిపాల్‌రెడ్డి కిడ్నీలు, లివర్‌ను అవయవదానం చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం కిస్మత్పూర్తోని ఆయన నివాసం వద్ద అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు. అంత్యక్రియల్లో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మహిపాల్‌రెడ్డి భౌతికకాయానికి అడిషనల్ డీజీపీ సజ్జనార్ నివాళులర్పించారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామంటూ.. రూ.3 కోట్ల మోసం -
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు
సాక్షి, పటాన్చెరు టౌన్: జర్నలిస్ట్‌ను ఫోన్లో దూషించి, బెదిరించిన ఘటనలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అమీన్పూర్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దినపత్రి కలో వచ్చిన కథనానికి సంబం ధించి జర్నలిస్ట్ సంతోశ్‌ను ఫోన్ చేసి ఎమ్మెల్యే దూషించిన విషయం వైరలైంది. ఎమ్మెల్యే తన ను దూషించాడని తోటి జర్నలిస్టులతో కలిసి సంతోశ్ మంగళవారం డీఎస్పీ భీంరెడ్డి కలిసి, అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై మంగళవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా ఈ మేరకు పోలీసులు 331/2020 అండర్ సెక్షన్ 109, 448, 504, 506–ఐపీసీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. కాగా, తాను ఏనాడూ జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడలేదని, అమర్యాదగా వ్యవహరించలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే కనుక వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒక ప్రటకనలో పేర్కొన్నారు. -
తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా
పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఓ జర్నలిస్ట్‌పై దూషణలకు దిగారు. ఓ దినపత్రికలో వ చ్చిన కథనం నేపథ్యంలో సదరు జర్నలి స్ట్‌కు ఫోన్‌చేసి ‘తమాషా చేస్తున్నావా.. నా పేరుతో కథనం రాస్తావా.. ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారు. ఈ ఆడియో కాస్తా మంగళవారం సోషల్ మీడియాలో వైరలైంది. అనంతరం తన ను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫోన్లో దూ షించారని జర్నలిస్టు సంతోష్‌నాయక్ పో లీసులను ఆశ్రయించాడు. తాను రాసిన కథనానికి ఎమ్మెల్యే ఫోన్లో దూషించడం తో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని డీఎస్పీ భీంరెడ్డిని కలసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే తీరును టీయూడబ్ల్యూజే– ఐజేయూ ఒక ప్రకటనలో ఖండించింది. -
ఆవేదనలో.. టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ గార్డెన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గార్డెన్లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన వ్యక్తిని ఆదివారం ఉదయం వాకింగ్‌కు వచ్చిన గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి మైలార్‌దేవ్‌పల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మహిపాల్‌రెడ్డిగా గుర్తించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కార్యకర్తలను పట్టించుకోలేదని సూసైడ్ నోట్లో మహిపాల్‌రెడ్డి పేర్కొన్నాడు. పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా టీఆర్ఎస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని మహిపాల్‌రెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వాకింగ్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చి మహిపాల్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులుస పేర్కొంటున్నారు. -
యూనివర్శిటీల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
-తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం పంజగుట్ట(హైదరాబాద్ సిటీ) ముఖ్యమంత్రి కెసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించడం సంతోషకరమని అదే సమయంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం డిమాండ్ చేసింది. ఎంతో మంది పేదలకు విద్య అందిస్తున్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని విశ్వవిద్యాలయాలకు బ్లాక్గ్రాంట్ని పెంచి నిధులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల భోధనేతర సిబ్బంది సంఘం అధ్యక్షులు కంచి మనోహర్, సెక్రటరీ జనరల్ కె.మహిపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ... ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతీ నెలా జీతాలు, ఖర్చులకు 33 కోట్ల 50 లక్షలు అవసరం కాగా ప్రభుత్వం కేవలం 19 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని, వచ్చే నెల జీతాలు వస్తాయో లేదో అన్న అనుమానం ఉందని పేర్కొన్నారు. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు పిఎఫ్ కూడా ఇవ్వడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు కూడా ట్రెజరీద్వారా ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. ప్రతీ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్న 238 కోట్ల బ్లాక్‌గ్రాంట్‌ను మరో 170 కోట్లు కలిపి త్వరగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్, పెన్షనరీ బెనిఫిట్స్‌ను చెల్లించాలని, టైమ్‌స్కేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మెనెంట్ చేయాలని, భోధనేతర సిబ్బంది లేని యూనివర్సిటీల్లో వెంటనే నియామకాలు చేపట్టాని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై త్వరలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం ఇస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జ్ఞానేశ్వర్, నాగభూషనం, శంకర్, ఖదీర్, రాజశేఖర్ రెడ్డి, వినోద్‌కుమార్, రుక్కయ్య, వెంకటేష్, రాము, విజయ్‌కుమార్, నాగభూషనం తదితరులు పాల్గొన్నారు. -
బంధువుల ఇంటికెళ్లి వచ్చేసరికి...
బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే లోపు ఇంటి తాళాలు పగులకొట్టి 13 తులాలు బంగారం, 30 తులాలు వెండి దోచుకెళ్లిన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ఎంఎల్ఆర్ కాలనీలో ఉండే యాస శ్రీకాంత్‌రెడ్డి కుటుంబం కలసి గత శనివారం నల్లగొండ జిల్లా తుర్కపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆయన తమ్ముడు మహిపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు. తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్లగా బట్టలు, వస్తువులు అన్ని చిందర వందరగా ఉన్నాయి. వెనక వైపు వెళ్లి చూడగా తలుపు గడి గడ్డపారతో విరగకొట్టి ఉంది. బీరువాలోని 13 తులాల బంగారు నగలు, 30 తులాలు వెండి కనిపించలేదు. ఈ విషయాన్ని ఆయన అన్న శ్రీకాంత్‌రెడ్డికి చెప్పాడు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాంత్‌రెడ్డి మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్‌టీంతో సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
పటాన్ చెరు ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ వక్తిపై దాడి చేసిన కేసులో మహిపాల్ రెడ్డికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడిందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే డిస్ క్వాలిఫై అయిన ఎమ్మెల్యేకు జీతం ఎలా చెల్లిస్తారని, అందుకు అసెంబ్లీ సెక్రటరీ పై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ రఘనందన్ రావు కోర్టను కోరారు. మరో వైపు పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం రెండు ఏళ్లకు మించి శిక్ష పడ్డ ప్రజా ప్రతినిధిపై ఆటోమేటిగ్గా అనర్హత వేటుపడుతుంది. ఈ నేపధ్యంలోనే ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ వర్గలు అంటున్నాయి. -
త్వరలో పఠాన్‌చెరు ఉపఎన్నిక
-
పాత కక్షలతో రైతు హత్య
నల్గొండ జిల్లా జైపూర్ మండలం పెరాటిగూడ గ్రామ శివారులో సోమవారం ఉదయం మహిపాల్‌రెడ్డి(40) అనే రైతులు గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. శివారులో మహిపాల్‌రెడ్డి శవం పడిఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వేట కొడవళ్లతో నరికి చంపినట్లు మృతుని మెడపై ఆనవాళ్లు ఉన్నాయి. పాతకక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు
ఓ పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో శిక్ష సంగారెడ్డి క్రైం: ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి, బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్కు రాయించుకున్న కేసులో మెదక్ జిల్లా పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. దీనితోపాటు రూ. 2,500 జరిమానా విధిస్తూ సంగారెడ్డి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ డి.దుర్గాప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు. అయితే జిల్లా కోర్టులో అప్పీలు చేసుకుంటామని, శిక్ష వాయి దా వేయాలని కోరడంతో అనుమతించారు. 2014, మే 5న పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాశమైలారంలో ఉన్న వర్సటైల్ పరిశ్రమలో పనిచేస్తున్న మహేశ్ అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో మహిపాల్‌రెడ్డి, 70 మంది అనుచరులతో కలసి పరిశ్రమ వద్దకు వచ్చి.. కార్మికుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆ కార్మికుడిని మీరే చంపారంటూ మహిపాల్‌రెడ్డి తమను బెదిరించారని పరిశ్రమ యజమాని పాటి చందుకుమార్... 2014, మే 7న బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పరిశ్రమ జీఎం మదన్‌కాంత్, ఏజీఎం ప్రశాంత్ ఉన్నారని.. తన వద్ద నుంచి రూ. 15 లక్షలకు బలవంతంగా చెక్కు రాయించుకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిఛ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి... ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేశారు. అయితే జిల్లా కోర్టులో అప్పీలు చేసుకుంటామని విజ్ఞప్తి చేయడంతో... న్యాయమూర్తి నెల రోజులు గడువు ఇచ్చారు. విచారణను 2016 జనవరి 6కి వాయిదా వేశారు. -
దుకాణం నుంచి రూ.4.38 లక్షల మద్యం చోరీ
తూప్రాన్(మెదక్): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో రహదారికి పక్కనే ఉన్న వైన్స్‌లో మంగళవారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. రూ. 4.38 లక్షల మద్యం, రూ.7వేల నగదును దుండగులు అపహరించుకెళ్లారు. దుకాణం యజమాని మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న నవదుర్గా వైన్స్ వెనుక నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.4.38 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకెళ్లారు. దీంతోపాటు క్యాష్‌బాక్స్‌లో ఉన్న రూ.7వేలు కూడా ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయటంతోపాటు డీవీఆర్‌ను తీసుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వెతలు తీరుస్తా..
రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ ప్రాంతం మెదక్ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పట్టణం. భిన్న సంస్కృతులకు నిలయం. వలస జీవుల ఆవాసం. మినీ భారత్‌ను తలపించే నియోజకవర్గ కేంద్రం. జనాభాకు తగ్గట్టుగానే ఇక్కడి సమస్యలూ ఎక్కువే. అందుకే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే వారికి క్షణం తీరిక ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ తలమునకలై ఉంటారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మహిపాల్‌రెడ్డిది కూడా అదే పరిస్థితి. కానీ ఆదివారం ఆయన ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కొత్త అవతారం ఎత్తారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి స్థానిక మార్కెట్ సమస్యలు తెలుసుకున్నారు. ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల ఇబ్బందులను వారి ద్వారానే తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి: ఏమయ్యా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి. వ్యాపారి అల్తాఫ్ : సార్ నమస్కారం (లేచి నిలబడేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే వారించి కూర్చోబెట్టారు) సార్ ధరలు మండి పోతున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. ఎమ్మెల్యే: తెలంగాణ రాష్ట్రం వచ్చిన త ర్వాతకూడ ధరలు తగ్గలేదా? (నవ్వుతూ) అల్తాఫ్: అలా అని కాదు సార్.. కాలం సరిగ్గా లేక కూరగాయల ధరలు పెరిగాయి. ఎమ్మెల్యే: పటాన్‌చెరుకు కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అల్తాఫ్: సిటీ నుంచి సార్. అలాగే శంకర్పల్లి, పటాన్చెరు మండలం నుంచి కూడా వస్తున్నాయ్. ఎమ్మెల్యే: కూరగాయల మార్కెట్లో ఉన్న సమస్యలేంటి ? అశోక్ (స్థానికుడు): చాలా సమస్యలున్నాయి సార్. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ మార్కెట్‌ను పట్టించుకో లేదు. మీరైనా దయతో దీన్ని బాగు చేయండి. పారిశ్రామిక వాడ పెద్దగా ఉన్నా, మార్కెట్ ప్రత్యేక ప్రదేశం లేదు. దీంతో రోడ్డుపైనే మార్కెట్ జరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే : మున్సిపాలిటీ వాళ్లు రోజు మార్కెట్‌ను శుభ్రం చేస్తున్నారా? అర్షాద్ (స్థానికుడు): లేదు సార్... మార్కెట్లో కంపువాసన వస్తోంది. మురిగిపోయిన కూరగాయలను ఇక్కడి నుంచి తొలగించడం లేదు. వర్షాకాలంలో అమ్మేటోళ్లు, కొనేటోళ్లు శాన ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటోళ్లు సరిగ్గా పట్టించుకుంట లేరు. మార్కెట్‌ను షిఫ్టు చేయాలి. రోడ్డు మీద కూరగాయలు అమ్మకుండా సూడాలి. (సమస్యలన్నీ సావదానంగా విన్న మహిపాల్‌రెడ్డి స్పందిస్తూ) ఎమ్మెల్యే: పట్టణంలోని తిమేసియా ఫ్యాక్టరీ ఆవరణలో 12 ఎకరాల జాగా ఉంది. అక్కడికి మార్కెట్‌ను తరలిస్తాం. అన్ని రకాల వసతులు కల్పిస్తాం. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఒక్కటిన్నర నెలలో కూరగాయల మార్కెట్‌ను అక్కడికి తరలిస్తాం. దశాబ్దాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. (ఒక్కొక్కొ దుకాణాన్ని చూస్తూ ముందుకు సాగిన మహిపాల్‌రెడ్డి మహిళా వ్యాపారి వద్ద ఆగారు) ఎమ్మెల్యే : ఏమమ్మా మార్కెట్ యార్డును తిమేసియా ఫ్యాక్టరీ దగ్గరలోని స్థలంలోకి బదిలీ చేస్తే బాగుంటదా? వ్యాపారి నర్సమ్మ : ఇక్కడైతే ఏం బాగాలేదు పటేలా. మార్కెట్‌ను మంచి జాగలో పెటుండ్రి. ఇప్పుడైతే సానా కష్టాలు పడుతున్నాం. ఏండ్ల నుంచి ఈడనే అమ్ముతున్నాం. కొనేటోళ్లకు, మాకు శాన ఇబ్బంది ఐతాంది. ఎమ్మెల్యే: ఇక ఈ సమస్యలన్నీ పోతయి తల్లీ.. త్వరలోనే మార్కెట్ కమిటీని కూడా ఏర్పాటు చేయిస్తా. (మార్కెట్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడిన మహిపాల్‌రెడ్డి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు) ఎమ్మెల్యే: పింఛన్లు అందరికి వస్తున్నాయా? లక్ష్మమ్మ: సారూ...మాకు పింఛన్లు రావడం లేదు. ఎవరికి అడిగినా సమాధానం లేదు. ఎమ్మెల్యే: ఏం బాధపడొద్దమ్మా...పింఛనే కాదు..అన్ని సంక్షేమ పథకాలను అర్హులందరికీ దక్కేలా చూస్తా. పింఛన్ పోయిందని ఆందోళనొద్దు. నీను నేనేం జెప్తున్నా తప్పకుండా నీకు పింఛన్ వస్తుంది. (పక్కనే ఉన్న శ్రీనివాస్ అనే స్థానికుడు కల్పించుకుని..) శ్రీనివాస్: వృద్ధులు, వికలాంగులు పింఛన్ కోసం ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇచ్చే రూ. 200లే అందరికీ ఇస్తే బాగుండేది. ఎమ్మెల్యే: అర్హులందరికీ రూ. వెయ్యి పింఛన్లు వస్తాయి. గతంలో రూ. 200 ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. అర్హులై ఉండీ ఇంతవరకూ పింఛన్లు రాని వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యే: సర్కార్ భూముల్లో నివాసముంటున్న పేదోళ్లకు ఉచితంగానే పట్టాలిస్తున్నారు తెలుసా? (అక్కడున్న వాళ్లంతా అనుమానంగా మొహాలు చూసుకున్నారు..వారి అనుమానం అర్థం చేసుకున్న మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..) ఎమ్మెల్యే: అవునయ్యా..సర్కార్ స్థలంలో ఉన్న పేదోళ్లందరికీ సర్కార్ పట్టాలిస్తుంది. అయితే నివాసముంటున్న భూమి 125 గజాల్లోపు ఉండాలి. అర్హులంతా 18వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం ఉచితంగానే పట్టాలిస్తుంది. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు వీఐపీ రిపోర్టర్‌ను చేయడంతో పాటు ప్రజల వద్దకు తీసుకువచ్చి వారి సమస్యలను స్వయంగా తెలుసుకునే చేసిన ‘సాక్షి’ ప్రత్యేక కృతజ్ఞతలు. విలేకరిగా మారి జనం సమస్యలను రిపోర్ట్ చేయడం మంచి అనుభూతిని మిగిల్చింది. స్వాతంత్య్రం రాక ముందునుంచీ పట్టణంలో కూరగాయల సంత ఇక్కడే జరిగేది. జనాభా పెరిగినా సౌకర్యాలు ఆమేరకు పెరగలేదు. తెలంగాణ సర్కార్ దశాబ్ధాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. -మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు -
3 నామినేషన్ల పర్వం బోణి
తొలి రోజు స్పందన అంతంతే ఖరారు కాని పొత్తులు తేలని ప్రధాన పార్టీల అభ్యర్థులు పలు స్థానాల్లో దాఖలు కాని నామినేషన్లు సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల పోరులో తొలి ఘట్టం ప్రారంభమైంది. నామినేషన్ల పర్వానికి తెర లేచింది. తొలిరోజు ‘గ్రేటర్’ పరిధిలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసి బోణి చేశారు. పొత్తులు ఖరారు కాకపోవడం.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల్నిప్రకటించకపోవడం.. తదితర కారణాల రీత్యా చాలా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు లోక్‌సభ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలకు గాను బుధవారం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి, ఖైరతాబాద్, పటాన్చెరు అసెంబ్లీ స్థానాలకు ఒక్కో నామినేషన్ వంతున దాఖలయ్యాయి. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీహెచ్ మురహరి (ఎస్‌యూసీఐ)కమ్యూనిస్టు, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా షాబాజ్ రమేశ్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పటాన్చెరు నియోజకవర్గానికి టీఆర్ఎస్కు చెందిన గూడెం మహిపాల్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగానే తన నామినేషన్ దాఖలు చేయడం విశేషం. జీహెచ్ఎంసీ పరిధిలో కంటోన్మెంట్, బహదూర్‌పురా, సికింద్రాబాద్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, మలక్‌పేట, ముషీరాబాద్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎం, వైఎస్సార్సీపీల నుంచి ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఎంఐఎం ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. వారిలోఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇక బీజేపీ- టీడీపీల పొత్తులో భాగంగా ఎవరికే సీట్లో వెల్లడి కాలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల అభ్యర్థుల జాబితా వెలువడాల్సి ఉంది. ఏ క్షణంలో ఏయే పార్టీలు పొత్తు కుదుర్చుకోనున్నాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. గ త అసెంబ్లీ (2009) ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తలపడగా.. చార్మినార్ శాసనసభ స్థానం నుంచి అత్యల్పంగా 14 మంది పోటీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో నామినేషన్లు నిల్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు రంగారెడ్డి జిల్లాలో ఒక్క దరఖాస్తు కూడా నమోదుకాలేదు. జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని జిల్లా కలెక్టర్ బీ.శ్రీధర్ వెల్లడించారు. ప్రజల వాణిని వినిపిస్తాం ప్రజాధనాన్ని దోచుకోవడం రాజకీయ నాయకులకు హక్కుగా మారింది. అవినీతికి వ్యతిరేకంగా, మహిళల రక్షణ కోసం పార్టీ తరపున పెద్దెత్తున ఉద్యమాలు చేశాం. చట్టసభల్లో ప్రజల వాణిని వినిపించేందుకే నేను ఎన్నికల్లో పోటీచేస్తున్నా. ఎంసీపీఐ(యు)పార్టీతో మా పార్టీకి పొత్తు ఉంది. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కచ్చితంగా గెలిచేందుకు పోరాడతాం. ఖైరతాబాద్ నుంచి కూడా మా పార్టీ అభ్యర్థిగా ఇ.హేమలత గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. - సిహెచ్.మురహరి, ఎస్‌యుసీఐ(సి) అభ్యర్థి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం