సాక్షి, హైదరాబాద్: పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. మైనింగ్ కేసులో మహిపాల్‌రెడ్డి రూ. 300 కోట్ల ఆక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిపాల్‌పాటు రెడ్డితో పాటు, ఆయన సోదరడు మధుసూదన్‌రెడ్డి, కుమారుడిన ఈడీ ప్రశ్నించింది.
మహిపాల్‌రెడ్డికి సంబంధించిన 1.2 కేజీల బంగారం, 100 రియల్ ఎస్టేట్ ఆస్తుల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మహిపాల్‌రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్స్‌కు ఎలాంటి రసీదులు, డాక్యుమెంట్స్ లేవని ఈడీ అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ టెస్ట్ కోసం ఎమ్యెల్యే, కుమారుడి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి మైనింగ్ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. పటాన్‌చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం పటాన్‌చెరులోని యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్లకు మహిపాల్‌రెడ్డినిత తీసుకువెళ్లి లాకర్లు తెరిచి తనిఖీలు చేశారు. యాక్సిస్ బ్యాంక్ లాకర్ నుంచి కీలక పాత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment