case filled
-
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి లాకర్లు తెరిచిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. మైనింగ్ కేసులో మహిపాల్‌రెడ్డి రూ. 300 కోట్ల ఆక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిపాల్‌పాటు రెడ్డితో పాటు, ఆయన సోదరడు మధుసూదన్‌రెడ్డి, కుమారుడిన ఈడీ ప్రశ్నించింది. మహిపాల్‌రెడ్డికి సంబంధించిన 1.2 కేజీల బంగారం, 100 రియల్ ఎస్టేట్ ఆస్తుల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మహిపాల్‌రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్స్‌కు ఎలాంటి రసీదులు, డాక్యుమెంట్స్ లేవని ఈడీ అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ టెస్ట్ కోసం ఎమ్యెల్యే, కుమారుడి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి మైనింగ్ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం పటాన్‌చెరులోని యాక్సిస్, ఎస్బీఐ బ్యాంక్‌లకు మహిపాల్‌రెడ్డినిత తీసుకువెళ్లి లాకర్లు తెరిచి తనిఖీలు చేశారు. యాక్సిస్ బ్యాంక్ లాకర్ నుంచి కీలక పాత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారం సీఎం జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. చదవండి: రక్తమోడినా సడలని సంకల్పం -
మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాం 100వ ఎపిసోడ్‌ను ఆదివారం బీజేపీ చాలా అట్టహాసంగా జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నెలవారి రేడియో కార్యక్రమం మన కీ బాత్ కోసం రూ. 8.3 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా అన్ని ఎపిసోడ్లకు కలిపి రూ. 830 కోట్లు ఖర్చుపెట్టారంటూ ఒక ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ని గుజరాత్ ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు గాధ్వీ చేశారు. దీంతో గాధ్వీపై ఏప్రిల్ 29న సైబర్ క్రై బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వం తరపును ఫిర్యాదుదారుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎలాంటి విశ్వసనీయమైన డేటా లేకుండా గాధ్వి ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆప్ బీజేపిపై ఫైర్ అయ్యింది. బీజేపీ రాజకీయ హత్యకు పాల్పడుతూ ఇలా తమ నాయకులపై కేసు నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్ధా మాట్లాడతూ..కొత్త రోజు కొత్త ఎఫ్ఆర్ అంటూ ట్విట్టర్లో విమర్శించారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చిన్న రాజకీయ తర్జభర్జన చేసినందుకే గాధ్విపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే..పతకాలు గెలుచుకున్న రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నాయకుడిని మాత్రం చూసి చూడనట్టు వదిలేశారు ఈ పోలీసులు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసనలు చేసినా.. సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని, సుప్రీం కోర్టుని ఆశ్రయించాక పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని చద్ధా గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ప్యాక్ట్ చెక్ యూనిట్ గాధ్వీ చేసిన ట్వీట్‌ని అవాస్తవమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. వాస్తవానికి ఆ వైరల్ మెసేజ్‌లో చెప్పినట్లుగా ఒక్క ఎపిసోడ్‌కు రూ. 8.3 కోట్లు కాదని మొత్తం మన్కి బాత్ ఎపిసోడ్ల ప్రకటనల మొత్త ఖర్చు రూ. 8.3 కోట్లని వెల్లడించింది. ప్రతి ఎపిసోడ్‌కు ప్రకటనల మద్దతు ఉందని ఊహిస్తోంది అది తప్పు అని పీఐబీ పేర్కొంది. (చదవండి: బతికే ఉన్నా, పెళ్లైంది అంటూ సీఎం, డీజేపీలకి లేఖ..తీరా చూస్తే ఆ వ్యక్తి..) -
సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్ పట్టుకుని...
ఇటీవలకాలంలో మహిళలు సెక్యూరిటీ గార్డుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు గురించి తురుచుగా వింటున్నాం. గ్రేటర్ కమ్యూనిటీ అపార్టమెంట్లో ఉంటున్న కొంతమంది నివాసితులు సెక్యూరిటీ గార్డుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లను కొట్టడం లేదా అసభ్యంకరంగా తిట్టి అవమాన పరిచే హేయమైన చర్యలకు దిగుతున్నారు. అచ్చం అలానే నోయిడాలోని ఒక మహిళ ఒక సెక్యూరిటీ గార్డుపై వీరంగం సృష్టించింది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నోయిడాలోని అజ్నార్ సోసైటీలో పనిచేస్తున్న ఒక గార్డు పట్ల ఒక మహిళ చాలా అమానుషంగా ప్రవర్తించింది. సదరు గార్డు టోపీ లాక్కుని, కాలర్ పట్టుకుని దుర్భాషలాడింది. పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను ఆపేందుకు ప్రయత్నించకుండా అలా చూస్తోంది. ఇంతలో మరో సెక్యూరిటీ గార్డు వచ్చి బాధితుడుని ఆ మహిళ నుంచి వెనక్కి లాగేందుకు యత్నించాడు. ఈ మేరకు పోలీసులు సదరు బాధితుడు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. (చదవండి: భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...) -
‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు
‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల తల్లిపై పోలీసుల కేసు నమోదైంది. తొలి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె వరస ఆఫర్లు అందుకుంటోంది. మూవీ ప్లాప్ అయినప్పటికు ఆమె మాత్రం వరస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండ ప్రాజెక్ట్స్‌తో తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తల్లి స్వర్ణలతపై తాజాగా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వివరాలు.. సుభాకర్రావు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న స్వర్ణలత మనస్పర్థలు రావడంతో 20 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె తన కూతురు, హీరోయిన్ శ్రీలీలతో కలిసి విడిగా జీవిస్తోంది. అయితే స్వర్ణలత-సుభాకర్ విడాకుల పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత ఈ నేపథ్యంలో అక్టోబరు 3న కొరమంగళలో ఉన్న తన అపార్ట్ మెంట్ లోకి స్వర్ణలత తాళం పగలగొట్టి వెళ్లిందని సుభాకర్ ఆరోపించారు. దీనిపై ఆయన తాజాగా అడుగుడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కాగా ఇప్పటికే స్వర్ణలతపై ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అలియన్స్ యూనివర్సిటీ వివాదంలో అనేకల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఏ2గా కేసు నమోదైంది. ప్రస్తుతం స్వర్ణలత బెయిల్‌పై ఉంది. ఈ క్రమంలో ఆమెపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’, నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ హీరోగా చేస్తున్న ‘స్టూడెంట్’లో చిత్రాలతో బిజీగా ఉంది. -
Vijayawada: ఐ-టీడీపీపై సీఐడీ కేసు
సాక్షి, విజయవాడ: ఐ-టీడీపీపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తన వీడియోని మార్ఫింగ్ చేసినట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టి ప్రాథమికంగా ఆ వీడియో మార్ఫింగ్ అని తేల్చారు. ఈ క్రమంలో ఐ-టీడీపీ సహా మరికొందరిపై పలు సెక్షన్లతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఐటీ (66t), IPC 465, 469, 471, 153(a), 505(2), 120(b) సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చదవండి: (సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ) -
రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతు మరణాలపై రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మరో 10 మందిపై శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్లు 144, 151, 107, 116ల కింద కేసులు నమోదు చేసినట్టు మంగళవారం మీడియాకి వెల్లడించారు. ప్రియాంకతో పాటు ఎంపీ దీపేందర్ హుడా, యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌కుమార్ లల్లూ, సందీప్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. అయితే ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకొని దాదాపుగా రెండు రోజులవుతున్నా ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచడం కానీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడంగానీ చేయలేదని కాంగ్రెస్ చెబుతోంది. అక్రమంగా నిర్బంధించారు: ప్రియాంక తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ప్రియాంకగాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘38 గంటలు గడిచినా నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. మాపై బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు కనీసం లాయర్‌ను కలవనివ్వలేదు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు’ అని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన రైతు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా ప్రియాంక మాట్లాడారు. లవ్ ప్రీత్ సింగ్, నక్షత్ర సింగ్ బంధువులతో మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తిగతంగా వారిని కలుసుకుంటానని ప్రియాంక రైతు కుటుంబాలకు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ నాయకుడు లలన్‌కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రియాంకా గాంధీని కలవడానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను లక్నో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విమానాశ్రయం వెలుపలికి రాకుండా నిరోధించారు. దీంతో ఆయన విమనాశ్రయంలోపల నేలపైనే కూర్చొని తన నిరసన తెలిపారు. ‘నన్ను ఎందుకు ఇక్కడ ఆపారు. నేను నిషేధాజ్ఞలు ఉన్న లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లడం లేదు. యూపీలో కాంగ్రెస్ కార్యాలయానికి వెళుతున్నాను’ అని బఘేల్ అన్నారు. లఖీమ్‌పూర్ ఖేరిని ముట్టడిస్తాం: సిద్ధూ రైతుల మరణాలకు కారణమైన మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్ట్ చేసి ప్రియాంక గాంధీని విడుదల చేయాలని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. బుధవారంలోగా ప్రభుత్వం ఆ పని చెయ్యకపోతే పంజాబ్ కాంగ్రెస్ లఖీమ్‌పూర్ ఖేరిని ముట్టడిస్తుందని హెచ్చరించారు. అసలు సిసలు కాంగ్రెస్‌వాది ప్రియాంక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన సోదరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక గాంధీ ఎప్పటికీ ఓటమిని అంగీకరించరని, ఆమె అసలు సిసలు కాంగ్రెస్‌వాది అని కొనియాడారు. తాము చేస్తున్న సత్యాగ్రహం ఆగదని అన్నారు. రాహుల్ బుధవారం లఖీమ్‌పూర్ ఖేరి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముగ్గురు రైతులకు అంతిమ సంస్కారం ఈ ఘటనలో మరణించిన నలుగురు రైతుల్లో ముగ్గురు లవ్‌ప్రీత్ సింగ్, నక్షత్ర సింగ్, దల్జీత్ సింగ్‌ల అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే మొహారియా గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్ అనే రైతు కుటుంబం తమకు ఇచ్చిన పోస్టుమార్టమ్ రిపోర్టుపై నమ్మకం లేదని, తిరిగి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. గుర్వీందర్‌ను కాల్చి చంపినట్టుగా తమకు అనుమానాలున్నాయని వారు చెప్పారు. దీంతో రెండోసారి పోస్టుమార్టమ్ చేయడానికి ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. లఖీమ్‌పూర్ ఘటనపై న్యాయ విచారణ జరపండి లఖీమ్‌పూర్ ఘటనపై సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగాలని కోరుతూ సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయవాదులు మంగళవారం ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగాలని, అత్యున్నత స్థాయిలో న్యాయ విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు వారు విన్నవించుకున్నారు. ఈ మేరకు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. తమ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించి ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోవాలని లాయర్లు కోరారు. నిర్దాక్షిణ్యంగా తొక్కించారు లఖీమ్‌పూర్ ఖేరికి ప్రదర్శనగా వెళుతున్న రైతులపై ఎస్యూవీ దూసుకుపోయి నలుగురు అన్నదాతలను బలిగొన్న ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. నినాదాలు చేస్తున్న రైతులు మీదుగా అత్యంత వేగంగా వాహనం దూసుకుపోయిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రైతులను నిర్దయగా వాహనంతో తొక్కిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రైతులు ఎస్‌యూవీపై పడటం, బలంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో పక్కకు ఎగిరిపడటం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనుద్దేశించి పోస్టు పెట్టారు. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన మంత్రి కుమారుడిని వదిలేసి, తనను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. తనలాంటి వారిని కాకుండా నేరం చేసిన వారిని అదుపులోనికి తీసుకోవాలన్నారు. బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ, మరి కొందరు బీజేపీ నేతలు కూడా ఈ వీడియోని షేర్ చేశారు. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఎవరో ఆ విజువల్స్‌లో స్పష్టంగా తెలియడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాయే కారుని నడుపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తుంటే, ఆ సమయంలో ఆ ప్రాంతంలో తన కుమారుడు లేడని మంత్రి వాదిస్తున్నారు. అందులో ఆశిష్ మిశ్రా ఉన్నాడు లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్యూవీ (మహీంద్రా థార్)లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జగ్జీత్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ను పోలీసులు నమోదు చేశారు. ‘రైతుల పైనుంచి నిర్దాక్షిణ్యంగా కాన్వాయ్‌లోని వాహనాలను తీసుకెళ్లిన ఘటన పక్కా వ్యూహం ప్రకారమే జరిగింది. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే రైతులు నిరసన ప్రదర్శనలకు దిగారు. బన్బీర్పూర్ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అజయ్ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా నిరసన తెలుపడానికి రైతులు ఆదివారం స్థానిక కాలేజీ మైదానం సమీపంలో గుమిగూడారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆశిష్ మిశ్రా 15 నుంచి 20 మంది సాయుధులతో మూడు వాహనాల్లో అక్కడికి చేరుకున్నాడు. మహీంద్రా థార్‌లో డ్రైవర్ పక్కసీట్లో కూర్చున్నాడు. ఈ ఎస్‌యూవీయే తొలుత వేగంగా రైతుల పైనుంచి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆశిష్ కాల్పులు జరిపాడు. నాన్పరాకు చెందిన రైతు గుర్విందర్ సింగ్ ఈ కాల్పుల్లో చనిపోయాడు. రైతుల పైనుంచి దూసుకెళ్లిన వాహనాల నెంబర్లు యూపీ 31 ఏఎస్ 1000, యూపీ 32 కేఎం 0036 కాగా... మూడో వాహనం మహీంద్రా స్కార్పియో (నెంబరు తెలియదు)’ అని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. రైతులను తొక్కించుకుంటూ ముందుకెళ్లిన ఆశిష్ వాహనం రోడ్డుకు ఓవైపునకు వెళ్లి బోల్తాపడింది. ఆశిష్ వాహనంలో నుంచి బయటపడి తిరిగి కాల్పులు ప్రారంభించాడు. చెరుకు తోటలోకి వెళ్లి దాక్కున్నారు’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేరులేదు. -
కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: కార్వీఎండీ పార్థసారథి రుణాల ఎగవేత కేసులో మరో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితులిద్దరిని రాజీవ్, హరికృష్ణలుగా గుర్తించారు. వీరిద్దరు కూడా నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నట్లు సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు.. కేసు నమోదు
గురుగ్రామ్: పాకిస్తాన్‌కు అనుకూలంగా ఓ వ్యక్తి నినాదాలు చేస్తూ.. అపార్టుమెంట్ వాసులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్ సొసైటీ అపార్టుమెంట్లో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ఫ్లాట్ బాల్కానీలో నిలబడి పాకిస్తాన్‌కు అనుకూలంగా.. ‘పాకిస్తాన్ జిందాబాద్.. పాకిస్తాన్ జిందాబాద్..’ నినాదాలు చేశాడు. దీంతో అతని నినాదాలకు ఇబ్బందిగా భావించిన అపార్టుమెంట్ వాసులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘తాలిబన్ ఉగ్రవాద సంస్థా? కాదా? సమాధానం చెప్పాలి’ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితుని భార్య కూడా అపార్టుమెంట్ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని, అందుకోసం చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది. అందువల్లనే నినాదాలు చేశాడని తెలిపింది. కొంతమంది అపార్టుమెంట్ వాసులు తమ ఫ్లాట్ వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. అయితే నిందితుడు ఒత్తిడి ఉండి నినాదాలు చేశాడా? లేదా? ఉద్దేశపూర్వంగా చేశాడా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: షాకింగ్.. రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్ -
పనిమనిషిపై లైంగిక దాడి: మాజీ సీఎం సలహాదారుపై కేసు!
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీకి ఒకప్పుడు సలహాదారుగా పనిచేసిన సునీల్ తివారీపై పోలీసులు లైంగిక దాడి కేసు నమోదైంది. తనపై లైంగిక దాడి చేశాడని సునీల్ పనిమనిషి అయిన 18 ఏళ్ల గిరిజన బాలిక కుంతి రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్లోరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా తివారీపై ఈనెల 16న లైంగిక దాడి కేసు నమోదు చేయగా.. తివారీ తనను బలవంతంగా లోబరుకున్నాడని, తాను అభ్యంతరం వ్యక్తం చేయగా తీవ్రంగా కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సునీల్ తివారీ తనను బెదిరించాడని ఆరోపించారు. బాధిత మహిళ తివారీ నివాసంలో ఏడాది పాటు పనిచేసి కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల తమ స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారి ప్రోద్బలంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపారు. కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, లైంగిక దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తివారీ పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్: యువతిపై ఆటో డ్రైవర్ల అఘాయిత్యం -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: రాప్తాడు టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ్‌తో సహా తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముష్టికోవెల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకట్రాముడుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇచ్చావంటూ పరిటాల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: నిమ్మగడ్డది అప్పుడో మాట.. ఇప్పుడో మాట -
బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్‌పై కేసు నమోదు
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ గౌహర్ ఖాన్‌పై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కేసు నమోదు చేసింది. ఆమెకు కరోనా వైరస్ సోకిందని, తమ సిబ్బందితో సహరించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని బీఎంపీ అధికారులు తెలిపారు. హోం క్వారంటైన్ స్టాంప్ వేయడానికి ఆమె ఇంటికి బీఎంసీ సిబ్బంది వెళ్లారని ఆ క్రమంలో తన ఇంటి తలుపులు మూసినట్లు పేర్కొన్నారు. దీంతో బీఎంసీ అధికారులు గౌహర్ ఖాన్‌పై ఓషివారా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్‌కు గురైన గౌహర్ ఖాన్ ఇంట్లో ఉండకుండా బయట తిరిగిందని ఓ వ్యక్తి ఫిర్యాదు కూడా చేసినట్లు బీఎంసీ అధికారి తెలిపారు. ఆమెను తన ఇంటికి తిరిగి రావాలని కోరిగా, వచ్చి కోవిడ్ నిర్థారణ పరీక్ష చేయించుకుందని పేర్కొన్నారు. ఆమెకు నెగటివ్ వచ్చిందని, కానీ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవరించిందని తెలిపారు. తాము ఆమె ఫోన్ చేసినా సరిగా స్పందించలేదన్నారు. బీఎంసీ తన ట్విటర్ ఖాతాలో ఆమెపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను జత చేసింది. చదవండి: భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్ -
22 మందిపై కేసులు.. 200 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. రైతు గణతంత్ర పరేడ్ పేరిట రైతులు నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు బారికేడ్లను తోసుకుని వచ్చి మరి పోలీసులపై దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో దాదాపు 300 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. ఇక దాడులకు సంబంధించి 22 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు. ఇక రైతు ర్యాలీకి సంబంధించి జారీ చేసిన ఎన్ఓసీని ఉల్లంఘించినందుకు గాను స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్‌తో పాటు ఇతర రైతు సంఘాల నాయకులు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాలతో సహా మరి కొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: వైరల్: 15 అడుగులో గోతిలో దూకిన పోలీసులు) హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రాజధానిలో అదనపు బలగాలను మోహరించించింది. ఎర్రకోట, జామా మసీద్ మెట్రో స్టేషన్లు మూసివేయడమే కాక సెంట్రల్ ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇక నిన్న రాజధానిలో తలెత్తిన హింసాత్మక ఘటనలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కేంద్రం గందరగోళ పరిస్థితులను సృష్టించిందని.. అందువల్లే హింసాత్మక ఘటనలు తలెత్తాయి అని.. అల్లర్ల వెనక కుట్ర కోణం దాగి ఉందని వెల్లడించారు. -
ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్‌తో పాటు కార్యకర్తలపైనా కేసు నమోదు అయింది. మార్పుకు నాంది పలకండి.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటూ పాలన సాగిస్తున్నారని ఎంపీ అరవింద్ దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి విజయదుర్గ సందీప్ యాదవ్‌కు మద్దతుగా ఆయన నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూతపడటం ఖాయమన్నారు. కరీంనగర్, నిజామాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ఎలా నిజాయితీకి ఓటు వేశారో అలానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటువేసి మార్పుకు నాంది పలకాలని ఎంపీ అరవింద్ కోరారు. -
సోనియా, రాహుల్‌లపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో గురువారం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ముంబై మాజీ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వరీస్ పఠాన్లు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలంటూ ‘లాయర్స్ వాయిస్’ తరఫున గురువారం పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన పిటిషన్ వేసింది. -
కనిపించని అభ్యర్థికి ప్రచారం!
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి లోక్‌సభ నియోజకవర్గంలో మే 19వ తేదీన పోలింగ్ జరగనుండటంతో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి అతుల్ రాయ్ తరఫున బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌లు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా అతుల్ కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా వారు పార్టీ శ్రేణులకు ఆదేశిస్తున్నారు. ఇందులో విశేషమేముంది...అనుకుంటున్నారా...వారు ఎవరికోసమైతే ప్రచారం చేస్తున్నారో ఆ అభ్యర్థి అతుల్ రాయ్ పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియడం లేదు. అంటే ‘కనిపించని’ అభ్యర్థి కోసం భారీ ఎత్తున ప్రచారం జరుగుతోందన్నమాట. ఇంతకీ అతుల్ అదృశ్యానికి కారణం, ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం. అతుల్ రాయ్ తనపై అత్యాచారం చేశారని ఒక విద్యార్థిని వారణాసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మే 1న అతుల్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కొందరు, మలేసియా పారిపోయారని ఇంకొందరు చెబుతున్నారు.ఆయన లేకపోయినా ఆయన తరఫున ప్రచారం మాత్రం సాగిపోతోంది. బీజేపీ వాళ్లు కుట్రతో తమ అభ్యర్థిపై బూటకపు కేసు పెట్టించారని మాయావతి, అఖిలేశ్‌లు చెబుతున్నారు. అతుల్ రాయ్‌ని తప్పనిసరిగా గెలిపించి బీజేపీ కుట్రను భగ్నం చేయాలని కూడా వారు ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు మే 23 వరకు అతుల్‌ను అరెస్టు చేయకుండా చూడాలని ఆయన లాయరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఈ రోజు విచారణ జరగనుంది. -
ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి!
అహ్మదాబాద్: గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో గురువారం ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీ తాజాగా వెనక్కి తగ్గింది. -
భానుప్రియ ‘అరెస్ట్’పై సోదరుడి స్పందన
చెన్నై : ప్రముఖ నటి భానుప్రియ అరెస్టాయ్యారంటూ వినిపిస్తోన్న వదంతులపై ఆమె సోదరుడు గోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. తన సోదరి గురించి అబద్దాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం భానుప్రియ షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉన్నారని తెలిపారు. అంతేకాక తమపై ఫిర్యాదు చేసిన పనిమనిషిని తేనాంపేట పోలీసులకు అప్పగించినట్లు గోపాలకృష్ణ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం, పండ్రవాడ గ్రామానికి చెందిన పెనుపాకల ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పని చేయడానికి పంపించారు. అయితే ఓ ఏడాది నుంచి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే గాక తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు ప్రభావతి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై భానుప్రియ స్పందించారు. ఆ బాలిక చెన్నైలోని తమ ఇంట్లో వస్తువులు, డబ్బు, నగలు దొంగతనం చేసిందని తెలిపారు భానుప్రియ. ఈ విషయం గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో బాలిక తల్లి ఐప్యాడ్, వాచ్‌లు, కెమెరా తెచ్చి ఇచ్చిందని.. నగలు, డబ్బు మాత్రం ఇవ్వలేదన్నారు. అవి కూడా ఇవ్వాలని అడగడంతో.. వాటిని తెస్తానని వెళ్లి తమపై తప్పుడు కేసు పెట్టిందని భానుప్రియ తెలిపారు. -
దుర్గగుడి ఉద్యోగులపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ : వరుస వివాదాలతో వార్తలోకెక్కిన దుర్గగుడిలో తాజాగా మరో వివాదం చేలరేగింది. దసరా ఉత్సావాల్లో అక్రమాలకు పాల్పడినట్లు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అచ్చుత రామయ్య తనను బెదిరించినట్లు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నలుగురు దుర్గగుడి ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోద చేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడి ఏఈవో అచ్చుత రామయ్య, సూపరిండెంట్ గోపిచంద్, రికార్డ్ అసిస్టెంట్ సునీత, కాంట్రాక్ట్ ఉద్యోగి సైదాలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. వీరి మీద సెక్షన్ 420, 409, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. -
అభిమాని అత్యుత్సాహం : స్టార్ హీరోపై కేసు
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మితిమీరిన అభిమానం ఒక్కోసారి స్టార్స్ హీరోలకు తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు చాలా సార్లు ఆ హీరోలు ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఇలయదళపతి అభిమాని తన ఫేవరెట్ హీరో ఫోటోతో డిజైన్ చేసిన ఓ పోస్టర్ విజయ్‌పై కేసు నమోదయ్యేలా చేసింది. విజయ్ వీరాభిమాని అయిన ఓ యువకుడు తన ఫేవరెట్ హీరో త్రిశూలం పట్టుకున్నట్టుగా ఓ పోస్టర్‌ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో వైరల్ కావటంతో అందరి దృష్టి పోస్టర్‌పై పడింది. అయితే ఈ ఫోటోలో విజయ్ షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవడం పై హిందూ మక్కల్ మున్నని పార్టీ అభ్యంతరం తెలిపింది. షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవటం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం అని.. అలా చేసి విజయ్ తమ మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా విజయ్‌పై కేసు నమోదయ్యింది.