
ఇటీవలకాలంలో మహిళలు సెక్యూరిటీ గార్డుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు గురించి తురుచుగా వింటున్నాం. గ్రేటర్ కమ్యూనిటీ అపార్టమెంట్‌లో ఉంటున్న కొంతమంది నివాసితులు సెక్యూరిటీ గార్డుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లను కొట్టడం లేదా అసభ్యంకరంగా తిట్టి అవమాన పరిచే హేయమైన చర్యలకు దిగుతున్నారు. అచ్చం అలానే నోయిడాలోని ఒక మహిళ ఒక సెక్యూరిటీ గార్డుపై వీరంగం సృష్టించింది.
వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నోయిడాలోని అజ్నార్ సోసైటీలో పనిచేస్తున్న ఒక గార్డు పట్ల ఒక మహిళ చాలా అమానుషంగా ప్రవర్తించింది. సదరు గార్డు టోపీ లాక్కుని, కాలర్ పట్టుకుని దుర్భాషలాడింది. పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను ఆపేందుకు ప్రయత్నించకుండా అలా చూస్తోంది. ఇంతలో మరో సెక్యూరిటీ గార్డు వచ్చి బాధితుడుని ఆ మహిళ నుంచి వెనక్కి లాగేందుకు యత్నించాడు. ఈ మేరకు పోలీసులు సదరు బాధితుడు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
(చదవండి: భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...)
Comments
Please login to add a commentAdd a comment