Cap
-
రూ. 2 కోట్ల 12 లక్షలకు...
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్‌కు ఊహించినట్లుగానే వేలంలో భారీ ధర పలికింది. 1947–48లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ధరించిన ఈ క్యాప్‌పై వేలంలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు. స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు ఇదే చివరి సిరీస్ కాగా... ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా బ్రాడ్‌మన్ ఏకంగా 715 పరుగులు సాధించడం విశేషం. పది నిమిషాల పాటు సాగిన వేలంలో చివరకు ఒక వీరాభిమాని 2 లక్షల 50 వేల డాలర్లకు (సుమారు రూ.2.12 కోట్లు) దీనిని సొంతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. దాదాపు 77 ఏళ్ల క్రితం వాడి రంగులు వెలిసిపోయి, కాస్త చినిగిపోయిన ఈ టోపీ లోపలి భాగంలో బ్రాడ్‌మన్ పేరు రాసి ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రాడ్‌మన్ విలువ ఏమిటో ఈ వేలం ధర చూపించింది. ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్‌కు ఆసక్తికర నేపథ్యం ఉంది. భారత్‌తో సిరీస్ ముగిశాక బ్రాడ్‌మన్ క్యాప్‌ను భారత జట్టు మేనేజర్ పంకజ్ గుప్తాకు బహుమతిగా అందజేశారు. ఈ సిరీస్‌లో భారత జట్టు వికెట్ కీపర్, ఆ తర్వాత తన మేనకోడలిని పెళ్లాడిన ప్రబీర్ కుమార్ సేన్‌కు పంకజ్ గుప్తా ఇచ్చారు. అదే క్యాప్ ఇప్పుడు వేలానికి వచ్చింది. -
బ్రాడ్‌మన్ క్యాప్ విలువ రూ. 2 కోట్లు!
సిడ్నీ: భారత క్రికెట్ జట్టు 1947–48లో తొలిసారి ఆ్రస్టేలియా లో పర్యటించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విదేశీ గడ్డపై మనకు ఇదే తొలి సిరీస్. భారత్, ఆ్రస్టేలియా మధ్య 5 టెస్టులు జరగ్గా ... ఆ్రస్టేలియా 4–0తో సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 178.75 సగటుతో 715 పరుగులు చేయగా... ఇందులో ఒక డబుల్ సెంచరీ సహా 4 సెంచరీలు, 1 అర్ధసెంచరీ ఉన్నాయి. బ్రాడ్‌మన్ తన కెరీర్లో భారత్‌పై ఆడిన సిరీస్ ఇదొక్కటే కావడం విశేషం. ఇప్పుడు ఈ సిరీస్‌లో బ్రాడ్‌మన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ వేలానికి వచ్చింది. నేడు జరిగే ఈ వేలంలో ఈ క్యాప్‌నకు 2 లక్షల 60 వేల డాలర్లు (సుమారు రూ. 2.20 కోట్లు) పలకవచ్చని అంచనా. టెస్టు క్రికెట్ ఆడే ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఆకుపచ్చ రంగుతో కూడిన బ్యాగీ గ్రీన్‌లను అందజేస్తారు.సుదీర్ఘ కెరీర్లో చినిగిపోయి, రంగులు వెలసిపోయినా వారు దానినే ఉపయోగిస్తారు. అలాంటి క్యాప్‌లపై క్రికెట్ వర్గాల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇరవై ఏళ్ల తన టెస్టు కెరీర్లో 52 టెస్టుల్లోనే అనితరసాధ్యమైన 99.94 సగటుతో 6996 పరుగులు చేసిన బ్రాడ్‌మన్ 92 ఏళ్ల వయసులో 2001లో కన్నుమూశారు. -
గాంధీ టోపీ వెనుక ‘నవాబుల కథ’
లక్నో: అక్టోబర్ 2.. గాంధీ జయంతి. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో మహాత్ముని కృషి మరువలేనిది. గాంధీజీ 1869, జనవరి 30న గుజరాత్‌లోని పోరుబందర్లో జన్మించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గాంధీ జీవితంలో అనేక ప్రత్యేక ఘట్టాలు కనిపిస్తాయి. గాంధీ ధరించిన టోపీ వెనుక ప్రత్యేక చరిత్ర ఉంది. యూపీలోని రాంపూర్ నవాబుల సంప్రదాయాలు భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రత్యేక అధ్యాయాన్ని అందించాయి. మహాత్మా గాంధీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నవాబుల రాజ సంప్రదాయమైన టోపీని ధరించారు. అనంతరం అది గాంధీ టోపీ పేరుతో ప్రసిద్ధి చెందింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగానూ మారింది.1918 డిసెంబర్ 30న ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మౌలానా షౌకత్ అలీ, మహమ్మద్ అలీలను కలుసుకునేందుకు గాంధీ మొదటిసారిగా రాంపూర్ వచ్చారు. 1919లో ఆయన రెండవసారి ఆయన రాంపూర్ వచ్చినప్పుడు ఈ టోపీ ధరించారు. ఈ పర్యటనలో ఆయన నాటి నవాబు సయ్యద్ హమీద్ అలీఖాన్ బహదూర్‌ను కలుసుకునే సందర్భం వచ్చింది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నవాబును కలుసుకునే సమయంలో తలను టోపీతోనే లేదా ఏదైనా వస్త్రంతోనే కప్పుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయంలో గాంధీ దగ్గర అటువంటిదేమీ లేదు.దీంతో ఆయన రాంపూర్ మార్కెట్లో టోపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే టోపీ ఎక్కడా దొరకలేదు. ఈ పరిస్థితిని చూసిన మౌలానా షౌకత్ అలీ, ఆయన తల్లి అబ్దీ బేగం స్వయంగా గాంధీకి టోపీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే గాంధీ టోపీ రూపొందింది. తదనంతర కాలంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ టోపీ.. ఉద్యమ చిహ్నంగానూ మారింది. ఇది నాటి భారతీయుల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. నేటికీ పలు చోట్ల మనకు గాంధీ టోపీ కనిపిస్తుంది.ఇది కూడా చదవండి: పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన -
ఇంగ్లండ్ కెప్టెన్‌కు అరుదైన బహుమతి
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ అరుదైన జాబితాలో చేరనున్నాడు. నేషన్స్ లీగ్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫిన్లాండ్తో ఇంగ్లండ్ తలపడనుండగా... ఇది హ్యారీ కేన్‌కు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందు కేన్‌కు బంగారు టోపీని బహూకరించనున్నారు.ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు తొమ్మిది మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా... ఇప్పుడు హ్యారీ కేన్ ఆ ఘనత సాధించిన పదో ప్లేయర్ కానున్నాడు. చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున వేన్ రూనీ 2014లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా... పదేళ్ల తర్వాత కేన్ ఆ క్లబ్లో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటి వరకు 72 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించిన 31 ఏళ్ల కేన్.. జాతీయ జట్టు తరపున 66 గోల్స్ కొట్టాడు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా గోల్డెన్ బూట్లు ధరించిన కేన్... ఇంగ్లండ్ తరఫున అత్యధిక మేజర్ ఫైనల్స్ (28) ఆడిన ప్లేయర్‌గానూ నిలిచాడు. -
బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా!
బట్టతల పురుషులను ఇబ్బందిపెట్టే సమస్య. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. రకరకాల నూనెలు వాడుతుంటారు. అప్పటికీ ఫలితం లేకపోతే, చాలా ఖరీదైన, బాధాకరమైన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలకు కూడా సిద్ధపడుతుంటారు. బట్టతలకు విరుగుడుగా అమెరికన్ కంపెనీ ‘హయ్యర్డోస్’ తాజాగా ఈ టోపీని మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ టోపీని క్రమం తప్పకుండా ఆరునెలలు పెట్టుకుంటే, బట్టతల మటుమాయమవుతుందని తయారీదారులు చెబుతున్నారు. బయటి నుంచి చూడటానికి ఈ టోపీ మామూలుగానే ఉన్నా, దీని లోపలి భాగంలో ఇన్ఫ్రారెడ్ కిరణాలను ప్రసరించే చిన్న చిన్న బల్బులు ఉంటాయి. రీచార్జ్ బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. ఈ బల్బుల నుంచి వెలువడే ఎర్రని కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోని కణజాలంలో ఉండే మైటోకాండ్రియాను బలోపేతం చేస్తాయి.ఫలితంగా బట్టతలపై క్రమక్రమంగా వెంట్రుకలు మొలకలెత్తడం మొదలవుతుంది. దీని ఖరీదు 449 డాలర్లు (రూ.37,493). హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఈ టోపీ ధర తక్కువే!ఇవి చదవండి: నయనతార 'చిన్నారి కవల'లను చూశారా! -
రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్‌లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు. వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు -
యూదుల ఆరాధనా విధానం ఏమిటి? ‘కిప్పా’కు ఎందుకంత ప్రాధాన్యత?
ప్రపంచంలోని పురాతన మతాలలో జుడాయిజం ఒకటి. దీనికి సుమారు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం దాదాపు ఒకే సమయంలో ఉద్భవించాయని చెబుతారు. ఈ కారణంగానే ఈ మతాల మధ్య ఎంతో సారూప్యత కనిపిస్తుంది. జుడాయిజాన్ని హిందూ మతంతో పోల్చిచూస్తే కొన్ని అంశాలు మినహా, ఎటువంటి సారూప్యత కనిపించదు. జుడాయిజం ప్రకారం ఈ మతాన్ని నమ్మేవారు రోజుకు మూడు సార్లు ప్రార్థనలు చేస్తారు. యూదులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ప్రార్థన చేసే సమయంలో జెరూసలేం వైపు చూస్తారు. జుడాయిజం విగ్రహారాధనను విశ్వసించదు. జుడాయిజంను అనుసరిస్తున్నవారు ప్రతిపనికీ దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఖబద్ హౌస్ యూదులకు చాలా ప్రత్యేకమైనది. ఖబద్ హౌస్‌లు పలు దేశాలలో కనిపిస్తాయి. ఇక్కడ యూదులు ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోని ముంబై, ఢిల్లీలోని పహర్‌గంజ్, అజ్మీర్, హిమాచల్‌లోని ధర్మ్కోట్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లలో ఖబద్ హౌస్‌లు ఉన్నాయి. విదేశాల నుంచి భారత్ సందర్శనకు వచ్చే ఇజ్రాయిలీలు ఈ ఖబద్ హౌస్‌లలో ప్రార్థనలు చేస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల, ధర్మ్కోట్లోని ఖబద్ హౌస్‌లను సందర్శించడానికి ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ నుండి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యూదులు ప్రార్థనా సమయంలో తలపై కిప్పా(టోపీ) తప్పనిసరిగా ధరిస్తారు. కిప్పా అనేది ప్రతి యూదు ప్రత్యేక సందర్భాలలో ధరించే టోపీ. ఇది హిందూ, ఇస్లాంలో కూడా కనిపిస్తుంది. హిందువులు పూజ చేసేటప్పుడు తలపై గుడ్డ పెట్టుకునే ఆచారం కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఇస్లాంలో కూడా నమాజ్ చదివేటప్పుడు తప్పనిసరిగా టోపీ ధరిస్తారు. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
గ్యాస్ వినియోగదారులకు ఊరట..
సీఎన్జీ, వంట గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం కేంద్రమంత్రి వర్గం తీసుకోబోతోంది. దేశంలో ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలపై పరిమితిని విధించడాన్ని కేంద్ర మంత్రివర్గం త్వరలో పరిశీలించే అవకాశం ఉందని తెలిసింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలను ప్రభుత్వం ద్వైవార్షికంగా అంటే ఏటా రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఈ సహజవాయువును వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీగా, వంట గ్యాస్‌గా, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు, ఎరువుల తయారీకి వినియోగిస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. దేశంలో ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇదివరకే అందుబాటులో ఉన్న క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్ ధర అయితే ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)కు 8.57 డాలర్లు (రూ.705), సముద్ర గర్భంలో కొత్తగా కనుగొన్న కష్టతరమైన క్షేత్రాల నుంచి తీసే గ్యాస్ అయితే 12.46 డాలర్లు (రూ.1,026)కు చేరింది. ఈ ధరలను వచ్చే నెల ఏప్రిల్ 1న సవరించాల్సి ఉంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం లెగసీ ఫీల్డ్‌ల నుంచి వెలికితీసే గ్యాస్ ధరలు ప్రతి ఎంఎంబీటీయూకు 10.7 డాలర్లు (రూ.881)కు పెరుగుతాయని, కష్టతరమైన ఫీల్డ్‌ల నుంచి వచ్చే గ్యాస్ ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. సీఎన్జీ, వంట కోసం వినియోగించే పైప్డ్ గ్యాస్ రేట్లు ఇప్పటికే 70 శాతం పెరిగాయి. ఏప్రిల్ 1న సవరణ జరిగితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు వినియోగదారులు, అటు ఉత్పత్తిదారులు ఇద్దరి ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ గ్యాస్ ధరల సవరణను పరిశీలించడానికి కిరిట్ పారిఖ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గత సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మిగులు దేశాలలో గ్యాస్ ధరలను వాటి సహజవాయువు ధరను నిర్ణయించే ప్రస్తుత పద్ధతికి బదులుగా లెగసీ ఫీల్డ్‌ల నుంచి గ్యాస్ ఇండెక్సేషన్‌ను బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలలో 10 శాతానికి మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది. ఒక ఎంఎంబీటీయూకు కనిష్ట ధర 4 డాలర్లు (రూ.329), గరిష్ట ధర 6.50 డాలర్లు (రూ.535) ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75 డాలర్లు ఉంది. దాని ప్రకారం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకు 7.5 డాలర్లు (రూ.617) ఉండాలి. కానీ పరిమితి అమలైతే గ్యాస్ ధర 6.5 డాలర్లు (రూ.535) మాత్రమే ఉంటుంది. కమిటీ సిఫార్సులపై మంత్రిత్వ శాఖల అంతర్గత సంప్రదింపులు ముగిశాయి. ఈ సిఫార్సులను కేబినెట్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గం దీనిని పరిశీలించే అవకాశం ఉంది. -
ఓఎన్జీసీ గ్యాస్‌పై ధరల పరిమితి
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల పరిమితిని తేల్చేందుకు ఏర్పాటైన కిరీట్ పారిఖ్ కమిటీ తన సిఫారసులను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వరంగ సంస్థల పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజవాయువుపై ధరల పరిమితిని సూచించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీనివల్ల సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఉత్పత్తి పరంగా క్లిష్టమైన క్షేత్రాల విషయంలో ఎటువంటి మార్పుల్లేకుండా ప్రస్తుత ధరల విధానానికే మొగ్గు చూపించనుంది. అంతిమంగా వినియోగదారుడికి సహేతుక ధర ఉండేలా సిఫారసులు ఇవ్వాలని ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో కోరడం గమనార్హం. పాత కాలం నాటి గ్యాస్ క్షేత్రాలను ఎక్కువగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా నిర్వహిస్తున్నాయి. వీటికి సంబంధించి వ్యయాలను ఇప్పటికే ఈ సంస్థలు రికవరీ చేసుకుని ఉంటాయన్న ఉద్దేశ్యంతో ధరల పరిమితికి కమిటీ మొగ్గు చూపించనుంది. అలాగే, కిరీట్ పారిఖ్ కమిటీ కనీస ధర, గరిష్ట ధరలను కూడా సిఫారసు చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా ధరలు ఉత్పత్తి రేటు కంటే దిగువకు పడిపోకుండా చూడొచ్చన్నది ఉద్దేశ్యంగా ఉంది. గ్యాస్ ధరలు సుమారు 70 శాతం మేర పెరిగి మిలియన్ బ్రిటిష్ ధర్మ యూనిట్‌కు 8.57 డాలర్లకు చేరడం తెలిసిందే. -
సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్ పట్టుకుని...
ఇటీవలకాలంలో మహిళలు సెక్యూరిటీ గార్డుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు గురించి తురుచుగా వింటున్నాం. గ్రేటర్ కమ్యూనిటీ అపార్టమెంట్లో ఉంటున్న కొంతమంది నివాసితులు సెక్యూరిటీ గార్డుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లను కొట్టడం లేదా అసభ్యంకరంగా తిట్టి అవమాన పరిచే హేయమైన చర్యలకు దిగుతున్నారు. అచ్చం అలానే నోయిడాలోని ఒక మహిళ ఒక సెక్యూరిటీ గార్డుపై వీరంగం సృష్టించింది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నోయిడాలోని అజ్నార్ సోసైటీలో పనిచేస్తున్న ఒక గార్డు పట్ల ఒక మహిళ చాలా అమానుషంగా ప్రవర్తించింది. సదరు గార్డు టోపీ లాక్కుని, కాలర్ పట్టుకుని దుర్భాషలాడింది. పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను ఆపేందుకు ప్రయత్నించకుండా అలా చూస్తోంది. ఇంతలో మరో సెక్యూరిటీ గార్డు వచ్చి బాధితుడుని ఆ మహిళ నుంచి వెనక్కి లాగేందుకు యత్నించాడు. ఈ మేరకు పోలీసులు సదరు బాధితుడు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. (చదవండి: భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...) -
రష్యా ఆయిల్‌పై నియంత్రణకు మా కూటమిలో చేరండి: అమెరికా
న్యూఢిల్లీ: రష్యన్ ముడిచమురు రేటును నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వాలీ అడెయెమో.. ప్రభుత్వ వర్గాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో పాటు ఈ అంశంపైనా చర్చించారు. రష్యా చమురు రేట్లకు చెక్ పెట్టడమనేది, దేశీయంగా ఇంధన ధరలను తగ్గించుకోవాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని వాలీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తత్సంబంధ వివరాలు అందిస్తున్నామని, దీనిపై చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దిగ్బంధం చేసేందుకు .. అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు కీలక ఆదాయ వనరైన చమురు రేట్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఎగిసినప్పటికీ భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే చమురును అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. -
ఈ టోపీ ఉంటే దోమలు దగ్గరికి కూడా రావు!
ఇక్కడ ఫొటోలో టోపీ మీద వాలిన తూనీగ కనిపిస్తోంది కదూ! అచ్చంగా తూనీగలాగానే కనిపిస్తున్నా, ఇది తూనీగ కాదు. తూనీగ ఆకారంలో రూపొందించిన పెండెంట్. ముమ్మూర్తులా తూనీగలనే పోలి ఉండే ఇలాంటి పెండెంట్లను జపానీస్ కంపెనీ ‘మికి లోకోస్’ ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. పీవీసీ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ తూనీగ పెండెంట్లు జపాన్‌లోని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఈ తూనీగ పెండెంట్లతో మరో లాభం కూడా ఉంది. అదేంటంటారా? ఈ పెండెంట్లను వేసుకున్న వారికి దోమల బెడద తప్పుతోందట! వీటిని చూస్తేనే చాలు, దోమలు పరారవుతున్నట్లు జనాలు గుర్తించడంతో, వీటికి మరింతగా గిరాకీ పెరిగింది. (క్లిక్: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే..) -
ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..
స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్మార్కెట్లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్కి సంబంధించిన వివరాలు... ఫ్లెక్సీక్యాప్ ఫ్లెక్సీక్యాప్ పథకాలు గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్గా పేరు మార్చుకున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలో మార్కెట్ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై దృష్టి ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్ షీట్ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.77 ఇన్ఫోసిస్ 8.46 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.05 డాక్టర్ రెడ్డీస్ 6.19 భారతీ ఎయిర్టెల్ 4.35 హెచ్‌సీఎల్ టెక్ 3.66 సన్‌ఫార్మా 2.75 బజాజ్ ఫైనాన్స్ 2.45 కోటక్ బ్యాంకు 2.24 ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ 2.22 -
బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్..
కోల్‌కతా: సాధారణంగా చిన్న పిల్లలు పెన్నుక్యాప్లను నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటడం చూస్తాం. కానీ, కొన్ని సార్లు పెన్నక్యాప్లు వారి శరీరంలోకి పోయి చాలా ప్రమాదకరంగా మారిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఓ బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్నుక్యాప్ ఉండటంలో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కోల్‌కతాలోని గారియా ప్రాంతంలో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడ్ని.. అతని తల్లిదండ్రులు స్థానిక ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డా.అరుణాభా సేన్‌గుప్తా బాలుడికి సిటీ స్కాన్ తీశారు. సిటీ స్కాన్ రిపొర్టు పరిశీలించగా.. బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్‌క్యాప్ ఉన్నట్లు తేలింది. నవంబర్‌లో తమ బాలుడు పెన్‌క్యాప్ మింగినటట్లు తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు అతన్ని స్థానిక నర్సింగ్ హోంకి తీసుకువెళ్లారు. ఆ నర్సింగ్ హోం డాక్టర్లు.. బాలుడి శరీరంలో పెన్‌క్యాప్ ఉందని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మాములుగా వైద్యం చేసి పంపించారు. పెన్‌క్యాప్ బాలుడి శరీరంలో ఉంటే ప్రాణాలతో ఉండేవాడు కాదని ఆ వైద్యులు తెలిపారు. దీంతో చేసేదేమి లేక బాలుడ్ని ఆ తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. కానీ ఆ బాలుడికి రోజురోజుకి దగ్గు, జలుబు ఎక్కువ కావటంతో అతని తల్లిండ్రులు గురువారం స్థానిక ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడి ఎడమ ఊపిరితిత్తులో ఉన్న పెన్క్యాప్ను శుక్రవారం ఆపరేషన్ చేసి తొలగించామని డాక్టర్ అరుణాభాసేన్ గుప్తా తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం బాలుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
బాటిల్ క్యాప్ చాలెంజ్.. భళే సరదా..
టెన్ ఇయర్స్ చాలెంజ్.. మరువక ముందే మరో చాలెంజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చాలెంజ్ అందరికి ఓ ఫీట్లా మారింది. అదే ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’. ఈ చాలెంజ్‌ను పలువరు సెలబ్రిటీలు ప్రయత్నించి విజయవంతంగా పూర్తిచేశారు. కాగా చాలా మంది నెటిజన్లు మాత్రం ఈ చాలెంజ్‌ను పూర్తి చేసేందుకు ప్రయల్నిస్తూ.. బాటిల్ క్యాప్ కిందపడకుండ .. వాళ్లు కిందిపడి భంగ పడుతున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాల వైరల్‌గా మరుతున్నాయి. ఈ చాలెంజ్ ఏమిటంటే.. ఒక బాటిల్‌పై దాని క్యాప్ వదులుగా బిగించి ఓ చోట కదలకుండా నిల్చోబెట్టాలి. తర్వాత దానికి కొంచం దూరం నుంచి కాలుతో కిక్(తన్నడం) చేస్తే ఆ క్యాప్ గిరగిరా తిరిగి కింద పడాలి. బాటిల్ కింద పడటం గాని, కాలు కదిలే దిశ మారటం గాని జరగకూడదు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నట దిగ్గజం జాసన్ స్టాథమ్,అమెరికా గాయకుడు జాన్ మేయర్లు ఈ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేయడంలో సఫలం అయ్యారు. -
హెచ్1బీ పరిమితి : అలాంటిదేమీ లేదు
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాలపై పరిమితులు విధించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న అంచనాలపై ట్రంప్ సర్కార్ స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి పరిమితులు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. డేటా స్థానికీకరణ అడిగే దేశాలపై హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించాలనే ప్రణాళికలేవీ లేవని ప్రకటించింది. హెచ్ -1 బి వీసీ ప్రోగ్రామ్‌తో, వర్క్ వీసా జారీ ప్రక్రియను విస్తృతంగా సమీక్షించాలని యోచిస్తున్నప్పటికీ ఇది ఒక నిర్దిష్ట దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని విదేశాంగ ప్రతినిధి తెలిపారు. నిక్షిప్తమైన డేటాకు సంబంధించి ఇండియాతో చర్చించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి...కానీ అది వీసాలపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆమె వెల్లడించారు. దేశంలోని చెల్లింపుల కంపెనీలన్నీ ఇక్కడే తమ వినియోగదార్ల సమాచారాన్ని నిల్వ చేయడాన్ని గతేడాది భారత్ తప్పనిసరి చేసింది. అయితే అందుకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని కొన్ని అమెరికా కంపెనీలు ఆ నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అమెరికా మన భారతీయ ఐటీ నిపుణులు ఆ దేశంలో పనిచేయడానికి వీలు కల్పించే హెచ్1-బీ వీసాలపై పరిమితులు విధించాలని భావించినట్లు బుధవారం మీడియా నివేదికలు ఆందోళనలు రేపాయి. దీనిపై గురువారం ట్రంప్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. -
ఎండకు టోపీ పెట్టేద్దాం..
సాక్షి సిటీబ్యూరో: ఎండాకాలంలో టూర్‌కు వెళుతున్నారా..?అయితే పలు జాగ్రత్తలు తీసుకొవాల్సిందే.. ఎందుకంటే నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండా కాలానికి.. పర్యాటకానికి అవినాభావ సంబంధం ఉంది. పిల్లలకు వేసవి సెలవులు రావడంతో పర్యటనలు మొదలవుతాయి. పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులకు వేసవి సెలవులు ఎంతో ఊరట. అందుకే తల్లిదండ్రులు వేసవి సెలవులు వస్తున్నాయంటే.. ముందుగానే ప్రణాళికలు వేసుకుని పర్యటనలకు సిద్ధమవుతారు. ఇలా వెళ్తున్నవారు కాస్తా ఆలోచించకుండా.. మొండిగా వెళ్లిపోతే.. ఎవరికో ఒకరికి వడదెబ్బ తగలడం.. వారితో మిగతా వారంతా సతమతం కావడం జరుగుతుంది. ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి నగర ప్రజలు రకరకాల ఉపశమన మర్గాలను ఎంచుకుంటారు. పిల్లల నుంచి పెద్దలు, యువతులు భానుడి కిరణాల భారి నుంచి రక్షించుకునేందుకు టోపీలను ధరించాల్సిందే. పిల్లలు మగవారు టోపీలు ధరిస్తే మహిళలకు మార్కెట్లో స్కార్ఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశీయ, విదేశీ డిజైన్లు.. నగరంలో దేశీయ టోపీలతో పాటు విదేశీ డిజైన్లతో టోపీలు అందుబాటులో ఉన్నాయి. ఇండోనేషియా, చైనా, బంగ్లాదేశ్‌తో పాటు కోలకత, ముంబైతో పాటు ఢిల్లీ నుంచి కూడా దేశీయ విదేశీ బ్రాండ్ టోపీలు నగరానికి దిగుమతి అవుతున్నాయి. విదేశీ డిజైన్ల టోపీలతో ఒకవైపు ఎండ నుంచి రక్షణ పొందుతూనే మరోవైపు స్టైయిలిష్‌గా కనబడవచ్చు. నగరంలోనూ టోలిచౌకి, మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వహకులు ఇల్యాస్ బుకారీ అన్ని వయసుల వారికి అనువైన టోపీలను తయారు చేస్తున్నారు. వెరైటీ టోపీలు వందల సంఖ్యలో వివిధ రకాల టోపీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ క్యాప్స్, గోల్ఫ్, కౌబాయి, రెబాక్, హిప్పొ, కాటన్, నైలాన్, కిట్క్యాట్లతో పాటు తోలుతో తయారు చేసిన వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం మహిళలు, అమ్మాయిలు వినియోగిస్తున్న స్కార్ఫ్‌లను కూడా నూతన డిజైన్లలో తయారు చేస్తున్నారు. -
క్యా క్యాప్ హై!
సాక్షి సిటీబ్యూరో: ముస్లింలకు రంజాన్ నెల పవిత్రమైంది. వారు ఈ నెల రోజులూ ఉపవాసం ఉంటూ ప్రత్యేక ప్రార్థలను చేస్తారు. నిష్టతో ఐదుపూటలా నమాజ్ చేస్తారు. నమాజ్ సమయంలోనే కాకుండా రోజంతా ప్రతి ఒక్కరూ టోపీలు ధరిస్తారు. పైగా ప్రతి ముస్లిం మహ్మద్ ప్రవక్త సంప్రదాయంగా టోపీని ధరించడం ఆనవాయితీ. ఈ టోపీ ధరిస్తే చెడు కార్యాలకు దూరంగా ఉంటారని ఓ నమ్మకం. ఇక ఈ నెలలో శుక్రవారానికి.. అందులోనూ మొదటి శుక్రవానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరోజు ముసల్మానులు ఎవరికి వారు ప్రత్యేకంగా కనబడేందుకు ఆసక్తి చపుతుంటారు. అందుకోసం ఎవరికి వారు లేటెస్ట్ డిజైన్ల టోపీలనే ఎంచుకుంటారు. ఈ సందర్భంగా గురువారం చార్మినార్, మదీనా సర్కిళ్లల్లోని క్యాప్ మార్ట్లు, మొహదీపట్నం,టోలిచౌకీ ప్రాంతాల్లోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వివిధ దేశాల డిజైన్లు దిగుమతి రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని క్యాప్ మార్ట్లు ముస్లింలు ధరించే టోపీలను విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా ఇస్లామిక్ సంప్రదాయం పాటించే ఇండోనేషియా, బంగ్లాదేశ్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఒమాన్, సౌదీ, మలేసియాతో పాటు చైనా నుంచి కూడా టోపీలు నగరానికి దిగుమతయ్యాయి. వీటిలో ఖురేషియా, ఒమానీ, సౌదీ రేషం, ఆజ్మేరీ, తహెరుల్ ఖాద్రీయా, షేర్‌గోలా, పాకిస్తానీ కమాన్, ఆఫ్ఘనీ గోల్, చైనా జాలీ, ఇండోనేసియా కమాల్ వంటి వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక వేడుకల్లో వాడే జిన్నా క్యాప్, సాలార్జంగ్ క్యాప్, రోమీ టోపీలు అదనం. రోజు వారి వాడే టోపీల ధరలు రూ.50 నుంచి రూ.150 వరకు ధర ఉంది. రంజాన్ నెలలో వాడే టోపీల ధరలు రూ 200 నుంచి రూ.500 మధ్య ఉన్నాయి. ఇక వేడుక టోపీల ధరలు రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నాయి. -
మూత మారితే లాభం రూపాయే..
కనిగిరి: మద్యం బాటిళ్ల నకిలీ మూతల రవాణాతో ఒక్కో మూతకు కేవలం రూపాయే లాభం. కానీ అందులోని మద్యమే మార్చితే వాటి వెల ప్రాణాలే..అన్నది నగ్నసత్యం. ఆ కోణంలో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ దీనిపై ప్రత్యేక దృష్టితో వేట సాగిస్తోంది. మూతల తయారీ వ్యవహారం రాష్ట్ర హద్దులు దాటడంతో జిల్లా, ఎస్టీఎఫ్ టీమ్‌లు తమ దర్యాప్తును స్టేట్ ఉన్నతాధికారుల కనుసన్నల్లో ఇతర రాష్ట్ర అధికారుల సహకారంతో సాగిస్తోంది. ఈ వేటలో ఎంతవరకు సఫలీకృతులవుతారన్న సంగతి పక్కన ఉంచితే.. బెంగళూరులోని ముఠా సభ్యుడు భాయ్ పట్టుబడితే తయారీ కేంద్రం..గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. చాలెంజ్‌గా ఎందుకు తీసుకున్నారంటే.. బ్రాండ్ మిక్సింగ్ (కల్తీ మద్యం) కేసులో పట్టుబడిన పలువురు నిందితులను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు విచారించారు. దొరికినవారంతా తాము కేవలం ఓసీ రూ.100 క్వార్టర్ బాటిల్లో రూ.50 విలువ చేసే హెచ్డీ (తక్కువ ఖరీదు) మద్యాన్ని మాత్రమే మిక్స్ చేసినట్లు వెల్లడించారు. అది కూడా చట్టరీత్య నేరమే. రెండూ మద్యమే అయినా ఒక బ్రాండ్‌లో మరొక బ్రాండ్ (ఎక్కవ ఖరీదులో.. తక్కువ రకం) కలిపి మోసం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణించారు. కనిగిరిలో, లేదా ఇప్పటి వరకు దొరికిన నిందుల విచారణలో కేవలం ఓసీ బాటిల్ నకిలీ మూతలే దొరికాయి. ఇవి కాకుండా ఇంకేమైనా బ్రాండ్ కంపెనీల మూతలు కూడా తయారై చలామణీ అవుతున్నాయా..? సెకండ్స్ మద్యం అక్రమ తయారీతో ప్రభుత్వానికి గండి కొడుతున్నారా..? అసలు అనుమతి లేని స్పిరిట్‌తో మద్యం అక్రమ వ్యాపారం ఏమైనా జరుగుతుందా..? కేవలం మూతల రవాణా వ్యాపారమేనా..? అసలు మూతల తయారీ కేంద్రం ఎక్కడ.. తెరవెనుక ఉన్న మాఫీయా కింగ్ ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కేవలం బ్రాండ్ మిక్సింగ్, నకిలీ మూతల అక్రమ మార్పిడి, రవాణానే కాకుండా ఇంకేమైనా అక్రమాలు జరిగి.. ప్రాణహాని సంభవిస్తే మొత్తం ఆబ్కారీ శాఖకే మచ్చ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్లే ఆబ్కారి శాఖ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతుగా నకిలీ మూలాలను వెలికి తీసే పనిలో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చైన్ లింక్ ఇలా.. ఇప్పటి వరకు దొరికిన నిందితులందించిన వివరాల ప్రకారం.. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన శివ నుంచి మూత రూ.3.50 రూపాయలకు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన పార్దుకు రవాణ చేస్తాడు. అక్కడి పార్దు, జనార్దన్, రమణాలు మూత ఒకటి రూ.4.50 రూపాయలకు (బొట్లగూడురుకు చెందిన కె.మాల్యాద్రి ద్వారా అదే గ్రామానికి చెందిన రెస్టారెంట్, వైన్‌షాపు నిర్వాహకుడు పి.శ్రీనుకు సరఫరా చేస్తారు. పి.శ్రీను అతని బావమరిది కలిసి నెల్లూరు జిల్లా కొండాపురంలో అతని వైన్ షాపులో స్టాక్ పాయింట్ పెట్టుకుని వ్యాపారం సాగిస్తూ పామూరు చెందిన వలిబాషా (ఆటో డ్రైవర్ మద్యం ఖాళీ బాటిల్ అమ్మకాలు కొనుగోలు చేసే)కు రూ.6లకు విక్రయిస్తాడు. అతను కనిగిరి, సీఎస్‌పురం మండలాల్లోని వైన్ షాపులకు (నందిని, కళ్యాణి, టీఎన్ఆర్ దుకాణాలకు) రూ.7.50కు విక్రయిస్తాడు. ఇలా నకిలీ మూతలు కనిగిరి నియోజకవర్గంలో చైన్ లింక్‌తో సరఫరా అయ్యాయి. అసలు అక్రమ వ్యాపారానికి పునాది బతుకు దెరువుకోసం షోడో వ్యాపారిని అనంతపురం జిల్లా ధర్మవరానికి వెళ్లిన మాల్యాద్రి అయితే అక్రమార్గానికి మరింత ఆజ్యం పోసి రెండు జిల్లాల్లో విస్తరింప చేసింది శ్రీనుగా తేలింది. -
మరోసారి వివాదంలో సీఎం యోగి ఆధిత్యనాథ్
-
హెచ్1 బీ దరఖాస్తుల కోటా ముగిసింది..కానీ
వాషింగ్టన్: హెచ్1బీ వీసాల దరఖాస్తులు కోటాకు సరిపడా స్వీకరించినట్టు అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. 2019 సంవత్సరానికి సంబంధించి హెచ్1 బీ వీసాలకు స్పందన భారీగా వచ్చిందని తెలిపింది. ఈ ఏడాది కోటా 65వేల దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిపింది. లాటరీ నిర్వహించి అనంతరం వీసాకు అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఎప్పుడు లాటరీ పద్ధతి నిర్వహిస్తారు, దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. మరోవైపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టతనిచ్చింది. అమెరికా ప్రభుత్వం జారీ చేసే భారతీయ ఐటి నిపుణులకు పాపులర్ అయిన హెచ్1బీ వీసాలపై ప్రభుత్వ కోటాను మించి ఎక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మంజూరు చేసే 20వేల వీసా క్యాప్‌కు సంబంధించి సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ‘హెచ్1బీ వీసాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని చెప్పలేం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతి అనుసరించే వీసాలు జారీ చేస్తాం’ అని యూఎస్సీఐఎస్ ప్రతినిధి తెలిపారు. అలాగే వీసాకుఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రుసుమును తిరిగి ఇచ్చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 2 నుంచి హెచ్1 వీసాల దరఖాస్తుల ప్రకియ ప్రారంభమైన విషయం తెలిసిందే. -
మోదీ మరో సంచలనం ఇదేనట..!
-
మోదీ మరో సంచలనం ఇదేనట..!
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్‌తో పెను సంచలనానికి తెరలేపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకోనున్న తదుపరి నిర్ణయంపై షాకింగ్ న్యూస్ ఒకటి వార్తల్లో నిలిచింది. గత ఏడాది జులైలో సిట్ చేసిన కీలక సూచనను అమలు చేసేందుకు మోదీ కసరత్తు చేస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. దీని ప్రకారం రూ.15లక్షలకుమించిన నగదు నిల్వలపై కొరడా ఝుళిపించనున్నట్టు తెలుస్తోంది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలను నిషేధించిన కేంద్రం తాజాగా ఒక వ్యక్తి లేదా సంస్థల క్యాష్ హోల్డింగ్స్ పై కూడా పరిమితులు విధించనుందట. నల్లధనంపై యుద్దంలో భాగంగా జీఎస్టీ అమలుతోపాటు, మరో సంచలనానికి కేంద్రం తెరతీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో నల్ల ధనం చలామణికి చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక సిఫారసులు చేసింది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీల రద్దుతో పాటు రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని సూచించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబి షా నాయకత్వంలోని సిట్.. ఈ సిఫారసులు చేసింది. అలాగే నగదు నిల్వలపై పరిమితులు లేకుండా ఈ నిషేధం అమలు చేయడం కష్టమని కూడా స్పష్టం చేసింది. ఇందుకోసం ఏ వ్యక్తి, సంస్థా రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని కోరింది. అయితే మరింత నగదు అవసరమైనపుడు సంస్థలు, వ్యక్తులు తమ ప్రాంతంలోని ఐటి శాఖ అధికారుల అనుమతితో అధిక నగదు ఉంచుకునే వెసులుబాటు కల్పించాలని నివేదించిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ నగదు నిల్వ పరిమితిపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, దీనికోసం ఒక ఆర్థికబిల్లును తీసుకురావాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు తరువాత నగదు ఉపసంహరణలపై రూ.150 బాదుడు నిర్ణయాన్ని ప్రకటించాయి. అలాగే హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ ,యాక్సిస్ బాటలో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులుకూడా పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.