వాషింగ్టన్: హెచ్1బీ వీసాల దరఖాస్తులు కోటాకు సరిపడా స్వీకరించినట్టు అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. 2019 సంవత్సరానికి సంబంధించి హెచ్1 బీ వీసాలకు స్పందన భారీగా వచ్చిందని తెలిపింది. ఈ ఏడాది కోటా 65వేల దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిపింది. లాటరీ నిర్వహించి అనంతరం వీసాకు అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఎప్పుడు లాటరీ పద్ధతి నిర్వహిస్తారు, దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. మరోవైపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టతనిచ్చింది.
అమెరికా ప్రభుత్వం జారీ చేసే భారతీయ ఐటి నిపుణులకు పాపులర్ అయిన హెచ్1బీ వీసాలపై ప్రభుత్వ కోటాను మించి ఎక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మంజూరు చేసే 20వేల వీసా క్యాప్‌కు సంబంధించి సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ‘హెచ్1బీ వీసాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని చెప్పలేం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతి అనుసరించే వీసాలు జారీ చేస్తాం’ అని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి తెలిపారు. అలాగే వీసాకుఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రుసుమును తిరిగి ఇచ్చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 2 నుంచి హెచ్1 వీసాల దరఖాస్తుల ప్రకియ ప్రారంభమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment