uscis
-
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్డేట్స్F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్‌గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్‌లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
USA: 99 ఏళ్ల భారతీయ బామ్మకు అమెరికా పౌరసత్వం
వాషింగ్టన్: భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనడానికి 99 ఏళ్ల దైబాయి నిదర్శనం. మా ఓర్లాండో కార్యాలయానికి ఆమె ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు’అని యూఎస్సీఐఎస్ పోస్టు చేసింది. దైబాయికి అమెరికా పౌరసత్వం లభించడం పట్ల పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి -
గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు
వాషింగ్టన్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగియనుండగా మరో మూడు రోజులు అంటే మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సీఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్–1బీ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ మార్చి 22
వాషింగ్టన్: 2025వ సంవత్సరానికి గాను హెచ్–1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువు మార్చి 22వ తేదీతో ముగియనుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. అదేవిధంగా, హెచ్–1బీ క్యాప్ పిటిషన్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. నాన్ క్యాప్ దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్–1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన!
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ధరఖాస్తుల కోసం ఆన్లైన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో పాటు హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ల సమర్పణను ప్రారంభించే ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌ను ప్రారంభించనుంది. వీటిని సంస్థాగత ఖాతాలు అని పిలుస్తారు. సంస్థాగత ఖాతాల్లో ఒక సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారి కోసం సంస్థ తరుపున పనిచేసే న్యాయపరమైన వ్యవహారాలు చూసుకునే ప్రతినిధులను హెచ్ -1బీ రిజిస్ట్రేషన్లు, ఫారమ్ ఐ-129, వలసేతర వర్కర్ కోసం ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తుదారుల కోసం ఫారమ్-ఐ 907ను అనుమతి ఇస్తుంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) విభాగాల్లో కీలక మార్పులు చేటుచేసుకున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఫీచర్లు: హెచ్-1బీ రిజిస్ట్రెంట్ ఖాతాలతో చట్టపరమైన ప్రతినిధులు, సంస్థల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన డిజైన్ కేస్ మేనేజ్మెంట్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఫైలింగ్ ఆప్షన్స్ : హెచ్-1బీ పిటిషనర్లు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారమ్‌లు ఐ-129, అనుబంధిత ఫారమ్ ఐ-907 ప్రీమియం ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. ఆన్లైన్ ఫైలింగ్ కోసం చట్టపరమైన ప్రతినిధి ద్వారా చేసుకోవచ్చు. లేదంటే పేపర్ ఆధారిత ఫైలింగ్‌ని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ : హెచ్-1బీ వీసా నమోదు ప్రక్రియ ప్రత్యేకంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. యూజర్ ఫీడ్ బ్యాక్ : యూఎస్సీఐఎస్ వివిధ స్టేక్ హోల్డర్స్‌తో కలిసి యుజబిలిటి టెస్టింగ్‌ను నిర్వహించనుంది. ఫలితంగా ఆర్గనైజేషనల్ అకౌంట్ పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కంటిన్యూడ్ ఫీడ్‌బ్యాక్ : యూఎస్ సీఐఎస్ వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించి, యూజర్ ఎక్స్పీరీయన్స్ను అందించే ప్రయత్నాలు చేయనుంది. నేషనల్ ఎంగేజ్మెంట్: యూఎస్సీఐఎస్ జనవరి 23, జనవరి 24న నేషనల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ద్వారా సంస్థలు, చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశం చేసేందుకు సంస్థాగత ఖాతాల సమాచారాన్ని అందిస్తుంది. ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ : హెచ్-1బీ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులను సమాచార సెషన్లకు హాజరు కావడానికి యూఎస్సీఐఎస్ ప్రోత్సహిస్తుంది. సంస్థాగత ఖాతాలు, ఆన్లైన్ ఫైలింగ్ వివరాలు హెచ్ -1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో అందుబాటులో ఉంటాయి. -
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్‌ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
అమెరికాలో మనోళ్ల వాటా పెరిగింది
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగింది, చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి గతేడాది విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం చూపిందని తెలిపింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికీ చైనా జాతీయులదే మెజారిటీ వాటా కాగా భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) ప్రకారం.. నాన్–ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసాలైన ఎఫ్–1, ఎం–1 ద్వారా 2021లో 12,36,748 మంది అమెరికాలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఇది 1.2% తక్కువ. 2021లో చైనా నుంచి 3,48,992 మంది, భారత్ నుంచి 2,32,851 మంది అమెరికాకు వచ్చారు. 2020తో పోలిస్తే చైనా విద్యార్థులు 33,569 మంది తగ్గిపోయారు. ఇక భారత్ నుంచి 25,391 మంది అదనంగా వచ్చారు. విదేశీయులు విద్యాభ్యాసం కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2021లో 2,08,257 మంది (16.8 శాతం) విదేశీయులు కాలిఫోర్నియా విద్యాసంస్థల్లో చేరారు. 2021లో యూఎస్‌లో 11,42,352 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. -
మార్చి 1 నుంచి హెచ్1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
వాషింగ్టన్: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్1–బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటనలో వెల్లడించింది. హెచ్1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్సీఐఎస్ 65 వేల హెచ్1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి. -
హెచ్-1బి వీసా దరఖాస్తు దారులకు శుభవార్త..!
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బి వీసాల ప్రాథమిక రిజిస్ట్రేషన్లు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ మధ్య కాలంలో దరఖాస్తుదారులు, ప్రతినిధులు(పిటిషనర్ తరఫున వీసాకోసం అప్లయ్ చేసే వారు) ఆన్లైన్ ద్వారా హెచ్-1బీ వీసాకోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్-1బీ క్యాప్ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. దరఖాస్తు స్టేటస్‌ను మాత్రం ఈ నంబర్ ద్వారా ట్రాక్ చేయలేరని స్పష్టం చేసింది.అమెరికాలో పని చేయాలంటే విదేశీయులకు హెచ్-1బీ విసా తప్పనిసరి. పరిమితకాలంతో ఈ వీసాను అమెరికా ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని టెక్ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. వారిలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఈ వీసా కార్యక్రమం ద్వారా యుఎస్ కంపెనీలు భారతీయులను నియమించుకోవచ్చు. అమెరికాలో అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్-1బి వీసాలు జారీ చేయగా, 20,000 వీసాలు యుఎస్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాలను అందుకున్న వారిలో అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. హెచ్-1బీ వీసా కోసం పిటిషనర్లు, వారి తరఫు ప్రతినిధులు మైయూఎస్సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్‌ను వినియోగించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో అభ్యర్థి 10 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. స్వియ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 21 నంచి మైయూఎస్సీఐఎస్ ఆకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. మార్చి 31 నాటికి ఎంపిక దరఖాస్తుకు ఎంపికైన వారి వివరాలు.. మైయూఎస్సీఐఎస్ అకౌంట్‌కు అందుతాయని పేర్కొంది. దరఖాస్తు యాదృచ్ఛికంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూను అమెరికా రద్దు చేసింది. (చదవండి: 5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!) -
హెచ్1బీ భాగస్వాములకు భారీ లబ్ధి
వాషింగ్టన్ : భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకి ప్రయోజనం చేకూరేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు (భర్త/భార్య) ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించడానికి అంగీకరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ నిపుణుల భార్యలకి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) హెచ్–1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు (భార/భర్త, 21 ఏళ్ల వయసులోపు పిల్లలు)కి హెచ్–4 వీసా జారీ చేస్తుంది. ఈ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉండాలి. దీనిని ఎప్పటికప్పుడు వారు పొడిగించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇకపై అలాంటి బాధ లేకుండా ఉద్యోగం చేయడానికి వీలుగా ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్‌తో కూడిన హెచ్–4 వీసాను మంజూరు చేయడానికి బైడెన్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి వెళ్లే మహిళలకే అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. ఈఏడీని పొడిగించుకోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్–4 వీసాదారుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) కోర్టులో పిటిషన్ వేసింది. ‘హెచ్–4 వీసాదారులు తరచూ రెగ్యులేటరీ పరీక్ష ఎదుర్కోవాలి. అయితే గతంలో హోంల్యాండ్ ఏజెన్సీ వారికి ఉద్యోగం రాకుండా నిషేధం విధించింది. దీంతో రీ ఆథరైజేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా వారు అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది’అని ఏఐఎల్ఏ లాయర్ జాన్ వాస్డెన్ చెప్పారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం 90 వేలమందికి పైగా హెచ్–4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ ఉంది. -
లక్ష గ్రీన్‌కార్డులు వృథా అయ్యే ప్రమాదం!
వాషింగ్టన్: దాదాపు లక్షకు పైగా గ్రీన్‌కార్డులు ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో చాలామంది ఆశలపై నీళ్లు జల్లినట్లు కానుంది. ఈ ఏడాది ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డుల కోటా గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా పెరిగి 2,61,500కు చేరిందని భారత్‌కు చెందిన సందీప్ పవార్ చెప్పారు. అయితే చట్టం ప్రకారం సెప్టెంబర్ 30లోపు అవసరమైన వీసాలు జారీ కాకుంటే అధికంగా పెరిగిన కోటాలోని లక్ష కార్డులు వృ«థా అవుతాయన్నారు. ఈ విషయమై బైడెన్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఇంకా ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) చేస్తున్న జాప్యమే గ్రీన్‌కార్డుల వృ«థాకు కారణమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్, చైనాకు చెందిన 125 మంది ఈ వృ«థా నివారించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసేవారుండగా, మరోపక్క ఇలా కార్డులు వృ«థా కావడం సబబుకాదని వీరు కోర్టుకు విన్నవించారు. యూఎస్సీఐఎస్ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల పలువురు భారతీయుల భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులకు గ్రీన్కార్డులందడంలేదని భారతీయ హక్కుల పోరాట కార్యకర్త పవార్ చెప్పారు. డ్రీమర్ల హక్కులకు రక్షణ కల్పించాలని, గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
హెచ్–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ
వాషింగ్టన్: హెచ్–1బీ వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ అనేది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్ ఫైలింగ్ ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
H-1B Visa: భారత టెక్కీలకు మరో ఛాన్స్!
H-1B Visa Second Lottery: భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లలో (ఏప్రిల్ 1 నుంచి 30 దాకా నమోదు చేసుకున్నవాళ్ల) మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్-ఓపీటీ స్టూడెంట్స్‌కు భారీ ఊరట ఇవ్వనుంది. కాగా, హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. -
USA: గ్రీన్‌కార్డు నిరీక్షణకు తెరపడేనా!
గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న భారతీయుల నిరీక్షణకు తెరపడేదెన్నడు? కంట్రీ కోటా పరిమితి 7 శాతాన్ని ఎత్తేస్తే భారతీయులకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాదిగా అమెరికా రాకపోకలపై ఆంక్షలతో గ్రీన్ కార్డులు మంజూరు కాకపోవడం మన దేశానికి కలిసి వస్తుందా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు మంజూరులో పెద్ద దేశం, చిన్నదేశం అన్న తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 20వ శతాబ్దం మధ్యలో దేశాలకు పరిమితి విధించారు. ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికీ ఏడు శాతానికి మించి జారీచేయకూడదని పరిమితి విధించారు. ఇప్పుడవే భారతీయ టెక్కీలకు శాపంగా మారాయి. అగ్రరాజ్యంలో పర్మనెంట్ రెసిడెంట్ హోదా పొందాలంటే జీవిత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దేశాల పరిమితిని ఎత్తేయడం కోసం రెండు బిల్లుల్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడంతో భారతీయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ రెండు బిల్లుల్లో ఏది ఆమోదం పొందినా భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభిస్తుంది. భారత్ నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన టెక్కీలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా... గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. చిన్న దేశాల నుంచి తక్కువ సంఖ్యలో వెళ్లేవారికి వెనువెంటనే గ్రీన్ కార్డు రావడం అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఏ దేశం నుంచి వచ్చారు అన్నది కాకుండా అమెరికాకు ఎంతవరకు వారి సేవలు ఉపయోగపడతాయి అన్నదే ఆధారంగా గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని డెమొక్రాటిక్ ప్రజాప్రతినిధి లోప్గ్రెన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన వారే దేశంలో స్థిరపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు అండదండగా ఉంటారని, అందుకే కాలం చెల్లిన కంట్రీ క్యాప్‌ను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అదే జరిగితే భారత్, చైనా దేశాలకే అత్యధికంగా గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి. ప్రతినిధుల సభలో బిల్లులు ► ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం–2021ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో 7 శాతంగా ఉన్న కంట్రీ క్యాప్‌ను ఎత్తేయడం, కుటుంబ వీసాల పరిమితిని ఏడు నుంచి 15 శాతానికి పెంచడం ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగంలో అత్యంత ప్రతిభను చూపిస్తూ, అధిక జీతం తీసుకుంటున్న వారికి తొలుత గ్రీన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇది ప్రతినిధుల సభ ఆమోదం పొంది, సెనేట్‌లో పాసైతే... బైడెన్ సంతకంతో చట్టం అవుతుంది. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల సమయంలో అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తానన్న హామీని నెరవేర్చుకోవడానికి అమెరికా పౌరసత్వ చట్టం 2021ను ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇందు లో కూడా గ్రీన్‌కార్డులకు సంబంధించి కంట్రీ కోటాను ఎత్తేయాలని ఉంది. ఈ బిల్లు ప్రకారం ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ముందు గ్రీన్ కార్డు మంజూరు చేయాలి. గ్రీన్‌కార్డు మంజూరైన తర్వాత అయిదేళ్లకి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్న ప్రస్తుత నిబంధనల్ని మూడేళ్లకి తగ్గించారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్), 2020 గణాంకాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తులు – 12 లక్షలు పైగా పెండింగ్‌లో ఉన్న భారతీయుల దరఖాస్తులు – 8 లక్షలు (66%) ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్ కార్డులు – 3,66,000 (ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి) కుటుంబాలకు ఇచ్చే గ్రీన్ కార్డులు – 2,26,000 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు – 1,40,000 ఈ గ్రీన్‌కార్డుల్లో భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే ఈబీ–2, ఈబీ–3 కేటగిరీ కింద ఏడాదికి 40,040 గ్రీన్ కార్డుల జారీ కంట్రీ కోటా కారణంగా నష్టపోతున్న దేశాలు: భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ – నేషనల్ డెస్క్, సాక్షి -
మార్చి నుంచి హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్లు
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1–2022 సెప్టెంబర్ 30) హెచ్–1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్–1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. -
లాటరీ విధానంలోనే హెచ్1బీ వీసా
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి భారతీయులు సహా విదేశీయులకు వీలు కల్పించే హెచ్–1బీ వీసాల మంజూరు ప్రక్రియలో ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన మార్పుల్ని బైడెన్ సర్కార్ వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31వరకు లాటరీ విధానమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త వీసా విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. హెచ్–1బీ వీసా కింద అమెరికాలో పలు టెక్ కంపెనీలు భారత్, చైనా ఇతర దేశాల నుంచి వేలాది మందిని ఉద్యోగాల్లో తీసుకుంటూ ఉంటారు. ట్రంప్ అధికారంలో ఉండగా ఈ వీసాల జారీ ప్రక్రియలో çకంప్యూటరైజ్డ్ లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానం తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం మార్చి 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీని అమలుకు అవసరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులకు మరింత సమయాన్ని ఇస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ కొత్త విధానం అమలును మార్చి 9 నుంచి డిసెంబర్ 31కి వాయిదా వేసినట్టుగా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివరించింది. ప్రతిభ ఆధారిత వీసాలు..! వలసేతర వీసా అయిన హెచ్–1బీ కింద అమెరికా ఏటా 65 వేల వీసాలను మంజూరు చేస్తుంది. వర్సిటీల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. ఈ వీసాలున్న విదేశీయులకు తక్కువవేతనం చెల్లిస్తూ పలు కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉండడంతో అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న భావన నెలకొంది. -
భారతీయ మహిళలకే అధిక ప్రయోజనం!
వాషింగ్టన్: అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఉపసంహరించారు. ఈ నిర్ణయంలో భారతీయ మహిళలే అధికంగా ప్రయోజనం పొందుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. హెచ్–1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములకు(భార్య లేదా భర్త), వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు) హెచ్4 వీసాలను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తోంది. అమెరికాలో హెచ్–1బీ వీసా కింద పనిచేస్తున్నవారిలో అత్యధిక శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఈ వీసాలతో అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను స్వదేశంలోనే నియమించుకోవచ్చు. ఇండియా, చైనా నుంచి ప్రతిఏటా వేలాది మంది హెచ్–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో హెచ్–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అనుమతి కార్డులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే కావడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక వలసలపై కఠినంగా వ్యవహరించారు. హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతిని రద్దు చేస్తున్నట్లు 2017లో ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలను తిరగదోడుతామని ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. గడువు ముగిసిన హెచ్4 వీసాదారుల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) చెల్లుబాటును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
హెచ్ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ
వాషింగ్టన్: హెచ్1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ (డీఓఎల్) ప్రకటించింది. తాజా మార్పులతో హెచ్ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌తో యూఎస్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజా నిబంధనల ప్రకారం.. సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా (4 లెవెల్స్) విభజించి, డీఓఎల్ నియంత్రిస్తుంది. తాజా మార్పుల ప్రకారం.. ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది. అలాగే, భారత్ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల అనుభవం ఉన్నవారిపైనా ప్రభావం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై, అలాగే, కాలేజీ అనంతరం ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఈ మార్పులు భారీగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలను జారీ చేసే విధానంలో.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు ఆ మేరకు నష్టపోనున్నారు. విదేశీ విద్యార్థులు ప్రధానంగా లెవెల్ 1 పరిధిలోకి వస్తారు. అయితే, తాజా నిబంధనలు విద్యార్థులపై ప్రభావం చూపబోవని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) పేర్కొంది. వారి ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సమయాన్ని అధిక వేతనం పొందగల స్థాయికి వెళ్లేలా అనుభవం పొందేందుకు వినియోగించుకునే అవకాశముందని వివరించింది. అయితే, కేవలం ‘స్టెమ్’ విద్యార్థులకు మాత్రమే మూడేళ్ల ఓపీటీ ఉంటుంది. మిగతా విభాగాల విదేశీ విద్యార్థులు కేవలం ఒక సంవత్సరం ఓపీటీకే అర్హులు. మరోవైపు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న, ఓపీటీ ద్వారా కొంత అనుభవం పొందిన విద్యార్థులు లెవెల్ 2 ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. కానీ, ఈ లెవెల్ హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో వారికి వీసా లభించడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 50% పైగా దరఖాస్తులు ఈ లెవెల్ నుంచే వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలపై గతంలో జరిపిన అభిప్రాయ సేకరణలో పలు విశ్వవిద్యాలయాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించే విషయంలో నెలకొనే అనిశ్చితి వల్ల విదేశీ విద్యార్థులు అమెరికాను ఉన్నత విద్యకు ఎంపిక చేసుకోకపోవచ్చని పేర్కొన్నాయి. -
గ్రీన్‌కార్డ్ వెయిటింగ్ లిస్ట్‌లో 8 లక్షల మంది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా యూఎస్ సిటిజన్‌షిప్ కోసం వేచిచూస్తున్న వారి జాబితా 2020లో 1.2 మిలియన్లకు చేరింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది యూఎస్ చరిత్రలో అత్యధికమని క్యాటో ఇన్స్టిట్యూట్ పేర్కొంది. యూఎస్ సిటిజన్‌షిప్‌ను కల్పించే గ్రీన్‌కార్డు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల సంఖ్య 8 లక్షలకు చేరినట్లు యూఎస్సీఐఎస్ పేర్కొంది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల్లో భారతీయుల వాటా 68 శాతానికి సమానమని తెలియజేసింది. కాగా.. వెయిటింగ్ లిస్ట్ అధికంగా ఉండటం, జారీకి పట్టే కాలాన్ని పరిగణిస్తే.. సుమారు 2 లక్షల మందికి తమ జీవితకాలంలో గ్రీన్‌కార్డ్ అందే అవకాశాలు లేనట్లేనని క్యాటోకు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ లిబర్టీ అండ్ ప్రాస్పెసరిటీ అభిప్రాయపడింది. చైనీస్‌కు రెండో ర్యాంకు యూఎస్ గ్రీన్‌కార్డులు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల తదుపరి చైనీయులు అధికంగా ఉన్నట్లు యూఎస్సీఐఎస్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలవారు 18 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. శాశ్వత ఉపాధి కార్యక్రమంలో భాగంగా యూఎస్ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ గ్రీన్‌కార్డులను జారీ చేస్తోంది. తద్వారా అత్యంత నైపుణ్యమున్న వారికి దేశంలో నివసించేందుకు వీలు కల్పిస్తోంది. వార్షికంగా 1.4 లక్షల మందికి మించి ఎంప్లాయ్మెంట్ గ్రీన్‌కార్డుల జారీకి అవకాశంలేదని ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్ ఈ అంశంలో సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ ప్రాసెస్ పూర్తికావడానికి చాలా కాలంపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. -
‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు
వాషింగ్టన్: అమెరికా హెచ్ 1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో తాజాగా మరికొన్ని ఆంక్షలను చేర్చింది. తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు కోరుకుంటున్న వేలాది భారతీయుల ఆకాంక్షలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)మంగళవారం దీనికి సంబంధించిన తాత్కాలిక తుది ఉత్తర్వులను జారీ చేసింది. హెచ్1బీకి వీలు కల్పించే ‘ప్రత్యేక నైపుణ్య వృత్తి(స్పెషాలిటీ ఆక్యుపేషన్)’ నిర్వచనానికి ఇప్పటివరకు ఉన్న విస్తృతార్థాన్ని ఇప్పుడు కట్టుదిట్టం చేసి, సంక్షిప్తం చేశారు. నిబంధనల్లో ఉన్న లొసుగులను తొలగించి అత్యంత అర్హులైన విదేశీయులకు స్థానిక కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించేలా మార్పులు చేశారు. అమెరికన్లను తొలగించి, ఆ ఉద్యోగాలను చవకగా లభించే విదేశీయులకు ఇచ్చే విధానాన్ని అడ్డుకునేలా నిబంధనలు రూపొందించారు. హెచ్1బీ పిటిషన్ ఆమోదం పొందకముందు, పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో, దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత కూడా వర్క్‌సైట్ ఇన్స్పెక్షన్ అధికారాన్ని డీహెచ్ఎస్కు కల్పించారు. ఈ నిబంధనలు రెండు నెలల్లో అమల్లోకి వస్తాయని డీహెచ్ఎస్ పేర్కొంది. అమెరికాలోని కంపెనీలు వృత్తి నిపుణులైన విదేశీయులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించినదే హెచ్1బీ వీసా అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏడాదికి 85వేల వీసాలు జారీచేస్తున్నారు. భారత్, చైనా తదితర దేశాల నుంచి ఈ వీసాలతో వేలాదిగా అమెరికాకు వెళ్తుంటారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇప్పటికే హెచ్1బీపై అమెరికాలో ఉన్న చాలామంది భారతీయులు కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ 19తో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ.. హెచ్1బీ ఉద్యోగాల వల్ల మరింత దిగజారకుండా, ముఖ్యంగా అమెరికన్ల ఉద్యోగ భద్రతకు ముప్పు కలగకుండా చూసే లక్ష్యంతో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) పనిచేస్తోందని డీహెచ్ఎస్ పేర్కొంది. తాజా ఆంక్షలను వైట్‌హౌజ్ సమర్ధించింది. అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ, అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకే ప్రాధాన్యం కల్పిస్తూ.. అమెరికా వర్క్ వీసా విధానాన్ని అధ్యక్షుడు ట్రంప్ మరింత మెరుగుపరుస్తున్నారని పేర్కొంది. ఇన్నాళ్లూ ఈ విధానం దుర్వినియోగమైందని విమర్శించింది. తక్కువ వేతనాలకు లభించే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోకుండా ట్రంప్ చూస్తున్నారని వివరించింది. ‘దేశ ఆర్థిక భద్రత హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలో భాగంగా మారిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇప్పుడు ఆర్థిక భద్రతే అంతర్గత భద్రత’ అని డీహెచ్ఎస్ సెక్రటరీ చాడ్ వాల్ఫ్ వ్యాఖ్యానించారు. -
హెచ్1బీ వీసాదారులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులకు భారీ ఊరట లభించింది. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు స్పందించడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ట్రంప్ సర్కార్ మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ అనుమతులు మంజూరు చేసింది. హెచ్1బీ, గ్రీన్‌కార్డులకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు స్పందించడానికి గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. వీసా పొడిగింపు విజ్ఞప్తులు (ఎన్–14), తిరస్కరణ నోటీసులు, ఉపసంహరణ నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడుల ఉపసంహరణ, ముగింపు నోటీసులు, ఫారమ్ ఐ–290బీ సమర్పణలు, దరఖాస్తు నోటీసులు వంటి వాటిపై అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి గడువు పెంచింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులపై ఉన్న గడువు తేదీ తర్వాత మరో రెండు నెలలపాటు వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఫారమ్ ఐ–290బీ నింపి పంపించడానికి ఈ ప్రకటన విడుదలైన నుంచి 60 రోజుల వరకు గడువు ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటుకు వీలు కల్పించే గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు ఉన్నారు. -
హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో చిక్కుల్లో పడ్డ అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యుఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్త అందించింది. అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. శుక్రవారం నాటి యుఎస్సీఐఎస్ ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది. గడువు ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుండి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీ ను పరిశీలిస్తామని యుఎస్సీఐఎస్ తెలిపింది. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటామని ఏప్రిల్ 10న ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని అంచనా వేసిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం సూచించిన కొద్ది రోజుల తరువాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
హెచ్-1బీ వీసా : పరిమితి ముగిసింది
వాషింగ్టన్ : వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1-బీ దరఖాస్తుల పరిమితి ముగిసిందని యూఎస్సీఐఎస్(యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) వెల్లడించింది. ఎవరి దరఖాస్తులను ఆమోదించాలనే విషయంపై లాటరీ ద్వారా నిర్ణయిస్తామని కౌన్సిల్ తెలిపింది. ఎంపికైన వారి వివరాలను ఆయా దరఖాస్తుదారులు, వారి సంస్థలకు మార్చి 31 లోపు సమాచారాన్ని అందిచేస్తామని ప్రకటించింది. అలాగే హెచ్1-బీ క్యాప్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30వ తేదీని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ నిర్దేశించిన 65 వేల దరఖాస్తుల స్వీకరణ పరిమితి మించిందని తెలిపింది. అయితే ఎంత మంది హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేశారనే విషయాన్ని యూఎస్సీఐఎస్ ప్రకటించలేదు. భారత్, చైనా దేశాల నుంచి వేల మంది ఐటీ నిపుణులు ఎక్కువగా హెచ్1-బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం తెలిసిన విషయమే. -
నిబంధనలు సరళిస్తేనే మరిన్ని వీసాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నా నిబంధనల సరళీకరణ కీలకమని, సులభతర వ్యాపార నిబంధనలుంటేనే స్థానిక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, ఉద్యోగాలూ వస్తాయని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. భారతీయ టెక్నాలజీ కంపెనీలు యూఎస్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సీఈఓల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మోహన్ రెడ్డి.. టెక్నాలజీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ట్రంప్ ముందు ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘హెచ్1బీ వీసాలకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గతేడాది నవంబర్‌లో 50:50 కంపెనీ చార్జెస్ నిబంధనలను తెచ్చింది. అంటే.. అమెరికాలోని భారతీయ కంపెనీల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులుంటే.. హెచ్1బీ వీసా కింద 4 వేల డాలర్లు, ఎల్1 కింద 4500 డాలర్ల రుసుము చెల్లించాలి. నిజానికి కొత్త హెచ్1బీ లేదా ఎల్1 వీసాల జారీలో ఈ నిబంధనలు ఓకే. కానీ రెన్యువల్ వీసాలకూ ఈ రుసుములు చెల్లించాలంటున్నారు. ఇది భారతీయ కంపెనీలకు పెనుభారమే. హెచ్1బీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్స్‌కే ఉద్యోగాలిద్దామంటే.. ఉద్యోగ అనుభవం అడ్డొస్తుంది. కొత్తగా వెళ్లే కంపెనీలు కూడా 50:50 కంపెనీ చార్జీల భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఉద్యోగులను తీసుకెళ్లే బదులు స్థానిక అమెరికన్స్‌కే ఉద్యోగాలిస్తున్నాయి. ఇక హెచ్1బీ వీసా వారి గ్రీన్‌కార్డ్ కోటా తొలగించటం వంటి లెజిస్లేటివ్ నిబంధనలూ ఇలాంటివే. ఈ విషయాన్ని ట్రంప్‌తో మేం ప్రస్తావించాం’’ అని మోహన్‌రెడ్డి వివరించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... వచ్చే 3–6 నెలల్లో అమెరికాలోని భారతీయ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించి నియంత్రణలను సరళీకరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చినట్లు మోహన్‌రెడ్డి వెల్లడించారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా ట్రంప్ సర్కారు గత మూ డేళ్లలో నియంత్రణల్ని సడలించినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ నిబంధనల తొలగింపును ప్రారంభించామని, వాటిని నోటిఫై చేయాల్సి ఉందని చెప్పారాయన’’ అని మోహన్‌రెడ్డి వివరించారు.