హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన! | H-1b Visa Online Filing For Fy25 To Begin In February | Sakshi
Sakshi News home page

హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన!

Published Sat, Jan 13 2024 1:19 PM | Last Updated on Sat, Jan 13 2024 1:56 PM

H-1b Visa Online Filing For Fy25 To Begin In February - Sakshi

హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్‌-1బీ వీసా ధరఖాస్తుల కోసం ఆన్‌లైన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో పాటు హెచ్‌-1బీ వీసా కోసం  రిజిస్ట్రేషన్‌ల సమర్పణను ప్రారంభించే ఆర్గనైజేషనల్‌ అకౌంట్స్‌ను ప్రారంభించనుంది. వీటిని సంస్థాగత ఖాతాలు అని పిలుస్తారు.  

సంస్థాగత ఖాతాల్లో ఒక సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారి కోసం సంస్థ తరుపున పనిచేసే న్యాయపరమైన వ్యవహారాలు చూసుకునే  ప్రతినిధులను హెచ్‌ -1బీ రిజిస్ట్రేషన్‌లు, ఫారమ్ ఐ-129, వలసేతర వర్కర్ కోసం ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తుదారుల కోసం ఫారమ్‌-ఐ 907ను అనుమతి ఇస్తుంది.  

యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ (యూఎస్‌సీఐఎస్‌) విభాగాల్లో కీలక మార్పులు చేటుచేసుకున్నాయి. వాటిల్లో ప్రధానంగా   

  • ఫీచర్‌లు: హెచ్‌-1బీ రిజిస్ట్రెంట్ ఖాతాలతో చట్టపరమైన ప్రతినిధులు, సంస్థల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన డిజైన్ కేస్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌లు అందుబాటులోకి  రానున్నాయి.
     
  • ఫైలింగ్ ఆప్షన్స్‌ : హెచ్‌-1బీ పిటిషనర్లు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారమ్‌లు ఐ-129, అనుబంధిత ఫారమ్ ఐ-907 ప్రీమియం ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. ఆన్‌లైన్ ఫైలింగ్ కోసం చట్టపరమైన ప్రతినిధి ద్వారా చేసుకోవచ్చు. లేదంటే పేపర్ ఆధారిత ఫైలింగ్‌ని ఎంచుకోవచ్చు.
     
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌ : హెచ్‌-1బీ  వీసా నమోదు ప్రక్రియ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
     
  • యూజర్‌ ఫీడ్‌ బ్యాక్‌ : యూఎస్‌సీఐఎస్‌  వివిధ స్టేక్‌ హోల్డర్స్‌తో కలిసి యుజబిలిటి టెస‍్టింగ్‌ను నిర్వహించనుంది. ఫలితంగా ఆర్గనైజేషనల్‌ అకౌంట్‌ పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
      
  • కంటిన్యూడ్‌ ఫీడ్‌బ్యాక్‌ : యూఎస్‌ సీఐఎస్‌ వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించి, యూజర్‌ ఎక్స్‌పీరీయన్స్‌ను అందించే ప్రయత్నాలు చేయనుంది.
     
  •  నేషనల్‌ ఎంగేజ్‌మెంట్‌: యూఎస్‌సీఐఎస్‌ జనవరి 23, జనవరి 24న నేషనల్‌ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ద్వారా సంస్థలు, చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశం చేసేందుకు సంస్థాగత ఖాతాల సమాచారాన్ని అందిస్తుంది.
     
  • ఇన్ఫర్మేషన్‌ రిసోర్సెస్‌ : హెచ్‌-1బీ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులను సమాచార సెషన్‌లకు హాజరు కావడానికి యూఎస్‌సీఐఎస్‌ ప్రోత్సహిస్తుంది. సంస్థాగత ఖాతాలు, ఆన్‌లైన్ ఫైలింగ్ వివరాలు హెచ్‌ -1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో అందుబాటులో ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement