H1B Visa
-
అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా వర్కర్లంటే అమెరికా ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించే చౌక కార్మికులని, అక్కడి వేతనాల స్థాయిని కుదించేస్తారనేది అపోహ మాత్రమేనని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎకానమీ వృద్ధిలో భారతదేశం, భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహకు లోను కావాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన, 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో పరిణామాలేమీ భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్–1బీ వీసాలనేవి నాన్–ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు, వాటికి సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. హెచ్–1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభిస్తుండటమనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్‌కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడమనేది ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని సింగ్ చెప్పారు. భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడివారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేశాయని సింగ్ చెప్పారు. -
H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. మంగళవారం(జనవరి21) వైట్‌హౌజ్‌లో ట్రంప్ ఈ విషయమై ఒరాకిల్,ఓపెన్ఏఐ,సాఫ్ట్‌బ్యాంక్ సీఈవోలతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘హెచ్1బీ వీసాలపై విభిన్నమైన వాదనలున్నాయి. రెండు వాదనలకు నేను మద్దతిస్తున్నాను. నేను కేవలం ఇంజినీర్ల గురించే మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల్లో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హెచ్1బీ వీసాలపై నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవవనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒరాకిల్,సాఫ్ట్‌బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజినీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్‌మస్క్ హెచ్1బీ వీసాలకు మద్దతిస్తున్నారు.హెచ్1బీ వీసాల జారీని నేను ఆపడం లేదు’అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా, హెచ్1బీ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి. కొందరు హెచ్1బీ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ మాత్రం హెచ్1బీ వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు. #WATCH | Washington DC | On H1B visas, US President Donald Trump says, "... I like both sides of the argument but I also like very competent people coming to our country, even if that involves them training and helping others that may not have the qualifications... About HB1, I… pic.twitter.com/ALFRoHUWgD— ANI (@ANI) January 22, 2025 ఇదీ చదవండి: ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం -
హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ : వాళ్లకి నష్టం, భారతీయులకు ఇష్టం!
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కీలకమైన, మంచి వేతనాలను అందుకునే ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వారి ఉద్యోగ స్థితి ఆధారంగా అమెరికాలో ఉండటానికి అనుమతి లభిస్తుంది.పదవీ విరమణ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో తుది వలస విధాన సంస్కరణలలో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకీకరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మాత్రమే మరిన్ని అవకాశాలందించే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు సమాచారం. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ H-1B ఫైనల్ రూల్ , H-2 ఫైనల్ రూల్ ప్రకారం, H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ , H-2 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ల నిబంధనలు మారతాయి. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించిన H-1B వీసా ప్రోగ్రామ్ మార్పులు భారతీయులకే ఎక్కువ.2023లో H-1B వీసా హోల్డర్లలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయ నిపుణులు ఉన్నందున, ఈ మార్పులు వారికే ఎక్కువప్రయోజనం చేకూరుస్తాయి.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) "H-1B తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా, ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి మెరుగైన యజమానులను అనుమతించేందుకు H-1B ప్రోగ్రామ్‌ను ఆధునీకరిస్తుందని వెబ్సైట్లో అని పేర్కొంది. హెచ్-1బీ వీసా కీలక మార్పులు హెచ్-1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను 'స్పెషాలిటీ ఆక్యుపేషన్' కింద నియమించుకోవడం కంపెనీలకు ఇక సులభతరం. కంపెనీలు వారి నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా H-1B కార్మికులను నియమించుకోవచ్చు, F-1 విద్యార్థి వీసాల నుంచి హెచ్-1బీ వీసాలకు మారడం ఈజీ. ప్రాసెసింగ్ జాప్యం కూడా తగ్గుతుంది. యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.జనవరి 17, 2025 నుండి కొత్త రూల్ ప్రకారం ఫారం I-129 తప్పనిసరి అవుతుంది. హెచ్-1బీ వీసా ప్రక్రియను సరళీకృతం చేసే దిశగానే దీన్ని తీసుకొచ్చింది. అయితే మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకే ఈ మార్పులని విమర్శలు వినబడుతున్నాయి. హెచ్-1బీ వీసా మార్పులు అమెరికా ఉద్యోగులకు నష్టమని, అమెరికన్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని విమర్శించారు. మరోవైపు రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్పులను ఎంతవరకు అంగీకరిస్తారు? తిరిగి ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
ఒకే ఒరలో రెండు కత్తులు!
అమెరికా రిపబ్లికన్ పార్టీలో టెక్ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్ ప్రపంచాన్ని జయించాలని టెక్ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్ దగ్గర టెక్ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.మొన్న క్రిస్మస్ రోజు అమెరికా సోషల్ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలేమిటి ఈ వివాదం? వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను డోనాల్డ్ ట్రంప్ తన ఏఐ–పాలసీ సీనియర్ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్ ట్రోలింగ్ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్’ ఉద్యమానికి ట్రంప్ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు. కృష్ణన్ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్ కృష్ణన్ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్లో జాత్యహంకారం జడలు విప్పింది. జాతీయ వాదులు భారతీయ టెక్ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్ సిద్ధాంతం. హెచ్–1బి వీసా విధానానికి మస్క్ మద్దతునిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్ టీమ్ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్ పొసొబిక్ బదులిచ్చాడు. వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ రంగంలోకి దిగాడు. హెచ్–1బి వీసాలు పెద్ద స్కామ్ అనీ, వాటిని సమర్థించి మస్క్ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.నిజానికి హెచ్–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. సయోధ్య కుదిరేనా?రిపబ్లికన్ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఒక ఉదాహరణ. పీటర్ థియల్ అనే మితవాద టెక్ బిలియనీర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్ హెచ్–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.ట్రంప్ పదవి చేపట్టిన తర్వాత టెక్ రైట్–నేషనలిస్ట్ రైట్ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్ గత హయాంలోనూ ఇదే జరిగింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్ రైట్‌కే ప్రాధాన్యం?ఈసారి టెక్ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్–డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న మెంట్ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. ఇక శ్రీరామ్ కృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్ క్యాబినెట్లో చోటు లభించనుంది.ట్రంప్ ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్‌కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. అలీ బ్రెలాండ్ వ్యాసకర్త సీనియర్ పత్రికా రచయిత(‘ది అట్లాంటిక్’ సౌజన్యంతో) -
భారత్‌కు తిరిగిరాకుండానే హెచ్1బీ రెన్యూవల్!
వాషింగ్టన్: ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్–1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు తమ వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది. చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్–1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే రెన్యూవల్‌కు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్–1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యువల్ సుసాధ్యమైంది. ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్–1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే. ఎందుకంటే ఏటా హెచ్–1బీ వీసాదారుల్లో భారతీయులే గణనీయమైన స్థాయిలో ఉన్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్–1బీ వీసాలు మంజూరైతే అందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. 2022 ఏడాదిలో ఏకంగా 77 శాతం వీసాలను మనవాళ్లే ఒడిసిపట్టారు. వీసా రెన్యూవల్ స్టాంపింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చుపెట్టి విమాన టికెట్లు కొనుగోలు చేసి భారత్‌కు తిరిగి రావడం, వీసా అపాయిమెంట్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ సమస్యలు, దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు చాలా రోజులు వేచి ఉండటం, తిరిగి మళ్లీ లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు తిరిగిరావడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. స్వదేశంలో రెన్యూవల్ అమలైతే ఈ బాధలన్నీ తీరతాయని అక్కడి హెచ్–1వీ వీసాలున్న భారతీయులు ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచనప్రాయంగా తెలిపింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాలకు పూర్తి మద్దతు తెలిపిన తరుణంలో అమెరికా గడ్డ మీదనే వీసా రెన్యూవల్ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుండటం గమనార్హం. హెచ్–1బీతోపాటు విద్యార్థి వీసా కోటాలోనూ భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఏడాది అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏకంగా 3,31,000 మంది భారతీయులు విద్యార్థి వీసాలు పొందారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్తుల్లో భారతీయుల సంఖ్యే అధికం. 2008/09 విద్యాసంవత్సరం నుంచి చూస్తే ఇంతమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే తొలిసారి. -
డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు!
హెచ్–1బీ వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతుందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతుండటం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది లక్ష మంది విద్యార్థులుఅంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ –1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఎఫ్–1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికా లో అత్యధి కంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి హెచ్–1బీ వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. కోర్టు చెప్పినా... విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్‌ను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్టెక్) కోర్టుకెళ్లింది. అయితే, కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. మరోసారి చర్చలు.. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ‘‘ఓపీటీ ప్రోగ్రామ్ విదేశీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యా లయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తు న్నాయి. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) తరహాలో చట్టవి రుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యు యేట్లను రక్షించడానికి ఈ ఓపీటీని రద్దు చేయాలి’’ అని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్.. ఎక్స్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం.. యూఎస్ జాబ్ మార్కెట్లలోకి దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది. ప్రశ్నార్థకంగా భవిష్యత్...అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతు దారులు సైతం.. హెచ్–1బీ వీసాలపై మండిపడుతున్నారు. హెచ్–1బీ వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభా వంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌తోపాటు.. ఎలన్ మస్క్, వివేక్ రామ స్వామి వంటి ప్రముఖులు చెబుతు న్నారు. ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమ ర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ కార్య క్రమం భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నా ర్థకంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్మార్ట్ పీపుల్ కావాలి
వాషింగ్టన్: స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రిపబ్లికన్ల ఎన్నికల హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్–1బీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ సహ సారథి వివేక్ రామస్వామి సమర్థిస్తున్న వేళ కాబోయే అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్–1బీ వీసాలను సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ కేవలం సమర్థవంతులైన వ్యక్తులే అవసరమని ట్రంప్ నొక్కి చెప్పారు. ‘‘ అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థవంతులైన వ్యక్తులే కావాలని నేను ఆశిస్తా. స్మార్ట్ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగ బోతోంది. దేశానికి నైపుణ్యవంతమైన కార్మికుల అవసరం చాలా ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం అమెరికాలోని మార్–ఏ–లాగో రిసార్ట్‌లో ట్రంప్‌ను స్థానిక మీడియా పలకరించింది. ‘‘హెచ్–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదు. నిఫుణులే అమెరికాకు కావాలి’’ అని స్పష్టంచేశారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీ వీసాల జారీని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, వారికి ఇప్పటికే ట్రంప్ మద్దతు పలకడం తెల్సిందే. అయితే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చారు. మొదట్నుంచీ తాను హెచ్–1బీకి అనుకూలమేనని పునరుద్ఘాటించారు. కేవలం అత్యంత నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తూ స్థానిక సాధారణ, తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు భవిష్యత్తులో పెరిగే ప్రమాదముందని రాజకీయ పండితుడు క్రేగ్ ఆగ్రనోఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఐటీ రంగంలో ముఖ్యమైన ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే తన్నుకు పోతే స్థానిక ఐటీ ఉద్యోగార్థుల పరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నకు ఇంతకాలం ఏ నేతా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని క్రేగ్ వ్యాఖ్యానించారు. స్థానిక అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ నైపుణ్యాలున్న విదేశీయులు లభిస్తుండటంతో అమెరికన్ కంపెనీలు హెచ్–1బీ వీసా విధానం ద్వారా విదేశీయులకే అధిక ప్రాధాన్యతనిచ్చి అమెరికాకు రప్పిస్తుండటం తెల్సిందే. -
హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically. I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు.. 👉తాజాగా.. వైట్‌హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్‌గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. -
హెచ్–1బీ వీసాలకు ట్రంప్ దన్ను
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు. -
ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం
హెచ్-1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ సంస్కరణల విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్'(Elon Musk) మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్-1బీ వీసాలను వ్యతిరేకిస్తున్న వారిపై బూతు ప్రయోగం కూడా చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.స్పేస్ ఎక్స్ఎం, టెస్లా వంటి కంపెనీలను స్థాపించడానికి మాత్రమే కాకుండా.. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం హెచ్-1బీ వీసా (H-1B Visa) అని మస్క్ స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాల కారణంగానే దేశం బలమైన దేశంగా అవతరించింది. కాబట్టి వీసాలను వ్యతిరేకిస్తున్నవారు ఓ అడుగు వెనక్కి వేయండి అని టెస్లా బాస్ అన్నారు.నిజానికి హెచ్-1బీ వీసాలను జారీ చేయడం వల్ల అమెరికాలోని ఉద్యోగాలను బయటి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయనంటే ఈ వీసాల జారీ చేయకూడదని కరడుగట్టిన రిపబ్లికన్లు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.The reason I’m in America along with so many critical people who built SpaceX, Tesla and hundreds of other companies that made America strong is because of H1B.Take a big step back and FUCK YOURSELF in the face. I will go to war on this issue the likes of which you cannot…— Elon Musk (@elonmusk) December 28, 2024త్వరలో ప్రారంభం కానున్న ట్రంప్ క్యాబినెట్‌లోని.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కో-హెడ్స్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాల ద్వారా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అమలు చేయనున్నారు. దీనిపై కూడా కొన్ని వ్యతిరేఖ నినాదాలు వినిపిస్తున్నాయి.10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలుఇదిలా ఉండగా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది. ఇందులో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం. -
హెచ్1బీ వీసాల రక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమే
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్క అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది. -
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్.. సోషల్ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్ఫ్లుయెన్సర్.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో చీప్ లేబర్ అంటూ భారతీయులను, ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌ను కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్ వివాదాస్పద పోస్టులు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదానికి శ్రీరామ్ కృష్ణన్ ద్రోహం చేస్తున్నాడని, గ్రీన్‌కార్డుల విషయంలో అతని వైఖరి భారత్‌లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని.. తద్వారా అమెరికాలోని STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) గ్రాడ్యుయేట్స్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతోందామె. అదే టైంలో..హెచ్1బీ వీసాల విషయంలోభారతీయులపై వివక్షాపూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, ఉషా వాన్స్లాంటి వాళ్లు అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు. ‘‘నేను ఓటేసింది అమెరికాను మరోసారి గొప్పగా తయారు చేస్తారని. అందుకోసం హెచ్1బీ వీసాలను తగ్గిస్తారని.అంతేగానీ పెంచుకుంటూ పోతారని కాదు. భారత్‌లో అంత మేధోసంపత్తి ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా.అమెరికాకు వలస రావడం దేనికి?. అంత హైస్కిల్ సొసైటీ అయితే.. ఇలా చెత్తకుప్పలా ఎందుకు తగలడుతుంది?( తాను పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ..)..@VivekGRamaswamy knows that the Great Replacement is real. So does @JDVance. It’s not racist against Indians to want the original MAGA policies I voted for. I voted for a reduction in H1B visas. Not an extension. And I would happily say it to their face because there’s nothing… https://t.co/vO2e33USE1 pic.twitter.com/EH4hpJxiNH— Laura Loomer (@LauraLoomer) December 24, 2024మీకు భారతీయుల్లాంటి చీప్ లేబర్ కావాలనే కదా వీసా పాలసీలను మార్చేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే.. నేనూ రేసిస్ట్ అనే విషయాన్ని అంగీకరిస్తా. మీలాంటి ఆక్రమణదారులు నిజమైన ట్రంప్ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటారు. కానీ, ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను. అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే(Make America Great Again) ఉద్దేశమూ లేదు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు’’ అని తీవ్ర స్థాయిలో సందేశాలు ఉంచారు. ఇంతకు ముందు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్ ఈ తరహాలోనే జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని..టెక్ బిలియనీర్లు మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో ఎక్కువసేపు గడుపుతూ.. తమ చెక్ బుక్‌లను విసిరేస్తున్నారు. అలాంటివాళ్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు. తద్వారా.. భారత్, చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలు రప్పించుకోవచ్చనేది వాళ్ల ఆలోచన అయి ఉండొచ్చు అంటూ ఆ పోస్టులోనే ఆమె ప్రస్తావించారు.Quite the change of tune. Wonder if he got “the call”. pic.twitter.com/o1Gp8dNYyo— Laura Loomer (@LauraLoomer) December 28, 2024కాంట్రవర్సీలకు జేజేమ్మ!31ఏళ్ల వయసున్న లారా ఎలిజబెత్ లూమర్.. పోలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జర్నలిస్ట్ కూడా. మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే. గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసి ఓడారామె. ఆపై కొన్ని క్యాంపెయిన్లను ముందుండి నడిపించారు. తాను ఇస్లాం వ్యతిరేకినంటూ బహిరంగంగా ప్రకటించి.. ఆ మతంపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు.. తన ద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్స్ యాప్స్, ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి.కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే.. రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. అధ్యక్ష రేసు బైడెన్ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ట్రంప్‌ను ప్రొత్సహించి లూమర్ను ప్రచారకర్తగా నియమించారు. ఆ టైంలో ట్రంప్‌తో ఆమెకు అఫైర్ ఉన్నట్లు కథనాలు రాగా.. ఆమె వాటిని ఖండించారు. ఒకరకంగా చూసుకుంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వొచ్చు. అలాంటి లూమర్ ఇప్పుడు.. ట్రంప్ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది. మస్క్ సొంత ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగానే ఆమె తీవ్ర పదజాలంతో సందేశాలు పోస్ట్ చేస్తుండడం గమనార్హం. ‘‘ఎలాన్ మస్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయెన్సీ(DOGE) బాధ్యతలు అప్పగించడం సుద్ధ దండగ. అతనొక స్వార్థపరుడు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్(MAGA) పేరుతో ఇమ్మిగ్రేషన్ పాలసీలలో తలదూర్చాలనుకుంటున్నాడు. తద్వారా అమెరికన్ వర్కర్లకు హాని చేయాలనుకుంటున్నాడు. వివేక్ రామస్వామి చేస్తున్న క్యాంపెయిన్ ఎందుకూ పనికి రానిది. రిపబ్లికన్లు అతిత్వరలో వీళ్లను తరిమికొట్టడం ఖాయం. మస్క్, రామస్వామిలు ట్రంప్‌కు దూరం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని విమర్శించిందామె. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆమెపై వెటకారంగా ఓ పోస్ట్ చేసి వదిలేశాడు..@VivekGRamaswamyThe technocratic state is more dangerous than the administrative state.Your silence on the censorship of those who wanted to put a limit on the power of big tech is deafening.DOGE can’t be allowed to be utilized as a vanity project to enrich Silicon Valley. https://t.co/81EYNTLkqx— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే.. మస్క్ తేలికగా తీసుకుంటున్నా లూమర్ మాత్రం తన విమర్శల దాడిని ఆపడం లేదు. మస్క్ పచ్చి స్వార్థపరుడని, చైనా చేతిలో పావు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో మస్క్ ఎక్కువసేపు గడుపుతున్నాడని.. తనకు లాభం వచ్చే పనులు ట్రంప్‌తో చేయించుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడని, తన స్నేహితుడు జీ జిన్‌పింగ్(చైనా అధ్యక్షుడు) కోసమే ఆరాటపడుతున్నాడంటూ తిట్టిపోసింది.ఎగిరిపోయిన బ్లూ టిక్.. మరో చర్చతప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు పోస్ట్ చేస్తోందన్న కారణాలతో.. గతంలో లారా లూమర్(Laura Loomer) ట్విటర్ అకౌంట్‌పైనా నిషేధం విధించారు. అయితే ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలుచేసిన కొన్నాళ్లకే..ఫ్రీ స్పీచ్ పేరిట చాలా మంది అకౌంట్లు పునరుద్ధరణ అయ్యాయి. అందులో ట్రంప్ అకౌంట్ కూడా ఉందన్నది తెలిసిందే. I mean right after @elonmusk called me a troll today, my account verification was taken away, my subscriptions were deactivated and I was banned from being able to buy premium even though I was already paying for premium.Clearly retaliation. https://t.co/fVskKH9Trg— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే తాజాగా లారా ఎలిజబెత్ లూమర్ హెచ్1బీ వీసాల వ్యవహారంతో ఎలాన్ మస్క్‌నే టార్గెట్ చేయడంపై.. ఆమెపై ఎక్స్(పూర్వపు ట్విటర్) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అకౌంట్ నుంచి బ్లూ టిక్ ఎగిరిపోవడంతో పాటు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. ట్విటర్(ఇప్పుడు ఎక్స్) కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్.. ఇప్పుడు తోక ముడిచారా? అని ఆమె ప్రశ్నించారు. -
భారతీయులకు 10 లక్షలకు పైగా అమెరికా వీసాలు
భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది.గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చదువుకోవడానికి వెల్లవారు మాత్రమే కాకుండా, సందర్శనార్ధం వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఇటీవల జారీ చేసిన 10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలలో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం.హెచ్-1బీ (H-1B) వీసాల రెన్యువల్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమలు చేసింది. దీని వల్ల ఎంతోమంది భారతీయులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాగా.. గత నాలుగు సంవత్సరాలలో భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. 2024 మొదటి 11 నెలల్లో 20 లక్షల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ యుఎస్ వెళ్లారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 26 శాతం ఎక్కువ.ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు యుఎస్‌ని సందర్శించడానికి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వీసాలను ప్రతిరోజూ జారీ చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.చదువుకోవడానికి ఇండియా నుంచి అమెరికా (America) వెళ్లే విద్యార్థులకు కూడా వీసాలను జారీ చేస్తున్నారు. ఈ వీసాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంటే అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2008 - 2009 విద్యాసంవత్సరంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశంగా 'భారత్' రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 3,31,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ఛేంజ్ విజిటల్ వీసాలు పొందిన భారతీయులు కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉండగలుగుతున్నారు. USలో వారి ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండవచ్చు. కాబట్టి ఇది వారి కెరీర్, విద్యను కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్స్ఛేంజ్ విజిటర్స్ స్కిల్స్ లిస్ట్ నుంచి ఇండియాను తొలగించడం వల్ల భారతీయ J-1 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఎక్కువ సౌలభ్యం లభించింది. మొత్తం మీద భారతదేశం నుంచి అమెరికాకు వివిధ కారణాల వల్ల వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్‌మెంట్‌ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులుయూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.సింపుల్‌గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులుఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలుమార్పులు ఎందుకంటే?హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్‌లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి. -
భారతీయులకు బైడెన్ గుడ్‌న్యూస్.. ఇకపై హెచ్1బీ వీసా ఈజీ!
-
హెచ్–1బీ వీసా సులభతరం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద వేగంగా ఉపాధి పొందాలనుకునే భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. వేగంగా ఉపాధి కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్–1బీ వీసా నిబంధనల్లో కీలకమార్పులు చేసింది. దీంతో హెచ్–1బీ వీసా పొందడం మునపటితో పోలిస్తే అత్యంత సులభంకానుంది. అమెరికా కంపెనీలు తమ ఉద్యోగాల కోసం విదేశీయులను ఎంపికచేసుకునే ప్రక్రియను సులభతరంచేయడం ఇందుకు మరో కారణం. నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీ, అనుమతి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిబంధనల సడలింపు ప్రక్రియ వంటి నిర్ణయాలు 2025 జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎఫ్–1 విద్యార్థి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులు ఇకపై సులువుగా తమ వీసాను హెచ్–1బీ వీసాగా మార్చుకోవచ్చు. దీంతో వీరికి అక్కడి కంపెనీలు వేగంగా ఉద్యోగాలు కల్పించేందుకు వీలవుతుంది. థిరిటికల్, టెక్నికల్ నిపుణులుగా వీరికి ఉద్యోగాచ్చేందుకు అక్కడి సంస్థలకు అవకాశం చిక్కుతుంది. అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్లుగా, ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా అమెరికన్ సంస్థలను తీర్చిదిద్దే లక్ష్యంతో వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం ప్రకటించింది. అమెరికా సంస్థలు కార్మిక కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 20వ తేదీన నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిరోజుల ముందు బైడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వేగ వంతం చేయనుంది. ‘‘హెచ్–1బీ వీసా విధానం ద్వారా అమెరికా సంస్థలు అత్యంత నైపుణ్యమైన ఉద్యోగులకు నియమించుకునే అవకాశాలను విస్తృతంచేశాం. దీంతో అంతర్జాతీయ మేధతో అన్ని రంగాల్లో అమెరికా ఎంతో ప్రయోజనం పొందనుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి అలెజాండ్రో ఎన్.మయోర్కాస్ చెప్పారు. ‘‘1990లో హెచ్–1బీ విధానం మొదలెట్టాక అమెరికా దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఈ పద్దతిని నవీకరించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు’’అని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం.జడ్డూ హెచ్–1బీ విధానాన్ని మెచ్చుకున్నారు.భారతీయులకు ఏ రకంగా ఉపయోగం?యూఎస్సీఐఎస్ ద్వారా హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం ఏటా లాటరీ విధానం ద్వారా కేవలం 65,000 వరకు హెచ్–1బీ వీసాలనే జారీచేసేది. అడ్వాన్స్డ్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న సందర్భాల్లో మరో 20వేల హెచ్– 1బీ వీసాలనే ఇచ్చేది. ఈ కోటా పరిమితి అనేది ఇన్నాళ్లూ లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు లేదు. దీంతో ఈ నిబంధనలోని లొసుగును దుర్వినియోగం చేస్తూ చాలా మంది ‘రీసెర్చ్’మాటున వీసాలు సాధించారని, దీంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్య అభ్యర్థులకు లాటరీ ద్వారా వీసా పొందే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు ఉండేవి. దీంతో వీటికి చెక్ పెడుతూ ఇకపై లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు తొలిసారిగా కోటా పరిమితిని విధి స్తూ, కోటాను నిర్వచిస్తూ నిబంధనల్లో మా ర్పులు తెచ్చారు. దీంతో నాన్‌ప్రాఫిట్, గవర్న మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి పోటీ తగ్గి ఆ మేరకు భారతీయులకు లాటరీలో అధిక ప్రా ధాన్యత, లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నా రు. ప్రతి ఏటా హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటున్నారు. -
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్డేట్స్F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. -
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్‌లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్‌లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్‌పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు. యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ల కోసం వెతుకుతున్నాను. నవంబర్‌లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.డ్రాప్‌బాక్స్ స్కీమ్ అంటే?డ్రాప్‌బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్‌బాక్స్ అపాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది. H1B Dropbox Visa Slots for India are a Nightmare!byu/AccomplishedPolicy94 inusvisaschedulingచదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్‌గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్‌లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్‌గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్‌లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
లేఆఫ్స్‌కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
అగ్రరాజ్యం అమెరికా హెచ్-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్‌ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్ నుంచి బడబడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్‌కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.ఫలితంగా లేఆఫ్స్ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్ పిరయడ్ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రేస్ పిరయడ్లో నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్చుకునేందుకు అప్లయ్ చేసుకోవచ్చు.స్టేటస్ అప్లికేషన్‌ను అడ్జెస్ట్మెంట్ చేయాలని కోరుతూ ఫైల్ చేయొచ్చు. ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. -
అమెరికా వెళ్లేవారికి అలర్ట్: కొత్త ఫీజులు రేపటి నుంచే..
అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. వీసా కొత్త ఫీజులు ఇలా.. కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది. ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి.