
అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ ఉపశమనం కలగనుంది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఇక వీసాల అనుమతులు,స్లాట్‌ల గురించి వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం.
♦ రాయబార కార్యాలయంలో లక్ష హెచ్ - 1బీ వీసాలకు డ్రాప్‌బాక్స్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 26 వేల స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది
♦ హెచ్-1బీ, బీ1/ బీ2 డ్రాప్ బాక్స్ కోసం వేచి ఉండే సమయాన్ని 9 నెలలకు తగ్గించగలిగాం.
♦ ఎంబసీ ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులు వీసాల అనుమతి కోసం సంబంధిత అధికారులకు అప్లికేషన్‌లను నిర్విరామంగా పంపిస్తున్నారు.
♦ వచ్చే ఏడాది మే నెల నుంచి హెచ్-1బీ వీసా డ్రాప్ బాక్స్‌కోసం వేచి చూసే సమయం 9 నెలల నుంచి 4 లేదా 5 నెలలకు తగ్గుతుందని, దశల వారిగా 3 నెలలు ఇలా సమయం తగ్గించే ప్రయత్నం చేస్తామని మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ వివరించారు.
#CNBCTV18Exclusive | #DropBox cases in categories of #student visas, H-1B & L visa & B1/B2 visas are a priority. 1,28,000 H-1B applicants in the queue for H-1B Drop Box applications, says Don Heflin, Minister Counselor for Consular Affairs pic.twitter.com/WapB7vPdtV
— CNBC-TV18 (@CNBCTV18Live) November 22, 2022