
హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులకు అమెరికా కొత్త నిబంధనలు
వాషింగ్టన్: వీసాల విషయంలో రోజుకో కొత్త నిబంధనతో ఆశావహులకు అమెరికా చుక్క లు చూపుతోంది. హెచ్–1బీ వీసా దరఖా స్తుదారులు ఇంటి చిరునామా, బయో మెట్రిక్ డేటా వంటి వ్యక్తిగత సమాచారం అందజే యాలని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మి గ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) తాజాగా ఆదేశించింది.
ఈ మేరకు వివరాలు సమర్పించాలంటూ వారికి రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్‌ఎఫ్‌ఈ) జారీ చేస్తోంది. అమె రికాలోని 240కి పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదవాలని కలలుగనే అంతర్జాతీయ విద్యార్థు లకు ఇది కొత్త సమస్యగా మారనుంది. దీని వెనక ఉద్దేశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. హెచ్–1బీ వీసా దరఖాస్తులకు బయోమెట్రిక్స్ అవస రమే ఉండదని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు అంటున్నారు.