new rule
-
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!పలు ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. -
వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!
అక్కడ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.కొత్త రూల్ ఎందుకంటే..తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు! -
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
టోల్ ఫీజు మినహాయింపు ఇక లేదు..
టోల్ ఫీజు మినహాయింపునకు సంబంధించిన మూడేళ్ల నాటి పాత నిబంధనలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఉపసంహరించుకుంది. టోల్ బూత్‌ల వద్ద ఫీజు వసూలు ఎక్కువ సమయం పట్టి వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాటిని టోల్ ట్యాక్స్ లేకుండానే అనుమతించాలని నిబంధన ఉండేది. దాన్ని ఎన్హెచ్ఏఐ తాజాగా తొలగించింది.ఎన్హెచ్ఏఐ 2021 మేలో జారీ చేసిన నిబంధన ప్రకారం ప్రతి టోల్ బూత్ వద్ద ఒక్కో వాహనం ముందుకు కదిలే సమయం 10 సెకన్ల కంటే తక్కువగా ఉండాలి. ఏ లేన్‌లోనైనా వాహనాల వరుస టోల్ బూత్ నుండి 100 మీటర్లకు మించకూడదు. టోల్ బూత్ నుండి 100 మీటర్ల దూరం దాటి వాహనాలు క్యూ పెరిగితే టోల్ వసూలు చేయకుండా వాటిని అనుమతించాలి. ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న టోల్ బూత్‌లు, భూసేకరణ పూర్తికాని టోల్ ప్లాజాల కోసం ఎన్హెచ్ఏఐ ఈ నిబంధనను రూపొందించింది.అయితే, ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఎన్హెచ్ఏఐ 2021 నాటి ఆ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు, ప్రజల నుండి వచ్చిన విమర్శల తర్వాత ఈ నిబంధనను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. ఎన్హెచ్ఏఐ ఇప్పుడు లాంగ్ లైన్లను నిర్వహించడానికి లైవ్ ఫీడ్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. టోల్ ప్లాజాల నిర్వహణకు సంబంధించి ఎన్హెచ్ఏఐ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయానికి వర్తించే నిబంధనలు తక్షణమే రద్దవుతాయి. ఎందుకంటే ఎన్‌హెచ్ ఫీజు రూల్స్ 2008లో అటువంటి మినహాయింపు ప్రస్తావన లేదు. -
పొరబాటు చేసినా రెండ్రోజుల్లో డబ్బు వాపస్!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సింపుల్‌గా యూపీఐ (UPI) దేశంలో ఒక విప్లవంలా వచ్చింది. లావాదేవీల అలవాట్లను ఇది పూర్తిగా మార్చేసింది. నగదు చెల్లింపులు సులభతరం అయ్యాయి. కేవలం ఒక్క స్కాన్‌తో రెప్పపాటులో డబ్బును పంపవచ్చు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా వేరొకరి యూపీఐ ఐడీ లేదా ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటారు. ఇలా జరిగితే భయపడాల్సిన పనిలేదు.యూపీఐ లావాదేవీల్లో పొరపాట్ల విషయంలో ఆందోళనలను పరిష్కరిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పొరపాటున యూపీఐ ఐడీకి డబ్బును బదిలీ చేస్తే, 24 నుంచి 48 గంటలలోపు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. పంపినవారు, స్వీకరించేవారు ఇద్దరూ ఒకే బ్యాంకును ఉపయోగించినప్పుడు, వాపసు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అదే వేరువేరు బ్యాంకులు అయితే వాపసు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు.పొరపాటు జరిగితే చేయాల్సినవి..పొరపాటున పంపిన డబ్బు ఎవరికి చేరిందో ఆ వ్యక్తిని సంప్రదించండి. లావాదేవీ వివరాలను తెలిపి డబ్బును తిరిగి పంపమని అభ్యర్థించవచ్చు.తప్పు యూపీఐ లావాదేవీ జరిగినప్పుడు వెంటనే యూపీఐ యాప్‌లో కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో మాట్లాడండి. లావాదేవీ వివరాలను వారికి ఇవ్వండి.యూపీఐ చెల్లింపు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. కాబట్టి తప్పు యూపీఐ లావాదేవీ జరిగితే ఎన్‌పీసీఐకి ఫిర్యాదు చేయవచ్చు.మీ డబ్బును తిరిగి పొందడానికి, డబ్బు కట్ అయిన బ్యాంకును సంప్రదించండి. మీ డబ్బును తిరిగి పొందడానికి బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది.యూపీఐ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
14 ఏళ్ల ట్యాక్స్ ఒకేసారి చెల్లించాలట!.. కొత్త రూల్
భారత్ (BH) సిరీస్ నంబర్ ప్లేట్లను ఎంచుకునే వ్యక్తులపై రవాణా శాఖ గణనీయంగా పన్ను భారాన్ని మోపింది. ఇంతకు ముందు రెండు సంవత్సరాలకు ఒకసారి పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు 14 ఏళ్లకు ఒకేసారి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్లను ప్రవేశపెట్టడంతో భారత ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేసింది. రహదారి, రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ద్వారా 2021 నుంచి రవాణాశాఖ బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్స్ జారీ చేస్తోంది. ఉద్యోగరీత్యా రాష్ట్రాలు మారే వ్యక్తులు ఈ సిరీస్ నెంబర్స్ కొనుగోలు చేశారు. ఈ నెంబర్ ప్లేట్స్ కోసం వాహనదారులు కేంద్ర రోడ్డు రవాణా శాఖకు చెందిన పరివాహన్ వెబ్సైట్లోకి వెళ్లి బీహెచ్ నంబర్ ప్లేటు కోసం అప్లై చేసుకోవచ్చు.దేశంలో ఇప్పటి వరకు బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్స్ కలిగిన వాహనాలు 731 ఉన్నట్లు సమాచారం. ఈ వాహనదారులు ఇప్పుడు ఒకేసారి 14 సంవత్సరాలకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపుల కోసం 60 రోజుల వ్యవధి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.ఏ వాహనానికి ఎంత ట్యాక్స్‌రూ.10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన వాహనాలకు 8 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ధర కలిగిన వాహనాలకు 10 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలకు 12 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. -
26 నుంచి కొత్త టెలికం చట్టం
న్యూఢిల్లీ: టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 కింద కొన్ని నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885.. వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం, 1993.. టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం, 1950 స్థానంలో కొత్త చట్టం పాక్షికంగా అమలు కానుంది. ‘‘ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023 అమలు తేదీని జూన్ 26గా నిర్ణయించడమైనది. నాటి నుంచి చట్టంలోని 1, 2, 10 నుంచి 30 వరకు, 42 నుంచి 44 వరకు, 46, 47, 50 నుంచి 58 వరకు, 61, 62 సెక్షన్లు అమల్లోకి వస్తాయి’’అని ప్రభుత్వ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కొత్త చట్టంలోని నిబంధనల కింద కేంద్ర సర్కారు జాతి భద్రత ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలికమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌లు లేదా సేవలను తన ఆ«దీనంలోకి తీసుకోవడంతోపాటు నిర్వహించగలదు. స్పామ్, హానికారక కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి (సమాచారం) వినియోగదారులకు రక్షణ కలి్పంచడం తప్పనిసరి. -
జూన్ 1 నుంచి సెబీ కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: మార్కెట్ వదంతుల ప్రభావంతో షేర్ల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని కట్టడి చేసే దిశగా సెబీ కొత్త నిబంధనలు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇవి టాప్ 100 లిస్టెడ్ కంపెనీలకు వర్తిస్తాయి. డిసెంబర్ 1 నుంచి తదుపరి 150 కంపెనీలకు వర్తిస్తాయి. వీటి ప్రకారం తమ షేర్ల ధరలను ప్రభావితం చేసే వదంతులేవైనా వస్తే లిస్టెడ్ కంపెనీలు 24 గంటల్లోగా ధృవీకరించడమో లేదా ఖండించడమో లేదా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఈ) డీల్స్ విషయంలో ’అప్రభావిత ధర’ కాన్సెప్టును కూడా సెబీ ప్రతిపాదించింది. దీని ప్రకారం వదంతుల ప్రభావమేమీ లేనప్పుడు షేరు సగటు ధర ఎంత ఉందో దాన్ని ఎంఅండ్‌ఈ డీల్స్ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. దీన్ని లెక్కించేందుకు సెబీ నిర్దిష్ట విధానాన్ని సూచించింది. -
రైల్వే రిజర్వేషన్లో కొత్త రూల్! ప్రాధాన్యత వారికే..
రైల్వే రిజర్వేషన్, బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్‌ను అమలు చేసింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే నిబద్ధతను ఈ నిబంధన తెలియజేస్తుంది. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లను పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం.. ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపులు లభ్యతకు లోబడి ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్నవారికి ముందుగా ప్రాతిపదికన లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. లోయర్ అవసరమైన ప్రయాణికులు రైలు టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించవచ్చని, లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
క్రికెట్లో కొత్త రూల్.. రేపటి నుంచే అమల్లోకి..!
పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఉన్న ఆదరణను కాపాడుకుంటూనే ఈ ఫార్మాట్లలో వేగం పెంచే దిశగా అడుగులు వేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. డిసెంబర్ 12 నుంచి పొట్టి ఫార్మాట్లో కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది. విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి ఐసీసీ "స్టాప్ క్లాక్" అనే నిబంధనను ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవల వెల్లడించింది. స్టాప్ క్లాక్ రూల్ పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓవర్‌కు ఓవర్‌కు మధ్య అధిక సమయం వృధా అవుతుందని భావిస్తున్న ఐసీసీ.. ఈ ఫార్మాట్లలో మరింత వేగం పెంచేందుకు ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్‌గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్‌ను దించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్‌కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్ 21న అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం - రోజుకి రూ.100 జరిమానా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొత్త నిబంధనలను ప్రకటించింది. కస్టమర్ ఒక కంప్లైంట్ దాఖలు చేస్తే దాన్ని ఆ రోజు (తేదీ) నుంచి 30 రోజుల వ్యవధిలో పరిష్కరించాలి. ఆలా కానట్లయితే 31 రోజు నుంచి బ్యాంకు వినియోగదారునికి రోజుకి రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ అప్డేట్ చేసిన సమాచారాన్ని 21 రోజులలోపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సమర్పించినప్పటికీ, ఫిర్యాదు 30 రోజులలోపు పరిష్కారం కాకుంటే ఫిర్యాదుదారుకు రోజుకు 100 రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్.. సమస్య 31వ రోజు తరువాత పరిష్కారమైతే ఫిర్యాదుదారుకు పరిహారం మొత్తం కంప్లైంట్ పరిష్కారమయిన 5 పని రోజులలోపు బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. క్రెడిట్ సంస్థలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పరిహారం అందించకపోతే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, 2021 కింద RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. -
20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..
అంతర్జాతీయ వ్యయాలపై కేంద్రం పెంచిన 20 శాతం టీసీఎస్ (TCS) పన్ను అక్టోబర్ 1 నుంచే అమలు కానుంది. సరళీకృత రెమిటెన్స్ పథకం (LRS) కింద ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల పరిమితికి మించి చేసిన విదేశీ ఖర్చులపై మూలం వద్ద ఈ పన్నును వసూలు చేస్తారు. విద్య లేదా వైద్య సంబంధ చెల్లింపులు మినహా ఇతర విదేశీ ఖర్చులపై ఈ పన్నును కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా అక్టోబర్ 1 నుంచి 20 శాతం ఉంటుంది. LRS కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. LRS చెల్లింపులు, వారి వెల్లడించిన ఆదాయాల మధ్య వ్యత్యాసాలను గుర్తించిన ఆర్థిక శాఖ LRS కింద కొత్త టీసీఎస్ రేట్లను 2023 బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించింది. కొత్త రేట్లు వైద్య లేదా విద్యా ఖర్చులపై ఎటువంటి మార్పును తీసుకురానప్పటికీ, రియల్ ఎస్టేట్, బాండ్లు, విదేశీ స్టాక్‌లు, టూర్ ప్యాకేజీలు లేదా ప్రవాసులకు పంపే బహుమతులు వంటి వాటికి చేసే ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 206C, సబ్-సెక్షన్ 1G ప్రకారం.. LRS లావాదేవీలపై, విదేశీ టూర్ ప్యాకేజీల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం టీసీఎస్‌ను వసూలు చేస్తుంది. -
వాట్సాప్‌లో హార్ట్ సింబల్స్ పంపుతున్నారా.. మీకు జైలు శిక్షే
ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ ఫ్రెండ్లీగా, ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడకుండా ఉండలేరేమో.యూత్‌లోనూ వాట్సాప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఏదైనా చెప్పాలన్నా, రియాక్ట్ అవ్వాలన్నా మెసేజ్‌లో టైప్ చేసేవారు. కానీ ఇప్పుడంతా ఎమోజీల కాలం అయిపోయింది. ప్రేమ, కోపం, బాధ, సంతోషం, ఆకలి..ఇలా ఏ ఫీలింగ్ అయినా ఒక్క ఎమోజీలో చెప్పేస్తున్నారు. అయితే అడ్డదిడ్డంగా ఎమోజీలు వాడితే జైలుకి వెళ్లాల్సి వస్తుందట. ఈ కొత్త రూల్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఎలాంటి ఎమోజీలు వాడకూడదు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. వాట్సాప్ వాడనిదే రోజు గడవని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్రతిరోజూ అవసరం కోసమో, ఏదైనా విషయాన్ని చెప్పాలన్నా వాట్సాప్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఇక ప్రేమలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల కంటే ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ముఖ్యంగా హార్ట్ ఎమోజీలతో ఇంప్రెస్ చేసేస్తుంటారు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు హార్ట్ సింబల్స్ పంపిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందట. వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు ఒకవేళ ఇదే నేరం మళ్లీ చేస్తే రూ. 60 లక్షల జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు. కఠినమైన ఆంక్షలు, నిబంధనలు అమలయ్యే సౌదీ అరేబియాలో తాజాగా ఇలాంటి కొత్త తరహా రూల్‌ను తెచ్చి పెట్టింది అక్కడి ప్రభుత్వం. దీంతో తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, అనవసరమైన చిక్కుల్లో పడకుండా సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్‌గా మార్చేందుకు ఈ కొత్త ప్రయత్నమని వివరించారు. -
ఇకపై వాటికి ఆధార్ తప్పనిసరి.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!
ఇప్పటివరకు 'ఆధార్' (Aadhaar) కార్డు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకింగ్ రంగం వంటి వాటిలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం కూడా ఆధార్ తప్పనిసరి అంటూ కేంద్రం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కేంద్ర హోమ్ మినిష్టర్ శాఖ (MHA) రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ కార్యాలయాన్ని జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ ప్రామాణీకరణ చేయడానికి అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఇలాంటి రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ అవసరం లేదు, కానీ కొత్త ఆదేశాలమేరకు ఇకపై వీటికి కూడా ఆధార్ తప్పనిసరి. ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు! 1969 చట్టాన్ని సవరించి ఇప్పుడు జనన మరణాల నమోదు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నిర్దారణని అందించాలి. అంతే కాకుండా ఈ డేటాను ప్రతి సంవత్సరం రాష్ట్రాలన్నీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు నివేదించాల్సి ఉంటుంది. సుమారు 54 సంవత్సరాల తరువాత 1969 చట్టం మొదటిసారి సవరించినట్లు తెలుస్తోంది. ఆధార్ ఇవ్వడం ద్వారా జనాభా రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం సవరణకు లోనైన జనన మరణాల చట్టం 2023లో లేదా ఆ తర్వాత పుట్టిన బిడ్డకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు. -
షాకింగ్ న్యూస్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ఇక నో ఛాన్స్!
Netflix Password Sharing End: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ప్రకటించింది. ఒక వ్యక్తి మాత్రమే ఒక ఖాతాను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు ఈ విధానానికి చరమగీతం పాడింది. సంస్థ ఈ నిర్ణయం గురించి గతంలోనే వెల్లడించింది. కాగా ఇప్పటికి అమలు చేసింది. ఒక కుటుంబంలో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణ సమయంలో కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఒక కొత్త ఫీచర్ అందించనున్నట్లు స్ట్రీమింగ్ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఇమెయిల్ ప్రారంభించినున్నట్లు కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) గత మేలో నెట్‌ఫ్లిక్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి ప్రముఖ మార్కెట్లతో సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్‌పై పరిమితులను విధించింది. కాగా ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ రూల్స్ అమలులోకి వచ్చేసాయి. సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక డేటా ప్రకారం ముగిసిన త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్స్క్రైబర్లతో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది. -
జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్!
జీఎస్టీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు ఆగస్టు 1 నుంచి బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ -ఇన్‌వాయిస్‌ని రూపొందించడం తప్పనిసరి. ప్రస్తుతం రూ.10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఈ -ఇన్వాయిస్ నిబంధన అమలులో ఉంది. ఇదీ చదవండి: సిటీ గ్రూపు నుంచి డిజిటల్ క్రెడిట్ కార్డ్.. లాభాలేంటో తెలుసా? కేంద్ర ఆర్థిక శాఖ మే 10 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ -ఇన్వాయిస్ నమోదు పరిమితిని తగ్గించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు B2B లావాదేవీలకు సంబంధించి ఈ -ఇన్వాయిస్లను సమర్పించాలి. ఈ నిబంధన ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B లావాదేవీల సంబంధించి ఈ -ఇన్వాయిసింగ్ సమర్పించడం తప్పనిసరిగా ఉండేది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ.100 కోట్లకు మించిన టర్నోవర్ ఉన్న సంస్థలకూ ఇది అమలలోకి వచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ -ఇన్వాయిస్లను సమర్పిస్తున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన రూ. 20 కోట్ల టర్నోవర్ కు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ. 10 కోట్ల టర్నోవర్ కు తగ్గింది. -
దీపికా పదుకొణె ట్విటర్ అకౌంట్ పోతుందా? ఎలాన్ మస్క్ కొత్త రూల్ ఏం చెబుతోందంటే?
ఎలాన్ మస్క్ ట్విటర్ సంస్థను సొంతం చేసుకున్నప్పటి నుంచి అనుకోని మార్పులు, ఊహించని పరిణామాలను తీసుకువచ్చాడనే సంగతి అందరికి తెలుసు. ఇప్పుడు తాజాగా మరో కొత్త రూల్ పాస్ చేయడానికి శ్రీకారం చుట్టాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్విటర్ అకౌంట్లో ఇన్‌యాక్టివ్‌గా ఉండే అకౌంట్లను తీసివేయనున్నట్లు మస్క్ వెల్లడించాడు. ఖాతాదారులు చాలా రోజుల నుంచి తమ అకౌంట్‌ని ఇన్‌యాక్టివ్‌గా ఉంచితే వారి ఖాతాలను పూర్తిగా తొలగించే అవకాశం ఉందని కూడా ప్రస్తావించాడు. ఇదే జరిగితే మీ ఫాలోవర్స్ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. మస్క్ తీసుకువచ్చే ఈ కొత్త రూల్ ప్రకారం, వినియోగదారుడు ట్విటర్ ఖాతాను కనీసం ప్రతి 30 రోజులకొకసారి తప్పకుండా లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఆలా కాకుండా మీరు మీ ఖాతాను లాగిన్ చేయకుండా ఉంటే దానిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత మీరు మీ ఖాతాను పూర్తిగా వినియోగించడానికి వీలుపడదు. We’re purging accounts that have had no activity at all for several years, so you will probably see follower count drop — Elon Musk (@elonmusk) May 8, 2023 కొన్ని నివేదికల ప్రకారం, నటి దీపికా పదుకొణె 2021 ఫిబ్రవరి నుంచి ట్విటర్ అకౌంట్లో యాక్టివ్‌గా లేదు. ఆమె చివరిసారిగా నోవాక్ జొకోవిచ్ షేర్ చేసిన చిత్రాన్ని లైక్ చేసింది. ఆ తరువాత ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్‌గా ఉంది. ఈ కారణంగా ఆమె తన అకౌంట్ కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ట్విటర్లో కొత్త రూల్ పాస్ చేసిన ఎలాన్ మస్క్.. రేపటి నుంచే అమలు
గత కొన్ని రోజుల నుంచి ట్విటర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు పర్వం, ఇటీవల ట్విటర్ లోగో మార్పుల్లో అవకతవకలు, ఇటీవల 'బ్లూటిక్' గోల. ఇలా అనునిత్యం ఏదో ఒక విధంగా ట్విటర్ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ట్విటర్ బాస్ మళ్ళీ ఓ కొత్త నిర్ణయంతో తెర మీదకు వచ్చేసాడు. ఇక మీద ట్విట్టర్లో వార్తలను ఫ్రీగా చదవాలనుకుంటే కుదరదు. ఎందుకంటే ఎలోన్ మస్క్ దీనికి కూడా డబ్బులు వసూలు చేయనున్నట్లు ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. ట్విటర్ వేదికగా వార్తలు చదవాలనుకునే వారు ఇప్పుడు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు వసూలు చేసుకునేందుకు ఆయా వార్తా సంస్థలకే మస్క్ అనుమతి కల్పించారు. ఆర్టికల్ ని బట్టి ధర నిర్ణయించుకునే అధికారాన్ని కల్పిస్తూ ట్వీట్ చేశారు. Rolling out next month, this platform will allow media publishers to charge users on a per article basis with one click. This enables users who would not sign up for a monthly subscription to pay a higher per article price for when they want to read an occasional article.… — Elon Musk (@elonmusk) April 29, 2023 ఈ కొత్త విధానం రేపటి (2023 మే 01) నుంచి అమలులోకి రానున్నట్లు ఎలోన్ మస్క్ తెలిపారు. అయితే సబ్స్క్రిషన్ సేవలు పొందుతున్న వారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించారు. వారు ఫ్రీగా వార్తలు చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కొత్త ఫీచర్ వల్ల అటు మీడియా, ఇటు యూజర్ ఇద్దరూ లాభం పొందుతారని మస్క్ వెల్లడించారు. (ఇదీ చదవండి: సైంటిస్ట్ నుంచి వేల కోట్ల కంపెనీ సారధిగా..! ఎవరీ అశ్విన్ డాని?) ఇప్పటికే కొన్ని వార్తా సంస్థల వెబ్సైట్లో వార్తలను చదవాలంటే డబ్బు చెల్లించాల్సిందే, అలాంటి విధానాన్ని మస్క్ ఇప్పుడు ట్విట్టర్లోకి తీసుకువచ్చారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సలహాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!
వ్యాపార సంస్థలకు సంబంధించి జీఎస్టీ కొత్త రూల్ మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. రూ. 100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్పీ (ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్వర్క్ తెలిపింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఐఆర్‌పీలో అప్లోడ్ చేస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ-ఇన్వాయిస్ ఐఆర్పీ పోర్టల్లలో పాత ఇన్వాయిస్లను అప్లోడ్ చేయడానికి కాల పరిమితిని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జీఎస్టీ నెట్వర్క్ పేర్కొంది. ఈ కొత్త ఫార్మాట్ 2023 మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి ఇన్వాయిస్లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్లను నివేదించడంలో ఎలాంటి కాల పరిమితి లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఐఆర్‌పీలో ఇన్వాయిస్లు అప్లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందలేవు. ప్రస్తుతం రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను రూపొందించడం తప్పనిసరి. జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఈ-ఇన్వాయిస్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ. 100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారికి కూడా దీన్ని వర్తింపజేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ-ఇన్వాయిస్లను సమర్పిస్తున్నాయి. అయితే 2022 ఏప్రిల్ 1 నుంచి ఆ పరిమితి రూ. 20 కోట్లకు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ.10 కోట్లకు తగ్గించారు. -
బంగారం కొనేవారికి అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
దేశంలో బంగారు ఆభరణాలు, నాణేల కొనుగోలుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని తప్పనిసరి చేసింది. దీని ప్రకారం.. ఈ హెచ్‌యూఐడీ ఉన్న బంగారు ఆభరణాలనే కొనాలి లేదా అమ్మాలి. (ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!) భారతదేశంలో బంగారు ఆభరణాలను అలంకరణ కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా కొనుగోలు చేస్తుంటారు. చాలా వరకు బంగారాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. వీటికి ఇప్పటి వరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలతో కూడిన హాల్‌మార్కింగ్ ఉండేది. హాల్‌మార్కింగ్ గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తూ ఇచ్చే గుర్తింపు. ఇది 2021 జూన్ 16 వరకు స్వచ్ఛందంగా ఉండేది. అంటే తప్పనిసరి కాదు. ఆ తర్వాత 2021 జూలై 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత హాల్‌మార్కింగ్‌లో నాలుగు అంశాలు ఉండేవి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, నగల వ్యాపారికి సంబంధించిన లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్. HUID హాల్‌మార్కింగ్‌లో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) పాత బంగారంపై ఆందోళన వద్దు అయితే తమ వద్ద పాత బంగారు ఆభరణాల సంగతేంటని వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వినియోగదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత హాల్‌మార్కింగ్ ఆభరణాలు కూడా చెల్లుబాటు అవుతాయని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్వచ్ఛతలో తేడా ఉంటే రెండు రెట్ల పరిహారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ 2018లోని సెక్షన్ 49 ప్రకారం... వినియోగదారు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై ముద్రించిన హాల్‌మార్క్‌లో ఉన్న దానికంటే తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలితే కొనుగోలుదారు రెండు రెట్ల పరిహారం పొందవచ్చు. -
ఐపీఎల్ 2023లో కొత్త రూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఫ్రాంచైజీలు తమ తుది జట్లను, ఇంపాక్ట్ ప్లేయర్ పేరు వివరాలను టాస్ తర్వాత ప్రకటించే వెసలుబాటు కల్పించింది బీసీసీఐ. దీంతో టాస్ గెలుపోటముల ఆధారంగా ఫ్రాంచైజీలు అత్యుత్తమ జట్టును ఎంచునే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎంచుకునే విషయంలో ఈ కొత్త రూల్ చాలా ఉపయోగపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఓ జట్టును, అదే తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే మరో జట్టును ఎంచకునే అవకాశం ఫ్రాంచైజీలకు దక్కుతుంది. గత సీజన్ వరకు కెప్టెన్లు టాస్కు ముందే తుది జట్లు, ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలను వెల్లడించేవారు. ఇలా చేయడం వల్ల ఫ్రాంచైజీలకు ఉపయోగకరమైన తుది జట్టును ఎంచునే విషయంలో కాస్త అసంతృప్తి ఉండేది. ఈ నయా రూల్‌ను గతంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అమలు చేశారు. ఫ్రాంచైజీలు టాస్ తర్వాత తుది జట్టును ప్రకటించే ముందు టీమ్ షీట్‌పై 13 మంది ప్లేయర్ల వివరాలను ఉంచాల్సి ఉంటుంది. ఈ జాబితా నుంచే 11 మంది ప్లేయర్లు, ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా, రానున్న ఐపీఎల్ సీజన్లో మరిన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి రానున్నాయి. అవేంటంటే.. నిర్దిష్ట సమయ వ్యవధిలో బౌలర్ ఓవర్ పూర్తి చేయకుంటే ఓవర్ రేట్ పెనాల్టీ ఉంటుంది. ఓవర్ రేట్ పెనాల్టీ పడితే 30 యార్డ్స్ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లు మాత్రమే అనుమతించబడతారు. అలాగే ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ అన్యాయమైన కదలికలకు పాల్పడితే బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించి ప్రత్యర్ధికి 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-2023 సీజన్లో పై పేర్కొన్న రూల్స్ అన్ని అమల్లోకి వస్తాయని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! ఈ బ్యాంకులో కొత్త రూల్..
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు చెల్లింపుల విషయంలో కొత్త రూల్ తీసుకొస్తోంది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రూల్ మోసపూరిత చెక్కుల చెల్లింపు నుంచి కస్టమర్లను కాపాడుతుంది. ఇంతకుముందు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పీపీఎస్‌లో చెక్కు వివరాలను సమర్పించాల్సి ఉండేది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్, చెక్కు నంబర్, చెక్కు ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, చెక్కు మొత్తం, లబ్ధిదారు పేరుతో సహా అవసరమైన వివరాలను కస్టమర్లు పీపీఎస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాలు జరిగే అవకాశం తగ్గుతుందని బ్యాంకు పేర్కొంటోంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి కస్టమర్లు ఈ పీపీఎస్ సౌకర్యాన్ని బ్యాంకు బ్రాంచ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. చెక్కు ప్రెజెంటేషన్ లేదా క్లియరింగ్ తేదీకి ఒక రోజు ముందుగా చెక్కు వివరాలను పీపీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్‌లో సమర్పించే రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు పీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారు ఇష్టం. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం మాత్రం దీన్ని తప్పనిసరి చేయవచ్చని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. -
ట్రైన్లో తోటి ప్రయాణికులపై దాడి చేస్తే మూడేళ్లు జైలు
కొరుక్కుపేట(చెన్నై): రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తోటి వారిపై దాడికి పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష, జరిమానా తప్పదని రైల్వే ఏడీజీపీ వనిత హెచ్చరించారు. ఈనెల 16న కదులుతున్న రైలులో ఉత్తరాదికి చెందిన వ్యక్తిపై కొందరు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు సహకారంతో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీజీపీ వనిత మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఉత్తరాది వారి వల్ల తమిళనాడు ప్రజలకు ఉదోగావకాశాలు రావడం లేదని, దీనికి ప్రధాని మోదీయే కారణమంటూ కొందరు దాడులకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ, వ్యక్తిగత ద్వేషపూరిత మాటలతో పలువురిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఇక కొందరు కుల మత భావాలను రెచ్చగొట్టి అశాంతికి కారణం అవుతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితులు ఫిర్యాదుల కోసం 1512 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు. చదవండి చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా!