ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ ఫ్రెండ్లీగా, ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడకుండా ఉండలేరేమో.యూత్‌లోనూ వాట్సాప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఏదైనా చెప్పాలన్నా, రియాక్ట్ అవ్వాలన్నా మెసేజ్‌లో టైప్ చేసేవారు.
కానీ ఇప్పుడంతా ఎమోజీల కాలం అయిపోయింది. ప్రేమ, కోపం, బాధ, సంతోషం, ఆకలి..ఇలా ఏ ఫీలింగ్ అయినా ఒక్క ఎమోజీలో చెప్పేస్తున్నారు. అయితే అడ్డదిడ్డంగా ఎమోజీలు వాడితే జైలుకి వెళ్లాల్సి వస్తుందట. ఈ కొత్త రూల్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఎలాంటి ఎమోజీలు వాడకూడదు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వాట్సాప్ వాడనిదే రోజు గడవని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్రతిరోజూ అవసరం కోసమో, ఏదైనా విషయాన్ని చెప్పాలన్నా వాట్సాప్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఇక ప్రేమలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల కంటే ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ముఖ్యంగా హార్ట్ ఎమోజీలతో ఇంప్రెస్ చేసేస్తుంటారు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు హార్ట్ సింబల్స్ పంపిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందట.
వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అంతేకాదు ఒకవేళ ఇదే నేరం మళ్లీ చేస్తే రూ. 60 లక్షల జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు. కఠినమైన ఆంక్షలు, నిబంధనలు అమలయ్యే సౌదీ అరేబియాలో తాజాగా ఇలాంటి కొత్త తరహా రూల్‌ను తెచ్చి పెట్టింది అక్కడి ప్రభుత్వం. దీంతో తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, అనవసరమైన చిక్కుల్లో పడకుండా సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్‌గా మార్చేందుకు ఈ కొత్త ప్రయత్నమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment