సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌మరోసారి చిక్కుల్లో పడింది. ముఖ్యంగా ఎమోజీల్లో అసభ్యకరమైన చిహ్నం ఉందంటూ ఢిల్లీ న్యాయవాది ఒకరు వాట్సాప్‌కు నోటీసులు పంపారు.
ఢిల్లీ న్యాయవాది గుర్మీత్ సింగ్ వాట్సాప్‌కు తాజా నోటీసులు పంపారు. దీనిపై 1 5రోజులలోపు అభ్యంతరకరంగా ఉన్న మిడిల్ ఫింగర్ చిహ్నాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది అశ్లీలమైనదిగాను, హానికరంగాను ఉందని గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమైనదని కూడా ఆయన వాదిస్తున్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని 354 ,509 సెక్షన్ల ప్రకారం, ఎవరైనా అశ్లీలమైన, అప్రియమైన, అశ్లీల సంజ్ఞల వాడకం చట్టవిరుద్ధమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment