Emoji
-
అలిగినా, బుంగమూతి పెట్టినా ‘ఎమోజీ’ ఉంటే చాలదూ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
భాషతో సంబంధం లేదు. మన మనసులోని భావాల్ని, భావోద్వేగాల్ని ఇట్టే చెప్పేస్తాయి. చిన్న చిన్న బొమ్మలే విశ్వవ్యాప్త భాషగా అవతరించి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను విప్లవాత్మకం చేశాయి. అలిగినా, సిగ్గుపడినా, బుంగమూతి పెట్టినా, నవ్వొచ్చినా, వెక్కిరించినా కోపం వచ్చినా, మనం ఎక్కడ, ఎలా ఉన్నా అవతలివాళ్లకి చెప్పాలంటే పిల్లల్ని నుంచి పెద్దల దాకా ఒకే ఒక్క సింగిల్ క్లిక్ ఎమోజీ. రోజుకు కొన్ని వందల కోట్ లఎమోజీలు షేర్ అవుతాయి. అంత పాపులర్ ఎమోజీ. ఈ రోజు ప్రపంచ ఎమోజి దినోత్సవం సందర్బంగా కొన్ని ఆసక్తికర విషయాలు.ప్రస్తుత టెక్ యుగంలో మెసేజ్‌లు, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ , ముఖ్యంగా వాట్సాప్ దాకా సోషల్ మీడియాలో ఎమోజీ లేనిదే రోజు గడవదు. సంతోషం, ప్రేమ, అసూయ, బాధ, కోపం, ఆఖరికి జలుబు, జ్వరం ఇలా ఏదైనా సరే ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు.ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము. ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014లో ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ రూపొందించారు. 2002లో Apple Mac కోసం iCalను ప్రవేశపెట్టిన రోజును సూచిస్తూ iOSలోని క్యాలెండర్ ఎమోజి ఈ తేదీని ప్రదర్శిస్తున్నందున జూలై 17ని ఎంచుకున్నారట. అలాగే జపాన్ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్ వీటిని రూపొందించాడని చెబుతుంటారు.షిగెటకా కురిటా 1990లలో "ఎమోజి" అనే పదాన్ని ఉపయోగించారట. "ఎమోజి" అనేది జపనీస్ ఇడియమ్. మరోవైపు ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చిందనే మరో కథనం కూడా. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల హావ భావాలు బాగా ఆకట్టు కున్నాయి. ముఖ్యంగా కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. అలా ఈ ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్న మాట. -
పర్యావరణ సంరక్షణ.. అందరికీ అర్థమయ్యేలా ఇమోజీ, కార్టూన్లతో
‘కళ కళ కోసమే కాదు... పర్యావరణ సంరక్షణ కోసం కూడా’ అంటోంది యువతరం. సంక్లిష్టమైన పర్యావరణ అంశాలను సులభంగా అర్థం చేయించడానికి, పర్యావరణ స్పృహను రేకెత్తించడానికి గ్రాఫిటీ వర్క్, ఇల్లస్ట్రేషన్, ఇమోజీ, కార్టూన్లను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది. ఆర్ట్, హ్యూమర్‌లను కలిపి తన ఇలస్ట్రేషన్లతో పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలను ప్రచారం చేస్తున్నాడు రోహన్ చక్రవర్తి. కామిక్స్, కార్టూన్లు, ఇలస్ట్రేషన్ సిరీస్‌లతో ‘గ్రీన్ హ్యూమర్’ సృష్టించాడు. రెండు జాతీయ పత్రికల్లో వచ్చిన ఈ సిరీస్‌ను పుస్తకంగా ప్రచురించాడు. తన కృషికి ఎన్నో అవార్ట్లు వచ్చాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రోహన్ చక్రవర్తి కార్టూన్లను పర్యావరణ పరిరక్షణ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన రోహన్ పదహారు సంవత్సరాల వయసు నుంచే కార్టూన్లు వేయడం మొదలుపెట్టాడు.‘పర్యావరణ సంక్షోభ తీవ్రతను కామిక్స్‌తో బలంగా చెప్పవచ్చు. శాస్త్రీయ విషయాలపై ఆసక్తి ఉన్న వారినే కాదు, వాటిపై అవగాహన లేని వారిని కూడా ఆకట్టుకొని మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సులభంగా చెప్పవచ్చు’ అంటున్నాడు రోహన్ చక్రవర్తి. కార్టూనిస్ట్, గ్రాఫిక్ స్టోరీ టెల్లర్ పూర్వ గోయెల్ తన కళను పర్యావరణ సంబంధిత అంశాల ప్రచారానికి ఉద్యమస్థాయిలో ఉపయోగిస్తోంది. పర్యావరణ నిపుణులు, పరిశోధకులు, పర్యావరణ ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘అన్ని వయసుల వారిని ఆకట్టుకొని, అర్థం చేయించే శక్తి కార్టూన్లకు ఉంది’ అంటోంది 26 సంవత్సరాల పూర్వ గోయెల్.పశ్చిమ కనుమల జీవవైవిధ్యానికి వాటిల్లుతున్న ముప్పు నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబంగ్ లోయలోని మిష్మి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల వరకు పూర్వ గోయెల్ తన కళ ద్వారా ఆవిష్కరించింది. అభివృద్ధిగా కనిపించే దానిలోని అసమానతను ఎత్తి చూపింది. డెహ్రడూన్‌కు చెందిన పూర్వ గోయెల్ నదులు, అడవులు ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యను దగ్గరి నుంచి చూసింది. బెల్జియంలో గ్రాఫిక్ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్స్ చేసింది. ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్యం అంశంపై కెనడాలో నిర్వహించిన సదస్సుకు హాజరైంది.‘ఆ సదస్సులో వక్తలు పర్యావరణ విధానాల గురించి సంక్లిష్టంగా మాట్లాడారు. సామాన్యులు ఆ ప్రసంగ సారాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యేలా పర్యావరణ విషయాలను చె΄్పాలనుకున్నాను. దీనికి నా కుంచె ఎంతో ఉపయోగపడింది. నన్ను నేను కమ్యూనికేటర్‌గా భావించుకుంటాను’ అంటుంది పూర్వ గోయెల్. ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కామిక్ బుక్ తయారుచేసింది గోయెల్. ఈ కామిక్ బుక్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘మేము ఎన్నో రిపోర్ట్లు విడుదల చేశాం. కాని ఒక్క రిపోర్ట్ చదవడానికి కూడా మా ఎకౌంటెంట్ ఆసక్తి చూపించలేదు. కామిక్స్ రూపంలో ఉన్న రిపోర్ట్ ఆమెకు బాగా నచ్చింది. కామిక్స్ ద్వారా తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం మొదలు పెట్టింది’ అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినప్పుడు ఉత్సాహం రూపంలో గోయెల్‌కు ఎంతో శక్తి వచ్చి చేరింది. ‘గ్రాఫిక్ డిజైన్‌లో భాగంగా బ్రాండ్ డిజైన్ నుంచి పబ్లికేషన్ డిజైన్ వరకు ఎన్నో చేయవచ్చు. కాని నాకు కామిక్ స్ట్రిప్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్‌ను సంక్షిప్తంగానే కాదు అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఒకటి లేదా రెండు వాక్యాలు, ఇమేజ్‌లతో పెద్ద స్టోరీని కూడా చెప్పవచ్చు’ అంటున్న అశ్విని మేనన్ గ్రాఫిక్ డిజైన్‌ను పర్యావరణ అంశాల ప్రచారానికి బలమైన మాధ్యమంగా చేసుకుంది.బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో చదువుకున్న అశ్విని కళకు సామాజిక ప్రభావం కలిగించే శక్తి ఉందని గ్రహించింది. తన కళను సమాజ హితానికి ఉపయోగించాలనుకుంది. రిచీ లైనల్ ప్రారంభించిన డాటా స్టోరీ టెల్లింగ్ సంస్థ ‘బెజలెల్ డాటా’ అసాధారణ ఉష్ణోగ్రతలకు సంబంధించిన సంక్లిష్టమైన సమాచారం అందరికీ సులభంగా, వేగంగా అర్థమయ్యేలా యానిమేటెట్ ఇమోజీలను క్రియేట్ చేస్తోంది.‘సంప్రదాయ రిపోర్ట్ స్ట్రక్చర్స్ ప్రకారం వెళితే అందరికీ చేరువ కాకపోవచ్చు. రిపోర్ట్ సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా డాటా కామిక్స్ ఉపయోగపడతాయి. పెద్ద వ్యాసం చదువుతున్నట్లుగా కాకుండా ఇతరులతో సంభాషించినట్లు ఉంటుంది’ అంటున్న రిచీ లైనల్ ఎన్నో స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించాడు క్లైమెట్ డాటాపై అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీతో కలిసి పనిచేశాడు. సంక్లిష్టమైన విషయాలను సంక్షిప్తంగా, సులభంగా అర్థమయ్యేలా చేయడానికి రిచీ లైనల్ అనుసరిస్తున్న మార్గంపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. మెరైన్ బ్లాగిస్ట్, నేచర్ ఫొటోగ్రాఫర్ గౌరవ్ పాటిల్ రాతలతోనే కాదు ఇలస్ట్రేషన్స్, ఫొటోలతో పర్యావరణ సంబంధిత అంశాలను ప్రచారం చేస్తున్నాడు. సముద్ర కాలుష్యం నుంచి కాంక్రీట్ జంగిల్స్ వరకు ఎన్నో అంశాల గురించి తన ఇల్లస్ట్రేషన్ల ద్వారా చెబుతున్నాడు.బెంగళూరుకు చెందిన అక్షయ జకారియ వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగింది. పర్యావరణంపై ఆసక్తి పెంచుకోవడానికి అది కారణం అయింది. పర్యావరణ సంరక్షణపై అవగాహనకు ఇలస్ట్రేషన్, డిజైన్లను ఉపయోగిస్తోంది. రోహన్ చక్రవర్తి నుంచి అక్షయ వరకు పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అందరినీ ప్రకృతి ప్రపంచంలోకి తీసుకువచ్చింది అనురక్తి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువైన అంకితభావం కూడా. -
వాట్సాప్‌లో హార్ట్ సింబల్స్ పంపుతున్నారా.. మీకు జైలు శిక్షే
ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ ఫ్రెండ్లీగా, ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడకుండా ఉండలేరేమో.యూత్‌లోనూ వాట్సాప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఏదైనా చెప్పాలన్నా, రియాక్ట్ అవ్వాలన్నా మెసేజ్‌లో టైప్ చేసేవారు. కానీ ఇప్పుడంతా ఎమోజీల కాలం అయిపోయింది. ప్రేమ, కోపం, బాధ, సంతోషం, ఆకలి..ఇలా ఏ ఫీలింగ్ అయినా ఒక్క ఎమోజీలో చెప్పేస్తున్నారు. అయితే అడ్డదిడ్డంగా ఎమోజీలు వాడితే జైలుకి వెళ్లాల్సి వస్తుందట. ఈ కొత్త రూల్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఎలాంటి ఎమోజీలు వాడకూడదు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. వాట్సాప్ వాడనిదే రోజు గడవని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్రతిరోజూ అవసరం కోసమో, ఏదైనా విషయాన్ని చెప్పాలన్నా వాట్సాప్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఇక ప్రేమలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల కంటే ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ముఖ్యంగా హార్ట్ ఎమోజీలతో ఇంప్రెస్ చేసేస్తుంటారు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు హార్ట్ సింబల్స్ పంపిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందట. వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు ఒకవేళ ఇదే నేరం మళ్లీ చేస్తే రూ. 60 లక్షల జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు. కఠినమైన ఆంక్షలు, నిబంధనలు అమలయ్యే సౌదీ అరేబియాలో తాజాగా ఇలాంటి కొత్త తరహా రూల్‌ను తెచ్చి పెట్టింది అక్కడి ప్రభుత్వం. దీంతో తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, అనవసరమైన చిక్కుల్లో పడకుండా సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్‌గా మార్చేందుకు ఈ కొత్త ప్రయత్నమని వివరించారు. -
ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..!
‘థంబ్స్ అప్’ ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటవుతుందా? అది ఎదైనా ఒప్పందానికి మిమ్మల్ని బంధించగలదా? ఒక సీనియర్ ఉద్యోగి పని ప్రదేశంలో అతని జూనియర్‌కు హార్ట్ ఎమోజీని పంపితే అవి లైంగిక వేధింపుల కిందికి వస్తాయా? ఇదేవిధంగా తుపాకీ లేదా కత్తి ఎమోజీని ఎవరైనా పంపితే దానిని ప్రాణాలకు ముప్పుగా భావించాలా? యుఎస్ నుండి యూకే వరకూ.. న్యూజిలాండ్, ఫ్రాన్స్, భారతదేశంలోనూ భావోద్వేగాలు, కార్యకలాపాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే చిన్నపాటి ఇలస్ట్రేటెడ్ క్యారెక్టర్ల విభిన్న వివరణలు ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కొన్ని దేశాలు ఎమోజీలను సాక్ష్యంగా ఉపయోగించుకోవడంతో న్యాయ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా కెనడాలోని కోర్టు తీర్పు చేరింది. ఈ దేశానికిచెందిన న్యాయమూర్తి 'థంబ్స్ అప్' ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటు అవుతుందని తేల్చిచెప్పారు. ఒక కేసులో ఎమోజీని ఆధారంగా చేసుకుని ఒకరైతు 61,000 యూఎస్ డాలర్ల మొత్తాన్ని ప్రత్యర్థికి చెల్లించాలని ఆదేశించారు! ఈ కొత్త వాస్తవికతకు న్యాయస్థానాలు అనుగుణంగా ఉండాలని ఆయన తన తీర్పులో వాదించారు. సహజమైన పురోగతి ఎమోజీల విషయంలో భారతదేశంలో చట్టమేదీ లేనందున వాణిజ్య చర్చల సమయంలో వ్యక్తులు,వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండటం కీలకంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు అన్నారు. డిజిటల్ చర్చలలో మరింత ఆలోచనాత్మకంగా ఉండటం, ఒప్పందపు చర్చలలో ఎమోజీలను ఉపయోగిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం తెలివైన పని అని ఆయన హెచ్చరించారు. కమ్యూనికేషన్ విధానాలు అభివృద్ధి చెందుతున్న దశలో ఎమోజీలు కూడా న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడం సహజమైన పురోగతి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మిడిల్ ఫింగర్ ఎమోజీని తొలగించాలి’ థంబ్స్-అప్ ఎమోజీ కొన్ని దేశాల్లో అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందనే చర్చను లేవనెత్తగా, చైనాలో స్మైలీ ఫేస్ ఎమోజీని వ్యంగ్యంగా తీసుకుంటున్నారు. భారతదేశంలోని మధ్య వేలు ఎమోజీ అసభ్యకరంగా పరిగణిస్తున్నారు. దీనిపై ఢిల్లీకి చెందిన లాయర్ గుర్మీత్ సింగ్.. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు లీగల్ నోటీసు పంపి, 15 రోజుల్లోగా "మిడిల్ ఫింగర్" ఎమోజీని తొలగించాలని కోరారు. మధ్య వేలును చూపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, అశ్లీలమైన, అసభ్యకరమైన సూచిక. ఇది భారతదేశంలో నేరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రాబల్యం అపరిమితంగా ఉన్నప్పటికీ వ్యాపారం, అధికారిక కమ్యూనికేషన్లో వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడం చాలా అవసరమని ఏఐసీఐ సీఐపీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇమేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకురాలు సోనియా దూబే దేవాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. కాంట్రాక్ట్ ఫార్మేషన్ విషయంలో.. భారత న్యాయశాస్త్రంలో చట్టపరమైన సంబంధాలను నెలకొల్పే ఉద్దేశ్యంతో కాంట్రాక్ట్ ఏర్పాటుకు స్పష్టమైన ఆఫర్, స్పష్టమైన అంగీకారం అవసరం. ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, 1872 కాంట్రాక్ట్ ఫార్మేషన్లో ఎమోజీలు లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల వినియోగాన్ని ప్రస్తావించలేదు. అయితే మనదేశంలోని న్యాయస్థానాలు.. ఈ-మెయిల్లు, తక్షణ సందేశం వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఏర్పడిన ఒప్పందాల చెల్లుబాటును గుర్తించాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వాట్సాప్ సమన్లు చెల్లుబాటు అయ్యే మోడ్‌గా గుర్తించారు. ఈ నేపధ్యంలో వాణిజ్య చర్చల్లో పాల్గొనే వ్యక్తులు.. తాము ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? తమ వాట్సాప్ సంభాషణలు,ఈ-మెయిల్లతో సహా మౌఖిక, రాతపూర్వక కమ్యూనికేషన్లలో ఏమి పేర్కొనాలనే దానిపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు తెలిపారు. ఎమోజీల వాడకంతో సంబంధం కలిగిన సంభావ్య చట్టపరమైన పరిణామాల గురించి పార్టీలు తప్పనిసరిగా తెలుసుకోవాలని, వివాదాలను నివారించడానికి, ఈ-ఎన్ఎఫ్ఓఆర్సి ఇ బిఐఎల్ఐటి వైని నిర్ధారించడానికి వారి ఉద్దేశాల స్పష్టతను గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. మద్రాస్ హైకోర్టులో ఎమోజీ కేసు వాట్సాప్ గ్రూప్‌లో 'కన్నీళ్లతో నవ్వుతున్న ముఖం' అనే ఎమోజీని పోస్ట్ చేసినందుకు కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు వచ్చిన కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. 2018లో హైకోర్టు ఈ కేసులో.. ఎమోజీకి సంబంధించిన వివరణను గమనించినప్పుడు అనేక భావాలను తెలియజేయడానికి ఎమోజీలు పోస్ట్ చేస్తారని పేర్కొంది. ఏదైనా ఫన్నీ లేదా నవ్వు తెప్పించినప్పుడు ఈ ఎమోజీ ఉపయోగిస్తారు. ఎమోజీని ఉపయోగించడం వల్ల వేధింపులకు అవకాశం ఉండకపోవచ్చు, అయితే అది ఫిర్యాదుదారుని కించపరిచేలా ఉన్నందున అలాంటి చర్యను ఖండిస్తున్నట్లు హైకోర్టు ఒక హెచ్చరికతో ఆ ఫిర్యాదును తోసిపుచ్చింది. ఏది ఏమైనప్పటికీ పౌర, వాణిజ్య న్యాయ న్యాయశాస్త్రంలో ఎమోజీల ఉపయోగం వివరణ, ప్రభావం మారవచ్చని శశాంక్ పేర్కొన్నారు. ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో.. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ఈ అంశంపై స్పందిస్తూ కేవలం ఎమోజీలు మాత్రమే చట్టపరమైన చర్యలకు కారణం కాదని అన్నారు. ఎలక్ట్రానిక్ మెసేజ్‌లు, ఎమోజీల కంటెంట్లు ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో అనుమతిపొందవు. అయితే అటువంటి ఎలక్ట్రానిక్ సందేశాలను సాక్ష్యంగా అంగీకరించనప్పటికీ.. విచారణ సమయంలో ప్రధాన సాక్ష్యం, క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ కంటెంట్లను నిరూపించాలన్నారు. ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగానికి నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీపీ ర్యాంక్ అధికారి. ఆమె ఈ విషయమై ఒక తీర్పును ఉటంకిస్తూ (అంబాలాల్ సారాభాయ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వెర్సెస్ కేఎస్ ఇన్‌ఫ్రాస్పేస్ ఎల్ఎల్పీ లిమిటెడ్‌తోపాటు మరో కేసులో.. ఇది జనవరి 6, 2020 నాటిది), వర్చువల్ వెర్బల్ కమ్యూనికేషన్లయిన వాట్సాప్ మెసేజ్‌లు సాక్ష్యాధారాల ద్వారా విచారణ జరిగే సమయంలో రుజువు చేయగల అంశం అని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఈ-మెయిల్లు, వాట్సాప్ సందేశాల ప్రకారం ఒక ఒప్పందం కుదిరిందా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి స్పషంగా వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని శిఖా గోయల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే నిర్ణయించదగిన సాక్ష్యం రూపంలో.. భారత న్యాయస్థానాలు, దర్యాప్తు అధికారులు.. వినియోగదారు ఉద్దేశాన్ని అర్థంచేసుకోవడానికి చెల్లుబాటు అయ్యే నిర్ణయాత్మక సాక్ష్యంగా ఎమోజీల వినియోగాన్ని అంగీకరించారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఇతర క్రిమినల్ కేసులలో ఇది ఉపయోగపడుతుందని అకార్డ్ జ్యూరిస్ న్యాయవాది, సహ వ్యవస్థాపకురాలు శ్రద్ధా గుప్తా అన్నారు. మన బహుళసాంస్కృతిక సమాజంలో ఎమోజీలపై ఏకరీతి వివరణ లేదని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యానం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది సంస్కృతి, ప్రాంతం, తరం, వృత్తి మొదలైనవాటిని అనుసరించి కూడా మారవచ్చని అన్నారు. ఉదాహరణకు ఒక డాక్యుమెంట్‌ను స్వీకరించినందుకు లేదా పత్రాన్ని పంపడంలో చేసిన ప్రయత్నాన్ని తెలియజేస్తూ 'థమ్స్ అప్'ని పంపవచ్చు. ఇది ఇండియా కాంట్రాక్ట్ చట్టం ప్రకారం అంగీకారంగా భావిస్తే కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ది లా ఛాంబర్స్‌లోని సీనియర్ అసోసియేట్ అయిన శ్రద్ధ అభిప్రాయపడ్డారు. ఎమోజీలపై వివరణాత్మక మార్గదర్శకత్వం క్రమబద్ధీకరించే వరకు, ఇటువంటి కమ్యూనికేషన్ మోడ్‌ను ద్వితీయ సాక్ష్యంగా మాత్రమే పరిగణించాలన్నారు. అపార్థాలకు ఆస్కారం లేకుండా.. ఎమోజీలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకోవడం వలన అపార్థాలకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకు ఎమోజీలను వినియోగించే విషయంలో స్పష్టతను నిర్ధారించడం, గందరగోళాన్ని తగ్గించడం చేయాలని న్యాయ నిపుణురాలు సోనియా తెలిపారు. పరస్పర మర్యాదలను అర్థం చేసుకుని వ్యాపార, అధికారిక వ్యవహారాలలో సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను ఈ విధమైన రీతిలో ప్రోత్సహించవచ్చన్నారు. వ్యాపారం లేదా అధికారిక సంభాషణలో ఇతర వ్యక్తులతో ఈవిధంగా కమ్యూనికేట్ చేయడం మంచి పద్ధతి అని ఆమె పేర్కొన్నారు. ఎమోజి గందరగోళాన్ని నావిగేట్ చేయడానికి ఉండవలసిన ప్రాథమిక నియమం ఏమిటంటే.. ఎమోజీ వినియోగించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అనవసరమైన ఎమోజీలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరమని కూడా ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ -
ఆ ఎమోజీని ఉపయోగించినందుకు..రైతుకి రూ. 50 లక్షలు జరిమానా
మనం ఇప్పుడూ ఏ వ్యవహారమైన ఫోన్ల ద్వారా లేదా మెసేజ్‌ల ద్వారా చక్కబెట్టేస్తున్నాం. దీంతో పని సులువుగా అవ్వడమే గాక టైం కూడా కలిసిస్తోంది. సాధారణంగా మెసేజ్‌లలో మన భావాలను వ్యక్తపరిచేలా.. ఎమోజీలు ఉపయోగించడం అనేది పరిపాటే. అలానే ఓ రైతు కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఆ ఎమోజీని ఉపయోగించాడు. దీంతో ఆ రైతుకి కోర్టు ఏకంగా రూ. 50 లక్షల జరిమాన విధించింది. అసలేం జరిగిందంటే..కెనడాలోని క్రిస్ అచ్టర్ అనే రైతు ఓ కొనుగోలుదారుతో ఫోన్లో.. మెసేజ్‌లతో సంప్రదింపులు చేశాడు. అతను సుమారు 86 టన్నుల అవిసె గింజలు కొనగోలు చేస్తానని, కేజి రూ 1048/- చొప్పున చేసి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. అందుకు సదరు రైతు అంగీకరించడమే గాక నవంబర్ కల్లా డెలివరి చేస్తానని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారయ్యినట్లే కదా అని అడగగా.. ధృవీకరిస్తున్నట్లుగా రైతు ఈ థంబ్స్ అప్ ఎమోజీని పంపాడు. దీంతో సదరు కొనుగోలుదారుడు ఒప్పందం ఖరారయ్యిందని భావించాడు. తీరా చూస్తే..అనుకున్న సమయానికి రైతు అవిసె గింజలు పంపిణీ చేయలేదు. దీంతో కొనగోలుదారుడు రైతుని ప్రశ్నించగా..తాను కాంట్రాక్ట్ తీసుకుంటున్నా అని ధృవీకరించానేగాని డెలివరీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని వాదించాడు. దీంతో కోర్టుని ఆశ్రయించారు ఇద్దరూ..కొనగోలుదారుడు ఒప్పందాన్ని నెరవేర్చలేదని మెసేజ్‌ల స్క్రీన్ షాట్ ఆదారాలను కోర్టుకి సమర్పించాడు. కాంట్రాక్ట్‌ను అందుకుంటున్నట్లుగా ఆ గుర్తుని పంపిచానని చెప్పాడు. ఐతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు నిరూపించేలా ఏ ఆధారాన్ని సమర్పించలేకపోయాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమోదాన్ని సూచించడానికి 'థంబ్స్ అప్ ఎమోజి'ని సాధారణంగా ఉపయోగిస్తారని పేర్కొంది. అలాగే ''డిక్షనరీ.కమ్" అందించిన ఎమోజీ నిర్వచనాన్ని కూడా ప్రస్తావిస్తూ..డిజిటల్ కమ్యూనికేషన్లో ఒప్పందం ఆమోదం లేదా ప్రోత్సాహాన్ని వ్యక్తికరించడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తామని స్పష్టం చేసింది. దేన్నైనా ఒప్పందం చేసుకున్నారు అని నిర్థారించడానికి సంతకాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇది సర్వసాధారణంగా జరిగే సాంప్రదాయపద్ధతి. అదే ఎమోజీలు ఉపయోగించడం అనేది ఆధునిక పద్ధతి అని కోర్టు వెల్లడించింది. ఇక్కడ థంబ్స్ అప్ ఎమోజీ సాంప్రదాయేతరమైనది అయినప్పటికీ ఆ వ్యక్తి అంగీకరించాడు అనడానికి అతని మొబైల్ నెంబర్ ద్వారా చేసిన మెసేజ్‌లే ఆధారమని స్పష్టం చేసింది. అందువల తమ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే గాక అంగీకరించలేదని వాదించినందుకు గానూ రైతుకి ఏకంగా రూ. 50,88,893/-లు జరిమానా విధించింది. (చదవండి: యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్నికూడా కలగజేస్తుందా!) -
రొమాంటిక్ వెబ్‌సిరీస్‌గా 'ఎమోజీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Emoji Web Series Will Streaming On Aha OTT: ఓటీటీ సంస్థలు యువతను అలరించే ప్రేమ కథా చిత్రాలను స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, దేవికా సతీష్, మానస చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ఎస్.రంగస్వామి దర్శకత్వం వహించారు. రమణ ఆర్ట్స్ పతాకంపై ఏఎం సంపత్‌కుమార్ నిర్మించారు. త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఆరు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ఒక యువకుడు ఆరంభంలోనే విడాకుల కోసం న్యాయవాదిని ఆశ్రయిస్తారు. ఒక షాపులో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తున్న ఓ యువతిని ఆ షాపుకు వస్తువులు కొనడానికి వచ్చిన యువకుడికి తొలి చూపులోనే నచ్చేస్తుంది. దీంతో ఆమె కోసమే రోజూ ఆ షాపుకు వస్తాడు. అలా ఆ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమిస్తాడు. ఆ యువతి కూడా అతని ప్రేమలో పడటంతో ఇద్దరూ కాఫీ షాపులు, పార్కుల చుట్టూ తిరిగి ఎంజాయ్ చేస్తారు. అలాంటి వారి ప్రేమ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? అసలు ఆ యువకుడు ఎవరితో, ఎందుకు విడాకులు కోరుకున్నాడు? వీరి జీవితంలోకి మరో యువతి ఎలా ప్రవేశించింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. ఇందులో రొమాన్స్ సన్నివేశాలకు కొదవ లేదు. వీజే ఆషిక్, ఆడుగళం నరేన్, ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ తరం యువత ప్రేమకు అద్ధం పట్టే ఈ సిరీస్‌లో మహత్ రాఘవేంద్ర తన పాత్రను ఎంజాయ్ చేస్తూ నటించారు. హీరోయిన్లు కూడా తమ పరిధిలో నటించి అలరించారు. దీనికి సనత్ భరద్వాజ్ సంగీతాన్ని, జలంధర్ వాసన్ చాయాగ్రహణను అందించారు. -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక..! ఈ ఎమోజీ పంపితే 20 లక్షల జరిమానా..!
Warning for Whatsapp Users: వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అక్కడి ప్రభుత్వం యూజర్లను హెచ్చరించింది. ఒక వేళ రెడ్ హార్ట్ ఏమోజీలను పంపితే రూ.20 లక్షల జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. . వేధింపులతో సమానంగా... గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం... వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు. వాట్సాప్‌లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపించడం వేధింపుల నేరమవుతుందని ఆయన పేర్కొన్నారు. యూజర్లు ఇతరులకు రెడ్ హార్ట్ ఎమోజి మెసేజ్‌లను పంపితే వారు తీవ్రంగా భావిస్తే కేసు నమోదు చేస్తే చిక్కుల్లో పడక తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయడం నేరం. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్‌లో సంభాషణలు జరపవద్దన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సౌదీ అరేబియాలో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని వేధింపుల కింద పరిగణిస్తారు. అక్కడి ఆచార సాంప్రదాయాల ప్రకారం వాట్సాప్‌లో రెడ్ హార్ట్ లేదా రెడ్ రోజెస్ వంటి ఎమోజీలను పంపించడం తమ గౌరవానికి భంగంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే దోషికి 1లక్ష సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు దోషిగా తేలితే 3లక్షల సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధించడంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. -
యాపిల్ జంబలకిడిపంబ: మగాడికి కడుపొస్తే..
Apple Brings Pregnant Man Emoji Soon To iPhones: టెక్ ప్రపంచంలో రోజూవారీ పనుల్ని తగ్గించేవెన్నో. అందులో సరదాగా మొదలైన ఎమోజీల వ్యవహారం.. ఇప్పుడు ఛాటింగ్ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జస్ట్ ఒక ఎమోజీతో బదులు ఇవ్వడమే కాదు.. పెద్ద పెద్ద ఉద్యమాలు సైతం నడుస్తున్న రోజులివి. కొన్నిసార్లు భావోద్వేగాలను మోతాదులో మించి ప్రదర్శిస్తున్నాయి కాబట్టే అంత ఆదరణ ఉంటోంది ఎమోజీలకు. కానీ, ఎమోజీలతో భావోద్వేగాలతో ఆడుకుంటే మాత్రం జనాలు ఊరుకుంటారా? యాపిల్ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రెగ్నెంట్ మ్యాన్’ ఎమోజీ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గురువారం అందించిన ఈ అప్డేట్ సడన్ సర్ప్రైజ్తో పాటు సీరియస్ డిస్కషన్‌కు తెర తీసింది ఈ ఎమోజీ. గర్భంతో ఉన్న మగవాడి ఎమోజీ ద్వారా వివక్షకు తెర తీసిందంటూ కొందరు విమర్శిస్తుండగా.. కొందరేమో ఈ ఎమోజీని సరదా కోణంలో ఆస్వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లింగ వివక్ష, మాతృత్వాన్ని దెబ్బ తీస్తుందన్న విమర్శల కోణంలో ఈ ఎమోజీపై నెగెటివిటీనే చెలరేగుతోంది సోషల్ మీడియాలో. #Pregnant man, pregnant person emoji coming to Apple iPhones. #Apple and #TimCook are you really that stupid. https://t.co/YA88hM4NiW #Pregnantemoji — Michael Osuna (@mlosuna) January 29, 2022 New Apple 'pregnant man' emoji looks like a regular dude with a beer belly to me and that's what i'm going with. pic.twitter.com/4MDN4xp5Fw — Pineapple on Pizza Speculator (@OnSpeculator) January 29, 2022 People in ancient times didn’t have pregnant men symbols because they had common sense #WokeHorseShit #emojis #pregnantman pic.twitter.com/wnClxh3Hra — Terry McNeely Comedian 🎙 (@Mac72Terry) January 29, 2022 ఐవోఎస్ 15.4 తాజా అప్డేట్తో ఐఫోన్లలో కొత్త ఎమోజీలు వచ్చాయి. ప్రెగ్నెంట్ మ్యాన్‌తో పాటు పెదవి కొరికే ఎమోజీ.. మరో 35 ఎమోజీలను ఐఫోన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బేటా వెర్షన్లో ఉన్న ఈ ఎమోజీలు.. త్వరలో పూర్తిస్థాయిలో వాడుకలోకి రానున్నాయి. Men 👏🏼 cannot 👏🏼 get 👏🏼 pregnant! 👏🏼 Why is this so controversial?? @Apple #PregnantManEmoji #Apple #PregnantMan #Impossible — Conservative Goth Girl 🇺🇸❤️ (@ConservativeGG6) January 29, 2022 Stop attacking womanhood #apple #pregnantman — amornesta (@amornesta1) January 29, 2022 కొత్తేం కాదు.. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే తరహా ఎమోజీను విడుదల చేసి విమర్శలు ఎదుర్కొంది ఎమోజీపీడియా. దీంతో ఆ ఎమోజీని ట్రాన్స్ మెన్, నాన్-బైనరీ పీపుల్, పొట్టి జుట్టు ఉన్న మహిళల కోసం.. ఉపయోగించొచ్చంటూ తప్పించుకునే వివరణ ఇచ్చుకుంది. అయినా విమర్శలు ఆగలేదు. ‘ఫుల్‌గా తిని కడుపు నిండిన మగవాళ్లు కూడా ఈ ఎమోజీని సరదాగా ఉపయోగించొచ్చు అంటూ ఎమోజీపీడియా జేన్ సోలోమన్ ఇచ్చిన స్టేట్మెంట్పై తిట్లు పడగా.. చివరికి తన మాటలకు క్షమాపణలు చెప్పాడు సోలోమన్. మరి విమర్శల నేపథ్యంలో యాపిల్ వెనక్కి తగ్గుతుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి!. చదవండి: మాస్క్ ఉన్నా ఫేస్ డిటెక్ట్ చేసి.. లాక్ తీసేస్తది! -
హృదయం ముక్కలైపోయింది: షణ్నూ ఇన్‌స్టా పోస్ట్..
Shanmukh Posts Heart Broken Emoji After Deepthi Sunaina Live Chat: దీప్తి సునయన- షణ్ముఖ్ బ్రేకప్ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 5ఏళ్లు రిలేషన్ షిప్లో ఉన్న ఈ జంట బిగ్‌బాస్ ఎఫెక్ట్‌తో విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ తమ దారులు వేరంటూ షణ్ముఖ్‌తో దీప్తి సునయన తెగదెంపులు చేసుకుంది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బ్రేకప్ అనంతరం తొలిసారి అభిమానులతో ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి సునయన ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇన్నేళ్లలో తన లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదని, ఇకపై వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అంటూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం అకస్మాత్తుగా లైవ్ నుంచి వెళ్లిపోయింది. అయితే దీప్తి లైవ్ చాట్ తర్వాత కాసేపటికే షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. హృదయం ముక్కలైపోయిన ఎమోజీలను జత చేశాడు. ప్రస్తుతం షణ్నూ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఇలాంటి కష్ట సమయంలో మేం అండగా ఉంటాం అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. చదవండి: Shrihan: బిగ్‌బాస్ రేపిన చిచ్చు.. సిరి-శ్రీహాన్ కూడా విడిపోతారా? రౌడీ హీరో విజయ్‌తో రష్మిక డేటింగ్? లీకైన ఫోటోలు View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
అమ్మాయిలూ.. అది ఉత్సాహం కాదు సెక్స్ అప్పీల్!
కొంచెం బాధ, మరికొంచెం జాలి, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, అమితమైన ప్రేమ..ఇలా ఏ భావాన్ని అయినా, ఎంత భారీ భావోద్వేగాన్ని అయినా సింపుల్‌గా వ్యక్తపరచడానికి ఎమోజీలును ఉపయోగిస్తుంటాం. అలాంటి ఎమోజీలకు గుర్తింపు దక్కిన రోజు ఇది. ఇవాళ (జులై 17)న వరల్డ్ ఎమోజీ డే. స్మార్ట్ ఫోన్లలో ఎన్ని అప్డేట్లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు చాంతాడంత మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా ఏంటో తెలుస్తుంది. చాలామందికి ఇవి పనుల్ని తేలిక చేస్తుంటాయి, కొందరికి సరదా పంచుతుంటాయి. ఇక మంచం మీద నుంచి లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా, కాలకృత్యాల నుంచి ప్రతీ పనికి ఏదో సింబల్‌తో ఎమోజీలు కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా అప్డేట్స్లతో వస్తుంటాయి. అయితే పసుపు రంగులో ఉండే ఈ గుర్తుల్లో కొన్నింటిని కొందరు పొరపాటుగా అర్థం చేసుకుంటుంటారు. ఉదాహరణకు.. క్లాప్స్ సింబల్‌ను కొందరు దణ్ణం సింబల్‌గా పొరబడుతుంటారు. అలాగే కొన్ని ఎమోజీలకు అర్థాలు వేరుగా కూడా ఉన్నాయి. స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ముఖంలో సిగ్గు.. సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్లు.. చుట్టూ హార్ట్ సింబల్స్. చాలామంది దీనిని సిగ్గుకి, సంతోషానికి, అవతలివాళ్లపై ఆప్యాయతను వ్యక్తపర్చడానికి ఉపయోగిస్తుంటారు. ఎవరికి పడితే వాళ్లకు పంపిస్తుంటారు. కానీ, ఆ ఎమోజీ అసలు ఉద్దేశం తాను పీకలలోతులో ప్రేమలో మునిగిపోయానని అవతలి వాళ్లకు తెలియజెప్పడం. డ్యాన్సింగ్ ట్విన్స్ విత్ హార్న్స్ ఇద్దరు అమ్మాయిలు నెత్తిన కొమ్ముల మాదిరి(కుందేలు చెవులు) వాటితో డ్యాన్స్ చేసే ఎమోజీ. చాలామంది అమ్మాయిలు గ్రూపులలో ఈ ఎమోజీలను ఎక్కువగా వాడుతుంటారు. ఎగ్జయిట్‌మెంట్‌కు దీన్నొక ప్రతీకగా దానిని భావిస్తుంటారు. కానీ, దాని అసలు అర్థం అది కాదు. నెత్తి మీద అలా కుందేలు చెవులు, కొమ్ములు ఉండే ఆ ఎమోజీని ‘సెక్స్ అప్పీల్’ కోసం పెట్టారు. అంతేకాదు అడల్ట్ సినిమాల్లోనూ ఇలాంటి గెటప్‌లను అవతలివాళ్లను రెచ్చగొట్టే చేష్టల కోసం ఉపయోగిస్తుంటారు. ఇక జపాన్ కాన్సెప్ట్‌లో ఫిక్షన్ క్యారెక్టర్లకు సంబంధించి గెటప్‌లను వేసినప్పుడు ‘కాస్ప్లే’ పేరిట ఈ సింబల్‌ను ఉపయోగిస్తారు. ప్లీడింగ్ ఫేస్ ఈ ఎమోజీకి ఏడుపుగొట్టు ఎమోజీ అనే పేరుంది. కానీ, దీన్ని పప్పీ డాగ్ ఐస్ అంటారు. ‘వేడుకోలు’ కిందకు వస్తుంది ఇది. అయితే ‘టచ్ చేశావ్’ అనే భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఈ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. షూటింగ్స్టార్ మ్యాజిక్ ఎమోజీ అని కూడా పిలుచుకుంటారు. ఎక్కువ ఉత్సాహంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది మైకాన్ని ఉద్దేశించి రూపొందించిన ఎమోజీ. ది పూప్ ఎమోజీ సింబల్ చూస్తేనే ఇదేంటో అందరికీ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ, దీని అర్థం ‘అదృష్టం’ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కావాలంటే ఎమోజీ డిక్షనరీ ఓపెన్ చేసి చూడడండి. ఎమోజీలు ఎప్పటికీ ఫేడ్ అవుట్ కావు. ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి, పైన చెప్పిన ఎమోజీలను నెక్స్ట్ ఎప్పుడైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అన్నట్లు లండన్‌కు చెందిన ఎమోజీపీడియా ఫౌండర్ జెర్మీ బర్గ్(37).. 2014 జులై 17న వరల్డ్ ఎమోజీ డేను మొదలుపెట్టాడు. అంతేకాదు ఈరోజున ఎమోజీలను ఎక్కువగా ఉపయోగించడంటూ ఓ పిలుపు కూడా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన కొత్త ఎమోజీలలో.. గర్భంతో ఉన్న మగవాళ్ల ఎమోజీ విమర్శలతో పాటు విపరీతమైన చర్చకూ దారితీస్తోంది. -
రావణుడిగా ఉద్ధవ్.. లక్ష్మీబాయిగా క్వీన్
ముంబై: ప్రస్తుతం మహారాష్ట్రలో కంగన వర్సెస్ సేన వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఎంసీ కంగన కార్యాలయాన్ని కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఆమె పోరటాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి కంగనకు షేర్ చేసిన ఒక ఎమోజీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో శివాజీ మహారాజ్.. కంగనకు కత్తి ఇస్తున్నట్లు ఉండగా.. వెనక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను రావణుడితో పోల్చారు. ఈ ఎమోజీ పట్ల కంగన ఉద్వేగానికి గురయ్యారు. ‘ధన్యవాదాలు వివేక్ జీ. నేను లక్ష్మీబాయి, వీర్ శివాజీ అడుగుజాడల్లో నడుస్తాను. నా పనిని కొనసాగిస్తాను. వారు నన్ను భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ధైర్యంతో ముందుకు వెళ్తాను. జై హింద్.. జై మహారాష్ట్ర’ అంటూ కంగనా మరాఠీలో ట్వీట్ చేశారు. (చదవండి: ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..) Received many memes, this one sent by my friend @vivekagnihotri ji made me emotional. लक्ष्मीबाई, वीर शिवाजी यांच्या पावलावर पाऊल ठेवून मी माझे कार्य पुढे करत राहीन. जरी त्यांनी मला घाबरवण्याचा खूप प्रयत्न केला तरीही मी धैर्याने पुढे जात राहीन जय हिंद, जय महाराष्ट्र 🙏 pic.twitter.com/c4KvpVcqX1 — Kangana Ranaut (@KanganaTeam) September 12, 2020 కంగన ముంబైని పీఓకేతో పోల్చడంతో ప్రారంభమైన వివాదం.. ఆమె కార్యలయాన్ని కూల్చడం వరకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్రం కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. తనకు ఎన్ని అడంకులు ఎదురైనా తలదించకుండా ఝాన్సీ లక్ష్మీబాయిలా ముందుకు వెళ్తానంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజు ఘాటుగా స్పందించాడు. భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతోమంది వీరుల పాత్రలు పోషించారని ఒక్క సినిమాతోనే (కంగనా) ఝాన్సీ లక్ష్మీ బాయ్ అయిపోయినట్లు అనుకోకని కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా కంగనాకు వై కేటగిరి భద్రత కల్పించడంపై కూడా ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
ఫేస్బుక్ కొత్త ఎమోజీ.. ఫన్నీ మీమ్స్ వైరల్
ఫేస్బుక్లో కొత్తగా వచ్చిన కేరింగ్ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్‌గా మారింది. ఈ ఎమెజీ వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ్యవాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజలు రోజంతా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో వారి స్నేహితులతో, సన్నిహితులతో చాట్ చేస్తూ తమ భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రేమ, చిరునవ్వు, బాధ, కోపం, అలగడం వంటి భావాలను తెలపడానికి వాట్సప్, ఫేస్బుక్లో ఇప్పటికే ఆరు ఎమోజీలు ఉన్న విషయం తెలిసిందే. (ఫేస్బుక్లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం!) "Mask off" on the Facebook "Care Emoji"? It was actually the Uncle Fester Emoji the whole time! pic.twitter.com/8EBzkw5U7V — Parallax Views w/ J.G. Michael (Podcast) (@ViewsParallax) May 3, 2020 అయితే ఇప్పడు కొత్తగా లాక్డౌన్లో మన వారిని జాగ్రత్తగా ఉండమని చెబుతూ వారిపై మనకు ఉన్న బాధ్యతను తెలియపరచడానికి ఇటీవల ‘కేరింగ్’ ఎమోజీని ఫేస్బుక్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రేమ, చిరునవ్వులతో హృదయాన్ని హత్తుకుని ఉన్న ఎమోజీకి కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుంటే మరికొందరు ‘ఫేస్బుక్ కేరింగ్ ఎమోజీని షేర్ చేస్తుంటే.. అది లేని వారి రియాక్షన్ ఎలా ఉంటుంది’ ‘ఈ కేరింగ్ ఎమోజీ కోసం నా ఫేస్‌బుక్‌ను ఆప్డేట్ చేస్తూనే ఉన్నాను.. కానీ అది రావడం లేదు’ అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి ట్విటర్లో షేర్ చేస్తున్నారు. కాగా ఈ ఎమోజీని విడుదల చేస్తున్నట్లు కమ్మూనికేషన్ మేనేజర్ అలెగ్జాండ్రూ వోయికా ఏప్రిల్‌లో ట్వీట్ చేశాడు. ‘‘మేము కొత్తగా కేరింగ్ ఎమోజీని ఫేస్బుక్, మెసెంజర్లో విడుదల చేస్తున్నాము. ఈ విపత్కర కాలంలో దూరంగా ఉన్న మీ వాళ్లపై ప్రేమను పంచుకునేందుకు ఈ ఎమోజీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశాడు. -
ఈ ఎమోజీలను వాడొద్దు.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ : లైంగిక వాంఛను తెలిపే లేదా సూచించే ఎమోజీలపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నిషేధం విధించింది. వంకాయ, పిక్క ఉండే పీచ్ పండు, కింద పడుతున్న నీటి బిందువుల ఎమోజీలు సహా లైంగిక కోరికలను తెలియజేసే ఇతర ఏ ఎమోజీని వాడరాదంటూ యూజర్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే నగ్న ఫొటోల పోస్టింగ్‌ను కూడా నిషేధిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియజేయలేదు. ఈ రెండు సామాజిక వేదికలను వేశ్యలు తమ లైంగిక వ్యాపారం కోసం వాడుకోకుండా నివారించేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వేశ్యల కోసమంటూ.. సరదాగా లైంగిక కోరికలపై జోకులు వేసుకోకుండా, కబుర్లు చెప్పుకోకుండా ఇదేమీ నిషేధమంటూ పలువురు యూజర్లు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం, వ్యాపారం కోసమే కాకుండా విద్వేష భావాల కోసం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోని యాజమాన్యం ఈ ఎమోజీలను పట్టించుకోవడం ఏమిటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. పరస్పర లైంగిక వాంఛలను తెలియజేసే ఇలాంటి ఎమోజీల వల్ల ముఖ్యంగా తన లాంటి పెళ్లయిన మగవాళ్లు అంతులేని బాధను అనుభవించాల్సి వస్తోందని ఇటీవల సోషల్ మీడియాలో వాపోయిన 42 ఏళ్ల ర్యాప్ సింగర్ కన్యే వెస్ట్‌కు ఇది శుభవార్త కావచ్చని ఒకరు వ్యాఖ్యానించగా, ఆయన భార్య కిమ్ కర్దాషియిని ‘ఎక్స్పోజింగ్’ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటే బాధ పడని వ్యక్తి, వీటికి ఎందుకు బాధ పడుతున్నారో అర్థం కావడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు. -
తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’
టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ చిత్రానికి దక్కని అరుదైన ఘనతను ‘సాహో’ సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. యువీ క్రియేషన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిని చిత్ర బృందానికి మరింత జోష్ కలిగించే వార్త లభించింది. తాజాగా సాహోకు ట్విటర్ ఎమోజీ వచ్చింది. ఇందులో వింతేముంది అనుకోకండి. ట్విటర్ ఎమోజీ లభించిన తొలి తెలుగు సినిమాగా ‘సాహో’నిలిచింది. టాలీవుడ్‌ను ఏలిన అగ్రహీరోల సినిమాలకు సాధ్యంకానీ ఘనతను ప్రభాస్ సాహో సాధించింది. ఈ మధ్యకాలంలో తమిళంలో కాలా, సర్కార్, బాలీవుడ్లో జీరో, సుల్తాన్ సినిమాలకు ట్విటర్ ఎమోజీలు వచ్చాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో ‘సాహో’పై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: ‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు ‘సాహో నుంచి తీసేశారనుకున్నా’ సాహో : ప్రభాస్ సింగిలా.. డబులా? -
కొత్త గుర్తు
నెట్లో గత రెండు రోజులుగా ఎర్రటి రంగులో రక్త బిందువు ఒకటి కనిపిస్తోంది! రక్తం ఎర్రగానే కదా ఉంటుంది. ‘ఎర్రటి రంగులో రక్త బిందువు’ ఏమిటి? అసలది నీటి బిందువులా ఉంది. ఎర్రగా ఉంది కాబట్టి రక్త బిందువు అయింది. అందుకే.. ఎర్రటి రంగులోని రక్తబిందువు అనడం. అక్కడితో అయిపోలేదు. ఆ రక్త బిందువు వెనుకంతా లేత నీలం రంగులో ఉంది. బ్లడ్ డ్రాప్‌కి బ్యాక్‌డ్రాప్. రక్త బిందువు వెనుక నుంచి ముదురు నీలి రంగు తరగలు, కొన్ని నీటి బిందువులు, ‘నీటి నక్షత్రాలు’ మెల్లగా కిందికి రాలుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపిన గ్రాఫిక్ ఇంటర్‌ఛేంజ్ ఫార్మాట్ (జిఫ్) రక్తబిందువు ఎమోజీ అది. పీరియడ్ ఎమోజీ! ‘ప్యాడ్ డేస్’లో ఉన్నాను అని ఫోన్లో సంకేత పరిచే ఎమోజీ. ‘ఇవాళ రాలేను’ అని ఆ రక్తబిందువు ఎమోజీని సెండ్ కొడితే అవతలి వాళ్లకు అర్థమైపోతుంది. ఫలానా పర్టిక్యులర్ కారణం వల్ల ఆఫీస్‌కో, గుడికో, ముందుగా అనుకున్నట్లు ఇంకో ప్లేస్‌కో రాలేకపోతున్నట్లు. ఆ ఎమోజీ లేకపోయినా విషయాన్ని ఏదో ఒక విధంగా ఇండికేట్ చెయ్యొచ్చు కానీ, అదొకటి ఇప్పుడు చేతి వేళ్ల కిందికి రాబోతోంది. మార్చిలో లాంచింగ్. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్ల ఎమోజీ లిస్టులో ఇది కూడా ఉంటుంది. పేరు.. పైన విన్నదే.. ‘పీరియడ్ ఎమోజీ’. బ్రిటన్‌లో ఆడపిల్లలు, వారి ఆరోగ్యం, నెలసరి పరిశుభ్రత.. ఇవన్నీ చూసేవాళ్లు కొందరు రెండు పీరియడ్ ఎమోజీలను పంపిస్తే, అమెరికాలో ఎమోజీలను డిజైన్ చేసేవాళ్లు ఈ రక్తబిందువును ఫైనల్ చేశారు. వాళ్లు పంపిన రెండో ఎమోజీ.. రక్తం మరకలు ఉన్న తెలుపు రంగు అండర్వేర్. మరీ నేరుగా ఉంది కాబట్టి అండర్వేర్ ఎమోజీని పక్కన పెట్టేశారు అమెరికా వాళ్లు. మంచి నిర్ణయమే. అయితే మంచి నిర్ణయం కాదని అనిపించడానికి అవకాశం ఉన్నదేమిటంటే.. పీరియడ్స్‌కి ఇలా ఒక ‘ఇకీ’, ‘యుకీ’, ‘గిమ్మికీ’ ఎమోజీని క్రియేట్ చెయ్యడం! ఇకీ యుకీ గిమ్మికీ అంటే.. బీభత్స భయానకంగా. దీంతో ఇప్పుడు.. ఇదేమైనా సమ్‌థింగ్ సమ్‌థింగా నిశ్శబ్దాన్ని ఛేదించడానికి అనే వాయిస్ ట్విట్టర్లో అక్కడా వినిపిస్తోంది. కొందరైతే.. ఇంతకన్నా ప్లెజెంట్ ఐడియాలు రాలేదా, ఎవరో మగవాళ్లే ఈ ఎమోజీని క్రియేట్ చేసి ఉంటారని విసుగ్గా ముఖాలు పెట్టేస్తున్నారు. మహిళల బిడియం తగ్గించడానికి, నెలసరిని ఒక నిత్యజీవిత సరళ వ్యక్తీకరణగా మార్చేయడానికీనట బ్రిటన్వాళ్లు, యు.ఎస్.వాళ్లు పీరియడ్ ఎమోజీని ఇన్వెంట్ చేశారు. పాయింట్లెస్ అనిపిస్తుంటే కనుక మీరు రైటే. లేదూ.. పాయింట్ ఉందనిపించినా కూడా మీరు రైటే. దీనిపై రెండు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి మరి! -
స్వాతంత్ర్య దినోత్సవ వేళ స్పెషల్ ఎమోజీ
న్యూఢిల్లీ : దేశమంతా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ పాటికే మీ మీ సోషల్ మీడియా సైట్ల ద్వారా సన్నిహితులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఉంటారు. కానీ కాస్తా క్రియేటివిటీగా శుభాకాంక్షలు తెలపాలనుకునే వారి కోసం ట్విటర్ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ రోజు సాధరణంగా ఎక్కువ మంది మూడు రంగుల జెండాతో ఉన్న సందేశాలనే పంపిస్తుంటారు. అలా కాకుండా కాస్తా భిన్నంగా ఎర్రకోట ఎమోజీని పంపిస్తే ఎలా ఉంటుంది.. ? చాలా బాగుంటుంది కదా. ఇలాంటి ఆలోచనతోనే ట్విటర్ తన యూజర్ల కోసం ఈ సదుపాయాన్ని కల్పించింది. అది కూడా మాతృభాషలో శుభాకాంక్షలు తెలిపివారికి మాత్రమే ఈ అవకాశం అంటుంది. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఎర్రకోట ఎమోజీని పంపిచాలనుకునే వారు మీ సందేశంతో పాటు ‘#IndependenceDayIndia’ను జత చేస్తే ఎరుపు రంగులో ఉన్న ఎమోజీ ఒకటి వస్తుంది. అది ఏంటంటే ఎర్రకోట. అవును మొఘలుల కాలంలో నిర్మించిన ఎర్రకోట.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని ప్రసంగించే ఎర్రకోట ఎమోజీ వస్తుంది. అంతేకాక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే ‘#IndiaIndependenceDay’ హాష్‌ట్యాగ్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది అని తెలిపింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ కేవలం ట్విటర్ మాత్రమే కాక గెయింట్ సెర్చింజన్ గూగుల్ కూడా డూడుల్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఈ డూడుల్ మీద క్లిక్ చేస్తే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన వార్తా విశేషాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది గూగుల్. -
తలైవా అభిమానుల అసంతృప్తి
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానులకు పండుగే. రజనీ సినిమాలు ఫెయిల్ అయినా సరే ఈ సూపర్‌స్టార్ క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరదు. గత కొంతకాలంగా తలైవాకు సరైన హిట్ లేదు. కొచ్చాడియన్, లింగా, కబాలి సినిమాలు ఆశించనంతగా ఆడలేదు. అయినా సరే మళ్లీ రజనీ సినిమా వస్తుందంటే అభిమానలు వేయి కళ్లతో ఎదురు చూస్తూంటారు. ప్రస్తుతం కాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కబాలి ఫేం పా రంజిత్ డైరెక్షన్లో రాబోతున్న కాలా చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కబాలి విడుదల సమయంలో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు బహుశా ఏ ఇతర భారతీయ సినిమాలకు చేసి ఉండరు. ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్స్‌ను వేశారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు కబాలి రిలీజ్ రోజున సెలవు కూడా ప్రకటించాయి. ఇప్పుడు కాలా సినిమాకు ట్విటర్ ఎమోజీని క్రియేట్ చేశారు చిత్రయూనిట్. అయితే దీనిపై తలైవా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఎమోజీలో రజనీ సరిగా కనబడటం లేదని అభిమానులు వాపోతున్నారు. మరికొందరు కొన్ని నమూనాలను డిజైన్ చేసి చిత్రయూనిట్‌కు ట్యాగ్ చేశారు. మరి వీరి బాధను కాలా టీం పట్టించుకుంటుందో లేదో చూడాలి. #Kaala emoji. All i see is a think red line with a black background. Wish they chose a different pic or worked on the resolution. — Prashanth Rangaswamy (@itisprashanth) May 28, 2018 Actually, i expected an Emoji of something like this from the team #Kaala , what they delivered is hardly visible Made some quick images, please take my samples into consideration, @wunderbarfilms @dhanushkraja @beemji or ask designer to comeup something visible to eyes! pic.twitter.com/zNBhQXzPfx — AG (@arunrp555) May 28, 2018 -
వాట్సాప్‌లో ఆ ఎమోజీ...నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్మరోసారి చిక్కుల్లో పడింది. ముఖ్యంగా ఎమోజీల్లో అసభ్యకరమైన చిహ్నం ఉందంటూ ఢిల్లీ న్యాయవాది ఒకరు వాట్సాప్‌కు నోటీసులు పంపారు. ఢిల్లీ న్యాయవాది గుర్మీత్ సింగ్ వాట్సాప్‌కు తాజా నోటీసులు పంపారు. దీనిపై 1 5రోజులలోపు అభ్యంతరకరంగా ఉన్న మిడిల్ ఫింగర్ చిహ్నాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది అశ్లీలమైనదిగాను, హానికరంగాను ఉందని గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమైనదని కూడా ఆయన వాదిస్తున్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని 354 ,509 సెక్షన్ల ప్రకారం, ఎవరైనా అశ్లీలమైన, అప్రియమైన, అశ్లీల సంజ్ఞల వాడకం చట్టవిరుద్ధమన్నారు. -
పురాతన ఎమోజీ!
లండన్ : ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎమోజీ (భావాల ను తెలిపే చిహ్నం)ని పరిశోధకు లు గుర్తించారు. 1635 సంవత్స రానికి చెందిన ఓ చట్టపరమైన దస్త్రాల్లో నవ్వుతున్న మొహంతో ఈ ఎమోజీ ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. స్లోవేకి యాలోకి స్ట్రాజోవ్ పర్వతాలకు పక్కన ఉన్న గ్రామంలో ఓ న్యాయవాది మున్సిపల్ అకౌంట్స్‌ను సమీక్షించి సంతకం చేశారు. ఆ సంతకంలో ఓ వృత్తం గీసి అందులో రెండు చుక్కలు, ఓ గీతను గీశారు. దీన్ని పరిశోధకులు పురాతన ఎమోజీగా గుర్తించారు. దీనికి ముందు 1648లోని ఓ ఎమోజీ పురాతనమైనదిగా గుర్తింపు పొందింది.