మనం ఇప్పుడూ ఏ వ్యవహారమైన ఫోన్‌ల ద్వారా లేదా మెసేజ్‌ల ద్వారా చక్కబెట్టేస్తున్నాం. దీంతో పని సులువుగా అవ్వడమే గాక టైం కూడా కలిసిస్తోంది. సాధారణంగా మెసేజ్‌లలో మన భావాలను వ్యక్తపరిచేలా.. ఎమోజీలు ఉపయోగించడం అనేది పరిపాటే. అలానే ఓ రైతు కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఆ ఎమోజీని ఉపయోగించాడు. దీంతో ఆ రైతుకి కోర్టు ఏకంగా రూ. 50 లక్షల జరిమాన విధించింది.
అసలేం జరిగిందంటే..కెనడాలోని క్రిస్ అచ్టర్ అనే రైతు ఓ కొనుగోలుదారుతో ఫోన్‌లో.. మెసేజ్‌లతో సంప్రదింపులు చేశాడు. అతను సుమారు 86 టన్నుల అవిసె గింజలు కొనగోలు చేస్తానని, కేజి రూ 1048/- చొప్పున చేసి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. అందుకు సదరు రైతు అంగీకరించడమే గాక నవంబర్ కల్లా డెలివరి చేస్తానని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారయ్యినట్లే కదా అని అడగగా.. ధృవీకరిస్తున్నట్లుగా రైతు ఈ థంబ్స్ అప్ ఎమోజీని పంపాడు. దీంతో సదరు కొనుగోలుదారుడు ఒప్పందం ఖరారయ్యిందని భావించాడు.
తీరా చూస్తే..అనుకున్న సమయానికి రైతు అవిసె గింజలు పంపిణీ చేయలేదు. దీంతో కొనగోలుదారుడు రైతుని ప్రశ్నించగా..తాను కాంట్రాక్ట్ తీసుకుంటున్నా అని ధృవీకరించానేగాని డెలివరీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని వాదించాడు. దీంతో కోర్టుని ఆశ్రయించారు ఇద్దరూ..కొనగోలుదారుడు ఒప్పందాన్ని నెరవేర్చలేదని మెసేజ్‌ల స్క్రీన్ షాట్ ఆదారాలను కోర్టుకి సమర్పించాడు. కాంట్రాక్ట్‌ను అందుకుంటున్నట్లుగా ఆ గుర్తుని పంపిచానని చెప్పాడు. ఐతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు నిరూపించేలా ఏ ఆధారాన్ని సమర్పించలేకపోయాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఆమోదాన్ని సూచించడానికి 'థంబ్స్ అప్ ఎమోజి'ని సాధారణంగా ఉపయోగిస్తారని పేర్కొంది. అలాగే ''డిక్షనరీ.కమ్" అందించిన ఎమోజీ నిర్వచనాన్ని కూడా ప్రస్తావిస్తూ..డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఒప్పందం ఆమోదం లేదా ప్రోత్సాహాన్ని వ్యక్తికరించడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తామని స్పష్టం చేసింది. దేన్నైనా ఒప్పందం చేసుకున్నారు అని నిర్థారించడానికి సంతకాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం.
ఇది సర్వసాధారణంగా జరిగే సాంప్రదాయపద్ధతి. అదే ఎమోజీలు ఉపయోగించడం అనేది ఆధునిక పద్ధతి అని కోర్టు వెల్లడించింది. ఇక్కడ థంబ్స్ అప్ ఎమోజీ సాంప్రదాయేతరమైనది అయినప్పటికీ ఆ వ్యక్తి అంగీకరించాడు అనడానికి అతని మొబైల్ నెంబర్ ద్వారా చేసిన మెసేజ్‌లే ఆధారమని స్పష్టం చేసింది. అందువల తమ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే గాక అంగీకరించలేదని వాదించినందుకు గానూ రైతుకి ఏకంగా రూ. 50,88,893/-లు జరిమానా విధించింది.
(చదవండి: యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్నికూడా కలగజేస్తుందా!)
Comments
Please login to add a commentAdd a comment