thumbs up
-
ఆ ఎమోజీని ఉపయోగించినందుకు..రైతుకి రూ. 50 లక్షలు జరిమానా
మనం ఇప్పుడూ ఏ వ్యవహారమైన ఫోన్ల ద్వారా లేదా మెసేజ్‌ల ద్వారా చక్కబెట్టేస్తున్నాం. దీంతో పని సులువుగా అవ్వడమే గాక టైం కూడా కలిసిస్తోంది. సాధారణంగా మెసేజ్‌లలో మన భావాలను వ్యక్తపరిచేలా.. ఎమోజీలు ఉపయోగించడం అనేది పరిపాటే. అలానే ఓ రైతు కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఆ ఎమోజీని ఉపయోగించాడు. దీంతో ఆ రైతుకి కోర్టు ఏకంగా రూ. 50 లక్షల జరిమాన విధించింది. అసలేం జరిగిందంటే..కెనడాలోని క్రిస్ అచ్టర్ అనే రైతు ఓ కొనుగోలుదారుతో ఫోన్లో.. మెసేజ్‌లతో సంప్రదింపులు చేశాడు. అతను సుమారు 86 టన్నుల అవిసె గింజలు కొనగోలు చేస్తానని, కేజి రూ 1048/- చొప్పున చేసి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. అందుకు సదరు రైతు అంగీకరించడమే గాక నవంబర్ కల్లా డెలివరి చేస్తానని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారయ్యినట్లే కదా అని అడగగా.. ధృవీకరిస్తున్నట్లుగా రైతు ఈ థంబ్స్ అప్ ఎమోజీని పంపాడు. దీంతో సదరు కొనుగోలుదారుడు ఒప్పందం ఖరారయ్యిందని భావించాడు. తీరా చూస్తే..అనుకున్న సమయానికి రైతు అవిసె గింజలు పంపిణీ చేయలేదు. దీంతో కొనగోలుదారుడు రైతుని ప్రశ్నించగా..తాను కాంట్రాక్ట్ తీసుకుంటున్నా అని ధృవీకరించానేగాని డెలివరీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని వాదించాడు. దీంతో కోర్టుని ఆశ్రయించారు ఇద్దరూ..కొనగోలుదారుడు ఒప్పందాన్ని నెరవేర్చలేదని మెసేజ్‌ల స్క్రీన్ షాట్ ఆదారాలను కోర్టుకి సమర్పించాడు. కాంట్రాక్ట్‌ను అందుకుంటున్నట్లుగా ఆ గుర్తుని పంపిచానని చెప్పాడు. ఐతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు నిరూపించేలా ఏ ఆధారాన్ని సమర్పించలేకపోయాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమోదాన్ని సూచించడానికి 'థంబ్స్ అప్ ఎమోజి'ని సాధారణంగా ఉపయోగిస్తారని పేర్కొంది. అలాగే ''డిక్షనరీ.కమ్" అందించిన ఎమోజీ నిర్వచనాన్ని కూడా ప్రస్తావిస్తూ..డిజిటల్ కమ్యూనికేషన్లో ఒప్పందం ఆమోదం లేదా ప్రోత్సాహాన్ని వ్యక్తికరించడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తామని స్పష్టం చేసింది. దేన్నైనా ఒప్పందం చేసుకున్నారు అని నిర్థారించడానికి సంతకాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇది సర్వసాధారణంగా జరిగే సాంప్రదాయపద్ధతి. అదే ఎమోజీలు ఉపయోగించడం అనేది ఆధునిక పద్ధతి అని కోర్టు వెల్లడించింది. ఇక్కడ థంబ్స్ అప్ ఎమోజీ సాంప్రదాయేతరమైనది అయినప్పటికీ ఆ వ్యక్తి అంగీకరించాడు అనడానికి అతని మొబైల్ నెంబర్ ద్వారా చేసిన మెసేజ్‌లే ఆధారమని స్పష్టం చేసింది. అందువల తమ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే గాక అంగీకరించలేదని వాదించినందుకు గానూ రైతుకి ఏకంగా రూ. 50,88,893/-లు జరిమానా విధించింది. (చదవండి: యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్నికూడా కలగజేస్తుందా!) -
దలాల్ స్ట్రీట్‌కు జీఎస్టీ బూస్ట్: ట్రిపుల్ సెంచరీ
ముంబై: దలాల్ స్ట్రీట్‌కు జీఎస్టీ బూస్ట్ లభించింది. దీంతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ సాధించి 31వేలకు ఎగువన ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ కౌంటర్లలో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లతో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్, నిప్టీ రెండూ సాంకేతిక స్థాయిలను అధిగమించి స్థిరంగా ఉండడం విశేషం. ట్రేడింగ్ ప్రారంభంలోనే 31,258 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ అనంతరం ఆ స్థాయికి నుంచి కిందిపడినా మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి, మెటల్, కన్సుమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, ఆటో షేర్లు 3.42 శాతం లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 305 పాయింట్లు లాభపడి 31,226 వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,600 ని అధిగమించింది. 89 పాయింట్ల లాభంతో 9606 వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగం 3.6 శాతం జంప్ చేసి తన హవా కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో దూకుడుమీద ఉన్న ఐటీసీ తన లాభాల పరుగును కొనసాగిస్తోంది. దీంతో ఎనలిస్టులు కూడా సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు. ఆరంభంలోనే 8 శాతం ఎగిసిన ఐటీసీ టాప్ విన్నర్‌గా కొత్త రికార్డులవైపు సాగుతోంది. దీంతోపాటు రియల్టీ, మెటల్ 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఆటోలో మారుతి టాప్ విన్నర్‌గా ఉంది. హిందాల్కో, ఇన్ఫ్రాటెల్, ఐషర్, వేదాంతా, మారుతీ, ఎంఅండ్ఎం, బీవోబీ, అల్ట్రాటెక్, టాటా స్టీల్ ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా పవర్, ఐబీ హౌసింగ్ నష్టాల్లో ఉన్నాయి. -
కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల ముక్కలు
కొత్తపేట: పాము పిల్ల ముక్కలున్న కూల్‌డ్రింక్ తాగి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మేడిద సత్యనారాయణ అనే వ్యక్తి శనివారం తన కుమార్తెను కొత్తపేటలో ఆమె అత్తవారింటిలో దించి తిరిగివెళుతూ స్థానిక కమ్మిరెడ్డిపాలెం సెంటర్లోని ఒక కూల్ డ్రింక్ షాపులో 200 ఎం.ఎల్. థమ్సప్ కూల్‌డ్రింక్ బాటిల్ తీసుకుని తాగుతుండగా చిన్న పాము ముక్కలు నోటికి తగిలాయి. అప్పటికే రెండు ముక్కలు పొట్టలోకి వెళ్లిపోవడంతో వాంతులు చేసుకున్నాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆయన బంధువులకు సమాచారం అందజేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం మండలం బొమ్మూరులోని ఒక షాపులోని థమ్సప్ కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల కనిపించిన ఘటన మరిచిపోకముందే శనివారం మరో ఘటన అదే కంపెనీ శీతల పానీయంలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.