కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల ముక్కలు | Pieces of the small snake in the Cool drink | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల ముక్కలు

Published Sun, Jun 11 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల ముక్కలు

కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల ముక్కలు

కొత్తపేట: పాము పిల్ల ముక్కలున్న కూల్‌డ్రింక్‌ తాగి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మేడిద సత్యనారాయణ అనే వ్యక్తి శనివారం తన కుమార్తెను కొత్తపేటలో ఆమె అత్తవారింటిలో దించి తిరిగివెళుతూ స్థానిక కమ్మిరెడ్డిపాలెం సెంటర్‌లోని ఒక కూల్‌ డ్రింక్‌ షాపులో 200 ఎం.ఎల్‌. థమ్సప్‌ కూల్‌డ్రింక్‌ బాటిల్‌ తీసుకుని తాగుతుండగా చిన్న పాము ముక్కలు నోటికి తగిలాయి.

అప్పటికే రెండు ముక్కలు పొట్టలోకి వెళ్లిపోవడంతో వాంతులు చేసుకున్నాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆయన బంధువులకు సమాచారం అందజేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం మండలం బొమ్మూరులోని ఒక షాపులోని థమ్సప్‌ కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల కనిపించిన ఘటన మరిచిపోకముందే శనివారం మరో ఘటన అదే కంపెనీ శీతల పానీయంలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement