
2 బిలియన్ డాలర్ల బ్రాండ్లుగా థమ్సప్, స్ప్రైట్
కోకా కోలా ఇండియా వీపీ సందీప్ బజోరియా
న్యూఢిల్లీ: ఈసారి వేసవి ప్రభావం కాస్త ముందే కనిపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ డ్రింక్ బాడీఆర్మర్‌లైట్‌తో పాటు హానెస్ట్ టీ తదితర బ్రాండ్లను ఈ వేసవిలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కోకా కోలా ఇండియా, నైరుతి ఆసియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద విమానాశ్రయాల్లాంటి ప్రదేశాల్లో విక్రయిస్తున్న విటమిన్‌వాటర్‌ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.
అలాగే కోక్ జీరో షుగర్, స్ప్రైట్ జీరో షుగర్ శ్రేణిని మరింతగా విస్తరిస్తామన్నారు. ఎలక్ట్రోలైట్స్, కొబ్బరి నీటితో తయారైన బాడీఆర్మర్‌లైట్.. హైడ్రేషన్ విభాగానికి చెందిన బ్రాండ్ కాగా హానెస్ట్ టీ అనేది అస్సాం తేయాకుతో తయారైన సేంద్రియ టీ బ్రాండు. మరోవైపు, థమ్సప్, స్ప్రైట్ త్వరలో 2 బిలియన్ డాలర్ల బ్రాండ్లుగా మారే అవకాశం ఉందని సందీప్ వివరించారు. వీటితో పాటు మాజా, మినిట్ మెయిడ్ విక్రయాలను కూడా పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment