summer care
-
నెల ముందే.. నిప్పులు చెరిగే సూరీడుతో.. జర జాగ్రత్త!
మే నెలకు ముందే సూరీడు నిప్పులు కక్కుతుండటం ఆందోళనకర పరిణామం. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు ప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 41–45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ అలర్ట్‌గా భావించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలాగే 45కు పైగా ఉష్ణోగ్రత చేరిందంటే.. మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు, రెడ్ అలర్ట్‌గా నిపుణులు చెబుతున్నారు. గత అయిదు రోజులుగా ఉష్ణోగ్రతల తీరిలా. ఎండ ప్రభావం.. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలపైనా ప్రభావముంటుంది. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశముంది. – డా.జి.మంజులత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రైతులు ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాధారణ ప్రజలు ఈ ఎండలకి అల్లాడిపోతున్నారు. శనివారం ఎండ తీవ్రత 44 డిగ్రీలు నమోదు కాగా.. ఆదివారం కూడా 44 డిగ్రీలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే రీతిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. అసలే వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఎండలు దంచి కొడుతుండటంతో రైతులు ఉదయం 6 గంటలకు వెళ్లి 9 గంటలకే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పగటి పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితేనే బయటకి వస్తున్నారు. వ్యవసాయం పరంగా పంటలు చివరి దశకు చేరడంతో ఎండిపోయే ప్రమాదం కనపడుతోంది. రోజురోజుకి మారుతున్న ఎండ తీవ్రత నుంచి, వీచే వడగాలుల నుంచి జాగ్రత్తలు వహించక తప్పదు. దాహానికి తగ్గ పానీయాలు సేకరించాలి. చిన్న పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇకపై ఈ ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇవి చదవండి: సోమావతి అమావాస్య అంటే..రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు? -
Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్. సరైన సమయంలో గుర్తించకపోతే ఇదిప్రాణాపాయానికి కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదు. శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగాలంటే ద్రవపదార్థాలు తగినన్ని ఉండడం అవసరం. ఒకోసారి రకరకాల కారణాల వల్ల శరీరంలోని ద్రవపదార్థాలు ముఖ్యంగా నీటి శాతం బాగా తగ్గిపోయి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒకోసారిప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు మరీ ఎక్కువ. అందువల్ల డీ హైడ్రేషన్‌ని నివారించేందుకు ఈ చిట్కాలు. డీ హైడ్రేషన్ గురికాకుండా ఉండాలంటే కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. దాహంగా అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే నీరు తాగాలి. డీహైడ్రేషన్ కు గురయ్యామని సూచించే మొట్ట మొదటి సంకేతం ’దాహం’ అనిపించటం. డీ హైడ్రేషన్‌ను ఎలా గుర్తించాలంటే..? నోరంతా పొడిబారినట్లు, బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్నా తీవ్రమైన డీహైడ్రేషన్ ఎదుర్కోబోతున్నట్లు సంకేతంగా భావించాలి. తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్ లక్షణాలే. అలా ఉన్నప్పుడు చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. దానికి బదులుగా వెంటనే కొంచెం మంచి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. భరించరాని తలనొప్పి కూడా డీహైడ్రేషన్ ను తెలియజేసే సాధారణ లక్షణం. సాధారణంగా కండర తిమ్మిర్లు శరీరంలో ఎలక్ట్రోలేట్ స్థాయుల అసమతుల్యతకు కారణంగా చెబుతారు. అయితే ఇది కూడా డీహైడ్రేషన్ ను సూచించే మరొక గుర్తు. కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. డీహైడ్రేషన్ ను తెలియచేసే తీవ్రమైన సంకేతాల్లో ఇది ఒకటి. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్‌కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవేవీ అందుబాటులో లేనప్పుడు కనీసం వెంటనే నీటిని తాగడం కూడా ప్రమాద నివారణకు సహకరిస్తుంది. చర్మం సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అంటే చర్మాన్ని పట్టుకుని లాగి వదిలితే వెంటనే వెనక్కి వెళ్లకుండా పైన నిలిచినట్లుగా ఉండే ఈ సమస్యలో ఉన్నట్లే భావించాలి. అస్పష్టమైన కంటిచూపు కూడా డీహైడ్రేషన్ సూచించే ఒక గుర్తు. రక్తంలో తక్కువ చక్కెర స్థాయులు ఉన్నప్పుడు కూడా అస్పష్టమైన కంటిచూపు కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా నిర్ణీత సమయానికి భోజనం చేయలేకపోతే వెంటనే గ్లూకోజ్ నీరు తాగాలి. సులువుగా చేయగలిగేది తగినన్ని నీళ్లు తాగడం. కనీసం అదైనా సరిగా చేస్తుంటే ప్రమాదాన్ని నివారించిన వారమవుతాం. ఇవి చదవండి: ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే -
వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే..
ఇంకా వేసవికాలం పూర్తిగా రానేలేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం దాదాపు 12 నుంచి సాయంత్రం 4 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. దాంతో బయట పనులకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. అలా అని ఇంట్లో ఉందామంటే కూడా వేడి తాళలేకపోతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లినా ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది కదా అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు కదా.. దాన్ని భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చల్లదనాన్ని ఇచ్చే పెయింట్లు.. దాదాపు అన్ని ఇళ్లు నిర్మాణానికి కాంక్రీటే వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సిమెంట్, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దాంతో ఆ ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్‌ను వేసుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం కల్గుతుంది. ఇంటిపై పడిన కిరణాలు తెలుగు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ పెయింట్స్ వరకు వినియోగించవచ్చు. దీనివల్ల భవనంపైన 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఇంటి లోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ షీట్స్‌తో రక్షణ.. బస్తీల్లో బిల్డింగ్‌లతోపాటు చాలావరకు రేకుల ఇళ్లు ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మంది జీవిస్తుంటారు. వీరు తక్కువ ఖర్చుతో పైకప్పుపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిస్తే చాలు. గాలులకు ఎగిరిపోకుండా చూసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో కొన్ని ఇళ్లపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిచి వేడి తగ్గించడం ద్వారా బస్తీవాసుల్లో అవగాహన కల్పించారు. ఆరేడు డిగ్రీల వరకు లోపల వేడి తగ్గినట్లు గుర్తించారు. సోలార్ ప్లేట్లతో.. ఇంటిని చల్లగా ఉంచడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తిచేస్తూ అవసరాలకు వాడుకునేలా సోలార్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు కిలోవాట్లకు సబ్సిడీ పోను రూ.1.10 లక్షలు ఖర్చువుతుంది. నెలకు 360 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంటికి అవసరమైన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. డిస్కం నుంచి యూనిట్‌కు రూ.5 లపైన తిరిగి పొందవచ్చు. ఇదీ చదవండి.. కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు! మొక్కలను పెంచడంతో.. ఇంటిపైన ఖాళీ స్థలంలో మొక్కలను పెంచవచ్చు. దాంతో వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. రకరకాల పూలు, అలంకరణ మొక్కలు, కూరగాయలు పెంచుకోవచ్చు. అయితే అంతకంటే ముందు వాటర్ లీకేజీలు లేకుండా వాటర్‌ఫ్రూపింగ్ చేయించాలి. ఇంటి చుట్టూ మొక్కలు, నీడనిచ్చే చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. -
కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..?
గ్వాలియర్: ఎండాకాలం విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాల్పుల నుంచి తట్టుకోవడానికి రకరకాల వంటింటి చిట్కాలు పాటిస్తుంటారు. కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియ కూడా ఉల్లిపాయల చిట్కాను పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి అధికారులకు కూడా ఆయన ఆ చిట్కాను సూచించారు. వేడికి ఉల్లిపాయల ఐడియా మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఎండలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 45డిగ్రీల సెల్సియస్ వరకు చెరుకున్నాయి. దీంతో రోజురోజుకూ వడదెబ్బతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే 50 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో కేంద్ర మంత్రి సింథియా వేడినుంచి తప్పించుకోవడానికి ఉల్లిపాయలు తెచ్చుకోవాలని సూచనలు చేశారు. అధికారులు కూడా పాటించాలని సూచించారు. తానూ పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండాకాలం అయినందున ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడే తన పాకెట్లో ఉల్లిగడ్డలు వెంట తెచ్చుకుంటున్నారట సింథియా. వాటిని ఉపయోగించి శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చని చెప్పారు. వేసవి ఎండల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో నిరాటంకంగా పనిచేయగలుగుతున్నానని తెలిపారు. ఉల్లిపాయలు శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయని వెల్లడించారు. మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. అజయ్ పాల్ కూడా ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు చేశారు. తగిన మోతాదుల్లో నీటిని తాగాలని సూచించారు. ఇదీ చదవండి:'సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలది తప్పుడు చర్య.' -
ఇంద్రకీలాద్రిపై సమ్మర్ ప్రేత్యేక ఏర్పాట్లు
-
ఎండలు బాబోయ్ ఎండలు.. జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టం
భానుడి భగభగలతో వేసవి తాపం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగానూ రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా గాలి వీచింది. అనంతపురం అర్బన్: ఎండలు మండుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎమ్.గౌతమి జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం వేళ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని, వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు రావాలని తెలిపారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలనూ పేర్కొన్నారు. ఆదేశాలు ఇలా.. ● మునిసిపల్, పంచాయతీ అధికారులు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో అక్కడక్కడా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. ● డ్వామా, ఎంపీడీఓలు ఉపాధి హామీ పనుల వేళల్లో మార్పులు చేసుకోవాలి. ● 104, 108 అంబులెన్స్‌ల్లో ఐస్‌ప్యాక్‌లు, వడదెబ్బ తగిలిన వారికి అసవరమయ్యే మందులు అందుబాటులో ఉంచాలి. ● వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఆరోగ్య కేంద్రాల్లో ఉంచాలి. ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలి. ● వడదెబ్బ తగిలిన వారికి అందించే ప్రాథమిక చికిత్సపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ● అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలి. సిబ్బంది, నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ● సూదూర రూట్లలో నడిచే బస్సుల్లో తప్పసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచాలి. -
చల్లటి నీళ్లు కావాలా నాయనా.? కొన'కుండ' ఉండలేరు మరి!
కురబలకోట : మట్టి కుండలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. అల్యూమినియం, స్టీలు, ఇతర పాత్రల ప్రవేశంతో వీటికి ఆదరణ తగ్గింది. ఆధునిక (మెటల్) వంట పాత్రల వాడకం ద్వారా రోగాలు కూడా మనిషిని చుట్టుముట్టాయి. దీంతో మళ్లీ జనం ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వంటకు, తాగునీళ్లకు కుండలను ఆదరిస్తున్నారు. మట్టివి తిరిగి జన జీవన స్రవంతిలో కన్పిస్తున్నాయి. తీరెను తాపం, కలిగించెన్ ఉపశమనం వేసవిలో మట్టి కుండల్లో నీళ్లు తాగడం హాయి హాయిగా.. కూల్ కూల్‌గా అన్పిస్తుంది. వేసవి తాపాన్ని తీరుస్తాయి. దీంతో ఈ నీళ్లు మనస్సుకు హాయిని, శరీరానికి ఉపశమనాన్ని కల్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఎండల సీజన్. ఒక పక్క ఉక్క పోత, మరో వైపు మండుటెండలు. ఇలాంటి పరిస్థితుల్లో మట్టి కుండ అనగానే ఎవ్వరికై నా చల్లని నీళ్లు గుర్తుకు వస్తాయి. చలివేంద్రాలు అంటే కూడా మట్టి కుండలే కన్పిస్తాయి. ఈ కుండల్లో నీళ్లు తాగితే వేసవి తాపం తీరుతుంది. ఆల్కలీన్ లక్షణాలు నీటిలోని పీహెచ్ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయని చెబుతారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కుండ నీళ్ల వల్ల వక్రియ మెరుగపడి పొట్టకు ఇబ్బంది లేకుండా చేస్తాయన్న పేరుంది. అంతేగాకుండా ఖనిజాలు, లవణాలు కూడా అందుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మట్టి కుండల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సదుం, మదనపల్లె దగ్గర సీటీఎం, ఈడిగపల్లె, కాండ్లమడుగు, కుమ్మరపల్లె తదితర ప్రాంతాల్లో వీటిని అమ్ముతున్నారు. రోడ్ల పక్కన స్టాల్స్‌లో వీటిని విక్రయిస్తున్నారు. ఉక్క పోత ఎక్కువగా ఉండడం ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మట్టి కుండ అంటనే చల్లదనానికి మారుపేరు. దీంతో చలివేంద్రాలలో ఎక్కడ చూసినా మట్టి కుండలే కన్పిస్తాయి. మట్టి కుండలకు పెట్టింది పేరు మట్టి కుండలు, బొమ్మలు అంటేనే ఎవ్వరికై నా తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని అంగళ్లు, కంటేవారిపల్లె, ఆ తర్వాత పలమనేరులోని ఘంటావూరు. వీటికి ఇవి ప్రసిద్ధి. ఇక్కడ సీఎఫ్‌సీ సెంటర్లు, ఆధునిక మిషన్లు ఉండడంతో వీటి తయారీలో హస్త కళాకారులు ఆరితేరారు. కుండలు, కడవలు రూ.120 నుంచి రూ. 300 చొప్పున అమ్ముతున్నారు. మగ్గులు రూ.150 నుంచి రూ.250, వాటర్ బాటిళ్లు రూ.150 నుంచి రూ.200, పెరుగు, మజ్జిగ కుండలు రూ.50 నుంచి రూ.70 చొప్పున విక్రయిస్తున్నట్లు హస్తకళాకారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు సరఫరా కుండల తయారీ వెనుక కుమ్మరుల కృషి ప్రశంసనీయం. వేసవి వస్తే వీటికి తరగని డిమాండ్ ఉంటుంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫారా అవుతున్నాయి. వీటిలో నీళ్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. మూడు నెలలు వేసవి సీజన్ ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రూ.2 కోట్ల దాకా ఈ కుండల అమ్మకం ద్వారా లావాదేవీలు జరుగుతాయి. – కష్ణమూర్తి, టెర్రకోట హస్తకళాకారుల సలహాదారు ఫ్రిజ్‌లున్నా వీటిపైనే మక్కువ నగర, పట్టణ వాసులు సై తం ఫ్రిజ్‌లు ఉన్నా మట్టి కుండల వైపే చూస్తున్నా రు. వీటిలో నీళ్లు సహజంగా చల్లబడతాయి. ఆరోగ్యానికి శ్రేయస్కరమని ని పుణులు చెబుతారు. మనిషి నాగరిగత నేర్చుకు న్న తర్వాత మొదటి వంట చేసింది మట్టి పాత్రల్లోనే అని చెబుతారు. ఇవి ఇళ్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరో వైపు పర్యావరణ ప్రేమికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – శ్రీనివాసులు, హస్తకళాకారుల సంఘ నాయకులు, కురబలకోట మండలం కుండ నీరు శ్రేయస్కరం కుండ, కడవల్లోని నీరు ఎంతో మంచిది. ఇప్పటికీ పేదవాడి ప్రిడ్జ్‌గా పిలుస్తారు. సాధారణంగా మనిషి శరీరం ఆమ్లస్వభావం కల్గి ఉంటుంది. మట్టి ఆల్కలీన్. కుండనీళ్లు తాగినప్పుడు శరీర ఆమ్ల స్వభావంతో చర్య జరుపుతుంది. సరైన పీహెచ్‌కు దోహదపడుతుంది. భూమి వివిధ ఖనిజ లవణాల సహజ గని. దీని నుంచి వచ్చిన మట్టితో చేసే కుండలు, సామగ్రి ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది. – బి.పద్మనాభరెడ్డి, పవర్ వాటర్ టెక్ నిర్వాహకులు, గుంతవారిపల్లె -
సమ్మర్ కేర్.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
శివరాత్రికి శివ.. శివా... అంటూ చలి అలా వెళ్లిందో లేదో ఎండలు, ఉక్కపోత ఇలా వచ్చేసాయి. రానున్న కాలంలో ఎండలు మరింత ముదిరి మండించడం ఖాయం. మరి ఈ టైమ్‌లో అందాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది టీనేజర్లకు బెంగ. ముఖ్యంగా ముఖం, జుట్టు, అందమైన చర్మం కోసం వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. ఎండాకాలంలోనూ మన స్కిన్ కోమలంగా మెరిసిపోవాలంటే పాటించాల్సిన సింపుల్ బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎండలు భయపెడుతున్నాయి.సాధారణంగా చర్మ రక్షణ కోసం మనం ఏడాది పొడవునా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ సమ్మర్లో మాత్రం ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సిందే. లేదంటే వేడికి స్కిన్ ట్యాన్ అయిపోయి, కాంతి విహీనంగా మారిపోతుంది. సమ్మర్ కేర్‌లో అన్నింటికంటే ముఖ్యమైంది సన్‌స్క్రీన్ క్రీమ్ లేదా లోషన్. అందుకే సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడు కోవడం చాలా ముఖ్యం. అందుకే బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, రెగ్యులర్‌గా ఆఫీసులకు వెళ్ళే వారు, సన్‌స్క్రీన్ ప్రతి రోజూ ఉదయం రాయాలి. దీంతోపాటు యాంటీ టానింగ్ క్రీమ్స్ వాడాలి. . తద్వారా చర్మం టాన్ అవ్వకుండా మెరుస్తూ ఉంటుంది. యూవిఎ/యూవిబి లేబుల్, ఎస్ఎఫ్ ఫి + ఉన్న లోషన్ లేదా క్రీమ్ సెలక్ట్ చేసుకోవడం చాలా మంచిది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయేలా ఇంట్లో తయారు చేసుకున్న నలుగు పిండితో స్నానం చేయడం, లేదా ఆర్గానిక్ స్క్రబ్‌ని ఉపయోగించడం అవసరం. వేసవిలో హాలీడే ట్రిప్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చాలాకామన్. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్త పడాలి. వేసవిలో చర్మంతో పాటు జుట్టు కూడా పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో చికాకు పెట్టే చెమటలు కురులను కూడా వేధిస్తాయి. మండేఎండలు, చెమటకు జుట్టు కాంతి విహీనంగామారడంతోపాటు దుమ్ము,ధూళితో చుండ్రు సమస్య పీడిస్తుంది.సో..ఎండలో వెళ్లేటపుడు జుట్టును కవర్ చేసుకునేలా స్కార్ఫ్ లాంటివి రక్షణగా వినియోగించుకోవాలి. ప్రతీరోజూ కాకపోయినా, ఎండకు, డస్ట్‌కు ఎక్స్పోజ్ అయ్యాం అనిపించినపుడు మంచి షాంపూతో తలస్నానం చేయడం ఉత్తమం. అలాగే తలస్నానానికి ముందుకు ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం ఇంకా మంచిది. నెలలో రెండుసార్లు తలలోని చర్మం కూల్‌గా ఉండేలా ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకోవాలి. తద్వారా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారకుండా నిగనిగలాడుతుంది. వేసవికాలంలో పెదాలు సహజ కోమలత్వాన్ని కోల్పోవడం, పగలిపోవడం మరో సమస్య. సెన్సిటివ్ స్కిన్‌తో ఉండే లిప్స్ ఎండ వేడికిమికి త్వరగా పొడిబారతాయి. సో.. ఎండలోకి వెళ్లేముందు లిప్‌బామ్ అప్ల్ చేయాలి. అది ఇంట్లో తయారుచేసుకున్నదైతే మరీ మంచింది. అలాగే రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యిని రాసుకుని మృదువుగా మాసాజ్ చేసుకుంటే పెదాలు మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. ఇక భరించలేని ఎండలకు ప్రభావితమయ్యేవి కళ్లు. కళ్లను రక్షించుకునేందుకు కూలింగ్ గ్లాసులు వాడటం అలవాటు చేసుకోవాలి..వీటన్నింటికంటే కీలకమైంది శరీరానికి ఏంతో మేలు చేసే మంచినీళ్లు తాగడం చాలా చాలా ముఖ్యం. వీటితోపాటు, పల్చటి మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, బార్లీ గంజి, సబ్జా గింజల నీళ్లు లాంటి ద్రవపదార్థాలు విరివిగా తీసుకోవాలి. అలాగే ఎండలోనుంచి వచ్చిన వెంటనే కాకుండా.. ముఖాన్ని, కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. -
సమ్మర్ కేర్.. సింపుల్ టిప్స్
-
వేసవిలో హీరోయిన్ రకుల్ తాగే డ్రింక్ ఇదే..
అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. వేడి తట్టుకోడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నిమ్మ రసం, పుదీనా రసం వంటి ద్రావణాలను తీసుకుంటుంటారు. ఇవన్నీ ఓకే.. రకుల్ ప్రీత్‌సింగ్ ఇంకోటి కూడా చెబుతున్నారు. ‘‘ఈ వేసవి తాపంలో శరీరానికి బార్లీ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి’’ అంటున్నారామె. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం యోగా, జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు రకుల్. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటారు. తాజాగా ఎండ వేడి నుంచి చల్లబడటానికి రకుల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘వేసవి తాపాన్ని ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే బార్లీ నీళ్లు బెస్ట్. ఈ ద్రావణాన్ని నా న్యూట్రిషనిస్ట్ సూచించారు. వేసవిలో వచ్చే ఆరోగ్య, జీర్ణ సమస్యలన్నింటినీ బార్లీ ద్రావణం దూరం చేస్తుంది. చోటా నామ్ (బార్లీని ఉద్దేశించి) బడా కామ్ (పేరు చిన్నదే అయినా పని పెద్దది)’’ అని చెప్పుకొచ్చారు రకుల్. పేరు చిన్నదే అయినా బాగా మేలు చేస్తుందన్నది రకుల్ ఉద్దేశం. రకుల్ చెప్పినట్లు బార్లీ వాటర్ తీసుకుంటే కూల్ అయిపోవచ్చు. -
నెహ్రూ జూ: చల్లందనమే..చల్లదనమే..!
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో వేసవి తాపం నుంచి వన్యప్రాణులకు ఉపశమనం కలిగించేందుకు జూ అధికారులు చర్యలు చేపట్టారు. జంతువులు, పక్షులు ఇబ్బంది పడకుండా చల్లదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైభాగంలో గ్రీన్ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నామన్నారు. అన్ని జంతువుల ఆవరణలో స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. తుంగగడ్డిని కొన్ని ఆవరణల పైకప్పుపై ఉంచారు. కోతులు, పులులు, లయన్స్, జాగ్వార్స్, చిరుత పులి జంతువుల ఆవరణలలో 50కి ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ యానిమల్ హౌస్‌లో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు. కోతులు, పక్షులు, ఎలుగుబంట్లకు పండ్లను అందజేస్తున్నారు. గ్లూకోన్–డీ, ఎలక్ట్రోరల్ పౌడర్, విటమిన్–సి, సప్లిమెంట్స్, బి–కాంప్లెక్స్ సప్లిమెంట్స్, థర్మోకేర్ లిక్విడ్ నీటిలో కరిగి వేసవి ఒత్తిడిని నివారించడానికి జంతువులు, పక్షులకు ఇస్తారు. -
గంధపు చెక్క... పన్నీటి చుక్క
ఎండలో తిరగడం వల్ల కాంతిహీనంగా తయారైన ముఖానికి ఎన్ని క్రీములు వాడినా ఒక్కోసారి ఏమంత ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు ప్రకృతి సహజంగా లభించే మూలికలను ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే సరి. ఇందుకు గంధం చాలా బాగా పని చేస్తుంది. ఎందుకంటే గంధంలో మేని ఛాయను మెరుగుపరచడం, మొటిమల్ని అదుపులో ఉంచడం, సుగంధ పరిమళాలు వెదజల్లడం వంటి చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. ఇంతకీ గంధాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దామా మరి! ►పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. ►పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండుసార్లయినా చేస్తుంటే ముఖం మిలమిలలాడుతుంది. -
చ..ల్ల..టి వేసవి
తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఎంజాయ్ చెయ్యలేమా?! ఫ్యాను, కరెంటు ఉన్నా కూడా ఇదొక కూల్ ఐడియా! అమ్మ బాబోయ్ ఏం ఎండలో.. భరించలేకుండా ఉన్నాం. సూర్యుడే దిగి వచ్చి అందరినీ సంబరంగా ఆశీర్వదిస్తున్నాడేమో అన్నట్లుగా ఉన్నాయి! తట్టుకోవాలి తప్పదు. అప్పుడేగా ఏ ఋతువునైనా మనం గౌరవించినట్లు. మూడు నెలల పాటు అతిథిగా వచ్చిన ప్రచండ భాస్కరుడినీ అలాగే గౌరవించాలి. అందుకు బదులు... ‘అష్’ ‘ఉష్’ అంటూ వేడి వేడి నిట్టూర్పులు నిట్టూరిస్తే ఎలాగ! ఆయన పని ఆయన సక్రమంగా చేయడమూ తప్పేనా? అసలు సూర్యుడు వేడిగా ఉండకపోతే ఆషాఢంలో వానలు పడవు. పైరులు కళకళలాడకుండా వెలతెలపోతాయి. ఆయన వేడివేడిగా వచ్చి, నీళ్లన్నీ పీల్చేస్తేనే కదా మేఘం వర్షించగలిగేది. ఆ విషయం మర్చిపోయి ‘ఎండలు బాబోయ్ ఎండలు’ అంటూ ఎండాకాలమంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని నిందిస్తూంటే ఎలాగ. ఆయనకే కనక కోపం వచ్చి, చిన్నబుచ్చుకున్నాడనుకోండి.. మన పరిస్థితి ఏంటి? వానలు పడవు, పంటలు పండవు. సరే ఇదంతా ప్రకృతికి సంబంధించిన విషయం. కరెంటు లేని రోజుల్లో వేసవిలో దొంగలకు సౌకర్యంగా ఉండేది కాదు. తెల్లవార్లూ విసనకర్రలతో విసురుకుంటూ, నిద్రపోకుండా ఇంట్లోని పెద్దవాళ్లలో ఎవరో ఒకరు మెలకువగా ఉండటంతో చోరుడికి అనుకూలించేది కాదు. వాడు ఎన్ని కళలు ప్రదర్శిద్దామన్నా పప్పులుడికేవి కాదు. పరోక్షంగా ఎవరో ఒకరు కాపలా కాస్తూ ఉండేవారు. పాపం ఆ వచ్చినవాడికి నిరాశే మిగిలేది. వేసవిలో ఇదొక భరోసా మనకు. ఇక ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మల ప్రహసనం మరోలా ఉండేది. తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, వాటి మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఆస్వాదించే ఉంటారు.సాయంత్రం సంబరం మరోలా ఉండేది. ఊర్లో ఉండే పెద్ద చెరువుకి పిల్లలంతా తాబేలు పిల్లల్లా బుడి బుడి అడుగులు వేస్తూ, డాల్ఫిన్ చేపల్లా నీళ్లలోకి దూకి, సొర చేపల్లాగ ఈత కొడుతూ, రకరకాల విన్యాసాలు చేసి, శరీర తాపం చల్లారాక ఒంటి నిండా వాన ముత్యాలు నింపుకుని, ఇంటికి వచ్చేవారు. ఇంట్లో ఉండే మేనత్తలో, బాబయ్యలో.. చీకటి పడకుండా అన్నాలు తినిపించి, పిల్లల్ని పక్కనే పడుకోబెట్టుకుని, పోతన భాగవత పద్యాలు నేర్పుతూ, విసనకర్రతో చల్లగా విసురుతుంటే, ఆరుబయట చంద్రుణ్ని, నక్షత్రాలను చూస్తూ, తుంగ చాప మీద పడుకుని, ఆదమరిచి నిద్రపోయేవారు. అలా ప్రకృతికి అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసేసేవారు. ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పిస్తున్న సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని స్తుతిస్తూనే, ఎండల్తో చంపేస్తున్నాడని నిందించడం ఎంతవరకు న్యాయం? శ్రీరాముడు సూర్యవంశీయుడే కదా, అనునిత్యం ఆయనకు నమస్కరించేవాడు కదా! సూర్యభగవానుడిని దినమణి అని, పూర్వ దిక్పాలకుడు అని కూడా అంటారుగా. అంతటి దేవుడిని ఇంతగా తెగనాడటం భావ్యమేనా? భావ్యమే లెండి. ఎందుకంటారా, ఆయన మనకు మిత్రుడు (సూర్యుడిని మిత్రుడు అని కూడా అంటారు), ఆయన దగ్గర మనకు చనువు ఉంది కదా, అందుకే అలా నిందాస్తుతి చేస్తుంటాం.ఇవన్నీ కాదు. వేసవి అంటే మామిడిపండ్లు, ద్రాక్షలు. నూజివీడు పెద్దరసాలు, చిన్న రసాలు, గోదావరి జిల్లాలలో ప్రత్యేకంగా దొరికే కొత్తపల్లి కొబ్బరి, చెరకు రసాలు, పంచదార కలశం, సువర్ణరేఖ.. ఇవేనా! ఊరు వెళితే చాలు తాటి చెట్లు ఎక్కినవాళ్లు కత్తితో తాటికాయలు కోసి ధబీధబీమని కింద పడేయడం, నీళ్లు బయటకు రాకుండా జాగ్రత్తగా కత్తితో చెదిపి ఇస్తే, ఒక్కో ముంజలోకి వేలితో చిన్న రంధ్రం చేసి స్ట్రా వంటివి లేకుండా ముంజకాయను నోట్లోకి తీసుకుని, నీళ్లు తాగేసి, గుజ్జు జాగ్రత్తగా తీసుకుని తినడం ప్రతి వేసవిలోనూ ఓ సరదా. రసాలు తినడమైతే ఓ పెద్ద టాస్క్. ఒంటి మీద కారకుండా తినాలి. అదొక మధురమైన ఉల్లాసం. ఎర్రటి కొత్త ఆవకాయలోకి మామిడిపండు రసం నంచుకుని తింటే ‘ఆహా నా రాజా’ అని జంధ్యాల మార్కు డైలాగు గుర్తురాకుండా ఉండదు. చెప్పొచ్చేదేమంటే.. ఇంత వేడి, ఇంత ఎండ లేకపోతే ఇవన్నీ ఇంత చల్లగా ఎలా ఆస్వాదించగలం. అందుకే అష్షుబుష్షులు మాని, ఆహా ఓహో అనుకుందాం. మనమెంత నిట్టూర్చినా ఎండ వేడిగా ఉండకమానదు, వడ గాడ్పు వీచక మానదు, శరీరాలు చెమట చిందించకా తప్పదు. కనుక ఫీల్ ది కూల్ ఆఫ్ సమ్మర్. వైజయంతి పురాణపండ -
మీ కడుపు చల్లగుండ
‘పలుచన కావడమ’టే విలువ తగ్గడమని తెలుగు వాడుక. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుం’దనీ తెలుగులో సామెత.అవును... మజ్జిగ నైజమే అంత. తాను పలుచనైనప్పటికీ భోజనానికి నలుగురెక్కువొచ్చినా, పదిమంది అదనంగా వేంచేసినా అందరి కడుపూ నిండాలనేదే, అందరికీ పోషకాలు అందాలనేదే మజ్జిగ సుగుణం. కడుపును చల్లగా చేసేంత మంచితనం ...కడుపులో చల్ల కదలకుండా ఉంచేంత గొప్పదనం మజ్జిగది... రండి... ఈ వేసవిలో రకరకాల మజ్జిగ రుచులు ఆస్వాదించండి. సోర్ అండ్ స్పయిసీ బటర్ మిల్క్ కావలసినవి: తాజా పెరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత ; కరివేపాకు – 2 రెమ్మలు; నిమ్మ రసం – 5 టీ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్ క్యూబ్స్ – తగినన్ని. తయారీ: ►ఒక పాత్రలో పెరుగు వేసి, చిక్కగా గిలకొట్టాలి ►ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు జత చేయాలి ►నిమ్మ రసం, నీళ్లు జత చేసి బాగా కలిపి గ్లాసులలో పోసుకోవాలి ►ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా అందించాలి. స్మోక్డ్ మసాలా చాస్ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; బొగ్గు ముక్కలు – 2; కరివేపాకు – 5 ఆకులు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి – 4 (సన్నగా తరగాలి); నూనె – ఒక టీ స్పూను. తయారీ: ►మిక్సీలో పెరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం తురుము, ఉప్పు వేసి తిప్పాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి ►మజ్జిగను ఒక పాత్రలోకి తీసుకోవాలి ► ఒక పాత్రలో కరివేపాకు, పచ్చి మిర్చి, జీలకర్ర ఉంచాలి ► బొగ్గును స్టౌ మీద కాల్చి, ఆ బొగ్గును చిన్న పాత్రలోకి తీసి, వెంటనే ఆ పాత్రను మజ్జిగ మీద ఉంచాలి ► నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్రలను మండుతున్న బొగ్గు మీద వేసి సిల్వర్ ఫాయిల్‌తో వెంటనే మూసేయాలి ► బొగ్గు మీద నుంచి వచ్చే పొగ మజ్జిగలోకి చేరి, కొత్త రుచి వస్తుంది ► ఐదు నిమిషాల తరవాత సిల్వర్ ఫాయిల్ తీసేయాలి ► బొగ్గును తీసి పడేయాలి ►మజ్జిగను గ్లాసులలోకి పోసి, పుదీనా ఆకులతో అలంకరించి అందించాలి. మసాలా బటర్ మిల్క్ కావలసినవి: తాజా పెరుగు – 2 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; ఐస్ క్యూబ్స్ – తగినన్ని. తయారీ: ►ఒక పాత్రలో పెరుగు, ఉప్పు వేసి గిలకొట్టాలి ►మూడు కప్పుల నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►జీలకర్ర పొడి, ధనియాల పొడి జత చేసి బాగా కలపాలి ►అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు కలపాలి ►ఐస్‌క్యూబ్స్ జత చేయాలి మిక్సీ జార్లో వేసి రెండు నిమిషాల పాటు మిక్సీ తిప్పి, గ్లాసులలోకి తీసుకుని, కొత్తిమీర ఆకులతో అలంకరించి, చల్లగా అందించాలి నిమ్మ ఆకులు కరివేపాకు మజ్జిగ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; నిమ్మ ఆకుల తరుగు – పావు కప్పు; కరివేపాకు తరుగు – ఒక టేబుల్ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టీ స్పూను. తయారీ: ►పెరుగును ఒక కుండలో పోసి కవ్వంతో బాగా చిలకాలి ►తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మరోమారు చిలకాలి ►ధనియాల పొడి, అల్లం తురుము, నిమ్మ రసం జత చేసి రెండు నిమిషాలు చిలకాలి ►నిమ్మ ఆకులు, కరివేపాకు తరుగు జత చేసి, గరిటెతో కలిపి మూత ఉంచాలి అర గంట తరవాత గ్లాసులలో పోసి చల్లగా అందించాలి. కుకుంబర్అండ్ మింట్ లీవ్స్బటర్ మిల్క్ కావలసినవి: తాజా పెరుగు – 2 కప్పులు; ఉప్పు – తగినంత; ఐస్ క్యూబ్స్ – 4; కీర దోస తురుము – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; కీర దోస చక్రాలు – 3 (అలంకరించడం కోసం); చల్లటి నీళ్లు – 3 కప్పులు; కొత్తిమీర – గుప్పెడు; పుదీనా – అర కప్పు. తయారీ: ►ఒక పాత్రలో పెరుగు, ఉప్పు వేసి గిలకొట్టాలి ►కీరదోస తురుము, అల్లం తురుము, ఐస్ క్యూబ్స్ జతచేసి, మిక్సీలో వేసి రెండు నిమిషాలు తిప్పాలి ►చాట్ మసాలా, మిరియాల పొడి, చల్లటి నీళ్లు జత చేసి మరోమారు తిప్పాలి ►గ్లాసులలోకి తీసుకుని పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు జత చేసి, కీరదోస చక్రాలతో అలంకరించి చల్లగా అందించాలి. స్పైసీ బటర్ మిల్క్ కావలసినవి: పుదీనా ఆకులు – 10; తరిగిన పచ్చి మిర్చి – 1; కొత్తిమీర – కొద్దిగా; అల్లం ముక్క – చిన్నది; గడ్డ పెరుగు – ఒక కప్పు; ఇంగువ – చిటికెడు; వేయించిన జీలకర్ర పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మరసం – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – ఒక కప్పు; ఐస్ క్యూబ్స్ – 10. పోపు కోసం... నెయ్యి – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ. తయారీ: ►మిక్సీ జార్లో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చి మిర్చి, అల్లం వేసి మెత్తగా చేయాలి ►పెరుగు, ఇంగువ, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ►నిమ్మ రసం, ఒక కప్పు నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►గ్లాసులలోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ జత చేయాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ►మజ్జిగ గ్లాసులలో వేసి అందించాలి. దబ్బ ఆకులు మిరియాల పొడి మజ్జిగ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; దబ్బ ఆకుల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను ; ఉప్పు – తగినంత. తయారీ: ►పెరుగును కుండలో వేసి కవ్వంతో చిలకాలి ►ఉప్పు, నీళ్లు జత చేసి రెండు నిమిషాల పాటు చిలకాలి ►నిమ్మ రసం, మిరియాల పొడి జత చేసి మరోమారు చిలకాలి ►దబ్బ ఆకుల తరుగు, కొత్తిమీర తరుగు వేసి గరిటెతో కలిపి సుమారు గంట సేపు మూత ఉంచాలి ►గ్లాసులలో పోసి చల్లగా అందించాలి. మింట్ జీరా బటర్ మిల్క్ కావలసినవి: పెరుగు – రెండు కప్పులు; జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్ మసాలా – పావు టీ స్పూను; ఐస్ క్యూబ్స్ – కొద్దిగా; పుదీనా తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – రెండు టీ స్పూన్లు. తయారీ: ►పెరుగును ఒక కుండలో వేసి కవ్వంతో బాగా చిలకాలి ►తగినన్ని నీళ్లు జత చేసి మరోమారు చిలకాలి ►అల్లం తురుము, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మ రసం జత చేసి మరోమారు చిలకాలి ►జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు జత చేసి గరిటెతో బాగా కలపాలి ►ఐస్ క్యూబ్స్ జత చేసి గ్లాసులో పోసి చల్లగా అందించాలి. చిట్కాలు ►మజ్జిగలో ఒక టీ స్పూను తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది ►వెన్ను నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ►గ్లాసుడు మజ్జిగలో అర టీ స్పూను శొంఠి పొడి వేసి క్రమం తప్పకుండా కనీసం నెల రోజులు వాడితే, పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. మజ్జిగ ఉపయోగాలు మజ్జిగ ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. మానవులలో ఉండే త్రిదోషాలనూ మజ్జిగ అదుపులో ఉంచుతుంది. ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల వారికి మజ్జిగ మంచిది కాదు. ►పథ్యంగా పని చేస్తుంది ►ఆకలిని పెంచుతుంది ►బుద్ధిని పెంచేందుకు తోడ్పడుతుంది ►మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణం కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది ►మజ్జిగను ఎక్కువగా వాడేవారికి పైల్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ ►మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది ∙ ►రోజులో ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది ►శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియమ్‌లను అందిస్తుంది ►గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ►బిపి, కొలస్ట్రాల్‌లను నివారిస్తుంది ►శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది ►శరీరంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది ►ఎముకలను బలంగా చేస్తుంది ►ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు సాయపడుతుంది ►బరువు తగ్గేందుకు దోహద పడుతుంది ►అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. -
వేసవి సన్నాహాలు
సాక్షి సిటీబ్యూరో: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో వేసవి నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మామిడి సీజన్ ప్రారంభం కానున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్నాహాలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యను అదిగమించేందుకు చర్యలు తీసుకున్నారు. మార్కెట్ యార్డుకు వేసవిలో మామిడితో పాటు వివిధ రకాల పండ్ల లారీలు ప్రతిరోజూ వందల సంఖ్యలో తరలివస్తాయి. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.ఇప్పటికే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 15 మంది సెక్యూరిటీ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిన నియమించారు. మార్కెట్‌కు వచ్చే రైతుల దాహార్తిని తీర్చేందుకు మార్కెట్ ప్రాంగణంలో నాలుగు చలివేంద్రాల ఏర్పాటు చేశారు. మార్కెట్ ముందు మెట్రో స్టేషన్ ఏర్పాటుతో ఇరుకుగా మారినా సర్వీస్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు రోడ్డుతో పాటు మార్కెట్ ప్రహరీ మధ్య ఉన్న రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులకు ప్రతిపాదనలు పంపించారు.. క్రాసింగ్ లైన్లు... గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ యార్డులో ప్రస్తుతం వాహనాల పార్కింగ్తో పాటు వాహనాల పార్కింగ్‌కు ఒక పద్దతి లేదు. దీంతో కమిషన్ ఏజెంట్లు తమ షేడ్లలో ఇతరులు తమకు కేటాయించిన స్థలాల వద్ద, వ్యాపారులు రోడ్డు పైనే వాహనాలను నిలిపివేస్తుండటంతో మార్కెట్ యార్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. దీనిని నియంత్రించేందుకు , వాహనాల రాకపోకలు సులువుగా సాగేందుకు రోడ్డుకు ఇరు వైపుల పసుపు రంగుతో మార్కింగ్ లైన్లు వేయించారు. వ్యాపారులు, వినియోగదారులు వాహనాలను గీత లోపలే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. స్తంభాల తొలగింపు... మెట్రో స్టేషన్ నిర్మాణంతో మార్కెట్ యార్డుకు అనుకొని ఉన్న సర్వీస్ రోడ్డు Ðð వెడల్పు తగ్గిపోవడంతో భారీ వాహనాలు మార్కెట్లో రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పాటు రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలతో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ఎస్జీఎస్, విద్యుత్ శాఖ ఉన్నతా అధికారులు సర్వీస్ రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో పాటు మార్కెట్ ప్రధాన ద్వారాన్ని ఇరు వైపులు విస్తరించాలని నిర్ణయించారు. సీజన్‌లోగా ఏర్పాట్లు పూర్తి మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మార్కెట్‌కు వచ్చే రైతులతో పాటు వ్యాపారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మామిడి సీజన్‌లోగా ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే మార్కెట్ యార్డులో ట్రాఫిక్ సమస్య నియంతణ్రకు చర్యలు తీసుకున్నాం. దీంతో వాహనాలు క్రమబద్దీకరణతో పార్కింగ్ చేసేందుకు ఏర్పాటు జరుతున్నాయి. వ్యాపారులు, వినియోగదారులు రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్ ఎదుట సర్వీస్ రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించినందున భారీ వాహనా రాకపోకలు సాఫీగా జరుగుతున్నాయి. – గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేశం -
ట్రాఫిక్ కాప్ కూల్.. కూల్
సాక్షి, సిటీబ్యూరో : భానుడు భగ్గుమంటున్నాడు. బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఏకబిగిన ఏనిమిది గంటలు ఎండలో డ్యూటీ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఈ నేపథ్యంలో ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిటీ ట్రాఫిక్ సిబ్బందికి ఇక ఉపశమనం లభించనుంది. ఈ పరిస్థితిని గమనించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ (అడిషనల్ సీపీ) అనిల్‌కుమార్ సిబ్బందికి అత్యాధునికి ఉత్పత్తులు అందజేయాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా తయారు చేసిన 500 కూలింగ్ జాకెట్లను ఈ ఏడాది పంపిణీ చేయనున్నట్లు ఆయన బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్ సిబ్బంది ధరిస్తున్న స్లీవ్‌లెస్ మాదిరిగానే నీలి రంగులో ఈ జాకెట్లు ఉంటాయి. రెండు పొరలతో ఉండి మధ్యలో ప్రత్యేకమైన ఊల్ మెటీరియల్ వీటి ప్రత్యేకత. పైభాగంలో ఉండే మొదటి పొర ఎండ వేడి లోపలకు వెళ్లకుండా పరిరక్షిస్తుంది. సిబ్బంది ఈ జాకెట్ ధరించే ముందు దాన్ని నీటిలో పూర్తిగా తడిపి, పిండకుండా ధరించాల్సి ఉంటుంది. దీని లోపల ఉండే ప్రత్యేక ఉలెన్ మెటీరియల్ తడిని తనలో ఇముడ్చుకుంటుంది. వెనుక వైపు ఉండే రెండో పొర చెమ్మ సిబ్బంది ధరించిన యూనిఫామ్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. అలాగే ట్రాఫిక్ పోలీసులు తలపై హెల్మెట్ తరహాలో ఉండే టోపీలు ధరిస్తారు. కొత్తగా ఖరీదు చేస్తున్న క్రౌన్గా పిలిచే గుండ్రటి ఉత్పత్తిని సైతం నీటిలో తడిపి టోపీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా రెండు పొరలతో, మధ్యలో ప్రత్యేక ఉలెన్‌తో తయారు చేసిందే. ఈ జాకెట్ ధరిస్తే బయటి దాని కంటే ఆరు నుంచి 12 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో శరీరం ఉంటుంది. ఇవి ఒకసారి తడిపితే ఆయా ప్రదేశాల్లోని గాలిలో ఉన్న తేమ శాతాన్ని బట్టి కనిష్టంగా మూడు గంటల నుంచి గరిష్టంగా ఐదు గంటల వరకు వేడి నుంచి కాపాడతాయి. నగరానికి చెందిన ఓ స్పిన్నింగ్ మిల్ ఎంతో అధ్యయనం చేసి వీటిని తయారు చేసింది. వేసవి కాలంలో వేడి నుంచి, శీతాకాలంలో చలి నుంచి కాపాడటం ఈ జాకెట్ల ప్రత్యేకత. ఒక్కో జాకెట్ రూ.2,500 వరకు ఖరీదు చేస్తుంది. గతేడాది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) 200 జాకెట్లను ప్రయోగాత్మకంగా అందించింది. ఫలితాలు ఉండటంతో ఈ ఏడాది 500 ఖరీదు చేయాలని నిర్ణయించిన ట్రాఫిక్ విభాగం అధికారులు, అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వారాంతానికి కూలింగ్ జాకెట్లు సిబ్బందికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మరోపక్క సైబరాబాద్, రాచకొండ అధికారులు సైతం ఈ తరహా జాకెట్లను ఖరీదు చేసి సిబ్బందికి అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
సుందరీ... నువ్వెవరు?
అబ్బబ్బబ్బా.. ఇవేం ఎండలు బాబోయ్. మాడు మాడిపోయేలా.. మొహం వాడిపోయేలా ఉన్నాయి. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే ఇక మేలో పరిస్థితేంటి? భానుడి భగభగలు తట్టుకోలేక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇలా వాపోతున్నారు. ఎండ బారిన పడకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్నారు. ఇదిగో.. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నట్లు చాలామంది అమ్మాయిలు ముఖం మొత్తం కవర్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ముసుగు వెనక దాగి ఉన్న సుందరి ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ! కూల్.. కూల్. సమాధానం చెప్పేస్తాం. ఆవిడ ఎవరో కాదు.. రకుల్. ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారీ బ్యూటీ. షాట్ గ్యాప్‌లో ఎండ నుంచి కాపాడుకునేందుకు ఇలా ముసుగేసుకున్నారు.