గడ్డిఅన్నారం ఫ్రూట్‌మార్కెట్
సాక్షి సిటీబ్యూరో: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో వేసవి నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మామిడి సీజన్ ప్రారంభం కానున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్నాహాలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యను అదిగమించేందుకు చర్యలు తీసుకున్నారు. మార్కెట్ యార్డుకు వేసవిలో మామిడితో పాటు వివిధ రకాల పండ్ల లారీలు ప్రతిరోజూ వందల సంఖ్యలో తరలివస్తాయి. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.ఇప్పటికే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 15 మంది సెక్యూరిటీ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిన నియమించారు. మార్కెట్‌కు వచ్చే రైతుల దాహార్తిని తీర్చేందుకు మార్కెట్ ప్రాంగణంలో నాలుగు చలివేంద్రాల ఏర్పాటు చేశారు. మార్కెట్ ముందు మెట్రో స్టేషన్ ఏర్పాటుతో ఇరుకుగా మారినా సర్వీస్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు రోడ్డుతో పాటు మార్కెట్ ప్రహరీ మధ్య ఉన్న రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులకు ప్రతిపాదనలు పంపించారు..
క్రాసింగ్ లైన్‌లు...
గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ యార్డులో ప్రస్తుతం వాహనాల పార్కింగ్‌తో పాటు వాహనాల పార్కింగ్‌కు ఒక పద్దతి లేదు. దీంతో కమిషన్ ఏజెంట్లు తమ షేడ్లలో ఇతరులు తమకు కేటాయించిన స్థలాల వద్ద, వ్యాపారులు రోడ్డు పైనే వాహనాలను నిలిపివేస్తుండటంతో మార్కెట్ యార్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. దీనిని నియంత్రించేందుకు , వాహనాల రాకపోకలు సులువుగా సాగేందుకు రోడ్డుకు ఇరు వైపుల పసుపు రంగుతో మార్కింగ్ లైన్లు వేయించారు. వ్యాపారులు, వినియోగదారులు వాహనాలను గీత లోపలే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
స్తంభాల తొలగింపు...
మెట్రో స్టేషన్ నిర్మాణంతో మార్కెట్ యార్డుకు అనుకొని ఉన్న సర్వీస్ రోడ్డు Ðð వెడల్పు తగ్గిపోవడంతో భారీ వాహనాలు మార్కెట్‌లో రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పాటు రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలతో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ఎస్‌జీఎస్, విద్యుత్ శాఖ ఉన్నతా అధికారులు సర్వీస్ రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో పాటు మార్కెట్ ప్రధాన ద్వారాన్ని ఇరు వైపులు విస్తరించాలని నిర్ణయించారు.
సీజన్‌లోగా ఏర్పాట్లు పూర్తి
మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మార్కెట్‌కు వచ్చే రైతులతో పాటు వ్యాపారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మామిడి సీజన్‌లోగా ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే మార్కెట్ యార్డులో ట్రాఫిక్ సమస్య నియంతణ్రకు చర్యలు తీసుకున్నాం. దీంతో వాహనాలు క్రమబద్దీకరణతో పార్కింగ్ చేసేందుకు ఏర్పాటు జరుతున్నాయి. వ్యాపారులు, వినియోగదారులు రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్ ఎదుట సర్వీస్ రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించినందున భారీ వాహనా రాకపోకలు సాఫీగా జరుగుతున్నాయి. – గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేశం
Comments
Please login to add a commentAdd a comment