
అప్పుడే మే నెల రాకుండానే ఎండలు భగభగ మంటున్నాయి. ఉక్కపోతలతో తారెత్తిస్తోంది. ఈ ఎండలకు ఏం తినాలనిపించదు. ఒక్కటే దాహం.. దాహం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీంతో అందరు మజ్జిగ, నిమ్మకాయ పంచదార నీళ్లు, పండ్లపై ఆధారపడుతుంటారు. అంతేగాదు ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ హైడ్రేషన్‌కి గురవ్వుతారు. అందుకే అంతా ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి అందించే సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిపై ఆధారపడుతుంటారు. ఈ రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? అందరూ తీసుకోవచ్చా అంటే..
చెరకు రసం
ఇది అద్భుతమైన వేసవి పానీయం. తక్షణ శక్తిని అందించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది.
ఇది సహజంగా చక్కెరలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రభావవంతమైన శక్తి వనరుగా ఉంటుంది.
శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి అందివ్వడంలో సహాయపడుతుంది.
డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో మంచి హెల్ప్ అవుతుంది
చెరకురసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చెరకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి
ఆమ్లత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది.యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
దీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి.
ఎవరు తీసుకోవాలంటే..?
బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెరుకు రసాన్ని మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతుంటారు నిపుణులు.
చెరకు రసంలో అధిక స్థాయిలో సహజ చక్కెర ఉంటుంది
ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.
దీనిలో ఉండే అధిక చక్కెరలు, కేలరీల కంటెంట్ కారణంగా పరిమితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.
కొబ్బరి నీరు
దీన్ని ప్రకృతి స్పోర్ట్స్ డ్రింక్ అని పిలుస్తారు.
ఇందులో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు అధికంగా ఉంటాయి.
ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.
చెరకు రసంలా కాకుండా, కొబ్బరి నీళ్ళల్లో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి.
బరువు నిర్వహణకు అనువైనదిగా చెబుతుంటారు.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది
పేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది
అదనపు నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.
పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
రెండింటిలో ఏది బెటర్ అంటే..
కొబ్బరి నీళ్ళలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల సోడియం అసమతుల్యతకు దారితీసే ప్రమదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
అందువల్ల దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. చెరకు రసం, కొబ్బరి నీరు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. ప్రతిది వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తికోసం అయితే చెరకు రసం బెస్ట్ ఆప్షన్. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీరు మంచిది. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్(Hydration)గా ఉండేలా చూసుకోండి. ఈ రిఫ్రెష్ పానీయాల ప్రయోజనాలను పొందేలా సరైన పద్ధతిలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: 'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!)
Comments
Please login to add a commentAdd a comment