coconut
-
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
ఎండ వేడిని తట్టుకోవడానికి, ఎండా కాలంలో సత్తువతో ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంతమంచిది అనుకుంటారు చాలామంది. అయితే ఇది సరిౖయెనది కాదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...కొబ్బరి నీళ్లలో ΄పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. శరీరంలో లవణాల సమతూకం దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.కొబ్బరినీళ్లలో అధిక పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో అధిక చక్కెర కంటెంట్ వల్ల బరువు పెరగడానికి దారి తీయవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు, దంత క్షయ ప్రమాదం పెరగవచ్చు.కొబ్బరితో అలర్జీలు అసాధారణమేమీ కాదు. కొంతమందికి కొబ్బరి నీటి వల్ల అలెర్జీలు రావచ్చు. దద్దుర్లు, వాపుతోబాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.హైబీపి ఉన్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పేగు పూత వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. (చదవండి: వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ కవల సోదరుల ప్రయోగంలో వేటిలో విటమిన్లు ఎక్కువంటే..?) -
భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..
మన ఆకలి తీర్చుతున్న ఆహారంలో 95% వరకు భూమాతే మనకు అందిస్తుంది. అందువల్ల భూమి పైపొర మట్టి మనకే కాదు జంతుజాలం మొత్తానికీ ప్రాణప్రదమైనది. భూమి పైమట్టి సారవంతమైనదే కాకుండా ఎంతో విలువైనది కూడా. కాబట్టి, మనకు మాదిరిగానే భూమికి కూడా ఆచ్ఛాదనగా వస్త్రం కప్పి పరిరక్షించుకోవాల్సిన ప్రాణావసరం మనది. మట్టి ఎండకు ఎండి నిర్జీవమైపోకుండా.. గాలికి, వర్షపు నీటి తాకిడికి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి కొబ్బరి పీచుతో చేసిన చాపలు భేషుగ్గా పనిచేస్తున్నాయి. ఈ కొబ్బరి చాపలనే కాయర్ బోర్డు ‘భూవస్త్రం’ అని పిలుస్తోంది. ఇరవయ్యేళ్లుగా కేరళ తదితర రాష్ట్రాల్లో పీచు పరిశ్రమదారులు ‘భూవస్త్రాల’ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, మన దేశంలో వాడకం తక్కువే. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కొబ్బరి పీచు భూవస్త్రాన్ని పంటలకు మల్చింగ్ షీట్‌గా, కాల్వలు, చెరువులు, నదుల గట్లకు రక్షణ కవచంగా కూడా వాడుకోవచ్చు. భూమిని కాపాడటమే కాకుండా ఐదారేళ్లలో భూమిలో కలిసిపోయి సారవంతం చేస్తుంది. భూవస్త్రాల మన్నిక ఎంత?కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు పర్యావరణ హితమైనవి. వీటిని వినియోగించుకుంటే కాలువలు, చెరువులు, నదుల గట్లు, ఏటవాలు ప్రాంతాల్లో నుంచి గాలికి, వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా జాగ్రత్తపడవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. చెరువులు, సరస్సుల గట్లు, నదుల వరద కట్టల నవీకరణ పనుల్లో భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఇంతకీ వీటి మన్నిక, పటుత్వం ఎంత? ఐదారేళ్ల వరకూ మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘కొబ్బరి పీచు పటుత్వం చాలా ఎక్కువ. ఇందులో లిగ్నన్ ఎక్కువ మోతాదులో ఉండటమే ఇందుకు కారణం. టేకు, ఇరుగుడు చావ కలపలో కన్నా కొబ్బరి పీచులోనే లిగ్నన్ ఎక్కువగా ఉంది. అంతేకాదు, నీటిని సంగ్రహించే సామర్థ్యం, అతినీల లోహిత(యు.వి.) కిరణాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువే, వేసిన తర్వాత ఐదారేళ్ల వరకు మన్నుతాయి. 90% తేమ, 30 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో కూడా దీర్ఘకాలంపాటు భూవస్త్రం పటిష్టంగా నిలిచినట్లు ‘జెర్మన్ బున్‌దేసంత్ ఫర్ మెటీరియల్ టెస్టింగ్ ఆన్ నేచురల్ ఫైబర్స్’ తెలిపింది. పత్తి ఉత్పత్తుల కన్నా 15 రెట్లు, జనపనార ఉత్పత్తుల కన్నా 7 రెట్లు ఎక్కువ రెట్లు మన్నిక కొబ్బరి పీచు భూవస్త్రాలకు ఉంది. వరద నీటిలో 4 వేల గంటలు మునిగి ఉన్న తర్వాత కూడా ఇవి చెక్కుచెదరలేదని సంస్థ తెలిపింది. అయితే, ఆ భూమి తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులు, యువి రేడియేషన్, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, ఏ విధంగా వాడారు అన్న విషయాలపై కూడా మన్నిక ఆధారపడి ఉంటుంది.కూరగాయ పంటల్లో భూవస్త్రంతో ఆచ్ఛాదనపంట పొలాల్లో, చెట్లు, మొక్కల పెంపకంలో భూమికి ఆచ్ఛాదన కల్పించడానికి మల్చింగ్ షీట్లుగా ప్లాస్టిక్‌కు బదులుగా కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఈ షీట్ మొక్కల చుట్టూ పరిస్తే ఎండ, వానల నుంచి భూమిని కాపాడటమే కాకుండా కలుపు మొలవకుండా అడ్డుకుంటుంది. కలుపు మందుల పిచికారీ అవసరం లేదు. కలుపు తీత ఖర్చులు ఉండవు. నాగాలాండ్‌లో పైనాపిల్ పంటను విస్తారంగా సాగు చేసే రైతులు భూవస్త్రాలతో మల్చింగ్ చేస్తున్నారు. అరటి, వంగ, టమాటా, బెండ తదితర పంటలకు బాగా మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి భూవస్త్రాలు 600 జి.ఎస్.ఎం.(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) నుంచి 2,000 జి.ఎస్.ఎం. మందం వరకు దొరుకుతాయి. మల్చింగ్ షీట్‌గా 600 జి.ఎస్.ఎం.(సుమారుపావు అంగుళం) మందం ఉండే భూవస్త్రం సరిపోతుంది. ఇది భూమిపై పరిచిన ఐదారు సంవత్సరాలలో భూమిలో కలిసి΄ోతుంది. ఫంక్షన్ హాల్స్, స్టార్ హోటళ్లలో కార్పెట్ల అడుగున కుషన్ ఎఫెక్ట్ కోసం 2,000 జి.ఎస్.ఎం. భూవస్త్రాలను వాడుతుంటారు. రోడ్ల మన్నిక పెరుగుతుందికొబ్బరి పీచు భూవస్త్రాలను మట్టి, తారు రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. గ్రావెల్, ఎర్రమట్టికి అడుగున భూవస్త్రాలను పరుస్తారు. భూవస్త్రం వాడటం వల్ల రోడ్ల మన్నిక 20–40% పెరిగినట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే వాడుతున్నారు. ప.గో. జిల్లాలో చించినాడ బ్రిడ్జి అ్ర΄ోచ్రోడ్డు నిర్మాణంలో వాడామని, 20 ఏళ్లయినా చెక్కుచెదరలేదు. కొబ్బరి పీచు భూవస్త్రాలను ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో ఉపయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో 164 కి.మీ., తెలంగాణలో 121 కి.మీ. మేరకు రోడ్ల నిర్మాణంలో భూవస్త్రాలను వాడేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇవి మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయని, బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కృష్ణా, గోదావరి డెల్టాలో కాలువ గట్లు జారిపోతూ ఉంటే ఏటా బాగు చేస్తూ ఉంటారు. ఈ గట్లను భూవస్త్రాలతో కప్పి, వాటిపై మొక్కలను పెంచితే గట్లు బాగా గట్టిపడతాయి. ఐదారేళ్ల వరకు చెక్కుచెదరవు. రైలు పట్టాలకు ఇరువైపులా మట్టికట్టలను కూడా ఇలాగే పటిష్టం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. భూవస్త్రాల ధర..?కొబ్బరి కాయ మన ఆహార, ఆధ్యాత్మిక సంస్కృతిలో పెద్ద పీట ఉంది. కొబ్బరి పంట నుంచి కొబ్బరి కాయ ప్రధాన ఉత్పత్తి. కాయను ఒలిస్తే వచ్చే డొక్కల నుంచి పీచును వేరు చేస్తారు. ఈ క్రమంలో పొట్టు వస్తుంది. కొబ్బరి పొట్టును స్వల్ప ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈనెలతో చాపలను లేదా మాట్స్ను తయారు చేస్తారు. ఇవే భూవస్త్రాలు (కాయిర్ జియో టెక్స్టైల్స్). వీటిని మీటరు పన్నాతో సుమారు 50 మీటర్ల పొడవున తయారు చేస్తారు. భూవస్త్రాలు రెండు రకాలు.. చేనేత వస్త్రం మాదిరిగా కొన్ని దశల్లో నేసేవి (వోవన్), ఒక యంత్రంతో సులువుగా అల్లిక చేసేవి (నాన్ వోవన్). నాన్ వోవన్ భూవస్త్రాల ధర చదరపు మీటరుకు రూ. 50–60 ఉంటే, వోవన్ భూవస్త్రాల ధర నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అనేక దశాబ్దాలుగా కేరళ తదితర రాష్ట్రాల్లో సహకార సంఘాలు, వ్యాపారులు కొబ్బరి ఉప ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. కేరళలో కొబ్బరి పీచు ఉత్పత్తుల తయారీ కోట్లాది మంది (వీరిలో 80% మంది మహిళలు)కి ఉపాధినిస్తున్న కుటీర పరిశ్రమ. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. మన దగ్గరి నుంచి ఫ్రాన్స్ వంటి దేశాలు భూవస్త్రాలతో భూమి కోతకు గురికాకుండా జలవనరుల పరిసరాల్లో వినియోగిస్తున్న తీరును చూసి ఇటీవల మన అధికారులు నోరువెళ్ల బెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..) -
కొబ్బరి నీరు వర్సెస్ చెరకు రసం: ఈ సమ్మర్లో ఏ పానీయం బెస్ట్..!
అప్పుడే మే నెల రాకుండానే ఎండలు భగభగ మంటున్నాయి. ఉక్కపోతలతో తారెత్తిస్తోంది. ఈ ఎండలకు ఏం తినాలనిపించదు. ఒక్కటే దాహం.. దాహం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీంతో అందరు మజ్జిగ, నిమ్మకాయ పంచదార నీళ్లు, పండ్లపై ఆధారపడుతుంటారు. అంతేగాదు ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ హైడ్రేషన్‌కి గురవ్వుతారు. అందుకే అంతా ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి అందించే సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిపై ఆధారపడుతుంటారు. ఈ రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? అందరూ తీసుకోవచ్చా అంటే..చెరకు రసంఇది అద్భుతమైన వేసవి పానీయం. తక్షణ శక్తిని అందించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది సహజంగా చక్కెరలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రభావవంతమైన శక్తి వనరుగా ఉంటుంది.శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి అందివ్వడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో మంచి హెల్ప్ అవుతుందిచెరకురసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చెరకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయిఆమ్లత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిదీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎవరు తీసుకోవాలంటే..?బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెరుకు రసాన్ని మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. చెరకు రసంలో అధిక స్థాయిలో సహజ చక్కెర ఉంటుందిఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.దీనిలో ఉండే అధిక చక్కెరలు, కేలరీల కంటెంట్ కారణంగా పరిమితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.కొబ్బరి నీరుదీన్ని ప్రకృతి స్పోర్ట్స్ డ్రింక్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.చెరకు రసంలా కాకుండా, కొబ్బరి నీళ్ళల్లో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు నిర్వహణకు అనువైనదిగా చెబుతుంటారు. జీర్ణక్రియకు సహాయపడుతుందివిషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందిపేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందిఅదనపు నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.రెండింటిలో ఏది బెటర్ అంటే..కొబ్బరి నీళ్ళలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల సోడియం అసమతుల్యతకు దారితీసే ప్రమదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. చెరకు రసం, కొబ్బరి నీరు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. ప్రతిది వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తికోసం అయితే చెరకు రసం బెస్ట్ ఆప్షన్. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీరు మంచిది. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్(Hydration)గా ఉండేలా చూసుకోండి. ఈ రిఫ్రెష్ పానీయాల ప్రయోజనాలను పొందేలా సరైన పద్ధతిలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!) -
తాపం తీర్చే అమృతభాండం
సాక్షి, అమలాపురం: మండు వేసవిలో దాహం తీర్చాలన్నా, వేడెక్కిన శరీరాన్ని చల్లబరచాలన్నా, అనారోగ్యం బారిన పడితే త్వరగా కోలుకోవాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది కొబ్బరి బొండాం. కొనుగోలుచేసేవారికే కాదు.. ఉత్పత్తి చేసే రైతులకు కూడా ఇది అమృత బాండమే. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ధరలు నిలకడగా ఉండటం, కాయ సేకరణ భారం లేకపోవడంతో కొబ్బరి రైతులు (Coconut Farmers) ఇదే తమకు మేలని భావిస్తుంటారు. వేసవి సమీపిస్తుండటంతో బొండాల ధరలపైన, ఎగుమతులపైన రైతులు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఒక కొబ్బరి బొండాం (Coconut) ఒక సెలైన్‌తో సమానం. బొండాంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. శరీరానికి రోజుకు సరిపడా సోడియంను ఇది అందిస్తుంది. దీనిలో పొటాషియం, కాల్షియం, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది తక్షణం శక్తిని ఇస్తుంది. ఇటీవలి కాలంలో బొండాం తాగేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు పెరిగాయి.మన రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి కొబ్బరి బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. కొబ్బరి బొండాలకు ఒకప్పుడు వేసవి (Summer) మాత్రమే సీజన్‌గా ఉండేది. ఇప్పుడు ఏడాది పొడవునా ఎగుమతులు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలో దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డి గూడెం, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో చాగల్లు, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, తుని పరిసర ప్రాంతాల నుంచి బొండాల ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం రోజుకు 50 లారీలకు పైగా ఎగుమతి అవుతుండగా, వేసవి సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి బొండాల ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్కో కొబ్బరి బొండాం ధర రూ. 12 పలుకుతోంది. కొబ్బరి కాయ ధర రూ. 14 నుంచి రూ. 15 పలుకుతోంది. దీని వల్ల బొండాం అమ్మకాలకన్నా రైతులు కాయపై దృష్టి పెట్టారు. సాధారణంగా కొబ్బరి కాయ కన్నా బొండాం ధర రూ.4 నుంచి రూ. 5 ఎక్కువ ఉంటుంది. చదవండి: పల్లె పిల్లలూ ‘స్మార్టే’! » మార్చి నుంచి కొబ్బరి బొండాలకు వేసవి సీజన్ మొదలవుతుంది. కొబ్బరి కాయకు ఇప్పుడున్న ధర మరికొద్దిరోజులు ఉంటే బొండాం ధర రూ.18 నుంచి రూ.20 వరకు చేరుతుంది. కాని దిగుబడి అధికంగా ఉండటం వల్ల బొండానికి ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. » కాయతో పోల్చుకుంటే బొండాం అమ్మకాలే రైతులకు లాభసాటిగా ఉంటాయి. బొండాం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే కొబ్బరికాయ పక్వానికి రావడానికి సుమారు 12 నెలలు పడుతుంది. కాయతో పోల్చితే బొండాల వల్ల రైతులు త్వరితగతిన ఉత్పత్తి అందుకుంటారు. » కొబ్బరి కాయ రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రెండు రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే బొండాలను వ్యాపారులే సొంత ఖర్చులు పెట్టుకుని దింపించుకుంటారు. దీంతో రైతులకు సేకరణ ఖర్చు తగ్గుతుంది. -
కోనసీమ కొబ్బరికి రాజయోగం.. భారీగా పెరిగిన ధరలు
-
మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేల
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలివస్తున్న మహా కుంభమేళా (Maha Kubh Mela) గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు (Coconut Market) పెద్ద వరమే అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) కేంద్రంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తయ్యే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. మహా కుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట (Ambajipeta) కొబ్బరి మార్కెట్లో కురిడీ కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. పాతకాయలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.20 వేలు వరకు పలుకుతోంది. దీనిలో గటగట రకం రూ.17,500 వరకూ ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం వెయ్యి కాయలకు రూ.20 వేల ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన రూ.18 వేలు మాత్రమే ఇప్పటి వరకూ గరిష్ట ధరగా ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు కురిడీ కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గింది. ఈ రెండు కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడీ ఎగుమతి పెరిగింది. రోజుకు రూ.8 లక్షలు విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడం కురిడీ ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.ఎనిమిదేళ్ల తరువాత మంచి ధర2016లో గండేరా రకానికి రూ.18 వేల ధర వచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీకి రూ.20 వేలు వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడీ ఎగుమతులు తగ్గడం, కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడీకి మార్కెట్లో ఊహించని ధర వచ్చింది.– అప్పన శ్యామ్, కురిడీ వ్యాపారి, అంబాజీపేట -
కొబ్బరి రైతుకు ఊరట
సాక్షి, అమలాపురం: అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు సం‘క్రాంతి’ వెలుగులొచ్చాయి. గడచిన వారం రోజులుగా పచ్చికొబ్బరి, కురిడీ కొబ్బరి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు జోరందుకున్నాయి. ఉత్తరాదికి ఎగుమతులు పెరగడం.. తమిళనాడులో దిగుబడులు తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో 1.77 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మార్కెట్లో కొబ్బరి లావాదేవీలు అంబాజీపేట మార్కెట్లో ధరల ఆధారంగా సాగుతుంటాయి. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్లో పచ్చి కొబ్బరి, వెయ్యికాయల ధర రూ.14,500 నుంచి రూ.15 వేలకు చేరింది.రోజుకు 70 నుంచి 100 లారీల ఎగుమతిగతేడాది అక్టోబర్ నుంచి నవంబర్ వరకూ పచి్చకొబ్బరి వెయ్యి కాయల ధర రికార్డు స్థాయిలో రూ.18,500 వరకు పలికింది. తర్వాత ధర తగ్గినా రూ.14 వేల వద్ద స్థిరంగా ఉంది. వారం రోజుల నుంచి ధర పెరుగుతూ వస్తోంది. దీంతోపాటు కురిడీ కొబ్బరి ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం పాత కాయలలో కురిడీ కొబ్బరి వేయింటికి గండేరా రూ.15 వేలు, గటగట రూ.13,500, కొత్త కాయలలో గండేరా రూ.14 వేలు, గటగట రూ.12,500 ఉండేవి. ఇప్పుడు వాటి ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో పాత కురిడీ కొబ్బరి వెయ్యింటికి గండేరా రూ.17,500, గటగట రూ.16,000, కొత్త గండేరా రూ.16,800, గటగటా రూ.15,000 వరకూ పెరిగాయి. ఆయా రకాలకు రూ.రెండు వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 నుంచి 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి అవుతోందని అంచనా. పెరిగిన వినియోగంసంక్రాంతికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొబ్బరి వినియోగం కొంత వరకూ పెరగడంతోపాటు స్థానికంగా దిగుబడి తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణం. ఈ సీజన్లో సగటు దిగుబడి ఎకరాకు 1,200 కాయలు కాగా, ప్రస్తుతం 400 కాయలు మాత్రమే దిగుబడిగా వస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకలో సైతం దిగుబడులు తగ్గడం కూడా రేటు పెరగడానికి కారణమైంది. మూడు నెలల నుంచి పచ్చికాయ ధర అధికంగా ఉండడం వల్ల కూడా కురిడీ కొబ్బరి ధర పెరుగుదలకు కారణమైంది. దిగుబడి తగ్గినా.. సంక్రాంతి సమయంలో కొబ్బరి ధరలు పెరగడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. -
కేరళలో ఓనం...కోనసీమకి వరం
కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు వరి కంటే మక్కువగా కొబ్బరికి ప్రాధాన్యమిస్తారు. కొబ్బరికాయ దిగుబడి ఇక్కడ బాగుంది అనుకునేలోపే తమిళనాడు, కేరళ రూపంలో గట్టి సవాల్ ఎదురయ్యేది. దాంతో కాయ ఉన్నా.. సరైన ధర ఎన్నడూ లభించేది కాదు. కానీ ఇప్పుడు కేరళలో ఓనం పండుగ వచ్చి అక్కడి కాయ అక్కడికే సరిపోతోంది. తమిళనాడు, కర్నాటకల్లో సరైన దిగుబడి లేకపోవడం, ఉత్తరాదిన దసరా, దీపావళి, కార్తికమాసం రూపంలో పండగలు క్యూ కట్టడంతో కోనసీమ కొబ్బరికి, రైతులకు ముందే పండగొచ్చింది. సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కేరళలో ఓనం పండుగ... తమిళనాడులో కొబ్బరికాయ అందుబాటులో లేకపోవడం... కోనసీమ కొబ్బరి రైతులకు పండగ వచ్చింది. కొబ్బరికాయ ధర రికార్డ్ స్థాయిలో పెరగడంతో వారికి దసరా... దీపావళి పండగ ముందే వచ్చింది. కొబ్బరి వెయ్యి కాయల ధర సైజును బట్టి రూ.17,500ల నుంచి రూ.18 వేల వరకు పలుకుతుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ హై. కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులకు ముందే దసరా, దీపావళి పండగ వచ్చినట్టయింది. వరుస పండగల నేపథ్యంలో కొబ్బరి ధరలు అనూహ్యంగా పెరిగాయి. నెల రోజుల క్రితం వెయ్యి కొబ్బరికాయల ధర రూ.8,500 మాత్రమే ఉండేది. తర్వాత నెమ్మదిగా పెరుగుతూ ఆగస్టు నెలాఖరు నాటికి రూ.10,500కు చేరింది. వినాయక చవితి సమయానికి రూ.11,500 నుంచి రూ.12 వేల వరకు ధర రావడంతో రైతులు చాలా వరకు కోలుకున్నారు. కానీ గత వారం రోజుల నుంచి ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది, తమిళనాడు, కర్ణాటకల్లో కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉన్నాయి. కేరళలో ఓనం పండగ కారణంగా స్థానికంగా కొబ్బరి వినియోగం ఎక్కువగా ఉంది. దీనితో ఆ రాష్ట్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు మందగించాయి. ఈ కారణంగా ఉత్తరాది మార్కెట్ అవసరాలను ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంత ధర రావడం విశేషం. విజయదశమి, దీపావళి, కార్తికమాసం దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కొబ్బరి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాలకు డొక్క ఒలిచిన కొబ్బరి ఎగుమతి అవుతుంటుంది. కానీ ఈసారి డొక్కా ఒలుపు చేయని కాయను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రాసుల రూపంలో రూ.18 వేల వరకు ధర ఉండగా 60 రకం (పెద్ద కాయ) డొక్కతో వెయ్యి కాయలు ధర రూ.20 వేలు పలుకుతుంది. ఏడేళ్ల తర్వాత రికార్డు ధర ఏడేళ్ల తర్వాత కొబ్బరికాయకు రికార్డు స్థాయి ధర వచ్చింది. 2017లో కొబ్బరికాయకు జాతీయ మార్కెట్లో రూ.17 వేల ధర రాగా ఈసారి అంతకుమించి ధర పలుకుతుండటం విశేషం.మార్కెట్లో ఈ స్థాయి ధర రావడం అరుదైన విషయమని కొబ్బరి రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయతో పాటు మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి. ప్రస్తుతం పాత కురిడీ కాయ గండేరా వేయింటికి రూ.14 వేలు, గటగటా రూ.17,500, కురిడీ కొత్త కాయ గండేరా రూ.13 వేలు, గటగట రూ.15,500 పలుకుతుంది. -
ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!
ప్రపంచవ్యాప్తంగా బాగా వినియోగించే ఆహారాల్లో కొబ్బరికాయలు ప్రధానమైనవి. అన్ని చోట్లా ఆయా పద్దతుల రీత్యా వీటిని బాగా వినియోగిస్తారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనకు చేసే మేలును గుర్తించడం కోసం ఒక రోజును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి ప్రతి ఏటా ఆ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని ఆసియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కొబ్బరితో చేసే ప్రసిద్ధ రెసిపీలు, లాభాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మనదేశంలో ఏ చిన్న పూజ లేదా ఏ కార్యమైనా కొబ్బరికాయ లేనిదే పూర్తి కాదు. ముఖ్యంగా కేరళ కొబ్బరికాయ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ కొబ్బరికాయ రుచి పరంగా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీన్ని కూరగా లేదా పచ్చడి రూపంలో తీసుకుంటారు చాలామంది. దీన్ని పలురకాల రెసిపీలో అదనపు రుచి కోసం ఉపయోగిస్తారు. ఎంతటి రుచిలేని కూరకైనా కాస్త కొబ్బరిని జోడిస్తే దాని రుచే వేరు. అలాంటి కొబ్బరితో వివిధ రాష్ట్రాల్లో చేసే ప్రముఖ వంటకాలేంటో చూద్దాం..ఎరిస్సేరీ:ఎరిస్సేరీ అనేది కేరళకు చెందిన సాంప్రదాయక వంటకం. ఇది ఓనం వంటి పండుగ సందర్భాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కూర గుమ్మడికాయ, పప్పు, కొబ్బరితో తయారు చేస్తారు. చివరిగా ఆవాలు, కరివేపాకు మరియు ఎండు మిరపకాయలతో తాలింపు వేస్తారు. ఈ కూరని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరేలెవెల్.చింగ్రీ మలై కర్రీచింగ్రి మలై కర్రీ అనేది ఒక ప్రసిద్ధ బెంగాలీ వంటకం. దీన్ని పెద్ద సైజులో ఉండే రొయ్యలతో చేసే కూరలో ఉపయోగిస్తారు. మసాల దినులు, కొబ్బరిపాలతో ఈ రొయ్యల కూర చేస్తారు.బాంగ్ద్యాచే అంబట్ కాల్వన్ఇది మహారాష్ట్రలోని తీర ప్రాంతాలలో చేసే స్పైసీ చేపల కూర. మాకేరెల్ (బాంగ్డా) కొబ్బరిపాలతో తయారు చేసిన కూర తింటే..ఓ పక్క నోరు మండుతున్న తింట ఆపరట. అంతలా స్పైసీగా టేస్టీగా ఉంటుందట. ఈ రెసిపీలో చింతపండు పులుసు అత్యంత కీలమైనది. ఇది గ్రేవీకి మంచి టేస్ట్ అందిస్తుంది.ఖవ్సాఖవ్సా లేదా ఖౌ సూయ్ గుజరాత్‌లోని కుచ్చి మెమన్ కమ్యూనిటీ తయారు చేసే వంటకం. చికెన్‌ని, కొబ్బరి పాలతో చేసే వంటకం. ఇది సాధారణంగా పూర్తి భోజనం కోసం క్రిస్పీ ఫ్రైడ్ నూడుల్స్ లేదా సెవ్‌తో వడ్డిస్తారు.గోవాన్ జిట్ కోడిజిట్ కోడి ప్రతి గోవా ఇంటిలో ప్రధానమైనది. ఇది కూడా చేపలతో తయారు చేసే వంటకమే. సాధారణంగా మాకేరెల్ లేదా కింగ్ ఫిష్, వంటి వాటిని కొబ్బరి పాలు, ఎర్ర మిరపకాయలు, కొత్తిమీరచ చింతపండు మిశ్రమంతో తయారు చేస్తారు. వెజిటబుల్ కుర్మావెజిటబుల్ కుర్మా అనేది దక్షిణ భారతదేశం అంతటా ఒక ప్రసిద్ధ వంటకం. ఇది తేలికపాటి మసాలాలతో కూడిన కొబ్బరి గ్రేవీకి పేరుగాంచింది. కుర్మాలో సాధారణంగా క్యారెట్, బఠానీలు, బీన్స్చ బంగాళదుంపలు వంటి వివిధ రకాల కూరగాయలు ఉంటాయి. వీటిని కొబ్బరి, జీడిపప్పు, పెరుగుతో తయారు చేసిన సాస్‌తో వండుతారు. ఈ వంటకానికి లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క వంటివి మొత్తం కూర రుచిని పెంచుతాయి. దీన్ని చపాతీలు లేదా పరాఠాలతో ఆస్వాదించవచ్చు.నార్కెల్ దూద్ పులావ్కొబ్బరి పాలతో కూడిన మరో బెంగాలీ వంటకం. ఇక్కడ పులావ్‌ని కొబ్బరి పాలతో తయారు చేస్తారు. ఇది సాధారణంగా గోబిందోభోగ్లా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి పాలు, బిర్యానీ ఆకులు, నెయ్యి, దాల్చిన చెక్క, ఏలుకులు, ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో తయారుచేస్తారు.చికెన్ కాల్డిన్చికెన్ కాల్డైన్ ఒక తేలికపాటి మరియు సుగంధ గోవా కూర. ఈ వంటకం కోకోనట్ మిల్క్ గ్రేవీలో ఉడికించి, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీరతో రుచికరంగా తయారు చేస్తారు. దీన్ని అన్నం లేదా ఇష్టమైన రోటీలతో ఆస్వాదించవచ్చు. కొబ్బరితో కలిగే లాభాలు..పోషకాలతో నిండిన కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.కొబ్బరి నూనెను చర్మం, జుట్టుకు అప్లై చేస్తే తేమను సమర్థవంతంగా లాక్ చేస్తుంది. పొడి చర్మం, పొడి జుట్టుకు చికిత్స చేస్తుంది. తామర వంటి చర్మవ్యాధులను నిర్వహించడానికి సహాయపడుతుంది.కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.బరువు తగ్గాలనుకుంటే కేలరీల వినియోగాన్ని పెంచడానికి పెరుగు లేదా ఓట్ మీల్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు జోడించండి. ఇది ఆకలిని తీర్చడానికి, కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. (చదవండి: ఉడకని పంది మాంసం తింటే ఇంత డేంజరా..!) -
మనంపడేసే కొబ్బరి చిప్పలకి ఇంత ధర..!
-
కొబ్బరి రైతుకు కష్టకాలం
సాక్షి అమలాపురం/ అంబాజీపేట: కొబ్బరికాయ నాణ్యత లేదనే సాకుతో స్థానికంగా ఉన్న ‘నాఫెడ్’ (నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఎండు కొబ్బరి (మిల్లింగ్ కోప్రా) చేయకపోవడం, తయారు చేస్తున్న కొద్దిపాటి ఎండు కొబ్బరి నాఫెడ్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం ఓ కారణం కాగా.. దీనికి తోడు కొంతమంది దళారులు కర్ణాటక, తమిళనాడు నుంచి నాణ్యమైన కొబ్బరి కాయలను దిగుమతి చేసుకుని రైతుల ముసుగులో ఈ కేంద్రాల్లో అధిక మొత్తానికి విక్రయిస్తుండడం.. ఇక్కడి రైతుల పాలిట శాపంగా పరిణమించింది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నాఫెడ్ కేంద్రాలు తెరచి నెల రోజులకు పైగా అయ్యింది. జిల్లాలో అంబాజీపేటతోపాటు కొత్తపేట, తాటిపాక, రాజోలు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీలలో ఈ కేంద్రాలను తెరవాల్సి ఉంది. తొలి దఫాగా అంబాజీపేట, కొత్తపేటలలో మాత్రమే ప్రారంభించారు. గత నెలలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వీటిని ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ కేంద్రాలు ప్రారంభించిన తరువాత పది రోజుల పాటు భారీ వర్షాల వల్ల తెరవలేదు. తరువాత తెరిచినా పెద్దగా కొనుగోలు లేకుండా పోయింది. ఇంతవరకు కొనుగోలు చేసింది కేవలం 750 క్వింటాళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ కేంద్రాల్లో వచ్చే అక్టోబర్ నెలాఖరు నాటికి ఎనిమిది వేల క్వింటాళ్ల కొబ్బరి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కొనుగోలు జరుగుతున్న తీరు చూస్తుంటే లక్ష్యం మేరకు కొనుగోలు చేస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. కొబ్బరి కాయ కొనుగోలు చేయాలి నాఫెడ్‌లో దళారుల ప్రమేయాన్ని తగ్గించి తమ వద్ద నుంచి నేరుగా పచ్చి కొబ్బరి కాయ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 5వ తేదీన మెచ్యూర్ డిహస్క్డ్ కోకోనట్ (తయారై వలిచిన కొబ్బరి కాయను) కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం వలిచిన కొబ్బరి కాయలకు క్వింటాల్‌కు రూ.3,013గా ధర నిర్ణయించింది. ఈ ధరకు మార్కెఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరి కాయ కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని కోనసీమ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
వర్షాకాలంలోపాపాయి పువ్వులాంటి చర్మంకోసం : చిట్కాలివిగో!
మండించే ఎండల నుంచి ఉపశమనంగా వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షంతోపాటు కొన్ని రకాల ఇబ్బందులు, జలుబు, జ్వరం లాంటివి వెంటే వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్న పిల్లలు ఆరోగ్యం, చర్య సంరక్షణ చాలా అవసరం. ఈ నేపథ్యంలో మారికో లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా అందించే చిట్కాలను పరిశీలిద్దాం.పెద్దవారితో పోలిస్తే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది దాదాపు 30శాతం పల్చగా, సుకుమారంగా ఉంటుంది. పెళుసుగా , పొడిగా ఉండి తొందరగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం, ఇన్ఫెక్షన్లు లాంటి వివిధ చర్మ సమస్యలొస్తాయి. పాపాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత, మాయిశ్చరైజేషన్ రెండూ చాలా అవసరం. వర్జిన్(పచ్చి) కొబ్బరి నూతోనె పాపాయి మృదువైన చర్మానికి మసాజ్ చేయాలి.వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆధారిత నరిషింగ్ లోషన్ లేదా క్రీంతో క్రమం తప్పకుండా బేబీ బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. తల్లి పాలలో లభించే పోషకాలుండే ఈ ఆయిల్ శిశువు చర్మాన్ని 24 గంటలూ తేమగా ఉంచేలా సాయపడుతుంది. చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది.బలమైన ఎముకలు, కండరాల అభివృద్ధి , నరాల అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.దీనితో పాటు, బిడ్డకు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాలకి ఉష్ణోగ్రతలు తగ్గి, గాలిలో తేమ పెరుగుతుంది. దీంతో చిన్నారికి చెమటలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక వదులుగా ఉండే దుస్తులను వాడాలి. అలాగే సింథటిక్ దుస్తులు కాకుండా మెత్తటి కాటన్, చలికి రక్షణగా ఉలెన్ దుస్తులను వాడాలి. లేదంటే అధిక చెమటతో, పొక్కులు, దద్దుర్లు వస్తాయి. ఈ సీజన్లో డైపర్లను తరచుగా మార్చుతూ అక్కడి చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి. -
కోనసీమ పనసకు గిరాకీ
సాక్షి అమలాపురం: చూడగానే నోరూరించే పనస పంటకు కోనసీమ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తేనెలూరే రుచి ఉండే ఈ పనస తొనలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి, అరటి తరువాత కోనసీమలో పండే విలువైన పంటల్లో పనస ఒకటి. ఈ కారణంగా తూర్పు, పశ్చిమ ఏజెన్సీలలో పండే పనసకన్నా కోనసీమలో పండే పనసకు మంచి డిమాండ్ ఉంది. 79.36 ఎకరాల్లో సాగు వేసవి వచ్చి0దంటే చాలు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనస కాయల ఎగుమతులు జోరందుకుంటాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంతోపాటు గోదావరి లంక గ్రామాల్లో కొబ్బరి తోటల్లో పనస చెట్లను పెంచడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతుంది. ఇక్కడ కొబ్బరి తోటల్లో మధ్యన, గట్ల మీద, సరిహద్దుల్లో పనసను రైతులు పెంచుతుంటారు. పనస మీద వచ్చే ఆదాయానికి తోడు ఏళ్ల పాటు చెట్టును పెంచితే టేకు, మద్ది కర్రతో సమానంగా ఆదాయం వస్తున్నది. దీని వల్ల డెల్టా, గోదావరి లంకల్లో పనస చెట్లు గణనీయంగా ఉంటాయి. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 79.36 ఎకరాల్లో పనస సాగు జరుగుతున్నది.కానీ వాస్తవంగా కొబ్బరి తోటలు, రోడ్లు, పంట కాలువల వెంబడి చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇందుకు రెండుమూడు రెట్లు సాగు జరుగుతున్నదని అంచనా. ఏజెన్సీతో పోల్చుకుంటే డెల్టా, గోదావరి లంకల్లో పెరిగే పనస తొనల రుచి అధికం. అందుకే జిల్లా నుంచి వచ్చే పనసను కోనసీమ పనసగా చెప్పి ఇతర పట్టణాల్లో అమ్ముతుంటారు. సీజన్లో రూ.ఐదు కోట్ల ఎగుమతులు వేసవి సీజన్లో జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పనస కాయలు రవాణా అవుతుంటాయి. కొబ్బరి తరహాలోనే పనసకు సైతం అంబాజీపేట అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్. రోజుకు 500కు పైగా పనస కాయలు వస్తాయని అంచనా.కాగా, జిల్లా నుంచి రోజుకు 800 నుంచి వేయి కాయల వరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పనస ఎగుమతి అవుతున్నది. మార్చి నుంచి జూలై నెల వరకు ఒక్క అంబాజీపేట నుంచే రూ.5 కోట్ల విలువైన పనస ఎగుమతి అవుతున్నదని అంచనా. మొత్తం జిల్లావ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నదని తెలుస్తున్నది. దిగుబడి పెరిగి.. ధర తగ్గింది.. గత నాలుగైదు ఏళ్ల కన్నా ఈ ఏడాది దిగుబడి అధికంగా ఉంది. చెట్టుకు సగటున 10 నుంచి 15 కాయల వరకు వస్తుంటాయి. ఈసారి 25 కాయలకు పైబడి దిగుబడిగా వస్తోంది. దీనివల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కాయ సైజు, బరువును బట్టి రూ.100 నుంచి రూ.400 వరకు ధర ఉంటున్నది. ఏడాది పొడవునా పనస పొట్టు కూరల్లో వినియోగించే పనస పొట్టు ఏడాది పొడవునా కోనసీమలో దొరుకుతున్నది. ఇది కూడా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నది. కేజీ పనస పొట్టు ధర రూ.175 నుంచి రూ.200 వరకు ఉంది. ఇది డిసెంబర్ నుంచి జూలై వరకు స్థానికంగా లభ్యమవుతున్నది. పెరిగిన ఎగుమతులుగతంలో కన్నా గత ఐదేళ్లుగా అంబాజీపేట మార్కెట్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలికి పనస కాయల ఎగుమతి జరుగుతున్నది. ఈ ఏడాది కాయల దిగుబడి అధికంగా ఉంది. అయితే ఎగుమతులు పెరగడం వల్ల సరుకు నిల్వ ఉండడం లేదు. మా దుకాణాల వద్ద రిటైల్ అమ్మకాలు కూడా పెరిగాయి. – కుంపట్ల నాగేశ్వరరావు, వ్యాపారి, అంబాజీపేట -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్‌లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్‌లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
ఎండలు చుర్రుమంటున్నాయి. ఒక్కటే దాహం, దాహం అన్నంతగా భగభగమంటోంది వాతావరణం. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంచేందుకు చల్లటి పానీయాలు, పళ్ల రసాలు వెంట పరిగెడతారు అందరూ. ఐతే చాలామంది కొబ్బరినీళ్లు మంచివని. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ కొబ్బరి నీళ్లు రుచిగా ఉండటమేగాక తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల కొబ్బరి బోండాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో కొబ్బరి బోండాలను కొనగానే నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడాదట. నేరుగా కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణలు. అదేంటీ..?నిజానికి ఎండ వేడిలో వస్తూ రోడ్డుపై కొబ్బరి బోండాలు కనిపించగానే హమ్మయ్యా అనుకుని వెంటనే కొబ్బరి బోండాలు కొని నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయటి వాతావరణం వేడిగా ఉంది. ఇక ఈ బోండాలు కూడా ఎంతసేపు ఈ వేడిలోనే ఉన్నాయన్నది తెలియదు. అందువల్ల అలా అస్సలు చెయ్యొద్దని చెబుతున్నారు. ఎందుకంటే వాటిని కుప్పలుగా వేసి విక్రయిస్తుంటారు. అలా చాలా రోజుల నుంచి లేదా చాల సేపటి నుంచి ఎండలో ఉండిపోవడంతో దానిలో ఒక రకమైన ఆకుపచ్చని ఫంగస్ వస్తుందట. అందువల్ల కొబ్బరి బోండాన్ని కొన్న వెంటనే నేరుగా స్ట్రా వేసుకుని తాగేయ్యకుండా..ఓ పారదర్శకమైన గాజు గ్లాస్లో వేయించుకుని తాగాలని అంటున్నారు. అందులో నీరు స్పష్టంగా, ఎలాంటి చెడు వాసన లేదని నిర్థారించుకుని తాగడం అనేది ముఖ్యం అంది. ఎందుకంటే ఈ ఎండల ధాటికి ఎలాంటివైనా తొందరగా పాడైపోతాయి. నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల దాహం అంటూ ఆత్రతగా కొబ్బరి నీళ్లు తాగేయొద్దని సూచిస్తున్నారు. ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందంటే..ఆకు పచ్చని ఫంగస్ ఆహార పదార్థాల ఉపరితలాలపై వస్తుంది. అది ఆహార పదార్థాన్ని కుళ్లిపోయేలా చేయడం ద్వారా పోషకాలు పొందుతుంది. ఇది ఎగురుతూ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చాలా కఠినమైన వాతావరణంలో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. తగినంత నీరు, సేంద్రియ పదార్థాలలో ఉన్న పదార్థాలపై ఇది పెరగడం ప్రారంభించి, నెమ్మదిగా మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..తీవ్రమైన అలెర్జీ, తుమ్ములు, ఎరుపు లేదా నీటి కళ్లు, చర్మంపై దద్దుర్లు, ముక్కులో దురద, కళ్ల నుంచి నీళ్లు రావడం. దగ్గు, శ్వాస ఆడకపోవడం, తదితర లక్షణాలు ఉంటాయి. ఈ ఫంగస్‌లో హానికరమైన మైకోటాక్సిన్‌లతో నిండి ఉంటాయి. ఇది తీవ్రమైన విషాన్ని కలిగిస్తుంది. కడుపు, మూత్రపిండం, కాలేయం వంటి వాటిల్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. నివారణ..ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. తాజా పండ్లు, కూరగాయాలను మాత్రమే తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చుచెడిపోయే వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకండిగాలి చొరబడని కంటైనర్లలో ఆహార పదార్థాల్ని నిల్వ చేయాలి.కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత కాలం సురక్షితంగా ఉంటాయో తెలుసుకుని నిల్వ ఉంచడానికి యత్నించాలి.(చదవండి: నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?) -
గ్రిల్డ్ కోకోనట్ ఎపుడైనా ట్రై చేశారా? ధర ఎంతో తెలుసా?
వేసవిలో కొబ్బరి బొండాంకున్న ప్రాధాన్యతే వేరు.సహజసిద్ధంగా ఏర్పడిన కొబ్బరి నీళ్లలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే మీరెపుడైనా స్పైసీ గ్రిల్డ్ లేదా రోస్టెడ్ కొబ్బరిని టేస్ట్ చేశారా? ఇండోనేషియాలో ఈ స్ట్రీట్ డ్రింక్ చాలా ఫ్యామస్. అంతేకాదు ఆక్రమణదారులనుంచి దేశాన్ని కాపాడేందుకు, శారీరక బలం కోసం దీన్ని అక్కడి రాజులు దీన్ని ఎక్కువగా తాగేవారట. ఇండోనేషియాలో స్పైస్ గ్రిల్డ్ కోకోనట్ చాలా ఖరీదైంది కూడా. ఒక్కో బోండాం ధర 10వేలకు పైమాటేనట. Roast coconut street food , Indonesia pic.twitter.com/ZaJcxt7h8g — Science girl (@gunsnrosesgirl3) April 14, 2024 పచ్చి కొబ్బరి కాయను సుమారు 1-2 గంటల పాటు కాల్చుతారు. స్పెషల్‌గా ఏర్పాటు చేసిన గ్రిల్మీద జాగ్రత్తగా కాల్చుతారు. ఆతరువాత పైన పీచు వలిచేసి,లోపల ఉన్న లేత కొబ్బరితో సహా నీళ్లను సేవిస్తారు. దీన్ని వేడి వేడిగా, లేదా చల్లగా ఎలాగైన తినవచ్చు. ఇలా కాల్చడం వల్ల కొబ్బరి టేస్ట్‌తోపాటు పోషక విలువలుకూడా మరింత పెరుగుతాయని ఇక్కడి వారి నమ్మకం. కాల్చిన కొబ్బరి నీళ్లు, స్థానిక సుగంధ ద్రవ్యాలతోపాటు కొద్దిగా షుగర్‌ను కలిపి తాగుతారు. ఒక రోజులో కనీసం 30 కొబ్బరికాయలు అమ్ముడవుతాయి. -
మా నాయినే! కొబ్బరికాయను తలకేసి కొట్టుకున్నాడు
కొబ్బరికాయను రాయిపై కొడితే పగులుతుంది. నుదుటిపై కొడితే? వైరల్ అవుతుంది! విషయంలోకి వస్తే... తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కొబ్బరికాయ పట్టుకొని పూజాపీఠం దగ్గర శ్లోకాన్ని జపించాడు. ఆ తరువాత తల పైకి లేపి కొబ్బరికాయను నుదుటి మీద కొట్టుకున్నాడు. ‘యాక్షన్‌కు రియాక్షన్’ అనేది ప్రకృతి ధర్మం కదా! సదరు వ్యక్తి వెంటనే కుప్పకూలి΄ోయాడు. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా వ్యక్తి చర్యను నెటిజనులు ఖండించారు. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్’, ‘గాయపడింది నువ్వు కాదు... కొబ్బరికాయ’లాంటి సరదా కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
తెరపైకి కొబ్బరి బోర్డు!
అశ్వారావుపేట రూరల్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో రైతు ల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు మొలకెత్తగా.. కేంద్రం స్పందిస్తుందా, లేదా అనే మీమాంస నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా.. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన సమయాన తెలంగాణలో సాగు తక్కువగా ఉందనే కారణంతో ఈ కార్యాలయాన్ని ఏపీకి మార్చారు. ఆనాటి నుంచి ఏపీ కొబ్బరి బోర్డు అధికారులే తెలంగాణలో కుడా కొబ్బరి సాగు విస్తరణ, అభివృద్ధి, రాయితీతోపాటు ఇతర సేవలందిస్తున్నారు. అయితే, తెలంగాణలో బోర్డు లేని కారణంగా కొబ్బరి రైతాంగానికి ఆశించిన స్థాయిలో సేవలు, రాయితీలు అందడం లేదనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లుగా ఇక్కడ కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడా వేలాది ఎకరాల్లో సాగు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎక్కువగా తోటలు, కొబ్బరి నర్సరీలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో కొన్నేళ్ల క్రితం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ రెండు మండలాల్లో కొబ్బరి తోటలు అత్యధికంగా విస్తరించాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 1,358 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 586 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తోటలు సాగులో ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు కాలేదు. ఫలితంగా సాగుదారులకు సేవలందక సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. బోర్డు లేని కారణంగా ఈ ప్రాంత రైతులకు రాయితీలు, ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు దక్కడం లేదని తెలుస్తోంది. మంత్రి తుమ్మల లేఖతో కదలిక? గతేడాది ఏప్రిల్‌లో కొబ్బరి అభివృద్ధిమండలి బోర్డు అధికారుల బృందం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించింది. ఈసందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు బోర్డు ఏర్పాటు విషయాన్ని ఉన్నతా ధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పా రు. కానీ ఆ తర్వాత ఈ అంశం మళ్లీ మరుగునపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మలకు వ్యవసాయ శాఖ దక్కడంతో బోర్డు ఏర్పాటు విషయాన్ని స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తుమ్మల తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయాలని లేఖ రాయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. -
సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్ అమ్మ’ కు పద్మశ్రీ
సేంద్రీయ వ్యవసాయంతో పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ‘నారియల్ అమ్మ’ వార్తల్లోనిలిచారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికిచెందిన 67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో విశేషకృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. సాంప్రదాయ వ్యవసాయం, కొబ్బరి సాగుతో 'నారియల్ అమ్మ' గా ఖ్యాతి గడించారు. దక్షిణ అండమాన్‌లోని రంగాచాంగ్‌కు చెందిన చెల్లమ్మాళ్ కొబ్బరి సాగులో విప్లవాత్మకమైన, వినూత్న పద్ధతులను అవలబించారు. స్థిరమైన వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ను కూడా అలవర్చుకున్నారు. కొబ్బరి ఆకులు, పొట్టును మల్చింగ్గా ఉపయోగించి వర్షానంతర కాలంలో నేల తేమను కాపాడుకుంటూ తేమ నష్టాన్ని తగ్గించడమే కాకుండా కలుపు, తెగుళ్ల బెడదను నివారించారు. అలాగే హానికర రసాయనాలకు దూరంగా 'ట్రాప్ ప్లాంట్స్'తో తెగుళ్ల నివారణలో వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు. ఫలితంగా ఆరోగ్యకరమైన కొబ్బరి దిగుబడిని సాధించారు. అంతేకాదు తనతోపాటు తోటి రైతులు కూడా సేంద్రీయ పద్ధతులను పాటించేలా కృషి చేశారు.. తన 10 ఎకరాల భూమిలో బహుళ జాతుల పంటలను పండిస్తారు చెల్లమ్మాల్. అలాగే ఏనుగు పాదం, అరటి, వేరుశెనగ, పైనాపిల్, బత్తాయి, పచ్చిమిర్చి, ట్యూబ్ రోజ్, గ్లాడియోలస్, ఆకు, కూరగాయలతో వైవిధ్యమైన సాగు ఆమె ప్రత్యేకత. సమీకృత వ్యవసాయ విధానంతో తక్కువ కొబ్బరి మార్కెట్ ధరల సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచింది. స్థిర వ్యవసాయ పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో మారుమూల గ్రామం నుంచిజాతీయ అవార్డు దాకా సాగిన చెల్లమ్మాళ్ అద్భుత ప్రయాణం భావి తరం రైతులకు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చెల్లమ్మాళ్ కొడుకు రామచంద్రన్, ఆమెకు వ్యవసాయంలో ఆసరాగా ఉంటారు. విభిన్న పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపక విశేషాలను స్థానిక విద్యార్థులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రదర్శిస్తూ వ్యవసాయ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. -
చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!
శీతాకాలంలో జుట్టు, ముఖం డ్రైగా మారి ఇబ్బంది పెడుతుండటమే గాక కొన్ని ఆహార పదార్థాలు కూడా గడ్డకట్టుకుపోయి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ కాలంలో ప్రతిది మైల్డ్‌గా ఉంటుంది. ఓ పట్టనా ఏది తొందరగా వేడెక్కదు. దీనికి తగ్గట్టు వాతావరణం అలానే ఉంటుంది. ఇలాంటప్పడూ కొన్ని చిట్టి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా పరిష్కారం దొరుకుంతుంది. మనకు కూడా చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఆ ఇంటి చిట్కాలేంటో చూసేద్దామా! తలకు పెట్టుకోవడానికి సరిపడా కొబ్బరిపాలలో కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ పాలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడుసార్లు కొబ్బరి పాలను ఇలా తలకు పట్టిస్తూ ఉంటే కురులకు మంచి పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జిడ్డుతత్వం గల కురులు ఉన్నవారికి ఈ కొబ్బరిపాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎండబెట్టిన కమలాతొక్కలను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేయాలి. దీనిలో టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లుపోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసి ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తరువాత తడిచేతులతో రుద్ది కడిగేయాలి. మృతకణాలు, ట్యాన్ తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మిలమిలలాడుతుంది. టేబుల్ స్పూను ఉసిరి నూనె లేదా బాదం నూనె తీసుకుని కొబ్బరి నూనెలో కలిపితే చలికాలంలో కొబ్బరినూనె గడ్డకట్టదు. ఉసిరి, బాదంలోని గుణాలు నూనెని గడ్డకట్టనివ్వవు. అందువల్ల వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కొబ్బరి నూనె గట్టిగా కాదు. మాయిశ్చరైజర్ లేదా లోషన్లో రెండు చుక్కల గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులకు రాసుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి తేమనందించి చర్మం పొడిబారకుండా చేస్తుంది. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?
శీతకాలంలో ముఖం డ్రైగా మారి గరుకుగా ఉంటుంది. స్కిన్ కూడా తెల్లతెల్లగా పాలిపోయినట్లు అయిపోతుంది. మన ముఖాన్ని టచ్ చేస్తేనే మనకే ఇరిటేషన్‌గా ఉంటుంది. దీంతో ఇంట్లో ఉండే కొబ్బరి నూనెనే గబుక్కున రాసేస్తుంటాం. అందరికీ అందుబాటులోనూ చవకగా ఉంటుంది కూడా. చిన్నప్పటి నుంచి చర్మంపై దురద వచ్చినా, కందినా కూడా కొబ్బరి నూనెనే రాసేవాళ్లం. అయితే ఇలా రాయడం మంచిదేనా? రాస్తే ఏమవుతుంది తదితరాల గురించే ఈ కథనం!. ఏం జరుగుతుందంటే.. ముఖానికి కొబ్బరి నూనె రాయడం చాలా మంచిదే గానీ దాన్ని సరైన విధంగా ముఖానికి అప్లై చేస్తేనే ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణలు అంటున్నారు. రాత్రిపూట ముఖానికి కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేస్తే రాత్రంత ముఖం తేమగా, కోమలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మసాజ్ వల్ల ముఖం అంతా రక్తప్రసరణ జరిగి తాజాగా ఉండటమే గాక ముఖ చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది పొడి చర్మం ఉన్నవారికి ఈ కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజషన్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉండవు కాబట్టి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది. అలాగే కళ్ల కింద వాపులను కూడా నయం చేస్తుంది. మొటిమలు, వాటి తాలుకా మచ్చలను తగ్గిచడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్ హెడ్స్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అతినీలలోహిత కిరణాలను నిరోధించే శక్తి ఈ కొబ్బరి నూనెకు ఉంది. అందువల్ల ఇది మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీన్ని సహజ మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించొచ్చు. చెప్పాలంటే.. మేకప్‌ని తొలగించి చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్‌గా పనిచేస్తుంది. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
కార్తీకంలో ఉపవాస విరమణను..ఈ టేస్టీ రెసిపీతో ఆస్వాదించండి!
కావలసినవి: మైదా – మూడు కప్పులు పసుపు – పావు టీస్పూను నువ్వుల నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం తరుగు – రెండు కప్పులు పచ్చికొబ్బరి తురుము – నాలుగు కప్పులు యాలకులపొడి – అరటీస్పూను నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: పెద్దగిన్నెలో మైదా, పసుపు వేసి కలపాలి. దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లుపోసుకుంటూ ముద్దలా కలపాలి. చివరగా నువ్వుల నూనె వేసి కలిపి మూతపెట్టి నలభై నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో బెల్లం, అరకప్పు నీళ్లుపోసి సన్నని మంట మీద కరగనివ్వాలి. ఐదు నిమిషాలకు బెల్లం కరుగుతుంది. బెల్లం నీటిని పలుచని వస్త్రం లేదా సన్నని చిల్లులున్న స్ట్రెయినర్‌తో వడగట్టాలి. ∙వడగట్టిన బెల్లం నీటిని మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇందులో కొబ్బరి తురుము వేసి అడుగంటకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడి ఉండలా మారుతున్నప్పుడు యాలకుల పొడి వేసి మరోమారు కలిపి దించేయాలి. అరటి ఆకు లేదా బ్లాటింగ్ పేపర్‌కు కొద్దిగా నెయ్యి రాయాలి. కలిపి సిద్ధంగా ఉంచిన మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేయాలి. ఇప్పుడు ఒక్కో ఉండను పూరీలా వత్తాలి. కొబ్బరి మిశ్రమాన్ని పూరీ మధ్యలో పెట్టి, మిశ్రమం బయటకు రాకుండా చుట్టాలి. కొబ్బరి మిశ్రమం బయటకు కనబడకుండా మైదా పిండితో కప్పేయాలి. చేతికి నెయ్యి రాసుకుని వీటిని బొబ్బట్లలా వత్తుకోవాలి. ఇలా పిండినంతటనీ బొబ్బట్లలా వత్తుకున్న తర్వాత పెనం వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి మీడియం మంటమీద రెండు వైపులా కాల్చుకుంటే కొబ్బరి పోలీ రెడీ. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
నోరూరించే కొబ్బరి ఖీమా బాల్స్ ట్రై చేయండిలా..!
కొబ్బరి ఖీమా బాల్స్‌కి కావలసినవి: కొబ్బరి – ఒకచిప్ప కారం – అర టీస్పూను పసుపు – చిటికెడు గరం మసాలా – అరటీస్పూను ధనియాల పొడి – అర టీ స్పూను కొత్తిమీర తరుగు – మూడు టీస్పూన్లు శనగపిండి – రెండు టీస్పూన్లు పచ్చిమిర్చి – రెండు స్పూన్లు కరివేపాకు – రెండు రెమ్మలు ఉప్పు – రుచికి సరిపడా నూనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి∙ కొబ్బరి చిప్పలోని కొబ్బరిని తురుముకోవాలి∙ కొబ్బరి తురుముని గిన్నెలో వేసి.. కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి∙ చివరిగా శనగపిండివేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి∙ బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉండలను వేసి వేయించాలి ∙ఉండలు వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేయించితే కొబ్బరి ఖీమా బాల్స్ రెడీ ∙ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో సర్వ్‌చేసుకోవాలి. (చదవండి: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు!) -
కొబ్బరికి మహర్దశ
సాక్షి అమలాపురం: ఒకవైపు పరిశ్రమల లోటు తీర్చడం.. మరోవైపు స్థానికంగా పండే పంటలను ఉప ఉత్పత్తులుగా తయారు చేస్తే రైతుకు లాభసాటి ధర వస్తుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరిజిల్లాల్లో వరి తరువాత అతి పెద్ద సాగు కొబ్బరి. దశాబ్దాల కాలం నుంచి సాగవుతున్నా.. వీటి విలువ ఆధారిత పరిశ్రమలు స్థానికంగా లేకపోవడంతో కొబ్బరి మార్కెట్ తరచు ఒడుదొడుకులకు లోనవుతోంది. రాష్ట్రంలో సుమారు మూడులక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.78 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. దీన్లో ఒక్క డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి జిల్లాలోనే ఏడాదికి 124.72 కోట్ల కాయల దిగుబడి వస్తున్నట్లు అంచనా. ఇంత పెద్ద దిగుబడి వస్తున్నా తరచు కొబ్బరి సంక్షోభంలో కూరుకుపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్)కు కొబ్బరిని ఎంపిక చేసింది. ఈ పథకం కింద జిల్లాలో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేదానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్ ఇండియా బృందం గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిలా్లలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. హరిప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం సభ్యులు ముమ్మిడివరం వద్ద ఉన్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూనిట్‌ను, పేరూరులో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ఆధ్వర్యంలోని కొబ్బరి తాడు పరిశ్రమను, మామిడికుదురు మండలం పాశర్లపూడిలో క్వాయర్ బొమ్మల దుకాణం, క్వాయర్ మాట్ యూనిట్, చీపుర్ల యూనిట్, కోప్రా యూనిట్, చార్కోల్ యూనిట్లను సందర్శించనున్నారు. ఉద్యానశాఖతోపాటు జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్డీఏ, కేవీఐబీ, హ్యాండ్లూమ్ అధికారులు వారికి జిల్లాలో కొబ్బరి పరిశ్రమల అవసరాన్ని, అవకాశాలను వివరించనున్నారు. వందకుపైగా ఉప ఉత్పత్తులు కొబ్బరి నుంచి వందకుపైగా ఉప ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చెప్పుకొనే స్థాయిలో పెద్ద పరిశ్రమలు లేవు. ఒకటి రెండు ఉన్నా అవి కేవలం క్వాయర్ పరిశ్రమలు మాత్రమే. ఇక్కడ పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని ప్రణాళిక సిద్ధం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా యువతతోపాటు మహిళా స్వయంశక్తి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధికంగా మేలు జరుగుతుంది. కొబ్బరికి స్థానికంగా డిమాండ్ పెరిగి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. -
కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్ జియో టెక్స్టైల్ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్‌టేప్ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు. కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో హుస్నాబాద్‌లో ఉమ్మాపూర్ నుంచి పోతారం(ఎస్) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌ఆర్‌ఆర్‌డీ) సూచనలతో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్‌లో వేసి జాలీ మాదిరిగా అల్లారు. ముందుగా నేలను చదునుగా చేసి రోలర్‌తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్‌తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్‌టేప్ డాంబర్ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఖర్చు తక్కువ.. సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్‌టేప్‌లో ఉండే పటుత్వం తగ్గుతుంది. ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్‌లో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది. –సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
కోకోనట్ చికెన్ ఫ్రై.. భలే రుచిగా ఉంటుంది
కోకోనట్ చికెన్ తయారీకి కావల్సినవి: చికెన్ – అర కిలో మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి కోరు – అర కప్పు నూనె – సరిపడా, ఉప్పు – తగినంత మిరియాల పొడి – కొద్దిగా కారం – 1 టీ స్పూన్ గుడ్లు – 3 తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు కొట్టి, 2 టీ స్పూన్ల కొబ్బరి పాలు పోసుకుని, బాగా గిలగ్గొట్టి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లోకి కొబ్బరి కోరు తీసుకోవాలి. ముందుగా ఒక్కో చికెన్ ముక్కను మొక్కజొన్న పిండిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో ముంచి వెంటనే కొబ్బరి కోరు పట్టించాలి. అనంతరం వాటిని నూనెలో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. ఈ కోకోనట్ చికెన్ ముక్కలు భలే రుచిగా ఉంటాయి. -
కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా?
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతులు తమ పొలాల్లో నీటి జాడలను కనిపెట్టేందుకు జియాలజిస్ట్‌లను పిలిపించలేరు. ఎందుకంటే వారు అంత డబ్బు వెంచ్చించలేరు. పైగా అంత సమయం కూడా ఉండదు. అందుకని రైతులు నీటి జాడలను కనిపెట్టే వారిపై ఆధారపడుతుంటారు. అయితే ఇది శాస్త్రీయమేనా? దీని గురించి సైన్సు ఏం చెబుంతుంది తదితరాల గురించే ఈ కథనం. చాలమంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయడానికి ఫీల్డ్ సర్వేయర్లను పిలుస్తారు. వారు చేతిలో కొబ్బరికాయ, వేప పుల్ల, నీళ్ల చెంబు తదితరాలను ఉపయోగించి నీటి జాడలను చెబుతారు. దీన్నే విశ్వసించి రైతులు వారు చెప్పిన చోట బోర్లు వేయించుకుంటారు. ఇటువంటి పద్ధతులు నిజానికి శాస్త్రీయమా? దీని గురించి రైతులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. మూడు పద్ధతుల్లో నీటి జాడను.. తనకు తెలిసిన పద్ధతుల్లో నీటిజాడలను గుర్తిస్తున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలువురు రైతులకు వాటర్ పాయింట్లను ఈ పద్ధతిని అనుసరించే ఏర్పాటు చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పొలవరానికి చెందిన వారు. సుబ్బారెడ్డి నీటిని కనుగొనడానికి కొబ్బరికాయ లేదా వై ఆకృతిలోని వేప కర్ర లేదా కానుగ కర్ర, వాటర్ బాటిల్‌ని ఉపయోగిస్తారు. కొబ్బరి పీచులు వేళ్ల వైపు ఉండేలా కొబ్బరికాయను అరచేతిలో ఉంచుతారు. పొలంలో అలా చేతిలో కొబ్బరికాయ పెట్టకుని వెళ్తున్నప్పుడూ ఎక్కడ కొబ్బరికాయ నిటారుగా నిలబడితే అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు. అదికాకపోతే అరచేతిలో వై ఆకారంలో ఉన్న వేప ఆకులతో ముందుకు వెళ్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుంది లేదా మరీ ఎక్కువగా ఉంటే గిరిగిర తిరుగుతుంది. అదే నీళ్ల చెంబు పద్ధతి అయితే నీరు ఎక్కడ పక్కకు ఒరిగితే అక్కడ నీళ్లు వస్తాయని సురేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇలానే ఎన్నో బోర్లు వేయించానని, ఈ పద్ధతిని తానే సొంతంగా నేర్చుకున్నట్లు తెలిపారు. కొబ్బరికాయను బట్టి నీరు ఎన్ని అడుగుల్లో ఉందో చెప్పేయొచ్చు అని అన్నారు. జియాలజిస్టులు యంత్రాల సాయంతో తనిఖీ చేసినా ఎంత నీరు పడుతుందనేది కచ్చితంగా చెప్పలేరని అన్నారు. తాను నీటి జాడను గుర్తించిన ప్రతి చోటు 99 శాతం విజయవంతమయ్యాయని సురేందర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం. పుల్ల కానీ, టెంకాయ గానీ పైకి లేస్తుంది. రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది. ఒక లైను పోయే చోట లేచి నిల్చుకుంటుంది. దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది. ఏ వైపు ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం. మరీ ఫోర్స్‌గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి. మూడు లేదా నాలుగు అంగుళాలు పడతాయి. ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయన్నారు సురేందర్ రెడ్డి. శాస్త్రీయ పద్ధతిలోనే కనిపెట్టగలం.. కొబ్బరి వేపపుల్ల, వాటర్ బాటిళ్లతో నీటి జాడలను గుర్తించే పద్ధతులను అశాస్త్రీయమైనవని తిరుపతికి చెందిన జియాలజిస్టు, భూగర్భ జల మైనింగ్ కన్సల్టెంట్ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టెంకాయ కాకుండా ఉత్తరేణిపుల్ల, వేప పుల్ల, రేగి చెట్టు పుల్ల, లాంటి వాటితో కూడా నీటిజాడలను గుర్తిస్తారు. వీటిని అశాస్త్రీయమైనవిగా పరిగణించాలన్నారు. అంతేగాదు కొందరి చేతుల్లో నీటి రేఖ ఉందని, తమ కలలో దేవుడు కనిపించి చెప్పాడని అంటుంటారు కానీ అవన్నీ సరైన పద్ధతులు కావని తేల్చి చెప్పారు. కేవలం శాస్త్రీయ పద్ధతుల్లోనే నీటి జాడను కచ్చితంగా కనిపెట్టగలమని చెప్పారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పుడూ ఏ పద్ధతిలోనైనా నీరు పడుతుంది. ఛాలెంజింగ్ ఏరియాల్లో..వెయ్యి అడుగులు బోరు వేసినా పడని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఈ పద్ధతులు విఫలమయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి చోట భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బోర్లు వేసి డబ్బులు వృథా చేసుకొవద్దని రైతులకు సూచిస్తామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో కచ్చితత్వం.. భూగర్భంలో నీటి జాడలను కనిపెట్టడంలో శాస్త్రీయ పద్ధతులు సమర్థవంతంగా పనిచేస్తాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ జలాల జాడను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే ఒకటి అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలిస్తే..భూమి పొరలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాళ్లు మట్టి కలిసి ఉంటాయి. భూమి పొరల రెసిస్టివిటీని అంచనావేసి నీటి జాడను నిర్థారిస్తాం అని సుబ్బారెడ్డి తెలిపారు. పూర్వీకుల నుంచే నీటి జాడలు కనిపెట్టే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. భూమి భౌగోళిక లక్షణాల ప్రకారం కొందరూ నీటి జాడను అంచనా వేయగలరని చెప్పారు. వరహ మిహరుడు గ్రంథంలో నీటి అన్వేషణ.. భూగర్భ జల వనరులను ఎలా గుర్తించాలో వరాహ మిహిరుడు ఒక గ్రంథాన్ని రాశాడు. నీటి అన్వేషణ కోసం చెప్పిన టెక్నిక్‌లో బయో ఇండికేటర్లు గురించి కూడా ప్రస్తావించారు. నీరు ఉన్నచోట ఉడగ, రెల్ల, మద్ది, తంగేడు వంటి చెట్లు గుంపులుగా ఉంటాయని పూర్వీకులు ప్రగాఢంగా నమ్మేవారు. దీన్ని ఆధారం చేసుకునే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం నీరు పడే అవకాశాలను చెబుతారని అన్నారు. నీటి కుంటలు ఉండే చోట కూడా నీరు పడుతుందని నిరూపితమైంది. జియాలజిస్ట్‌లు సైంటిఫిక్ పద్ధతుల తోపాటు వీటిని కూడా పరిగణలోని తీసుకుంటారని చెప్పారు. ఇక్కడ అనుభవం కీలకం... చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బోర్ పాయింట్‌ని గుర్తించాలంటే.. జిల్లాలో ఎంత లోతులో నీరు పడుతుందో, ఏ వైపు సర్వే చేస్తే బాగుంటుందో అవగాహన ఉండాలి. నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి, అది నాకు సులభం. అదే కొత్త ప్రాంతమైతే.. అక్కడి జియాలజిస్ట్ కమాండింగ్ చేస్తున్నాడు. అక్కడ నాకంటే ఆయనే ఎక్కువ విజయాలు సాధిస్తారు అని సుబ్బారెడ్డి అన్నారు. కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన వేప చెట్లను కూడా పరిగణలోనికి తీసుకుని చెబుతారు. దీన్ని జీవ సూచికగా పరిగణిస్తారు. “వేప చెట్టు ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు మరియు ఆకులు ఒక వైపుకు వంగి ఉంటే... అటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక నీటి కాలువ ఉందని సూచిస్తుంది. అటువంటి ప్రాంతంలో పరికరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యం. ఇది ఆ ప్రాంతంలోని జియాలజిస్ట్ పరిజ్ఞానం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది, ”అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కొన్నిసార్లు రాతి నిర్మాణాలు చాలా సవాలుగా ఉంటాయని, అలాంటి చోట భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రమే నీటి వనరులను గుర్తించగలరని ఆయన అన్నారు. భూగర్భ జలాలను గుర్తించే సాంకేతికత 1910 నుంచి అభివృద్ధి చెందుతోందని, విమానంలో ప్రయాణిస్తూ కూడా నీటి జాడలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వేలు అందుబాటులో ఉన్నాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. (చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!) -
కొబ్బరి మాత్రమే ఆహారం..ఈ పెద్దాయన డైట్ ప్లాన్ వింటే షాకవుతారు..
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..’ అంటూ వేడి అన్నంలోకి నెయ్యి, పప్పు, ఆవకాయ, అప్పడాలు ఇలా ఎన్నో రకరకాల వంటకాలను తింటుంటారు భోజన ప్రియలు. అదే ప్రతిరోజూ ప్రతిపూట ఒకే ఆహారం తినాల్సి వస్తే? ఆ బాధ వర్ణించరానిది. అలాంటిది ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒకే ఆహారాన్ని గత రెండు దశాబ్దాలుగా తీసుకుంటున్నాడు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాలకృష్ణ పలాయి, గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కేవలం కొబ్బరి నీళ్లు, కొబ్బరి కాయలు తింటూ జీవితం సాగిస్తున్నాడు.ఎందుకంటే, అతనికి ‘గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). ఈ జబ్బుతో బాధపడేవారి అన్నవాహిక చివర ఉండే కండరం సరిగ్గా మూసుకోదు. దీంతో, ఏ ఆహారం తిన్నా గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరంతో నీరసించి, ఒక్కోసారి కుప్పకూలిపోతారు కూడా. బాలకృష్ణకు కూడా ఇదే పరిస్థితి. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, తక్కువ మొత్తంలో ఆహారం తిసుకునేవాడు. కాలక్రమంలో తనకు కొబ్బరి నీళ్లతో ఏ ఇబ్బంది లేదని గ్రహించాడు. తర్వాత కొంచెం లేత కొబ్బరిని ప్రయత్నించాడు. దాంతో కూడా ఏ ఇబ్బంది లేకపోవడంతో ఇక తన ఆహారం కేవలం కొబ్బరి మాత్రమేనని నిర్ణయించుకున్నాడు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది. కొబ్బరిలో ఎన్నో మినరల్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, కాబట్టి బాలకృష్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు, లోకల్ క్లబ్లో తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడుతూ ఫుట్‌బాల్ ప్లేయర్‌గానూ విజయాలు సాధిస్తున్నాడు. -
కొబ్బరికాయలతో గణనాథుడు
-
కొబ్బరితో కార్న్ ఇడ్లీ..రుచి మాత్రమే కాదు, చాలా బలం కూడా
కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి: మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్ చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి) ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి. -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు..
పాట్న: బిహార్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్కు పేరును కోకోనట్ పార్క్‌గా మార్చడంపై రాజకీయంగా వివాదానికి దారితీసింది. బిహార్ అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్ పేరును కోకోనట్ పార్క్‌గా సోమవారం అధికారికంగా పేరు మార్చారు. పార్క్ బయట శిలాఫలాకాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. పార్క్‌ను మొదట్లో కోకోనట్ పార్కు పేరుతోనే పిలిచేవారు. 2018లో అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం కోకోనట్ పార్క్‌కు అటల్ పేరును ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వం ఆ పార్కు పేరును కోకోనట్‌గా మార్చడంపై బీజేపీ నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 'వాజ్‌పేయీ వర్థంతి సందర్భంగా నితీష్ కుమార్ ఇటీవల పూలమాలలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అటల్ పేరుపై ఉన్న పార్కుకు కొత్త పేరును మార్చారు. ఒకే ప్రభుత్వం వాజ్‌పేయీపై విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్కుకు అటల్ పేరును యథావిధిగా ఉంచాలి' అని బీజేపీ డిమాండ్ చేసింది. రాజకీయంగా వివాదాస్పదం కావడంతో అటల్ పార్కుకు రాకపోకలను నిలిపివేశారు. ఓ వైపు పార్కు బయట కోకోనట్ పేరుతో శిలాఫలకం ఉండగా.. పార్కు బయట వాజ్‌పేయీ పేరు అలాగే ఉంది. ఇదీ చదవండి: 'ఆపరేషన్ హస్త'.. నాయకుల మధ్య పొలిటికల్ వార్.. -
ఎండుకొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి
ఎండుకొబ్బరిని నిల్వ ఉంచిన కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం చూస్తుంటాం. ఇవేవీ రాకుండా, కొబ్బరిచిప్పలను చింతలేకుండా ఇలా నిల్వచేసుకోండి... మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా తుడిచి, ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరినూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో పెట్టి , కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి నెలల పాటు పాడవకుండా ఉంటుంది. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయటా తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టి, కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేయాలి. ఇలా కూడా ఎక్కువ రోజుల పాటు చిప్పలు తాజాగా ఉంటాయి. -
Coconut Rice Balls: పసందైన స్నాక్స్.. కమ్మని కోకోనట్ రైస్ బాల్స్
కోకోనట్ రైస్ బాల్స్ కావల్సినవి: కొబ్బరి పాలు – ముప్పావు కప్పు బియ్యప్పిండి – అర కప్పు జొన్న పిండి – 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు – తగినంత కొబ్బరి కోరు, కాచిన పాలు – కొద్దికొద్దిగా (గార్నిష్‌కి అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ముందుగా కొబ్బరి పాలలో కొద్దిగా ఉప్పు వేసుకుని.. చిన్న మంట మీద మరిగించాలి. అనంతరం బియ్యప్పిండి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడే సమయంలో మళ్లీ జొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడిన తర్వాత చల్లార్చి.. చేతులకు నూనె రాసుకుని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని ఆవిరిపై బాగా ఉడికించుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడు గరిటె సాయంతో ఒక్కో బాల్ని పాలలో ముంచి.. కొబ్బరి కోరు పట్టించి సర్వ్ చేసుకోవచ్చు. అభిరుచిని బట్టి ఆవిరిలోంచి తియ్యగానే.. తాలింపు వేసుకోవచ్చు. లేదా బెల్లం పాకంలో వేసుకుని, నానిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. -
టమాటా లేకపోతేనేం.. ఇలా వంటలు చేసుకోండి
చాలామందికి టొమాటో కలపనిదే కూర చేయబుద్ధి కాదు. అయితే ఇటీవల కొద్దికాలం నుంచి సెంచరీ కొట్టినా .. కిందకి దిగనంటోంది టొమాటో. అయినా ఏం పర్వాలేదు, టొమాటో లేకపోయినా కూరలను రుచిగా వండొచ్చని చేసి చూపిస్తోంది ఈ వారం వంటిల్లు.... బైగన్ కా బార్తా తయారీకి కావల్సినవి: మీడియం సైజు వంకాయలు – రెండు వెల్లుల్లి రెబ్బలు – నాలుగు నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ; అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి) పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా.. ♦ వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. ♦ ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి. ♦ ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి. ♦ వంకాయ కాలిన తరువాతచల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి. ♦ బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ♦ ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ♦ కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ♦ నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్ డిష్. -
నోరూరించే కోకోనట్ ఖీర్ ట్రై చేయండి ఇలా..
కోకోనట్ ఖీర్కి కావలసినవి: చిక్కటి పాలు – 2 కప్పులు (కాచి, చల్లార్చుకోవాలి) కొబ్బరి బొండాం మీగడ – అర కప్పు (ఇందులో కాచి చల్లార్చిన పాలలోంచి పావు కప్పు పాలు కలిపి, మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – 1 కప్పు నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు పంచదార – పావు కప్పు ఏలకుల పొడి – పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి) జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, కిస్మిస్ – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి, నచ్చినవి మరిన్ని కలుపుకోవచ్చు. అయితే అన్నిటినీ నేతిలో దోరగా వేయించుకోవాలి) తయారీ విధానం: ముందుగా నేతిలో కొబ్బరి కోరు వేసుకుని గరిటెతో దోరగా వేయించుకుని.. అందులో పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన అనంతరం పాలు, కొబ్బరి మీగడ మిశ్రమం వేసుకుని దగ్గరపడేవరకూ తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకుని, ఒకసారి కలిపి, చివరిగా ఏలకుల పొడి.. నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. (చదవండి: ముంజులతో కేక్ చేసుకోండి ఇలా..) -
బ్రేక్‌ఫాస్ట్ కోసం వేడివేడిగా కొబ్బరి పోహా.. తయారీ ఇలా
కోకోనట్ పోహా తయారీకి కావాల్సినవి.. కొబ్బరి కోరు – అర కప్పు అటుకులు – ఒకటిన్నర కప్పులు (వాడుకునే 2 నిమిషాల ముందు జల్లెడ తొట్టెలో వేసుకుని నీళ్లు పోసి, 2 సార్లు కడిగి, ఆరబెట్టుకోవాలి) ఆవాలు, జీలకర్ర – పావు టీ స్పూన్ చొప్పున శనగపప్పు – 1 టీ స్పూన్ పచ్చిమిర్చి – 2 లేదా 3 (నిలువుగా కట్ చేసుకోవాలి) నూనె – సరిపడా, ఉప్పు – రుచికి తగ్గట్టుగా అల్లం తరుగు – కొద్దిగా, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు –2 రెబ్బలు జీడిపప్పు, వేరుశనగలు – కొన్ని చొప్పున (దోరగా వేయించి పెట్టుకోవాలి) ఎండుమిర్చి – 2 తయారీ విధానం ఇలా.. ముందుగా నూనెలో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుని తిప్పుతూ పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి. అందులో జీడిపప్పు, వేరుశనగలు, తగినంత ఉప్పు, కొబ్బరికోరు వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు చిన్నమంట మీద ఉడకనివ్వాలి. అనంతరం అటుకులు వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది ఈ పోహా -
ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్
ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి కొబ్బరి బోండాలకు సాటి ఏదిరాదు. అలాంటి కొబ్బరి బోండాలు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, లేదా పండగలు, శుభాకార్యాల్లోనే ఎంతగానో వినియోగిస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది కొబ్బరి బోండాలనే ప్రివర్ చేస్తుంటారు. కూల్‌డ్రింక్స్‌కి బదులు ఇవే ఆరోగ్యానికి మంచిదని వాటికే ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఐతే ఈ వీడియో చూశాక కచ్చితంగా ఓపినియన్ మారిపోవడమే గాక తాగేందుకు భయపడతాం కూడా. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని విస్మయం కలిగిస్తుంది ఈ వ్యక్తి చేసిన పని. ఆ వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్ వాటర్ చల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్‌గా గుర్తించారు. #Watch | Vendor sprinkling drain water on coconuts. Noida Police caught after video viral on social media#Noida #viralvideo #Coconuts #News18JKLH pic.twitter.com/ZhuXEYCylz — News18 Kashmir (@News18Kashmir) June 6, 2023 (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
భలే.. భలే.. కొబ్బరిపువ్వు
సాక్షి, అమలాపురం: దేవాలయాల్లోనో, శుభకార్యాల్లోనో కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ కొబ్బరి పువ్వు ఇప్పుడు కొంతమంది వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలోని నీరు ఇంకిపోయాక మొక్క మొలకెత్తే సమయంలో ఈ కొబ్బరిపువ్వు కాయ లోపల తయారవుతుంది. ఈ సమయంలో కొబ్బరికాయను కొడితే లోపల దూదిలా తెల్లగా ఉండే కొబ్బరిపువ్వు ఉంటుంది. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. గతంలో ఇవి కొబ్బరి పంట ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా లభించేవి. ఇప్పుడు మహానగరాల్లో కూడా లభిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై వంటి నగరాల్లో కొబ్బరి పువ్వుకు మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంతాలకు గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా రోజూ కొబ్బరి పువ్వు ఎగుమతి అవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంజవరం, ముంగండ, మలికిపురం మండలం రామరాజులంక, పెదతిప్ప, రాజోలు, మామిడికుదురు మండలాలతో పాటు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, దెందులూరు, పెదవేగి ప్రాంతాల్లో కొబ్బరి పువ్వు ఎక్కువగా లభ్యమవుతోంది. గోదావరి ప్రాంతం నుంచి ఈ వేసవి సీజన్లో రోజుకు 3 వేల నుంచి 5 వేల పువ్వులు హైదరాబాద్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ రోజుకు 8 వేల నుంచి 10 వేల వరకు ఎగుమతి అవుతాయి. కాయ కన్నా ప్రియం కొబ్బరి పువ్వును వాడుక భాషలో కొబ్బరి గుడ్డుగా పిలుస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కొబ్బరి గుడ్డుకు సైజును బట్టి రూ. 30 నుంచి రూ.70 వరకూ ధర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చెన్నై, బెంగళూరు మార్కెట్లకు ఈ పువ్వులు ఎగుమతి అవుతున్నాయి. పెద్దసైజు పువ్వులను ఆ మార్కెట్లలో రూ. 100 వరకూ అమ్ముతున్నారు. గోదావరి జిల్లాల్లో కొబ్బరి రైతుల వద్ద నుంచి వ్యాపారులు అన్ సీజన్లో పువ్వు సైజును బట్టి రూ. 4 నుంచి రూ. 9 మధ్యలోనే కొంటున్నారు. అదే సీజన్లో రూ.12 నుంచి రూ.15 వరకూ ధర చెల్లిస్తున్నారు. నీళ్ల కంటే ఎక్కువ పోషకాలు కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే కూడా కొబ్బరి పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పువ్వు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుందని వివరిస్తున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలో కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దరి చేరకుండా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని సైతం రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచిది కొబ్బరి పువ్వులో 66 శాతం కార్బోహైడ్రేట్లు, 64 శాతం సాల్యుబుల్ సుగర్స్ ఉంటాయి. ఫైబర్‌తో పాటు మినరల్స్, న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తినడం ఆరోగ్యపరంగా మంచిది. – బి.శ్రీనివాసులు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, అంబాజీపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గతం కన్నా ఎగుమతులు పెరిగాయి ఐదారేళ్ల క్రితం కొబ్బరి గుడ్డు ఉచితంగా ఇచ్చేవారు. మరీ డిమాండ్ ఉంటే పువ్వు రూపాయి ఉండేది. ఇప్పుడు కొబ్బరి కాయకన్నా ఎక్కువ ధర పలుకుతోంది. ఇటీవల ఎగుమతులు బాగా పెరిగాయి. కోనసీమ నుంచే కాకుండా ఏలూరు నుంచి కూడా ఎగుమతి అవుతోంది. అప్పుడప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా హైదరాబాద్‌కు కొబ్బరి గుడ్డు వస్తోంది. – సూదాబత్తుల వెంకట రామకృష్ణ, వ్యాపారి, అంబాజీపేట -
మామిడికుదురు మండలం పాశర్లపూడిలో భారీ అగ్ని ప్రమాదం
-
బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్ మజ్జిగచారు తయారీ ఇలా
వేసవిలో కడుపులో చల్లచల్లగా ఉండాలంటే ఈసారి కన్నడ కుంబలకాయ్ మజ్జిగె హులి ట్రై చేసి చూడండి! కన్నడ స్టైల్ మజ్జిగచారుతో ఎంచక్కా భోజనం చేసేయండి! కావలసినవి: ►బూడిద గుమ్మడికాయ ముక్కలు – పావు కేజీ (చెక్కు, గింజలు తొలగించి ముక్కలు చేయాలి) ►పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ►పచ్చి కొబ్బరి తురుము– కప్పు ►పచ్చిమిర్చి– 3 ►అల్లం– అంగుళం ముక్క ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►పెరుగు – కప్పు. ►పోపు కోసం: వంట కొబ్బరి నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఇంగువ – పావు టీ స్పూన్; కరివేపాకు – 4 రెమ్మలు. తయారీ: ►ముందుగా పచ్చిశనగపప్పును కడిగి నీటిలో 20 నిమిషాల సేపు నానబెట్టాలి. ►పెరుగులో కప్పు నీరు పోసి చిలికి పక్కన ఉంచాలి. ►గుమ్మడి కాయ ముక్కలను ప్రెషర్ కుక్కర్ లేదా నేరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►శనగపప్పును నీటి నుంచి తీసి మరో గిన్నెలో వేసి అందులో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. ►పెనంలో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, మిక్సీలో రుబ్బిన పేస్ట్ వేసి కప్పు నీటిని పోసి వేడి చేయాలి. ►ఈ మిశ్రమం ఉడకడం మొదలైన తర్వాత చిలికిన పెరుగు వేసి దించేయాలి. ►పోపు లేని మజ్జిగె హులి సిద్ధమైందన్నమాట. ►ఇప్పుడు మరొక పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తరవాత జీలకర్ర వేయాలి. ►అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి ఈ పోపును మజ్జిగె హులిలో కలపాలి. చదవండి: అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ.. -
కాకినాడలో రవాణాశాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్పై కత్తితో దాడి.. తెగిపడిన వేలు
కాకినాడ క్రైం: ఫిట్నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసినందున వాహనాన్ని సీజ్ చేసేందుకు యత్నించిన అధికారి, అతని డ్రైవర్‌పై వాహన యజమాని హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రం కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన పెంటా వెంకట దుర్గాప్రసాద్ ఆటోపై కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక ఫెలోషిప్ సెంటర్లోని దేవదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయం సమీపాన శుక్రవారం ఉదయం ఆటో నిలిపి వ్యాపారం చేసుకుంటున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా విధులు నిర్వర్తిస్తున్న మిద్దే చిన్నారావు అక్కడకు వెళ్లారు. దుర్గాప్రసాద్ ఆటో నంబరు తనిఖీ చేసి, గతేడాది నవంబర్లోనే వాహనం ఫిట్నెస్ ముగిసిందని, ఇన్స్రూెన్సు కూడా లేదని చెప్పారు. ఈ క్రమంలో ఆటోను సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. వద్దని దుర్గాప్రసాద్ వారించాడు. తాను ఆటో నడుపుతూ వ్యాపారం చేయడం లేదని, కేవలం రోడ్డు పక్కన నిలిపి మాత్రమే జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారావు ఆటోను సీజ్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో దుర్గాప్రసాద్ ఆటో వద్దకు వెళ్లి కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొచ్చాడు. కారులో ఉన్న చిన్నారావును బెదిరించేందుకు కారు అద్దంపై కత్తితో వేటు వేశాడు. ‘ఏంటి చంపుతావా?’ అంటూ చిన్నారావు బయటకి రాబోయారు. అప్పటికే వర్షం పడుతుండడంతో కారు దిగిన వెంటనే చిన్నారావు కాలు జారి పడిపోయాడు. ఆయనపై దుర్గాప్రసాద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిని నిలువరించేందుకు ఏఎంవీఐ కారు డ్రైవర్ గుత్తుల వీర వెంకట సత్యనారాయణ యత్నించగా దుర్గాప్రసాద్ అతడి పైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారావు మెడ, తల, చేయి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేలు తెగి పడింది. పెద్దపేగు పూర్తిగా బయటికి వచ్చేసింది. డ్రైవర్ సత్యనారాయణకు రెండు చేతులపై గాయాలయ్యాయి. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. కాగా కత్తి దాడిలో తెగిపడిన చిన్నారావు చేతి వేలిని అతికించేందుకు జీజీహెచ్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిన్నారావు శరీరంపై మొత్తం 34 కత్తిపోట్లు, గాయాలు గుర్తించామని వైద్యులు తెలిపారు. జీజీహెచ్‌లో బాధిత కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పరామర్శించారు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశామని టూ టౌన్ సీఐ నాయక్ తెలిపారు. -
కోవిడ్ సంక్షోభం చూపిన ప్రత్యామ్నాయం.. నారికేళం.. కలిసొచ్చే కాలం..
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘ప్రతి సంక్షోభం ఓ ప్రత్యామ్నాయం చూపుతుంది. తప్పక మేలు చేస్తుంది’ అనేది కొబ్బరి విషయంలో వాస్తవ రూపం దాల్చనుంది. అంది పుచ్చుకోవాలే కానీ ‘కల్పవృక్షం’ విశ్వవ్యాప్తంగా మెరుగైన అవకాశాలను చూపుతుందని.. కొబ్బరికి కలిసొచ్చే కాలం మున్ముందు అపారంగా ఉంటుందని మార్కెటింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విలువ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా కొబ్బరి రైతులకు, పారిశ్రామికవేత్తలకు లాభాలు సమకూరుతాయని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోకోనట్ ప్రొడక్ట్స్, ట్రేడ్ అండ్ మార్కెటింగ్’ అంతర్జాతీయ సదస్సులో నిపుణులు ఉద్ఘాటించారు. ప్రతికూలతలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయ్ రూగోస్ వైట్ ఫ్లై (తెల్లదోమ) వల్ల కొబ్బరి దిగుబడి తగ్గి ఆశించిన ధర దక్కడం లేదు. మరోవైపు క్వాయర్ ఉత్పత్తుల ధరలు నేలచూపు చూస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాలతో పోల్చుకుంటే అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్, దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఏపీ వెనుకబడి ఉన్నాయి. ఇక్కడి నుంచి కొబ్బరి కాయ, కురిడీ కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి రైతులు, వ్యాపారుల ఆలోచనా ధోరణిలో మార్పులొస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల వినియోగం కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నందున కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు నోచుకోనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 3 కోట్ల మందికి కొబ్బరి దింపు, సేకరణ, ఎగుమతి, దిగుమతులు జీవనాధారంగా ఉండగా.. వారిలో రైతులు 1.20 కోట్ల మంది ఉన్నారు. డిమాండ్‌ను ఒడిసి పడితే.. అంతర్జాతీయంగా కొబ్బరి కాయ, కొబ్బరి ముక్క, కొబ్బరి నీళ్లతో తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కోకోనట్ చిప్స్, కోకోనట్ వాటర్ ప్యాకెట్లు, నాటాడీకో వంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త డిమాండ్ ఉంది. కొబ్బరిని ఆరోగ్యానికి ఔషధంగా గుర్తించారు. కొబ్బరి పాలలో ఉండే ల్యారిక్ యాసిడ్ చిన్న పిల్లలకు చాలా ఉపయోగకరం. పశువులకు సంక్రమిస్తున్న విభిన్న వ్యాధులు, వైరస్ల వల్ల వాటి నుంచి వచ్చే పాల వాడకంపై అభివృద్ధి చెందుతున్న దేశాలు విముఖత చూపుతున్నాయి. ఈ మార్కెట్‌ను కొబ్బరి పాలతో భర్తీ చేసేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కొబ్బరి పాల నుంచి తయారు చేసే వర్జిన్ కోకోనట్ ఆయిల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని సేవించడం వల్ల శరీరంలోని తెల్ల రక్తకణాలు ఉత్సాహంగా ఉంటాయి. ఎయిడ్స్ రోగులకు ఇది ఇమ్యూనిటీ బూస్టర్ వంటిదని, ఆరోగ్యానికి దివ్య ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో యూరప్ దేశాలకు కొబ్బరి ఎగుమతులు పెరిగాయి. అవకాశాలు అనేకం భారీ పరిశ్రమలు మొదలు ఫుడ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటే కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు అనేకం ఉన్నాయి. డిమాండ్ పెరుగుతున్నందున ఔత్సాహికులు ఉప ఉత్పత్తులపై, కుటీర పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాల్సి ఉంది. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉత్పత్తులతో పాటు పీచు, పెంకు, కలప వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఎండు కొబ్బరి (కోప్రా), కొబ్బరి నూనె, వర్జిన్ కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, కొబ్బరి పాలు/క్రీమ్, కొబ్బరి పాలతో పొడి, వెనిగర్, చిప్స్, కొబ్బరి నీటితో పాటు పలు రకాల పానీయాలు ఉత్పత్తి చేయవచ్చు. ఔత్సాహికులు ఇప్పటికే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో యువ పారిశ్రామికవేత్త గుత్తుల ధర్మరాజు వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మరో యువ పారిశ్రామికవేత్త వికాస్ సైతం వేపూరి ఆగ్రో ప్రొడక్ట్స్ పేరిట ఇవే ఉత్పత్తులను జాతీయంగా ఎగుమతి చేస్తున్నారు. వీరిని చూసి మరికొంతమంది ముందుకు వస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రూ.3.50 కోట్లతో వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కోకోనట్ చార్కోల్ (చిప్ప బొగ్గు) తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇటువంటివి మరిన్ని ఏర్పాటు చేసేందుకు కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) వంటి సంస్థలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి మార్కెట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను బేబీ మసాజ్ ఆయిల్గా పశ్చిమ బెంగాల్, చుట్టుపక్కల పట్టణాల్లో అమ్ముతున్నారు. మా కంపెనీ నుంచి ఆయిల్ కూడా ఇక్కడకు వెళ్తోంది. అక్కడి ఫార్మా కంపెనీలు సైతం వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను సిఫారసు చేస్తున్నాయి. మన ప్రాంతంలో జాన్సన్ అండ్ జాన్సన్ వాడుతున్నారు. మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి వాడకం పెరుగుతోంది. మన దేశం కన్నా ఇతర దేశాల్లో అధికంగా కొబ్బరి ఉత్పత్తులను వాడుతున్నారు. ఆరోగ్యం పట్ల నెమ్మదిగా అవగాహన పెంచుకుంటున్నారు. – గుత్తుల ధర్మరాజు, కోనసీమ ఆగ్రోస్ కంపెనీ యజమాని, ముమ్మిడివరం -
Coconut Dream: కొబ్బరి తురుము, అరటి పండు గుజ్జుతో కోకోనట్ డ్రీమ్!
కొబ్బరి తురుముతో కోకోనట్ డ్రీమ్ ఇలా తయారు చేసుకోండి. కోకోనట్ డ్రీమ్ తయారీకి కావలసినవి ►పచ్చి కొబ్బరి తురుము – 200 గ్రా ►మంచి నీరు – పావు లీటరు ►పండిన అరటిపండ్లు – 4 ►నిమ్మకాయ – 1. తయారీ: ►కొబ్బరి తురుమును మిక్సీలో వేసి నీటిని పోస్తూ బ్లెండ్ చేయాలి. ►బ్లెండ్ చేసే కొద్దీ కొబ్బరిలోని క్రీమ్ పైకి తేలుతుంది. ►ఈ పాలను మరొక పాత్రలోకి వంపి, పైకి తేలిన క్రీమ్ తిరిగి కొబ్బరి పాలలో కలిసి పోయే వరకు పక్కన ఉంచాలి. వడపోయవద్దు. ►కొబ్బరి కోరు పూర్తిగా మెదగకుండా కొంత ఉండిపోయినప్పటికీ అలాగే తాగడం ఆరోగ్యకరం. ►అరటి పండు గుజ్జును మెత్తగా బ్లెండ్ చేసి అందులో నిమ్మరసం కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో పోసి సమంగా కలిసే వరకు బాగా కలపాలి. ఇవి కూడా ట్రై చేయండి: Palak Dosa: గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే! పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి -
నట్స్, డార్క్ చాక్లెట్స్, అరటి పండ్లు ఇష్టమా? డోపమైన్ అనే హార్మోన్‌ను విడుదల చేసి..
Health Tips In Telugu: ఒక్కోసారి కారణమేమీ లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. విలువైన వస్తువులేవో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా చికాకు వేస్తుంటుంది.ఆ తర్వాత కాసేపటికి ఇష్టమైన వారెవరో కనిపిస్తేనో, ఏదైనా మంచి వార్తలు వింటేనో, ఏమయినా మంచి ఆహారం తింటేనో మూడ్ సరి అయిపోతుంది. ఇది మనసు చేసే మాయాజాలం. ఇదంతా జరగడానికి మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ విడుదలలో తేడాలు రావడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అలా కారణం మాత్రమే చెప్పి ఊరుకోకుండా మంచి మూడ్‌లోకి తీసుకొచ్చే కొన్ని ఆహార పానీయాల గురించి కూడా చెప్పారు. వీటిని కేవలం మూడ్ బాగోలేనప్పుడే కాదు, రోజువారీ తీసుకుంటే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు కదా.. ఇంతకూ అలాంటి ఆహార పానీయాలేమిటా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వెళ్దాం... వీటితోబాటు ఆకుకూరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ కూడా డోపమైన్ బూస్టర్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు వీటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే సరి. నట్స్ నట్స్‌లో అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అమైనో యాసిడ్‌కు డోపమైన్ విడుదలను పెంచే సామర్థ్యం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం... నట్స్‌లో టైరోసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ టైరోసిన్ విచ్ఛిన్నమైతే.. డోపమైన్‌గా తయారవుతుంది. వేరుశెనగలు, బాదం, గుమ్మడి గింజలు, నువ్వులలో టైరోసిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు. కాఫీ సాధారణంగా చాలామందికి మూడ్ బాగోలేనప్పుడు లేదా తలనొప్పిగా అనిపించినప్పుడు మంచి ఫిల్టర్ కాఫీ తాగుతుంటారు. దాంతో శాడ్ మూడ్ కాస్తా తిరిగి హ్యాపీ మూడ్‌గా మారిపోతుంటుంది. ఒక పరిశోధన ప్రకారం రోజూ సుమారు బిలియన్ మందికి పైగా కాఫీ తాగుతుంటారు. రోజూ కాఫీ తాగేవారికి డిప్రెషన్ కూడా కాస్త దూరంలోనే ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది కాబట్టి నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటున్నవారు దానిని కొనసాగించడం మంచిది. ఈసారెప్పుడైనా మూడ్ బాగోలేప్పుడు ఒక కప్పు కాఫీ తాగి చూస్తే సరి. కొబ్బరి పచ్చి కొబ్బరిలో మీడియం లెవెల్లో ట్రై గ్లిజరైడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, మెదడుకు చైతన్యాన్ని ఇస్తాయి. కొబ్బరి పాలు, కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. అందుకే కొబ్బరికి మూడ్ ఫుడ్ అనే పేరుంది. బెర్రీలు... సాధారణంగా పండ్లు, కూరగాయలు బాగా తీసుకునేవారి మానసిక ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాటిలోనూ ప్రత్యేకించి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల బెర్రీలు తీసుకునే వారికి కుంగుబాటు, ఆందోళన ఆమడదూరంలో ఉంటాయి. బ్లూ బెర్రీలు అంటే నేరేడు పండ్ల వంటివి తీసుకోవడం వల్ల మూడ్ బాగుంటుంది. అవకాడో ఒకప్పుడు ఇది కాస్తంత ఖరీదైన ఆహారాల జాబితాలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పండులో ఉండే మెత్తటి గుజ్జు అనేక రకాల పోషకాలకు నిలయం. దీనిలోని కొలీన్కు నాడీ వ్యవస్థను నియంత్రించడంతోపాటు మూడ్‌ను సంతోషంగా మార్చే లక్షణాలు ఉన్నాయి. ఒక సర్వే మేరకు అవకాడో తినే మహిళలలో ఆందోళన ఉండదట. వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ బి శరీరంలోని ఒత్తిడి స్థాయులను అదుపు చేస్తుంది. అందువల్ల వీలయినప్పుడలా అవకాడో తింటూ ఉండటం ఎంతో ప్రయోజనకరం. డార్క్ చాక్లెట్స్ ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపే వాటిలో డార్క్ చాక్లెట్స్ ఎప్పుడూ ముందుంటాయి. వీటిలో ఉండే ఉండే ఫినైల్థైలమైన్ అనే రసాయనం డోపమైన్‌ను కొద్ది కొద్దిగా విడుదల చే స్తుంటుంది. అంతే కాదు, డార్క్ చాక్లెట్స్‌లో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ఎండార్ఫిన్ హార్మోన్, సెరోటోనిన్ అనే మోనోఅమైన్ న్యూరోట్రాన్స్మీటర్ విడుదలవుతాయి. వీటివల్ల మానసిక ఉల్లాసం, సంతోషం కలుగుతాయి. అరటిపండు అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ న్యూరో టాన్స్మీటర్ల విడుదలకు ఉపకరిస్తుంది. మెదడు, శరీరం చురుగ్గా ఉండేలా చేయడానికి ఈ రసాయనాలు తోడ్పడడంతోపాటు మానసిక స్థితిని నియంత్రణలో ఉంచి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అరటిపండ్లు రక్తంలోని షుగర్ నిల్వలను సైతం నియంత్రించగలవు. అలాగని షుగర్ ఉన్నవారు ఒకేసారి రెండు మూడు అరటిపళ్లు లాగించేయకూడదు. మూడ్ సరిగా లేదనిపిస్తే మాత్రం ఒక అరటిపండు తింటే సరి. డెయిరీ ఉత్పత్తులు ఒత్తిడిలో ఉన్నప్పుడు డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, పాలు, పెరుగు తీసుకుంటే.. శరీరంలో హ్యాపీ లెవల్స్ పెరుగుతాయి. చీజ్‌లో టైరమైన్ ఉంటుంది, ఇది మానవ శరీరంలో డోపమైన్‌గా మారుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు పాలు, చీజ్, పెరుగు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, పుల్లట్లు తిన్నా, పులి బొంగరాలు తిన్నా మంచిదే. కాకపోతే అవి సిద్ధంగా ఉండవు కాబట్టి వీలయినప్పుడల్లా తింటూ ఉంటే మంచిది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే -
Recipes: చట్‌పటే కోకోనట్, బటాడా వడ ఇలా తయారు చేసుకోండి!
ఎప్పుడూ చేసుకునే పకోడి, పునుగులు, బజ్జీలు, వడలు కాకుండా.. దుంపలు, పాలకూర, గుడ్లతో విభిన్నంగా ప్రయత్నించి చూడండి. నోరూరించే క్రంచీ కరకరలు మళ్లీమళ్లీ కావాలనిపిస్తాయి. వీటిని ఎలా చేయాలో చూసేద్దామా మరి... చట్‌పటే కోకోనట్ కావలసినవి: క్యారట్లు – మూడు బంగాళ దుంపలు – రెండు పాలకూర – కట్ట కొత్తిమీర – చిన్నకట్ట ఒకటి పచ్చిమిర్చి – మూడు కారం – టీస్పూను మిరియాలపొడి – టీస్పూను మెంతిపొడి – టీస్పూను మైదా – ముప్పావు కప్పు పచ్చికొబ్బరి తురుము – రెండు కప్పులు గుడ్లు – మూడు నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ: ముందుగా కూరగాయ ముక్కలన్నింటిని ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి ఈ మిశ్రమంలో కారం, మిరియాలపొడి, మెంతిపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి కబాబ్స్‌లా వత్తుకోవాలి గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కబాబ్స్‌ను ముందుగా గుడ్లసొనలో ముంచి తరువాత మైదా, చివరిగా కొబ్బరి తురుములో ముంచి సన్నని మంటమీద గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి పీనట్ సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. బటాడా వడ కావలసినవి: బంగాళ దుంపలు – పావు కేజీ పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క వెల్లుల్లి రెబ్బలు – నాలుగు కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా నిమ్మరసం – పావు టీస్పూను పంచదార – ముప్పావు టీస్పూను నూనె – టేబుల్ స్పూను ఆవాలు – అరటీస్పూను జీలకర్ర – అరటీస్పూను పసుపు – పావు టీస్పూను ఇంగువ – చిటికెడు కరివేపాకు – రెండు రెమ్మలు నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. బ్యాటర్ కోసం: శనగపిండి – కప్పు, పసుపు – పావు టీస్పూను, కారం – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, బేకింగ్ సోడా – చిటికెడు, తయారీ: బంగాళ దుంపలను ఉడికించి తొక్క తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసి కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మెత్తగా చిదుముకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్టుచేసి పెట్టుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూను నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపడలానివ్వాలి. తరువాత పసుపు, చిటికెడు ఇంగువ వేసి కలపాలి తిప్పిన వెంటనే పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ఇవన్నీ చక్కగా వేగాక చిదిమిపెట్టుకున్న దుంపల మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి చివరిగా నిమ్మరసం, పంచదార వేసి నిమిషం పాటు మగ్గనిచ్చి దించేయాలి ఈ మిశ్రమం చల్లారాక ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని గిన్నెలో వేసి కాసిన్ని నీళ్లుపోసుకుని గరిటజారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి దుంపల ఉండలను బ్యాటర్లో ముంచి లేతబంగారు వర్ణంలోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. వేయించిన పచ్చిమిర్చి, కొబ్బరి చట్నీతో ఈ వడలు చాలా బావుంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి ఇలా తయారు చేసుకోండి! దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా! -
కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!
How To Prepare Coconut Coir Based Compost: కొబ్బరి పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువు ‘మట్టి లేని సేద్యాని’కి ఉపయోగపడుతోంది. నిస్సారమైన భూముల్లో లేదా సాగుకు నేల అందుబాటులో లేని అర్బన్ ప్రాంతాల్లో నివాస గృహాల పైన, మిద్దెలపైన, గేటెడ్ కమ్యూనిటీల్లోని ఖాళీ స్థలాల్లో.. గ్రో బ్యాగ్‌లలో కొబ్బరి పొట్టు ఎరువు (కంపోస్టు)తో.. కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కల సాగుకు మట్టి లేని సేద్యం ఉపకరిస్తుంది. తామర తంపరగా పట్టణీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ జనం కూడే పట్టణాలు, నగరాల దగ్గర్లోనే తాజా కూరగాయలు, ఆకుకూరల లభ్యతను పెంచడానికి ఈ సేద్యం ఉపయోగకరమని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) చెబుతోంది. ఆ విశేషాలు ఈ నెల 16న ‘సాక్షి సాగుబడి’లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొబ్బరి పొట్టుతో చక్కటి సేంద్రియ ఎరువు తయారీ పద్ధతి గురించి తెలుసుకుందాం.. కొబ్బరి డొక్కల నుంచి ఒక కేజీ పీచును వేరు చేసే క్రమంలో 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఈ ముడి పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. ముడి కొబ్బరి పొట్టులోని ‘కర్బనం–నత్రజని’ నిష్పత్తి మొక్కలకు అనుకూలం కాదు. దీనిలో ‘లెగ్నిన్’ కూడా అధిక మోతాదులో ఉంటుంది. అందువల్ల దీన్ని కుళ్లబెట్టకుండా నేరుగా వాడితే మొక్కలకు హాని జరుగుతుంది. కొబ్బరి పొట్టును ఒక శిలీంధ్రం కలిపి కుళ్లబెడితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. మట్టి లేని సేద్యానికే కాకుండా.. సాధారణ పొలాల్లో పంటల సాగులో కూడా సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. కొబ్బరి పొట్టును సులువుగా సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియను సెంట్రల్ కాయిర్ బోర్డు ప్రమాణీకరించింది. ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను కాయిర్ బోర్డు రైతులకు పరిచయం చేసింది. రసాయనిక పదార్థాలు వాకుండా ఫ్లూరోటరస్ సాజర్ కాజూ, అజొల్లా, వేప పిండినివినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం ఇది. కోనసీమ రైతుల ‘కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ’ కొబ్బరి పొట్టు ఎరువును తయారు చేస్తోంది. కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి కావలసిన పదార్ధాలు: ►టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించినది) ►10 కేజీల అజొల్లా ∙30 కేజీల వేప పిండి. ►5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ శిలీంధ్రం. ►వీటిని పొరలు, పొరలుగా వేసి తడుపుతూ ఉంటే నెల రోజుల్లో బాగా చివికిన కొబ్బరి పొట్టు ఎరువు తయారవుతుంది. ►ఫ్లూరో టస్ సాజార్ కాజూ శిలీంధ్రం ధవళేశ్వరంలోని కాయిర్ బోర్డు రీజనల్ కార్యాలయంలో లభిస్తుంది. కొబ్బరి పొట్టుతో కంపోస్టు తయారీ ఇలా.. ►ఒక టన్ను కొబ్బరి పొట్టుకు 12 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తున బెడ్ తయారు చేసుకోవాలి. ►ముందుగా 200 కేజీల కొబ్బరి పొట్టును సమతలంగా, నీడగా ఉన్న ప్రదేశంలో ఒక పొరలా వేయాలి. ►దీనిపై నీరు చిలకరించి (సుమారు 20 లీటర్లు) ఒక కేజీ ఫ్లూరోటస్ సాజర్ కాజూ శిలీంధ్రాన్ని వెదజల్లాలి. ►దీనిపై మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి. పొట్టు వేసిన తరువాత అజోల్లా, వేపపిండి మిశ్రమం 20 కేజీలు వేయాలి. ►20 లీటర్ల నీరు పోసి మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి ►తరువాత ఫ్లూరోటస్ సాజర్ కాజు 2 కేజీలు వేసి నీరు చల్లి, తిరిగి 200 కేజీల పొట్టు వేయాలి. ►తరువాత నీటితో తడపాలి. ►మరోసారి మిగిలిన 20 కేజీల అజొల్లా, వేప పిండి మిశ్రమం, ఫ్లూరోటస్ శిలీంధ్రం 2 కేజీలు చల్లి.. దానిపై నీరు చిలకరించి, మిగిలిన 200 కేజీల కొబ్బరి పొట్టును వేసి నీరు చల్లాలి. ►కనీసం 30 రోజులు దీనిపై ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లి తడపాల్సి ఉంది. ►నెల రోజుల్లో పొట్టు బాగా కుళ్లి మంచి ఎరువుగా తయారవుతుంది. ►కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి మరో పద్ధతి కూడా ఉంది. ►గైలరిసీడియా (గిరిపుష్పం) చెట్ల ఆకులు, గోమూత్రం కలిపిన పశువుల పేడ, ముడి కొబ్బరి పొట్టును పొరలుపొరలుగా వేసి కుళ్లబెట్టినా కొబ్బరి పొట్టు కంపోస్టు తయారవుతుంది. ►అయితే, ఈ పద్ధతిలో రెండు నెలల సమయం పడుతుంది. – నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి అమలాపురం చదవండి: Sagubadi: కూరగాయల్లోనూ ‘డ్యూయల్ గ్రాఫ్టింగ్’! ఒకే మొక్కకు రెండు అంట్లు! Organic Farming: 34 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...! -
Recipe: రుచికరమైన కొబ్బరి వడల తయారీ ఇలా!
కొబ్బరి వడలు ఇలా తయారు చేసుకోండి. కొబ్బరి వడల తయారీకి కావలసినవి: ►కొబ్బరి కోరు – అర కప్పు ►బియ్యం – 1 కప్పు (నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టాలి) ►జీలకర్ర – 1 టీ స్పూన్ ►బియ్యప్పిండి – 1/3 కప్పు ►ఉప్పు – తగినంత ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా మిక్సీ బౌల్లో నానబెట్టిన బియ్యం, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ►అనంతరం అందులో కొబ్బరికోరు, ఉప్పు వేసుకుని.. ఈసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. దానిలో బియ్యప్పిండి వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం ఒక అరటి ఆకుపైన లేదా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ మీద చిన్నచిన్న ఉండల్ని అప్పడాల్లా ఒత్తుకుని.. కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ►ఇవి నూనెలో పడగానే పూరీల్లా పొంగుతాయి. వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. ! ఇవి కూడా ట్రై చేయండి: Kalakand Laddu Recipe: దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా! Recipes: శాగూ కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి! -
Health Tips: రాత్రి భోజనంలో ఇవి తిన్నారంటే...
డిన్నర్లో ఏం తింటామో వాటిపై మన రాత్రి నిద్ర ఆధారపడి ఉంటుంది. చాలామంది రకరకాల ఫుడ్స్ తిని అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. జీర్ణక్రియకు భంగం కలిగించే ఆహారాన్ని తింటే ఉదయాన్నే పొట్టను క్లియర్ చేయడంలో సమస్య ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. తొంభైశాతం సరైన ఆహారం ఎంచుకోకపోవడం వల్ల రాత్రి నిద్ర పాడవుతుంది. అయితే రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మీ విందు చాలా తేలికగా, జీర్ణమయ్యేలా ఉండాలి. అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు లో భారం గా ఉండకూడదు. డిన్నర్లో తినే ఆహార పదార్థాలు గ్యాస్ ఉత్పత్తి చేయకూడదు. ఎందుకంటే ఇది నిద్రిస్తున్నప్పుడు కడుపు నొప్పికి కారణమవుతుంది. అంతేకాదు నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. డిన్నర్ చాలా కారంగా కూడా ఉండకూడదు. ఇది డీహైడ్రేషన్ సమస్యని సృష్టిస్తుంది. రాత్రి తరచుగా దాహం ఉండవచ్చు. రాత్రి భోజనంలో తేలికపాటి సుగంధ ద్రవ్యాలు, ఆవుపాలతో తయారు చేసిన దేశీ నెయ్యిని ఉపయోగించాలి. ఓట్స్ లేదా శనగ పిండితో చేసిన ఆహారాలని ఉపయోగించవచ్చు. పప్పు, చపాతీ అన్ని విధాలా బాగుంటుంది. అలాగే బ్రోకలీ, కొబ్బరి, పుదీనా ఉపయోగించిన వంటకాలు సులభంగా జీర్ణమవుతాయి. చదవండి: Health Tips: నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు! ఇవి తింటే మేలు! -
రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో
ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో ఊహించలేం. చేయని తప్పుకు కూడా కొన్నిసార్లు అనుకోకుండా బలికావాల్సి వస్తోంది. అచ్చం ఓ మహిళకు కూడా ఇలాంటి ఓ భయంకర సంఘటనే ఎదురైంది. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఊహించని ఈ ఘటన మలేషియాలో జరిగింది. తన స్నేహితురాలితో కలిసి మహిళ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది. అయితే రహదారి పక్కన కొన్ని కొబ్బరి చెట్లు రోడ్డుపైకి వంగి ఉన్నాయి. ఇంతలో ఒక కొబ్బరి చెట్టుపై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళ తలపై నేరుగా పడింది. దీంతో మహిళ ఒక్కసారిగా స్కూటర్ పై నుంచి రోడ్డుపై పడిపోయింది. అయితే మహిళ హెల్మెట్ ధరించి ఉండటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్కూటర్‌పై ఉన్న స్నేహితురాలు, స్థానికులు అప్రమాత్తమయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కాగా టూవీలర్ వెనకాల వెళ్తున్న కారు డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. చదవండి: ‘యూకే ప్రధాని’ని ఛేజ్ చేస్తున్నపోలీసులు!: వీడియో వైరల్ -
‘ఉద్దానం కొబ్బరికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు’
సాక్షి,కవిటి(శ్రీకాకుళం): ఉద్దానం కొబ్బరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా దేశవ్యాప్తంగా నాణ్యమైన మొక్కలు అందించేందుకు జాతీయ కొబ్బరి బోర్డు, రాష్ట్ర ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని సీడీబీ డిప్యూటీ డైరెక్టర్ రేష్మి డీఎస్ అన్నారు. ఆమె గురువారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈస్ట్‌కోస్ట్ టాల్ వెరైటీలో ఎంపిక చేసిన మదర్ ప్లాంట్ క్షేత్రాల్ని తనిఖీ చేసేందుకు అంబాజీ పేట ఉద్యానవన వర్సిటీ కొబ్బరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కవిటి మండలంలోని ముత్యాలపేట, డి.గొనపపుట్టుగ, కవిటి గ్రామాల్లో కొత్త మొక్కల తయారీకి ఆసక్తి కనబరిచిన రైతుల వ్యవసాయ క్షేత్రాల్ని పరిశీలించారు. ఈ పథకంలో చిక్కాఫ్ సంస్థ ఆధ్వ ర్యంలో రైతులు 10 లక్షల కొబ్బరిచెట్లు పెంచుతున్నామన్నారు. వీటిలో తొలిదశలో 5000 మదర్ప్లాంట్ల నుంచి ఎంపిక చేసిన విత్తన మొక్కల్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంచాలన్న ఒప్పందం రైతులకు, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(సీడీబీ)కు కుదురుతుందన్నారు. ఆ మేరకు తొలిదశ ఎంపిక జరిగిందన్నారు. ఎంపిక చేసిన మదర్ప్లాంట్లకు మూడోదశ తనిఖీ బృందం ట్యాగ్‌లను ఇచ్చి నంబర్లు కేటాయిస్తుందన్నా రు. ఆ ట్యాగ్ నంబర్లతో పాటు రైతు చిరునామా, ఫోన్ నంబర్ సీడీబీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అవసరమైన రైతు లు నేరుగా సంబంధిత రైతులను సంప్రదించి స్థానిక మార్కెట్ ధరకు అదనంగా 30శాతం చెల్లించి మదర్‌ప్లాంట్ మొక్కల విత్తన పండ్లు కొనుగోలు చేయడం ఈ పథకం ఉద్దేశమని సీడీబీ ఏపీ టెక్నికల్ ఆఫీసర్ ఎం.కిరణ్‌కుమార్ వివరించారు. చదవండి: AP: సినిమా టికెట్ల కలెక్షన్లు.. ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలోకి ’ -
Recipes: అరటి పండ్లు, కొబ్బరి కోరు.. నోరూరించే స్వీట్ రెడీ!
అరటి పండ్లు, కొబ్బరి కోరు, పంచదార ఇంట్లో ఉంటే చాలు ఇలా సులువుగా బనానా కోకోనట్ బర్ఫీ తయారు చేసుకోవచ్చు. బనానా కోకోనట్ బర్ఫీ తయారీకి కావలసినవి: ►అరటి పండ్లు – 3 (గుజ్జులా చేసుకోవాలి) ►మిల్క్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►పంచదార పొడి – అర కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►చిక్కటి పాలు – 1 కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి కోరు – పావు కప్పు, డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి బనానా కోకోనట్ బర్ఫీ తయారీ విధానం: ►ముందుగా పాలు కాచి.. అందులో అరటిపండ్ల గుజ్జు వేసుకోవాలి. ►చిన్న మంట మీద, బాగా ఉడికిన తర్వాత పంచదార పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడుతున్న సమయంలో మిల్క్ పౌడర్, నెయ్యి, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలుపుతూ ముద్దలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►అనంతరం డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి, బాగా చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి! చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా -
మ్యాంగో కోకోనట్ కొలడా.. వేసవిలో అదిరిపోయే డ్రింక్
కావలసినవి: మామిడిపండు ముక్కలు – కప్పు, కొబ్బరి నీళ్లు – కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తులసి ఆకులు – మూడు, పంచదార – టీస్పూను, ఐస్ క్యూబ్స్ – ఐదు. తయారీ: గ్లాసులో తులసి ఆకులు, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి మామిడిపండు ముక్కలు, ఐస్‌క్యూబ్స్, కొబ్బరి నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తులసి ఆకులున్న గ్లాసులో పోయాలి ఈ గ్లాసులో కొబ్బరి క్రీమ్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలోæ వెంటనే దాహం తీర్చేవాటిలో మ్యాంగో కోకోనట్ కొలడా ఒకటి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, మామిడిలోని పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. -
కోనసీమ జిల్లా పారిశ్రామిక పురోగతిపై ఆశలు
అమలాపురం టౌన్: కోనసీమ జిల్లా ఆవిర్భావంతో పారిశ్రామిక ప్రగతిపై ఆశలు చిగురిస్తున్నాయి. అన్ని ప్రాంతాలూ సమాంతర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజన చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న వనరులతో పారిశ్రామిక అభివృద్ధిని ఆవిష్కరించేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది. కోనసీమలో వ్యవసాయం, పర్యాటక రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయి. అలాగే చమురు, గ్యాస్ నిక్షేపాలకు కొదవ లేదు. కొబ్బరి పీచు పరిశ్రమ మధ్య, చిన్నతరహాకే పరిమితమైంది. కోనసీమ జిల్లాగా రూపాంతరం చెందడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఎన్నో ఆశలు చిగురించాయి. పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టాలని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా ఆవిష్కరణ దినోత్సవం రోజున ప్రకటించడాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. కొబ్బరి అనుబంధ పరిశ్రమల్లో కోనసీమది మూడో స్థానం కొబ్బరి సిరులకు కేరళ తర్వాత కోనసీమ పేరే వినిపిస్తుంది. జిల్లా అయ్యాక రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల చేరికతో ఈ సీమలో కొబ్బరి విస్తీర్ణం 20 వేల ఎకరాలు పెరిగి 1.45 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఈ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 1,200 వరకూ ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 10 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు మొదటి రెండు స్థానాల్లో ఉంటే, కోనసీమ మూడో స్థానంలో ఉంది. ఇక్కడి పరిశ్రమలు కేవలం పీచు, సన్నతాళ్లు, కొబ్బరి పొట్టు బ్రిక్స్ మాత్రమే తయారు చేస్తూ, దేశ, విదేశీ ఎగుమతుల ద్వారా ఏటా రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి అడుగులు ఇలా కొబ్బరి ఆధారిత భారీ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రజాప్రతినిధులు ప్రోత్సాకంగా నిలవాల్సి ఉంది. అలాగే చమురు సంస్థల్లోని హై ప్రెజర్ బావుల ద్వారా భారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేస్తున్నట్టే, లో ప్రెజర్ బావుల ద్వారా గ్యాస్‌ను ఇక్కడ నెలకొల్పబోయే పరిశ్రమలకు సరఫరా చేస్తే విద్యుత్ భారాలు తగ్గుతాయి. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి, ఆయా సంస్థలు లాభాల్లో నడుస్తాయి. కొబ్బరి పీచు మాత్రమే కాకుండా ఈనెలు, చెక్కలు, చిప్పలు, ఆకుల నుంచి గృహోపయోగ, అలంకరణ వస్తువుల ఉత్పత్తి ద్వారా ఉపాధికి బాటలు వేయవచ్చు. కొబ్బరి పంట ద్వారా ఏటా రూ.2,300 కోట్ల టర్నోవర్ చేస్తున్న కోనసీమ కొబ్బరి ఆధారిత పరిశ్రమలను పూర్తి ప్రగతితో ముందుకు తీసుకువెళ్తే ఆ టర్నోవర్ రూ.3,500 కోట్లకు దాటుతుందని అంచనా. ఔత్సాహికులు సన్నద్ధం.. కోనసీమలో ఏదైనా సువిశాల ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటిస్తే పారిశ్రామికవేత్తలకు అనువుగా ఉంటుంది. పీచు పరిశ్రమలకు తోడు కొబ్బరి అనుబంధంగా ఉన్న అన్ని వస్తువుల తయారీకి కోనసీమలో కొన్ని భారీ పరిశ్రమల స్థాపన అత్యవసం. ఇప్పుడు జిల్లాతో సాకారమైతే మాలాంటి వారికి సంతోషమే. – రాణి శ్రీనివాసశర్మ, కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ క్వాయర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఊడిమూడి, పి.గన్నవరం మండలం -
ఒక్క చెట్టు.. వెయ్యి వరాల పెట్టు
శ్రీకాకుళం: వేరు నుంచి ఈనె వరకు.. నీరు నుంచి పీచు వరకు.. కాండం నుంచి కమ్మల వరకు.. వ్యర్థమంటూ లేదు. ఉద్దానాన్ని దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న కొబ్బరి స్పెషాలిటీ ఇది. నారికేళ వృక్షమంటే కొబ్బరి కాయ ఒక్కటే కాదు... తరచి చూస్తే ఈ తరువు నిలువెల్లా ఉపయోగకారిణే. ఇక్కడి కొబ్బరి ఉత్తరాదికి ఎగుమతి అవుతుంది. కాయతోపాటు కమ్మలు, ఈనెలకు కూడా ఆ లారీల్లో స్థానం ఉంటుంది. అక్కడితో అయిపోలేదు. కొబ్బరి పీచు దొరకడం ఆలస్యం.. తాళ్ల నుంచి సోఫాల వరకు బోలెడు వస్తువులు తయారైపోతాయి. అదృష్టం ఉండి కొబ్బరి కాండం దొరికిందా.. అల్మరా బల్లల నుంచి దూలాల వరకు ఎన్నింటినో తయారు చేసుకోవచ్చు. ఇన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టే ఉద్దానం పెద్ద కొడుకుగా దీనికి పేరు వచ్చింది. పోషకాలు మెండు.. ఆరోగ్య పరిరక్షణలో కొబ్బరి పా త్ర కీలకం. చక్కటి పోషక విలు వలున్న ఆహారం. బీ6, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి శక్తినిచ్చే పోషకాలు దీనిలో ఉన్నాయి. గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పీచుతో గృహ‘షో’భ.. కొబ్బరి కాయల్లో ఉండే పీచు పర్యావరణ హితమైంది. అందుకే దీనిని చాలా రకాల వస్తువుల తయారీలో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సోఫాలు, దిండ్లు, ఫ్లోర్‌మ్యాట్‌లు, పరుపుల తయారీలో అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే తాళ్ల తయారీకి అధిక శాతం పీచును వినియోగిస్తున్నారు. ఆహా..రం.. కొబ్బరి గుజురుతో కొబ్బరి పాలు, నూనె, బిస్కెట్లు, పాలపొడి, తినుబండారాల తయారీలతో పాటు వంటల్లో అదనపు రుచుల కోసం దీనిని వినియోగిస్తున్నారు. ఔ కమ్మలు, ఈనెలు.. బోలెడు ఉపయోగాలు కొబ్బరి ఈనెల నుంచి చీపుర్లను తయారు చేస్తు న్నారు. ఉద్దానం ప్రాంతంలో తయారైన చీపుళ్లకు వి విధ రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎండు ఈనెలు, పచ్చి ఈనెల్ని వేర్వేరుగా అమ్మకాలు చేస్తున్నారు. ఎండు ఈనెల్ని చీపుర్ల తయారీకి వినియోగిస్తున్నా రు. వీటికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్టాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చి ఈనెల్ని పైకప్పులకు, ఊటబావుల్లో నీటి నిల్వకోసం, అగ్గిపుల్లల తయారీ, ఐస్‌క్రీం తయారీలో వినియోగిస్తున్నారు. ఒడిశా, ప శ్చిమ బెంగాల్‌లకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. శుభకార్యమేదైనా కొబ్బరి కమ్మల పందిళ్లు వేయడం ఆనవాయితీ. వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలోని ప్రతి ఏరియాలోనూ చలవ పందిళ్లు వేసి ప్రజలు సేదతీరు తుంటారు. కొబ్బరి కాండాన్ని దూలాలు గా, వంటచెరుకుగా, ఇంటిలోని అల్మారా బల్లలుగా, ఇంటి నిర్మాణంలో కలపగా వినియోగిస్తున్నారు. సీడీబీ, ఉద్యానశాఖలు ఆధ్వర్యంలో.. కొబ్బరి పునరుద్ధరణ పథకం(ఆర్అండ్ఆర్జే): రైతు లు సాగుచేస్తున్న కొబ్బరితోటల్లో పురుగుపట్టి పాడై న చెట్లు, అనుత్పాదక చెట్లు తొలగించి కొత్త మొ క్కల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం(ఆర్అండ్ఆర్ జే ) సీడీబీ (కోకోనెట్ డెవలప్మెంట్ బోర్డ్) సాయంతో అమలు చేస్తోంది. దీనికోసం హెక్టారుకు రూ. 35000 వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని రైతులకు అందజేస్తోంది. కొబ్బరి రైతు సంఘాలు(సీపీఎస్): 1000 చెట్లు సాగు చేసే రైతులు ఓ సమాఖ్యగా, 10 సమాఖ్యలు ఓ ఫెడరేషన్‌గా, 10 ఫెడరేషన్లు ఓ కంపెనీగా ఏర్పా టు చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ సీపీఎస్ సంఘాలకు కొబ్బరి అభివృద్ధి బోర్డు గుర్తింపు ఇస్తుంది. గుర్తింపు పొందిన కంపెనీలు, ఫెడరేషన్లకు ప్రత్యేక రాయితీలు, వ్యాపారంలో భాగస్వామ్యాలు కల్పించడం వంటి వెసులుబాటు ఉంది. కొబ్బరిమొక్కల ఉత్పత్తి కేంద్రం కూడా బారువలోఉంది. సర్కారు సాయం ఇలా... వడ్డీలేని రుణం: కొబ్బరి రైతులకు లక్ష రూపాయల వరకు పంటరుణంగా(క్రాప్ లోన్) స్వల్ప వడ్డీకే ప్రభుత్వం అందిస్తోంది. గరిష్టంగా రూ.1.60 లక్షల వరకు అందిస్తున్నారు. కిసాన్ గోల్డ్‌కార్డ్ పేరిట కొబ్బరితోటల అభివృద్ధి పథకం కింద రుణాన్ని కూడా అందజేస్తున్నారు. డీసీసీబీ ద్వారా షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ రుణాలపేరిట భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేస్తున్నారు. విశేషాలెన్నో... ► ఎనిమిదేళ్లకు దిగుబడి మొదలై ఇరవై ఐదేళ్ల పాటు నిరంతరాయంగా కాయల్ని అందిస్తుంది. ► అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం సాధించే పంట. ► రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత సిక్కోలులోనే కొబ్బరి పంట విస్తారంగా సాగవుతోంది. నాణ్యమైన కొబ్బరి ఉద్దానం కొబ్బరికి ప్రపంచ స్థాయిలో నాణ్య త విషయంలో ఎంతో గుర్తింపు ఉంది. కోకోనట్ ఫుడ్‌పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే రైతుకు ప్రస్తుత ధర కంటే పది రెట్ల ఆదాయం దక్కుతుంది. కొబ్బరి ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు అయితే జిల్లా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుంది. – జోహర్‌ఖాన్, చిక్కాఫ్ చైర్మన్, కవిటి కోకోనట్ ఫుడ్‌పార్క్‌కు సీఎం భరోసా.. రాష్ట్రంలో రెండో కోనసీమగా గుర్తింపు పొందిన కవిటి ఉద్దానం ప్రాంత కొబ్బరి రైతుల ఆర్థికాభివృద్ధికి కోకోనట్ ఫుడ్‌పార్క్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలన్నింటిపై వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రుల సహకారంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించాం. – పిరియా సాయిరాజ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం -
బాలుడిని బలి తీసుకున్న కొబ్బరి ముక్క
చెన్నై: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్‌కు మూడు న్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచారు. అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్ ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కుపోవడంతో స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాడు. -
పచ్చి కొబ్బరి.. సర్వ రోగ నివారిణి
పచ్చికొబ్బరితో పచ్చడి చేసుకుని తింటారు లేదా ఇడ్లీ చట్నీకి వాడతారు. కొబ్బరిని కోరి లౌజు చేసుకుంటారు. అయితే అవేమీ కాకుండా పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో కలుగుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం... రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి తక్షణ శక్తి అందుతుంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది మూత్రనాళాల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది గుండెకు మేలు చేస్తుంది మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరం అవుతాయి డయాబెటిస్ (మధుమేహం) ను నియంత్రిస్తుంది. -
రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు
లక్నో: మన దగ్గర రోడ్లు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా నిర్మాణాల నాణ్యత సదరు కాంట్రాక్టర్ ఎంత నిజాయతీపరుడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోటి రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు ఒపెనింగ్ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలు అయ్యింది. రోడ్డు ఒపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా.. అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కొబ్బరి కాయ బదులు రోడ్డు బీటలు వారింది. ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం ) ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వం 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 7 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మించింది. రహదారి ప్రారంభోత్సవానికి బిజ్నోర్, సదార్ నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరీని ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పూజ చేసి.. కొబ్బరి కాయ కొట్టి.. రోడ్డును ప్రారంభిద్దామని భావించారు. అయితే కొబ్బరి కాయ పగలలేదు కానీ.. రోడ్డు మాత్రం బీటలు వారింది. (చదవండి: అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు) ఈ సంఘటనపై మౌసం చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులు వచ్చి.. నమూనాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. మూడు గంటలు నిరీక్షించిన తర్వాత అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆమె తారు నమూనాను సేకరించడంలో అధికారులకు సహాయం చేయడానికి గాను ఆ ప్రదేశంలో తవ్విన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి. This 7 km road in west UP’s Bijnor took 1.16 crores to renovate but when @BJP4UP MLA Suchi Chaudhary tried a coconut cracking ritual to formally inaugurate it , its the road that cracked open, she says …. pic.twitter.com/fvtaEEsNWf — Alok Pandey (@alok_pandey) December 3, 2021 చదవండి: ‘ఛ ఛ.. నీవల్లే ఇన్ని నేర్చుకున్నాను’ -
Viral: దాహమేసిన కోతికి కొబ్బరి బోండాం దొరికితే!
కోతులు జనావాసాలకు వస్తే.. ఇళ్లలో ఉండే ఆహారపదార్థాలను ఎత్తుకెళ్లి మరీ తింటాయి. నగరంలో అయితే పండ్లు, కూరగాలయలు, కొబ్బరి బోండాం షాప్‌లపై పడుతుంటాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే.. ఆ ఆనందం వేరు! అయితే కొబ్బరి చిప్పకు బదులు కొబ్బరి బోండాలు దొరికాయి. అసలే దాహం, ఆకలిలో మర్కటం ఓ కొబ్బరి బోండాన్ని తానే స్వయం ఒలుచుకుంది. మనుషుల వలే కొబ్బరి పీచును నెమ్మదిగా తీసింది. పచ్చి కొబ్బరి బోండాం కావటంతో ఆకలికి ఆగలేని కోతి.. పీచును కూడా తిన్నది. అయితే ఆ కొబ్బరి బోండాలు తాగి పక్కకు పడేసిన వియషం దాని తెలిక కొబ్బరి కోసం కుస్తీ పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ఓ మార్ట్ వద్ద చోటుచేసుకుంది. దాహం వేసిన మర్కటం కొబ్బరి బోండాంను తానే స్వయంగా ఒలచుకుంది. చివరి నిముషంలో కొబ్బరిబోండాం వ్యాపారి ఆ మర్కటాన్ని తరిమివేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నోరూరించే స్వీట్ పాన్ లడ్డూ.. ఇలా తయారు చేసుకోవాలి..
తమలపాకులు, కొబ్బరి తురుము, నెయ్యి.. లతో స్వీట్ పాన్ లడ్డు ఏవిధంగా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: ►తమలపాకులు – 15 సుమారుగా ►కస్టర్డ్ మిల్క్ – పావు కప్పు ►గ్రీన్ ఫుడ్ కలర్ – కొద్దిగా ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి కోరు – అర కప్పు+3 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి లౌజు – పావు కప్పు (ముందుగా సిద్ధం చేసి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో తమలపాకులు, కస్టర్డ్ మిల్క్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో గ్రీన్ ఫుడ్ కలర్ చేసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నెయ్యి వేసుకుని.. అర కప్పు కొబ్బరికోరు దోరగా వేయించుకోవాలి. అందులో తమలపాకు జ్యూస్ వేసుకుని తిప్పుతూ బాగా కలపాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. ఆపైన గ్రీన్ కలర్ కొబ్బరి–తమలపాకుల మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. మధ్యలో కొద్దికొద్దిగా కొబ్బరి లౌజు ఉంచి, ఉండల్లా చేసుకోవాలి. మిగిలిన 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి కోరు బాల్స్‌కి పట్టించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: భలే రుచిగా బీట్రూట్ రొయ్యల కబాబ్స్.. ఎలా చేయాలంటే.. -
చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం
వజ్రపుకొత్తూరు: కొబ్బరికాయ నుంచి మొలక బయటకొచ్చి చిలక ఆకారంలో ఆకట్టుకుంటోంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు పంచాయతీ హుకుంపేటలో గ్రామ వలంటీర్ కొండ ఈశ్వరీబాయి తన ఇంట్లో పూజ కోసం కొన్న కొబ్బరికాయ ఇలా చూపరులను ఆకర్షిస్తోంది. చిలక ఆకారంలో ఉండటంతో జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇవీ చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్ నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం -
బరువు తగ్గాలనుకుంటున్నారా..? కొబ్బరి తింటే సరి!
చాలామంది కొబ్బరి లేకుండా అంతా నీళ్లు ఉండే బొండా అడుగుతారు. కానీ ఈసారి అలా చేయకుండా కొబ్బరిబోండా తాగేశాక కొబ్బరి కూడా అడిగి తినేయండి. మీరు తాగిన కొబ్బరినీళ్లతో ఆరోగ్యకరమైన రీతిలో రీ–హైడ్రేట్ అవుతారు. ఖనిజ లవణాలూ పొందుతారు అదో ప్రయోజనం. ఇదిగాక మరో లాభమూ ఉంది. (చదవండి: భారీగా బరువు తగ్గిన ఖుష్బూ..! ఫొటో వైరల్) కొబ్బరిలో కొవ్వుల పాళ్లు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అందువల్ల కొబ్బరి తిన్న తర్వాత ఆ కొవ్వుల కారణంగా చాలాసేపు ఆకలి అంతగా అనిపించదు. దాంతో తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యవంతమైన రీతిలో తమ స్థూలకాయాన్ని వదుల్చుకునేందుకు ఇదో మంచి సాధనం. -
జెండా పండుగ వంటలు
స్వాతంత్య్ర దినోత్సవం... మువ్వన్నెల జెండా దేశమంతా రెపరెపలాడుతుంది. ఇంటింటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. పిల్లలంతా మిఠాయిలు పంచుకుంటారు. మువ్వన్నెల వంటలు తయారు చేసి, జాతీయజెండాకు వందనం చేద్దాం. తిరంగా ఢోక్లా కావలసినవి: బియ్యం – 3 కప్పులు; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; పుల్ల పెరుగు – కప్పు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూను; పుదీనా తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; పసుపు – టీ స్పూను; మిరప కారం– టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; నువ్వులు – టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం, సెనగ పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, విడివిడిగా సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ∙నీరంతా ఒంపేసి మిక్సీలో వేసి విడివిడిగా గారెల పిండిలా ఉండేలా పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙పుల్ల పెరుగు, కొద్దిగా వేడినీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, ఆరుగంటలసేపు పిండిని వదిలేయాలి ∙మిక్సీలో పుదీనా, పచ్చి మిర్చి వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙నానిన పిండికి ఉప్పు, అల్లం తురుము జత చేయాలి ∙పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగం పిండికి పసుపు, మిరప కారం జత చేయాలి ∙ఒక భాగానికి మెత్తగా చేసిన పుదీనా, పచ్చిమిర్చి ముద్ద జత చేయాలి ∙ఒక పాత్ర తీసుకుని నూనె పూయాలి ∙ముందుగా పుదీనా జత చేసిన మిశ్రమాన్ని సమానంగా వేసి, ఆవిరి మీద రెండు నిమిషాలు ఉడికించాలి ∙పాత్రను బయటకు తీసి, దాని మీద, తెల్లటి పిండి వేసి మళ్లీ ఆవిరి మీద ఉంచి రెండు నిమిషాల తరవాత ఆ పాత్రను బయటకు తీయాలి ∙పసుపు, మిరపకారం జత చేసిన మిశ్రమాన్ని సమానంగా పరిచి ఆవిరి మీద బాగా ఉడికించి దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక నువ్వులు కూడా వేసి కొద్దిగా వేయించి తీసేసి, ఢోక్లా మీద సమానంగా పోయాలి. కాజు కట్లీ కావలసినవి: జీడి పప్పు – 2 కప్పులు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; పాలు – టేబుల్ స్పూను; పంచదార పాకం కోసం; నీళ్లు – కప్పు; పంచదార – కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుడ్ కలర్ – ఆకుపచ్చ, ఆరెంజ్ రంగులు (చిటికెడు చొప్పున) తయారీ: ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగాక, ఏలకుల పొడి జత చేసి, ముదురు పాకం పట్టి పక్కన ఉంచాలి ∙జీడిపప్పును మిక్సీలో వేసి మధ్యమధ్యలో ఆపుతూ తిప్పి, ఆ పొడిని జల్లించాలి ∙ఇలా మొత్తం జీడిపప్పులను మిక్సీ పట్టి జల్లెడ పట్టి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పు పొడి వేసి దోరగా వేయించాలి ∙పంచదార పాకం జత చేసి సన్నటి మంట మీద ఆపకుండా కలుపుతుండాలి ∙బాగా దగ్గర పడి, అంచులను వదిలేస్తుండగా దింపేసి, కొద్దిగా చల్లారనివ్వాలి ∙చేతికి నెయ్యి రాసుకుని, పాలు జత చేసి, మెత్తగా అయ్యేవరకు కలిపి మూడు భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగానికి ఆకు పచ్చ రంగు రెండు చుక్కలు, ఆరెంజ్ రంగు రెండు చుక్కలు విడివిడిగా కలిపి పక్కన ఉంచాలి ∙ముందుగా ఆకుపచ్చరంగు, ఆ తరవాత తెలుపు రంగు, చివరగా కాషాయ రంగు ఉంచి చేతితో జాగ్రత్తగా అదిమి, సుమారు పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తీసి, కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. కోకోనట్ గుల్కండ్ కావలసినవి: తెలుపు కోసం, తాజా కొబ్బరి తురుము – 3 అర కప్పులు; స్వీట్ కండెన్స్డ్ మిల్క్ – 3 పావు కప్పులు; గుల్కండ్ రోజ్ పెటల్ ప్రిజర్వ్ – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఎండు కొబ్బరి తురుము – రోలింగ్ కోసం తగినంత; క్యారట్ ముక్కలు – పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఆరెంజ్ ఫుడ్ కలర్ – కొద్దిగా; గ్రీన్ ఫుడ్‌కలర్ – కొద్దిగా. తయారీ: తెల్ల లడ్డు... స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక క్యారట్ ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక కొబ్బరి తురుము వేసి, సన్నటి మంట మీద దోరగా (రంగు మారకుండా) వేయించాలి ∙కండెన్స్డ్ మిల్క్ జత చేసి, ఆపకుండా కలపాలి ∙అంచులు విడుతుండగా, దింపి చల్లారనిచ్చాక మూడు భాగాలు చేయాలి ∙ఒక భాగం నుంచి కొద్దిగా చేతిలోకి తీసుకుని, మధ్యలో కొద్దిగా గుల్కండ్ ఉంచి లడ్డూ మాదిరిగా చేసి, ఎండు కొబ్బరి పొడిలో దొర్లించి పక్కన ఉంచాలి (ఇలా తెలుపు లడ్లు సిద్ధం చేసుకోవాలి) ∙రెండో భాగానికి క్యారట్ మిశ్రమం, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు చేసి, కొబ్బరి పొడిలో దొర్లించితే కాషాయ రంగు లడ్లు తయారైనట్లే ∙మూడో భాగానికి ఆకు పచ్చ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు తయారుచేసుకుని, కొబ్బరి పొడిలో దొర్లించితే మువ్వన్నెల కోకోనట్ గుల్కండ్ రెడీ. -
ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’
‘మనసుంటే మార్గమూ ఉంటుంది’ అనే నానుడి మరోసారి నిజమైంది. కేరళ, త్రిశూర్ అమ్మాయి మారియా కురియాకోస్ ఎంబీఏ చేసింది. ముంబయిలో ఒక సోషల్ ఎంటర్ ప్రైజ్‌లో ఉద్యోగం చేసింది. ‘తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించలేకపోతే జీవితానికి పరమార్థం ఏముంటుంది?’ అని కూడా అనుకుంది. ఉద్యోగం మానేసి సొంతూరు త్రిశూర్కి వచ్చేసింది. ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలనే స్పష్టత రావడం లేదు. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయి? అలా ఊరంతా తిరిగి నలుగురిని చూస్తే కదా తెలిసేది... అనుకుంది. త్రిశూర్‌లో ఏమున్నాయి? ఏమి లేవు అనేది కూడా తెలుసుకోవాలి కదా! అనుకుంటూ త్రిశూర్‌లోని రోడ్లన్నీ చుట్టిరావడం మొదలుపెట్టింది. తనకు తెలిసిన ఊరే అయినా, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఒక కొబ్బరి నూనె మిల్లు కనిపించింది. కేరళ అమ్మాయికి కొబ్బరి నూనె మిల్లును చూడడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆమె దృష్టిని ఆకర్షించింది కొబ్బరి నూనె కాదు, నూనె కోసం కొబ్బరి వలిచిన తర్వాత మిగిలిన ఖాళీ కొబ్బరి చిప్పలు. రాశులుగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారని అడిగింది. పొయ్యిలో వంటచెరకుగా వాడతారు, ఇటుకలను కాల్చడానికి బట్టీల్లో వాడతారని తెలుసుకుంది. అంత గట్టి మెటీరియల్ బొగ్గుగా కాలిపోవడమేంటి? వీటిని ఉపయోగించే తీరు ఇది కాదు, మరింత ఉపయుక్తంగా ఉండాలని ఆలోచించింది మారియా. కోకోనట్ కప్ కొబ్బరి చిప్పలు కిందపడినా పగలవు. ఇంకేం! సెంటెడ్ క్యాండిల్ తయారు చేయడానికి గాజు కుండీలకంటే కొబ్బరి పెంకులే మంచి బేస్ అనుకుంది మారియా. సూప్ తాగడానికి కూడా పింగాణీ కప్పుల కంటే కొబ్బరి పెంకు కప్పులే సేఫ్. అంతే కాదు, హ్యాంగింగ్ గార్డెన్‌కి కూడా కొబ్బరి కుండీలే. ఫోర్క్‌లు, స్పూన్లు కూడా. మన్నిక ఓకే, మరి కొబ్బరి పెంకును అందంగా తీర్చిదిద్దడం ఎలా? తండ్రి మెకానికల్ ఇంజనీర్. రిటైరయ్యాడు కాబట్టి ఆయన కూతురికి అవసరమైన యంత్రాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. పూర్వం స్టీలు గరిటెలు, గిన్నెలు లేని రోజుల్లో గరిటలుగా కొబ్బరి చిప్పలనే వాడేవారని తెలుసుకున్న తర్వాత మారియా ఆ వృత్తి పని వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పని అన్నానికి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ఇతర ఉపాధి పనులకు మారిపోయారు. త్రిశూర్, కొట్టాయం, వయనాడుల్లో విస్తృతం గా సర్వే చేసి, ఆ వృత్తిదార్లను సమీకరించింది. ఇప్పుడామెతో కలిసి పదిమంది పని చేస్తున్నారు. గతంలో అయితే కొబ్బరి చిప్పలను ఉలి సహాయంతో చేత్తోనే నునుపుగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మారియా డిజైన్ చేయించుకున్న మెషీన్‌తో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ‘తెంగ’ పేరుతో ఆమె రిజిస్టర్ చేసుకున్న పరిశ్రమ ఇప్పుడు స్థిరమైన రాబడినిస్తోంది. తెంగ ఉత్పత్తులకు కేరళతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లకు పేర్లు ముద్రించి ఇవ్వడం ఆమె ఎంచుకున్న మరో చిట్కా. అమెజాన్ ద్వారా జర్మనీలో అమ్మకాలకు కూడా రంగం సిద్ధమైంది. కేరళలో కొబ్బరి వలిచిన ఖాళీ కొబ్బరి చిప్పలు సూప్ బౌల్స్‌గా జర్మనీకి చేరనున్నాయి. తండ్రితో మారియా కురియాకోస్ -
తెల్ల దోమలపై యుద్ధానికి బదనికల సైన్యం
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన సర్పిలాకార తెల్లదోమ (రూగోస్ వైట్ ఫ్లై) ఉద్యాన పంటలు సాగుచేసే రైతులను వణికిస్తోంది. దేశంలోని కొబ్బరి తోటలతో పాటు 200 రకాలకు పైగా పంటలపై వేగంగా విస్తరిస్తూ సాగుదారులను నష్టాలకు గురి చేస్తోంది. ఈ కొత్త రకం తెల్లదోమ నియంత్రణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలోని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. సర్పిలాకార తెల్లదోమలను సమర్థవంతంగా ఎదుర్కొనే మిత్ర పురుగులను తయారు చేయడమే కాకుండా.. వాటి ఉత్పత్తి కోసం రాష్ట్రంలో రెండుచోట్ల ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కడియంలో కనబడి.. దేశమంతా విస్తరించింది సర్పిలాకార తెల్లదోమ విదేశీ మొక్కల ద్వారా దేశంలోకి చొరబడిన కొత్త రకం దోమ. 2016లో కడియం నర్సరీలలో దీనిని గుర్తించినప్పటికీ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. గడచిన రెండేళ్లుగా చాపకింద నీరులా దేశమంతటా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉద్యాన పంటలను దెబ్బతీస్తోంది. మన రాష్ట్రంతోపాటు కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న కేరళ, గోవా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, బిహార్, అస్సోం వంటి రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. కొబ్బరితో పాటు అంతర పంటల్ని కూడా అతలాకుతలం చేస్తోంది. కొబ్బరిలో 25–30 శాతం, ఆయిల్‌పామ్‌లో 35 శాతం, అరటి ఇతర పంటల్లో 15 నుంచి 25 శాతం విస్తీర్ణంలో వ్యాప్తి చెందినట్టుగా గుర్తించారు. ఎలా దాడి చేస్తోందంటే.. సర్పిలాకార తెల్లదోమ రసం పీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఐదు దశల్లో వృద్ధి చెందే ఇది మామూలు తెల్లదోమ కన్నా ఐదు రెట్లు (దాదాపు 2.5 మి.మీ.) పెద్దది. దీని జీవితకాలం 40–45 రోజులు. ఇవి ఆకుల కింద భాగంలో చేరి రసాన్ని పీల్చేసి తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనివల్ల ఏర్పడే లెప్టోగైజఫియమ్ అనే బూజు కిరణ జన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ దోమలు ఆకుల కింద తెల్లటి వలయాకారంలో గుడ్లను పెడతాయి. వీటి ఉధృతి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, ఆకులే కాదు రెమ్మ, మొదళ్లు, పువ్వులు, కాయలు సైతం తెల్లని దూది లాంటి పదార్థంతో నిండిపోతాయి. ఈ ప్రభావం వల్ల 20–30 శాతం మేర దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. నియంత్రణకు ఏం చేయాలంటే.. సర్పిలాకార తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించేందుకు ఆముదం పూసిన పసుపు రంగు అట్టలను కాండంపై ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి తక్కువగా ఉంటే మిత్రపురుగు డైకో క్రైసా ఆస్టర్‌కు చెందిన 100–150 గుడ్లు, ఎక్కువగా ఉంటే 300–500 గుడ్లు చొప్పున విడుదల చేయాలి. తగిన మిత్ర పురుగులు లేకపోతే ఒక శాతం వేపనూనెకు 10 గ్రాముల డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. ఫలించిన ‘ఉద్యాన’ పరిశోధనలు తెల్లదోమను ఎదుర్కొనేందుకు ‘సూడో మల్లడా’ అనే మిత్ర పురుగులు సమర్థవంతంగా పని చేస్తాయని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరు నుంచి ఇసారియా అనే ఫంగస్, తమిళనాడు, కేరళ, బెంగళూరు నుంచి ‘ఎన్కార్సియా’ అనే మరో మిత్ర పురుగును తీసుకొచ్చారు. వీటి తయారీలో ఆర్బీకే సిబ్బందికి, కోనసీమ ప్రాంత రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా కోనసీమలో తెల్లదోమపై ప్రయోగించి సత్ఫలితాలను సాధించారు. ఈ మిత్ర పురుగులు, ఫంగస్ తయారీ కోసం శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో రూ.27 లక్షలతో జీవ నియంత్రణా పరిశోధనా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు (ఎంవోయూలు) కూడా చేసుకున్నారు. జీవ నియంత్రణా పద్ధతులతోనే నివారణ సాధ్యం తెల్లదోమ సోకిన మొక్కలను ఒకచోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. జీవ నియంత్రణా పద్ధతుల ద్వారా సామూహికంగా దీన్ని నియంత్రించగలం. ఇప్పటికే 30 లక్షల మిత్ర పురుగులను తయారు చేశాం. పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉన్న దృష్ట్యా ఇవి ఏమాత్రం సరిపోవు. అందుకే వీటి తయారీ కోసం 5 కంపెనీలతో ఉద్యాన యూనివర్సిటీ ఒప్పందాలు చేసుకుంది. – డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు, శాస్త్రవేత్త, కొబ్బరి పరిశోధనా కేంద్రం, అంబాజీపేట -
మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..
వాషింగ్టన్: తెలియని ప్రాంతంలో ఒక్క పూట గడపాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది నర సంచారం లేని దీవిలో.. తిండి తిప్పలు లేకుండా నెల రోజులకు పైగా గడపడం అంటే మాటలు కాదు. ఇలాంటి భయంకర పరిస్థితి ఎదురయ్యింది ముగ్గురు వ్యక్తులకు. వీరంతా 33 రోజుల పాటు మనుషుల్లేని దీవిలో బందీలయ్యారు. నాలుగో మనిషి కనబడడు.. ఆహారం, నీరు లేదు. అదృష్టం కొద్ది అక్కడ కొబ్బరి చెట్లు ఉండటంతో.. ఇన్నాళ్లు బతికి బట్టకట్టగలిగారు. చివరకు 33 రోజుల తర్వాత ఆ దీవి నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇంతకు వీరంతా ఆ దీవిలోకి ఎందుకు వెళ్లారు.. ఎలా బయటపడగలిగారు అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్యూబాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు.. పడవలో సముద్రంలోకి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువ కావడం వల్ల వారు ప్రయాణిస్తున్న పడవ బొల్తా పడింది. ఊహించని ఈ ప్రమాదానికి వారు బిక్క చచ్చిపోయారు. ఎలానో ధైర్యం తెచ్చుకుని చేతికి అందిన వస్తువులను పట్టుకుని సమీపంలోని దీవి వరకు ఈదుకుంటూ వెళ్లిపోయారు. ఇక వారు చేరుకున్న దీవి నర సంచారం ఉండని బహమాన్ దీవుల్లోని అతి చిన్న ద్వీపం అంగుయిలా కే. ఒడ్డుకు అయితే చేరగలిగారు కానీ అక్కడి నుంచి బయటపడే మార్గ కనిపించలేదు. చేసేదేం లేక అటుగా ఏమైనా ఓడలు, విమానాలు వస్తే సాయం అడగవచ్చని భావించి.. కాలం గడపసాగారు. ఇలా ఓ మూడు రోజులు గడిచాయి. వారితో తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీవిలో ఏమైనా పండ్ల చెట్ల లాంటివి ఉంటాయేమోనని వెతకడం ప్రారంభించారు. అదృష్టం కొద్ది వారికి కొబ్బరి చెట్లు కనిపించాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మొదట్లో కొబ్బరి బొండాల్లో నీరు తాగి, కొబ్బరిని తిని రోజులు వెళ్లదీశారు. కానీ ఎన్ని రోజులని ఇలా. సరైన ఆహారం లేక.. కేవలం కొబ్బరి మాత్రమే తీసుకుంటుండటంతో వారిలో నీరసం బాగా పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్ది నీరసం పెరగుతోంది.. బతుకు మీద ఆశ తగ్గుతోంది. ఇక తామంతా ఆ దీవిలోనే ఆకలితో అలమటించి సజీవ సమాధి అవ్వక తప్పదని భావించారు. అలా 33 రోజుల గడిచిపోయాయి. #UPDATE @USCG rescued the 3 Cuban nationals stranded on Anguilla Cay. A helicopter crew transferred the 2 men & 1 woman to Lower Keys Medical Center with no reported injuries. More details to follow.#D7 #USCG #Ready #Relevant #Responsive pic.twitter.com/4kX5WJJhs8 — USCGSoutheast (@USCGSoutheast) February 9, 2021 ఈ క్రమంలో ఫిబ్రవరి 8న అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి అటుగా ఎగురుతూ వచ్చింది. ఆ శబ్దం వారిలో చనిపోయిన ఆశలను రేకేత్తించింది. బతికిపోయాం.. ఇక బయటపడతాం అని భావించారు. తమ దగ్గరున్న దుస్తులను జెండాలుగా ఊపుతూ.. తమ గురించి ఎయిర్ క్రాఫ్ట్‌లోని వారికి అర్థం అయ్యేలా చేశారు. ఇక విమానంలో ఉన్న వారికి కింద ఏవో జెండాలు కదులుతున్నట్లు తోచి.. కాస్త కిందకు వచ్చారు. అక్కడ ఈ ముగ్గురిని చూసి షాకయ్యారు. ఆ తర్వాత పైలెట్ వీరి గురించి అధికారులకు తెలియజేశాడు. దాంతో ఆ దీవి వద్దకు హెలికాప్టర్‌ను పంపి ఆ ముగ్గురికి నీళ్లు, ఆహారంతో పాటు వారితో మాట్లాడేందుకు వీలుగా ఓ రేడియో వాకీ టాకీని కూడా అందించారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అదే రోజు వారిని రక్షించలేకపోయారు. దాంతో ఫిబ్రవరి 9న మరో రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుని ముగ్గురిని రక్షించింది. అనంతరం వారిని హాస్పిటల్‌కు తరలించారు. లక్కీగా వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. నీరసం మినహా ఇతర అనారోగ్య సమస్యలు ఏం లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక వీరిని కాపాడిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మీకింకా భూమ్మీద నూకలున్నాయి.. అందుకే బయటపడ్డారు.. మరో సారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటూ నెటిజనులు సూచిస్తున్నారు. చదవండి: ఆరోగ్యం... క్యూబా భాగ్యం! స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..! -
అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు
భోపాల్ : ప్రపంచంలోని ఒకప్పటి ఏడు వింతల్లో బాబిలోనియాలోని హ్యాంగింగ్ గార్డెన్స్ గురించి విన్నాం. అచ్చంగా అలాంటిది కాదు, కానీ... ఇప్పుడు మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఒక వేళ్లాడే తోటను చూస్తున్నాం. సాక్షి భరద్వాజ్ ఇంటి మీద వేళ్లాడే ఈ తోటలో నాలుగు వందల యాభై రకాల మొక్కలున్నాయి. దేశీయ విదేశీ మొక్కలన్నీ కలిపి మొత్తం నాలుగు వేలున్నాయి. మైక్రో బయాలజీ చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సాక్షి... స్టూడెంట్స్‌కి చెప్పబోయే పాఠాలను ప్రయోగాత్మకంగా తన ఇంటి ఆవరణలోనే పెంచి చూసేది. అది చివరికి ఒక తోటగా మారింది. నేల మీద కుండీలు, సిమెంట్ తొట్టెల్లో పెంచుతుంటే... మొక్కలకు ఎరువుగా వేసిన బత్తాయి, కమలా తొక్కలను తినడానికి వచ్చిన చీమలు మొక్కల వేళ్లను కూడా తినేస్తున్నాయి. ఈ చీమల బెడదను తప్పించి మొక్కలను కాపాడడానికి ఆమె చేసిన మరో ప్రయోగమే ఖాళీ కొబ్బరి బోండాల్లో మొక్కలను పెంచడం. అది విజయవంతమైంది. అలా ఆమె ఇంటి మీద వేళ్లాడే తోట ఆవిష్కారమైంది. పాఠాల తోట సాక్షి భరద్వాజ్ మైక్రోబయాలజీ పూర్తి చేసి రెండేళ్ల కిందట మన్ సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరింది. మొక్కల జన్యుకణాల గురించి థియరీ చెప్పి ఊరుకోవడం కాదు, దానిని ఆచరణలో చూపించాలనుకుంది. అంటుకట్టడం, బత్తాయి వంటి పుల్లటి పండ్లతొక్కల నుంచి బయో ఎంజైమ్‌ల తయారీ, వేప– బొప్పాయి ఆకులతో వర్మీ కంపోస్టు తయారీ వంటివన్నీ స్వయంగా చేసి చూసుకుంది.‘‘మొదటగా సిమెంట్ తొట్టెల్లో చేసిన ప్రయోగం ఎర్ర చీమల కారణంగా విఫలమైంది. ప్రత్యామ్నాయం ఏమిటా... అని ఆలోచిస్తున్న సమయంలో కొబ్బరి బోండాం గుర్తుకు వచ్చింది. నాకు రోజూ కొబ్బరి బోండా తాగే అలవాటుంది. ఖాళీ బోండాలనే మొక్కల పాదుల్లా మలుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది అన్నారు. (చదవండి: మూడు దశాబ్దాలుగా పీడిస్తున్న పీడకల) ‘‘దాంతో బోండాలను కడిగి ఆరబెట్టి, రెండు రంధ్రాలు చేసి ఇనుప తీగె కట్టి, వరండా పైకప్పుకి హుక్కులు వేయించి కొబ్బరి బోండాలను వేళ్లాడదీసి చూశాను. కొబ్బరి బోండాంలోని సహజమైన పోషకాలు కూడా మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. అప్పటి నుంచి చీమల బెడద మాత్రమే కాదు తెగుళ్ల బాధ కూడా లేదు. ప్రయత్నం సఫలమైన తర్వాత కొబ్బరి బోండాలు ఆకర్షణీయంగా కనిపించడానికి రంగులు కూడా వేశాను. అలాగే వాడిపారేసిన మంచినీళ్ల సీసాల అడుగు తీసేసి అందులోనూ మొక్కలను నాటాను. ఇప్పుడు నా దగ్గర నాకిష్టమైన మాన్స్టెరా ఎదామ్సోనాయ్ ఇండోనేసియా నుంచి తెప్పించిన అరుదైన ఫిలోడెండ్రాన్ కూడా ఉంది. మొక్కల పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. నా తోట పాఠ్య పుస్తకానికి జీవరూపం’’ అన్నారు సాక్షి భరద్వాజ్. -
ఎమ్మెల్యే పెళ్లిరోజు.. 101 కొబ్బరికాయలు కొట్టిన కార్యకర్త
సాక్షి, వరంగల్ / జనగామా: కోరుకున్న కోర్కెలు తీర్చితే దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చూశాం. అభిమాన తారలకు, నాయకులకు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇవన్ని రోటిన్‌గా అనిపించాయో ఏమో తెలియదు కానీ తాజాగా ఓ కార్యకర్త ఎమ్మెల్యే మీద అభిమానం చాటుకోవడం కోసం మోకాళ్ల మీద గుడి మెట్లు ఎక్కి.. 101 కొబ్బరికాయలు కొట్టాడు. ఆ వివరాలు.. జనగామా జిల్లా చిల్పూర్ గుట్ట వాసి మూల నాగరాజు.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వీరాభిమాని. ఈ నేపథ్యంలో నేడు తన అభిమాన నాయకుడి పెళ్లి రోజు సందర్భంగా చిల్లూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 101 కొబ్బరి కాయలు కొట్టి.. మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి అభిమానం చాటుకున్నాడు నాగరాజు. రాజయ్య పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాడు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ‘రాజయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. రాబోయే రోజుల్లో ఆయనను మంత్రిగా చూడాలని దేవుడిని కోరుకున్నాను’ అని తెలిపాడు. ఇక నాగరాజు చిల్పూర్ గుట్ట దేవస్థానంలో మూడు పర్యాయాలు చైర్మన్‌గా కొనసాగాడు. -
స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!
బాలి: కరోనా వైరస్ అందరి జీవితాల్లో పేను మార్పులు తెచ్చింది. లాక్డౌన్ కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. అన్ని రంగాలు ఎంతో దెబ్బతిన్నాయి. విద్యా రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. పాఠశాలలు, కాలేజీలు మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే వారి బాధలు వర్ణణాతీతం. ఇదిలా ఉంటే పాఠశాలలు తెరిచినా.. పిల్లలను బడికి పంపలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందరో తల్లిదండ్రులు. తినడానికి తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న వారు ఇక వేలకు వేలు ఫీజులు చెల్లించి పాఠశాలలకు పంపడం అంటే మాటలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తలల్లిదండ్రుల కష్టాలను గమనించిన ఓ హాస్పిటాలిటీ కళాశాల ఈ సమస్యకు ఆసక్తికరమైన పరిష్కారంతో ముందుకు వచ్చింది. అది ఏంటంటే విద్యార్థులు ఫీజుకు బదులు కొబ్బరి బొండాలు ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ఎన్నో కుటుంబాలకు మేలు చేసింది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కాలేజీ మనదేశంలో లేదు. ఇది బాలిలో జరిగింది. బాలిలోని టెగలాలాంగ్లోని వీనస్ వన్ టూరిజం అకాడమీ తన విద్యార్థుల ట్యూషన్ ఫీజును నగదుకు బదులు కొబ్బరికాయల రూపంలో చెల్లించడానికి అనుమతించింది. ఆర్థిక మందగమనం, నష్టాల కారణంగా ఫీజు చెల్లించలేని కుటుంబాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఎందరికో మేలు జరగడమే కాక విద్యార్థులలో వ్యవస్థాపకత స్ఫూర్తిని పొందుపరిచింది అంటున్నారు అకాడమీ సిబ్బంది. ఎలా అంటే వారు తీసుకువచ్చే కొబ్బరికాయలను ఉపయోగించి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ వయన్ పసేక్ ఆది పుత్రా మాట్లాడుతూ.. ‘కోవిడ్ వల్ల అందరి ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఫీజుల భారంతో విద్యార్థులు చదువుకు దూరమవ్వకూడదని ఈ విధానాన్ని తీసుకువచ్చాం. ఫీజు బదులు కొబ్బరి కాయలు ఇవ్వొచ్చు. విద్యార్థులు తీసుకువచ్చిన కొబ్బరి కాయలను ఉపయోగించి స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఉత్పత్తి చేస్తాం’ అని తెలిపారు. (చదవండి: పేదరికాన్ని అనుభవించా.. అందుకే) ఈ అకాడమీ కొబ్బరికాయలతో పాటు స్థానికంగా దొరికే మోరింగా, గోటు కోలా అనే ఔషధ మొక్కల ఆకులను కూడా ఫీజు కింద తీసుకుంటుంది. కొబ్బరి నూనె, ఈ ఔషధ మొక్కలను ఉపయోగించి హెర్బల్ సబ్బులను తయారు చేస్తామని అకాడమీ సిబ్బంది వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. -
బీచ్ వెంబడి 30 వేల కొబ్బరి మొక్కలు..
సాక్షి, విశాఖపట్నం: ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏడాది క్రితం విశాఖ కేంద్రంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ప్రగతి భారత్ ట్రస్ట్ దశల వారీగా తన సేవలను రాష్ట్రమంతటా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ, భీమిలి బీచ్ అందంగా తయారు చేయడానికి 30 వేల కొబ్బరి మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా ప్రగతి భారత్ ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు అధికారులు కొనియాడారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ట్రస్ట్ అన్ని రకాలుగా సహాయపడిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. -
‘ఛ ఛ.. నీవల్లే ఇన్ని నేర్చుకున్నాను’
‘నీ దగ్గర నిమ్మకాయలు ఉంటే నిమ్మరసమే పిండుకుని తాగు’ అంటాడు డేల్ కార్నెగీ. ‘చింతించడం ఆపి జీవించడం మొదలుపెట్టు’ అని 1945 లో ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం లోనివి ఈ నిమ్మకాయలు, నిమ్మరసం. ఆయన కన్నా ముందే హబ్బార్డ్ ఈ మాట రాశాడని కూడా అంటారు. ఇద్దరూ అమెరికన్ రచయితలే. ఇద్దరూ ఇప్పుడు లేరు. ముందూ వెనుకగా ఎవరు చెప్పినా జీవితంలో ముందుకు నడిపించే మాటే ఇది. శ్రీదేవికి జీవితంలో ముందుకు నడిచి తీరవలసిన అవసరం రెండుసార్లు ఏర్పడింది. తను హై స్కూల్లో ఉండగా తల్లిని, తనను, చెల్లిని వదిలేసి తండ్రి ఇల్లొదిలి వెళ్లి పోయినప్పుడు ఒకసారి. 18వ ఏట పెళ్లై, భర్త తాగుబోతు అన్న విషయం బయట పడినప్పుడు మరొకసారి. తనకు 36 ఏళ్ల వయసు వచ్చేలోపు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అనుకుంది శ్రీదేవి. ఇప్పుడు ఆమెకు 37 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఇద్దరు పిల్లలు. చెల్లి పెళ్లి తనే చేసింది. తల్లిని, తాగుబోతు భర్తనీ పద్దెనిమిదేళ్లుగా తనే చూస్తోంది. అందుకోసం ఆమె చేయని పని లేదు. నేర్చుకోని విద్య లేదు. ట్రాక్టర్ నడుపుతుంది. కొబ్బరి చెట్లెక్కి కాయల్ని దింపుతుంది. ఈత చాపలు అల్లుతుంది. జీడి కాయలు వలిచే ఫ్యాక్టరీకి వెళుతుంది. బట్టల దుకాణంలో పని చేస్తుంది. చేపలు పడుతుంది. కోళ్లఫారంలో ఉంటుంది. ఆటో తోలుతుంది. కుక్కల్ని పట్టి బోనెక్కిస్తుంది. పాముల్ని పట్టి ఫారెస్టు అధికారులకు ఇస్తుంది. కుందేళ్లను, పందుల్ని పెంచుతుంది. మొత్తం 74 పనులు చేతనవును శ్రీదేవికి! అన్నీ కష్టపడి నేర్చుకున్న పనులే. శ్రీదేవిని అంతగా కష్ట పెట్టినందుకు జీవితం ఆమె ఎదుట చేతులు కట్టుకుని అపరాధిలా నిలుచోవాలి. అప్పుడు కూడా శ్రీదేవి ‘ఛ ఛ.. నీవల్లే ఇన్ని నేర్చుకున్నాను‘ అంటుంది తప్ప రాటు తేలిన చేతుల్ని చూసుకోదు. అంతలా తన చుట్టూ రక్షణగా పనులను పేర్చుకుంది. శ్రీదేవిది కేరళలోని కట్టకడ. డేల్ కార్నెగీ, హబ్బార్డ్ చెప్పినట్టుగా ఉన్న దాంతోనే జీవితాన్ని లాగించాలని అన్నారు. ఏదీ లేని రోజులు కూడా శ్రీదేవి జీవితంలో చాలానే ఉన్నాయి. అందుకే పని లేని రోజు లేకుండా ఉండటం కోసం జాగ్రత్త పడినట్లుంది. సహస్ర వృత్తుల శ్రామిక స్వరూపిణి అయింది. చదవండి: రోడ్డు మీద వరి పండించాడు -
ఉద్దానం పెద్ద కొడుకు
సాక్షి, ఇచ్ఛాపురం: ఒకటా రెండా వందల ఏళ్లుగా ఉద్దానం కడుపు నింపుతోంది. రాకాసి గాలులకు ఎన్నిసార్లు తలలు తెగి పడినా మళ్లీ తన వాళ్ల కోసం నిటారుగా నిలబడింది. కమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు అన్నింటినీ రైతు కోసమే ధారబోసింది. రహస్యం తెలుసుకుని మసలుకున్న వాడి పాలిట కల్ప తరువుగా నిలిచింది. అందుకే దేవుడంతటి వాడే దాసోహమైపోయాడు. మానవమాత్రుడేపాటి. కొబ్బరి అందరికీ ఓ పంట. కానీ ఉద్దానానికి మాత్రం ఆత్మబంధువు. ఇక్కడి వారికి అది కేవలం చెట్టు కాదు.. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు. ఉద్దానం పల్లెలు పచ్చగా ఉన్నాయంటే అది కొబ్బరి చలవే. రేపు (సెప్టెంబర్ 2) అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం. ఈ సందర్భంగా నారికేళం చేసే మేలు గురించి తెలుసుకుందాం. దాని మహత్తును గమనించి తరిద్దాం. పల్లె పచ్చగా.. రాష్ట్రంలో రెండో కోనసీమగా ఉద్దానం పేరు పొందింది. విస్తారంగా పరచుకున్న కొబ్బరి తోటలు ఈ ప్రాంతాన్ని పచ్చగా చూస్తున్నాయి. జిల్లాలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలతో పాటు వజ్రపుకొత్తూరు, మందస, పలాస, రణస్థలం, లావేరు మండలాల్లో 17,540 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. జిల్లాలో వేల మంది రైతులు, వ్యాపారులు, కార్మికులకు ప్రత్యక్షంగా, అంతకు రెండు రెట్లు మందికి పరోక్షంగా బతుకునిస్తోంది. కొబ్బరి వల్ల రైతులు ఉత్పత్తుల తయారీ, అంతర పంటల పెంపకానికి కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), క్వాయర్ అభివృద్ధి బోర్డు, రాష్ట్ర ఉద్యానవన శాఖ పలు రాయితీలు అందిస్తున్నాయి. 106 రకాలు చేయవచ్చు.. కొబ్బరి నుంచి 106 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రతినిధులు చెబుతున్నారు. రైతులు కనీసం 16 రకాల ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోవచ్చంటున్నారు. జిల్లాలో సుమారు 50 వేల మంది రైతులు, 50 వేల మంది వ్యాపారులు, కార్మికులు, కూలీలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొబ్బరిపై ఇంత మంది జీవనోపాధి పొందుతున్న నేపథ్యంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా జిల్లాలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు సుమారు రూ.350 కోట్లు ప్రతిపాదించారు. అందులో కేవలం కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం కొబ్బరిని పండించే ఏడు మండలాల్లో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లతో ప్రాజెక్ట్ తయారు చేశారు. త్వరలో కార్యరూపం దాల్చనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎండు కొబ్బరి: వంటలకు ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా కేకులు, కొబ్బరి నూనె తయారీతో పాటు బయోడీజిల్ తయారీకి సైతం దీన్ని వాడుతుంటారు. కొబ్బరి చిప్స్: అందరూ ఇష్టపడే పొటాటో చిప్స్లానే కొబ్బరి నుంచి చిప్స్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. ఇదింకా కాస్త ఫేమస్ కావాల్సి ఉంది. కొబ్బరి పాలు: వంటలతో పాటు టీ, కాఫీలను కూడా తయారు చేయవచ్చు. కొబ్బరి పాలు శీతలీకరణలో మిల్లింగ్ చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తారు. కొబ్బరి క్రీమ్: దీన్ని కేకులు, వివిధ రకాల వంట తయారీకి వినియోగిస్తారు. కొబ్బరి తురుము: పంటలతో పాటు కొబ్బరి రకాల పచ్చళ్లలో దీన్ని అధికంగా వాడుతుంటారు. బేకరీల్లో బ్రెడ్లు, బన్స్‌తో తయారు చేసే రకరకాల ఆహారాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కేరళలో కొత్తగా కోకోనట్ కురికురీ స్వీట్, హాట్ రకాల్లో తయారీకి కొబ్బరి తరుములు అధికంగా వినియోగిస్తున్నారు. కోకో పికిల్: కొబ్బరితో తయారయ్యే పచ్చళ్లు, ఇవి కాకుండా కోకోనట్ క్రిస్పీ, కొబ్బరి డెసికేటెడ్ పౌడర్, కోకోనట్ క్యాండీ, కోకో మిల్క్ పౌడర్, కోకో సిరప్‌లను తయారు చేసి మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. కొబ్బరి డొక్క: కొబ్బరిలో అత్యంత విలువైనది దీని నుంచి వచ్చే పీచు. పట్టుకు జాతీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి డొక్కల నుంచి పీచు తయారు చేసే పరిశ్రమలు ఉన్నప్పటికీ పీచు నుంచి తాళ్లు, మ్యా ట్లు, ఫైబర్ మ్యాట్లు, కాయర్ జియోటెక్స్, గార్డెన్ ఆర్టికల్స్ (కుండీలు) తయారు చేసే పరిశ్రమలు లేకపోవడం మనకు కాస్త వెలితి. గతంలో కవిటి మండలం బొరివంక, మాణిక్యపురం, రాజపురంలో కంచిలి మండలం తలతంపర, సోంపేట మండలం బారువ గ్రామాల్లో క్వాయర్ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఉండేవి. అవి ఇప్పుడు మూతపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. కంచిలి మండలం కొక్కిలి పుట్టుగ, మజ్జిపుట్టుగ, నాథపుట్టుగ, చంద్రుపుట్టుగ తదితర గ్రామాల్లో బెంతు ఒరియా తెగకు చెందిన కూలీలు చిన్పపాటి చక్రాలతో కొబ్బరి తాళ్లు అల్లుతుంటారు. ప్రస్తుతం కొబ్బరి పొట్టుకు సైతం మంచి డిమాండ్ పెరిగింది. నీటి నిల్వను ఎక్కువ కాలం ఉంచేందుకు వ్యవసాయంలో దీన్ని అధికంగా వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనె: ఎండు కొబ్బరిని తరుమును వినియోగించి నూనె తయారు చేస్తారు. ఉద్దానం ప్రాంతాలలో ఎండు కొబ్బరి ముక్కల నుంచి నూనె తయారు చేసే మిల్లులు చాలా ఉన్నాయి. దీనిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అత్యంత విశిష్టమైంది. దీన్ని ఆహారంగా తీసుకుంటే మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎయిడ్స్ వంటి వ్యాధి గ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. అన్నీ విలువైనవే.. కొబ్బరి కాయ మాత్రమే కాదు చెట్టులో అన్ని భాగాలు విలువైనవే. కొబ్బరిలో బీ6, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి శక్తినిచ్చే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వందశాతం ఆరోగ్యానికి ఉపయోగకరం. ముఖ్యంగా గుండె పనితీరును ఎంతగానో మెరుగు పరుస్తుంది. ఇక కొబ్బరి కమ్మ పశువుల ఆహారంగానూ, ఇళ్ల పైకప్పుగానూ, శుభకార్యాల సందర్భంలో పచ్చని పందిరిగా ఉపయోగపడుతుంది. ఇక కొబ్బరి ఈనెలలను పరిశీలిస్తే దీన్ని ఒక కుటీర పరిశ్రమగా చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని కొబ్బరి పంట పండిస్తున్న పల్లెల్లో ఈనెపుల్లల అమ్మకం ఒక ప్రధాన పరిశ్రమ. ఎండు,పచ్చి రకాలుగా వీటిని విక్రయిస్తారు. ఎండు ఈనెలు కమ్మల నుంచి తొలగించి కొంతకాలం ఎండలో ఆరగట్టి వీటిని కట్టలుగా కట్టి ప్రధానంగా ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఎండు ఈనెలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. అదేవిధంగా పచ్చి ఈనెలు ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని ప్రధానంగా పైకప్పులకు ఊటబావుల్లో నీటి నిల్వ కోసం, అగ్గిపుల్లల తయారీ, ఐస్‌క్రీమ్ తయారీలో వినియోగిస్తున్నారు. చెట్టులోని భాగం బల్లలుగా ఇంటి కలపగా నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా కొబ్బరిలో ప్రతి భాగమూ ఉపయోగమే. ప్రభుత్వ సాయం ఇలా.. ఉద్దానం కొబ్బరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి. కొబ్బరి అభివృద్ధి బోర్డు(సీడీబీ), రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నడిచే ఉద్యానవన శాఖల సంయుక్త సహకారంతో ఎన్నో పథకాలు కొబ్బరిరైతులకు అందిస్తున్నాయి. కొబ్బరి రైతులకు వడ్డీ లేని రుణం లక్ష వరకు కాగా పంట రుణంగా(క్రాప్ లోన్) గరిష్టంగా రూ.1.60లక్ష స్వల్పవడ్డీకే అందిస్తున్నారు. దీంతో పాటు కిసాన్ గోల్డ్ కార్డ్ పేరిట కొబ్బరితోటల అభివృద్ధి పథకం కింద పెద్ద రుణాన్ని కూడా అందజేస్తున్నారు. డీసీసీబీ ద్వారా షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ రుణాల పేరిట భారీ మొత్తంలో రుణాలు కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత పంటల బీమా పథకం అమలుచేశారు. దీనికింద కేంద్రప్రభుత్వం 50శాతం ప్రీమియం చెల్లిస్తే, రాష్ట్రప్రభుత్వం మిగిలిన 50 శాతం ప్రీమి యం చెల్లించేవిధంగా దీన్ని ఉచిత పంటల బీమా పథకంగా కొబ్బరికి అనువర్తింపజేస్తున్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ సౌ కర్యం 90 శాతం రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం సింహభాగం నిధులు మంజూరు చేస్తోంది. దీని కోసం రైతులకు వ్యవసాయ విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అందిస్తోంది. కొబ్బరి పునరుద్ధరణ పథకం, విస్తీర్ణ అభివృద్ధి పథకం వంటివి మేలు చేస్తున్నాయి. కొబ్బరి కల్లు (కల్పరసం): కొబ్బరి దశదిశ మార్చేది ఇదే. అతి విలువైన ఉత్పత్తి కొబ్బరి కల్లు (కల్పరసం)ను పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని రకాల పద్ధతులు వినియోగించి ఉత్పత్తి చేస్తారు. ఇలా చేయడం వల్ల కల్లు పులిసిపోకుండా (ఫెర్మంటేషన్ అవకుండా) ఉంటుంది. ఇది పూర్తిగా ఆరోగ్యకరమైన పానీయం. కొబ్బరి పరిశ్రమలు నెలకొల్పుతాం కేవలం కొబ్బరిపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవించే కుటుంబాలు జిల్లాలో వేలాదిగా ఉన్నా యి. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ముందుగా నష్టపోయేది కొబ్బరి రైతులే. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుల కృషితో ఇక్కడి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి క్షేత్రాన్ని నెలకొల్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. విలువ ఆధారిత ఉత్పత్తులపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా కొబ్బరి రైతుల కలలను సాకారం కానున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పుతాం. – పిరియా సాయిరాజు, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, శ్రీకాకుళం -
గర్భిణి ఏనుగు మృతి: వెలుగులోకి కొత్త విషయం
తిరువనంతపురం : కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్ బాంబును తినిపించి చంపిన ఘటనలో కొత్త విషయం వెలుగులో వచ్చింది. ఇన్ని రోజులు పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ తినడం వల్ల ఏనుగు చావుకు కారణమయ్యిందని అందరూ అనుకుంటుండగా.. తాజాగా టపాకాయలు నింపిన కొబ్బరికాయను తిని ఏనుగు మరణించిందని అటవీశాఖ అధికారి సునీల్ కుమార్ వెల్లడించారు. ఏనుగు చనిపోయిన ఘటనపై యావత్ దేశం స్పందిస్తూ, అన్యాయంగా మూగజీవిని పొట్టనపెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏనుగు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న ఒకరిని నిన్న(శుక్రవారం) అరెస్టు చేశారు. (ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు) సాక్ష్యాల సేకరణలో భాగంగా అధికారులు నిందితుడిని పేలుడు పదార్థాలు తయారు చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ విషయంపై అధికారి మాట్లాడుతూ.. ‘కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన వ్యక్తిని ప్లాంటేషన్ షెడ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతను మరో ఇద్దరికి బాంబులు తయారు చేయడంలో సహాయం చేస్తున్నాడు.’ అని పేర్కొన్నారు. నిందితుడి పేరు విల్సన్‌గా, ఇతడు చెట్ల నుంచి రబ్బరు తీసేవాడుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేసులో మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. (ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు) కాగా.. క్రూరమైన అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాకాయలు తయారు చేసి పండ్లు, జంతువుల కొవ్వులో నింపి ఉచ్చులుగా ఉంచుతారు. ఈ క్రమంలో ఏనుగు పేలుడు పదార్థంతో నింపిన కొబ్బరికాయను తినడం వల్ల అది ఏనుగు నోటిని పూర్తిగా గాయపరిచింది. ఇలా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఏనుగు కొన్ని రోజులుగా ఆహారం, నీరు తీసుకోకుండా ఇబ్బంది పడింది. తీవ్రమైన గాయాలతో పాలక్కాడ్‌లోని వెల్లార్ నదిలోకి దిగిన ఏనుగు రోజంతా అలాగే ఉండి నీరసంతో చివరికి మరణించింది.అయితే ఏనుగు 20 రోజుల క్రితం గాయపడినట్లు, అప్పటి నుంచి ఆకలితో ఉండి మరణించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. (అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన) -
కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా
వేసవి అనగానే గుర్తుకు వచ్చేది కొబ్బరిబోండం. ఈ కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అందుకే పోషకాల నిధిగా పేరుపొందుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్‌లు, ఎమైనో యాసిడ్స్, సైటోకిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఎండ వేడిమికి అలసిపోయిన శరీరానికి ఎన్నో సుగుణాలు, పోషక విలువలు ఉన్న కొబ్బరి నీళ్లు హుషారునిస్తాయి. ♦ కొబ్బరిబోండంలో ఎమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, ఆహార ఫైబర్, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంటుంది. క్లోరైడ్లు, కొలెస్ట్రాల్‌లు తక్కువ మోతాదులో ఉంటాయి. ♦ ఎండలో తిరిగి వచ్చిన వారికి వడదెబ్బ తగలకుండా చేస్తాయి. గుండె నీరసాన్ని పోగొడుతుంది. ఫైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. ♦ కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్ పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీర ద్రవాలలో ఎలక్ట్రోలైట్‌ను తిరిగి భర్తీ చేస్తుంది. ♦ ఇవి తేమకోసం సిరల ద్వారా పంపే ద్రవంలా ఉపయోగపడతాయి. వైద్య సదుపాయాలు అందుబాటులో లేని లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు పునరుజ్జీవం కలిగిస్తాయి. ఉపయోగాలు ► ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలనే కోరికను కొబ్బరినీళ్లు తగ్గిస్తాయి. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ► ఒక వ్యక్తి శరీరం ఫ్లూ లేదా సలిపి రెండు రకాల బ్యాక్టీరియాల బారిన పడినప్పుడు ఇవి వైరల్, బ్యాక్టీరియాలను అరికట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ► కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గించటానికి కూడా ఉపయోగపడతాయి. ► కొబ్బరినీళ్లలోని ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదాలను కూడా తగ్గించవచ్చు. ► మొటిమలు, మచ్చలు, ముడతలు, సాగిన గుర్తులు, సెల్యులైట్, తామర వంటి వాటిపై కొబ్బరినీళ్లను రెండు, మూడు వారాల పాటు రాసి వదిలేస్తే అది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ► కేన్సర్‌ను తగ్గించే కారకాలు రక్తప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకినిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. ► ఈ నీళ్లలో సెలేనియం, యాంటీఆక్సిడెంట్ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉండడం వల్ల ఇవి కేన్సర్‌పై పోరాటం చేస్తాయని ప్రయోగశాలలో రుజువైంది. ► ఇందులో ఆమ్ల ఫాస్పటేస్, కాటలేస్, హైడ్రోజినస్, డయాస్టెస్, పెరాక్సిడేస్, ఆర్ఎన్ఏ, పాలిమెరాసేస్ లాంటి జీవ ఎంజైమ్‌లు ఉంటాయి. ► పెద్దగా స్థిరత్వం లేనప్పటికీ ఈ నీళ్లలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ లాంటి ఖని జా లు నారింజ లాంటి పళ్లలో కన్నా ఎక్కువగా ఉంటాయి. ► ఈ నీళ్లలో థయామిన్, ఫైరిడాక్సిన్, ఫోలేట్ లాంటి బీ–కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. ► కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 మిల్లీలీటర్ల కొబ్బరినీళ్లలో 250 మిల్లీ గ్రాముల పొటాషియం, 105 మిల్లీ గ్రాముల సోడియం లభిస్తాయి. ఈ రెండు ఎలక్ట్రోలైట్లు కలిసి శరీరంలో విరేచనాల వలన తగ్గిన ఎలక్రోటైట్లను పునరుత్పత్తి చేస్తాయి. పైగా తాజా కొబ్బరినీళ్లలో విటమిన్– సీ కూడా ఉంటుంది. ► లేత కొబ్బరినీళ్లు దాహానికి మంచి పానీయం. అలసటను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలాగా చేస్తాయి. దగ్గు, అస్తమా, అజీర్తితో బాధపడేవారికి మాత్రం కొబ్బరినీళ్లు అంత మంచివి కావు. ► కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు కలిపి గర్భిణులకు ఇస్తే మూత్ర విసర్జన సమయంలో మంటను నివారిస్తుంది. ► పిల్లలకు పచ్చి కొబ్బరి ముక్కలను, బెల్లంతో కలిపి తినేలా చేస్తే పళ్లు దృఢంగా మారతాయి. చిగుళ్లు, దంత సమస్యలు రావు. ► పచ్చి కొబ్బరి పాలలో గసగసాలు రుబ్బి తీసిన పాలను, తేనెను కలిపి తాగితే పొడిదగ్గు, చాతిలో మంట, డయేరియా వంటి వాటిని నివారించవచ్చు. ► కొబ్బరినీళ్లు ముఖానికి మంచి క్లీనర్‌గా పనిచేస్తాయి. ఈ నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు, బ్లాక్‌హెడ్స్ పోతాయి. ► కొబ్బరినీళ్లలో సమానంగా నిమ్మరసం కలిపి చిటికెడు పసుపు అరికాళ్లకు పూస్తే పాదాలు, అరచేతుల్లోని చురుకు మంటను నివారిస్తుంది. ► పిల్లల పెరుగుదలకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. శరీరంలోని వేడిని త్వరగా తగ్గించి సత్వర శక్తిని ఇస్తుంది. ► గుండె, కాలేయం, కిడ్నీ వ్యాధులతో బాధ పడేవారికి కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ► డయేరియాతో బాధపడేవారికి కొబ్బరినీళ్లు, నిమ్మరసం కలిపి ఇస్తే మేలు కలుగుతుంది. -
ఫుట్‌పాత్‌పై దందా.. రూ.5 వేలు డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: పొట్టకూటి కోసం కొబ్బరి కాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారిపై ఓ వ్యక్తి దౌర్జన్యం చేశాడు. తన భవనం ఎదురుగా దందా చేసుకుంటున్నందుకు అద్దె చెల్లించాలని డిమాండ్ చేశాడు. వివరాలు.. కర్మన్‌ఘాట్‌లోని రోడ్డు ఫుట్‌పాత్‌పై రామారావు అనే వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు. తన భవనం ముందు కొబ్బరి బొండాలు అమ్ముతున్నందుకు నెలకు 5వేల రూపాయలు అద్దె చెల్లించాలని భవన యజమాని కొండూరు లింగయ్య డిమాండ్ చేశాడు. అద్దె ఇవ్వనందుకు కొబ్బరి బొండాలు రోడ్డుపై విసిరికొట్టి హంగామా సృష్టించాడు. దీంతో లింగయ్య దౌర్జన్యంపై కొబ్బరి బోండాల వ్యాపారి రామారావు సరూర్ నగర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ‘సిగ్నల్’ అవస్థలు !) -
తెల్లదోమ విజృంభణ
సర్పిలాకార తెల్లదోమ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యానతోటలు అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను ఇది పీల్చి పిప్పి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూల ð ¬క్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలనూ తెల్లదోమ చుట్టుముట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల రైతాంగంతోపాటు తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంత కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులను సైతం కలవరపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఉద్యాన శాఖ సమీక్షలో ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో నివారణ చర్యలను ఉధృతం చేసింది. రూగోస్ తెల్లదోమ ఇలా వ్యాపిస్తుంది ► వలయాకారపు తెల్లదోమ (రూగోస్) ప్రధానంగా గాలి ద్వారా తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లను ఆశిస్తుంది. వీటిలో చక్కెర ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ► అక్కడి నుంచి జామ, మామిడి, పూలు, అలంకరణ మొక్కలను ఆశిస్తుంది. ► ఆకులో ఉండే పత్ర హరితాన్ని హరిస్తుంది. ► ఆకుల నుంచి రసాన్ని పీల్చి వేసి మైనం లాంటి తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది. దానిపై ’కాప్నోడియం’ అనే బూజు పెరిగి.. ఆకుపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీని వల్ల సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగ ► క్రియ స్తంభించి చెట్టు పూర్తిగా నీరసించిపోతుంది. ► కొబ్బరిలో 40 శాతం, ఆయిల్ పామ్‌లో 35 శాతం దిగుబడి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► తెల్లదోమను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, నివారణే మార్గమంటున్నారు. ఎక్కడెక్కడ ఉందంటే..? ► తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్ని, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని వేలాది ఎకరాల ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించింది. ► తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్ని కూడా తెల్లదోమ ఆశించింది. ► కడియం నర్సరీలలో కొబ్బరి, ఆయిల్ పామ్, జామ, అలంకరణ మొక్కలను సైతం తెల్లదోమ కమ్మేసింది. ► 1.60 లక్షల ఎకరాల కొబ్బరిని, అదే స్థాయిలో ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించినట్టు అనధికారిక అంచనా. సమగ్ర యాజమాన్యంతోనే తెల్లదోమకు చెక్ ► సర్పలాకార తెల్లదోమ సోకితే రసాయనిక పురుగుమందులు చల్లటం తగదు. వీటిని చల్లితే మిత్రపురుగులు నశించి తెల్లదోమ రెండు–మూడు రెట్లు విజృంభిస్తుంది. అందువలన అవాంఛిత పురుగుమందుల వాడకం నివారించి మిత్రపురుగులను పెంచుకోవాలి. ► జీవ నియంత్రణతో తెల్లదోమను అదుపు చేయొచ్చు. ► కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పసుపు రంగు టార్పలిన్ అట్టలను ఎకరానికి 10 నుంచి 15 చొప్పున (1 మీ.“ 1 మీ. విస్తీర్ణం) అతికించి, వాటికి ఆముదం పూసి, తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించి, చంపాలి. ► వీటి ద్వారా దోమను పూర్తిగా అదుపు చేయకున్నా.. ఒక తల్లి దోమను చంపడం ద్వారా 100 పిల్ల దోమలను నిరోధించవచ్చు. ► తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. ► డైకోక్రైసా ఆస్టర్ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. డైకోక్రైసా ఆస్టర్ సంతతి వృద్ధికి దాని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశలోనే చెట్ల ఆకులకు పిన్ చేసుకోవాలి. వీటిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానంలోనే దేశంలోకెల్లా మొట్టమొదటి సారిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా రోజుకు 3–4 లక్షల గుడ్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు లక్ష గుడ్ల ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► మిత్రపురుగైన ఎన్‌కర్సియా గ్వడెలోపే అనే బదనికలు ఈ తెల్లదోమలను అదుపులో ఉంచుతాయి. ఈ పురుగును ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే అవకాశం లేదు. సహజ సిద్ధంగా కొబ్బరి తోటల్లో ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతుంటాయి. అక్కడి నుంచి సేకరించి తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి. ► రిజర్వాయర్ మొక్కలు / బ్యాంకర్ మొక్కలను పెంచడం వలన ఎన్కార్సియా గ్వడెలోపే సంతతి పెరుగుతుంది. ► పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్రపురుగులు లేకపోతే, 1 శాతం వేపనూనెకు 10 గ్రా. డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► ఐసోరియ ఫ్యూమోసోరోసే అనే రకం కీటకాలను అరికట్టే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 5 గ్రాముల స్పోర్స్ సాంద్రత 1“108గా ఉండాలి చొప్పున కలిపి తయారు చేసుకున్న శిలీంద్ర ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను అదుపులోకి తేవచ్చు. శిలీంద్రం సాంద్రత తగినంత లేకపోతే ఫలితాలు పాక్షికంగానే వస్తాయి. ఒక ప్రాంతంలో రైతులందరూ కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసుకునే పద్ధతిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మదర్ కల్చర్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. ► నీటికి కొరత లేకపోతే.. నీటిలో డిటర్జెంట్ పౌడర్ కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► పగటి ఉష్ణోగ్రత పెరగేకొద్దీ తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. 40 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగేటప్పటికి తగ్గుతుంది. ► రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపడితే సర్పలాకార తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. – డా. ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, తూ.గో. జిల్లా – ఎ. అమరయ్య, సాక్షి బ్యూరో, అమరావతి -
కొబ్బరి అ‘ధర’హో
ధర పెరిగిందనగానే కొబ్బరి రైతుల్లో ఆనందం పెల్లుబికింది. ఈసారైనా లాభాలు ఆర్జించవచ్చునని ఆశపడితే చివరికి నిరాశే మిగిలింది. దిగుబడి బాగుంటే ఆ స్థాయిలో విక్రయాలు నిర్వహించి, నష్టాల నుంచి బయటపడవచ్చునని అనుకున్నారు. కానీ వివిధ రకాల తెగుళ్ల కారణంగా కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. తూర్పుగోదావరి, అమలాపురం/అంబాజీపేట: అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో కొబ్బరికాయ ధర పెరిగింది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎగుమతులు తగ్గడం.. సంక్రాంతి పండగ నేపథ్యంలో కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే వెయ్యి కాయల ధర ఏకంగా రూ.వెయ్యి వరకూ పెరిగింది. నెల కిందట తగ్గి... ఆందోళనలో ఉన్న కొబ్బరి రైతులకు పెరిగిన ధర కొంత వరకు ఊరట కల్పించాలి... కానీ అంచనాలకన్నా తక్కువ దిగుబడి రావడంతో పెరిగిన ధర వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. పెరుగుదలకు ఇదీ కారణం సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులకు కొబ్బరి కాయల ధర రూపంలో కొంత ఊరట కలి గించే అంశమనుకుంటున్న సమయంలో దిగుబడి కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల రోజుల కిందట కొబ్బరి ధర పతనమైన విషయం తెలిసిందే. వెయ్యి పచ్చికాయల ధర రూ.7 వేల నుంచి రూ.7,200 వరకు తగ్గిపోగా, పాత ముక్కుడు కాయ ( నిల్వ కాయ) రూ.7,500 నుంచి రూ.8 వేల వరకు ఉండేది. ఇప్పుడు పచ్చికాయ ధర రూ.8 వేల నుంచి రూ.8.500 వరకు, ముక్కుడు కాయ రూ.9 వేల నుంచి రూ.9,500 వరకూ పెరిగింది. ఇంచుమించు రూ.వెయ్యి వరకు పెరగడం విశేషం. ధర పెరగడానికి కారణం ఉత్తరాది మార్కెట్‌కు దక్షిణాది తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి ఎగుమతులు చాలా వరకు తVýæ్గడమే. పైగా ఈ రాష్ట్రాల నుంచి వస్తున్న కొబ్బ రి ధర అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు మన రాష్ట్రం నుంచి కొబ్బరి కొనుగోలుకు మొగ్గు చూపడంతో స్థానిక మార్కెట్లో డిమాండ్ ఏర్పడి ధర పెరి గింది. ముఖ్యంగా అంబాజీ పేట మార్కెట్ నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌కు ఎగుమతి అవుతున్నాయి. తగ్గిన దిగుబడి పెరిగిన ధర రైతులకు పెద్దగా సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఈ సీజన్లో కత్తెరకాయ (చిన్నకాయ) దిగుబడిగా వస్తోంది. దీనికితోడు దిగుబడి సైతం గణనీయంగా తగ్గింది. ఎకరాకు 1800 వరకు ఉండే దింపు ఇప్పుడు 400 నుంచి 600 మించడం లేదని రైతులు వాపోతున్నారు. మరో రెండు, మూడు నెలలూ ఇదే పరిస్థితి. దీనివల్ల పెరిగిన ధరల వల్ల తమకు పెద్దగా లాభం లేదని, అయితే ధరలు పెరగడం కొంత వరకు ఊరటనిస్తోందని రైతులు చెబుతున్నారు. అంబాజీపేట మార్కెట్లో పచ్చి కొబ్బరితోపాటు కొత్తకొబ్బరి ధరలు కూడా పెరిగాయి. క్వింటాల్ కొత్త కొబ్బరి ధర గతంలో రూ.8,500 నుంచి రూ.8,800 వరకు ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.8,700 నుంచి రూ.9,300 వరకు పెరిగింది. కొత్త కొబ్బరి రెండో రకం ధర గతంలో రూ.7,500 నుంచి రూ.8.100 వరకు ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.8,300 నుంచి రూ.8.500 వరకూ పెరిగింది. కురిడీ కొబ్బరి పాత రకంలో వెయ్యికాయల ధర రూ.12 వేలు ఉండగా, అది కాస్తా రూ.12,500 వరకూ పెరిగింది. రూ.11 వేలు ఉన్న పాత కాయ రూ.11,500 వరకు, గటగట పాత కాయ రూ.8 వేల నుంచి రూ.8,300 వరకు, కొత్తకాయ రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఇలా మొత్తం కొబ్బరి ఉత్పత్తుల ధరల పెరగడం విశేషం. -
అనుగ్రహానికి అన్నం నైవేద్యం
అమ్మ అంటేనే అనుగ్రహించేది అని అర్థం. దుర్గమ్మ తల్లి తన భక్తులను బిడ్డలుగా భావించి సదా అనుగ్రహిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ పిల్లలు తమ సంతృప్తి కోసం తల్లికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు. ఆపై ప్రసాదంగా స్వీకరిస్తారు. నవరాత్రుల సందర్భంగా బియ్యంతో చేసే ఈ నైవేద్యాలను చేయండి. అనుగ్రహాన్ని పొందండి. పరమాన్నం కావలసినవి: బియ్యం – కప్పు; పంచదార – 4 కప్పులు; పాలు – 2 కప్పులు; నెయ్యి – టేబుల్ స్పూను; జీడిపప్పు – 10; కిస్మిస్ – గుప్పెడు; కొబ్బరి తురుము – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీస్పూను. తయారి: ►బియ్యం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ►పాలు స్టౌ మీద పెట్టి, మరుగుతుండగా అందులో బియ్యం పోసి బాగా కలపాలి ►బాగా ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి కొద్దిసేపు స్టౌ మీదే ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ►ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి బాగా కలపాలి ►ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించేయాలి ►ఈ ప్రసాదం తింటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆశీర్వదించినట్లే. బెల్లం అన్నం కావలసినవి: బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పున్నర; నెయ్యి – టేబుల్ స్పూను; కొబ్బరి ముక్కలు – అర కప్పు (నేతిలో వేయించాలి); పచ్చ కర్పూరం – టీ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి ►అన్నం పూర్తిగా ఉడికిన తరువాత బెల్లం పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి ►ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ►నెయ్యి, వేయించిన కొబ్బరి ముక్కలు, పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దించేయాలి ►వేడివేడిగా తింటుంటే సాక్షాత్తు మహిషాసుర మర్దని ప్రత్యక్షం కావలసిందే. కదంబం కావలసినవి: బాస్మతి బియ్యం – రెండు కప్పులు; క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, బంగాళ దుంప, మెంతి కూర, పుదీనా – అన్ని ముక్కలు కలిపి ఒక కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఏలకులు – 2; లవంగాలు – 2; దాల్చినచెక్క – చిన్న ముక్క; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పు – గుప్పెడు; కిస్మిస్ – టేబుల్ స్పూను; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వరుసగా వేసి కొద్దిగా వేయించాలి ►తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, కరివేపాకు వేసి పచ్చి పోయేవరకు వేయించి తీసేయాలి ►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి విడివిడిలాడేలా చేయాలి ►కూర ముక్కలు, ఉప్పు వేసి కలపాలి ►జీడి పప్పు, కిస్మిస్, దానిమ్మ గింజలు జత చేసి బాగా కలపాలి ►కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి ►ఉల్లి రైతా కాంబినేషన్లో తింటే శాకంభరీదేవి ప్రత్యక్షం కావలసిందే. పెసర పొడి పులిహోర కావలసినవి: పెసర పప్పు – 4 టీ స్పూన్లు; అన్నం – 2 కప్పులు; ఎండు మిర్చి – 3 + 3; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెబ్బలు; ఉప్పు – తగినంత. తయారి: ►స్టౌ మీద బాణలిలో పెసరపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి ►చల్లారాక అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర ఇంగువ వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ►రెండు కప్పుల అన్నాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఇందులో నాలుగు టీ స్పూన్ల పెసర పొడి, ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూను నూనె వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో పులిహోర పోపు కోసం నూనె వేసి కాగాక, అందులో ఘుమఘుమలాడేలా ఇంగువ, పచ్చి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►పెసర పొడి వేసిన అన్నానికి పోపు జత చేయాలి ►అంతా ఒకసారి బాగా కలియబెడితే పెసర పొడి పులిహోర రెడీ. పెరుగన్నం లేదా దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – రెండు కప్పులు; అల్లం – చిన్న ముక్క; పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 5; సెనగ పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను; చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష – కప్పు; చెర్రీ ముక్కలు – టీ స్పూను; టూటీ ఫ్రూటీ ముక్కలు – టీ స్పూను; జీడి పప్పులు – 10; నెయ్యి – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి, ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి ►అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి ►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి ►తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి ►పుల్లగా ఉండే నిమ్మకాయ ఊరగాయతో అందిస్తే ప్రసాదాన్ని కూడా అన్నంలా తినేస్తారు. ఉప్పు పొంగలి లేదా కట్ పొంగల్ కావలసినవిః బియ్యం – కప్పు; పెసర పప్పు – కప్పు; జీలకర్ర – టీ స్పూను; మిరియాల పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – గుప్పెడు. తయారి: ►ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసర పప్పు వేసి నీళ్లతో బాగా కడిగి నీరు ఒంపేయాలి ►ఆరు కప్పుల నీరు జత చేసి, కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►మిరియాల పొడి వేసి వేగుతుండగానే, జీడిపప్పు వేసి బాగా వేయించాలి ►కరివేపాకు వేసి వేయించి వెంటనే దించేయాలి ►ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదిపి, ఉప్పు జత చేయాలి ►నేతిలో వేయించి ఉంచుకున్న పదార్థాలను వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి ►అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీల కాంబినేషన్‌తో ఈ ప్రసాదానికి రెట్టింపు రుచి వస్తుంది. పులిహోర కావలసినవి: బియ్యం – 4 కప్పులు; చింత పండు – 100 గ్రా.; పచ్చి సెనగ పప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 10; కరివేపాకు – 4 రెమ్మలు; వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లు (నువ్వులు వేయించి పొడికొట్టాలి); జీడి పప్పులు – 15; నూనె – 100 గ్రా.; ఇంగువ – టీ స్పూను; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, నీరు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి బియ్యం ఉడికించాలి ►ఉడికిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక పెద్ద పళ్లెంలోకి తిరగబోసి, గరిటెతో పొడిపొడిగా అయ్యేలా కలపాలి ►ఒక గిన్నెలో చింతపండులో తగినంత నీరు పోసి నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి దోరగా వేయించాలి ►చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, ఉడికించి దించేయాలి ►అన్నంలో చింతపండు రసం, పోపు మిశ్రమం వేసి బాగా కలపాలి ►నువ్వుల పొడి, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తరవాత తింటే ప్రసాదాన్ని రుచిగా ఆస్వాదించవచ్చు. కొబ్బరి అన్నం కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – 2 కప్పులు; పచ్చి మిర్చి – 10; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 6; పల్లీలు – టేబుల్ స్పూను (వేయించినవి); అల్లం ముక్కలు – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి); నెయ్యి – టేబుల్ స్పూను; నిమ్మకాయ – 1; ఉప్పు – తగినంత; నూనె – టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారి: ►బియ్యం శుభ్రంగా కడిగి, 3 కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి ►అన్నం వేడిగా ఉండగానే పెద్ద పళ్లెంలో వేసి విడివిడిలాడేలా కలపాలి ►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►కొబ్బరి జత చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాక, ఉప్పు వేసి కలపాలి ►అన్నం జత చేసి బాగా కలిపి, దించే ముందు నిమ్మ రసం పిండాలి ►వేయించిన పల్లీలు, నేతిలో వేయించిన జీడిపప్పులు వేసి బాగా కలపాలి ►కొత్తిమీరతో అందంగా అలంకరించితే నోరూరించే కొబ్బరి అన్నం ప్రసాదం తినడం కోసం తొందరపడక తప్పదు. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
ఆరోగ్య కారకం
వాతావరణం చల్లబడినట్లే ఉంది. పొడిగా ఉండడం అవసరం. పొడులు తినడమూ అవసరం.వర్షాలు వెళ్లే వరకూరోజూ ఒక ముద్ద కారప్పొడితో తింటే..అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పేరుకు కారాలే గానీ..రుచికరమైన ఆరోగ్య కారకాలే ఇవన్నీ! కాకరకాయ కారం కావలసినవి: కాకరకాయలు ఒక కిలో; ఎండు మిర్చి: 100 గ్రా‘‘; చింతపండు: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; శనగపప్పు: మినప్పప్పు: ఒక్కొక్కటి ఒక స్పూను; ఉప్పు,నూనె: తగినంత తయారి: దీనికి రెండు రోజులు పని చేయాలి. ముందు రోజు కాకరకాయలను చిన్న ముక్కలు చేసి ఎండబెట్టాలి. మరుసటి రోజు నూనెలో వేయించి పొడి చేయాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేయించుకుని చింతపండు, వెల్లుల్లి వేసి పొడి చేయాలి. ఈ మిశ్రమంలో కాకరకాయ ముక్కల పొడిని కలుపుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడ. కరివేపాకు కారం కావలసినవి: కరివేపాకు: పావుకిలో; ఎండు మిర్చి: 100గ్రా‘‘; చింతపండు: 50గ్రా‘‘; వెల్లుల్లి: 50గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ధనియాలు: 100గ్రా‘‘; పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు; మినప్పప్పు: రెండు స్పూన్లు; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: కరివేపాకును కారం చేయడానికి ముందురోజు కడిగి ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును రెమ్మల నుండి విడదీసి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకును వేయించాలి. దానిని పక్కన ఉంచి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేయించుకుని పొడి చేసేటప్పుడు చింతపండు, వెల్లుల్లిని చేర్చాలి. ఇది దోశలలోకి బాగుంటుంది. అన్నం లో కలుపుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం నుంచి స్వస్థత పొందిన వాళ్లకు దీనితో భోజనం పెడితే నోటి అరుచి పోయి హితవు పుడుతుంది. త్వరగా జీర్ణం కావడంతోపాటు కరివేపాకులో ఉండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది. కంది కారం కావలసినవి: కందిపప్పు: 100గ్రా‘‘; ఎండు మిరపకాయలు: 50గ్రా‘‘; శనగపప్పు: ఒక స్పూను; పెసరపప్పు: ఒక స్పూను; ఇంగువపొడి: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: తగినంత. తయారి: కందిపప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు ఒకదాని తర్వాత మరొకటి వేయించుకుని పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు, ఇంగువ పొడి వేయాలి. దీనిని అన్నంలోకి కలుపుకోవచ్చు. వేపుడు కూరలలో చివరగా రెండు స్పూన్ల కారం చల్లితే ఆ రుచే వేరు. నల్ల కారం కావలసినవి: ఎండుమిరపకాయలు: 100 గ్రా; చింతపండు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా; ధనియాలు: 50 గ్రా; పచ్చిశనగపప్పు: ఒక స్పూన్; మినప్పప్పు: ఒక స్పూన్; కరివేపాకు: కొద్దిగా; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ విడివిడిగా వేయించాలి. వేడి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది. కొబ్బరి కారం కావలసినవి: పచ్చికొబ్బరి: ఒక కాయ నుంచి తీసినది; ఎండు మిర్చి: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగపప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె: తగినంత. తయారి: పచ్చికొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండు మిర్చి వేయించిన తర్వాత కొబ్బరి తురుమును వేయించాలి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కూడ వేయించుకుని అన్నీ కలిపి ఉప్పు చేర్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేపుడు కూరలలో వేసుకుంటారు. ఈ కారంపొడిలో నెయ్యి కలిపితే ఇడ్లీకి మంచి కాంబినేషన్. ఇడ్లీ కారం కావలసినవి: వేయించిన శనగపప్పు(పుట్నాలు): 100 గ్రా‘‘; ఎండు కొబ్బరి: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ఎండు మిర్చి: 50గ్రా‘‘; ఉప్పు: రుచికి తగినంత; నూనె: వేయించడానికి సరిపడినంత. తయారి: నూనె వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకుని శనగపప్పు, జీలకర్ర ఒకదాని తర్వాత మరొకటి వేయించాలి. ముందుగా మిరపకాయలను గ్రైండ్ చేసి దానిలో పుట్నాలు, ఎండుకొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. పేరుకి ఇది ఇడ్లీకారమే అయినా వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కారం కలిపి తింటే ఇక వేరే కూరలేవీ రుచించవు. కూర కారాలు కూర కారం కావలసినవి:ఎండు మిర్చి: ఒక కిలో; ధనియాలు: పావు కిలో వెల్లుల్లి: పావుకిలో; జీలకర్ర: 150గ్రా‘‘ మెంతులు: 50గ్రా‘‘; ఉప్పు: పావుకిలో తయారి: కూరకారానికి ఎండుమిర్చి వేయించకూడదు. ధనియాలు, జీలకర్ర విడివిడిగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి, ఉప్పు చేర్చుకోవాలి. దీనిని పులుసుల్లో వేసుకుంటే రుచి పెరగడమే కాక, ఘుమఘుమలాడుతుంది. కూరకారం, ఇగురుకారం ఆరు నెలల పాటు నిలవ ఉంటాయి నువ్వుల పొడి కావలసినవి: తెల్ల నువ్వులు: 100గ్రా‘‘; చింతపండు : 50గ్రా‘‘; ధనియాలు : 50గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగ పప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె : తగినంత. తయారి: నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్రలను విడివిడిగా వేయించి అన్నింటినీ కలిపి పొడి చేసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఇడ్లీకి మంచి కాంబినేషన్. దీనిని ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటారు. వర్షాకాలంలో కూడ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా శరీరానికి అందించాల్సిన ఔషధాలను ఆహార రూపంలో అందించడమే మన రుచుల ప్రత్యేకత. ఇగురుకారం కావలసినవి: ఎండుమిర్చి: ఒక కిలో జీలకర్ర: పావుకిలో వెల్లుల్లి: పావుకిలో నూనె: వేయించడానికి కావలసినంత తయారి: మిరపకాయలను నూనెలో వేయించి చల్లారిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసి పొడి చేసుకోవాలి. దీనిని కూరలు, వేపుళ్లలో వేసుకుంటే వంటల రుచి మరింత ఇనుమడిస్తుంది. నాన్ వెజ్ రొయ్యల కారం కావలసినవి: ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పుఎండు రొయ్యలు– అర కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుఅల్లం తరుగు – ఒక టీ స్పూనుకరివేపాకు – మూడురెమ్మలుఎండు మిరపకాయలు– ఆరునల్ల మిరియాలు– 15చింతపండు– పెద్ద ఉసిరికాయంతఉప్పు– రుచికి తగినంత తయారి: ఎండు రొయ్యలను పెనంలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో కొబ్బరి తురుమును, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, మిరియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో చింతపండు, ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పల్లీ కారం పల్లీకారం: కొబ్బరికారంలో వేసిన దినుసులన్నీ వేసుకుని కొబ్బరికి బదులుగా వందగ్రాముల వేరుశనగ పప్పు వాడాలి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం అన్నింటిలోకి మంచి ఆధరువు. కరివేపాకు కారానికి వాడిన దినుసులన్నీ వేసుకుంటూ కరివేపాకు బదులుగా పుదీనా వాడాలి. కొత్తిమీర పొడికి కూడ ఇదే పద్ధతి. -
కొబ్బరి రైతులను ముంచుతున్న ఆక్వా
సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి రైతుకు కొత్త కష్టమొచ్చింది. ఆక్వా సాగు పుణ్యమాని తూర్పు గోదావరి జిల్లాలో వందలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు రొయ్యలు, చేపల చెరువులున్న ప్రాంతాల్లో కొబ్బరి కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. గడచిన ఐదేళ్ల కాలంలో కాయ సైజు సగటున 100 గ్రాముల వరకు తగ్గినట్టు అంచనా. కొబ్బరి ధర పతనానికి.. మార్కెట్ సంక్షోభానికి కాయ సైజు తగ్గడం కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడి ఉండే తోటల్లో పక్వానికి వచ్చిన కొబ్బరి కాయ సగటు బరువు డొక్కతో కలిపి 600 గ్రాముల వరకు ఉంటుంది. డొక్క తీసిన తరువాత కాయ బరువు మన రాష్ట్రంలో సగటున 450 గ్రాములు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, విజయనగరం జిల్లాలో అయితే 450 నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో డొక్క తీసిన కాయ బరువు 500 గ్రాముల వరకు, కేరళలో 550 గ్రాముల వరకు వస్తోంది. మన రాష్ట్రంలో కొబ్బరి తోటలకు పెట్టింది పేరైన కోనసీమతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో వలిచిన కాయ సగటు బరువు 400 గ్రాముల వరకు ఉండేది. ఇప్పుటికీ ఆరోగ్యకరమైన తోటల్లో దిగుబడి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. కానీ.. తీరప్రాంత మండలాలు, ఆక్వా చెరువులు ఉన్న మండలాల్లో మాత్రం కాయ బరువు గణనీయంగా తగ్గుతోంది. ఇక్కడ వలిచిన కాయ సైజు 250 గ్రాములకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. కాయ బరువు తగ్గడమే కాదు.. కాయ స్వరూపం మరింత కోలగా మారిపోతోంది. కోనసీమతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, తాళ్లరేవు, తొండంగి మండలాల పరిధిలో ఆక్వా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగయ్యే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు తదితర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి తోటలు ఆక్వాబారిన పడి కాయ సైజు తగ్గిపోతోంది. ఉప్పు వల్ల ముప్పు ఇటీవల ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతున్న స్థాయిలోనే కొబ్బరికి నష్టం కలుగుతోంది. ఆక్వా ప్రభావం వల్ల ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు మోడువారిన విషయం తెలిసిందే. ఇది వెనామీ రొయ్యల్ని పెంచే చెరువు గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లకు మాత్రమే పరిమితమైందని రైతులు భావించేవారు. కానీ.. భూమి పొరల ద్వారా వస్తున్న ఆక్వా ఉప్పు నీటివల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోయారు. ఆక్వా సాగు చేస్తే చెరువు చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని భూమిలో సూక్ష్మ పోషకాలు నశించడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నీరు ఉప్పగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొబ్బరికి భూమి ద్వారా సహజ సిద్ధంగా అందే నీరు ఉప్పగా మారడంతో తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోతోంది. మరోవైపు పోషకాలు అందక కొబ్బరికాయ సైజు తగ్గుతోంది. ఫలితంగా ఇక్కడ పండే కొబ్బరి కాయలకు డిమాండ్ తగ్గి ధర పడిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో పండే కొబ్బరి కాయల్లో నూనె శాతం 69 ఉంటే.. ఇక్కడి కాయల్లో 61 శాతం మాత్రమే ఉంటోంది. ఫలితంగా ఈ ప్రాంత కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా దిగజారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయిలో ఉంది ఆక్వా సాగు వల్ల, సముద్రం ఎగదన్ని వస్తున్నందు వల్ల నదులు, మురుగునీటి కాలువల్లో ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగింది. భూగర్భ జలాలు సైతం ఉప్పు బారిన పడుతున్నాయి. మరోవైపు కొబ్బరి ఆక్వా బారిన పడటంతో రోగ నిరోధక శక్తి తగ్గుతోంది. కోనసీమలో చాలాచోట్ల లవణాల సాంద్రత 2000 పీపీఎం దాటింది. ఇది ప్రమాద తీవ్రతకు సూచిక. ఈ పరిస్థితులే కొబ్బరి కాయ సైజు తగ్గడానికి, దిగుబడి పడిపోవడానికి కారణం. – డాక్టర్ పి.కృష్ణకిశోర్, ప్రిన్సిపాల్, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ, అమలాపురం శక్తి హరిస్తోంది ఆక్వా చెరువుల వల్ల భూగర్భ జలాల్లో లవణ శాతం పెరిగి కొబ్బరి చెట్లకు సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్లు అందడం లేదు. దీనివల్ల చెట్టు శక్తిహీనమై దిగుబడి తగ్గుతోంది. గడిచిన ఐదేళ్లలో కాయ సైజు భారీగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టం. ఆక్వా చెరువుల చుట్టూ ఉన్న చెట్లకు నల్లముట్టి పురుగు, తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువైంది. –ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
చల్లగా ఉందాం..
చిత్తూరు :ఎండలు భగభగమంటున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతలు అధికం కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలోని నీటి నిల్వలు, ఖనిజ లవణాల శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల పండ్లు, కాయలు, రసాలు తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే అవకాశముంటుందని చెబుతున్నారు. కొబ్బరిబొండం కొబ్బరి నీళ్లు తాగితే తాపం తగ్గుతుంది. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా నిలువరిస్తుంది. కొబ్బరిబొండంలో కాల్షియం, పాస్పరస్, విటమిన్ బీ1, బీ3, సీ మొండుగా లభిస్తాయి. ఇవీ పోషకాలు నీరు–93.08 శాతం, శక్తి–24 కిలో కేలరీలు, కాల్షియం–25 మిల్లీగ్రాములు, పాస్పరస్– 10 మిల్లిగ్రాములు, విటమిన్ బీ1–0.01 మిల్లీగ్రాములు, విటమిన్ బీ3– 0.1మిల్లీ గ్రాము, విటమిన్ సీ–2 మిల్లీగ్రాములు ఉంటాయి. దోసకాయ వేసవిలో దోసకాయ తింటే ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ తింటే 13 కిలోకేలరీల శక్తి ఉత్పన్నమై శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాల్షియం, పాస్పరస్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ సీ, బీ, డీ అలసట దూరమవుతుంది. ఇవీ పోషకాలు నీరు–96.9శాతం, శక్తి–13 కిలో కేలరీలు, కాల్షియం–10 మిల్లీగ్రాములు, పాస్పరస్– 25 మిల్లీగ్రాములు, పోలిక్‌యాసిడ్–14.7 మిల్లీగ్రాములు, విటమిన్ సీ–17 మిల్లీగ్రాములు, విటమిన్ బీ–0.2 మిల్లీగ్రాములు, విటమిన్ డీ–0.3 మిల్లీ గ్రాములు ఉంటాయి. పుచ్చకాయ పుచ్చకాయలో నీటితో పాటు పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. జ్యూస్ తాగినా, నేరుగా తిన్నా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. విటమిన్ బీ6 ఎనర్జీ లభిస్తుంది. ఇవీ పోషకాలు నీరు–92శాతం, విటమిన్ బీ–6 మిల్లీ గ్రాములు, పిండి పదార్థం–7 శాతం, శక్తి–16 కిలో కేలరీలు ఉంటాయి. ద్రాక్ష దాక్ష పండు తిన్నా, రసం తాగినా శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. అన్ని పండ్ల కన్నా ద్రాక్షలో కేలరీలు బాగా లభిస్తాయి. నీరు, ప్రొటీన్లు, కొవ్వు, పీచుపదార్థాలు, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇవీ పోషకాలు నీరు–92.2 శాతం, ప్రొటీన్లు–0.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు– 0.3 గ్రాములు, పీచు పదార్థాలు– 2.9 గ్రాములు, ఐరన్ శక్తి–0.52 మిల్లీ గ్రాములు, శక్తి– 71 కిలో కేలరీలు లభిస్తాయి. అరటి పండు అరటి పండు సులభంగా జీర్ణమై రక్తంలో కలుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించి అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. మినరల్స్, పొటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఈపండులో 70.1గ్రాముల నీరు ఉంటుంది. ప్రొటీన్లు 1.2 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, పిండిపదార్థాలు 27.2 గ్రాములు ఉంటాయి. మామిడి పండు మామిడి పండులో కార్బన్ కణాలను అరికట్టే గొప్ప గుణం ఉంది. ఇందులో ఉండే ఫాలీఫినోల్ ఇందుకు సహకరిస్తుంది. 15 శాతం చక్కెర, ఒక శాతం మాంసకృతులు, ఏ,బీ, సీ విటమిన్లు ఉంటాయి. పిండిపదార్థాలు 17.00 గ్రాములు, చక్కెర 14.8 గ్రాములు, పీచు పదార్థాలు 0.27, మాంసకృత్తులు 51 గ్రాములు, థయామిన్ 0.058, సియాసిస్ 0.0584 లు ఉంటాయి. -
పెసరంత భక్తి
రాములవారికి ఏ నైవేద్యం పెట్టినా స్వీకరిస్తాడు. అందులో భక్తి నింపితే చాలు. పెసరంత నైవేద్యానికి కొండంత అండగా ఉంటాడు.పండగరోజు పెసరలతో స్వామికి నైవేద్యం!మీకు ప్రసాదం! వడ పప్పు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా. తయారీ: ►ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, నిమ్మ రసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. పానకం కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ►ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ►ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ►గ్లాసులోకి తీసుకుని తాగాలి. పెసర పప్పులడ్డు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; బియ్యం – అర కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ముందుగా ఒక పాత్రలో మినప్పప్పు, బియ్యం, ఉప్పు వేసి సుమారు నాలుగు గంటలు నానబెట్టాలి ►మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బి పక్కన ఉంచాలి ►పెసర పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►బాణలి లో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►పెసరపప్పు జత చేసి ఉడికించి దింపేయాలి ►చల్లారాక, రంధ్రాలున్న గిన్నెలో పోసి నీళ్లు పోయేవరకు సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి ►నీరంతా పోయాక మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ►కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి, ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు ముద్ద వేసి కలిపి, గట్టి పడిన తరవాత దింపేయాలి ►కొద్దిగా చల్లారాక ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ►బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పెసర పూర్ణాలను మినప్పప్పు మిశ్రమం పిండిలో ముంచి బూరెల మాదిరి గా నూనెలో వేసి వేయించాలి ►దోరగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►కొద్దిగా చల్లారాక మధ్యకు చేసి, కాగిన నెయ్యి వేసి అందించాలి. పెసర పాయసం కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పల్చటి కొబ్బరి పాలు – అర కప్పు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీడిపప్పులు – 15; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►పెసర పప్పును శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక మూత తీసి ఉడికిన పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►గరిటెతో మెత్తగా మెదపాలి ∙పల్చటి కొబ్బరి పాలు, నీళ్లు జత చేసి బాగా కలపాలి ►బెల్లం పొడి జత చేసి కరిగేవరకు కలుపుతుండాలి ►చిక్కటి కొబ్బరిపాలను జత చేసి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి (ఎక్కువ సేపు ఉంచితే, పాలు విరిగిపోతాయి) ►స్టౌ మీద బాణలిలో కొబ్బరి నూనె కాగాక, జీడిపప్పులు, కిస్మిస్లు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఉడికిన పాయసంలో వేయాలి ►ఏలకుల పొడి కూడా జత చేసి కలిపి దింపేయాలి. పెసర పప్పుహల్వా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్ స్పూను (అన్సాల్టెడ్); కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ. తయారీ: ►పెసరపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు ఐదు గంటల సేపు నానబెట్టాక నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక మెత్తగా రుబ్బుకున్న పెసరపిండిని అందులో వేసి ఆపకుండా సన్నటి మంట మీద కలుపుతుండాలి ►బాగా ఉడికి, బాణలి నుంచి విడివడేవరకు కలుపుతుండాలి ►ఈలోగా మరొక బాణలి స్టౌ మీద ఉంచి పాలు, నీళ్లు, పంచదార వేసి ఉడికించాలి ►పెసర పిండి మిశ్రమం కొద్దిగా రంగు మారుతుండగా, పంచదార పాలు మిశ్రమాన్ని జతచేసి కలియబెట్టాలి ►నెయ్యి వేరుపడే వరకు కలపాలి ►ఏలకుల పొడి, పిస్తా తరుగు, కిస్మిస్ జత చేసి కలియబెట్టాలి ►హల్వాను వేడిగానే అందించాలి. పెసర పప్పు బూరెలు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; పంచదార – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ – పావు కప్పు (జీడి పప్పు, బాదం పప్పులు, పిస్తాలు...) తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పెసర పప్పు వేసి దోరగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండిలా అయ్యేలా గ్రైండ్ చేయాలి ►పిండిని జల్లించాలి ∙అదే మిక్సీలో పంచదార, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి ►ఒక పాత్రలో పెసర పిండి, పంచదార పొడి వేసి రెండూ కలిసేలా కలపాలి డ్రైఫ్రూట్స్ జత చేయాలి ►కరిగించిన నేతిని కొద్దికొద్దిగా జత చేస్తూ ఉండలు కట్టుకోవాలి ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. పెసర పప్పు ఫ్రై కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నీళ్లు – రెండున్నర కప్పులు; పసుపు – చిటికెడు. పోపు కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (నిలువుగా మధ్యకు తరగాలి); ఎండు మిర్చి – ఒకటి; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కసూరీ మేథీ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – అర టేబుల్ స్పూను తయారీ: ►పెసర పప్పును ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపేయాలి ►చల్లారాక గరిటెతో మెత్తగా మెదపాలి ►అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి ►చిన్న బాణలిలో నూనె లేదా బటర్ వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాక, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి ►మిరప కారం, గరం మసాలా, ఇంగువ, కసూరీ మేథీ, కొత్తిమీర జత చేయాలి ►బాగా ఉడికేవరకు వేయించాలి ►తడ్కా మిశ్రమం జత చేసి మరోమారు కలిపి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి. పెసర పప్పుతడ్కా కావలసినవి: పెసర పప్పు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత పోపు కోసం: జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2; ఇంగువ – కొద్దిగా; నెయ్యి లేదా నూనె – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి కలుపుకోవాలి ►పసుపు, మిరపకారం, నీళ్లు జత చేసి బాగా కలపాలి ►పెసర పప్పు వేసి కలియబెట్టి మూత పెట్టాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►ఉప్పు జత చేసి కలియబెట్టాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి ►వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి కలిపి దింపేయాలి ►గరం మసాలా, మిరప కారం, ఇంగువ జత చేసి బాగా కలిపి, ఉడికిన తడ్కా మీద వేసి కలపాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. పెసర సలాడ్ కావలసినవి: పెసలు – రెండు కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి); మిరప కారం – పావు టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఉడికించిన బంగాళ దుంప – ఒకటి (తొక్క తీసి సన్నగా తరగాలి); కొత్తిమీర – కొద్దిగా; తయారీ: ►ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, పక్కన ఉంచాలి ►ఆ మరుసటి రోజు ఉదయానికి మొలకలు వస్తాయి ►మొలకలు వచ్చిన పెసలను ఉపయోగించాలి. తయారీ: ►మొలకలు వచ్చిన పెసలకు తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉల్లితరుగు, టొమాటో తరుగు జత చేయాలి ►పచ్చి మిర్చి తరుగు, బంగాళదుంప తరుగు జత చే సి కలియబెట్టాలి ►పావు మిరపకారం, చాట్ మసాలా జతచేశాక, ఉప్పు, నిమ్మ రసం వేసి, బాగా కలపాలి ►కొత్తిమీరతో అలంకరించి, వెంటనే అందించాలి. పెసర కిచిడీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; జీలకర్ర – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; నీళ్లు – మూడున్నర కప్పులు; నూనె లేదా నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో పెసర పప్పు, బియ్యం వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి ►మంచి నీళ్లు జత చేసి సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి, వేడయ్యాక నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి వేయించాలి ►పసుపు, ఇంగువ జత చేసి టొమాటోలు మెత్తపడే వరకు వేయించాలి ►నానబెట్టుకున్న పెసర పప్పు, బియ్యం మిశ్రమంలోని నీటిని తీసేసి, బియ్యం మిశ్రమాన్ని కుకర్‌లో వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్ మూత పెట్టాలి ►ఆరేడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►మిశ్రమం మరీ ముద్దగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు జత చేయాలి ►కిచిడీ మీద నెయ్యి వేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది ►పెరుగు, సలాడ్లతో తినొచ్చు. పెసర పప్పు కచోరీ కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – పావు కప్పు; నీళ్లు – తగినన్ని కచోరీ స్టఫింగ్ కోసం: పెసర పప్పు – అర కప్పు; నెయ్యి – అర టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; సోంపు పొడి – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత తయారీ: ►ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి ►పావు కప్పు నెయ్యి జత చేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ►తడి వస్త్రం మూత వేసి గంట సేపు పక్కన ఉంచాలి ►పెసర పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టాలి ►నీళ్లు ఒంపేసి, పెసర పప్పును మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా ఉండేలా మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక మిరప కారం, ఆమ్చూర్ పొడి వంటి మసాలా దినుసులు జత చేసి దోరగా వేయించాలి ►రవ్వలా మిక్సీ పట్టిన పెసర పప్పు, ఉప్పు, ఇంగువ జత చేసి మూడునాలుగు నిమిషాలు ఆపకుండా కలియబెట్టి, దింపి చల్లార్చాలి ►చేతికి కొద్దిగా నూనె పూసుకుని, పిండిని తగు పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఉండలు చేసి పక్కన ఉంచాలి ►కలిపి ఉంచుకున్న మైదాపిండిని మరోమారు బాగా కలపాలి ►పిండిని పొడవుగా గుండ్రంగా ఒత్తి, సమాన భాగాలుగా కట్ చేయాలి ►ఒక్కో ఉండను చపాతీకర్రతో కొద్దిగా పల్చగా ఒత్తాలి ►పెసరపప్పు మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచులు మూసేసి, (మరీ పల్చగాను, మరీ మందంగాను కాకుండా చూసుకోవాలి) ►మరోమారు ఒత్తాలి (పల్చటి వస్త్రం పైన వేసి ఉంచాలి. లేదంటే ఎండిపోతాయి) ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న కచోరీలను వేసి, దోరగా వేయించాలి ►కొద్దిగా పొంగుతుండగా, జాగ్రత్తగా వెనుకకు తిప్పాలి ►బంగారు వర్ణంలోకి వచ్చాక పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►గ్రీన్ చట్నీ లేదా స్వీట్ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. పెసరపప్పు ఢోక్లా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – టేబుల్ స్పూను; నీళ్లు – అర కప్పు; కొత్తిమీర ఆకులు – టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ ఉప్పు – టీ స్పూను. పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; వేయించిన నువ్వులు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు గార్నిషింగ్ కోసం: కొత్తిమీర తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు తయారీ: ►పెసరపప్పుకి తగినన్ని నీళ్లు జతచేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నాలుగు గంటల పాటు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►కొత్తిమీర, అరకప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి కొద్దిగా పలుకులా ఉండేలా మిక్సీ పట్టాలి (మరీ ముద్దలా అవ్వకూడదు. మరీ పల్చగాను, మరీ గట్టిగానూ కూడా ఉండకూడదు) ►ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మరిగించాలి ►వెడల్పాటి పళ్లానికి కొద్దిగా నూనె పూసి పక్కన ఉంచాలి ►ఒక పాత్రలో అల్లం + పచ్చిమిర్చి ముద్ద, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, తయారుచేసి ఉంచుకున్న పెసర పిండి మిశ్రమాన్ని జత చేయాలి ►చివరగా నిమ్మ ఉప్పు జత చేసి బాగా కలిపి, నూనె పూసిన పాత్రలో పోసి సమానంగా పరవాలి ►స్టౌ మీద మరుగుతున్న నీళ్ల పాత్రలో ఈ పళ్లెం ఉంచి, మూత పెట్టి, సుమారు పావు గంట తరవాత దింపేయాలి ►బాగా చల్లారాక బయటకు తీయాలి ►చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►నువ్వులు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►ఇంగువ, కరివేపాకు వేసి వేయించి బాగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి పోపు మిశ్రమాన్ని బాగా కలపాలి ►ఈ మిశ్రమాన్ని తయారు చేసి ఉంచుకున్న ఢోక్లా మీద వేయాలి ►కొత్తిమీర, కొబ్బరి తురుములతో అలంకరించి అందించాలి. పానకం– వడపప్పు ప్రాముఖ్యత ఏమిటి? శ్రీరామ నవమి రోజున అందరిళ్లలోనూ పానకం–వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం దాగి ఉంది. ఇది ఎండాకాలం. కాబట్టి పానకాన్ని, వడపప్పును ప్రసాదరూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. అందుకే పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. బాగా జ్వరంతో బాధపడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి పెద్దలు పెసరపప్పుతో చేసిన కట్టు, పెసరపప్పు కలిపి వండిన పులగం వంటి వాటిని తినిపిస్తారు. ఎందుకంటే పెసరపప్పు తేలికగా అరుగుతుంది. శరీరం కోల్పోయిన బలాన్ని, సత్తువను తిరిగి తెస్తుంది. వేసవి కాలంలో వడపప్పును తినడం వంటికి చలువ చేస్తుంది. అలాగే తియ తియ్యటి బెల్లం పానకాన్ని సేవించడం వల్ల ఎండలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. -
కీర్తనల్లో...ద్రాక్ష, అరటి, కొబ్బరి
దక్షిణాదిన ఒక నానుడి ఉంది. త్యాగరాజ కీర్తనలు ద్రాక్షపళ్ళలాంటివి...నోట్లో వేసుకుని చిదిమితే చాలు, పులకించిపోతాం. శ్యామశాస్త్రి గారి కీర్తనలు కదళీఫలం లాంటివి. కొంచెం కొంచెంగా తొక్క ఒలుచుకుని తింటుంటేనే అరటి పండును ఆసాంతం సంతృప్తిగా ఆస్వాదించగలం. ముత్తుస్వామి దీక్షితులు గారి కీర్తనలు నారికేళ పాకం లాంటివి. కొబ్బరి బోండాం తెచ్చి, పీచు తీసి, పగుల కొట్టి, కొబ్బరి తీసి, తురిమి, పాకం పట్టించి తింటే తప్ప ఆ ఆనందం తెలియదు. దంతసిరి కూడా ఉండాలి. లేకపోతే పళ్ళమధ్య ఇరుక్కుపోతున్నవాటిని సభా గౌరవం కూడా పాటించకుండా పుల్లలతో గుచ్చుకుంటుండాలి. అంటే ముగ్గురివి అటువంటి స్థాయి కలిగిన కీర్తనలు. శ్యామశాస్త్రి గారికి శ్రీవిద్యా సంప్రదాయం అంటే కరతలామలకం. సాక్షాత్ అమ్మవారిని ఉద్దేశించి చేసిన కీర్తనలో ఎన్ని రహస్యాలు దాచారో.. అదొక అద్భుత కీర్తన...‘‘హేమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి/శ్యామకృష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీకీరవాణీ శ్రీలలితే.....’’ పాహిమాం వరదే పరదేవతే అని చిట్టచివరి చరణంలోకి వెళ్ళేటప్పటికి శ్రీలలితే అని చేసారు. ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. రాజగోపురంలో కూర్చుని ఒళ్ళు మరిచి సంకీర్తన చేస్తుంటే... అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఒంటినిండా నగలు ధరించి చేత్తో పాలు పట్టుకొచ్చి..‘అన్నయ్యా! అన్నయ్యా!!!’ అని పిలిచి ఇచ్చేది. అవి తాగేవారు ఆయన. ఇంటికొచ్చి వారి అమ్మనడిగేవారు..‘‘చెల్లిని ఎందుకు పంపావు ?’’ అని.‘నీ చెల్లీ రాలేదు, నేనూ పంపలేదు’ అని ఆమె అనేవారట. అందుకే ఎక్కువగా ఆయన కీర్తనలలో చివర ‘శ్యామకృష్ణ సహోదరీ’ అని చేర్చారు. ఒక అర్థంలో కామాక్షీదేవిని వాళ్ళ ఇంటి ఆడపడుచు–అని, మరొక అర్థంలో విష్ణు సహోదరి అయిన అమ్మవారు– అని అర్థం వచ్చేలా ఉంటుంది. త్యాగరాజుగారు ‘త్యాగరాజనుత’ అని వేసుకున్నట్లుగానే, శ్యామశాస్త్రిగారు ‘శ్యామకృష్ణ సహోదరి’ అనీ, ‘శ్యామకృష్ణ పూజిత’ అని వేసుకున్నారు.అనేకమంది మహర్షులకు నిలయం హిమవత్ పర్వతం. ఎందరో అక్కడ ధ్యానం చేస్తుంటారు. అటువంటి హిమవత్ పర్వత రాజయిన హిమవంతుడి భార్య మేనక. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిగా ఉండి హిమాలయాల్లో సంచరిస్తుండగా ఆమెను చూసిన మేనక –‘నాకు ఇటువంటి కుమార్తె ఉంటే బాగుండును’ అనుకున్న కారణంగా ఆమె హైమవతి గా జన్మించింది. ప్రపంచంలోని పర్వతాలన్నింటిలోకి శ్రేష్టమయినదిగా పిలవబడే హిమవత్పర్వతం... దానికి రాజయిన హిమవంతుడికి కుమార్తె అయిన దానా... వరదే.. అంటే వరములిచ్చేది... ఇక్కడ ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరాలు కాదట. ఏ ఆనందాన్ని అనుభవించడం చేత అటువంటి సుఖం కలుగుతుందో అటువంటి ఆనందం కేవలం పరమేశ్వరుని పాదాలనుంచి స్రవించే అమృతంలో తప్ప మరొక దానిలో లేదు. అటువంటి పాదసేవ కోర్కెను తీర్చగలిగే తల్లి కనుక ‘వరదే’ అన్నారు. అంటే లౌకికమైన స్థితినుంచి అలౌకికమైన స్థితిని పెంచడానికి అవకాశమున్న భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిగా చేయగలిగిన దానివి. అందుకని .. వరదే.. అన్నారు. ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరం కాదు. ఆ వరానికి ‘కాదంబరి’ అన్న నామంతో సంబంధం ఉంది. ఈ కీర్తన గొప్పతనం ఎంతంటే.. .అది ప్రతిరోజూ విన్నంత మాత్రం చేత అద్భుతమైన వాక్శక్తినీ, వాఙ్మయ ధారను అమ్మవారు కటాక్షించ గలుగుతుంది. -
కొబ్బరి చిప్ప కావాలా, నాయనా?
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ అమ్మకాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. అయితే అమెజాన్‌లో బ్రాండెడ్ దుస్తులో, స్మార్ట్‌ఫోన్ అమ్మకాలో, ప్రముఖ ఎలక్ట్రానిక్ అమ్మకాలో కాదు.. అతి విలువైన పురాతన వస్తువులు అంతకన్నా కాదు. ఇప్పటివరకూ పిడకలు, గొబ్బెమ్మలు, రెడిమేడ్ పిడకలు కూడా అమెజాన్ ఆన్లైన్ స్టోర్లలో దర్శనమిచ్చాయి. తాజాగా కొబ్బరి చిప్ప కప్పు లిస్ట్‌లో కనిపించడం వింతగా కనిపించింది. నాచురల్ కోకోనట్ షెల్ కప్ పేరుతో దీన్ని అమ్మకానికి పెట్టింది. నెటిజన్ల వ్యంగస్త్రాలతో నాచురల్ కోకోనట్ షెల్ కప్ క్షణాల్లో వైరల్‌గా మారింది. నాచురల్ కోకోనట్ షెల్ కప్ ధర రూ.1289 నుంచి ప్రారంభం.. డిమాండ్ పెరిగితే రూ.2499 వరకూ అంటూ ఇది అమెజాన్‌లో కనిపించింది. పైగా 55 శాతం స్పెషల్ డిస్కౌంట్ తో రూ.1365 లకు (కొబ్బరిచిప్ప ధర రూ.3వేల) అందిస్తోందట. ఈ రేటుకు మంచి పవర్ బ్యాంకునో, లేదా బ్రాండెడ్ హెడ్సెట్ కొనొచ్చు. నోకియా ఫీచర్ ఫోన్ కూడా కొనొచ్చు. రెండు సోనీ హెడ్‌సెట్స్ కూడా వస్తాయంటూ ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. మా యింటి ద్గగర గుట్టల కొద్దీ కొబ్బరి చిప్పలు ఉన్నాయి, అమెజాన్‌కు అవి ఉచితం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. దీంతో ట్విటర్లో పెద్ద చర్చే మొదలైంది. ఈ నాచులర్ కోకోనట్ షెల్ కప్ స్పెసిఫికేషన్స్ చూసి తీరాల్సిందే. మరోవైపు ప్రస్తుతం ఈ కప్ అందుబాటులో లేదు అన్న సమాచారం అమెజాన్ సైట్లో కనిపిస్తోంది. Didn’t realise that my mundane #malluanguish tweet would create a ‘storm in a coconut 🥥 cup’. 😀https://t.co/BXu7JobzJm — Rema Rajeshwari IPS (@rama_rajeswari) January 16, 201 Dear @amazonIN, If u come to my house I will give u free coconut shell in loads! #Amazon #Bravo #MiddleClassWithModi pic.twitter.com/6R0iKF1Y5r — Abimanyu Karthick (@abimanyukarthik) January 15, 2019 2 ways to become a millionaire: * Supply kottanguchi to Amazon (🥥 Coconut shell) * Sell Idly in front of Apollo hospital 😜#Justmillionairethings — barath kumar (@barathkumar22) January 15, 2019 -
కేక్‌లో పలుకు చిలకలు...
ఫైలో : ఫైలో అనే పదానికి గ్రీకులో ‘ఆకు’ అని అర్థం. ఇది చాలా పల్చగా ఉంటుంది. పేస్ట్రీల తయారీలో ఫైలోను ఎక్కువగా ఉపయోగిస్తారు. బాల్కన్ క్విజీన్‌లో వీటి వాడకం ఎక్కువ. ఫైలో డఫ్‌ను మైదాపిండి, నీళ్లు, కొద్దిగా నూనె లేదా వైట్ వెనిగర్ ఉపయోగించి తయారుచేస్తారు. ఈ షీట్లను వరుసగా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ, ఆయిల్ లేదా బటర్‌తో బ్రషింగ్ చేసి, అప్పుడే పేస్ట్రీని బేక్ చేస్తారు. ఇంటి దగ్గర చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇందుకోసం పెద్ద పెద్ద రోలింగ్ షీట్లు, పెద్ద టేబుల్, పెద్ద చపాతీ కర్ర అవసరమవుతాయి. అలాగే రెండు పొరల మధ్య పొడి పిండి వేస్తూనే ఉండాలి. అందువల్ల వీటిని ఇంటి దగ్గర తయారు చేసుకోవడం కష్టం. ఫైలోలను చక్కగా తయారుచేసే యంత్రాన్ని 1970లో కనిపెట్టారు. ఇవి ఇప్పుడు సూపర్ మార్కెట్లో విస్తృతంగా దొరుకుతున్నాయి. వీటి తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రీమ్ ఆఫ్ టార్టార్: ఈ పేరు చూడగానే క్రీమ్ అనుకోకూడదు. ఇది పొడిపొడిగా ఉంటుంది. ద్రాక్ష పళ్లను పులియబెట్టి, తయారుచేసిన వైన్ నుంచి తయారయ్యే బైప్రోడక్ట్ ఇది. శాస్త్రీయంగా దీనిని పొటాషియం బైకార్బొనేట్ అంటారు. కోడిగుడ్లను గిలకొట్టేటప్పుడు ఈ పొడిని కొద్దిగా జత చేస్తే, మిశ్రమం బాగా నురుగులా, మెత్తగా వస్తుంది. షార్టెనింగ్: ఘనరూపంలో ఉన్న ఏదో ఒక ఫ్యాట్‌ని పేస్ట్రీలలో ఉపయోగిస్తారు. షార్టెనింగ్ అనే పదాన్ని మార్గరిన్కి దగ్గరగా ఉండే బటర్ పదానికి బదులుగా ఉపయోగిస్తారు. కొబ్బరి ఫ్లేక్స్: కొబ్బరిని సన్నగా ముక్కలుగా తురమాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ కొబ్బరి ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. స్వీటెన్డ్ ఫ్లేక్డ్ కోకోనట్ : సన్నగా తురిమిన కొబ్బరి ముక్కలకు కొద్దిగా పంచదార జతచేసి బాగా కలపాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. ఇవి సుమారు వారం రోజులు నిల్వ ఉంటాయి. ఇదీ కేకు చరిత్ర: కేక్ అనే పదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ పదం వికింగ్ దేశాలకు చెందిన పురాతన నార్స్ (స్కాండెనేవియా) పదం ‘కక’ నుంచి వచ్చింది. పురాతన గ్రీకులు కేక్‌ని ప్లకోస్ అని పిలిచేవారు. ఇది ఫ్లాట్ అనే పదం నుంచి పుట్టింది. కోడిగుడ్లు, పాలు, నట్స్, తేనెలను జత చేసి బేక్ చేసి తయారుచేసేవారు. గ్రీకులకు సతురా అనే ప్రత్యేకమైన కేక్ ఉండేది. అంటే ఫ్లాట్‌గా తయారుచేసిన హెవీ కేక్ అన్నమాట. రోమనుల కాలంలో ప్లాసెంటాను కేక్‌తో కలిపి బేక్ చేసేవారు. పేస్ట్రీల తయారీలో ఉపయోగించే వారు. వీరు మేకపాలను ఉపయోగించి చీజ్ తయారుచేసేవారు. పూర్వకాలంలో రోమన్లు బటర్, కోడిగుడ్లు, తేనె కలిపి బ్రెడ్ తయారీకి కావలసిన పిండిని తయారుచేసేవారు. ఇంగ్లండ్‌లో కూడా తొలినాళ్లలో బ్రెడ్‌నే కేక్‌గా ఉపయోగించుకునేవారు. స్పాంజ్కేకులు స్పెయిన్‌లో ప్రారంభమైనట్లు భావిస్తారు. కేకులు చాలా రకాలు ఉన్నాయి. బటర్ కేక్స్, స్పాంజ్ కేక్స్, చిఫాన్ కేక్స్, చాకొలేట్ కేక్స్, కాఫీ కేక్స్... -
ఇక్కడ కొబ్బరికాయ కొట్టరు!
భక్తులు భగవంతుని దర్శించుకునే ముందు ఆయా క్షేత్రాల్లో టెంకాయలను కొట్టడం ఆనవాయితీ, ఆచారంగా వస్తోంది, ఏ ఆలయంలో చూసినా భక్తులు తమ కోర్కెలు తీర్చమని భగవంతుని ప్రార్థిస్తూ టెంకాయలను కొడుతుంటారు. కానీ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్త క్షేత్రంలో మాత్రం టెంకాయలను కొట్టరు. చెట్టుకు తాడుతో కడతారు. ఇది ఆచారంగా వస్తోంది. భక్తులు తాము తలచిన కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ ఒక టెంకాయను తాడుతో దత్త క్షేత్రంలో ఉన్న ఔదుంబర వృక్షం (మేడిచెట్టు)కు వేలాడదీయడం ఆచారంగా కొనసాగుతోంది. సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారాల్లో లాభాలు తదితర కోర్కెలను తలచుకుంటూ భక్తులు టెంకాయని మేడిచెట్టుకు కట్టి దత్తాత్రేయునికి దణ్ణం పెట్టుకుంటారు. కోర్కెలు తీరితే ఆలయంలో పల్లకి సేవ, అభిషేకం, అన్నదానం, పారాయణం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామంటూ మొక్కుకుంటారు. తమ కోర్కెలు నెరవేరిన వెంటనే తిరిగి ఆలయానికి చేరుకుని మొక్కుబడులను తీర్చుకుంటారు. దాంతో ఈ మేడిచెట్టు ఎప్పుడు చూసినా కొబ్బరికాయలతో నిండి ఉంటుంది. చెట్టు నిండిపోతే ఆ కొబ్బరికాయలను తొలగించి వాటిని పవిత్రమైన గోదావరి కాలువలో నిమజ్ఞనం చేస్తుంటారు. ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాదవల్లభ జయంతి, దత్తాత్రేయ జయంతి తదితర ఉత్సవాల సమయంలో భక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో విచ్చేస్తుంటారు. ఆయా ఉత్సవాల సమయంలో ఎక్కువమంది భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని అధికసంఖ్యలో కొబ్బరికాయలు కట్టడంతో రోజుకు రెండుసార్లయినా చెట్టునిండా కొబ్బరి కాయలు నిండిపోతుంటాయి. ఈ చెట్టుకు కట్టిన కొబ్బరికాయలను ఏ విధమైన అవసరాలకు ఉపయోగించకుండా పవిత్రమైన గోదావరి జలాల్లో నిమజ్ఞనం చేయడం విశేషం. పాదగయ క్షేత్రంలోనూ... పిఠాపురం పాదగయ శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానంలో వేంచేసియున్న దత్తాత్రేయుని ఆలయంలోనూ కొబ్బరి కాయలు కొట్టకుండా అక్కడ ఉండే మేడిచెట్టుకు కట్టడం ఆచారంగా వస్తోంది. భక్తులు తమ మనసులో కోర్కెలు కోరుకుని కొబ్బరి కాయను మేడి చెట్టుకు కడతారు. అందుకే పాదగయ క్షేత్రంలో వెలసియున్న దత్తాత్రేయుడి గుడి వద్ద ఉన్న మేడిచెట్టు కొబ్బరి కాయలతో నిండిపోయి మేడి చెట్టు కాస్తా కొబ్బరి చెట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి ఆచారం దత్త క్షేత్రాల్లో మాత్రమే ఉంది. భక్తులు కట్టిన కొబ్బరి కాయలను పవిత్రంగా భావించి వాటిని ఏవిధమైన అవసరాలకు ఉపయోగించకుండా పవిత్రజలాలలో నిమజ్జనం చేస్తుంటారు. ఇలా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేసిన కొబ్బరికాయలను భక్తులు పవిత్ర ప్రసాదంగా భావిస్తుంటారు. ఎవరికైనా నీటిలో దొరికితే దానిని స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారు. నీటిలో ఉండడం వల్ల కాయలు మొలకలు వస్తే వాటిని దేవుడి వరంగా బావించి తమ ఇళ్ల వద్ద నాటుకుంటారు. శ్రీపాద వల్లభుడి ప్రతిరూపంగా పెంచుకుంటారు. ఇది ప్రాచీన ఆచారం పూర్వం ఒక భక్తురాలు తన మనసులో కోరిక కోరుకుని కొబ్బరికాయ కొట్టడానికి వీలు లేక అక్కడే ఉన్న ఔదంబరి చెట్టు దగ్గర పెట్టి వెళ్లిపోయి ఆమె కోరిక నెరవేరాక మళ్లీ తిరిగి వచ్చి చూడగా కొబ్బరి కాయ అక్కడే ఉండడంతో స్వామివారు ఆ కొబ్బరికాయను చూసి తమ కోర్కెలు తీర్చారని ఆమె చెప్పిందని, ఆ తర్వాత మరల అలాగే చేసిందని, అప్పుడు కూడా ఆమె కోరిక తీరడంతో అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోందని పూర్వీకులు చెబుతారు. – నాగభట్ల జానకీరామశర్మ, ఆలయ అర్చకులు, శ్రీ పాదశ్రీవల్లభ మహాసంస్థానం, పిఠాపురం. – వీఎస్‌వీఎస్ వరప్రసాద్ సాక్షి, పిఠాపురం, తూ.గో. జిల్లా -
నిలిచిన కొబ్బరి వర్తకం
సాక్షి, పాలకొల్లు అర్బన్(పశ్చిమగోదావరి జిల్లా): కొబ్బరి వర్తకులు ఈ పర్మిట్ తో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని జీఓ జారీ చేయడంతో జూలై 1 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి వర్తకం పూర్తిగా స్తంభించిపోయింది. రోజు వారీ జరిగే సుమారు రూ.3 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగా 30 వేల కుటుంబాలకు ఉపాధి కరువయ్యింది. ఎగుమతి, దిగుమతి, ఒలుపు, దింపు కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ పర్మిట్ అంటే.. ప్రతి వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ప్రతి 15 రోజులకో, లేదా నెలాఖరుకో వ్యాపార లావాదేవీలను బట్టి వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పన్ను చెల్లించేవారు. అయితే గత నెల జూన్ 1 నుంచి ఈ పర్మిట్ ద్వారా పన్ను చెల్లించాలని జీఓ జారీ చేశారు. దీంతో వర్తకులు ఆందోళనకు దిగడంతో కొంత వెసులుబాటు కల్పించారు. అయితే అదే జీఓను ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించుకోవడంతో కొబ్బరి వర్తకులు జూలై 1 నుంచి వ్యాపార లావాదేవీలు నిలిపి వేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఈ పర్మిట్ విధానం ప్రకారం వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ఏ రోజు పన్నును ఆ రోజే ఈ పర్మిట్ విధానంలో చెల్లించాలి. ఇది వర్తకులకు సాధ్యం కాదంటున్నారు. గుమస్తాలకు ఆన్లైన్లో పన్ను చెల్లించడం వీలు కాదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరి కాయలను ఎగుమతి చేసుకునే సరికి అర్థరాత్రి అవుతుంది. ఆ సమయంలో నెట్ సౌకర్యం అందుబాటులో ఉండదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సిగ్నల్స్ కూడా సరిగా పని చేయవంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్లో పన్నులు ఏవిధంగా చెల్లిస్తామని కొబ్బరి వర్తకులు ప్రశ్నిస్తున్నారు. ధర పడిపోతుందని ఆందోళన కొబ్బరి వర్తకులు సమ్మె కారణంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి నిలిచిపోవడంతో కేరళ రాష్ట్రం నుంచి ఎగుమతులు ఊపందుకుంటాయి. దీంతో సమ్మె విరమించినా కొబ్బరి ధర పడిపోతుందని రైతులు, వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 కోట్ల కొబ్బరి కాయలు ఎగుమతి ఉభయ గోదావరి జిల్లా నుంచి ప్రతి రోజు సుమారు 40 కోట్ల కొబ్బరి కాయలు మహారాష్ట్ర, ముంబై, పుణే, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీని ద్వారా రోజువారీ రూ.3 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 200 మంది కొబ్బరి వర్తకులున్నారు. రోజుకు 100 లారీల కొబ్బరి కాయలు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. లారీకి మూడు నుంచి 5 లక్షలు కొబ్బరి కాయలు ఎగుమతి చేస్తే సుమారు 40 కోట్లు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉపాధి కరువైన ఒలుపు, దింపు కార్మికులు కొబ్బరి వర్తకం ప్రధానంగా ఒలుపు, దింపు, హమాలీలు (ఎగుమతి కూలీలు), గుమస్తాలపై ఆధారపడుతుంది. ప్రస్తుతం గత వారం రోజుల నుంచి వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 30వేల మంది కుటుంబాలకు ఉపాధి కరువైంది. దీంతో గత వారం రోజుల నుంచి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఏ రోజు కారోజు పని చేసుకుని ఉపాధి పొందే కూలీలకు పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఉపాధి లేక ఇబ్బందులు ప్రభుత్వం వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలి. ఈ పర్మిట్ వల్ల ఇబ్బందులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ చెల్లింపులు కష్టం. అంతే కాకుండా గుమస్తాలకు అవగాహన తక్కువ. దాదాపు 30 ఏళ్ల నుంచి ఒక షాపులో గుమస్తాగా పనిచేస్తున్నా. కొబ్బరి కాయ నాణ్యతను పరిశీలించి రైతుల నుంచి కొనుగోలు చేస్తాం. – కాపిశెట్టి కృష్ణ, గుమస్తా గుదిబండగా మారింది ఒలుపు, దింపు కార్మికులకు ఉపాధి కరువైంది. ఏ రోజు కారోజు పనిచేసుకుని ఉపాధి పొందే ఒలుపు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ గుదిబండగా మారింది. కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకుని ప్రభుత్వం ఆ జీఓను వెనక్కి తీసుకోవాలి. – దూలం భాస్కరరావు, ఒలుపు కార్మికుడు -
కోనసీమలో మారని కొబ్బరి రైతుల తలరాతలు
-
కొబ్బరి ఐస్‌క్రీమ్
కొబ్బరి ఐస్‌క్రీమ్ అంటే సరదాగా ఉంది కదూ. మనకు కోన్ ఐస్‌క్రీమ్, బాల్ ఐస్ క్రీమ్‌లాంటివి తెలుసు. కొబ్బరి ఐస్‌క్రీమ్ అంటే ఏమిటో తెలీదు కదా. బెంగళూరులోని వెంకట రమణ దేవాలయం దగ్గర, సీతారామ కావత్ అనే 60 సంవత్సరాల వ్యక్తి కనిపెట్టిన కొత్త రకం ఐస్ క్రీమ్ ఇది. ఆయన దగ్గర మంగళూరు కొబ్బరిబొండాలు తాగిన తరవాత, ఆ బొండాన్ని మధ్యకు చీల్చి, లేత కొబ్బరిని ఒకే దానిలోకి తీసి, అందులో మనకు కావలసిన ఫ్లేవర్ ఐస్‌క్రీమ్, (వెనిలా, స్ట్రాబెర్రీ, బటర్‌స్కాచ్) రకరకాల పండ్ల (అరటి, ద్రాక్ష, దానిమ్మ, పైనాపిల్) ముక్కలు వేసి మళ్లీ పైన కొద్దిగా ఐస్‌క్రీమ్ వేసి, ఆప్యాయంగా అందిస్తాడు. ఇది ఆయనే కనిపెట్టాడు. ఈ ఐస్‌క్రీమ్ ఖరీదు, అరవై రూపాయలు మాత్రమే. -
ఎలుకల నష్టం అపారం
అమలాపురం: కొబ్బరి, కోకో తోటల్లో ఎలుకలు చేసే నష్టం అంతా ఇంతా కాదని, వీటిని సకాలంలో గుర్తించి తగు చర్యలు తీసుకోకుంటే రైతులు భారీగా నష్టపోతారని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ బి.నరేష్, డాక్టర్ పి.శక్తివేల్ తెలిపారు. అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో కొబ్బరి, కోకో తోటల్లో ఎలుకలు నివారణ, బిందు సేద్యంపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఏడీహెచ్ సిహెచ్.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ దేశం మొత్తం మీద 104 ఎలుక జాతులు ఉన్నాయని, వీటిలో 14 జాతులు వ్యవసాయ, ఉద్యాన పంటలను నష్టపురుస్తాయని, దీనిలో నాలుగు జాతులు అత్యంత తీవ్ర నష్టం చేస్తాయని వారు తెలిపారు. ఎలుకల పళ్లు రోజుకు 0.04ఎంఎం ఎదుగుతాయని, దాని వలన వాటిని నియంత్రించడానికి ఎదురు వచ్చినవాటిని కొరికిపడేస్తాయని తెలిపారు. వరి రైతులు 96:2:2 పాళ్లలో నూకలు/ ఏదైనా ఎర:నూనె:విషం (బ్రోమోడయోలిన్) కలిపి బొరియల్లో వేయాలన్నారు. కొబ్బరి తోటల్లో సైతం ఇదే విధానంలో మందును తయారు చేసి చెట్టు మొవ్వు వద్ద ఉంచాలన్నారు. కోకోలో విషం కలిపిన పొట్లాలను ఏదైనా గొట్టం లేదా వెదురు బొంగులలో ఉంచడం వల్ల ఇతర జంతువులకు హాని తప్పించే అవకాశముందని శాస్త్రవేత్తలు నరేష్, శక్తివేల్ తెలిపారు. ఏపీ ఎంఐపీ పీడీ ఎస్.రామమోహన్ మాట్లాడుతూ చుట్టూ గోదావరి ఉన్నంత మాత్రాన బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) అవసరం లేదన్నట్టు రైతులు అనుకోవడం మంచిది కాదని, ఇక్కడ తప్పనిసరిగా బిందు సేద్యాన్ని వినియోగించాల్సి ఉందన్నారు. బిందు సేద్యం ప్రోత్సాహానికి ప్రభుత్వం భారీగా రాయితీలందిస్తోందన్నారు. ఐదు ఎకరాలలోపు ఓసీ, బీసీ రైతులకు 90 శాతం, 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు 70 శాతం, 10 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదు ఎకరాల లోపు 100 శాతం, 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులకు 70 శాతం, 10 ఎకరాల పైబడి ఉన్న రైతులకు 50 శాతం రాయితీ అందిస్తోందని ఆయన వివరించారు. తుంపర్లకు 2 అంగుళాల నుంచి 4 అంగులాల పైపులు వరకు 50 శాతం రాయితీ అందిస్తామన్నారు. బిందు సేద్యం వల్ల ఎరువులు ఆదా చేయడంతో పాటు దిగుబడి 10 శాతం వరకు పెరుగుతుందని ఆయన వివరించారు. ఉద్యానశాఖ ఏవోలు, ఎంపీఈవోలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చిటికెలో కూల్ కొబ్బరినీళ్లు
ఖమ్మంమామిళ్లగూడెం: పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చిటికెలో కూల్ కొబ్బరి నీళ్లు అందించడం పట్ల ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆశ్చర్యపోయారు. వైరారోడ్‌లోని తేజస్వి వైద్యశాల ఎదుట యలమందల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు యలమందల ప్రభాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన కోకోనట్ చిల్లర్‌ను ఎమ్మెల్యే సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కనిపించని ఈ కోకోనట్ చిల్లర్‌ను ఖమ్మానికి పరిచయడం చేయడం శుభపరిణామమన్నారు. డాక్టర్ గంగరాజు సారథ్యంలో ఇలాంటివి మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బత్తుల మురళి, కమర్తపు మురళి, డాక్టర్ గంగరాజు, నాగరాజు, లాల్‌జాన్‌పాషా, శేఖర్కమ్మల, వసంతరావు, కిరణ్ పాల్గొన్నారు. -
కొబ్బరి బోండాం కొనివ్వలేదని మహిళ ఆత్మహత్య
సాక్షి, చెన్నై: ఆధునిక సమాజంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరిలోనూ మానసిక బలహీనత పెరుగుతోంది. చిన్న చిన్న విషయాలకు ఒత్తిడి, మనో వేదనకు లోనవుతున్నారు. ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఇలాంటి చిన్న విషయానికి మనోవేదనకు గురై ఓ మహిళ నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. చెన్నై అంబత్తూరు, రామ్‌నగర్ జవహర్ వీధికి చెందిన ప్రభు కంటైనర్ల వాహనాన్ని అద్దెకు ఇస్తుంటాడు. ప్రభుకు లత(26)తో ఆరేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి కాపురం ఎంతో ఆనందకరంగా సాగుతోంది. బు«ధవారం లత తనకు కొబ్బరి బోండం కొనివ్వాలని ప్రభును కోరింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సమయంలో ప్రభు కొబ్బరి బొండం తీసుకు రాకపోవడంతో లత తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ విషయంగా భర్తను నిలదీయడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భర్తతో వాగ్వాదం అనంతరం లత తీవ్ర మనో వేదనలో పడింది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అంబత్తూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లత మృతదేహాన్ని శవ పంచనామాకు పంపించారు. లత మరణం వెనుక కొబ్బరి బొండం వివాదం ఉందని కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు పేర్కొన్నా, వివాహమైన ఆరేళ్లే అవుతుండడంతో వరకట్న వేధిపులు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులతో పాటు అంబత్తూరు ఆర్డీఓ విచారణ చేస్తున్నారు. -
కోనసీమ కొబ్బరికాయలకు పెరిగిన డిమాండ్
-
తోటలోని మొనగాళ్లు
♦ కొబ్బరి కాయల వెనుక అంతులేని శ్రమ ♦ దింపుడు నుంచి విక్రయం వరకు సాహసాలే ♦ కొబ్బరి కార్మికులకు అందని ప్రభుత్వ సాయం కళ్లకు ఇంపుగా కనిపించే కొబ్బరి వెనుక కనిపించని సాహస గాథలకు కథానాయకులు ఉన్నారు. చెట్టు ఎక్కడం, ఒడుపుగా కాయ దింపడం, వాటిని పద్ధతిగా ఒలవడం, చక్కగా బండి కట్టడం వంటి పనులకు కేరాఫ్ వారు. ఈ పనులు బయట ప్రపంచానికి అంతగా తెలీవు. దాదాపు ప్రతి పనిలోనూ అపాయం దాగి ఉంటుంది. ఆ అపాయమే తమ ఉపాధి మార్గమని వారు చెబుతుంటారు. చెట్టెక్కి కాయలు దింపే పద్ధతి నుంచి దొనికత్తి జమానా వరకు కొబ్బరి కార్మికుల పనితనం చాలా ప్రత్యేకం. కొందరు సన్నకారు రైతులు కూడా ఇక్కడ కార్మికులు కావడం విశేషం. దేవుడి గుడి మొదలుకుని ఇంటిలో వేడుకల వరకు అన్నింటా కొబ్బరిదే అగ్ర తాంబూలం. అందుకే కొబ్బరి తోటలోని మొనగాళ్ల గురించి తెలుసుకుందాం. కవిటి ఉద్దానం.. రాష్ట్రంలో కోనసీమ తర్వాత కొబ్బరి అంటే గుర్తుకువచ్చేది ఈ ప్రాంతమే. కొబ్బరికి పెట్టింది పేరైన ఈ ఊళ్లలో శ్రమ జీవులకు కొదవలేదు. కొబ్బరి రైతు తన కుటుంబ పోషణకు ప్రతి రెండు నెలలకోసారి కొబ్బరి కాయలను దింపుతారు. రైతులు వ్యక్తిగతంగా తోటలపై శ్రద్ధ తీసుకున్నా కాయలు చెట్టు నుంచి తీసే వారు మాత్రం వేరే ఉంటారు. వారే కొబ్బరి కార్మికులు. కొందరు సన్నకారు రైతులు కూడా కార్మికుల్లో భాగమే. అసంఘటిత రంగ కార్మి కుల్లా వీరు దశాబ్దాల తరబడి తోటల్లో పనులు చేస్తున్నారు. అయితే వీరిని గుర్తించిన వారు మా త్రం ఎవరూ లేరు. ఒలుపు కార్మికులూ భాగస్వాములే.. కొబ్బరి నేలపైకి దించే ప్రక్రియ ముగిసిన తర్వాత కచ్చితంగా డొక్క తీయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ఒలుపు చేసే కార్మికులు ఈ పనిలోనే ఉంటారు. కంచిలి ప్రధాన కేంద్రంగా ఉంటున్న కొబ్బరి మార్కెట్లో ఉత్తరాది రాష్ట్రాలకు రోజుకు 15 లారీల కొబ్బరికాయలు(ఒలిచిన కాయలు) ఎగుమతి అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అంతమొత్తంలో ఒకేసారి ఒలుపు చేయాలంటే కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన నిపుణులైన ఒలుపు కార్మికులకే సాధ్యం. దీనికి చాలా శారీరక ధృడత్వంతో పాటు సహనం కూడా అవసరమే. వంద పణాలు(8000 కొబ్బరికాయలు) ఒలిచేందుకు సగటున రోజుకు పదిపణాలు వలిచే సామర్థ్యం కలి గిన వారు పది మంది అవసరం. ఒక లారీ లోడు సామర్థ్యం అంటే పెద్ద చిన్న పరిమాణాల్లో ఉన్న సుమారు 12,000 కాయలు ఒలుపు చేయాలి. 15 లారీ లోడులు అంటే 1.80లక్షల కాయ ఎగుమతి చేయాలి. ఇంత పెద్దమొత్తంలో ఒలుపు చేయాలంటే అదే స్థాయిలో అధిక సంఖ్యలో కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రతీ రోజు కవిటి మండలం నుంచి పొరుగు రాష్ట్రం ఒడిశాకు నిత్యం 10 నుంచి 15 మినీ లారీలు, మేజిక్ ఆటోల్లో సరుకు అమ్మకాలు కూడా జరుగుతుంటాయి. దీంతో వీరికి దాదాపు నెలకు పది రోజులు మినహా అన్ని రోజులూ పని ఉంటుంది. అయితే వీరి కూలి డబ్బులు కొబ్బరి కొన్న వ్యాపారి భరించడు. రైతే భరించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూలి డబ్బుల విషయంలో దాదాపు రైతులు కొంచెం బాధగానే కనిపిస్తూ ఉంటారు. తమకు వచ్చే కొద్ది లాభాలు కూలికి సరిపోతాయని చాలా మంది చెబుతుంటారు. అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న కొబ్బరి కాయలు తీసే కార్మికులకు, ఒలుపు చేసే కార్మికులకు కార్మికశాఖ ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. సాహసమే.. ఒకప్పుడు కొబ్బరి కాయలు దింపడం అంటే ప్రాణాలతో చెలగాటమే అనేవారు. డబ్బై, ఎనభై అడుగులు ఎత్తున్న కొబ్బరి చెట్లు అలవోకగా ఎక్కి దింపేవారు. ప్రస్తుతం ఆ తరహా కార్మికులు తక్కువైపోయారు. ప్రస్తుతం దొనికత్తి (పొడవాటి వెదురుకర్ర చివరన కత్తిని కట్టిన పరికరం) వినియోగించి నేలమీద నుంచే కాయలు తీస్తున్నారు. ఈ పని కూడా అంత సులువు కా దు. ఒడుపుగా తీయకపోతే ఒంటికే ప్రమాదం. అయితే పాతతరం కార్మికులు ఇప్పటికీ తోటలో సాధ్యమైనంత వరకు పనులు చక్కబెడుతూ కనిపిస్తుంటారు. దొనికత్తే మేలే కానీ.. దొనికత్తితో కాయలు తీసే విధానంలో వేగంగా కాయలు తీసే సౌలభ్యం ఉంటుంది. కానీ చెట్టు మొవ్వులో దట్టంగా గు బురుగా అల్లుకున్న కొబ్బరిపీచు, కొబ్బరిపాలలను తీసే అవకాశం, ఎండు కొమ్మలు, విరిగిన కమ్మలను తీయడం వీలుపడదు. దీంతో చెట్టు పరిశుభ్రత తగ్గి వ్యాధులు ప్రబలుతాయి. కార్మికులే పైకి ఎక్కితే పైన పేర్కొన్న పనులను చూడగలరు. అయితే ప్రత్యామ్నాయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో దొనికత్తి వాడకానికే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. కూలి బాగున్నా.. ఉదయం ఏడు గంటలకు వెళ్లి రెండు గంటల వ్యవధిలో కొబ్బరికాయలను తీస్తే రెండు వందల రూపాయల కూలి వస్తుంది. అయితే ఈ మొత్తం కొందరు సన్నకారు రైతులకు భారంగా తోస్తోంది. కొంత మంది పెద్ద రైతులు కాంట్రాక్ట్ పద్ధతిలో వారి కొబ్బరి తోటలన్నీ పూర్తిగా దింపు చేస్తే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మొత్తాన్ని ఇచ్చుకుంటున్నారు. ఇం కొందరు రైతులు తమ తోటల్లో తీసే కొబ్బరికాయలకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్మికుడికి 8 పుంజీలు(32కాయలు) ఇస్తారు. వారసత్వం మా తాత తండ్రుల నుంచి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి రైతుల వద్ద కొబ్బరి కాయలు ఒలుపు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. శరీరంలో సత్తువ ఉన్నంత వరకు ఈ పనే చేస్తాను. – గయా మధు, కొబ్బరి ఒలుపు కార్మికుడు, కవిటి ఆదాయ వనరు నేను ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాను. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఖాళీ సమయంలో కొబ్బరి కాయలు ఒలుపు చేసేందుకు వెళ్తుంటాను. ఓ నాలుగు ఐదు పణాలు ఒలిస్తే రెండు వందల వరకు వస్తుంది. – ఎ.ఈశ్వరరావు, ఆటో డ్రైవర్, కవిటి చిన్నప్పటి నుంచే.. నేను చిన్నతనం నుంచే కొబ్బరి చెట్టు ఎక్కడం నేర్చుకున్నాను. ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తూ మిగతా సందర్భాలో కాయలు తీసేందుకు వెళ్తాను. రైతు బాగుంటే మా జీవితాలు బాగుంటాయి.– వై.రుద్రయ్య, కొబ్బరిచెట్టు కాయలు తీసే కార్మికుడు, గడపుట్టుగ పెట్టుబడులు ఉంటాయి కొబ్బరి కాయలు తీసే కత్తులు గానీ, దొనికత్తిగానీ, వెదురుకర్ర గానీ పాడైతే వాటిని మళ్లీ కొనుక్కోవాలి. గతంలో తక్కువకే ఇవి దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర బాగా పెరిగింది. – మరిడి ఉమాపతి, గొండ్యాలపుట్టుగ, కొబ్బరి కార్మికుడు -
ధర రాక... దరి లేక..
►అంతరాష్ట్రీయంగా డిమాండ్ ►ఒడిదుడుకుల్లో కొబ్బరి రైతు తగ్గిపోతున్న తోటల విస్తీర్ణం ►గిట్టుబాటు కాని ధరలు కాయకు రూ.3 నుంచి రూ.5లు ►మార్కెట్లో మాత్రం అధిక రేటు విదేశాలకూ ఎగుమతులు ►కొత్తగా జీఎస్టీ తలపోటు నరసాపురం: జిల్లా పేరు చెపితే వరి తరువాత గుర్తుకు వచ్చేది కొబ్బరి. దేశంలో కేరళ తరువాత ఎక్కువ స్థాయిలో కొబ్బరి ఎగుమతులు సాగించేది మన రాష్ట్రమే. రాష్ట్రంలో కూడా గోదావరి జిల్లాల నుంచే కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా సాగుతుంటాయి. ఇందులో మన జిల్లా స్థానం ప్రత్యేకమైనది. కొడుకును నమ్ముకునే బదులు ఓ కొబ్బరి చెట్టును పెంచుకుంటే మేలనే నానుడి జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది. కొబ్బరి చెట్టు ఆర్ధికంగా ఆసరాగా ఉంటుందనే భరోసా అందరిలో ఉంటుంది. అలాంటి కొబ్బరి పరిశ్రమ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో పడింది. బయట మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ. 15లు నుంచి రూ. 20లు వరకూ కొబ్బరి కాయధర పలుకుతోంది. అదే రైతుకు మాత్రం రూ. 3 నుంచి రూ. 5లు వరకూ మాత్రమే దక్కుతోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రైతుకు మరో అర్ధ రూపాయో, రూపాయో పెరుగుతుంది అంతే. కేవలం రైతులే కాదు కొబ్బరి దింపు, వలుపు, లారీల్లోకి, ట్రాక్టర్లలోకి ఎగుమతి, దిగుమతి.. ఇలా జిల్లాలో కొబ్బరి పరిశ్రమపై ఆధాపరడి వేల కుటంబాలు జీవిస్తున్నాయి. ఇంకోవైపు జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం ప్రతీ ఏటా తగ్గుతోంది. చెరువుల సాగు పెరగడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ కొబ్బరి ఎగుమతులపై ఎలాంటి పన్నులు లేవు. అయితే కొత్తగా జీఎస్టీ పరిధిలోకి కొబ్బరిని పరోక్షంగా తీసుకొచ్చారు. దీంతో జిల్లాలో కొబ్బరి ఎగుమతులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి కూడా. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో కొబ్బరిసాగు, పరిశ్రమ కూడా సంక్షభంలోకి వెళుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. డిమాండ్ ఫుల్.. రైతుకు నిల్.. జిల్లాలో పాలకొల్లు కేంద్రంగా కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి విస్తృతంగా సాగుతుంది. రోజుకు 50 లారీలు తక్కువ కాకుండా ప్రతీరోజూ ఎగుమతి అవుతుంటాయి. అంటే జిల్లా నుంచి రోజుకు రూ. 1 కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకూ కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి జరుగుతుంది. జార్ఖండ్, హర్యానా, చత్తీస్గడ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఉత్తర భారతదేశంలోని 14 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతాయి. కోఫ్రా (పైచెక్క తొలగించిన కురిడి), ఇడిబుల్ కోఫ్రా (ఆయిల్‌కు వినియోగించే విధంగా ముక్కలు చేసినవి), కోఫ్రా స్లైస్ (తరుము) రింగ్స్అండ్స్లైసెస్ (కురిడికాయను చిన్నచిన్న ముక్కలుగా చేసినవి) విదేశాలకు ఎగుమతి అవుతాయి. కొబ్బరికి ఇంత డిమాండ్ ఉంది. అయితే కొబ్బరి రైతులకు డిమాండ్‌కు అనుగుణంగా ధర దక్కడం లేదు. గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో కాయ ధర రూ. 15లు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల్లో అయితే రూ. 20లు నుంచి రూ. 25లు వరకూ ఉంది. ఇక్కడి రైతుకు రూ. 5లు మాత్రమే దక్కుతుంది. రైతు వద్ద తీసుకున్న కాయ బయట ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగురెట్లు పలుకుతుందన్నమాట. ప్రస్తుతం జాతీయంగా కొబ్బరికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కాయ ఒక్కింటికి రైతుకు రూ. 5ల నుంచి రూ. 7లు వరకూ సైజును బట్టి ముట్టజెపుతున్నారు. కొబ్బరి బొండాలదీ ఇదే పరిస్థితి. రైతులు చాలా కాలంగా దారుణంగా నష్టపోతున్నారు. జిల్లాలో తగ్గుతున్న విస్తీర్ణం.. జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వాసాగు పెరగడంతో భూములు అన్నీ చెరువులుగా మారడం ఒక కారణమైతే, కొత్తగా కొబ్బరిసాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో 22 మండలాల్లో కొబ్బరిసాగు విస్తృతంగా సాగుతోంది. నరసాపురం, పాలకొల్లు, ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో విపరీతంగా సాగవుతోంది. కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, పెదవేగి, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, భీమడోలు, నల్లజర్ల మండలాల్లో కూడా సాగు ఎక్కువగా ఉంది. డెల్టాలో అయితే చేను గట్ల మధ్య కొబ్బరి మొక్కలు పెంచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. మెట్టలో మాత్రం తోటల పెంపకం ఎక్కువగా జరుగుతుంది. డెల్టాలో చెరువులు ఎక్కువగా తవ్వుతుండటంతో కొబ్బరి చెట్లను భారీగా నరికి వేస్తున్నారు. తుఫాన్ల ప్రభావంతో చెట్లు పడిపోవడం, కొత్తగా కొబ్బరి మొక్కలు నాటక పోవడం కూడా జరుగుతోంది. దీంతో విస్తీర్ణం తగ్గిపోతోంది. జిల్లాలో ప్రస్తుతం 98 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. చెరువుగట్లపైనా, రోడ్ల పక్కనా ఉన్నవాటితో కలుపుకుని. పదేళ్ల క్రితం అయితే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరితోటలు ఉండేవి. చెరువుల తవ్వకాలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో 20వేల ఎకరాలుపైనే కొబ్బరి చెట్లు మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు అన్నం పెట్టడమే కాకుండా కొబ్బరి పరిశ్రమ జిల్లాలో వేల మందికి ఉపాధి చూపిస్తోంది. కొబ్బరి ఎగుమతులకు సంబంధించి ఒలుపు, లోడింగ్, ట్రాన్స్పోర్ట్, వ్యాపారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రంగంపై జిల్లాలో 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొబ్బరి సాగు సంక్షోభంలోకి వెళితే వీరందరకీ గడ్డు పరిస్థితి తప్పదు. జీఎస్టీ తలపోటు... కొత్తగా జీఎస్టీ తలనొప్పి కొబ్బరి ఎగుమతులకు పట్టుకుంది. ప్రస్తుతం కొబ్బరి ఎగుమతులకు ఎలాంటి వాణిజ్య పన్నులు లేవు. ప్రస్తుతం జీఎస్టీలోకి కొబ్బరి ఎగుమతులను ప్రత్యక్షంగా చేర్చనప్పటికీ, పరోక్షంగా భారం వేశారు. కొబ్బరిలోడు లారీ ఎగుమతికి సంబంధించి హమాలీ లోడింగ్ చార్జీలు, గన్నీ సంచుల చార్జీలు, దళారీ కమీషన్, లారీ కిరాయి వీటన్నిటినీ ఎగుమతి దారులు బిల్లులో పొందు పరుస్తారు. వీటికి సర్వీస్టాక్స్ నిమిత్తం ఇప్పుడు జీఎస్టీలో 18శాతం విధించారు. అంటే ఒకలారీ లోడుకు అదనంగా ఇప్పుడు జీఎస్టీ క్రింద రూ. 20 నుంచి రూ 25వేల వరకూ ఖర్చవుతుంది. దీంతో ఎగుమతి దారులు గత 10 రోజులుగా ఎగుమతులు నిలిపివేశారు. మొత్తంగా రెండు రోజుల నుంచి ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే జీఎస్టీ విధానంలో స్పష్టతలేక పోవడంతో ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. రూ. 5లు మించి ధర ఉండదు చిలకా సత్యనారాయణ, మర్రితిప్ప, నరసాపురం మండలం, కొబ్బరి రైతు కొబ్బరి పువ్వు నుంచి కాయగా మారడానికి 40 రోజులు పడుతుంది. చెట్టును పెంచాలంటే పదేళ్లు పైనే పడుతుంది. కాయకి ప్రస్తుతం రూ. 5లు ఇచ్చి మా దగ్గర కొంటున్నారు. మేమే ఏదైనా గుడి దగ్గర కాయ కొనుక్కోవాలంటే రూ. 15లు పెట్టాలి. మాకు ఎప్పుడూ రూ. 5లు, రూ. 6లు మించి ఇవ్వరు. ధరలేని రోజుల్లో అయితే కాయ ఓ రూపాయి, రాపాయిన్నరకు కూడా కొంటారు. ఎరువులు అవీ వేసి పెంచే పని లేదు కాబట్టి , ఏదో అలా వెళ్లిపోతుంది. మా పరిస్థితి మాత్రం దారుణం. కొబ్బరి చెట్ల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి ప్రాంతాల నుంచి గతంలో వచ్చినంత దిగుబడి రావడం లేదు. గత మూడేళ్లలో అయితే మరీ దారుణంగా ఉంది. చెట్ల సంఖ్య తగ్గిపోవడమే కారణం. చేల గట్ల మధ్య ఇక్కడ ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉండేవి. ఇప్పుడు చెరువులు తవ్వేస్తున్నారు. మొగల్తూరు లాంటి ప్రాంతాల్లో తోటలు కూడా తవ్వేసి చెరువులు చేసేస్తున్నారు. 20 ఏళ్లుగా కొబ్బరి వలుపు పని చేస్తున్నాను. ఇప్పుడు 100 కాయలు ఒలిస్తే రూ. 70లు ఇస్తున్నారు. ఈ మధ్యనే కూలి పెరిగింది. మొన్నటి వరకూ కాయకు అర్ధ రూపాయి ఇచ్చేవారు. కాపుబాగా కాస్తే మాకు పని ఉంటుంది. ధరలేక పోయినా, ఎగుమతులు లేక పోయినా పని ఉండదు. ఈ పని చేసేవాళ్లం మరో పని చేయలేము. కొబ్బరి ఎగుమతులపై గతంలో వాణిజ్య పన్నులు ఉండేవి. అయితే 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రద్దు చేశారు. ప్రస్తుతం ఎలాంటి పన్నులు లేవు. అయితే కిరాయి, హమాలి చార్జీలు వాటిపై 18శాతం జీఎస్టీ ఉందని అంటున్నారు. కొంతమంది లేదంటున్నారు. ఈ విషయంలో స్పష్టతలేదు. అందుకే కొన్ని రోజులు ఎగుమతులు కూడా నిలిపివేశారు. కొబ్బరి ఎగుమతులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదు. -
కొబ్బరి ‘ధర’హాసం
వెయ్యి పచ్చికాయల ధర రూ.8,200 మరింత పెరిగే అవకాశం తగ్గిన దిగుబడి..పెరిగిన ఎగుమతులు అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం) : దిగుబడి తగ్గడం...శ్రావణమాస నిల్వ పోతలు ఆరంభం కావడంతో కొబ్బరికాయ ధర అనూహ్యంగా పెరిగింది. వారం రోజుల వ్యవధిలో వెయ్యికాయల ధర రూ.6,500ల నుంచి రూ.8,200కు చేరింది. పచ్చికాయతోపాటు ముక్కుడు కాయ ధర కూడా పెరగడం సహజంగా రైతులకు సంతోషాన్ని నింపాలి. కానీ ఇదే సమయంలో వేసవి ఎండల కారణంగా పిందెలు రాలి.. దిగుబడి తగ్గడం వల్ల పెరిగిన ధర రైతులకు పెద్దగా ఊరటనివ్వడం లేదు. రాష్ట్రంలో కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేట మార్కెట్లో పచ్చికాయ కొబ్బరి ధర గడిచిన వారం రోజులుగా పెరుగుతూ వస్తోంది. తాజాగా పచ్చికాయ వెయ్యికాయల ధర రూ.8,200ల వరకు పెరుగుతోంది. గోదావరి లంకకాయ ధర రూ.8,500లు పలుకుతోంది. గడిచిన మూడు, నాలుగు నెలలుగా రూ.6 వేల నుంచి 7 వేల మధ్యలో మాత్రమే ధర ఉండగా, ఆషాడంలో ఉత్తరాది వారు ప్రత్యేకంగా చేసే పూజలకు కొబ్బరికాయను ఎక్కువుగా వినియోగించడం, ఇతర రాష్ట్ర వ్యాపారులు శ్రావణ మాస నిల్వలకు సిద్ధం కావడంతో పచ్చికాయ ధర అంచనాలకు మించి పెరిగింది. వ్యాపార సరళి చూస్తుంటే ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల వ్యాపారులు శ్రావణమాసాన్ని దృష్టిలో పెట్టుకుని నిల్వపోతలు చేస్తున్న కారణంగానే పచ్చికాయ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు వచ్చే నెలలో తెలంగాణాలో బోనాలు పండుగ జరగనున్నందున హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం వరకు కోనసీమ నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల వరకు పచ్చికాయ ఎగుమతి అయ్యే పచ్చికొబ్బరికాయలు ఇప్పుడు 40 నుంచి 50 లారీల వరకు ఎగుమతి పెరిగింది. నిన్నటి మొన్నటి వరకు పచ్చికాయ ధరతో సమానంగా ఉన్న ముక్కుడు కాయ (నెల రోజుల నిల్వ ఉన్న కాయల) ధర ఆశించిన స్థాయిలో పెరిగలేదు. రూ.6,500లు ఉన్న ముక్కుడు కాయల ధర ప్రస్తుతం రూ.7,500 మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో దక్షిణాదిలో కొబ్బరిలో ద్వితీయ స్థానంలో ఉన్న తమిళనాడులో సైతం కొబ్బరి దిగుబడి తగ్గడం మన కొబ్బరికి ధర రావడం మరో కారణమైంది. అంబాజీపేట మార్కెట్లో పెరిగిన ఈ ధరలు మార్కెట్లో ఉత్సహభరిత వాతావారణాన్ని నింపింది. కాని రైతులకు మాత్రం పెరిగిన ధర పెద్దగా ఆనందాన్ని ఇవ్వడం లేదు. వేసవి సీజన్లో ఎకరాకు కొబ్బరి కాయల దిగుబడి ఎకరాకు 1,200లు కాగా, ప్రస్తుతం ఎకరాకు 600ల నుంచి 800 దిగుబడిగా వస్తోంది. వేసవిలో పది రోజులకు పైబడి 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల కారణంగా సైజులో ఉన్న పిందెలు, కాయలు రాలిపోవడం వల్ల దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. పైగా పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు ఈసారి మన జిల్లా నుంచి సైతం పెద్ద ఎత్తున బొండాలు రవాణా జరగడం వల్ల కూడా దిగుబడి తగ్గింది. ముందు, ముందు ఈ ప్రభావం ఎక్కువుగా ఉండే అవకాశంతోపాటు శ్రావణ నిల్వపోతలు పెరిగితే ధర మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్న రైతులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు. -
బ్యూటిప్స్
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ తలకు పట్టించినట్లయితే జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. అప్పుడప్పుడే తెల్లబడుతుంటే క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఈ రెండింటినీ కలుపుకోవడం సాధ్యం కానప్పుడు వంద గ్రాముల కొబ్బరి నూనెలో 50 మి.లీ నిమ్మరసం కలిపి మరిగించి నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని నిమ్మరసంలోని నీటిశాతం ఆవిరయ్యే దాకా వేడి చేయాలి. వేడయ్యేటప్పుడు చిటపట శబ్దం రావడం తగ్గిందంటే నీటిశాతం లేదని అర్థం. -
కొబ్బరి రైతుల నెత్తిన జీఎస్టీ పిడుగు
- ఎండుకొబ్బరిపై ఐదు శాతం పన్ను - ఇప్పటి వరకు పన్ను మినహాయింపు - ఏడాదికి రూ.ఐదు కోట్లకు భారం - మిగిలిన ఉత్పత్తులపైనా ప్రభావం - కొబ్బరి నూనెకు ఊతం - జీఎస్టీ 22 శాతం ఉన్న పన్ను 18కి కుదింపు అమలాపురం /అంబాజీపేట (పి.గన్నవరం) : రైతులు ఆందోళన చెందుతున్నట్టుగానే కొబ్బరిపై జీఎస్టీ పిడుగు పడింది. ఎండు కొబ్బరిపై 5 శాతం పన్ను విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మన రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లుగా పన్ను మినహాయింపు ఉండగా, తాజాగా పన్నుభారం పడడం రైతులు విస్మయానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో కొబ్బరి నూనెపై కొంత వరకు పన్ను మినహాయింపునిచ్చి ఊరట కలిగించేందుకు ప్రయత్నించినా ఎండు కొబ్బరిపై పన్ను వల్ల రైతులపై మోయలేని భారం పడనుంది. గతంలో ఎండుకొబ్బరిపై 4 శాతం పన్ను ఉండేది. దీన్ని తొలుత రెండు శాతానికి తగ్గించి, 2008 నుంచి పూర్తిగా ఎత్తివేశారు. వ్యాట్ అమలులోకి వచ్చినా పన్ను మాత్రం అమలు చేయలేదు. కేవలం సీఎస్టీ (ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటప్పుడు) మాత్రమే 2 శాతం పన్ను విధానం ఉంది. పన్ను మినహాయింపు వల్ల వ్యాపారులకు ప్రత్యక్షంగా, రైతులకు పరోక్షంగా మేలు జరిగేది. ఈ మినహాయింపు వల్ల జిల్లాలో 1.25 లక్షల మంది రైతులు లాభపడ్డారు. కోట్ల రూపాయల భారం... దేశమంతా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సు (జీఎస్టీ) అమలులోకి రావడంతో కొబ్బరి ఉత్పత్తులపై పన్నుపడింది. నిన్నటి మొన్నటి వరకు స్పష్టత రాకున్నా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఎస్టీ పన్ను విధానంలో ఎండుకొబ్బరి, పంచదార వంటి వ్యవసాయ ఆధారిత తయారీ ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఎండుకొబ్బరి ఆధారంగానే కొబ్బరి ఉత్పత్తుల ధరలు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పన్ను మినహాయింపు ఇక నుంచి ఉండకపోవడంతో వ్యాపారులు కన్నా రైతులు ఎక్కువుగా నష్టపోనున్నారు. వ్యాపారులు పన్ను భారాన్ని రైతులపై మోపి, వారికి చెల్లించే సొమ్ముల నుంచి తగ్గించడం ఇక్కడ సర్వసాధారణం. అంబాజీపేట మార్కెట్ నుంచి ఎండు కొబ్బరి ఎగుమతులే ఏడాదికి రూ.250 కోట్లకు పైబడి ఉంటాయని అంచనా. అంటే ఏడాదికి సుమారు రూ. 5 కోట్ల పన్నుభారం పడనుందని అంచనా. మనకు ఇంత వరకు పన్ను లేకున్నా జీఎస్టీలో దేశమంతా ఒకే విధమైన పన్ను విధానం అలులోకి రావడంతో మనపై కూడా పన్నుభారం పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్ను విధానాన్ని జీఎస్టీలో దేశమంతా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మన రాష్ట్రంతోపాటు కేరళలో మాత్రమే కొబ్బరి, ఎండు కొబ్బరిపై పన్నులేదు. మిగిలిన కొబ్బరి పండించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, అస్సాం వంటి రాష్ట్రాల్లో పన్ను విధానం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని జీఎస్టీ విధించినట్టు సమాచారం. కొబ్బరి నూనెపై ఊరట... ఇదే సమయంలో కొబ్బరి నూనెకు పన్ను తగ్గించడం రైతులకు కొంతలో కొంత ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 22 నుంచి 24 శాతం పన్ను విధానాన్ని మార్పులు చేసి జీఎస్టీలో 18 శాతం శ్లాబ్‌లో పెట్టడంతో వ్యాపారులకు, రైతులకు మేలు జరగనుంది. దీనివల్ల కొబ్బరి నూనె ధరలు తగ్గడంతోపాటు వినియోగం పెరిగి ఇటు కొబ్బరికి సైతం డిమాండ్ వస్తోందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొబ్బరినూనె మార్కెట్‌కు, ఎగుమతులకు అంబాజీపేట చిరునామాగా ఉన్న విషయం తెలిసిందే. రోజుకు ఇక్కడ నుంచి రెండు టన్నుల కొబ్బరి నూనె ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటుంది. పన్ను మినహాయింపు లభిస్తే ఇక్కడ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. -
కోనసీమలో నాఫెడ్ కేంద్రం?
సర్వేకు వస్తున్న ఆయిల్‌ఫెడ్ అధికారులు స్థానిక కొబ్బరి రైతులకు సమాచారం అమలాపురం/ అంబాజీపేట : కోనసీమలో మరోసారి నాఫెడ్ కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఆయిల్‌ఫెడ్ అధికారులు రెండు, మూడు రోజుల్లో మార్కెట్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందింది. అంబాజీపేట మార్కెట్లో ఎండు కొబ్బరి క్వింటాల్ ధర రూ.7 వేల వరకూ ఉంది. ఇదే సమయంలో వెయ్యి పచ్చికాయల ధర రూ.7 వేలు ఉంది. పచ్చికాయ, ఎండుకొబ్బరి ధరలు ఒకేలా ఉండడంతో రైతులు ఎండుకొబ్బరి తయారీ దాదాపు నిలిపివేశారు. గత ఫిబ్రవరిలో క్వింటాల్ రూ.8.500 ఉండగా, పచ్చికాయ ధర కూడా రూ.8,500 ఉంది. మార్చి నాటికి ఎండుకొబ్బరి ధర రూ.8 వేలకు, పచ్చికాయ ధర రూ.7 వేలకు తగ్గింది. ఏప్రిల్ నెలలో ఎండుకొబ్బరి ధర రూ.7,800, పచ్చికాయ ధర రూ.7,300 తగ్గింది. తాజాగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు రూ.ఏడు వేలకు చేరాయి. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. సిండికేట్‌గా మారిన వ్యాపారులు? డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎండు కొబ్బరిని కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. బయట మార్కెట్ కన్నా ఇది తక్కువే అయినా కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే ధర మరింత పతనమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమలో కాకున్నా కనీసం కొబ్బరి వాణిజ్య కేంద్రమైన అంబాజీపేటలోనైనా నాఫెడ్ కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఈ విషయంపై భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల జమ్మిల్ నుంచి వివరాలు సేకరించారు. మార్కెట్లో ధర ఉంది కదా? ఇప్పుడెందుకు కేంద్రాలని ఆయన ప్రశ్నించారు. నెల రోజుల నుంచి ధర పడిపోతోందని, కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రైతులు మరింత నష్టపోతారని బీకేఎస్ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఆయన నాఫెడ్‌కు నోడల్ ఏజెన్సీ అయిన ఆయిల్‌ఫెడ్ అధికారులకు ఈ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఇందుకు స్పందించిన ఆ సంస్థ అధికారులు కోనసీమలో మార్కెట్ సర్వే చేసేందుకు రెండు, మూడు రోజుల్లో వస్తున్నట్టు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో... జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల్లో పెద్దగా కొనుగోళ్లు లేకున్నా.. రైతులకు కొంతలో కొంతైనా కనీస మద్దతు ధర దక్కుతోంది. ఇవి లేకుంటే ఇప్పుడున్న ధర కూడా రాదని రైతుల అభిప్రాయం. కొబ్బరి రైతులు సైతం ఇదే తరహాలో తమకు నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
కొబ్బరి నేత్రం
► తుమకూరులో వింత కొబ్బరికాయపై వెలసిన కన్ను ఆకారం ఆసక్తి రేపుతోంది. తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో ఉన్న కడబ గ్రామానికి చెందిన రైతు వెంకటప్ప తోటలో కొబ్బరి చెట్టుకు కాసిన కొబ్బరికాయపై ఒంటి కన్ను కనిపించింది. రైతు కొబ్బరి పీచు తీస్తుండగా కన్ను రూపం బయటపడింది. ఎవరో శ్రద్ధగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దానిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతు కొబ్బరి కాయను దేవునిగదిలో ఉంచి పూజలు చేశారు. -
కొబ్బరి రైతులపై జీఎస్టీ కత్తి
- వై.ఎస్.హయాంలో 2 శాతం పన్నును ఎత్తివేస్తే ఇప్పుడు కొత్త పన్నులా... - సీఎస్టీ స్థానంలో జీఎస్టీ రావడంతో అదనపు పన్ను పోటుకు అవకాశం - రైతులపై రూ.25 కోట్లకు పైగా భారం - ఇదేమి పాలనంటూ కొబ్బరి రైతులు మండిపాటు అమలాపురం (అమలాపురం)/ అంబాజీపేట (పి.గన్నవరం) : ‘ములిగే నక్కపై తాటిపండు పడిన’చందాన ఉంది కొబ్బరి రైతుల పరిస్థితి. సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న కొబ్బరి రైతు నెత్తిన జీఎస్టీ కత్తి వేలాడుతోంది. గతంలో రాష్ట్ర పరిధిలో ఉన్న సేల్స్‌ట్యాక్స్..దాని స్థానంలో వచ్చిన వ్యాట్‌ట్యాక్స్.. కేంద్రం పరిధిలోని సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ)ల స్థానంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) రావడం.. దీనిలో కొబ్బరి ఉత్పత్తులకు ట్యాక్సు మినహాయింపుపై స్పష్టత లేకపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలా అయితే వ్యాపారం ఎలా... పచ్చికొబ్బరి (నీటి కొబ్బరి), ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి), కురిడీ కొబ్బరిలపై రాష్ట్ర పరిధిలో ఇప్పుడు పన్ను మినహాయింపు ఉంది. గతంలో సేల్స్ ట్యాక్సు నాలుగు శాతం, సీఎస్టీ రెండు శాతం పన్ను ఉండేది. 1996లో తుపాను, 1998లో నల్లి తెగులు ఆశించి కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొబ్బరి నూనె మినహా మిగిలిన కొబ్బరి ఉత్పత్తులైన పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, కురిడీ కొబ్బరిలపై నాలుగు శాతం ఉన్న పన్నును రెండు శాతానికి కుదించారు. తరువాత వ్యాట్ అములోకి వచ్చినా ఇదే విధానం కొనసాగింది. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు శాతం పన్నును సైతం ఎత్తివేశారు. కేవలం సీఎస్టీ రెండుశాతం మాత్రమే ఉండేది. పన్ను అములులో ఉన్నప్పుడు వ్యాపారులు పన్ను చెల్లించినా.. దానిని రైతుల వద్ద నుంచి వసూలు చేసేవారు. పన్ను మినహాయింపు వల్ల రైతులే ఎక్కువుగా ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీని అమలు చేస్తోంది. రాష్ట్రాల పరిధిలో వ్యాట్, సీఎస్‌టీల స్థానంలో జీఎస్టీ అమలులోకి వస్తోంది. జూన్ నుంచి మొదలు కాబోయే జీఎస్టీలో కొబ్బరికి మినహాయింపుపై స్పష్టత లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే తమపై పన్ను భారం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ నుంచి ఏటా రూ.600 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయని అంచనా. జీఎస్టీలో పన్ను వసూలు చేస్తే రైతులపై సుమారు రూ.25 కోట్లకుపైగా భారం పడుతోందని రైతులు లెక్కలు కడుతున్నారు. ఇప్పుడు పన్ను విధానంలో ఉన్న మినహాయింపులు జీఎస్టీలో కూడా వర్తించే అవకాశముందనే ప్రచారం ఒకవైపు.. కొబ్బరి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు దక్కదని మరోవైపు జరుగుతున్న ప్రచారం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. దీనిపై వ్యాణిజ్య పన్నుల శాఖాధికారులకు సైతం సరైన సమాచారం ఇంత వరకు అందలేదు. కొబ్బరిపై జీఎస్టీ పన్ను విధానంపై స్పష్టత వచ్చే వరకు రైతుల్లో ఆందోళన తగ్గేలా లేదు. -
పెంపుపై కొబ్బరి రైతుల పెదవి విరుపు
అమలాపురం : కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు జిల్లా రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.550 పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) సిఫారసు మేరకు కేంద్రం ఈ ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఎండుకొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్ సాధారణ రకం రూ.5,950 ఉంది. తాజా పెంపుతో ఇది రూ.6,500కి పెరిగింది. బాల్‌కోప్రా రూ.6,240 ఉండగా, తాజాగా రూ.6,790కి చేరింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే క్వింటాల్‌కు రూ.575 పెంచగా, తరువాత కనీస మద్దతు ధర పెంచింది ఈసారే. కానీ పెరిగిన పెట్టుబడులతో పోలిస్తే ఈ పెంపువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎండు కొబ్బరి ధర క్వింటాల్ రూ.7 వేల నుంచి రూ.7,200 వరకూ ఉంది. ఇదే సమయంలో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర సహితం రూ.7 వేలు ఉంది. దీంతో ఎండుకొబ్బరి తయారీ పెద్దగా జరగడం లేదు. పచ్చికాయ ధర తగ్గినప్పుడు రైతులు ఎండు కొబ్బరి తయారు చేస్తూంటారు. నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు తమకు నిరాశ కలిగించిందని కొబ్బరి రైతులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిసి కోనసీమకు చెందిన రైతులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి సురేష్‌ప్రభులను గత ఏడాది అక్టోబరులో కలిశారు. పెట్టుబడులతోపాటు రైతు కుటుంబాలకు అయ్యే ఆదాయ వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.17 వేలు చెల్లించాలని కోరారు. వారి సూచనల మేరకు సీఏసీపీ చైర్మన్ విజయ్పాల్శర్మను కలిసి ఇదే డిమాండ్‌పై వినతిపత్రాలు అందజేశారు. కనీసం రూ.10 వేలు చేసినా ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని రైతులు ఆశించారు. అయితే వారి ప్రయత్నాలను పట్టించుకోని కేంద్రం.. ఈసారి పెంపును రూ.550కే పరిమితం చేసింది. తమిళనాడు కాంగాయంతోపాటు మన జిల్లాలోని కోనసీమలోనే ఎండు కొబ్బరి ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఈ ఉత్పత్తి పైనే అంబాజీపేట మార్కెట్లో 80 శాతం లావాదేవీలు జరుగుతూంటాయి. ధర పెంపు స్వల్పంగా ఉండడంవల్ల ఎండు కొబ్బరి తయారీ పరిశ్రమ కోలుకునే అవకాశం లేదని రైతులు, వ్యాపారులు అంటున్నారు. ‘పాత ధర మీద ఎంతో కొంత పెంచితే చాలన్నట్టుగా ఉంది సీఏసీపీ పరిస్థితి. ‘ఈమాత్రం దానికి సమీక్షలు.. సమావేశాలు.. నివేదికలు కోరడాలెందుకు? అసలు సీఏసీపీ ఎందుకు?’ అని అంబాజీపేటకు చెందిన రైతు, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
అంతరార్థం
భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నా, అరటి లేదా కొబ్బరి కాయలకే ఆది నుంచి అగ్రతాంబూలం. వాటినే పూర్ణఫలాలుగా పేర్కొంటారు. కారణం ఏమిటంటే, సృష్టిలోని అన్ని ఫలాలను మనం ఆరగించి, వాటిలోని విత్తనాలను నోటినుంచి ఊసి పారవేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని, వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి, తిరిగి పుష్పించి, ఫలిస్తాయి. మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్ఠం కాదు. అయితే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు. మహాపతివ్రత, సౌందర్యరాశి అయిన సావిత్రిదేవి శాపవశాత్తూ భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. అర టిచెట్టు విత్తనాల ద్వారా గాక పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాల్లోనూ పండ్లను ఇస్తుంది. కొబ్బరిచెట్టు బీజంగల చెట్టే అయినప్పటికీ, దానికి కూడా ఎంగిలి దోషం అంటదు. అందుకే అరటిపండు, కొబ్బరికాయ పూర్ణఫలాలయ్యాయి. వినాయకుడికి, ఆంజనేయస్వామికి, రామచంద్రమూర్తికీ అరటిపండ్లు అమితమైన ప్రీతి గలవి. వారి పూజలో అరటిపండును నివేదించడం తప్పనిసరి అని పెద్దలు చెబుతారు. -
నిలిచిన ఎండుకొబ్బరి తయారీ
కొబ్బరి ధర పెరుగుదల రైతులకు సంతోషాన్ని ఇస్తుంటే.. కొబ్బరి కార్మికులకు, తయారీ కొబ్బరి వ్యాపారులను మాత్రం కష్టాల్లోకి నెట్టుతోంది. పచ్చికొబ్బరి కాయ ధర పెరగడంతో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి).. కొబ్బరినూనె తయారీ దాదాపు నిలిచిపోయింది. దీంతో ఇటు వ్యాపారులకు... అటు కార్మికులకు చేతిలో పనిలేకుండా పోతోంది. – అమలాపురం/అంబాజీపేట ప్రస్తుతం మార్కెట్లో పచ్చికాయ, ముక్కుడు కాయ వెయ్యి కాయల ధర రూ.7,500 వేల వరకూ ఉంది. పది, పదిహేను రోజుల క్రితం రూ.పది వేలు ఈ ధర పలికింది. కాయ ధర ఎక్కువగా ఉండడంతో రైతులు, కొబ్బరి వ్యాపారులు నేరుగా కొబ్బరిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంత ధరకు కొనుగోలు చేసి.. తయారీ కొబ్బరి (కొత్తకొబ్బరి, ఎండుకొబ్బరి)ని స్థానికంగా తయారుచేసే అవకాశం లేదు. తయారీ కొబ్బరి కన్నా పచ్చికొబ్బరి ధర ఎక్కువగా ఉంది. తయారీ కొబ్బరి క్వింటాల్ ధర రూ.8 వేలు ఉండగా, పచ్చికొబ్బరి ధర రూ.7,500లే ఉంది. ఎండు కొబ్బరి చేస్తే నష్టమే.. వెయ్యి కొబ్బరికాయల నుంచి 90 కేజీల ఎండు కొబ్బరి తయారవుతుంది. క్వింటాల్ ఎండుకొబ్బరి తయారు చేయాలంటే 1,110 కాయలు అవసరం. మార్కెట్ ధరను బట్టి చేస్తే అయ్యే ఖర్చు రూ.8,325. వలుపు, తయారీ కార్మికులకు, రవాణా ఖర్చులు కలుపుకుంటే క్వింటాల్ ఎండు కొబ్బరి ఉత్పత్తికి అయ్చే ఖర్చు రూ.వెయ్యికిపైనే. అంటే క్వింటాల్ ఎండుకొబ్బరి తయారీ పెట్టుబడి రూ.9,500ల వరకూ అవుతున్నట్టు లెక్క. మార్కెట్ ధర మాత్రం రూ.8,200లే. దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలను వేలంలో పొందినవారే ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. సీజ¯ŒSలో అంబాజీపేట మార్కెట్ నుంచి ఇప్పుడు 10 టన్నులు కూడా ఎగుమతి కావడం లేదు. ఉపాధి కోల్పోయిన కార్మికులు పచ్చికొబ్బరి ఎగుమతి కన్నా ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఎగుమతులపైనే అంబాజీపేట మార్కెట్లో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 3 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు. నిండా ముంచేస్తున్న వ్యాపారులు తక్కువ ధర ఉన్నప్పుడు భారీగా నిల్వ చేసిన వ్యాపారులు ఇప్పుడు ఎగుమతి చేసే పనిలో పడ్డారు. నిల్వలు పూర్తయ్యేవరకూ ధర తగ్గించేశారని రైతుల ఆరోపణ. నిల్వలు పూర్తయ్యాకా తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసి, తరువాత ధరలు పెంచి లాభపడాలనే వ్యాపారుల వ్యూహానికి బలవుతున్నామని రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు మాత్రం ధర పెరిగిన తరువాత అమ్మకాలు చేయాలని కొబ్బరికాయలను నిల్వ చేస్తున్నారు. -
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి
నాఫెడ్ కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు హోంశాఖామంత్రి చినరాజప్ప అంబాజీపేట : కొబ్బరి విస్తారంగా సాగవుతున్న కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం అంబాజీపేటలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకొంటామన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సీపీసీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప ఇటీవల కోనసీమలో పర్యటించారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అల్లవరం మండలం సామంతకుర్రులో గుర్తించారని తెలిపారు. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించే చర్యలు తీసుకొంటున్నామన్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయిందన్నారు. ప్రారంభోత్సవాలు అంబాజీపేటలో రూ.18 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాములను హోం మంత్రి చినరాజప్ప బుధవారం ప్రారంభించారు. తొలుత అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెంలో రూ.20 లక్షలతో నిర్మించిన సామాజిక కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న «వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ భవనాలను దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. అనంతరం స్థానిక వెంకట్రాజు ఆయిల్ మిల్లు వద్ద ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొబ్బరి ఒలుపు యంత్రం (డీ హస్కర్)ను మంత్రి రాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం, అమలాపురం ఎమ్మెల్యేలు పులపర్తి నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, ఏడీహెచ్ శ్రీనివాస్, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, సర్పంచ్‌లు సుంకర సత్యవేణి, కాండ్రేగుల గోపాలకృష్ణ, మట్టపర్తి చంద్రశేఖర్, ఎంపీటీసీలు ఈతకోట సత్యవతి, దొమ్మేటి సాయికృష్ణ, కత్తుల నాగమణి, కోమలి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీడీపై వీడిన అస్పష్టత
కంపెనీలకు మాత్రమే ఇస్తామంటూ నిబంధన రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న సీడీబీ కొబ్బరి సొసైటీలకు డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే స్పష్టం చేసిన సీపీసీఆర్‌ఐ, సీడీబీ డైరెక్టర్ చౌడప్ప అమలాపురం : కొబ్బరి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన కోకోనట్ డవలప్మెంట్ బోర్డు (సీడీబీ) కొందరి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందని కోనసీమ కొబ్బరి రైతులు ఆరోపిస్తున్నారు. లేయింగ్ అవుట్ ఆఫ్ డిమాన్‌స్ర్టేషన్ ప్లాంట్ల (ఎల్‌ఓడీపీ) ఎంపిక కోసం లేని నిబంధనలు ప్రవేశపెట్టిందా? అంటే అవునంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. సీడీబీలో లేని నిబంధనను ఇక్కడ అమలు చేసి వందలాది మంది రైతుల ప్రయోజనాలను కాలరాసిందని ఆరోపిస్తున్నారు. కొబ్బరి సాగుకు చేయూతనిచ్చేందుకు సీడీబీ గత కొన్నేళ్లుగా ఎల్ఓడీపీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో రైతుకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున రెండేళ్లపాటు ఎరువులను ఉచితంగా అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాలను మొదట క్లస్టర్ల్గా చేసి ఒక్కో దాని పరిధిలో 25 హెక్టార్లను ఎల్‌ఓడీపీ స్కీమ్‌ను అమలు చేశాయి. తరువాత రైతులు కోకోనట్ ప్రొడ్యూసర్ సొసైటీలగా ఏర్పడితే ఇస్తామని చెప్పింది. దీంతో కోనసీమలో వందలాది సొసైటీలు ఏర్పడ్డాయి. తరువాత నిబంధన మార్చిన సీడీబీ అధికారులు ఫెడరేషన్లుగా ఏర్పడితేనే ఎల్‌ఓడీపీ ఇస్తామని చెప్పారు. తరువాత ఈ నిబంధననూ మళ్లీ మార్చేసి కేవలం కంపెనీలుగా ఏర్పడ్డవారికి మాత్రమే ఇస్తామన్నారు. దీని వల్ల సొసైటీలకు, వాటిలోని వేలాది మంది రైతులకు ఎల్‌ఓడీపీ స్కీమ్ అందకుండా పోయింది. ఈ సంఘాలను పక్కనబెట్టారు – ముమ్మిడివరం మండలం లంకాఫ్ఠాన్నేల్లంకలో సుమారు 750 మంది రైతులు 17 సొసైటీలుగా ఏర్పడ్డారు. సీడీబీ సూచన మేరకు వీరంతా స్వామి వివేకానంద ఫెడరేషన్‌గా ఏర్పడ్డారు. రెండేళ్లు గడుస్తున్నా ఎల్‌ఓడీపీ ఇవ్వలేదు. ఇందుకు సీడీబీ అధికారులు చెప్పే కారణం వీరందరూ కలిసి కంపెనీ కాలేదని. – కోనసీమలో భద్రకాళీ వీరేశ్వరస్వామి (ఐ.పోలవరం), బలరామ సీపీఎఫ్ (బండారులంక), ఆర్ధర్ కాటన్ (అయినవిల్లి), సుజలా (అంబాజీపేట) ఫెడరేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2,500 మంది రైతులున్నారు. కొన్ని ఫెడరేషన్లు 2013లోనే సీడీబీలో రిజిస్టర్ అయ్యాయి. కేవలం కంపెనీలుగా ఏర్పడలేదని వీరికి కూడా ఎల్‌ఓడీపీ అందించలేదు. ఆ నిబంధన ఉందా? కంపెనీలుగా ఏర్పడినవారికే ఎల్ఓడీపీలో ఎరువులు ఇవ్వాలనే నిబంధన ఉందని సీడీబీ అధికారులు చెబుతుండగా, అటువంటిదేమీ లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కోనసీమలో ఒక కంపెనీ ప్రయోజనం కోసం మొదట సొసైటీలు, తరువాత ఫెడరేషన్లు, తరువాత కంపెనీలకు ఎరువులు ఇస్తామనే నిబంధనలు పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీలకు ఎల్‌ఓడీపీ ఇవ్వాల్సిందే ‘కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీలకు మాత్రమే డెమోప్లాట్లు ఇవ్వాలనే నిబంధన ఏమీలేదు. సొసైటీలకు సైతం డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే. మీ ఫెడరేషన్‌కు ఎందుకు ఇవ్వలేదనేదానిపై నేను చర్చిస్తాను’అని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ), కోకోనట్ డవలప్మెంట్ బోర్డు (సీడీబీ)ల డైరెక్టర్ పాలెం చౌడప్ప చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు దీనిపై డీసీసీబీ డైరెక్టర్, స్వామి వివేకానంద ఫెడరేషన్ చైర్మన్ గోదాశి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు రైతు సంఘం ప్రతినిధులు ముత్యాల జమ్మిలు మాట్లాడుతూ సీడీబీలో లేని ఈ నిబంధన వల్ల కోనసీమలో సుమారు ఐదు వేల మంది రైతులు ఎల్‌ఓడీపీ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని వివరించగా ఆయన పై విధంగా స్పందించారు. దీనిపై తాను సీడీబీ పాలక మండలి సమావేశంలో మాట్లాడతానన్నారు. సొసైటీలకు ఎల్ఓడీపీలో ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
తులసి ఫేస్ ప్యాక్
బ్యూటిప్స్ గుప్పెడు తులసి ఆకులు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. తులసి ఆకులు లేకపోతే తులసి పౌడర్‌నైనా నీటిలో కలుపుకుని పేస్ట్ చేసుకోవచ్చు. పౌడర్ మార్కెట్లో లభిస్తుంది. తులసి ఆకుల పేస్ట్ రెండు టీ స్పూన్లు, ఓట్మీల్ పౌడర్ రెండు టీ స్పూన్లు, రెండు టీ స్పూన్ల పాలు, కొద్దిగా నీళ్ళు తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్‌ను ముఖమంతా అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్ వేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. ఈ ప్యాక్‌ను నెలకు రెండుసార్లు వేసుకుంటే మొటిమలు రావడం తగ్గుతుంది. చర్మం రంగు కూడా మెరుగవుతుంది. సెన్సిటివ్ స్కిన్వాళ్ళు ఈ ప్యాక్‌ను ముందుగా చేతిపై వేసుకుని మంట, దురద లేకపోతే ముఖానికి వేసుకోవచ్చు. కోకోనట్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనె ముఖానికి పట్టించి, వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. టవల్ తీసుకుని వేడి నీటిలో ముంచి ముఖం పై అద్దాలి. ఇలా అయిదారు సార్లు చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. చివరగా రోజ్ వాటర్‌ని అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు సార్లయినా క్రమం తప్పకుండా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. -
కొబ్బరి ధర పతనం
కాయకు మిగిలేది రూపాయే... ∙ అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ. 3,500 తీరప్రాంత మండలాల్లో రూ.2,500 ∙ గొల్లుమంటున్న కొబ్బరి రైతులు అమలాపురం/ అంబాజీపేట : ఆశించితి నత్తగారా.. అన్నట్టుగా ఉంది కొబ్బరి రైతుల పరిస్థితి. ఇటీవల కాలంలో కొబ్బరి కాయ ధర తగ్గిపోయింది. పండగ సీజన్లో పెరగవచ్చంటూ రైతులు ఆశలు పెంచుకున్నారు. అయితే ఈ సీజన్లో కూడా ధర కనిష్ట స్థాయికి దిగజారిపోయింది. దాంతో డీలా పడిన రైతు దింపులు తీసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇది పండగల సీజన్.. ఇప్పుడు దసరా.. నెలాఖరున దీపావళి.. వెంటనే కార్తీకమాసం. సాధారణంగా ఈ సీజన్లో కొబ్బరికి ఎనలేని డిమాండ్ ఉంటుంది. ధర పెరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో వెయ్యి పచ్చికొబ్బరి కాయల ధర రూ.3,400 నుంచి రూ.3,500 వరకు ఉంది. నెల్లాళ్లుగా ఇదే ధర నిలకడగా ఉంది. ధర పెరుగుతుందని రైతులు ఆశించారు. అయితే ధరలు పెరగకపోవడంతో వారు నీరుగారిపోయారు. ఉప్పలగుప్తం, అల్లవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం తదితర ప్రాంతాల్లో వెయ్యి కాయల ధర రూ.2,500 పలుకుతోంది. మార్కెట్లో డిమాండ్ లేనందున ధర తగ్గినా వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపడడం లేదు. దీంతో ధర పెరుగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. మిగిలేది రూపాయే తీర ప్రాంత మండలాల్లో కొబ్బరి కాయ ధర రూ.2.50 పలకడం రైతులను నిర్వేదానికి గురి చేస్తోంది. దింపునకు కాయకు 90 పైసలు, కాయలు పోగుపెట్టి రాశులుగా పోయడానికి మరో 40 పైసలు అడుగుతున్నారు. అంటే కాయకు రూ.1.30 పైసలన్నమాట. కాయకు వచ్చేది రూ.2.50. అంటే రైతుకు మిగిలేది రూ.1.20 మాత్రమే. శనగ కాయలు (100 కాయలకు 4 కాయలు), మోతమోసే కూలీలకు రెండు కాయలు ఇవి కాకుండా తొట్టి, చిన్నకాయలు పోగా రైతుకు కాయకు ఒక్క రూపాయి మాత్రమే మిగులుతోంది. దీంతో దింపులు మొత్తం ఆగిపోయాయి. ఏడాదిలో ఎంత మార్పు గత ఏడాది దసరా సీజన్లో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి) మినహా మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు భారీగానే ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచే అంబాజీపేట మార్కెట్లో కొబ్బరి ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కేవలం కొత్తకొబ్బరి ధర మాత్రమే పెరిగింది. -
ఎఫ్పీవోలుగా ఏర్పడితేనే సాగు లాభసాటి
ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసులు కొబ్బరి రైతులకు అవగాహన సదస్సు అమలాపురం/ అంబాజీపేట : ‘ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో)లుగా ఏర్పడితేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అన్ని వాణిజ్య పంటల రైతులు తమ పంటల వారీగా ఎఫ్పీవోలుగా ఏర్పడాలని ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ శ్రీనివాసులు అన్నారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలోని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఇంటి వద్ద కొబ్బరి రైతులకు ఎఫ్‌పీవోలపై అవగాహన సదస్సు జరిగింది. కోనసీమ నలుమూలల నుంచి కొబ్బరి రైతులు హాజరయ్యారు. వినియోగదారుడు కొనుగోలు చేసే ధరలో ప్రస్తుతం రైతులకు కేవలం 25 శాతం మాత్రమే ధర లభిస్తుందని, దీనిని కనీసం 65 శాతం వరకు పెంచేలా ప్రభుత్వం ఎఫ్‌పీవోలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎఫ్‌పీవోలను, కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేయడం ద్వారా రైతుల ఉత్పత్తులను కంపెనీలు నేరుగా కొనుగోలు చేసే అవకాశముందని, దీని వల్ల రైతులకు లాభసాటి ధర వస్తుందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంతో పాటు రూ.కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. కొబ్బరి రైతులు సైతం పెప్సీకో వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశముందని, కోనసీమలోని సుమారు 10 లక్షల కురిడీ కొబ్బరికాయల నిల్వ చేసుకునే స్థాయిలో ప్యాక్‌హౌస్‌లను సైతం రైతులు నిర్మించుకునే అవకాశముందని ఆయన చెప్పారు. ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసుకునే విధివిధానాలపై వృత్తి స్వచ్ఛంద సంస్థకు చెందిన నరేంద్రనాథ మాట్లాడుతూ ములకనూరు రైతు సహకార సొసైటీ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని రైతులు ఎఫ్పీవోలుగా ఏర్పడాలన్నారు. గ్రామస్థాయిలోను, డివిజన్ స్థాయిలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, ఒక పాలకవర్గాన్ని సైతం ఎన్నుకోవాలని సూచించారు. ఎఫ్‌పీవోలకు నాబార్డు, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సహకాలందుతాయన్నారు. కేరళలో కొబ్బరి అభివృద్ధి వెనుక ఈ సంఘాల కృషి ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్‌కు చెందిన ట్రేడర్ లక్ష్మీనారాయణ, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి, బలరామ్ కోకోనట్ ఫెడరేషన్ చైర్మన్ ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు పెదమల్లు నాగబాబు, డీసీసీబీ డైరెక్టర్ జవ్వాది బుజ్జిలు పాల్గొన్నారు. -
వయసు 7సంవత్సరాలు..సంపాదన 60వేలు
-
కొబ్బరి రైతుకు కుడి భుజంగా...
పలు పరిశోధనలు చేసిన డాక్టర్ చలపతిరావు ఫలితాలు క్షేత్రస్థాయికి చేరేలా విశేష కృషి అంబాజీపేట కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా సేవలు ఉత్తమ శాస్త్రవేత్తగా రేపు అవార్డు స్వీకరణ అంబాజీపేట : కోనసీమ సిరికి ఇరుసు వంటిది కావడమే కాదు.. ఆ గడ్డ ‘సొగసరి’తనానికీ మూలం కొబ్బరి. అలాంటి కొబ్బరి సాగులో రైతులకు కొండంత అండగా నిలుస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన కేంద్రం కీటకశాస్త్ర విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న ఆయన ‘కొబ్బరిలో వచ్చే తెగుళ్ళు, యాజమాన్య పద్ధతులు’పై అధ్యయనం చేయడంతో వాటిపై పరిశోధనలు చేసి పలు విజయాలు సాధించారు. కొబ్బరిలో వచ్చే పురుగులు, తెగుళ్లపై ప్రత్యేక పరిశోధనలు చేసి, ఫలితాలను కరపత్రాలుగా రూపొందించి, రైతులకు అవగాహన కల్పించడం ద్వారా మేలు చేకూరుస్తున్నారు. జీవ నియంత్రణ పద్ధతిలో బదనికల ఉత్పత్తి గత ఐదేళ్లుగా కీటక విభాగంలో గణనీయమైన పరిశోధనలు చేసిన డాక్టర్ చలపతిరావు వాటి ఫలితాలు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రచారం చేశారు. ప్రతి పరిశోధనా ఫలితాన్నీ రైతులకు అర్థమయ్యేలా ప్రచురించి, వారికి చేరువ చేశారు. జీవనియంత్రణ పద్ధతిలో అధిక సంఖ్యలో బదనికలు ఉత్పత్తి చేసి రైతులకు మేలు చేశారు. ఆకుతేలుపై కొత్త బదనికలను, జీవ శిలీంధ్రాలను గుర్తించారు. వీటిపై తాను చేసిన ప్రత్యేక పరిశోధనలు విజయం సాధించాయని, దాంతో రైతుల మన్ననలు పొందడమే కాక అనేక అవార్డులను పొందానని డాక్టర్ చలపతిరావు ‘సాక్షి’కి వివరించారు. ఈ నెల 30న వెంకటరామన్నగూడెంలో నిర్వహించనున్న విశ్వ విద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి నరసింహన్, న్యూఢిల్లీ వ్యవసాయ పరిశోధనామండలి, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ త్రిలోచన్ మొహపాత్రల ఆధ్వర్యంలో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డును అందుకోనున్నట్టు తెలిపారు. -
కొబ్బరిలో కుదేలు
నేడు అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం అమలాపురం/ అంబాజీపేట : జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సుమారు లక్ష మంది రైతులు, మూడు వేల మంది వ్యాపారులు, ఐదు వేల మంది కార్మికులు, మరో పది వేల మంది కూలీలు కొబ్బరిపై ఆధారపడి ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. రెండు నెలల క్రితం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.మూడు వేల వరకు పడిపోవడంతో రికార్డు స్థాయిలో రైతులు దిగుబడి సాధించినా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం ధర రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ఉన్నా కొనేవారు లేక రైతులు ఇళ్ల వద్ద.. తోటల్లో.. కళ్లాల్లో వేలాదిగా కొబ్బరి నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రంలోని కొబ్బరి వ్యాపార కేంద్రం మన జిల్లాలోని అంబాజీపేటలో ఉంది. ఏడాదిలో ఇక్కడి కొబ్బరి వ్యాపార లావాదేవీలు రూ.400 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఇంతటి కీలకమైన కొబ్బరి పంట ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పక్కనే ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొబ్బరి రైతులకు ఆయా ప్రభుత్వాలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), పరిశోధనా కేంద్రాల నుంచి అందుతున్న సహాయ సహకారాలు... రాయితీల్లో పదో వంతు కూడా మన రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, చిత్తూరులో విస్తారంగా కొబ్బరి సాగు జరుగుతున్నందున కొబ్బరి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. అందుకు ‘పంచ’ విధానాలు అమలు చేయాలని, తమకు వాటిని ఆందుబాటులోకి తీసుకురావాలని కొబ్బరి రైతులకు కోరుతున్నారు. -
మందుబాబులకు ఇదొక వింత ఫైన్
రాయ్‌పూర్: సాధారణంగా మద్యపానం వినియోగాన్ని తగ్గించేందుకు చట్టాలు కఠినతరం చేస్తారు. పరిమితులు విధిస్తారు. వాటిని అతిక్రమిస్తే జైలులో పడేస్తారు. కానీ, చత్తీస్ గఢ్లోని కోర్బా జిల్లాలోగల ఓ గిరిజన గ్రామంలో మాత్రం ఓ వింత నిబంధన పెట్టారు. ఎవరైనా మద్యం నిషేధాన్ని అతిక్రమించి మద్యం సేవిస్తే వారు ఒక కొబ్బరి కాయ జరిమానగా తిరిగి చెల్లించాలంట. మైంగాడి అనే గ్రామంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు పలువురు మద్యానికి బానిసలయ్యారంట. వారితో మద్యం మాన్పించేందుకు ఆలోచన చేసిన పంచాయతీ సర్పంచ్ శనిచరణ్ మింజ్ ఈ రకమైన ఫైన్ వేశారు. అయితే, కొబ్బరికాయ సమర్పించుకోవడమంటే ఏదో పంచాయతీకి ఇచ్చి వెళ్లడం కాదు. అందరూ ఉండగా బహిరంగంగా దానిని తీసుకొచ్చి పంచాయతీ పెద్ద చేతిలో పెట్టాలంట. ఇలా చేయడం ద్వారా నలుగురి వారికి అవమానంగా అనిపించి మందు మానేస్తారని ఆ పెద్ద మనిషి ఆలోచన. ఒకసారి తప్పు చేసిన వారు మరోసారి అదే తప్పు చేస్తే మాత్రం నేరుగా పోలీసుల వద్దకు పంపింస్తారని నిబంధన పెట్టారు. వాస్తవానికి ఈ గ్రామంలో విద్యుత్ లేదంట.. వినోద కార్యక్రమాలు లేవంట. ఈ కారణం వల్లే వారంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ మద్యం సేవిస్తారని ఆ సర్పంచ్ చెప్పారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారు మారకపోవడం వల్లే తాజాగా ఈ నిబంధన తెచ్చినట్లు తెలిపారు. -
కొబ్బరికాయ వేలం రూ.18.50లక్షలు
నార్కట్‌పల్లి: మండలంలోని చెర్వుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో దేవాలయం గట్టు కింద కొబ్బరికాయలు విక్రయించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్గరమణ బాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం రూ.18.50 లక్షలకు అదే గ్రామానికి చెందిన అంకాల సతీశ్ పాటను దక్కించుకున్నట్లు ఈఓఆర్డీ్డ లక్ష్మినారాయణ తెలిపారు. పాట దక్కించుకున్న వ్యక్తులకు ఒక సంవత్సరం పాటు కొబ్బరికాయలు విక్రయించేందుకు హక్కు కలిగి ఉంటారని తెలిపారు. ఈ వేలంలో 13మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, వార్డు సభ్యులు గుంటిసైదమ్మ, నర్సింహ్మ, కొండేటి వేణు, దాసోజు తిరుపతమ్మ, కోటి, వంపు శివ శంకర్, కుకుట్ల అనురాధ, గణేష్, అండాలు, చంద్రయ్య, పారిజాత, శంకర్, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల నెత్తిన టెంకాయ బాదుడు
– ఉరకుంద క్షేత్రంలో భక్తులను దోచుకుంటున్న టెంకాయ వ్యాపారులు – జత టెంకాయలు రూ.60 విక్రయం – మార్కెట్లో జత టెంకాయలు రూ.30 – కళ్లు మూసుకున్న క్షేత్రం అధికారులు మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో భక్తుడు అడుగు పెట్టింది మొదలు స్వామికి హారతి పట్టేంత వరకు నిలువు దోపిడీకి గురికావాల్సిందే. ఓ వైపు భక్తుల జేబులు గుల్ల అవుతున్నా అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టెంకాయ బాదుడు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. స్వామి వారికి నిర్మలైన మనస్సుతో టెంకాయ సమర్పించాలని కొనేందుకు వెళ్తే జేబులు చూసుకోవాల్సి వస్తోంది. ఈ క్షేత్రంలో శ్రావణమాసంలో అధికంగా సోమ, గురువారాలు లక్షలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. వచ్చిన ప్రతి భక్తుడూ స్వామికి జోడు నారీకేళాలు సమర్పించుకుంటారు. టెంకాయలు విక్రయించేందుకుగానూ ఇటీవల రూ.82.10 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. క్షేత్రంలో దాదాపు 55 టెంకాయ దుకాణాలు ఉన్నాయి. క్షేత్రంలో టెంకాయల విక్రయదారులు గాలి ఉన్నప్పుడు తూర్పార బట్టాలన్న సామెతను ఒంట బట్టించుకున్నారు. అడ్డగోలుగా టెంకాయల ధరలకు రెక్కలు తొడిగారు. రెట్టింపు చేసేసి భక్తులను పీల్చి పిప్పిచేసేస్తున్నారు. మార్కెట్లో జోడు టెంకాయలు రూ.30కే లభిస్తున్నాయి. అదే హోల్‌సేల్‌కు తీసుకుంటూ రూ.20 మించి పలుకవు. ఇక్కడ మాత్రం జోడు టెంకాయలు రూ.60. సగానికి సగం ధర పెంచేశారు. మాసంలో 20 లక్షలకుపైగా టెంకాయలు విక్రయిస్తారు. ఈ లెక్కన దోచేస్తున్న సొమ్ము దాదాపు రూ.30 లక్షలు. టెంకాయ బాదుడుకు బదులు టెంకాయలు కొట్టే చోట దక్షిణ సమర్పించుకోవాలి. ఒక్క నారీ కేళ సమర్పణకే గుడి నుంచి బయటకు వచ్చేలోపు రూ.70కి పైగా ఖర్చు. నారీ కేళాలు సమర్పించుకుందామంటే రెక్కలు తొడిగిన ధరలతో నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులు అరచీ గీపెట్టుకున్నా అధికారుల్లో చలనం లేదు. భక్తులను ఇంత దోచేస్తున్నా అధికారుల మౌనానికి ఆంతర్యం స్వామికే ఎరుక. భక్తుల దోచిన పాపంలో అధికారుల పాత్ర ఉందంటూ లక్షలాది మంది భక్తులు గొంతెత్తి ఆరోపిస్తున్నారు. ఎక్కడా చూడలేదు : నాగరాజు, ఎమ్మిగనూరు స్వామి మొక్కు కోసం కాలినడకన ఇక్కడకు వచ్చాం. క్షేత్రంలో రూ.60 చెల్లించి రెండు టెంకాయలు తీసుకున్నాం. ఏ క్షేత్రంలోనూ ఇంత దోపిడీ చూడలేదు. సగానికి సగం ధర కట్టి విక్రయిస్తున్నారు. భక్తులను దోచుకోవడమే ఇక్కడ పనిగా పెట్టుకున్నారు. అధికారులు ఏమి చేస్తున్నారు : కొండయ్య, పోలకల్ సత్యానికి, ధర్మానికి నిలయాలు దైవ క్షేత్రాలు. అయితే ఉరకుంద క్షేత్రంలో ధర్మం మంట గలిసింది. భక్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడి అధికారులు ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. ఇలాంటి అధికారులుంటే భక్తులు క్షేత్రాలకు రావడమే మానేస్తారేమో. దోపిడీ అరికట్టాలి: బద్రి, ఎర్రకోట ఉరకుంద క్షేత్రం రెండు టెంకాయలు రూ.60 విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో రూ.30కే లభిస్తున్నాయి. టెంకాయలు కొనాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. భక్తులను దోచుకోవడం నిజంగా మోసం. ఇక్కడి అధికారులు కాకపోయినా ఉన్నతాధికారులు కళ్లు తెరచి దోపిడీకి కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. -
పిడుగుపాటుకు టెంకాయచెట్టులో మంటలు
కురింజాలం(వరదయ్యపాళెం): పిడుగుపాటుకు ఓ టెంకాయచెట్టులో మంటలు రేగాయి. కురింజాలం గ్రావుంలో వుంగళవారం సాయంత్రం పెద్ద శబ్దంతో ఉరుములు మెరుపులు వచ్చాయి. అదే సమయంలో గ్రావుంలోని మోహన్ ఇంటివద్ద ఉన్న టెంకాయ చెట్టుపై పిడుగుపడింది. దీంతో వుంటలు వ్యాపించాయి. పిడుగుపాటు కారణంగా గ్రావుంలోని పలు ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. -
ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా...
జర్మనీః కొబ్బరి చెట్టు' వ్యాసం ప్రతి విద్యార్థీ చిన్న తరగతుల్లో చదువుకునే ఉంటాడు. కొబ్బరిచెట్టు ఆకులు, కాండం నుంచీ కాయలదాకా ప్రతి భాగం మనిషి జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఆ వ్యాసం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఎందరికో అనుభవపూర్వకం కూడా. అందుకే కాబోలు జర్మనీ శాస్త్రవేత్తల దృష్టి కొబ్బరి పై పడింది. నాగరికతద్వారా మనుషులు భూమిపై వారి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నా... ప్రకృతి సహజ విపత్తులు, అంటువ్యాధులు వంటివి ఇంకా జీవితాలపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి విపత్తుల పరిష్కారం దిశగా ఆలోచించిన జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భూకంపాలను నిరోధించేందుకు కొబ్బరి కాయలో అత్యంత ధృఢంగా ఉండే పెంకులపై దృష్టి సారించారు. జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త మార్గంలో ప్రయోగాలు చేస్తోంది. తమ ప్రణాళికలను అభివృద్ధి పరిచేందుకు పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. సహజ విపత్తులను తట్టుకోగలిగే శక్తి కొబ్బరి పెంకులో ఉన్నట్లు గుర్తించారు. అందులోని పదార్థాల ఆధారంగా భూ కంపాలు ఇతర ప్రకృతి విలయాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా 30 మీటర్ల ఎత్తు ఉండే కొబ్బరి చెట్లనుంచీ కాయలు కింద పడినా పగిలిపోకుండా కాపాడే కొబ్బరి పెంకు ధృఢత్వాన్ని గుర్తించిన పరిశోధకులు... దాని ఆధారంగా విపత్తు నివారణా మార్గాలపై అధ్యయనం చేశారు. కొబ్బరి పెంకు నిర్మాణానికి సంబంధించిన ఫార్ములాపై ప్రయోగాలు చేస్తున్నారు. కొబ్బరి పెంకులో ఉండే లెథరీ ఎక్సో కార్ప్, ఫైబరస్ మెకోకార్స్, ఎండోకార్ప్ అనే మూడు పొరల వల్ల కొబ్బరి పెంకు ధృఢంగా ఉంటుందన్న విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అదే స్ఫూర్తిగా ఇళ్ళ నిర్మాణం చేపడితే విపత్తులను, భూకంపాలను తట్టుగోగల్గుతాయన్న దిశగా ఆలోచిస్తున్నారు. బయోలాజికల్ డిజైన్ అండ్ ఇంటిగ్రేటివ్ స్ట్రక్చర్స్ ప్రాజెక్టు ద్వారా.. జర్మనీలోని ఫ్రీబర్గ్ యూనివర్శిటీ ప్లాంట్ బయో మెకానిక్స్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, మెటీరియల్ సైంటిస్టు ల బృందం సంయుక్తంగా భూకంపాలను తట్టుకునే నిర్మాణాలను చేపట్టే దిశగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాలను వినియోగించి కొబ్బరి పెంకులోని మూడు పొరల్లో ఉండే శక్తిని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎండోకార్ప్ పొర కారణంగా కొబ్బరి పెంకు ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని, పగుళ్ళు లోపలకు పోనీకుండా అందులోని లిగ్నిఫైడ్ స్టోన్ సెల్స్ ప్రభావం చూపిస్తాయని గుర్తించారు. తమ ప్రయోగాలు ఫలిస్తే.. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా తట్టుకోగలిగే ఇళ్ళ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. -
కోటమ్మగారి కొబ్బరి మొక్కు!
అక్షర తూణీరం కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరి మొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....! ఆయన చిత్తూరు చాణక్యు డండీ! జనానికి మండు వేసవిలో చందమామని చూపిస్తున్నాడంటూ ఓ పెద్దమనిషి తెగ ఆశ్చర్య పడ్డాడు. మొన్నటికి మొన్న కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం చేసి పచ్చ పూల హారతి ఇచ్చాడు. నిన్నటికి నిన్న అమరావతి ముఖ్యపట్టణం తాలూకు సచివాలయం నూతన భవనంలోంచి ముఖ్యమంత్రి మహా సంతకాలు చేశారు. అసలు కొత్త క్యాపిటల్ నూతన సెక్రటేరి యట్ భవనాన్ని రిబ్బన్ కత్తిరించి, స్వజనం కరతాళ ధ్వనుల మధ్య ప్రారంభించడం భళారే చిత్రం! రాష్ట్రం ముందుకు పోతావుంది. సందేహం లేదు. పూర్వం ఎన్నో నిర్మాణాలు శిలాఫలకాల దగ్గరే నిద్ర పోతుండేవి. ఇప్పుడు అట్లా కాదు. ఎంతోకొంత పైకి సాగుతున్నాయి. ‘‘ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవని ముఖ్యమంత్రి పురిట్లోనే బారసాల చేశాడని’’ ఓ మాటకారి చమత్కరించాడు. అంతేగాని నేత చిత్త శుద్ధిని మెచ్చుకోలేదు. పైగా, అమరావతి నిండా కొత్త తాటాకు చలవ పందిళ్లు వెలుస్తాయి చూడండంటూ ప్రత్యక్ష వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ఉమ్మడి రాజధానిలో మనకు స్థానబలిమి లేకుండా పోయింది. గుట్టుగా ఓ ఫోను చేసుకుం దామన్నా రట్టయిపోతోంది. వేరుపడ్డాక భద్రాచల రామయ్య వాళ్ల పక్షానికి వెళ్లాడు. ఇక మన సంగతి ఎంతవరకు పట్టించుకుంటాడో అనుమానమే. మనం దిక్కులేక ఒంటిమిట్టని ఉన్నట్టుండి ఉద్ధరించే పనిలో పడ్డాం. రాముడు నిజం గ్రహించలేడా? గ్రహించినా లౌక్యంగా, పోన్లే ఇన్నాళ్టికి ఈ వైభవం దక్కిందని సరిపెట్టుకుంటాడా? వాటాల్లో మిగిలిన దేవుళ్లు ఎటు చెదిరినా, మనకి కొండంత అండ వెంకన్న మిగిలాడు. చాలు, అదే కోటి వరహాలు. కోటివరాలు! అంతేనా, ఇంకా అన్నమయ్య, ఆయన వేనవేల సంకీర్తనలు మనకు దక్కాయి. ఇంకానయం వాటాల పంపిణీలో పదివేలు మాకు చెందాలని, దాయి భాగాలకి పేచీ పెట్టరు కదా! ఒకవేళ పెడితే, వారి వాటాకి వెళ్లిన సంకీర్తనలు వారు తప్ప వీరు పలకరాదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు రాజధాని తరలింపుపై మునికాళ్ల మీద ఉన్నారు. హాయిగా హైకోర్టుకి నాలుగు చలవ పందిళ్లు, అసెంబ్లీకి ఓ పెళ్లిపందిరి- ఇలా వేసుకుంటూ వెళితే తప్పేముంది? ఒకప్పుడు కర్నూలు రాజధాని పటకుటీరాలలో అంటే డేరాలలో నడవలేదా? రాజధానికి భూమి మాత్రం కొదవలేదు. రైతులు వారికిచ్చిన కమ్మర్షియల్ స్థలాల్లో కూడా చక్కటి తాటాకు, కొబ్బరాకు పందిళ్లు వేసుకుని, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు అద్దెలకిచ్చు కుంటారు. దీని మీద విస్తృతంగా చర్చిస్తే అనేక లాభసాటి మార్గాలు, అడ్డదారులు కనిపిస్తాయి. కోటమ్మ గారు వాళ్ల పుట్టింటి నుంచి కొబ్బరి మొక్క తెచ్చి వాళ్ల పెరట్లో నాటింది. రోజూ దానికి నీళ్లు పోసి, ప్రదక్షిణ చేసి, ‘కాశీ విశ్వేశ్వరా! నీకు వెయ్యెనిమిది టెంకాయలు కొడతా’నంటూ మొక్కేది. ఒక్కో వారం ఒక్కో దేవుడికి టెంకాయల మొక్కు మొక్కేది. అది మారాకు తొడిగే సరికి మూడేళ్లు, మాను కట్టేసరికి పుష్కరం పట్టింది. కోటమ్మకి పెద్దతనం వచ్చింది. ఓపిక అయిపోయింది. ఒకరోజు కొడుకుని కోడల్ని పిలిచి, టెంకాయల మొక్కు సంగతి చెప్పింది. ‘‘నువ్వు చెప్పాలా? ఊరందరికీ తెలుసు. అన్నీ కలిపి లక్షన్నర కొబ్బరికాయల పైమాటే. మా నెత్తి మీదకు తెచ్చిపెట్టావ్’’ అని వేష్టపడ్డారు. కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరిమొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....! వ్యాసకర్త: శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
భగ భగ
వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రెండు మూడు రోజుల్లోనే వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సివస్తే గొడుగు పట్టుకుని బయటకు వస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం కోసం గతంలో ఇంటికి వెళ్లే వారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే లంచ్ బాక్స్ వెంట తీసుకెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జన సంచారం లేని కడప కోటిరెడ్డి సర్కిల్ దృశ్యమిది.. ఎండల్లో చల్లదనం కోసం... ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం అయితే ప్రధాన రహదారులు సైతం జనం లేక బోసిపోతున్నాయి. ఇక ప్రజలు వేసవి తాపం తీర్చుకునేందుకు కొబ్బరినీరు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ తాగుతున్నారు. పండ్ల రసాలు, కర్బూజకు గిరాకీ పెరిగింది. కొందరు చెడిపోయిన ఫ్రిజ్‌లను తయారుచేయించుకంటుండగా.. మరి కొందరు కుండలను కొనుగోలు చేస్తున్నారు. -
కొబ్బరికాయ @ రూ.2.50
భారీగా పడిపోయిన ధరలు లబోదిబోమంటున్న రైతులు కృత్తివెన్ను : కొబ్బరికాయ కంటే కోడిగుడ్డే అధిక ధర పలుకుతుంది. గుడ్డు విలువ రెండు కొబ్బరి కాయల ధరకు సమానంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి కాయ ధర భారీగా పడిపోయింది. రెండు నెలలుగా కొబ్బరి ధరలు రోజురోజుకూ తగ్గుతూ ప్రస్తుతం ముదురు కొబ్బరి కాయ రూ. రెండు నుంచి 2.50 పైసలకు చేరింది. మార్కెట్లో రూ. 5లు చేస్తున్న కోడిగుడ్డుతో పోల్చుకుని కొబ్బరి రైతులు లబోదిబో మంటున్నారు. కొబ్బరి బొండాల ధర కూడా అదే స్థాయికి దిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కొన్ని నెలలు క్రితం కొబ్బరికి ఎనలేని డిమాండ్ ఉంది. టెంకాయ పది రూపాయలు పైచిలుకు పలుకగా నేడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తగ్గిన కొబ్బరి బొండాల ఎగుమతులు కోస్తా కోనసీమగా పేరుగాంచిన కృత్తివెన్ను మండలంలో చినగొల్లపాలెం దీవిలో కొబ్బరిని ప్రధాన పంటగా నాలుగు వేల ఎకరాల్లో పండిస్తున్నారు. పంటపొలాలు, చేపల చెరువుల గ ట్లపైన పెద్ద ఎత్తున కొబ్బరి చెట్ల పెంపకం సాగుతోంది. గతంలో ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల వరకు కొబ్బరి బొండాలు మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్‌లతో పాటు హైదరాబాద్‌కు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం దిగుబడి ఉన్నా కొనగోలుదారులు లేకపోవడంతో వారానికి కనీసం 20 వేల కాయలు కూడా ఎగుమతి కావడం లేదు. బెంగుళూరు, తమిళనాడులతో పాటు రావులపాలెం ఈతకోట నుంచి నాణ్యమైన కొబ్బరి కాయలు దిగుమతి కూడా ఇక్కడి కాయలు కొనుగోలుపై ప్రభావం చూపుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ముదురు కాయలకు కూడా సరైన ధరలేక రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. -
చదివింపు
మంచి మార్కులతో పాస్ అవ్వాలంటేబాగా చదవాలి. మరి డాక్టర్ అవ్వాలంటే?చదివింపు తప్పేట్టులేదు!ఒక గుడి.. అక్కడో స్వామీజీ.. ఓ కొబ్బరికాయ..దాంట్లో పూలు!ఇంత మహిమ చూశాక‘చదివింపు’ తప్పుతుందా?ఈ చదివింపు ఏమిటో మీరూ చదవండి.జాగ్రత్త పడండి... జాగృతం అవండి. పూలెలా వచ్చాయి? కొబ్బరికాయకు మూడు కళ్లుంటాయి. అందులో ఒకటి మెత్తగా ఉంటుంది. మొలక వచ్చేది ఆ కన్ను నుంచే. పీచును తొలగించకుండా జాగ్రత్తగా సందు చేసి మెత్తని కన్నుకు రంధ్రం చేస్తారు. నీరంతా ఒంపేసి స్ట్రాతో సన్న మల్లెమొగ్గలను దూర్చి కర్పూరం అతికించి పీచును సరిచేస్తారు. అలాగే... రక్తం కూడా. పూలకు బదులు ఎర్ర రంగు నీటిని సిరంజితో ఇంజెక్ట్ చేస్తారు. ఈ కొబ్బరికాయలను పూజసామగ్రి అమ్మే వారి చేతనే అమ్మిస్తారు. కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది శిల్ప. ఉదయం పదిన్నరకు విద్యాశాఖ మంత్రి టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. ఆ ఫలితాల కోసమే ఆమె ఆందోళన. పరీక్ష బాగా రాశాననే నమ్మకం ఎంతగా ఉన్నప్పటికీ ఏదో మూల భయం. టీవీ పెట్టుకుని చూస్తోంది. ఎంతకీ పదిన్నర కావడం లేదు. ఒకచోట కూర్చోబుద్ధి కావడం లేదు. ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో శిల్ప స్నేహితురాలు లలిత పరుగెత్తుకు వస్తోంది. అల్లంత దూరం నుంచే ‘శిల్పా! మన సైన్స్ మాస్టారు చెప్పారు... మనిద్దరం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాం. సునీతకేమో సెకండ్ క్లాస్... ఇంకా..’’ అంటూ వగరుస్తూ జాబితా వల్లిస్తోంది. శిల్ప ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ‘‘నాన్నా! నన్ను డాక్టర్ చదివిస్తావు కదా!’’ అని గారంగా అడుగుతోంది. ముందెప్పుడో ఇచ్చిన మాటను తండ్రి ఎక్కడ తేలిగ్గా తీసుకుంటాడోనని, మరింత నిర్థారణ చేసుకునే ప్రయత్నం ఆ అమ్మాయిది. ‘‘శిల్పా! మాట తీసుకోవాల్సింది మీ నాన్న దగ్గర కాదు. మల్లోని చెన్రాయుని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టు. డాక్టర్ కావాలని ఆ దేవుణ్నే కోరుకో’’ అన్నది వాళ్లమ్మ సరస్వతి. మరుసటి రోజు ఉదయాన్నే తలంటుకుని శిల్ప, లలిత ఇద్దరూ ఊరికి కనుచూపు మేరలో కొండ మీద ఉన్న ఆలయానికి బయల్దేరారు. బాలికా.. ఇదేనా నీ కోరిక?! ఆలయం పరిసరాల్లో కొబ్బరికాయలు, కర్పూరం, అగరుబత్తీలు అమ్మేవాళ్లు వరుసగా కూర్చుని ఉన్నారు. కొబ్బరికాయలు కొన్ని ముదురు రంగులో కొన్ని తాజాగా లేతగా కనిపిస్తున్నాయి. ‘‘ఈ పెద్ద కాయ తీసుకోవే శిల్పా! డాక్టర్ కావాలనే నీ కోరిక పెద్దది కదా మరి’’ అంటూ ఆటపట్టించింది లలిత. ‘‘నీకు మంచి కాయ ఇస్తానుండు’’ అంటూ బుట్టలో అటు కదిలించి ఇటు కదిలించి ఓ కాయను ఇచ్చింది పూజ సామగ్రి అమ్మే ఆమె. ఆలయంలోకి వెళ్లగానే పూజారికంటే ముందే ఓ స్వామీజీ కనిపించాడు. ‘చెన్రాయునికి దణ్ణం పెట్టుకుని ఇక్కడ కూర్చోండి’ అంటూ వారిని అప్పటికే అక్కడ ఉన్న వారి పక్కన కూర్చోబెట్టాడు. వరుసలో శిల్ప వంతు రాగానే లేచి వెళ్లి, తాను తెచ్చిన పూజ సామగ్రిని స్వామీజీ ముందు పెట్టింది. ‘‘డాక్టర్ కావాలని ఉందా? నీ కోరిక నెరవేరుతుంది’’ అంటూ కళ్లు మూసుకుని టెంకాయను నుదుటి మీద ఆనించి మంత్రాలు చదివాడు. క్షణాల్లో స్వామీజీ ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ప్రశాంతంగా కళ్లు తెరిచి శిల్పను ఆదరంగా చూశాడు. ‘‘ఈ టెంకాయను దేవుడి దగ్గర కొట్టు’’ అని ఇచ్చాడు. శిల్ప కొబ్బరికాయ కొట్టగానే... అక్కడున్న అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కళ్లు ఇంతింత చేసుకుని చూశారు. టెంకాయ కొట్టగానే మల్లెపూలు జలజలారాలాయి! గమనించి, మైండ్ గేమ్ ఆడతారు! ఇది అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండలం, మల్లోని చెన్రాయుని పల్లెలో జరిగింది. కొండ మీద చెన్రాయుని గుడి ఉండడంతో ఆ ఊరికి ఆ పేరే వచ్చింది. చెన్రాయుని గుళ్లో పూజారులు ఈ పని చేయరు. అక్కడికి దొంగ స్వాములు వస్తూ కొన్నాళ్లు ఉండి వెళ్లిపోతుంటారు. ఓ స్వామీజీ ఈ కొబ్బరికాయల తంత్రంతో జనాన్ని మోసం చేయసాగాడు. అతడి దగ్గరకు వచ్చే వాళ్లు కారులో వచ్చారా, ఖరీదైన దుస్తులు వేసుకున్నారా, ఒంటి మీద ఆభరణాలున్నాయా... వంటివన్నీ గమనిస్తారు. వచ్చిన వాళ్ల తాహతుకు తగ్గట్లు టోకరా వేసేవాడు. ముందుగా కొబ్బరికాయలో రక్తం చిందిస్తారు. లక్షలు గుంజిన తర్వాత పూలు తెప్పిస్తారు. బయటి ఊళ్ల వాళ్లకు జరిగినవి పెద్దగా బయటకు తెలిసేవి కాదు. అయితే శిల్ప విషయంలో... స్వామీజీ అత్యుత్సాహపడ్డట్లున్నాడు. మొదటి ప్రయత్నంలోనే పూలు తెప్పించి గొలుసు కాజేశాడు. టెంకాయలో పూలు తెప్పించి గొలుసు కాజేశాడనే సంగతి ఊరంతా పొక్కిపోయింది. మేము టెంకాయలు తీసుకెళ్లి పూలెలా తెప్పిస్తారో, రక్తం ఎలా తెప్పిస్తారో చేసి చూపించాం. తర్వాత ఊళ్లోని యువకులు సరదాగా ఈ ప్రయోగాలు చేసి నవ్వుకునేవారు. ఇప్పుడా ఊళ్లో ఎవరూ మంత్రాలు, తంత్రాలను నమ్మడం లేదు. - ఎస్. శంకర శివరావు, జెవివి జాతీయ మేజిక్ కమిటీ కన్వీనర్ పూలొచ్చాయి కదా.. ఆశ నెరవేరినట్లే... భక్తుల ఆశ్చర్య వదనాలను ఆనందంగా చూస్తున్నాడు స్వామీజీ. ‘‘నీ కోరికను స్వామి మన్నించాడు. నువ్వు డాక్టర్ అవుతావు’’ అని శిల్పతో చెప్పాడు. ఇదంతా చూస్తున్న ఒక భక్తురాలు ‘‘స్వామీ! పోయిన వారం నేను కొట్టిన కొబ్బరికాయ నుంచి రక్తం చిందింది. నాకు పూలెప్పుడు వస్తాయి?’’ ఆశగా అడిగింది. మరో మూడు వారాలకు మీ ఇంటిని పట్టిన పీడ తొలగిపోవాలి. ఐదో వారానికి నీ కొబ్బరికాయలోనూ పూలు రావచ్చు’’ సాలోచనగా చెప్పాడు స్వామీజీ. ఆమె గాల్లోకి చూస్తూ అంతా తమ దయ అని దండం పెట్టుకుంది. మిగిలిన భక్తులు వారి వారి వినతులు వెలిబుచ్చుతున్నారు. తాను వచ్చిన పని పూర్తి కావడంతో శిల్ప ఇంటికి వెళ్లడానికి లేచింది. ఆ పక్కనే ఉన్న స్వామి అనుచరులు ‘‘స్వామి వారికి దక్షిణ ఇవ్వాలి’’ అనడంతో హుండీలో వేయడానికి తన దగ్గరున్న డబ్బులు తీసింది. ‘‘స్వామి ఉన్న ఫళాన నీ కోరిక నెరవేరేటట్లు చేశారు. ఇంత చిన్న దక్షిణ ఇస్తావా?’’ అన్నారు. మా అమ్మ ఇచ్చిన డబ్బులో పూజ సామాను కొనగా ఇక నా దగ్గర ఇంతే ఉంది’’ అన్నదామె నిస్సహాయంగా. ‘‘నీ మెడలో బంగారు గొలుసుందిగా అమ్మా. నువ్వు డాక్టర్ అయితే ఇలాంటి గొలుసులు ఎన్నో కొనుక్కోవచ్చు. అసలు మీ అమ్మానాన్న అందరూ వారం వారం వస్తుంటే మీ ఇంటికి డబ్బు ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరుతుంది.’’ అని ఊదరగొట్టారు స్వామీజీ శిష్యులు. గత్యంతరం లేనట్లు, తాను చేస్తున్నది తప్పా, ఒప్పా అనే మీమాంసలోనే మెడలోని గొలుసు తీసి హుండీలో వేసి ఇంటి దారి పట్టింది శిల్ప. ఊరు నోరు తిరిచింది! ఇంటికెళ్లగానే శిల్ప మెడ బోసిగా ఉందని గుర్తించింది సరస్వతి. జరిగింది తెలుసుకున్నాక ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలే ఆడపిల్ల. ఆ స్వామీజీ గొలుసుతో సరిపెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది... అనుకుని అంతటితో ఆ సంగతిని వదిలేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసింది. తెలిసిన వాళ్లంతా వచ్చి పరామర్శిస్తున్నారు. జనవిజ్ఞానవేదిక కార్యకర్తలకూ తెలిసింది. వారొచ్చి ఇందులో తంత్రాలను తెలియచేయడంతో ఊరుఊరంతా స్పందించింది. స్వామీజీకి దేహశుద్ధి చేయాలన్నంత ఉద్రిక్తత ఏర్పడింది ఊరివాళ్లలో. ఇది తెలిసిన స్వామీజీ రాత్రికిరాత్రి పరారయ్యాడు. బంగారు గొలుసు తీసుకున్న చేతులకు ఇనుప గొలుసులు పడేలోపు అప్రమత్తమయ్యాడు స్వామీజీ. ఈ సంఘటనతో గ్రామం చైతన్యవంతమైంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇంటిప్స్
వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయడం చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది. వెడల్పాటి రెండు సెరామిక్ బౌల్స్ తీసుకొని, ఒకదాంట్లో వెల్లుల్లి రెబ్బలను వేసి, మరో బౌల్‌ను వాటి మీద గట్టిగా అటూ ఇటూ అదిమితే.. త్వరగా పొట్టు వచ్చేస్తుంది. బటర్‌ను తురుముతుంటే గుజ్జుగా అయిపోయి ప్లేట్‌కు అతుక్కుపోతుంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా మైదా పైన చల్లితే కొబ్బరి తురుములా వస్తుంది. కావల్సినంత ఐస్‌క్రీమ్ తీసుకున్నాక డబ్బాను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. దీంతో అది అడుగుభాగాన గడ్డకట్టిపోయి, తిరిగి తీయడానికి కష్టమవుతుంది. ప్లాస్టిక్ జిప్‌లాక్ కవర్లో ఐస్‌క్రీమ్‌ను డబ్బాను ఉంచి, ఫ్రిజ్‌లో పెట్టేస్తే తిరిగి తీసుకోవడం సులువు అవుతుంది. -
ప్లేట్ పూజ
కొబ్బరికాయ... టెంకాయ... నారికేళం... పేర్లేమైనా కాని పూజ చేయాలంటే ఇది పగలాల్సిందే. కాయ కొట్టు. దండం పెట్టు. మరి పొట్టకు? ప్లేట్ పూజ చేయాలంటే ఇది అక్కర్లేదా? పచ్చి కొబ్బరి... ఎండు కొబ్బరి... దాంతో ఒక కూర.. దీంతో ఒక భక్ష్యం... కార్తీకమాసం పూజపునస్కారాల మాసం. ప్రతి గుడిలో ఇంటిలో కొబ్బరి చిప్పలు పోగుపడే కాలం. ఆత్మ సంతృప్తికే కాదు జిహ్వ సంతృప్తికి కూడా ప్రయత్నించండి. గుడిలోకే కాదు... అలా కిచెన్‌లోకి కూడా నడవండి. గుప్... స్టవ్ మండింది. టప్... కొబ్బరి పగిలింది... స్టార్ట్. కొబ్బరి సెనగపప్పు కూర కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము - కప్పు, పచ్చి సెనగ పప్పు - కప్పు, కరివేపాకు - 3 రెమ్మలు, ఎండు మిర్చి - 6, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా. తయారీ: సెనగ పప్పుకు తగినంత నీరు జత చేసి ఉడికించాలి. (మరీ మెత్తగా అవ్వకూడదు. కుకర్‌లో కాకుండా విడిగా ఉడికించుకుంటే ముద్దలా అయిపోకుండా విడివిడిలాడుతూ వస్తుంది) బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ఉడికించుకున్న సెనగపప్పు వేసి బాగా కలపాలి కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా, మూత ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి వేడి వేడి అన్నంలో, కమ్మటి నెయ్యి వేసుకుని తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి వడలు కావలసినవి: బియ్యం - కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చి మిర్చి -4, ఉప్పు - తగినంత, క్యారట్ తురుము - పావు కప్పు, పుదీనా తరుగు - పావు కప్పు, అల్లం తురుము - టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తరుగు - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: బియ్యాన్ని సుమారు రెండు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి మిక్సీలో... నానిన బియ్యం, కొబ్బరి ముక్కలు, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి, ఉప్పు, అల్లం తురుము వేసి మెత్తగా తిప్పాలి మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తరుగు వేసి చేతితో బాగా కలపాలి బాణలిలో నూనె కాగగానే పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాట్ సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. కొబ్బరి బూరెలు కావలసినవి: పాలు - కప్పు, పంచదార - కప్పు, కొబ్బరి తురుము - కప్పు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ఏలకుల పొడి - టీ స్పూను, మినప్పప్పు - అర కప్పు, బియ్యం - కప్పు. తయారీ: ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి 2 టేబుల్ స్పూన్ల పెరుగు జత చేసి పాలు విరిగే వరకు కలపాలి పంచదార వేసి కరిగించాలి కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మిశ్రమం చిక్కబడేవరకు ఉంచి దించేయాలి మినప్పప్పు, బియ్యం ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బాలి తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి తురుము మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె కాగాక, కొబ్బరి ఉండను బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి, బూరెల మాదిరిగా నూనెలో వేసి, వేయించి తీసేయాలి. కొబ్బరి జున్ను కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ - కప్పు, పచ్చి కొబ్బరి తురుము - కప్పు, పెరుగు - కప్పు, ఏలకుల పొడి - టీ స్పూను. తయారీ: ఒక పాత్రలో కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్, పెరుగు వేసి బాగా కలిపాలి ఏలకుల పొడి జత చేసి మరో మారు కలపాలి ఒక పాత్రలో ఈ మిశ్రమం వేసి,ఇడ్లీ కుకర్‌లో కాని, రైస్ కుకర్‌లో కాని ఉంచి, విజిల్ లేకుండా సుమారు అరగంటసేపు ఉంచి దించాలి చల్లగా అందించాలి. కొబ్బరి పులుసు కావలసినవి: కొబ్బరి తురుము - కప్పు, చింతపండు - నిమ్మకాయంత (నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాలి), బియ్యప్పిండి - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఎండు మిర్చి - 6, మెంతులు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, నూనె - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట, రసం పొడి - టీ స్పూను. తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి కొబ్బరి తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి చింతపండు పులుసు, ఉప్పు వేసి బాగా కలిపి మరిగించాలి చిన్న గిన్నెలో బియ్యప్పిండి, చిన్న గ్లాసుడు నీళ్లు వేసి చిక్కగా కలిపి, మరుగుతున్న పులుసులో వేసి కలిపి ఉడికించాలి పులుసు చిక్కబడ్డాక, కరివేపాకు, పసుపు, రసం పొడి వేసి బాగా కలిపి, దించే ముందు కొత్తిమీర వేయాలి. కొబ్బరి పొడి కావలసినవి: ఎండు కొబ్బరి చిప్ప - 1, పుట్నాల పప్పు - 2 కప్పులు, ఎండు మిర్చి - 7, సెనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, నెయ్యి - టేబుల్ స్పూను. తయారీ: ముందుగా ఎండు కొబ్బరిని సుమారు గంటసేపు ఎండలో ఎండబెట్టాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి పొడిలా వచ్చేలా పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి పుట్నాల పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, పచ్చిసెనగ పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాక, ఎండు మిర్చిని మాత్రం వేరు చేసి, జీలకర్ర జత చేసి వేయించి తీసేయాలి మిగిలిన నేతిలో కరివేపాకు వేయించి తీసేయాలి పాత్రలో కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి, పోపు సామాను, కరివేపాకు వేసి బాగా కలపాలి వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో తింటే రుచిగా ఉంటుంది. (సూచన: కొబ్బరిని ఎక్కువ సేపు మిక్సీలో తిప్పకూడదు. అలా చేస్తే ఎండు కొబ్బరి నుంచి నూనె వచ్చే అవకాశం ఉంటుంది) -
టెంకాయ మీది పీచు... తలకాయ మీది కుచ్చు!
హ్యూమర్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ -
కొబ్బరికాయ ఒకటే.. కానీ..
మిర్యాలగూడ టౌన్: కొబ్బరికాయ ఒక్కటే.. దాన్ని కొట్టి చూస్తే లోపల రెండు భాగాలు కనిపించాయి. ఈ విశేషం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్‌లో చోటు చేసుకుంది. శ్రీరామనవమి పూజలో భాగంగా శనివారం కొండవీటి శేఖర్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టగా అందులో రెండు కాయలుగా ఉండడాన్ని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదేదో మంచి పరిణామంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు కూడా చూసేందుకు వారింటికి క్యూకట్టారు. -
పే..ద్ద ‘బొండా’
వరంగల్: కొబ్బరిబొండా సాధారణంగా కేజీ నుంచి రెండు కేజీల వరకు ఉంటుంది.. కానీ.. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌లో విఘ్నేశ్వర కొబ్బరిబొండాల యజమాని వద్ద దాదాపు 6 కేజీల బరువున్న బొండా ఉంది. 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న తాను ఇంతవరకు ఇంత పెద్ద బొండా చూడలేదని, దీనిని బెంగళూరు నుంచి తెప్పించినట్లు చెప్పాడు. ఎవరికీ విక్రయించకుండా అందరికీ కనపడే విధంగా దుకాణం ఎదుట పెట్టాడు. దీనిని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బొండా పీచు తీసి దేవుడి వద్ద కొడతానని రవి చెప్పాడు. -
భక్తజన సంద్రం
బొంరాస్‌పేట : కిక్కిరిసిన భక్త జనం.. ‘ఎల్లమ్మమాతాకి జై’అంటూ నినాదాలు.. జమిడీకె, డప్పుల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వేలాది మంది శివసత్తుల భక్తిపారవశ్యం ఎదుట పసుపు, గవ్వలబండారు చల్లుతూ అవ్మువారికి భక్తుల ప్రణామాలు చేయడం వంటి కార్యక్రమాలతో శుక్రవారం బొంరాస్‌పేట మండలం పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం(సిడె) శుక్రవారం సాయంత్రం భక్త జనసంద్రంగా మారింది. ‘మావురాల ఎల్లమ్మతల్లి’ మూలవిరాట్‌ను సిడెపై ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఎల్లమ్మ దేవత 50అడుగుల ఎత్తులో నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు రెండులక్షల వుందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి కోనేరులో భక్తులు స్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. రోజంతా కోడిపుంజులు, మేకపోతులు, కొబ్బరికాయులు, బోనపుకడువలతో భక్తులు అవ్మువారికి నైవేద్యంపెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి సన్నిధిలో.. ప్రముఖులు వుహబూబ్‌నగర్ మాజీ ఎంపీ డి.విఠల్‌రావు, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సలీం, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ ముదిగండ్ల కృష్ణ, కోస్గి మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ వెంకట్రాములుగౌడ్, తహశీల్దార్ వెంకటయ్య, ఆలయకమిటీ చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, మాజీచైర్మన్ రామకృష్ణారెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రాజేందర్‌రెడ్డి, రేణుకాఎల్లవ్ము యువజన సంఘం అధ్యక్షుడు బుగ్గప్ప తదితరులు దర్శించుకున్నారు. -
కోతి-కొబ్బరికాయ
కథ ఒక అడవిలో ఓ కోతి ఉండేది. ఓ రోజు దానికి ఒక గుడి దగ్గర ఒక కొబ్బరి కాయ దొరికింది. కోతి కొబ్బరికాయను పగులగొట్టి తినాలని ప్రయత్నించింది. కానీ కోతి ఎంత ప్రయత్నించినా కొబ్బరి కాయ పగులలేదు. దానితో విసుగుపుట్టి ఆ కాయను ఎక్కడైనా దాచిపెడదామని ఆలోచిస్తూ చుట్టూ చూసింది. చెట్ల ఆకులు మేస్తున్న రెండు ఏనుగులు కనిపించాయి దానికి. కోతి వెంటనే వాటి దగ్గర ఉన్న చెట్టు పైకి దూకి, ‘‘మిత్రులారా! ఎప్పుడూ రుచీ పచీ లేని ఆకులు తినడమేనా? ఇదిగో ఈ కొబ్బరికాయ తినండి. చాలా రుచిగా ఉంటుంది. కాని నేను మీకు ఒక పోటీ పెడతాను. అందులో గెలిచిన వారికే ఇది ఇస్తాను’’ అని కొబ్బరికాయను వాటికి చూపిస్తూ అంది. ‘‘పోటీకి మేం సిద్ధం’’ అని అన్నాయి ఏనుగులు ముక్తకంఠంతో. ‘‘అయితే ఎదురుగా కనిపిస్తున్న ఆ జామచెట్టును వేళ్లతో సహా పెకలించాలి. ముందుగా ఎవరు అలా చేస్తారో వారికి ఈ కొబ్బరికాయ ఇస్తాను’’ ఊరిస్తూ అంది కోతి. వెంటనే ఒక ఏనుగు ఆ జామచెట్టు దగ్గరికి వెళ్ళింది. రెండో ఏనుగు మాత్రం కదలకుండా అలాగే నిల్చుంది. ‘‘మిత్రమా! నీకు ఈ కొబ్బరికాయ వద్దా?’’ అని అడిగింది కోతి దాన్ని. అందుకు ఆ ఏనుగు ‘‘నేస్తమా! ఒక కొబ్బరికాయ కోసం ఎన్నో పళ్ళు కాసే జామచెట్టును నాశనం చేయటమా? ఎన్నో జీవాలకు ఆశ్రయం, ఆహారం లేకుండా చేయటమా? అలా చేయలేను’’ అని అంది. ఏనుగు వివేకానికి, ప్రకృతిపై దానికున్న ప్రేమకు మెచ్చి, కోతి ఆ కొబ్బరికాయను రెండో ఏనుగుకు ఇచ్చేసింది. -
కొబ్బరి పాలు + పుల్ల మజ్జిగ..!
పంట పెట్టడం ఒకెత్తయితే.. అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్లో నూరారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారు చేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే అక్సిన్స్, గిబ్బర్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని.. ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి.. వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నర్రెంగ మొక్కలు దొరక్కపోతే? మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి.. ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టు కోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి. -
దండంతో సరిపెట్టుకోవాల్సిందే..!
సాక్షి, ముంబై: ప్రముఖ నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూల హారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రిని నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని కొత్త ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు కమిటీ తెలిపింది. దీంతో ఎంతో భక్తిశ్రద్ధలతో శివున్ని దర్శించుకునేందుకు అంత దూరం వెళ్లిన భక్తులు కేవలం నమస్కారం వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో నిత్యం ఈ ఆలయాన్ని వేలాదిమంది సాధారణ భక్తులు, ప్రజలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు. నాసిక్ జిల్లాలో పంచవటి, త్రయంబకేశ్వర్ సమీపంలో ఉన్న కొండ వద్దే గోదావరి నది పుట్టింది. అదేవిధంగా నాసిక్ జిల్లాకు 90 కి.మీ. దూరంలో ప్రముఖ షిర్డీ పుణ్య క్షేత్రం కూడా ఉంది. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు త్రయంబకేశ్వర్‌ను దర్శించుకోనేదే ఉండలేరు. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమీ లేవు. ఇక్కడ అందరూ సమానమే. అందువల్ల ఎవరైనా ఎవరైనా దేవుడిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్లాల్సిందే. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల సంఖ్య కూడా పెరగసాగింది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తరుచూ కేంద్ర గూఢచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు,హారాలు, మిఠాయి బాక్స్‌లు తదితర అర్చన సామగ్రిని నూతన సంవత్సరం నుంచి నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
కొబ్బరికి తెగుళ్ల బెడద
ఎస్.రాయవరం మండలంలో నల్లముట్టె పాయకరావు పేటలో గ్రెబ్లెయిట్ నివారణ చర్యలు చేపట్టాలంటున్న ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు అనకాపల్లి: వాతావరణ ప్రతికూల పరిణామాలు సీజన్ పంటలకే కాదు దీర్ఘకాలిక పంటలు, చెట్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. వివిధ మండలాల్లో కొబ్బరికి సోకుతున్న తెగుళ్లను ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సీ.వీ రామారావు, ప్రదీప్‌లు గుర్తించారు. జిల్లాలోని ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల కొబ్బరి రైతుల తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రే బ్లెయిట్ తెగులు... పాయకరావుపేట మండలంలోని కొబ్బరి తోటల్లో గ్రే బ్లెయిట్ తెగులును గుర్తించినట్లు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సీ.వీ రామారావు తెలిపారు. దీని లక్షణం చెట్టు ఆకులపై ముందుగా పసుపు రంగు మచ్చలుగా ఏర్పడి నలుపు రంగుకు మారతాయి. ఆకులు ఎండిపోయి మట్టలు రాలిపోతాయి. మట్టలు రాలిపోతే కాయ దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మట్టలను కొట్టి తగులబెట్టాలి. లీటర్ నీటికి మూడు గ్రాముల కాఫర్ ఆక్సీక్లోరైడ్‌ను లేదా 100 మిల్లీలీటర్ల నీటికి రెండు మిల్లీలీటర్ల టెబుకొనజోల్ ప్రొఫికొనాజోల్ను కలిపి వేరు ద్వారా చెట్టుకు అందేటట్టు పిచికారీ చేయాలి. నల్లముట్టె తెగులు... ఎస్ రాయవరం మండలంలోని కొబ్బరి తోటల్లో నల్లముట్టెతెగులును ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని లక్షణాల మేరకు పురుగు సోకినపుడు పత్ర హరితం తినడం వల్ల ఆకుపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి అధికంగా ఉంటే తోట మాడిపోతుంది. దీని నివారణకు గాను పురుగు సోకిన మట్టలు కొట్టివేయాలి. 10మిల్లీ లీటర్ల మోనోక్రోటపాస్ను 10 మిల్లీ లీటర్ల నీటికి కలిపి వేరు ద్వారా అందించాలి. -
రోగాలను నిరోధించే పచ్చికొబ్బరి
అన్నానగర్: పచ్చి కొబ్బరిలో కేవలం 50 శాతానికి మించి కొవ్వు ఆమ్లాలు లేవని, వీటిని మన దేహం పూర్తిగా శక్తిగా మారుస్తుందే కానీ మిగిలిన నూనెలకు మల్లే శరీరంలోని కొవ్వును వృద్ధి చేయదని న్యూట్రీషనిస్టులు చెప్పారు. కొబ్బరిలోని మోనోలారిన్ అనే పదార్థం మెదడును ఆరోగ్యంగా ఉంచి పక్షవాతం రాకుండా నివారిస్తుందని తెలిపారు. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి జీవులను శరీరంలో ఎదగనివ్వదన్నారు. కొబ్బరి తినేవారికి ఇన్ఫెక్షన్లు సోకవని పేర్కొన్నారు. కొబ్బరిలో సిలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, మాంగనీస్, కాపర్ వంటి లోహాలున్నాయన్నారు. అదేవిధంగా అకాల వృద్ధాప్యాన్ని నివారించే విటమిన్ ఈ, శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్ సితో పాటుగా బి-వన్, బి-త్రీ, బి-ఫైవ్, బి-సిక్స్‌లు సమృద్ధిగా ఒక్క కొబ్బరిలోనే లభ్యం అన్నారు. వాస్తవానికి కొబ్బరి వాడకపోవడం వల్లనే పిల్లల్లో పోషకాహార లోపాలు కన్పిస్తున్నాయని న్యూట్రీషనిస్టులు స్పష్టం చేశారు. ఉదయం తొమ్మిది గంటల లోపల కొబ్బరితో చేసిన పదార్థాలు తింటే ఎంతో మంచిదన్నారు. ఉదయం వేళ నూనెతో చేసిన వస్తువులను తినరాదని అయితే నూనె శాతం తక్కువ కలిగిన కొబ్బరి పదార్థాలు అంటే కొబ్బరి చట్నీ వంటి వాటిని తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ఎండుకొబ్బరి కంటే అప్పటికప్పుడు కొట్టిన పచ్చి కొబ్బరి వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. కొబ్బరిలో పాలీశాచ్యురేటడ్ తైలాలు ఎక్కువ అన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. కొబ్బరి జాతి వాస్తవానికి ఆస్ట్రేలియా దేశానిదని అయితే ఇవి భారతీయుల జన జీవనంలో ఒక ప్రధాన భాగమైపోయాయన్నారు. ఎండు కొబ్బరిని కొంచెం తక్కువగా వాడటం మంచిదని వీరు చెబుతున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం కొన్ని కంపెనీలు కొబ్బరి మంచిది కాదని చెప్పడం విచారకరమన్నారు. -
కన్నుపడింది..కప్పేశారు!
అమలాపురంలో గెడ్డ, చెరువు ఆక్రమణ రూ.2 కోట్ల విలువైన భూమికి టెండర్ గెడ్డ, చెరువులను కప్పేసి కొబ్బరి, టేకు సాగు ఆర్డీవో తనిఖీతో వెలుగులోకి కుంభకోణం రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు నక్కపల్లి,న్యూస్‌లైన్: కన్నుపడిందే తడవు అక్రమార్కులు చెలరేగిపోయారు. ఏకంగా చెరువు, కాలువలను పొక్లయిన్‌తో కప్పేసి చదును చేసేశారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన భూమిని దర్జాగా ఆక్రమించేసి టేకు, కొబ్బరి సాగు చేపట్టేశారు. ఇంత జరిగినా మండల రెవెన్యూ సిబ్బందికి ఈ విషయం తెలియదట. అసలు వారికి సమాచారమే లేదట. గురువారం మండలంలోని ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు వచ్చిన నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక రెవెన్యూ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినందునే రెవెన్యూ సిబ్బంది నోరు మెదపలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... అమలాపురం సర్వే నంబర్ 270లో 18.7 ఎకరాలు గెడ్డ ప్రాంతం, సర్వే నంబర్ 295లో 4.17 ఎకరాలు చెరువు గర్భం ఉంది. వీటిని ఆనుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎస్.ఈశ్వరరెడ్డి కుటుంబీకులకు సర్వేనంబర్ 294/1లో 1.2 ఎకరాలు, సర్వే నంబర్ 294/2లో 1.22 ఎకరాలు, 294/3ఎలో 1.85 ఎకరాలు, 294/3బిలో 0.25 సెంట్లు జిరాయితీ భూమి ఉంది. ఈ భూములను ఆనుకుని రెవెన్యూ రికార్డుల్లో గెడ్డగా నమెదయిన 5 ఎకరాలతోపాటు పద్దరాజు చెరువుగా రికార్డుల్లో ఉన్న 4.17 ఎకరాల్లో కొంతభూమిని అప్పలకొండ, సూర్యనారాయణరాజు, ఈశ్వరరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించేశారు. అందులో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని విస్తరించేశారు. కబ్జా భూముల్లో బోర్లు ఏర్పాటు కోసం విద్యుత్లైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చెరువును అడ్డంగా తవ్వి జిరాయితీ, ఆక్రమిత భూముల్లోకి రాకపోకలు సాగించేందుకు పక్కారోడ్డు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. కొంతమంది సిబ్బంది సహాయంతో ఆక్రమిత భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు సంపాదించేందుకు కబ్జాదార్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. కోస్తాతీరం వెంబడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పీసీపీఐఆర్‌లో నక్కపల్లి మండలం క్లస్టర్‌గా ఉంది. పీసీపీఐఆర్కోసం సేకరించే భూముల్లో అమలాపురం కూడా ఉండటంతో ఆక్రమణదార్లు ప్రభుత్వ భూములపై దృష్టిసారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భూముల ధర ఎకరా రూ15 నుంచి 20 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వం సేకరించినా దాదాపు ఇదేధర ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిరాయితీతోపాటు డీఫారం పట్టాభూములకు 70 శాతం నష్టపరిహారం వచ్చే అవకాశం ఉండటంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడుతోంది. ఆక్రమణపై ఫిర్యాదు అందడం వల్లే తనిఖీలకు వచ్చారని మరికొందరు చెప్పుకుంటున్నారు. అనుమానంతో పరిశీలన ఆక్రమణలపై ఎటువంటి ఫిర్యాదు అందలేదు. మండలంలోని ప్రభుత్వ భూముల పరిశీలనకు మాత్రమే అమలాపురం వచ్చాను. చెరువు గర్భంలోంచి రోడ్డు వేయడం చూసి అనుమానంతో ఆరాతీశాను. రోడ్డువేసిన ప్రాంతాన్ని ఆనుకుని సాగులో ఉన్న భూములు ప్రభుత్వానివని రెవెన్యూ అధికారుల నుంచి వివరణ వచ్చింది. దీంతో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గుర్తించాను. అయితే ఎంత భూమి ఆక్రమణకు గురైందన్న దానిపై పూర్తి వివరాలు సర్వేచేసి ఇవ్వాలని తహశీల్దార్, సర్వేయర్లను ఆదేశించడం జరిగింది. నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయి. - సూర్యారావు, నర్సీపట్నం ఆర్డీవో -
అమరిక : కొబ్బరి తినేశారా? అయితే డిజైన్ రెడీ!
కొబ్బరికాయను జాగ్రత్తగా కొడితే.. రెండు సమానమైన ముక్కలవుతాయి. లోపలి నీరు తాగి, కొబ్బరి తినేశాక చిప్పలను ఓ వైపుకు పడేసి చేతులు దులుపుకోవడం సాధారణంగా జరిగేదే! ఓ సారి ఈ కళాత్మక వస్తువులను చూశారంటే పడేసిన కొబ్బరిచిప్పలను వెతుక్కోవడం ఖాయం. ఇవే కాదు ఎండిన కొబ్బరిబొండాలు, కొబ్బరికాయలు ఇంట్లో అలంకరణ వస్తువులుగా రకరకాలుగా రూపొందించవచ్చు. ఇందుకు కావలసింది తగినంత నైపుణ్యం, ఓపిక. కావలసినవి: ఎండు కొబ్బరిబొండాలు, కొబ్బరికాయలు, కొబ్బరిచిప్పలు, సిలికాన్ కార్బైడ్ పేపర్ (కొబ్బరికాయ పైన స్మూత్ ఫినిషింగ్ చేయడం కోసం), స్క్రూలు, స్ట్రా, వార్నిష్, పైన అతికించడానికి రంగురంగుల పేపర్లు, గ్లూ, రంధ్రాలు చేయడానికి మేకు లేదా డ్రిల్లర్! అవసరాన్ని బట్టి మరికొన్ని ఉపకరణాలను వాడచ్చు లేత కొబ్బరికాయల్లో నీరు తీసేసి వాడుకోవాలంటే పైన (మూడు కన్నులు ఉన్న చోట) రంధ్రం చేసి, స్ట్రాతో నీరంతా తీసేయాలి సిలికాన్ కార్బైడ్ పేపర్ రఫ్‌గా ఉన్న వైపు తీసుకొని కొబ్బరి చిప్ప పై భాగాన్ని బాగా రుద్దాలి. దీంతో పైన ఉండే పీచు అంతా పోయి పై భాగం నునుపుగా అవుతుంది రెండు చిప్పలకు (పగలకుండా) రంధ్రాలు చేసి స్క్రూలు బిగించవచ్చు. ఆభరణాలు దాచుకునే పెట్టెగా రూపొందించవచ్చు లేదంటే చిన్న పూజామందిరంలా తయారుచేయవచ్చు ఎండుకొబ్బరిబొండాన్ని చాకుతో చెక్కి, కోతి బొమ్మ చేయవచ్చు. పిల్లలూ ఈ పనిలో పాలుపంచుకునేలా చేస్తే కొబ్బరి వల్ల కలిగే ఉపయోగాలన్నో వారికి తెలియజేసే వీలుంటుంది. ప్రకృతితో మమేకం చేసే అవకాశం లభిస్తుంది. సృజనాత్మకత, నైపుణ్యం ఉపయోగిస్తే లెక్కలేనన్ని అలంకరణ వస్తువులు మీ చేతుల్లోనే రూపుదిద్దుకుంటాయి. మీషోకేస్లో కనువిందుచేస్తాయి. అప్పుడిక కొబ్బరిచిప్పలను ఎవరు పడేసినా ఊరుకోరు. మీ కోకోనట్ షెల్ఫ్ చూసిన వారు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేరు. -
చాక్లెట్ అండ్ కోకనట్ ఫట్స్