
బ్యూటిప్స్
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ తలకు పట్టించినట్లయితే జుట్టు తెల్లబడడం తగ్గుతుంది.
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ తలకు పట్టించినట్లయితే జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. అప్పుడప్పుడే తెల్లబడుతుంటే క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఈ రెండింటినీ కలుపుకోవడం సాధ్యం కానప్పుడు వంద గ్రాముల కొబ్బరి నూనెలో 50 మి.లీ నిమ్మరసం కలిపి మరిగించి నిల్వ చేసుకుని వాడుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని నిమ్మరసంలోని నీటిశాతం ఆవిరయ్యే దాకా వేడి చేయాలి. వేడయ్యేటప్పుడు చిటపట శబ్దం రావడం తగ్గిందంటే నీటిశాతం లేదని అర్థం.