
హైదరాబాద్: బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు చేసిన ప్రచారం పాతబస్తీలో హల్చల్ సృష్టించింది. ఢిల్లీకి చెందిన వకీల్ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్ పేరుతో కటింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించింది.
వకీల్ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్‌ను బట్టతలపై రాసేవాడు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో నగరవ్యాప్తంగా కొందరు బట్టతల ఉన్న వారు ఆందోళన చేపట్టినట్లు సమాచారం. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని కాలాపత్తర్ ఇన్‌స్పెక్టర్ ఆసిఫ్ తెలిపారు.
గుండు గీసి కెమికల్స్ రాసి పంపిన షకీల్ భాయ్.. సైడ్ ఎఫెక్ట్… pic.twitter.com/l2rKpDE1x1— Telugu Scribe (@TeluguScribe) April 7, 2025