Bald
-
Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే..
బట్టతల వచ్చినందుకు చాలా మంది మగవారు బాధపడుతూ ఉంటారు. తలపై వెంట్రుకలు లేని తమను ఎవరు చూస్తారని చింతిస్తూ ఉంటారు. కానీ బట్టతల ఉన్నవారికీ ఫ్యాన్స్ ఉన్నారు. గూగుల్‌లో బట్టతల అందగాళ్ల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, శారీరక లక్షణాల ఆధారంగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ప్రిన్స్ విలియం (Prince William) "2023లో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్"గా ఎంపికయ్యాడు. అమెరికన్ యాక్టర్ విన్ డీజిల్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్లను అధిగమించి టాప్‌లో నిలిచాడు. బట్టతల సెలబ్రిటీలను షర్టు లేకుండా చూడటానికి ఇంటర్నెట్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారన్న దానిపై రీబూట్ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు రూపొందించింది. బట్టతల సెలబ్రిటీల ఎత్తు, నెట్‌వర్త్, ముఖ నిష్పత్తి, బట్టతల మెరుపు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఈ "సెక్సీ" స్కోర్‌లో 10కి 9.88 స్కోర్‌తో ప్రిన్స్ విలియం అగ్రస్థానంలో నిలిచాడు. మిర్రర్ కథనం ప్రకారం.. సెలబ్రిటీల వాయిస్ ఫ్రీక్వెన్సీని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. అధ్యయనం మేరకు ప్రిన్స్ విలియం నెట్‌వర్త్ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.832 కోట్లు), ఎత్తు 1.91 మీటర్లు. ఇక వాయిస్ వియషంలో 10కి 9.91 స్కోర్, బట్టతల మెరుపులో 8.90 స్కోర్ సాధించాడు. మరోవైపు అమెరిన్ యాక్టర్ విన్ డీజిల్ 8.81 టోటల్ స్కోరుతో రెండవ స్థానంలో, జాసన్ స్టాథమ్ 8.51 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 7.12 స్కోర్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. -
వైరల్‌గా మారిన క్రాంతిదాస్ ఫొటోలు.. ఇంతకీ ఆమె ఎవరు!
‘కురులున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నట్లు ఎంత పొడవాటి కురులుంటే అంత అందంగా భావిస్తారు చాలా మంది మహిళలు. తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే శిరోజాలను కాపాడుకునేందుకు ఎన్నో రకాల సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఉరుకు పరుగుల నేటి ఆధునిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యంతో కురులు ఊడిపోతున్నాయి. వాలుజడ అన్నమాట బాపు సినిమాల్లోని హీరోయిన్లకు మాత్రమే పరిమితమైపోయింది. ఊడిపోతున్న జుట్టు.. కోల్పోతున్న అందం.. మహిళల ధైర్యాన్ని.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో వారు ఆత్మనూన్యతా భావానికి గురవుతున్నారు. బయట ప్రపంచానికి ముఖం చాటేస్తున్నారు. అలాంటి మహిళల్లో ధైర్యాన్ని నింపేందుకు ఓ మగువ పెద్ద సాహసమే చేసింది. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ క్యాంపెయిన్‌లో భాగస్వామిగా మారింది. తన ఒత్తైన.. నిగనిగలాడే శిరోజాలను తొలగించుకుంది. సోషల్ మీడియాలో గుండుతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసి.. మహిళల్లో మనోస్థైర్యం నింపేందుకు ముందుడుగు వేసింది. ఆమే క్రాంతిదాస్. ఈ ఆలోచనల వెనుక కారణాలు ఆమె మాటల్లోనే విందాం.. మద్దిలపాలెం(విశాఖ తూర్పు): అమ్మకు తల వెంట్రుకలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని గుర్తించాం. దీంతో ఆమె బయటకు రావడానికి ఇబ్బందులు పడేది. ఎక్కడికైనా వెళ్లాలంటే స్కార్ఫ్ వేసుకుని వెళ్లేది. దీన్ని చూసి నేను ఆలోచనలో పడ్డాను. అదే సమయంలో క్యాన్సర్ రోగులు పడుతున్న ఇబ్బందులు నన్ను కదిలించాయి. మహిళలకు జుట్టే అందం. క్యాన్సర్, పోషకాహార లోపం, కాలుష్యం, తదితర కారణాలతో చాలా మంది జుట్టును కోల్పోతున్నారు. తక్కువ జుట్టు/గుండుతో బయట తిరగలేక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి మహిళల్లో ఆత్మస్థైర్యం నింపాలనే దఢృమైన ఆలోచన నాలో మెదిలింది. నా జుట్టును తొలగించుకుని.. బాధిత మహిళలకు అండగా ఉండాలని భావించాను. కుటుంబ సభ్యులు, భర్త ఆమోదంతో నా కురులను షేవ్ చేసుకున్నాను. 40 రోజులుగా హెడ్ షేవ్.. ఇలాంటి వారిని చూసిన తర్వాత.. వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తలంపు వచ్చింది. బట్టతల ఉన్న వారు జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పూర్తిగా జట్టురాని వారు విగ్గులు పెట్టుకుని.. ఇబ్బందిగానే కాలం వెల్లదీస్తున్నారు. ఇలా ఎంత కాలం? మీలో మీకే మార్పు రావాలి. ముందుగా మిమ్మల్ని మీరే ఇష్టపడాలి. అప్పుడు అందం కంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అని బాధిత మహిళలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఒత్తుగా ఉన్న నా జట్టును తొలగించుకున్నాను. క్లీన్ హెడ్ షేవ్ చేసుకున్నాను. 40 రోజులుగా పూర్తిగా గుండుతోనే ఉంటున్నా.. కొన్నాళ్ల పాటు ఇలానే ఉంటా. నా పరిధిలో సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో నేను గుండుతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తున్నాను. జట్టు రాలిపోయిన మహిళలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. గుండుతోనూ మహిళ అందంగా ఉంటుందనే భావన కలిగేందుకు ప్రయత్నం చేస్తున్నా.. నా గుండు ఫొటోలు చూసి కొందరైనా మనోస్థైర్యం పొందుతారని ఆకాంక్షిస్తున్నా.. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ జుట్టులేని వారు వారిలో అలాంటి లోపం ఉందనే భావనే కలగకూడదు. అలా ఉండడం నేటి రోజులు ఓ ట్రెండ్ అనే ఆలోచన రావాలి. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే అంశం ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్యాంపెయిన్ హాలీవుడ్లో జోరుగా సాగుతోంది. గతంలో హీరోయిన్ సోనాలి బింద్రే సైతం ఇలాంటి క్యాంపెయిన్ చేశారు. మనీషా కోయిరాల క్యాన్సర్‌ను జయించారు. అప్పటో వారు జట్టు కోల్పోయిన పరిస్థితిలో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. సాటి మనిషిని ప్రేమించాలి మనిషిని మనిషిగా ప్రేమించడం.. వారిలో లోపాలను వెతుకుతూ.. ఆత్మనూన్యత భావాన్ని కలిగించడం భావ్యం కాదు. అలాంటి వారిని మనతో సమానంగా చూసుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినవారమవుతాం. అదే నా లక్ష్యం.. స్వతహాగా నేను జంతు ప్రేమికురాలిని. జంతువులకు ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఎంతో మదన పడుతుంటాను. గతంలో వైజాగ్ కేంద్రంగా రతన్ టాటా సంస్థతో కలిసి జంతువుల సంరక్షణపై పనిచేశాను. వీధుల్లో సంచరించే జంతువులకు రిఫ్లెక్టివ్ కాలర్లు పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాను. ప్రస్తుతం విశాఖ, బెంగళూరులో జంతువుల సంరక్షణపై పనిచేస్తున్నాను. కుటుంబ నేపథ్యం.. నగరంలోని మురళీనగర్‌లో చేముడూరి క్రాంతిదాస్ నివాసం ఉంటున్నారు. ఆమె భర్త నాగతేజ చేముడూరి ఐటీ రిక్యూటర్. తండ్రి జగదీష్ నేవీలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. తల్లి శారదదాస్ గృహిణి. జుట్టు రాలిపోవడానికి బోలెడు కారణాలు వెంట్రుకలంటే ఆఫ్టరాల్ అని కొట్టిపారేసే విషయం కాదు. వాటి కోసం ఒక్కొక్కరు ఎంత క్షోభపడుతుంటారో... అవి రాలిపోతున్నవారికే తెలుస్తుంది. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడీపడని కాస్మోటిక్స్.. అన్నింటి ఫలితం జుట్టు రాలిపోతుంది. మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలాంటి కారణాలతో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు ఒత్తుగా లేకపోకపోతే తోటి ఆడపిల్లలే ఎగతాళి చేసే పరిస్థితులు అక్కడ క్కడా వెలుగుచూస్తుంటాయి. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. జుట్టు లేనివారితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ కారణంగా జట్టును పూర్తిగా తొలగిస్తారు. అలోపిషియా బారిన పడిన పడిన మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాంటి వారు జట్టును పూర్తిగా కోల్పోతారు. పూర్తిగా రూపం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి డిజార్డర్ బారిన పడిన మగువలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. -
ఈ చిన్నారి కష్టం తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది
ఇంగ్లండ్/ బ్రిస్టల్: కరోనా మహమ్మారి ఏ నిమిషాన ఈ ప్రపంచంలో అడుగుపెట్టిందో తెలియదు కానీ... మనుషులెవరిని ప్రశాంతంగా బతకనీయడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా బాధిస్తోంది. ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ చాలా మందిపై ఆర్థిక, మానసిక ప్రభావం చూపింది. పాఠశాలలు మూసివేయడం.. బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఇంటికే పరిమితం కావడంతో పిల్లలు కూడా డిప్రెషన్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఒత్తిడి భరించలేక ఎనిమిదేళ్ల చిన్నారి చేసుకున్న కొత్త అలవాటు ప్రస్తుతం తన జీవితాన్ని నరకప్రాయం చేసింది. స్నేహితులు, చుట్టుపక్కల వారు గేలి చేస్తూ ఏడిపిస్తున్నారు. ఆ చిన్నారి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. (చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా ఇంగ్లండ్, బ్రిస్టల్ నగరానికి చెందిన అమెలియా అనే ఎనిమిదేళ్ల చిన్నారి.. మొదటిసారి 2020లో విధించిన లాక్డౌన్ కాలంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దాన్ని తట్టుకోలేక కనురెప్పలను లాగి పడేయ్యడం ప్రారంభించింది. ఆ అలవాటు అలానే కొనసాగి.. చివరకు తల వెంట్రుకలను కూడా అలానే లాగసాగింది. కొన్ని రోజుల్లోనే బాలిక కనురెప్పలు, తలలో ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు పూర్తిగా మాయమయ్యాయి. అమెలియా పరిస్థితి చూసిన ఆమె తల్లి.. స్నేహితులను కలవకుండా ఉండటం, పాఠశాలకు వెళ్లకపోవడం వల్లే.. తన కుమార్తె ఇలా అయ్యిందని భావించింది. ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్లో డాక్టర్ని సంప్రదించి కుమార్తె పరిస్థితిని వివరించింది అమెలియా తల్లి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తను ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతుందని వెల్లడించారు. ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా (చదవండి: వైరల్: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..) కొద్ది కాలం తర్వాత లాక్డౌన్ ఎత్తేశారు.. పాఠశాలలు తెరిచారు. కానీ అమెలియా మాత్రం తన అలవాటును మానుకోలేకపోయింది. వైద్యుల ప్రకారం జనాభాలో ప్రతి 50 మందిలో ఒకరు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళన, ఏదైన బాధ. ప్రస్తుతం అమెలియా తల మీద.. అది కూడా వెనకభాగంలో మాత్రమే కొన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయి. విగ్గు, స్కార్ఫ్ లేకుండా అమెలియా బయటకు వెళ్లడం లేదని ఆమె తల్లి తెలిపింది. ఈ వ్యాధి కారణంగా తన కుమార్తె ఎన్నో అవమానాలు ఎదుర్కొందని.. తోటి పిల్లలు తనను ఏడిపించారని.. ఫలితంగా అమెలియా మరింత డిప్రెషన్‌కు గురైందని తెలిపింది. (చదవండి: అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా అమెలియా తల్లి మాట్లాడుతూ.. ‘‘తను ప్రారంభంలో కనురెప్పలను లాగుతున్నప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ తన కనురెప్పలు పూర్తిగా పోయాయో అప్పుడు నాకు భయం వేసింది. ఈ అలవాటును మాన్పించాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. అలా పెరుగుతూనే ఉంది. చివరకు తల వెంట్రుకలను లాగడం ప్రారంభించింది. ప్రస్తుతం తన తల వెనకభాగంలో మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. ముందు భాగం అంతా గుండయ్యింది’’ అని వాపోయింది. తన కూతురు పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న అమెలియా తల్లి, ఆమెను వారం వారం స్కూల్ థెరపిస్ట్, ప్రైవేట్ హిప్నోథెరపీ సెషన్లకు తీసుకెళ్తుంది. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని తెలిపింది. అంతేకాక ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతున్నారని కానీ ఇప్పటికీ దాని గురించి పెద్దగా అవగాహన లేదని.. పరిస్థితికి చాలా తక్కువ మద్దతు ఉందని వాపోయింది. చదవండి: ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు -
బట్టతల దాచి పెళ్లి: భర్తకు షాకిచ్చిన భార్య!
పెళ్లికి ముందు అందరూ ఎదో ఒక తప్పు పని చేసే ఉంటారు. వేరే వ్యక్తిని ప్రేమించి ఉండటం, చెడు అలవాట్లకు దగ్గరవడం. అయితే పెళ్లి సమయం వచ్చేసరికి కాబోయే భార్య, భర్త దగ్గర ఇలాంటి విషయాలను దాచిపెట్టేస్తుంటాం. కానీ వివాహం అనంతరం ఎదో ఒకరోజు మనకు సంబంధించిన రహస్యాలు వారికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అచ్చం ఇలాగే ఉంటుంది. ఇక్కడ చెప్పబోయే మహిళకు కేవలం అబద్దం చెప్పాడనే సంగతి తెలిసింది. ఇంకేముంది అది పెద్దదా చిన్నదా అనే విషయాన్ని పక్కనపెట్టి రచ్చకెక్కింది. పెండ్లికి ముందు భర్త తనకు బట్టతల ఉన్నదన్న విషయం దాచినందుకు ఏకంగా అతనికి విడాకులిచ్చేందుకు సిద్ధమమైంది సదరు భార్య. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 2020 జనవరిలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే సరిగ్గా ఏడాడికి అతడికి బట్టతల ఉన్న విషయం భార్యకు తెలిసింది. దీంతో పెళ్లి సమయంలో జుట్టు ఒత్తుగానే ఉంది కదా. ఇప్పుడిలా జుట్టు ఊడిపోయిందేంటని భార్తను ప్రశ్నించింది. దీంతో అతడు తనకు ముందు నుంచే బట్టతల ఉందని అసలు విషయం బయటపెట్టాడు. పెళ్లిలో విగ్గు పెట్టుకుని కవర్ చేశానని చెప్పాడు. ఇది విన్న మహిళకు చిరాకెత్తింది. భర్త తనను మోసం చేశాడని అతని నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది. తనకు బట్టతల ఉందని భర్త ఎన్నడూ చెప్పలేదని, ఈ విషయం చెప్పనందున భర్త నుంచి విడాకులు కోరుతున్నానని పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్ ముందు అవమానానికి గురయ్యానని, కాబట్టి తనకు విడాకులు కావాల్సిందేనని కోరింది. అయితే, ఆమెకు నచ్చజెప్పేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. కౌన్సెలింగ్ జరుగుతోంది. మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడుత కౌన్సెలింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..! ‘విగ్గు’ మొగుడు నాకొద్దు -
బట్టతలపై వెంట్రుకలు మొలిపించవచ్చు...
బట్టతలతో బాధపడుతున్న వారందరికీ శుభవార్త. జపాన్ శాస్త్రవేత్తలు బోడిగుండుపై కూడా బోలెడన్ని వెంట్రుకలు..అదీ వేగంగా మొలిపించేందుకు ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. సిలికోన్ డబ్బాల్లో వీరు చేసిన ప్రయోగాలు సత్ఫలితాలివ్వడంతో ఇకపై బట్టతల అన్నది ఉండదని అంటున్నారు. యోకహోమా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జున్‌జీ ఫుకూడా నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో రెండు రకాల వెంట్రుక కణాలను ఉపయోగించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే దాదాపు ఐదువేల వరకూ వెంట్రుకలను పెంచడంలో విజయం సాధించారు. ప్రస్తుతం క్లినిక్స్‌లో వెనుకవైపు వెంట్రుకలను తీసుకుని ముందు అతికిస్తున్నారని.. దీనివల్ల తలపై వెంట్రుకలు మందంగా ఉండటం లేదని ఫుకూడా అంటున్నారు. మందులతో జట్టు ఊడిపోయే వేగాన్ని తగ్గించవచ్చుగానీ.. పూర్తిగా నివారించలేమని.. ఈ నేపథ్యంలో తాము కొత్త టెక్నిక్‌ను ఉపయోగించి జట్టు వేగంగా పెరిగేలా చేశామని వివరించారు. ప్రస్తుతానికి తాము పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు నిర్వహించామని.. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మరిన్ని ప్రయోగాలు చేసిన తరువాతగానీ ఈ పద్ధతిని మనుష -
అతి వ్యాయామంతో హెయిర్ లాస్
‘సర్వే’జనా బట్టతలకీ బాడీబిల్డింగ్కూ ముడి పడింది. అధి కంగా వ్యాయామం చేయడం వెంట్రుకల మీద ప్రభావం చూపుతుంది. ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధన దీనిని వెల్లడించింది. మజిల్స్ బిల్డప్ విషయంలో బాగా ఆసక్తితో గంటలకొద్దీ జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో గడిపేవారికి ఇది ఇబ్బంది కరమైన వార్తే. ఎక్సర్సైజ్లు తక్కువగా, మితంగా చేసే వారితో పోలిస్తే అతిగా వర్కవుట్స్ చేసేవారికి జుత్తు తొందరగా పలచనవుతుందని పరిశోధకులు హెచ్చరించారు. కఠినమైన వ్యాయామాల సందర్భంగా దేహం టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను అధికంగా విడుదల చేస్తుందని, ఈ హార్మోన్ ఉత్పత్తిలో మోతాదు మించడంతో అది హెయిర్లాస్కు దారితీస్తుందని వివరించారు. -
మీ ఆహారమే...మీకు శిరోజరక్ష
మీరు జుట్టు ఊడిపోతోందంటూ బాధపడే వారి జాబితాలో ఉన్నారా? అయితే ఇది తప్పక చదవండి. మీకు చాలా ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. మీకు తెలుసా? మనం రోజూ దాదాపు నూరు వెంట్రుకల వరకు కోల్పోతుంటాం. ఇది చాలా నార్మలే. అయితే అదే పనిగా జుట్టు ఊడిపోవడం ఎక్కడికి దారితీస్తుందోనని, తమకు బట్టతల వచ్చేస్తుందేమోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. వాళ్ల ఆందోళన తీరాలంటే చేయాల్సిందేమిటంటే... జుట్టుకు అవసరమైన మూడు అంశాలు: జింక్, ఐరన్, విటమిన్-సి... ఈ మూడు పోషకాలు జుట్టు పాలిట మూడు ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు. అందుకే ఈ మూడు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. జింక్ కోసం: జుట్టుకు అవసరమైన జింక్ కోసం... ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్‌తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ సిఫార్సు చేస్తోంది. జింక్‌కు ఆహార పదార్థాలన్నింటిలోనూ పుష్కలమైన వనరు గుమ్మడి గింజలే. ఇక దానితో పాటు సీఫుడ్, డార్క్ చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలో జింక్ పాళ్లు ఎక్కువ. దాంతోపాటు పుచ్చకాయ తింటూ వాటి గింజలను ఊసేయకండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. ఐరన్ కోసం: మన ఆహారంలో పుష్కలమైన ఐరన్ కోసం గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి వాటిపై ఆధారపడవచ్చు. ఇక మాంసాహారంలో అయితే కాలేయం, కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువని తెలుసుకుని మీ ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. విటమిన్-సి కోసం: మనకు లభ్యమయ్యే అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో నాణ్యమైన విటమిన్-సి పుష్కలంగా లభ్యమవుతుంది. ఇక నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్-సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బత్తాయి, నారింజ పండ్లు ఎక్కువగా తినేవారిలో జుట్టు రాలడం ఒకింత తక్కువే. ఇవన్నీ తీసుకుంటూ జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండుసార్లు తలస్నానం చేస్తూ ఉన్నా, జుట్టు రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యత జుట్టు రాలే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటిదేదైనా ఉంటే దాన్ని డాక్టర్లు పరిష్కరిస్తారు. ఒకవేళ స్వాభావికంగానే ఈ సమస్య లేకుండా చూసుకోవాలంటే చేపలు ఎక్కువగా తినేవారిలో థైరాక్సిన్ అసమతౌల్యత సమస్య చాలా తక్కువని గుర్తుంచుకోండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే అప్పుడు మీరు డర్మటాలజిస్ట్లు, ట్రైకాలజిస్ట్ల వంటి నిపుణులను కలవాల్సి ఉంటుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ - డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
తలలందు బట్టతలలు వేరయా!
జుట్టు రాలిపోవడాన్ని, బట్టతలగా మారడాన్ని అలొపేషియా అంటారు. ఇందులోనూ చాలా రకాలుంటాయి. అవి... స్కారింగ్ అలొపేషియా: ఈ తరహా రుగ్మతతో మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. దీనివల్ల రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఈ రుగ్మతలో ఫాలికిల్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రాలేటప్పుడు ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా ఉండి, ఆ ప్యాచ్‌లు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే ప్యాచ్‌లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్ పస్ట్యూల్ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్ డీజనరేషన్ సిండ్రోమ్, లెకైన్ ప్లానో పైలారిస్, సూడోపెలేడ్ ఆఫ్ బ్రాక్ అనే కండిషన్లు ఈ తరహా స్కారింగ్ అలొపేషియాకు కారణం. బట్టతల : ఇందులో రెండు రకాల బట్టతలలు ఉంటాయి. మొదటిది పురుషుల్లో వచ్చే బట్టతల. దీన్నే ‘మేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’ అంటారు. ఇక రెండోది మహిళల్లో వచ్చే ‘ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’. బట్టతలను ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. అయితే నిన్నమొన్నటివరకూ పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల ఇది వచ్చేదన్న అపోహ ఉండేది. కానీ అత్యాధునిక పరిశోధనల ప్రకారం దీనికి టెస్టోస్టెరాన్ కారణం కాదనీ... ‘డీహెచ్‌టీ’ (డిహైడ్రో టెస్టోస్టెరాన్) కారణమని తేలింది. పురుషుల్లో వచ్చే బట్టతలలో నుదురు మీద ఉండే హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కిపోతూ ఉంటుంది. మహిళల్లో వచ్చే ఫిమేల్ పాట్రన్ హెయిర్‌లాస్ అనే బట్టతలలో ముందున్న హెయిర్‌లైన్ అలాగే ఉండి, మాడు మీద జుట్టు పలచబారుతూ పోతుంటుంది. బట్టతలను నిర్ధారణ చేయడానికి పుల్టెస్ట్, ప్లక్టెస్ట్, స్కాల్ప్ బయాప్సీ, డెయిలీ హెయిర్ కౌంట్ (ఒకరోజు రాలిపోయే వెంట్రుకల సంఖ్య), ట్రైకోస్కోపీ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో ప్రయోజనం లేకపోతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలతో పాటు మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి అత్యాధునిక ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్ఫ్రా రెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. -
బెటర్ తల
దేవుడు సృష్టించింది కొన్ని నాణ్యమైన తలలే! తక్కినవాటిని జుట్టుతో కప్పేశాడు! సినిమాలో ఒక జోక్: డాక్టర్: రెండు నెలల్లో నీకు బట్టతల గ్యారంటీ. ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావ్? హీరో: స్ట్రెస్ వల్ల డాక్టర్. డాక్టర్: అవునా. స్ట్రెస్ ఎందుకు? హీరో: జుట్టు రాలిపోతోందని... ఆడవాళ్లు అనేక కారణాలకు స్పృహ తప్పుతారు. మగవాడు మాత్రం ఒకే ఒక కారణానికి కెవ్వుమంటాడు. అదేమిటో తెలుసా? అద్దంలో బట్టతల. దువ్వుకునేటప్పుడు వెంట్రుకలు రాలుతూ కనిపించినా నుదురు పైకి పాకుతూ కనిపించినా అందరికీ వెన్నులో చలి పుట్టొచ్చుగాని మగవాడికి మాత్రం మాడులో చలిపుడుతుంది. పుర్రె బయటపడుతుందేమోననే వెర్రి భయం పట్టుకుంటుంది. అసలు కేశంకు కొంచెం ‘ల’ వత్తు తగిలిస్తే క్లేశం వస్తుంది. అంటే దేవుడు కేశంలోనే క్లేశం పెట్టాడన్న మాట. శివుడికి బట్టతల ఇష్యూ లేదు. ఆయనది చిక్కుముడుల తల. పైగా గంగమ్మ ఏసి ఒకటి రన్ అవుతూ ఉంటుంది. విష్ణుమూర్తికి హెయిర్‌లాస్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లేదు. కిరీటాన్ని హెల్మెట్‌లా పెట్టుకున్నాక కూడా మనకు జులపాల జుట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఇక బ్రహ్మదేవునికి నాలుగు తలలతోపాటు నాలుగు గడ్డాల నిండుగా కూడా కేశాలు కళకళలాడుతూ ఉంటాయి. మరి ఈ ముగ్గురు దేవుళ్లకు లేని బాధ సగటు మగవాడికి ఎందుకు? బ్రహ్మ సృష్టించిన మగ ప్రాణికి ఎందుకు? ఒకవేళ ఇచ్చెనుపో... స్త్రీ జాతికి మగవాడి శిరోజాల మీదే దృష్టి పెట్టడం ఏలా? తరాల నుంచి వారికి మగవాడి ముఖం మీద కంటే తల మీద ఉన్న జుట్టు మీదే ఆసక్తి ఎక్కువ. ‘దీర్ఘ కేశములవాడు’... అని వారు మురిసిపోతారు. ‘నల్లని కురులవాడు’ అని మనసు పారేసుకుంటారు. ‘నీలాల ముంగురులవాడు’ అంటూ మఖ్మల్ పత్రం పై నెమలి ఈకతో లవ్ లెటర్ రాస్తారు. ఏం జుట్టు లేనివాడు మనిషి కాడా? జుట్టున్న నాగార్జున మాత్రమేనా మన్మథుడు? ఇలా ఎవరు నిలదీయాలి? ఈ లోకం కళ్లు ఎవరు తెరిపించాలి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్చ్. బట్టతల ఉంది. కేన్సిల్. ఎన్.ఆర్.ఐ... అమెరికాలో పెద్ద ఉద్యోగం. నో. పైన ఎకరం పోయింది. కేన్సిల్. బాగా వెనకేసుకున్నాడు.... బోనస్‌గా అత్తమామలు ఆడపడుచులు కూడా లేరు. నెవర్. ట్వంటీ ట్వంటీ మేచ్ ఆడటానికి సరిపడా గ్రౌండ్ ఉంది నెత్తి మీద కేన్సిల్. గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్. నోనో... ఆ ఓపెన్ టాప్వాడు సెల్ఫీకి పనికిరాడు... కేన్సిల్. ఇంతకీ ఏంటంటావ్. ఎవరినైనా తేండి... కాని నెత్తి మీద జుట్టున్నవాణ్ణి తేండి. ఇలా మాట్లాడేవాళ్ల మీద పరువు నష్టం దావా వేసే చట్టం ఎందుకు రాదు? దీని కోసం ఓపిక చేసుకుని అన్నా హజారే కాని ఓపిక లేకపోయినా అరవింద్ కేజ్రీవాల్గాని ఎందుకు పోరాటం చేయరు. బట్టతల ఉన్న సహోదరులారా... పోరాడండి... పోరాడితే పోయేదేమీ లేదు... మిగిలిన ఆ కాస్తంత జుట్టు తప్ప. మగవాడు పుట్టింది దేని మీదైనా సరే కాలు దువ్వడానికి కాని జుట్టు దువ్వడానికి కాదు. జుట్టు ఉన్నా పౌరుషమే. జుట్టు లేకపోయినా పౌరుషమే. అసలు బట్టతల వల్లే ఈ సమాజం నడుస్తోందని రూఢీగా చెప్పవచ్చును. సమాజం నడవాలంటే మేధావులు కావాలి. మేధావులుగా ఎవరైనా మారాలంటే వారికి బట్టతల రావాలి. అందుకే అన్నారు పెద్దలు ‘బట్టతలవాడు బ్రహ్మవిద్యలు నేర్చున్’ అని. బట్టతల వాళ్లకు ఉన్న అడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి. బార్బర్ ఖర్చు లేదు. తలస్నానానికి షాంపు ఖర్చు లేదు. జేబులో దువ్వెన ఖర్చు లేదు. పేల భయం లేదు. ఇన్నేలా? చాలామంది మగవాళ్లు తమ జుట్టును తీసుకెళ్లి భార్య చేతిలో పెడతారు. కాని బట్టతల ఉన్నవాళ్లు ఆత్మాభిమానం కలిగిన భర్తల్లా నిర్భీతితో మెలుగుతారు. బట్టతల కలిగినవారు నిస్వార్థపరులు. ఈ సంగతి ఉదాహరణతో సహా నిరూపించవచ్చు. చరిత్రలో ఎంతోమంది బట్టతల సైంటిస్ట్‌లు ఉన్నారు. వాళ్లంతా మానవ కల్యాణం కోసం ఆవిష్కరణలు చేశారే తప్పితే తమ బట్టతల మీద జుట్టు మొలిపించే ప్రయోగాలకు పోలేదు. థామస్ ఆల్వా ఎడిసన్‌కు సంపూర్ణ బట్టతల. కాని అతడు తన బుర్రలో వెలిగిన ఐడియాను బయట బల్బ్‌లా వెలిగించాడు కాని తలుచుకుంటే బట్టతల మీద బొచ్చు మొలిపించుకోలేక కాదు. ఆ సంగతి చేతకాకా కాదు. వద్దనుకున్నాడంతే. ఇక చాలు. బట్టతల ఉన్నందుకు సమాజం మగవాణ్ణి వెంటాడింది చాలు. యుగాలుగా మగవాడు సమాజానికి భయపడి తన బట్టతలను దాచుకున్నాడు. కిరీటాలు పెట్టాడు. తల పాగాలు చుట్టాడు. టోపీలు ధరించాడు. తల గుడ్డ కట్టాడు. స్కార్ఫ్‌ల్లో తలను దాచుకున్నాడు. కాని ఇక అక్కర్లేదు. నా బట్టతలే నా అందం. నా బట్టతలే నా సంస్కారం. నా బట్టతలే నా గౌరవం. నా బట్టతలే నా ఆభరణం అని ఇప్పుడు బట్టతలను ఓన్ చేసుకుంటున్నాడు. అసలు ఏకంగా బట్టతల చుట్టూ ఉన్న ఇతర వెంట్రుకలను కూడా తొలగించి బోడి గుండుతో తిరుగుతూ అదే ఫ్యాషన్‌గా నిరూపించుకోగలుగుతున్నాడు. 20 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లు బట్టతలతో లేదా బోడి గుండుతో కనిపించడం వారి శారీరక దృఢత్వానికి ఒక సంకేతంగా భావిస్తున్న రోజులు వచ్చాయి. స్త్రీలు, సమాజం మంచి వయసులో ఉండి బోడి గుండుతో తిరుగుతున్నవారిని దృఢమైనవారిగా గుర్తిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయిదు పదేళ్ల క్రితం అయితే ఇలా కనిపించేవారిని చూసి నవ్వడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు నవ్వు స్థానంలో యాక్సెప్టెన్స్ వచ్చింది. సక్సెస్‌ను మించిన ఆకర్షణ లేదు. మగవాడు తాను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయితే అది అతడి నిజమైన బాహ్య ఆకర్షణ అయ్యే రోజులు వచ్చాయి. కనుక మగవాడు ఇప్పుడు బట్టతల బెంగను క్రమంగా వదిలించుకుంటున్నాడు. తనను ‘దానితో పాటు’గా అంగీకరించే స్థితికి సమాజాన్ని తీసుకువెళుతున్నాడు. తలంపు ముఖ్యం. తల కాదు. బట్టతల తలెత్తుకుని తిరుగుతున్న రోజులను స్వాగతిద్దాం. - శశి వెన్నిరాడై మహామహులు... తమ బట్టతలను లెక్క చేయకుండా మహామహులుగా మన్ననలు అందుకున్నవారు ఎందరో చరిత్రలో ఉన్నారు. గాంధీగారు తన బట్టతలను దాచుకునే వారు కాదు. నెహ్రూగారి బట్టతలకు తెల్లటి టోపీయే అందం. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాస్ చంద్రబోస్ వీరికంతా బట్టతలే. హీరోల్లో గొప్పవారు కూడా బట్టతలను లెక్క చేయలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ సూపర్‌స్టార్ ఎం.జి.ఆర్, కన్నడ రాజకుమార్... వీరందరూ బట్టతల ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఒక వెలుగు వెలిగినవారే. నటుడు రజనీకాంత్ ఇంత పెద్ద స్టార్‌గా ఉన్నా బట్టతలను దాచుకోరు. ధీరూభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం ఎంత అనేదే జాతి చూసిందిగాని ఆయన బట్టతలను ఎవరూ ఒక వంకగా చూడలేదు. క్రికెట్లో సయ్యద్ కిర్మాణి చేసే స్టంప్ ఔట్స్ చూశారే తప్పితే రౌండ్ క్యాప్ కింద ఉన్న అతడి బట్టతలను కాదు. అవును... నాకు బట్టతల ఉంది... ఆ నాలుగు వెంట్రుకలు కూడా పక్కకు పారేసి హాయిగా గుండుతో ఉంటాను ఇది నా ఫ్యాషన్ స్టేట్మెంట్ అని దేశంలో ధైర్యంగా ప్రకటించింది దక్షిణాదిన చో రామస్వామి అయితే ఉత్తరాదిన సినీ దర్శకుడు రాకేష్ రోషన్. ఆ తర్వాత పాప్ గాయకుడు బాబా సెహెగల్, జర్నలిస్ట్ ప్రీతిష్ నంది, అనుపమ్ ఖేర్ తదితరులు గుండుతో కనిపించసాగారు. తెలుగులో హాస్యనటుడు ఏవిఎస్ కూడా పూర్తి గుండునే తన మార్క్‌గా చేసుకున్నారు. సంగీత దర్శకుడు రమణ గోగుల దానిని కొనసాగిస్తున్నారు. కంప్యూటర్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ గాని నేటి ఆదర్శం సత్య నాదేళ్ల కాని తమ బట్టతలలను దాచుకోలేదు. వీరంతా జుట్టు లేనివారి జట్టు. బట్టతలకే జై కొట్టు. రహస్య బట్టతలలు.... అందరూ రజనీకాంత్‌లు కాలేరు. స్క్రీన్ మీద మేకప్ బయట అక్కర్లేదు అనుకోలేరు. అదేం తప్పు కాదు. ఎవరి ఇష్టాయిఇష్టాలు వారివి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వచ్చాక బాలీవుడ్లో చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారని అంటారు. అమితాబ్ ఈ విషయంలో తొలి వరుసలో ఉంటారు. సల్మాన్‌ఖాన్, గోవింద, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా, సన్ని డియోల్, హాస్య నటుడు జావేద్ జాఫ్రీ, సంగీత దర్శకుడు అనూమలిక్... ఇలా ఈ పట్టిక అనంతం. -
బట్టతలతళతళ
జాబిల్లి రోమసంహితం అయితే బాగుంటుందా? వెండి పళ్లెంలో వెంట్రుకలొస్తే సబబుగా ఉంటుందా? ఇదే మగాడి ఆలోచన. యువకులుగా మారడానికి తమ జుట్టు కాస్తంత వెనక్కు జరిగినా వాళ్లకు బాధ ఉండదు. హెయిర్‌లైన్ వెనక్కుపోతుందన్న ఇబ్బందీ, అందానికి లోపం కలుగుతుందన్న విచారం కంటే పురుషత్వపు లక్షణాలు కనబడుతున్నాయనే ఆనందమే ఎక్కువ. తళతళలాడే చందమామ మెరుపును చూసి ఆశ్చర్యం పొందని వారెవరైనా ఉంటారా? మిలమిలలాడే బంగారం తళుకులు చూసి సంబరపడనివారెవరైనా ఉంటారా? సేమ్ బట్టతల కూడా. కానీ బట్టతల అంటే పురుషులు ఇష్టపడరని అందరూ అనుకుంటుంటారు. అది అపోహ మాత్రమే. పురుషులు దాన్ని ఇష్టపడరని అనుకోవడం జస్ట్ ఒక దురభిప్రాయం మాత్రమే. వాస్తవం వేరే. చందమామనూ, బంగారాన్నీ ఇష్టపడ్డట్టే పురుషులూ బట్టతలనూ ఇష్టపడతారు. కాకపోతే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు రెండు ఉంటాయి. మొదటిది... మనిషి అనగానే దేనినైనా పెంచుకోవాలనే తాపత్రయం అధికం. దాన్ని బాగా సాకాలనేది అతడిలో మరీ మిక్కుటమైన మక్కువ. గుబురు మీసాలూ, గడ్డాల మాటున నక్కి అంతగా కనపడదు గానీ పురుషులకు పెంపక కాంక్ష మరీ ఎక్కువ. ఈ పెంపకం సాగించాలన్న తపనతో, ఆ తీవ్రమైన ఇన్స్టింక్ట్తో కొందరు మొక్కలూ, ఇంకొందరు కుక్కలూ పెంచుతుంటారు. ఇక కోళ్లూ, బాతులు, తాబేళ్లూ... వెర్రిబాగా ముదిరితే తొండలూ కొండచిలువలూ పెంచేవారు కూడా ఉన్నారు. ఈ తీవ్రమైన కోరికవల్లే కాలం బాగా లేకపోయినా రైతులు పొలాలను సాగు చేస్తూ ఉంటారు. చెరువుల్లో చేపలు పెంచుతుంటారు. ఈ పెంచాలన్న తీవ్రమైన తపన ఉండటం వల్లనే జుట్టు పెంచడం అన్నది కూడా జరుగుతుంది. కుక్క పెంచితే ఇంటి దగ్గర అది ఎలా ఉందో తెలియని భయం ఉండొచ్చు. మొక్కకు నీళ్లు అందుతాయో లేదో అన్న ఆందోళన కలగవచ్చు. నీళ్లూ, తెగుళ్ల దిగుళ్లతో కుంగిపోవచ్చు. కానీ జుట్టు పెంచుకుంటే అది నెత్తి మీదే పదిలంగా ఉంటుంది. కావాలనుకుంటే వర్క్‌ప్లేస్‌లోనూ బాత్రూమ్లోకి వెళ్తే అద్దంలో కనిపిస్తుంది. కుక్కను చేతులతో లాగే దాన్ని దువ్వెనతో దువ్వవచ్చు. కాస్త చేయ్యి సాచితే అందుతుంది. సర్దుకుంటే ఒదుగుతుంది. కుక్కా, మొక్కా ఇంటి అందాన్ని ఇనుమడింపజేసినట్లు రోమాలూ అందానికి హామీగా ఉంటాయి. కాబట్టి పెంచుకోవాలనే కాంక్ష తప్ప... మెరిసే బట్టతలను నిరసించాలన్న భావన ఏ పురుషుడిలోనూ ఉండదు. ఇక రెండోది పురుషులకు చాలా ఇష్టమైన విషయం. ఇది ఒకింత సీక్రెట్. అయినా కాస్తంత బహిరంగంగానే మాట్లాడదాం. మగపిల్లలు టీన్స్‌లోకి రాగానే తమ ముఖం కాస్త అందవికారంగా మారుతున్నా పెద్ద లెక్కచేయరు. ఆ ఏజ్ నుంచి తాము యువకులం కాబోతున్న ఫీలింగే వాళ్లకు సంతోషంగా ఉంటుంది. యువకులుగా మారడానికి తమ జుట్టు కాస్తంత వెనక్కు జరిగినా వాళ్లకు బాధ ఉండదు. హెయిర్‌లైన్ వెనక్కుపోతుందన్న ఇబ్బందీ, అందానికి లోపం కలుగుతుందన్న విచారం కంటే పురుషత్వపు లక్షణాలు కనబడుతున్నాయనే ఆనందమే ఎక్కువ. అయితే పాపం... కొందరిలో కాస్తంత వెనక్కు జరగాల్సిన హెయిర్‌లైన్, బ్యాలెన్స్ తప్పి, గబుక్కున పడిపోయినట్లుగా వెనక్కు జారిపోతుంది. జుట్టు అంతా అంతర్జాతీయ షేర్ మార్కెట్లలాగా కుప్పకూలి కుదేలైపోతుంది. షేర్‌కు జూలు మొలవడం ఎలాగో, కిశోర బాలకులకు జుట్టు రాలడం అలాగ. అందుకే జుట్టు రాలిపోతుందన్నా లెక్క చేయరు. ఈ ఒక్క దృష్టాంతం చాలదా. వాళ్లు బట్టతలను ఇష్టపడకపోవడం ఏదీ లేదని. కాబట్టి పురుషులకు బట్టతల అంటే ఇష్టపడకపోవడం అంటూ ఏదీ ఉండదు. స్త్రీలకు బంగారం లాగే పురుషులకు బట్టతల. జాబిల్లి రోమసంహితం అయితే బాగుంటుందా? వెండి పళ్లెంలో వెంట్రుకలొస్తే సబబుగా ఉంటుందా? ఇదే మగాడి ఆలోచన. మీరు నమ్మకపోయినా పురుషులకు బట్టతల ఇష్టం ఉండదన్న విషయమంతా ఈ పాడు లోకం అల్లిన కల్పితాలే. - యాసీన్ -
తల స్నానం చేస్తే.. గుండు మిగిలింది
పట్నా: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు...బిహార్‌లోని మధుబని జిల్లాలో ఒక వింత చోటు చేసుకుంది. రోజూలాగానే తమ ఇంటిముందు ఉన్న చేతి పంపు నీళ్ళతో స్నానం చేసిన ఆ కుటుంబానికి ఓ వింత అనుభవం ఎదురైంది. జుట్టంతా ఊడిపోయి వరుసగా ఒకరి తరువాత బోడిగుండుతో మిగలడంతో బిత్తరపోయారు. ఏమైందో అని కంగారుపడి వైద్యులతో పాటు సంబంధిత అధికారుల దగ్గరికి పరుగు తీశారు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు, అధికారులు కూడా కారణాలు ఆరా తీసే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే మహమ్మద్ హసీం, భార్య, ఇద్దరు పిల్లలు పంపు నీళ్లతో స్నానం చేసిన పాపానికి జుట్టంతా ఊడిపోవడంతో విస్తుపోయారు. ఇంటిముందు ఉన్న చేతిపంపు నీళ్లతో స్నానం చేసిన కొద్దిసేపటికి తల చుట్టూ దురదలు మొదలయ్యాయి. అనంతరం పాయలు పాయలుగా జుట్టు ఊడిపోవడం మొదలైంది. క్రమంగా గుండు గీసినట్టుగా నున్నగా మొత్తం జుట్టు రాలిపోయింది. దీంతో ఆ కుటుంబం భయభ్రాంతులకు లోనయ్యింది. వెంటనే సమీపంలో ఉన్న అధికారులను, వైద్యులను సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు విచారణ మొదలు పెట్టారు. తక్షణమే సదరు చేతి పంపును సీజ్ చేసి, మరో కొత్తపంపు వేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అయితే చాలా ఏళ్లనుంచి ఈ నీళ్లను వాడుతున్నారనీ.. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదని గ్రామస్తులు తెలిపారు.