అతి వ్యాయామంతో హెయిర్ లాస్
‘సర్వే’జనా
బట్టతలకీ బాడీబిల్డింగ్‌కూ ముడి పడింది. అధి కంగా వ్యాయామం చేయడం వెంట్రుకల మీద ప్రభావం చూపుతుంది. ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధన దీనిని వెల్లడించింది. మజిల్స్ బిల్డప్ విషయంలో బాగా ఆసక్తితో గంటలకొద్దీ జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో గడిపేవారికి ఇది ఇబ్బంది కరమైన వార్తే.
ఎక్సర్‌సైజ్‌లు తక్కువగా, మితంగా చేసే వారితో పోలిస్తే అతిగా వర్కవుట్స్ చేసేవారికి జుత్తు తొందరగా పలచనవుతుందని పరిశోధకులు హెచ్చరించారు. కఠినమైన వ్యాయామాల సందర్భంగా దేహం టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను అధికంగా విడుదల చేస్తుందని, ఈ హార్మోన్ ఉత్పత్తిలో మోతాదు మించడంతో అది హెయిర్‌లాస్‌కు దారితీస్తుందని వివరించారు.