Jim
-
రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి
దేశా రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్ఘాన్కి చెందిన 35 ఏళ్ల జిమ్ యజమానికి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తరంజన్ పార్క్‌లో నివశిస్తున్న అఫ్ఘాన్‌కు చెందిన జిమ్ యజమాని నాదిర్ షా పార్క్ చేసిన రెండు కార్ల పక్కన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సరిగ్గా గురువారం రాత్రి 10.40 గంటలకు గళ్లచొక్కా ధరించిన వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాదిర్ షా తీవ్రంగా గాయపడగా, మరొక వ్యక్తి ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అనతరం దుండగుడు కొన్ని మీటర్ల దూరంలో పార్క్ చేసిన మోటార్ సైకిల్‌పై ఎక్కి తప్పించుకున్నాడు. దుండగడు దాదాపు ఆరు నుంచి ఎనిమి రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అలాగే ఘటనా స్థలంలో బుల్లెట్ ప్రక్షేపకాలు, ఖాళీ కాట్రడ్జ్లు లభించాయి. తీవ్రంగా గాయపడిన బాధితుడు నాదిర్ షాను మాక్స్ ఆస్పత్రికి తరలించగా..అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని వెల్లడించారు అధికారులు. అయితే దాడి చేసిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అతడిపై కాల్పులు జరిపి పారిపోయారని చెబుతున్నారు . అయితే బాధితుడు నాదిర్ షాకి దుబాయ్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయని, అలాగే అతడిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాదు అతడు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులకు తెలిసిన పోలీస్ ఇన్ఫార్మర్ అని అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా..ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ సన్నిహితుడు రోహిత్ గోదారా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారం రేపింది. ఆ పోస్ట్‌లో తీహార్ జైలులో ఉన్న తన సన్నిహితుడు సమీర్ బాబా వ్యాపార ఒప్పందాలను అడ్డుకోవడంతోనే తాను నాదిర్ షాను అంతమొందించాలని తన సహాయకులను ఆదేశించినట్లు రోహిత్ గోదారా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. పైగా ఎవరైనా ఆ ధైర్యం చేస్తే వారికి అదే గతిపడుతుందని హెచ్చరించడం గమనార్హం.(చదవండి: వేధించే ఎన్ఆర్ఐ భర్తలపై కొరడా) -
హనీ పాప అదిరిపోయే లుక్.. ఈసారి ట్రీట్ మామూలుగా లేదుగా!
బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఈ కేరళ కుట్టి ముద్దుగుమ్మ మలయాళంలో '14 వయదిల్ బాయ్‌ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా 2004లో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్ లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. గతేడాది బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవల డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్లలో సందడి చేసే కేరళ భామ గతంలోనూ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించింది. తాజాగా ఓ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. డంబెల్‌తో కసరత్తులు చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ న్యూ లుక్ చూశారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఇలాగే స్టన్నింగ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మలయాళీ భామ.. మరోసారి అదిరిపోయే ట్వీట్ ఇచ్చింది. ఈ సారి ఏకంగా జిమ్ డ్రెస్‌లో స్టేజీపై అదరగొట్టేసింది. Clicks 📸 pic.twitter.com/n0o6Mofw94 — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 Any fitness tips? 😋 pic.twitter.com/vkRHgg2NUR — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 💪🚶♀️ pic.twitter.com/uW9oEnyWA9 — Honey Rose (@HoneyRoseNET) January 22, 2024 -
స్టార్ హీరో మదర్‌ను మోసం చేసిన ఉద్యోగి
బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ భార్య, టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్‌ను అలెన్ ఫర్నాండో అనే వ్యక్తి రూ.58 లక్షలకు మోసం చేశాడు. ఈ మేరకు అయేషా ష్రాఫ్ ముంబయ్‌లోని శాంటాక్రజ్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఫెర్నాండెజ్‌పై సెక్షన్ 420, 408, 465, 467, 468 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 20, 2018న MMA మ్యాట్రిక్స్ అనే జిమ్ కంపెనీని టైగర్ ష్రాఫ్ తన సోదరితో కలిసి స్టార్ట్ చేశాడు. (ఇదీ చదవండి: నాగార్జున సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్) అక్కడ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా అలెన్ ఫర్నాండోను వారు నియమించారు. టైగర్ ష్రాఫ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల దాని బాధ్యతలను తల్లి అయేషా చూసుకుంటుంది. MMA మ్యాట్రిక్స్ ద్వారా పలు టోర్నమెంట్లను నిర్వహించడం కోసం కొందరి నుంచి రూ.58 లక్షలు తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. అలెన్ ఫర్నాండోను ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ నటి.. ఫోటో షూట్ వైరల్!) -
అంత పవర్ ఎలా ...భయపెడుతున్నారు: సమంత
సాక్షి,హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ సమంత ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మేరకు జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను సమంతా షేర్ చేసింది. ఏకంగా తన బరువులో సగమున్న డంబెల్‌తో స్క్వాట్లు చేస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఫైటర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆమె ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు. జిమ్‌లో 30 కిలోల బరువున్న డంబెల్స్‌తో కుస్తీ పడుతున్న వైనాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సమంత. అంతేకాదు ఈ సందర్భంగా తన కోచ్ డాక్టర్ స్నేహ దేసుకికి తనపై ఉన్న నమ్మకంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. జిమ్‌లో లేక పోయినా భయపెడుతున్నారంటూ స్నేహనుద్దేశించింది వ్యాఖ్యానించింది. అందుకే కేవలం మీకోసమే 30 కిలోల బరువెత్తాను అంటూ స్నేహ శిక్షణా సామర్థ్యంపై ప్రశంసలు కురిపించింది. ‘‘నా పైన ఇంత పవర్ ఎలా వచ్చింది మీకు. ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా.. మీరంటే భయం. అందుకే మీకోసం.. నా బరువులో సగం ఉన్న 30 కిలోల డంబెల్‌తో ఇలా చేయడం సాధ్యమయ్యేది కాదు’’ అంటూ డాక్టర్ స్నేహకు ధన్యవాదాలు తెలిపింది. కాగా నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తరువాత, విమర్శలను వివాదాలను పట్టించుకోకుండా కరియర్లో ముందుకు సాగుతున్న సమంత తాజాగా రెండు ప్రాజెక్టులకు సైన్ చేసింది. మరోవైపు 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' డిజిటల్ అరంగేట్రంలోనే అక్కడ కూడా భారీక్రేజ్ సంపాదించింది. మెల్బోర్న్ 2021 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజిగా నటనకు ఆమె ఉత్తమ నటి (సిరీస్) అవార్డును కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
పట్టువదలని చిన్నది..
న్యూఢిల్లీ: ఒక చిన్నారి తన తండ్రి ప్రోత్సహించడంతో బరువులు ఎత్తే వీడియో ట్వీటర్లో వైరల్ అయ్యింది. నెటిజన్లకు ఇంటర్నెట్ అనేది ఎప్పుడూ చిరునవ్వును నింపే హృదయపూర్వక వీడియోల నిధి. అలాంటి ఒక క్లిప్.. తండ్రి, కుమార్తె మధ్య జరిగిన సన్నివేశాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. వైరల్ క్లిప్ ఏమిటి? ఈ వైరల్ వీడియోను అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విటర్లో షేర్ చేశాడు. "ఈ నాన్న, అతడి కుమార్తె ఈ రోజు నాకు అవసరమైన స్ఫూర్తిని ఇచ్చారన్న’’ సందేశంతో అనే శీర్షికతో రెక్స్ క్లిప్‌ను షేర్ చేశాడు. క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి జిమ్‌లో బరువులు ఎత్తడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు చిన్నారి తండ్రి అక్కడి వచ్చి తన కుమార్తెను ప్రోత్సహించడం, ఆమెకు సూచనలు ఇవ్వడం కూడా వినవచ్చు. కొన్ని సెకన్ల తరువాత, అమ్మాయి బరువులు కొద్దిగా ఎత్తడానికి ప్రయత్నిస్తుంది, కానీ పూర్తిగా కాదు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ చిన్నారి చివరకు పెద్ద జంప్ తీసుకొని బార్‌ను పైకి ఎత్తుతుంది. తర్వాత ఉత్సాహంగా తన తండ్రిని ఆలింగనం చేసుకుని ముద్దు పెడుతుంది. ఈ క్లిప్ 2.6 మిలియన్లకు పైగా నెటిజన్లు చూసి ఆనందించారు. -
జిమ్‌కు వెళ్లండి... మతిమరపును దూరం చేసుకోండి
మీరు ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి అక్కడ బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామాల వల్ల మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మరీ ముఖ్యంగా బెంచ్‌ప్రెస్ (బెంచ్‌మీద పడుకొని బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామం) చేసే వారికి పెద్దవయసులోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వందలాది మంది పెద్దవయసు వారిపై చాలాకాలంపాటు నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. -
ట్రైనర్స్ లేకుండా జిమ్ కి వెళ్తున్నారా..
సాక్షి, సిటీబ్యూరో: హిమాయత్‌నగర్ నివాసి రూపేశ్గుప్తా అధిక బరువు తగ్గించుకోవాలని సమీపంలోని జిమ్‌లో చేరాడు. ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించాడు. రెండు నెలలు వెళ్లాక అకస్మాత్తుగా కుడి భుజం నొప్పి రావడం మొదలైంది. రాన్రాను అది తీవ్రతరం కావడంతో డాక్టర్‌ను సంప్రదించాడు. సరైన రీతిలో వర్కవుట్ చేయకపోవడంతో కండరాల్లో అపసవ్యత వచ్చిందని, సర్జరీయే శరణ్యమని తేల్చారు. ఇలా గాయాలపాలవడం, ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం నగరంలోని వ్యాయామ ప్రియులకు సర్వసాధారణమైంది. కొందరైతే ఏకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలూ వెలుగు చూస్తున్నాయి. అందం, ఆరోగ్యం ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? అంటూ ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. సిటీజనుల్లో చక్కని శరీరాకృతి, ఆరోగ్యంపై ఆసక్తి అంతకంతకూ రెట్టింపవుతూ అదే సమయంలో అందుకు అవసరమైన శిక్షణ లభించకపోవడంతో అది పెను సమస్యలకు దారితీస్తోంది. ఆరోగ్యమే ‘మహా’భాగ్యమై... ప్రపంచవ్యాప్తంగా ఫిట్నెస్ విప్లవం నడుస్తోంది. చాలా రోగాలకు కారణం జీవనశైలి మార్పులు. ప్రధానంగా శారీరక శ్రమ లేకపోవడమని స్పష్టమవడంతో సిటీజనులు మందుల కన్నా వ్యాయామం మీదే ఆధారపడడం పెరిగింది. ఈ నేపథ్యంలోనే నగరంలో జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ప్రపంచస్థాయిలో పేరున్న బ్రాండ్స్ నగరంలో వ్యాయామ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కూడా నగరంలో జిమ్‌ల ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నారంటే... ఇక్కడ వీటి బూమ్ ఏ రేంజ్లో ఉందో అర్థం అవుతుంది. ఈ తరహా ఆరోగ్య స్పృహ మంచిదే అయినా సిటీని ఈ ఫిట్నెస్ ఫీవర్ ఒక్కసారిగా చుట్టుకోవడం పలు రకాల సమస్యలకు కారణమవుతోంది. డిమాండ్ ఫుల్.. ట్రైనర్స్ నిల్ నగరంలో ఫిట్నెస్ ట్రైనర్ల కొరత తీవ్రంగా ఉంది. స్వల్ప వ్యవధిలో వెలిసిన వందల సంఖ్యలోని జిమ్‌లకు సరిపడా శిక్షకులు అందుబాటులో లేరు. దీనిని ఇప్పటికీ యువత పూర్తిస్థాయి కెరీర్‌గా భావించడం లేదు. అలా భావిస్తున్నవారు కొద్దొ గొప్పో ఉన్నా, శిక్షకులుగా మారడానికి అవసరమైన శిక్షణ సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. రీబాక్ వంటి కొన్ని సంస్థలు ఫిట్నెస్ శిక్షకుల కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా, వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితుల్లో అనుభవరాహిత్యం గురించి పట్టించుకోకుండా, అందుబాటులో ఉన్న ట్రైనర్లతోనే నిర్వాహకులు జిమ్‌లు నడిపిస్తున్నారు. ఏవో కొన్ని పేరున్న ఫిట్నెస్ సెంటర్లను మినహాయిస్తే మరే జిమ్‌లో కూడా సర్టిఫైడ్ ట్రైనర్ లేరంటే అతిశయోక్తి కాదు. సందుగొందుల్లో మాత్రమే కాదు శ్రీనగర్‌కాలనీ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చే స్తున్న జిమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈజీగా.. క్రేజీగా.. వ్యయప్రయాసల రీత్యా చూస్తే చాలా వ్యాపారాల కన్నా జిమ్ ఏర్పాటు అనేది కాస్త సులభమైన విషయమే. అంతేకాకుండా దీని నుంచి స్థిరమైన రాబడిని అందుకునే అవకాశం ఉంది. కూర్చొని ఆదాయం సంపాదించే వ్యవహారం కావడంతో చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు సైతం జిమ్ నిర్వహణలోకి ప్రవేశిస్తున్నారు. అందులో తప్పులేకపోయినా వారికి స్వతాహాగా జిమ్ మెయింటెనెన్స్‌పై అవగాహన లేక, ఏదో ఒక ఫ్లాట్ అద్దెకు తీసేసుకుని పరికరాలు పెట్టుకుంటే చాలు నడిపించేయవచ్చుననే అపోహతో తాము నష్టాలపాలు అవడమే కాకుండా ఆరోగ్యార్థులను అనారోగ్యానికి గురిచేస్తున్నారు. బౌన్సర్లూ ట్రైనర్లే... పెద్ద మొత్తాల్లో జీతాలిచ్చి ట్రైనర్లను పెట్టుకోలేక కాస్త రెగ్యులర్‌గా వ్యాయామం చేసిన అనుభవం ఉన్నవారితో సహా ఎవరిని పడితే వారిని ట్రైనర్లుగా మార్చేస్తున్నారు. నిజానికి ఫిట్నెస్ ట్రైనింగ్ అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సిటీలో కొన్ని జిమ్‌లు కాస్త శరీర సౌష్టవం ఉన్న వ్యక్తులు దొరికితే చాలు శిక్షకులుగా చేర్చుకుంటున్నాయి. దీంతో బార్లలో బౌన్సర్లుగా పనిచేసేవారు కూడా శిక్షకుల అవతారమెత్తుతున్నారు. వీరు తెలిసీ తెలియకుండా ఇస్తున్న శిక్షణతో వ్యాయామ ప్రియులకు అనూహ్యమైన శారీరక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పర్సుఫుల్ ఉంటేనే పర్సనల్... మరికొన్ని చోట్ల జిమ్‌లో చేరిన కొన్ని రోజుల వరకు కాస్త శ్రద్ధ చూపించి, ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారు. నిజానికి తమ జిమ్‌లో చేరిన ప్రతి సభ్యుడికీ అవసరమైన శిక్షణ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకుండా వారిని వదలేయడం శిక్షార్హం. అయినప్పటికీ చాలా జిమ్‌లు అదేమీ పట్టించుకోవడం లేదు. జిమ్‌ల మధ్య విపరీతమైన పోటీ కారణంగా ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తే చాలు సభ్యత్వాలు అందిస్తున్నారు. అయితే అలా చెల్లించిన వారికి పర్సనల్ ట్రైనింగ్ ఉండదు. కేవలం తూతూమంత్రంగా మాత్రమే వారికి సూచనలిస్తుంటారు. అలా కాదని గట్టిగా ఏదైనా మాట్లాడితే పర్సనల్ ట్రైనింగ్ పెట్టుకోమంటూ సలహా ఇస్తారు. ఈ పర్సనల్ ట్రైనింగ్‌లో సభ్యుడి కోసం పూర్తిగా ఒక ట్రైనర్‌ని కేటాయిస్తారు. దీనికి గాను అదనంగా నెలకు రూ.10వేలు దాకా చెల్లించాల్సి వస్తుంది. డేంజరస్.. డైట్, సప్లిమెంట్స్ సాధారణంగా వ్యాయామ కేంద్రాల్లో సభ్యులుగా ఉన్నవారు తీసుకునే ఆహార అలవాట్లలో మార్పుచేర్పుల విషయంలోనూ జిమ్ నిర్వాహకులనే సంప్రదిస్తుంటారు. వారేమో ఎలాంటి ముందస్తు అనుభవం లేకపోయినా, వైద్య పరమైన కోర్సులేవీ చేయకపోయినా ఇష్టారాజ్యంగా డైట్‌ని సూచిస్తుంటారు. వ్యక్తికి ఉన్న ఆరోగ్య సమస్యలు, వంశపారంపర్య లక్షణాలు ఇత్యాది అంశాలేమీ పట్టించుకోకుండానే గుడ్డిగా వీరిచ్చే సలహాలు పాటించడం ద్వారా చాలా మంది సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాగే వేగంగా శారీరక మార్పులు కోరుకునే యువతీ యువకులకు సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వంటివి అలవాటు చేస్తున్న జిమ్‌లు, ట్రైనర్లు కూడా నగరంలో ఉన్నారు. ఇది మరింత తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత శాఖలు ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. జిమ్‌ల నిర్వహణ, తీరు తెన్నులపై సమగ్రమైన విధి విధానాలు ఖరారు కావాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే సమయంలో నగరంలోని యువతకు ట్రైనర్లుగా శిక్షణ పొందితే వచ్చే ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచాలి. వ్యాయామ ప్రియులు కూడా మెంబర్షిప్ ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా సరైన వ్యాయామ శిక్షకులు ఉన్న జిమ్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. -
మో‘డిమ్’ జిమ్స్!
సాక్షి నెట్వర్క్: ఖరీదైన జిమ్ సెంటర్లకు వెళ్లిలేని వారికోసం జీహెచ్ఎంసీ మంచి ఆశయంతో ప్రారంభించిన మోడర్న్ జిమ్‌లు ఆలనాపాలనా లేక అధ్వానంగా మారాయి. పట్టించుకునే నాథుడు లేక కోట్ల రూపాయల విలువైన పరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. కనీస నిర్వహణకు నోచుకోక, ఆసక్తి ఉన్న వారికి ఉపకరించక కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. మొత్తం జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 150 జిమ్‌లు ఏర్పాటు చేయాలనుకున్నారు. 135 జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిమ్‌కు దాదాపు రూ.4లక్షల వంతున దాదాపు రూ.5.50 కోట్లు ఖర్చు చేశారు. అంతే కాకుండా వీటిని ఏర్పాటు చేసే హాళ్లలో మౌలిక సదుపాయాల కోసం ఆయా కమ్యూనిటీ హాళ్లు తదితర ప్రాంతాల్లో ఒక్కోదానికి రూ.5 లక్షల వంతున దాదాపు మరో రూ.7కోట్లు వెరసి జిమ్‌ల పేరిట దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. ఆధునిక జిమ్‌లు బస్తీల్లోని యువతకు ఉపకరిస్తాయని ఏర్పాటు చేసినప్పటికీ, కొద్దికాలం బాగానే పని చేసిన తర్వాత అవి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయి. 2016లో ఏర్పాటు చేసిన ఈ జిమ్‌లు దాదాపు ఏడాదిన్నర కాలానికే ఆనవాళ్లు లేకుండాపోయాయి. చాలా వాటిల్లో పరికరాలు పాడయ్యాయి. కొన్ని చోట్ల పరికరాలు స్థానిక నేతల ఇళ్లకు చేరాయి. ఇంకొన్ని చోట్ల అసలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. స్వల్ప మరమ్మతులు చేసేవారు సైతం లేక కొన్ని మూలనపడ్డాయి. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జిమ్‌లు పనికిరాకుండా పోయాయి. జిమ్‌లలో ట్రైనర్లు లేకపోవడంతోనూ వీటి ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదు. ఇక కొన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారో, ఎప్పుడు మూసేస్తున్నారో తెలియని దుస్థితి. దూరప్రాంతాలకు వెళ్లలేని మహిళలకు ఈ జిమ్‌లు ఎంతో సదుపాయంగా ఉంటాయని భావించినా అమలుకు నోచుకోలేదు. జిమ్‌లలో ఉచిత వైఫై సదుపాయాన్ని సైతం కల్పిస్తామని ప్రకటించినప్పటికీ తాగునీరు, టాయ్లెట్ల వంటి కనీస సదుపాయాల్లేవు. స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తప్ప వాటిని పట్టించుకుంటున్నవారు లేరు. సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసుకోవాలని కాలనీ సంఘాలకు సూచించినా, అసలు పట్టించుకునేవారు లేక చాలాచోట్ల వెలవెలబోతున్నాయి. కొన్ని సెంటర్లలో నాసిరకం పరికరాలు ఉంచారనే ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల నాణ్యమైనవి ఇతర ప్రాంతాలకు తరలించారనే విమర్శలున్నాయి. కోట్లు వెచ్చించిన జీహెచ్ఎంసీ నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన జిమ్‌సెంటర్ల దుస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన.. పరికరాలు మాయం.. ఒక్కో జిమ్‌లో అత్యంత ఆధునిక సైక్లింగ్, త్రెడ్మిల్, ప్లేట్‌స్టాండ్, త్రిస్టర్, డంబెల్స్ సదుపాయాలతో సహా మొత్తం 21 పరికరాలను ఉంచినట్లు పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో సీతాఫల్మండి ఇందిరానగర్, తార్నాక, మాణికేశ్వర్‌నగర్, మెట్టుగూడ, బౌద్ధనగర్లలోని జిమ్‌లకు నెలల తరబడి తాళాలు వేసి ఉండడంతో పాటు శిక్షకులు అందుబాటులో లేకపోవడంతో జిమ్‌కు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని వ్యాయామ పరికరాలు విరిగిపోగా, మరికొన్ని తుప్పు పట్టి పనికిరాకుండా పోయాయి. జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్‌నగర్‌లోని జిమ్ పరికరాలు మూలనపడి తుప్పు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి అంబేడ్కర్‌నగర్ కమిటీ హాల్లోని జిమ్ ఎక్కడికి తరలిపోయిందో తెలియని పరిస్ధితి. జగద్గిరిగుట్ట డివిజన్ జగద్గిరినగర్‌లో, సూరారం డివిజన్ పరిధి నెహ్రూనగర్ కమిటీ హాల్లో ఉన్న జిమ్‌లు మూత పడ్డాయి. చింతల్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో జిమ్ పరికరాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొన్ని డివిజన్లలో ఉండాల్సిన వాటికన్నా తక్కువగా జిమ్ పరికరాలు ఉన్నాయని, స్థానికంగా ఉన్న చోటామోటా లీడర్లు ఆయా పరికారాలను సొంతానికి వాడుకుంటున్నట్లు తెలియవచ్చింది. ఇదీ పరిస్థితి... ⇔ గాజులరామారం సర్కిల్ పరిధి రంగారెడ్డినగర్ డివిజన్ ఆదర్శనగర్ కమిటీ హాల్, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి సుభాష్‌నగర్ డివిజన్ అపురూప కాలనీ కమిటీ హాల్లో ఉన్న మోడ్రన్ జిమ్‌లో నెల రుసుము వసూలు చేస్తున్నారు. మోడ్రన్ జిమ్‌లు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచాల్సి ఉండగా ఈ రెండు జిమ్‌లలో మాత్రం నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ⇔ జియాగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్ అంబేద్కర్ భవన్లో మొదటి అంతస్తులో జిమ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించడంతో సామగ్రి జిమ్ కేంద్రంలో ఉంచుతున్నారు. వాటిలో చాలా వరకు చోరీకి గురయ్యాయని యువకులు ఆరోపిస్తున్నారు. రహీంపురాలోని జిమ్‌ను కేవలం ఉదయం వేళల్లో మాత్రమే తెరుస్తున్నారని స్థానికులు తెలిపారు. ⇔ శాస్త్రినగర్‌లో ఏర్పాటు చేసిన జిమ్‌లోని పరికరాలు దుమ్ముకొట్టుకుపోయాయి. గదినిండా చెత్తాచెదారం పేరుకుపోయింది. రాంనగర్ డివిజన్ హరినగర్ కమ్యూనిటీ హాల్లో పరికరాలు వృథాగా పడి ఉన్నాయి. బండమైసమ్మ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన జిమ్ తాళం తీసే నాథుడే లేడు. ⇔ ఉప్పల్ సర్కిల్లో నాణ్యత లేని పరికరాలు ఎక్కడికక్కడ జామ్ అయిపోయాయి. కొన్ని చోట్ల వంగిపోయాయి. మరికొన్ని చోట్ల సీట్లు ఊడి చెదలు పట్టాయి. బాడీ గ్రోత్ యంత్రం వైర్లు తెగిపడి మూలన పడ్డాయి. జిమ్‌లలో కోచ్‌లు లేకపోవడంతో చాలామంది ప్రైవేట్ జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలోని వార్డు కార్యాలయంలో రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన జిమ్‌కు రోజుకు ఒకరిద్దరు మాత్రమే వచ్చి పోతున్నారు. ⇔ చిలుకానగర్ డివిజన్లో బీరప్పగడ్డలోని కమ్యూనిటీహాలులో ఏర్పాటు చేసిన జిమ్‌లో కనీస వసతులు లేవు. దీంట్లో ట్రేడ్మిల్ మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన యంత్రాలన్నీ మూలనపడ్డాయి. రామంతాపూర్ ప్రగతినగర్ జిమ్‌లో పరికరాలు పాడైనా మరమ్మతులు చేసేవారు లేరు. ⇔ రామ్‌రెడ్డినగర్‌లోని జిమ్ గత రెండు నెలలుగా మూతపడింది. సర్కిల్లో వినియోగంలో ఉన్న జిమ్‌లలో రూ.300 ఫీజులు వసూలు చేస్తుండటంతో ఎవరూ ఆసక్తి చూపడం లేరు. ఏఎస్‌రావునగర్ డివిజన్ కమలానగర్ కమ్యూనిటీ హల్లో ఏర్పాటు చేసిన జిమ్‌ను యువకులు, మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్ధానిక కార్పొరేటర్‌కు, కాలనీ అసోసియేషన్ నాయకులకు మధ్య ఉన్న విభేదాల కారణంగా ఇప్పటికీ జిమ్‌ను అధికారికంగా ప్రారంభించలేదు. కాలనీ అసోసియేషన్‌పై అంతస్థులోని హాల్లో పరికరాలుంచారు. మోయలేని భారం.. ⇔ జిమ్‌ల నిర్వహణను కాలనీవాసులకు వదిలేసి చేతులు దులుపుకోవడంతో అవి ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరడం లేదు. ఎల్బీనగర్ సర్కిల్లో పలుచోట్ల సౌకర్యాలు, కోచ్‌లు లేక జిమ్‌లు మూతపడగా, మరికొన్ని చోట్ల కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో భారంగా నడుస్తున్నాయి. కోచ్ జీతం, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, స్వీపింగ్, యంత్రాల సర్వీసింగ్ ఖర్చులు తడిసి మోపడవుతుండడంతో ‘జిమ్‌లు మాకొద్దు బాబంటూ..’ కాలనీ సంక్షేమ సంఘాలు వాపోతున్నాయి. ⇔ హయత్‌నగర్ డివిజన్లో శారదానగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన జిమ్ కేంద్రానికి రోజుకు 10 మంది మాత్రమే వస్తున్నారని, వారి వద్ద వసూలు చేస్తున్న రూ.3వేలు దేనికీ సరిపోవడం లేదని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కోచ్ జీతం రూ.8వేలు, ఇతర ఖర్చులు కలుపుకొని నెలకు రూ.12వేల వరకు ఖర్చవుతోందని, జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి సహకారం లేదని కాలనీ కార్యదర్శి కేఎల్‌ఎన్‌రావు పేర్కొన్నారు. తమకు గుదిబండగా మారిన జిమ్‌ను ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని ఆయన కోరారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లో విజయపురి ఫేజ్–2కాలనీ సంక్షేమ సంఘం భవనంలోని జిమ్‌కు కోచ్, నీటి వసతి, టాయ్లెట్ల సౌకర్యం లేకపోవడంతో జిమ్ నిరుపయోగంగా మారింది. -
కేటీఆర్ @ జిమ్
మంత్రి కేటీఆర్ జిమ్‌లో కసరత్తులు చేశారు. వివిధ పరికరాలను పరిశీలించారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ సదుపాయాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి జిమ్‌లో కాసేపు గడిపారు. గచ్చిబౌలి: గ్రేటర్లో ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో రూ.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అర్బన్ మిషన్ కాకతీయలో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులను ప్రక్షాళన చేసి, సుందరీకరణ పనులు చేపడతామన్నారు. తొలి దశలో 40 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో రెండు వేల ఎంఎల్డీ ద్రవ వ్యర్థాలు వెలువడుతుండగా, కేవలం 700 ఎంఎల్డీ మాత్రమే ఎస్టీపీల ద్వారా శుద్ధి అవుతోందన్నారు. ఎస్టీపీల సంఖ్యను పెంచి ద్రవ వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. త్వరలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుతో జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.100 కోట్లు ఆదా అయిందన్నారు. సోలార్, విండ్ పవర్‌తో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతోందన్నారు. సోలార్ ఎనర్జీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను దశలవారీగా ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని చెప్పారు. కన్జర్వేషన్ జోన్లో నిబంధనలు మరింత కఠినం చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. చెరువుల కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 25వేల మొక్కలు నాటాలని పిలుపు... 12 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్‌ను ఆహ్లాదంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. హరితహారంలో భాగంగా మిగిలిన 262 ఎకరాల్లో ఒకే రోజు 25వేల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. బొటానికల్ గార్డెన్‌లోని చెట్లకు నీటిని అందించేందుకు ఎస్టీపీ ప్లాంట్‌ను మంజూరు చేస్తునట్లు ప్రకటించారు. హెచ్ఎండీఏ పరిధిలో కండ్లకోయ, శంషాబాద్, నారపల్లిలో ఇప్పటికే ఫారెస్ట్ బ్లాకులు అభివృద్ధి చేశామని, త్వరలో మరిన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా మెర్సర్ సంస్థ అధ్యయనంలో హైదరాబాద్ నిలిచిందని చెప్పారు. అయితే పరిస్థితి ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 230 కోట్ల మొక్కల పెంపకం... అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా 230 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. ఇది ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ప్రయత్నామని పేర్కొన్నారు. 80 ఫారెస్ట్ బ్లాక్‌లు, 99 కన్జర్వేషన్ బ్లాక్‌లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండా దామోదర్‌రెడ్డి, ఎండీ చందన్‌మిత్రా, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే గాంధీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాతయాదవ్, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, హమీద్ పటేల్, జగదీశ్వర్‌గౌడ్, పూజిత, మేకా రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
సార్.. స్టేషన్‌కు వెళ్లమన్నారని..!
సాక్షి, సూర్యాపేట క్రైం : హలో డ్రైవర్సార్.. మిమ్మ ల్నే.. సీఐసార్ నాకు దగ్గర.. మిమ్మల్ని.. పల్సర్ బైక్ వేసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమ్మంటున్నారం టూ.. ఓ గుర్తుతెలియని దుండగుడు.. సరిగ్గా.. 04.44 గంటల సమయంలో డ్రైవర్ కళ్లు కప్పి పోలీసు వాహనాన్ని దొంగిలించాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేట రూరల్ సీఐగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ జిమ్ చేసేందుకు జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ జిమ్సెంటర్కు తన కు కేటాయించిన ఆత్మకూర్(ఎస్) మండల పోలీస్‌స్టేషన్ సుమో టీఎస్ 09 పీఏ 1568 నం బరు గల వాహనంలో వచ్చాడు. సెంటర్లో సీఐని దింపిన డ్రైవర్ సమీపంలో పార్కింగ్ చేసేందుకు వచ్చాడు. సీఐ డ్రైవర్ ఎం.సైదులు వద్దకు వచ్చిన దుండగుడు సీఐ మిమ్మల్ని అర్జెంటుగా స్టేషన్‌కు వెళ్లమన్నారని.. మీకు పల్సర్‌బైక్ ఇవ్వమన్నారంటూ తన వద్ద ఉన్న బైక్ డ్రైవర్‌కు ఇవ్వడమే ఆలస్యం.. వెంటనే సుమోలోకి ఎక్కిన దుండగుడు డ్రైవింగ్ చేసుకుంటూ అపహరించుకుపోయాడు. 20 నిమిషాల పాటు .. డ్రైవర్ సైదులు వద్ద నుంచి సుమోను దొంగలించుకుపోయిన దుండగుడు.. నేరుగా పట్టణంలోని మున్సిపల్ పెద్దవాటర్ ట్యాంక్ మీదుగా.. సద్దుల చెరువు కట్టపైకి సుమోను డ్రైవింగ్ చేసుకుంటూ సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్ ముందు నుంచే వెళ్లాడు. సుమో ఎక్కడాన్ని గమనించిన డ్రైవర్ సైదులు దుండగుడు ఇచ్చిన బైక్‌ను తీసుకుని సుమోను వెంబడించాడు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో సుమోకు బైక్‌ను అడ్డం పెట్టినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. సుమోను తిరిగి వెనక్కు అదే రూట్లో రూరల్‌పోలీస్‌స్టేషన్ ముందు నుంచి తీసుకెళ్తండడాన్ని స్టేషన్లో పోలీసులు గుర్తించారు. గమనించిన కొందరు కానిస్టేబుళ్లు.. సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి సీఐ ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌చేసి తమకు కేటాయించిన సుమోను వేగంగా నడుపుతూ వెళ్తున్నారని చెప్పారు. వెంటనే సీఐ డ్రైవర్ సైదులుకు ఫోన్ చేయగా.. విషయాన్ని వివరించాడు. వాహనాన్ని అపహరించిన దుండగుడు ముందుగా సుమోకు ఏర్పాటు చేసిన జీపీఆర్ఎస్ను తొలగించి రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోనే వేశాడు. దీంతో దుండగుడు వినియోగించిన పల్సర్ బైక్ టీఆర్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అన్నాదురై నగర్‌కు చెందిన యాట ప్రవీణ్‌కు చెందిన పల్సర్బైక్గా గుర్తించారు. వెంటనే అన్నాదురై నగర్‌కు పోలీసులు చేరుకుని యాట నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ప్రవీణ్ తన బైక్‌ను బావమరిది తిరుపతి రాజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తీసుకుని వెళ్లినట్లుగా తెలిపాడు. వెంటనే ప్రవీణ్ వద్ద ఉన్న రాజు, అతని భార్య ఫోన్ నంబర్లు కూడా తీసుకుని విచారణ చేపట్టారు. భార్య ఫోన్ ఫోన్ కలవగానే.. విషయాన్ని పోలీసులు వివరించారు. రాజు భార్య తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని.. పోలీసు వాహనాన్ని తమ వద్దకు తీసుకొచ్చి నట్లు తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భార్యను చూసిన రాజు.. తిరిగి వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి తన అత్తగారి స్వ గ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం లోని జగన్నాథపురం గ్రామానికి వాహనాన్ని తీ సుకుని వెళ్లాడు. వెంటనే అక్కడి కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఎస్పీ జాదవ్ సమాచారం చేరవేశారు. ఐదు గంటలకుపైగా హైరానా.. ఎస్పీ జాదవ్ అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలకు సమాచారం చేరవేశారు. వెంటనే సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డ్రైవర్ సైదులుతో పాటు సీఐ ప్రవీణ్‌కుమార్‌ను విచారించారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న పోలీస్స్టేషన్లలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని అప్రమత్తం చేసి విషయాన్ని సెట్ ద్వారా చేరవేశారు. జిల్లా కేంద్రంలోని పోలీసులు 8 బృందాలుగా చీలిపోయి గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లా చిల్లకల్లులో స్వాధీనం దుండగుడు తన అత్తగారి గ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథరం నుంచి వాహనాన్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోకి ప్రవేశించాడు. అక్కడ వాహనంతో సంచరిస్తుండగా.. అక్కడి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా చింతకాని నుంచి చిల్లకల్లుకు సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పేట ఎంటీఓ ఆర్ఐ, సిబ్బంది చాకచక్యంగా వ్యవరించి దుండగుడిని పట్టుకుని చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీ చెందిన తిరుపతి రాజుగా గుర్తించామని ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ తెలిపారు. దుండగుడు దొంగ కాదని.. అతడికి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి అని పేర్కొన్నారు. -
కసరత్తులు అక్కర్లేదు.. ఒక్క ట్యాబ్లెట్ చాలు!
లండన్: అప్పుడప్పుడూ టీవీల్లో యాడ్స్ వస్తుంటాయి.. కష్టపడుతూ గంటల తరబడి జిమ్‌లో కండలు కరిగించాల్సిన అవసరం లేదని, ఈ చిన్నపాటి బెల్టును పెట్టుకుంటే చాలు నాజూగ్గా మారిపోతారంటూ చెబుతారు. అందులో నిజమెంతో, అబద్ధమెంతో తెలియదుగానీ.. శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు అలాంటి మాటలే చెబుతున్నారు. జిమ్‌కు వెళ్లి ఎక్సర్సైజులు చేస్తే శరీరం ఎటువంటి ప్రభావానికి లోనవుతుందో సరిగ్గా అలాంటి మార్పులే శరీరంలో సంభవించేలా చేసే ఓ మాత్రను తయారు చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. వ్యాయామం చేసిన ఫలితాలు పొందుతారంటున్నారు. యూకేలోని లీడ్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మాత్రలను తయారు చేశారట. ‘పీజో1’గా నామకరణం చేసిన ఈ మాత్ర వేసుకోగానే.. వ్యాయామం చేయడం ద్వారా కలిగే ఫలితాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘కసరత్తులు చేసే సమయంలో శరీరంలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. తద్వారా శరీరంలోని కీలక అవయవాలకు మరింత రక్తప్రసరణ జరుగుతుంది. ఇటువంటి మార్పులే తాము తయారు చేసిన పీజో1 మాత్ర వేసుకున్నప్పుడు కూడా కలుగుతాయి’ అని పరిశోధకుల్లో ఒకరైన డేవిడ్ బీచ్ తెలిపారు. -
జిమ్ జిల్ జిగా
-
వెయిట్ లాస్..? ప్లీజ్ వెయిట్ బాస్
అధికబరువుతో జిమ్‌కి వెళ్లిన వారిలో అత్యధికులు స్వల్పకాలంలోనే వ్యాయామాలకు గుడ్‌బై చెప్పేయడం జరుగుతోందంటున్నారు నిపుణులు. వీళ్లు జిమ్‌కి వెళ్లడం మరిన్ని ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోందట. ఈ అంశంపై హైదరాబాద్‌లోని ప్రతిమ హాస్పిటల్‌కు చెందిన చీఫ్ ఆర్థోపెడిషియన్ సర్జన్ డాక్టర్ రాధాకృష్ణ విళ్లేషణ ఇదీ... కఠినంగా కాదు ! రన్నింగ్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్, ట్రెడ్మిల్... తదితర కార్డియో వర్కవుట్స్ ఎక్కువ చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గుతాం అనుకుంటారు. ప్రారంభంలోనే జిమ్‌లో అత్యధిక సమయం వ్యాయామానికి కేటాయిస్తారు. నొప్పులు వస్తే బాగా చేశాం అనుకోవడం... ఇవి జాయింట్ పెయిన్స్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అధికబరువు తగ్గించుకునే క్రమంలో జిమ్‌కి వెళ్లడానికి ముందు శరీరానికి ప్రీ టోనింగ్ కోసం రోజూ కనీసం 10 నిమిషాలు చొప్పున బ్రిస్క్ వాకింగ్ చేయాలి. వర్కవుట్ మిషన్లపై అవగాహన జిమ్‌లో ప్రతి వర్కవుట్ మిషన్ గురించి తెలుసుకోవాలి. ట్రెడ్ మిల్ ఎలా అడ్జస్ట్ చేయాలి, సైకిల్ మీద కరెక్ట్‌గా కూర్చున్నామా లేదా అనేది సరిచూసుకోవాలి.. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్ లేదా పెలక్టికల్, స్టెప్పర్, సైకిల్ వంటి వాటి పని తీరు గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. మనం ట్రెడ్ మిల్ చేస్తున్నప్పుడు దాని సర్ఫేస్ ఫ్లాట్‌గా లేదా సమాంతరంగా ఉండాలి. ఇన్క్లినేషన్ జీరోలో ఉండాలి. కేలరీల ఖర్చు, మిషన్‌పై గడుపుతున్న సమయం... ఈ నంబర్స్‌కి మీ ఆరోగ్యంతో సంబంధం లేదని గుర్తించండి. ముఖ్యంగా కేలరీలతో పాటు ఏమేం కోల్పోతున్నామో తెలుసుకోండి. వేగం 5.5 తర్వాత బ్రిస్క్వాక్లో నుంచి రన్నింగ్‌గా మారుతుంది. కాని కేవలం బ్రిస్క్వాకింగ్కే పరిమితం అవడం మంచిది. నిస్సత్తువ వచ్చాక మజిల్ సామర్ధ్యం తగ్గిపోతుంటుంది. అందుకని ఏ కార్డియో స్టేషన్ మీదైనా 20 లేదా 25 నిమిషాల కంటే ఎక్కువ సమయం వెచ్చించకూడదు. ఎందుకంటే ఒకటే మజిల్పై ప్రెషర్ పడితే ఆ మజిల్ డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. స్టెప్పర్ ఒకింత కఠినంగా అనిపిస్తుంది కాబట్టి అధిక బరువున్నవాళ్లు బాగా కేలరీలు బర్న్ చేస్తున్నాం అనుకుంటారు. కాని అది మోకాలికి హాని చేస్తుంది. కూర్చుని చేస్తాం కాబట్టి సైక్లింగ్ చాలా మం చిది. జాయింట్ మీద బాడీ వెయిట్ పడదు. వెయిట్ లాస్ ప్రక్రియలో కేలరీ ఖర్చు అవడంతో పాటు మజిల్ కూడా లాస్ అవుతామని గుర్తుంచుకోవాలి. వెయిట్ ట్రైనింగ్‌తో మాత్రమే మజిల్ సామర్ధ్యం పెరుగుతుంది కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్కూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఓవర్ వెయిట్... చేయకూడని వర్కవుట్? ఉండాల్సిన బరువుకన్నా పది కిలోలు ఎక్కువుంటే ఓవర్ వెయిట్, అంతకు మించి ఉంటే ఒబేసిటీ అంటారు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు కార్డియో వర్కవుట్స్ చేస్తే సరిపోతుంది. ఒబేసిటీ ఉన్నవాళ్లు మాత్రం కార్డియో, డైట్ కంట్రోల్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి. ఇలాంటి వ్యక్తులు స్కిప్పింగ్, జంపింగ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్లు చేయకూడదు. ఒక నెల వరకూ అబ్డామినల్ వ్యాయామాలు వ్యక్తిగత ట్రైనర్ పర్యవేక్షణలో చేయాలి. బాడీ ఫ్యాట్లో పొట్ట దగ్గరున్న ఫ్యాట్ మాత్రమే పోవాలి. - డాక్టర్ రాధాకృష్ణ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ -
అతి వ్యాయామంతో హెయిర్ లాస్
‘సర్వే’జనా బట్టతలకీ బాడీబిల్డింగ్కూ ముడి పడింది. అధి కంగా వ్యాయామం చేయడం వెంట్రుకల మీద ప్రభావం చూపుతుంది. ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధన దీనిని వెల్లడించింది. మజిల్స్ బిల్డప్ విషయంలో బాగా ఆసక్తితో గంటలకొద్దీ జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో గడిపేవారికి ఇది ఇబ్బంది కరమైన వార్తే. ఎక్సర్సైజ్లు తక్కువగా, మితంగా చేసే వారితో పోలిస్తే అతిగా వర్కవుట్స్ చేసేవారికి జుత్తు తొందరగా పలచనవుతుందని పరిశోధకులు హెచ్చరించారు. కఠినమైన వ్యాయామాల సందర్భంగా దేహం టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను అధికంగా విడుదల చేస్తుందని, ఈ హార్మోన్ ఉత్పత్తిలో మోతాదు మించడంతో అది హెయిర్లాస్కు దారితీస్తుందని వివరించారు. -
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జిమ్
ప్రారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణ్ భవన్లో ఉద్యోగుల దేహదారుఢ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. వ్యక్తి ఆరోగ్యం, మానసిక స్థితిపై ఫిట్నెస్ ప్రభావం అధికంగా ఉంటుందని మంత్రి అన్నారు. ప్రస్తుత జీవనశైలిలో ఉద్యోగులకు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లో ఈ విధమైన వ్యాయామ సౌకర్యాలు ఉండడం వల్ల వారి ఫిట్నెస్ మరింత మెరుగుపడుతుందన్నారు. ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. సుమారు రూ.5 లక్షలతో ఏర్పాటైన వ్యాయామశాలను మంత్రిత్వ శాఖలోని దాదాపు 500 మంది ఉద్యోగుల సౌలభ్యం కోసం ఆఫీసు పనివేళల తర్వాత తెరిచి ఉంచుతారు. మంత్రిత్వ శాఖలో ని ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వ్యాయామశాల ప్రారంభించడం ఇదే మొదటిసారి. -
ప్యారిస్ నదిపై జిమ్ జర్నీ
ప్యారిస్ : విద్యుత్తు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం రూపురేఖలు మారిపోయాయి. ఇందులో డౌటేమీ లేదు. కానీ పెరిగిపోతున్న భూతాపం, వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఈ స్వరం మారుతోంది. కరెంటు వద్దని అనడం లేదుగానీ... అవకాశమున్న చోటల్లా సంప్రదాయేతర ఇంధన వనరులను వాడుకుందామన్నది ఈ సరికొత్త ఆలోచన. ఇటలీ ఆర్కిటెక్ట్ ‘కార్లో రాటీ అసోసియేటీ’ తాజా డిజైన్ దీనికి పక్క సాక్ష్యంగా కనిపిస్తోంది. ప్యారిస్ నగరంలోని సీన్ నదిని దాటేందుకు వీరు డిజైన్ చేసిన పడవ ప్లస్ జిమ్ ఇది. పెట్రోలు, డీజిళ్లను పక్కనబెట్టి లోపలున్న వాళ్లు సైకిల్ తొక్కితేనే ఈ పడవ నడుస్తుంది. దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ పడవలో ఆట్రిస్ వ్యాయామ యంత్రాలను బిగించారు. సైకిల్ తొక్కినా... బరువులెత్తినా మనుషులు వాడిన శక్తిని ఇవి విద్యుత్తు మార్చి బ్యాటరీల్లో నిల్వ చేస్తాయి. పడవ పైభాగాన మొత్తం పారదర్శకమైన గాజు లాంటిది ఏర్పాటు చేశారు. ఇది పరిసరాలను గమనించేందుకు మాత్రమే కాదు...వ్యాయామం తాలూకూ వివరాలు (దూరం, వేగం, కరిగిన కేలరీలు వంటివి) కనిపించే స్క్రీన్స్గానూ పనిచేస్తుంది. ఒక్కో పడవ జిమ్‌లో ఏకకాలంలో 45 మంది వరకూ వ్యాయామం చేయవచ్చు. ప్యారిస్ నగరంలో ఈ జిమ్‌ను ఏడాది పొడవునా అందుబాటులో ఉంచుతామని, నగరాన్ని ఓ కొత్త కోణంలో చూసేందుకు ఇది ఉపయోగపడుతుందని కార్లో రాటీ అసోసియేటీ అంటోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ పడవ జిమ్‌ను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్య లండన్‌లో ఒక బస్‌లోనూ ఇలాంటి జిమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే! -
జంగిల్ ఫీట్స్
హ్యూమర్ ప్లస్ మనకెంత తెలుసో అదే జ్ఞానం. ఒక తొండ బస్కీలు లేసి తీసి తనది సిక్స్‌ప్యాక్ బాడీ అనుకుంది. జ్ఞానాన్ని అమ్ముకోవడం తెలిస్తే దాన్ని విజ్ఞానమంటారు. అందుకే అడవిలో జిమ్స్టార్ట్ చేసింది. ఒక ఊసరవెల్లి వచ్చి రిబ్బన్ కట్ చేసింది. రకరకాల రంగులు మారుస్తూ అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొండ ప్రత్యేకత ఏమంటే అది ప్రతిదానికీ తల ఊపుతూ ఉంది. ఈ ఒక్క లక్షణముంటే చాలు మనమెక్కడున్నా పెద్దమనిషి అని పిలుస్తారు. అందువల్ల తొండకి అండదండలు లభించాయి. జిమ్‌లో బాడీమసాజ్, వెయిట్‌లాస్, మెమరీలాస్ ఇలా చాలా ఐటమ్స్ ప్రవేశపెట్టింది. మొదట ఒక నత్తవచ్చి రన్నింగ్ నేర్పించమని అడిగింది. ‘‘నత్తలతో పరిగెత్తించడం కార్పొరేట్ సంస్కృతి, పరిగెత్తేవాటిని నత్తలుగా మార్చడం ప్రభుత్వ విధానం. ఇది అడవి. భోజ్యమే తప్ప రాజ్యముండదు’’ అని తొండ రెండు బస్కీలు తీసింది. బస్కీలు తీస్త్తూ మాట్లాడ్డం, మాట్లాడుతూ బస్కీలు తీయడం తొండ బాడీ లాంగ్వేజ్.నత్తకి స్కేటింగ్ బూట్లు కట్టి ఒక తోపు తోస్తే ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ అని పాడుకుంటూ వెళ్లింది. షికారు ముగిసిన తర్వాత నత్త చిత్త భ్రాంతితో పొర్లుదండాలు పెట్టి ‘‘నత్తకే వేగం నేర్పావంటే నువ్వు మామూలు తొండవి కాదు, ఉద్ధండ పిండానివి’’ అని పొగిడింది.‘‘ఉన్నచోటునే ఉంటూ పరిగెత్తుతున్నామని అనుకోవడం భ్రాంతి, భ్రమలు, కలలే జీవన విధానమైనప్పుడు భ్రాంతిని కాంతిమతం చేసుకోవాలి. దీన్నే పర్సనాలిటి డెవలప్మెంట్ అంటారు’’ అంది బస్కీటోన్తో తొండ.తరువాత ఒక ఎలుగుబంటి వచ్చి బాడీమసాజ్ చేయమని అడిగింది. ‘‘నీలో ఏది బొచ్చో, ఏది బాడీనో తెలుసుకోవడానికే రెండు రోజులు పడుతుంది’’ అని తొండ గొణుక్కుని, ఖడ్గమృగాన్ని అవుట్‌సోర్సింగ్‌కి తీసుకుంది. ఒక గ్యాలన్ ఫిల్టర్ వాటర్ వేతనంగా ఇవ్వాలని అది కోరింది. ఎలుగుబంటిని చూడగానే ఖడ్గమృగం ఒక్కసారిగా జడుసుకుంది. ఒక బూజుకర్ర తీసుకుని దాని ఒంటిపై ఎడాపెడా బాదింది. దట్టమైన దుమ్ముధూళితోపాటు కొన్ని వందల తేనెటీగలు కూడా ‘జుమ్మంది నాదం’ అంటూ పైకి లేచి కోపంతో ఖడ్గమృగం వెంటపడ్డాయి.‘వీటికి నోట్లోనే కుట్టు మిషనుంటుంది’ అనుకుంటూ ఖడ్గమృగం పారిపోయింది. తేనెటీగల్ని ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఇంతకాలం ఒంటిపై తేనె పట్టు ఉంచుకుని తేనెకోసం చెట్లూపుట్టలూ వెతికానా?’’ అంది ఎలుగుబంటి. ‘‘అదే ఈ ప్రపంచానికి పట్టిన తెగులు. తమలో ఉన్నది తెలుసుకోలేరు. దేనికోసమో వెతుకుతూ ఉంటారు. నీ అన్వేషణ నీతోనే ముగుస్తుంది’’ అంది తొండ. ఒక కొండచిలువ బుసబుస వచ్చి తనకి స్కిప్పింగ్ నేర్పించమని అడిగింది. ‘‘ప్రపంచమంతా రజ్జు సర్పభ్రాంతితో చస్తూ వుంది. మనం తాడనుకున్నవాడు పాముగా మారుతాడు. పాము అనుకుని హడలి చస్తే అక్కడ తాడూ బొంగరమూ రెండూ ఉండవు. పాము వచ్చి తాడును కోరుకోవడం వాస్తవ విరుద్ధం. మనం నకిలీగా జీవించాలి తప్ప, మనలాంటి నకిలీలను తయారు చేయకూడదు’’ అంది తొండ. కొండ చిలువ వినలేదు. దానికి స్కిప్పింగ్ తాడు ఇస్తే రెండుసార్లు ఎగిరింది. మూడోసారి తన తోకనే తాడు అనుకుని దబ్బున పడింది. తరువాత ఒక జింక వేగంగా వగరుస్తూ వచ్చి తనకి చిరుతకంటే వేగంగా పరిగెత్తడం నేర్పమని అడిగింది. తొండ విషాదంగా నవ్వి ‘‘నువ్వెంత వేగంగా పరిగెత్తినా, నిన్ను తినేవాడు నీకంటే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. చిరుత నీకు మృత్యురూపమైతే గద్ద నాకు మృత్యురూపం. మృత్యువు ఒక నీడలా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు అది మనముందు నిలబడి చిరునవ్వు నవ్వుతుంది. అప్పుడు మనకు ఏడుపొచ్చినా నవ్వాల్సిందే’’ అంది.ఇంతలో చిరుతవచ్చి జింకని పట్టేసుకుంది. గద్దకి దొరక్కుండా తొండ మాయమైంది. - జి.ఆర్.మహర్షి -
రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్
ఇక జీహెచ్ఎంసీ ‘జిమ్స్’.. ఫిట్నెస్ మంత్రం జపిస్తున్న నగర కార్పొరేషన్ హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఉంటుంది. ఇందు కోసం చాలా మంది ప్రైవేట్ జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమత లేని వారు.. అందుబాటులో జిమ్‌లు లేని వారు వీటికి దూరంగా ఉండిపోతున్నారు. ఇలాంటి వారి కోసమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అందరికీ ఉపయోగపడే అత్యాధునిక జిమ్‌లను అందుబాటులోకి తెస్తోంది. వ్యాయామం ద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వం అందించేందుకు జిమ్‌లు ఉపయోగపడతాయని భావించి వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం గ్రేటర్‌లోని ఐఎస్ సదన్, రామంతాపూర్, ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడతో సహ పది ప్రాంతాల్లో జిమ్‌లను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో జిమ్‌ను సగటున యాభై మంది ఉపయోగించుకోవచ్చని, మరో 125 జిమ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వీటి ద్వారా యువత, వయోధికులు, మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. అన్ని జిమ్ సెంటర్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వీటి వద్ద సీసీ కెమెరాలను స్థానిక కాలనీ, సంక్షేమ సంఘాలే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని 12 ప్రధాన క్రీడా మైదానాల్లో కూడా ఆధునిక జిమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆధునిక సామగ్రి.. గ్రేటర్లో మొత్తం 135 జిమ్‌ల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని జీహెచ్ఎంసీ ఇప్పటికే కొనుగోలు చేసింది. పేరెన్నికగ న్న కంపెనీల నుంచి ఆధునిక సామగ్రిని ఈ జిమ్‌ల కోసం కొనుగోలు చేశారు. ఒక్కో జిమ్‌లో 21 ఉపకరణాలు ఉంటాయి. వీటిల్లో ఆధునిక సైక్లింగ్, త్రెడ్మిల్, ప్లేట్‌స్టాండ్, ట్రైస్టర్, డంబెల్స్, ట్విస్టర్స్, ఫోర్‌స్టేషన్ మల్టీ జిమ్, ఇంక్లైన్, డిక్లైన్ బెంచ్ తదితర సామగ్రి ఉంటాయని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఓఎస్డీ ప్రేమ్‌రాజ్ తెలిపారు. ఎక్కడెక్కడ.. ఎవరి ఆధ్వర్యంలో.. ఒక్కో జిమ్‌కు జీహెచ్ఎంసీ సగటున రూ.10 లక్షలు ఖర్చు చేస్తోంది. జిమ్‌లో అవసరమైన ఉపకరణాలు, క్రీడాపరికరాలు తదితరాలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తుండగా, కేంద్రా ల్లో సదుపాయాల కల్పనకు మరో రూ.5 లక్షలు వెచ్చిస్తోంది. వీటి నిర్వహణను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంటాయి. సంబంధిత డిప్యూటీ కమిషనర్, ఏఈలు నిర్వహణను పరిశీలిస్తారు. కేంద్ర నిర్వహణతోపాటు సామగ్రి రక్షణ బాధ్యత రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీలదే. పేద, మధ్య తరగతి వారికి ఉపకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వీటిల్లో నెలకు సుమారు రూ. 100 వసూలు చేయవచ్చని తెలుస్తోంది. జిమ్ నిర్వహణకే ఫీజును వసూలు చేస్తారు. సంపన్న ప్రాంతాల్లో అధికంగా వసూలు చేసే యోచన ఉంది. -
ప్రతి జిల్లాలో పోలీస్ జిమ్
–రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వెల్లడి కడప అర్బన్: పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో జిమ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పర్యటనకు విచ్చేసి ఆయన కడప నగరంలోని పోలీసు లైన్లో పోలీసు జిమ్ కేంద్రాన్ని, పోలీసు పెట్రల్ బంకును ప్రారంభించారు. అనంతరం జిమ్‌లోని పరికరాలను పరిశీలించారు. కొద్ది సేపు వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో ఊబకాయులుగా ఉన్నవారి బరువు తగ్గించేందుకు ముందుగా ప్రత్యేక టీంలతో సర్వే చేయించామన్నారు. ఈ జిమ్ కేంద్రాల ద్వారా అధిక బరువు ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, వారికి వ్యాయామ తరగతులను నిర్వహిస్తామన్నారు. పోలీసు శాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా ఆయా స్థలాల్లో అవసరమైన సంక్షేమ కార్యక్రమాల కోసం నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో పోలీస్ పెట్రోల్ బంక్‌ను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కడపలో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించామన్నారు. తద్వారా మిగతా పెట్రోల్ బంక్ కన్నా నాణ్యమైన పెట్రోల్‌ను తమ వాహనాలతో పాటు, ఇతర వాహనాలకు అందించగలుగు తామన్నారు. హె పీసీఎల్ సంస్థ వారికి ఆదాయంతో పాటు వచ్చే కమీషన్ పోలీస్ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే పెట్రోల్ బంక్ ఆవరణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమాల్లో రాయలసీమ ఐజి శ్రీధర్‌రావు, కడప– కర్నూలు రేంజి డిఐజి రమణకుమార్, జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ, ఓఎస్డి (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పి అన్బురాజన్, జిల్లా అదనపు ఎస్పీ విజయకుమార్, డీఎస్పీలు ఈజీ అశోక్ కుమార్, పూజిత నీలం, సర్కార్, రాజేంద్ర, నాగేశ్వర్ రెడ్డి, భక్తవత్సలం, శ్రీనివాసులు, రాజగోపాల్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
వారణాసి జిమ్‌లో ధోని సందడి
-
మహిళా మండలి భవనంలో జిమ్ పెడతారా?
రాజేంద్రనగర్: మహిళా మండలికి చెందిన భవనంలో జిమ్ ఏర్పాటు చేయటంపై రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి జిమ్‌కు సంబంధించిన పరికరాలను ఆ భవనంలో ఉంచగా మంగళవారం మహిళలంతా అక్కడికి తరలివచ్చి ధర్నాకు దిగారు. పరికరాలను తీసుకు వచ్చి బయటపడేశారు. మహిళల ఫిర్యాదు మేరకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడి, మహిళా మండలికే భవనాన్ని కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
గెట్ రెడీ ఫర్ క్రిస్ గెతిన్ వర్కవుట్స్
దేశంలో తొలి జిమ్ నగరంలో ఏర్పాటు ఈ నెల 14న బంజారాహిల్స్‌లో ప్రారంభానికి సన్నాహాలు హైదరాబాద్: వరల్డ్ ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఇండియాలో తన వర్కవుట్లకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. దేశంలో తొట్టతొలి అత్యాధునిక జిమ్‌ను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో విశాల సముదాయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమెరికాకు చెందిన గెతిన్ బాలీవుడ్ బాయ్స్ రణబీర్‌కపూర్, హృతిక్ రోషన్, జాన్ అబ్రహం, అర్జున్‌కపూర్‌లతో పాటు టాలీవుడ్ స్టార్ మహేష్‌బాబులకు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాకు చెందిన గెతిన్ హెల్దీ ఫిట్‌నెస్‌లో డైనమిక్ ట్రాన్స్మిషన్ ప్రిన్సిపుల్ విధానంతో అనేక అద్భుతాలు సొంతం చేసుకున్నారు. ఫిట్నెస్, కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్, కోర్ ఫిట్నెస్ విభాగాలతో పాటు సాలిడ్ న్యూట్రిషన్ అడ్వైజ్ చేయటం గెతిన్ ప్రత్యేకత. నగరంలో 14న ప్రారంభం... పూర్తి అధునాతన టెక్నాలజీ, సదుపాయాలతో నిర్మించిన జిమ్‌ను ఈ నెల 14న ప్రారంభించనున్నారు. మరింత మందికి హెల్దీ లైఫ్‌ను అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే క్రిస్ గెతిన్ హైదరాబాద్‌ను ఎంచుకున్నాడని అతని సన్నిహితుడు, ఇంటర్నేషనల్ ఫిట్నెస్ ట్రైనర్ సతీష్ పర్యాద చెప్పారు. -
ఫిట్నెస్ రంగంలోకి రకుల్ ప్రీత్ సింగ్
-
రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్
♦ ఫిట్నెస్ రంగంలోకి నటి రకుల్‌ప్రీత్ ♦ గచ్చిబౌలిలో ప్రారంభమైన అత్యాధునిక జిమ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్నెస్ రంగంలోకి అడుగుపెట్టారు. గచ్చిబౌలిలో ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‌ను ఆమె నెలకొల్పారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఫిట్నెస్ స్టూడియో ప్రారంభోత్సవానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వ్యాయామ ప్రియులకు అవసరమైన అన్నిరకాల అత్యాధునిక ఎక్విప్మెంట్ తమ ఫిట్నెస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన విధానంలో రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేస్తే చక్కని శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చన్నారు రకుల్. - సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
స్వీటీతో జిమ్‌లో రానా హల్చల్
హైదరాబాద్: కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రత్యేక పాత్రలతో సాహసాలు చేస్తూ అందరిన్నీ అలరిస్తున్న టాలెండెట్ హీరోయిన్ అనుష్క. జిమ్ బాడీతో, ఆకట్టుకునే నటనతో, విభిన్న పాత్రలతో విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విలక్షణ నటుడు రానా. వీరిద్దరూ కలిసి జిమ్‌లో సందడి చేస్తే ఎలా ఉంటుంది? నిజంగానే వీళ్లిద్దరూ జిమ్‌లో జాలీ జాలీగా ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తూ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ సరదా వీడియోను అనుష్క తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 'సైజ్ జీరో' చిత్ర యూనిట్ కి రానా దగ్గుబాటి వ్యాయామ పాఠాలు నేర్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని మెలకువలు నేర్పుతానంటూ రానా అనుష్క(స్వీటీ), ప్రకాశ్ కోవెలమూడి, కనికలతో రక రకాల వ్యాయామాలు చేయిస్తున్న ఈ వీడియో ఇపుడు టాక్ ఆఫ్ ఆది టౌన్. అయితే 'బయటివాళ్లకే కాదు, సినిమా వాళ్లకూ బరువు పెరిగిపోతున్నామేమో అన్న అభద్రతా భావం ఉంటుంది. సైజ్ జీరో అంటే సన్నగా ఉండిపోవడం కాదని అనుష్క మీడియాతో తెలిపింది. శరీర సౌష్టవం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందని, ఎవరికి వాళ్లు సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పింది. వ్యాయామాల్ని, ఆరోగ్య సూత్రాల్ని ప్రోత్సహిస్తా కానీ.. సౌందర్యం పేరుతో లావుగా ఉన్న వాళ్లను అవహేళన చేయడం తగదని సూచించింది. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటించిన 'సైజ్ జీరో' గత శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగింది. ఈ క్రమంలో కృత్రిమ పద్ధతిలో కాకుండా ఎంత కావాలంటే అంత సహజంగానే బరువు పెరుగగలనని నిరూపించిన స్వీటీ ఇపుడు మళ్లీ మునుపటి మెరుపు తీగలా మారేందుకు ప్రయత్నిస్తోందన్న మాట. -
అలా చేస్తే... బాహువులుబలి
సిటీయూత్లో బాహుబలి సినిమా ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. ఆ సినిమాలో ప్రభాస్ తరహా ఫిజిక్ కోసం యువకులు జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. మెడ నుంచి వీపు దిగువ వరకూ ‘వి’ షేప్‌తో అదరగొట్టిన ప్రభాస్ తరహా లుక్ కోసం వీరు ట్రైనర్లను సంప్రదిస్తున్నారు. ‘ఒకటే షేప్ కోసం ప్రయాస పడడం కాదు. ఓవరాల్‌గా ఫిజిక్‌ను తీర్చిదిద్దుకోవాలి. అలా కాకపోతే ఫిజిక్ సమతుల్యం కోల్పోతుంది’అంటున్నారు ‘సోల్’ జిమ్‌కు చెందిన ట్రైనర్ వెంకట్. ఆయన చేస్తున్న సూచనలేమిటంటే... వీపునకు రెండు వైపులా భుజాలకు దిగువన ఉండే కండరాల పేరు లెటిజమ్ మజిల్. మొత్తం దేహంలోనే అతి పెద్ద మజిల్ ఇది. అప్పర్ బ్యాక్ బాడీ షేప్ మొత్తం నిర్దేశించే మజిల్గా దీన్ని చెప్పవచ్చు. ఈ భాగం సరైన రీతిలో పికప్ అయితేనే వి-షేప్ లుక్ వస్తుంది. అలాగే నడుం నుంచి లాట్స్ ప్రారంభం వరకూ ఉండే మజిల్‌ను లోయర్ బ్యాక్ అంటారు. ఈ ప్రాంతంలోని మజిల్‌ను తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ భాగానికి కఠినమైన వ్యాయామాలతో ప్రభాస్ లాంటి క్రిస్మస్ ట్రీ షేప్ పొందవచ్చు. చాలా మంది అప్పర్ బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, లోయర్ బాడీని నిర్లక్ష్యం చేస్తారు. అయితే పై భాగానికి మితిమీరి వర్కవుట్ ఇస్తున్నప్పుడు లోయర్ పార్ట్‌కి సమాంతరంగా ఇవ్వాలి. లేని పక్షంలో ఆ పార్ట్ సహజంగా ఉండాల్సిన ఫిట్నెస్ను సైతం కోల్పోతుంది. పైగా లోయర్ పార్ట్‌కి చేస్తేనే మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. లెగ్స్ స్ట్రెంగ్త్ లేకపోతే వెన్ను, మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందుకే రెగ్యులర్‌గా స్క్వాట్స్, లంజెస్, క్వార్డ్రయిసప్స్, కాఫ్ వంటివి చేయాలి. ‘వి’షేప్ సాధనలో భాగంగా చినప్స్ చాలా ముఖ్యం. ట్రిపిజల్స్, ట్రైసప్, లాట్స్, బ్యాక్ ప్రెస్, బెంచ్‌ప్రెస్... ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో చేయాలి. లేకపోతే చెక్కినట్టుండే రూపం సాధ్యం కాదు. పొట్ట ప్రాంతంలో కండరాల బలోపేతానికి అబ్డామినల్ వర్కవుట్స్, క్రంచెస్ బాగా చేయాలి. ఈ తరహా షేప్ కోసం కఠినమైన వ్యాయామాలు చేయాలి కాబట్టి, ముందుగా డాక్టర్ సలహా తీసుకుని ట్రైనర్ పర్యవేక్షణలో చేయాలి. -
‘షేప్’ కావాలంటే.. టైమ్ ఇవ్వాల్సిందే..
ఫిట్‌నెస్‌కు ఎన్నో జాగ్రత్తలు తప్పవు.. సినీమోజు పనికిరాదంటున్న ట్రైనర్స్ సిటీ యూత్‌కి జిమ్‌లు, ఎక్సర్సైజ్లు క్రేజీగా మారాయి. సినిమా హీరో, హీరోయిన్లను చూసి పెంచుకుంటున్న మోజుతో అచ్చం వారిలాగే వేగంగా తమ బాడీ ‘షేప్’ కూడా మార్చుకోవాలనుకుంటున్నారు. కండరాలు.. అవి పనిచేసే విధానంపై సరైన అవగాహన లేక లేనిపోని సమస్యలతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల మెహదీపట్నం, గతంలో ఎల్బీనగర్ జిమ్‌లలో యువకులు వర్కవుట్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వ్యాయామం సరైన విధంగా సాగాలంటే మజిల్స్ మీద కనీస అవగాహన ఉండాలంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి మనం తినే ఆహారం, చేసే శారీరక శ్రమ కండరాల లుక్‌ని, షేప్‌ని నిర్ణయిస్తాయి. ఈ కండరాల్లో మార్పులు వేగంగా రావాలనుకుంటే సప్లిమెంట్స్, శస్త్రచికిత్సలు చేయాలి. వీటికన్నా తగిన సమయం తీసుకుని వచ్చే ఆరోగ్యకరమైన షేప్‌ని మాత్రమే మనం ఆహ్వానించాలి. అందుకు ముందుగా కండరాలపై, వాటికి ఇచ్చే వ్యాయామంపై అవగాహన పెంచుకోవాలంటున్నారు సోల్ జిమ్‌కు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్. డెల్టాయిడ్స్: భుజ కండరాల ఎక్సర్సైజ్లో స్పందించే కండరమే డెల్టాయిడ్. షోల్డర్‌కు ఓ పక్కగా ఉన్న భాగాన్ని మెడిలియల్ డెల్టాయిడ్, ప్రముఖంగా కనబడే భాగాన్ని యాంటిరియర్ డెల్టాయిడ్ అంటారు. వీటిని తీరైన విధంగా తీర్చిదిద్దాలంటే.. 4 నుంచి 8 నెలల సమయం పడుతుంది. ట్రైసప్స్: భుజాలకు దిగువన చేతికి వెనుక భాగంలో ఉండే కండరం ఇది మూడు మజిల్స్‌తో ఏర్పడుతుంది కాబట్టి ట్రైసప్స్ అంటారు. ఆలస్యంగా వెలుగు చూసి తొందరగా మాయమయే స్వభావం దీనిది. వ్యాయామ ప్రియులు ‘హార్స్‌షూ’గా అభివర్ణించే ఈ షేప్ రావాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుంది. అప్పర్-లోయర్ బ్యాక్ వీపునకు రెండు వైపులా భుజాలకు దిగువన ఉండే కండరాలను లెటిజమ్ మజిల్ అంటారు. దీనికి సరైన విధంగా ఎక్సర్సైజ్ అందిస్తే విషేప్ వస్తుంది. గ్రీకు వీరుడి రూపానికి అంత ప్రాచుర్యం రావడానికి కారణమైన కార వి-షేప్ కావాలంటే ఏడాదిన్నర పడుతుంది. ఈ పార్ట్ మంచి షేప్ తిరిగితే ‘క్రిస్మస్ ట్రీ షేప్’ అంటూ ఫిట్నెస్ లవర్స్ వర్ణిస్తారు. బైసప్స్: ముందు వైపు చేతుల భుజం కిందుగా మోచేయికి పైన ఉండే కండరాలు. నేను బలవంతుడిని అని చూపించడానికి తరచుగా ప్రతి ఒక్కరూ చేతులు పైకి మడిచి చూపించే కండరాలివే. రెండు కండరాలు జత కారణంగా దీన్ని బైసప్స్ అంటారు. మూడు నుంచి 8 నెలల సమయంలో బైసప్స్ను షేప్‌కు తేవచ్చు. పెక్టొరాలిస్: ఛాతి ప్రాంతంలో ఉండేవి పెక్టొరాలిస్ మజిల్స్. వీటిలోనే మైనర్, మేజర్ పెక్టొరాలిస్ అని రెండు రకాల మజిల్స్ ఉంటాయి. ఛాతిని తీర్చిదిద్దే పెద్ద సైజ్ కండరాలివి. అప్పర్, మిడిల్, లోయర్, అవుటర్.. ఇలా 4 రకాలుగా విభజించి దానికి తగ్గట్టుగా ఛాతికి వ్యాయామం అందివ్వాలి. తొందరగా పెరిగే లక్షణం ఛాతి మజిల్ కి ఉన్నప్పటికీ కనీసం 6 నెలల టైమ్ ఇవ్వాల్సిందే. రెక్టస్ మజిల్: ఛాతికి దిగువన ఉంటాయి. దీనిలో రెక్టస్ అబ్డామినల్ మజిల్స్‌ను పైకి కనిపించేలా చేయడానికి వ్యాయామ ప్రియలు ప్రయత్నిస్తుంటారు. ఇందులో కూడా అప్పర్ , లోయర్, మిడిల్ భాగాలుంటాయి. ఈ మూడింటికి సమానంగా ఇచ్చే వ్యాయామం ద్వారా అందంగా కొలువుతీరే కండరాలనే సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ వర్ణిస్తున్నారు. అత్యంత కఠినమైన వ్యాయామాలతో ఏడాది పైన సమయం పడుతుంది. క్వార్డ్రయిసప్స్: తొడకు ముందు భాగంలో ఉండే ఈ మజిల్ సైజ్ పరంగా పెద్దది. మొత్తం 4 కండరాలతో నిర్మితమైంది కాబట్టి దీన్ని క్వార్డ్రయిసప్స్గా వ్యవహరిస్తారు. దీనిని బలంగా మార్చాలంటే కనీసం ఆర్నెల్ల సాధన అవసరం. కాఫ్స్: కాలి దిగువ భాగంలో ఉండే కండరాలివి. మనం పిక్కలని పిలుస్తాం. ప్రతిరోజూ ఎక్కువగా వాడే కండరం ఇది. దీనిలో కూడా ఇన్నర్, అవుటర్, రియర్.. అంటూ 3 రకాలుంటాయి. దీనికి ఆర్నెల్లలో మంచి షేప్ తీసుకురావచ్చు. ఒక ప్రత్యేక భాగాన్ని షేపప్ చేయాలంటే.. వ్యక్తి వయసు, దేహం శైలి, ఆహారపు అలవాట్లను అనుసరించి ఉంటుంది. ఆరోగ్యకరమైన పద్ధతుల్లో మాత్రమే ఫిజిక్ షేప్ చేసుకోవాలనేది గుర్తించాలి. -
ఆహార నియంత్రణ చాలు!
ఆరోగ్యం ఒంట్లో చెడు కొవ్వు పేరుకోకుండా ఉండటానికి రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా ఒక సులభతరమైన ప్రత్యామ్నాయ మార్గముందని ప్రకటించారు గ్రీకు అధ్యయనకర్తలు. శారీరక వ్యాయామానికి సమయం లేని వారు ఎంచక్కా ఓ పని చేస్తే హృదయ సంబంధ జబ్బుల ప్రమాదం నుంచి చాలావరకూ బయటపడవచ్చని వారు అంటున్నారు. ఇంతకీ ఏమిటా పని అంటే.. ఆహార నియంత్రణ పాటించడం! వేళకు ఇంత తిని.. ఆ ఆహారంలో తాజా పళ్లు, కాయగూరలు ఉండేటట్లు చూసుకుంటూ, తృణ ధాన్యాలు, విత్తనాలు, బీన్స్, ఆలివ్ ఆయిల్, చేపలు వంటి ఆహారానికి తోడు అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకుంటుంటే చాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 47 శాతం వరకూ తగ్గిపోతాయని అధ్యయనకర్తలు వివరించారు. ఇలాంటి ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకుంటే వేరే శారీరక కసరత్తు అవసరం లేకపోయినా గుండె జబ్బుల నుంచి బయటపడ్డట్టేనని వారు తెలిపారు. ఏథెన్స్లోని హరొకొపియో వర్సిటీ అధ్యయనకర్తలు ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుత జీవనశైలిలో ఆహార నియంత్రణ పాటించడం కూడా అంత సులభం కాకపోవడ ం వల్లనే కదా.. మానవాళి జబ్బుల పాలవుతున్నది! అదే పాటిస్తే ఇక ఏ ఆరోగ్య సమస్యా ఉండదేమో! -
ఫిట్నెస్ భాగ్య
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పీయూసీ కళాశాలల్లో యువశక్తి కేంద్రాలు ఒక్కో కేంద్రానికి రూ 15 లక్షల విలువైన పరికరాలు మొదట 30 జిమ్‌ల ఏర్పాటు అనంత రం రాష్ర్ట వ్యాప్తంగా విస్తరణ నిర్వహణ భారం సదరు కళాశాలదే బెంగళూరు : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా పీయూసీ (ఇంటర్ మీడియట్) కళాశాలల్లో ఆధునిక జిమ్ (వ్యాయామశాల)ను అందుబాటులోకి తీసుకుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో వెయ్యి అంతకంటే ఎక్కువగా ఉన్న 30 ప్రభుత్వ పీయూసీ కళాశాలల్లో ‘యువశక్తి కేంద్రాల’ పేరుతో అధునాతన జిమ్‌లను ఏర్పాటు చేస్తారు. జిమ్‌ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని రాష్ట్ర యువజన, క్రీడల శాఖ సమకూరుస్తోంది. నిర్వహణ మాత్రం సదరు కళాశాల యాజమాన్యమే భరించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రిన్సిపాల్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తారు. విద్యార్థి, విద్యార్థినులకు జిమ్ తరగతుల వేళలు ప్రత్యేకంగా ఉంటాయి. పెలైట్ ప్రతిపాదికన ముప్పై జిమ్‌లు మొదట ఏర్పాటు చేసి ఫలితాలను అనుసరించి రాష్ట్రంలోని మిగిలిన పీయూసీ కళాశాలలతో పాటు డిగ్రీ కాలేజీల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బహుశా వచ్చే జనవరి నుంచి యువశక్తి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై రాష్ట్ర యువజన క్రీడల శాఖ డెరైక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ... ‘ఒక్కో కేంద్రానికి రూ. 15 లక్షల విలువ చేసే జిమ్ పరికరాలను సమకూరుస్తాం. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. యువతను ముఖ్యంగా కళాశాల విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచే చర్యల్లో భాగంగా యువశక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.’ అని తెలిపారు. -
అయిదారంకెల జీతాలు...
అయిదారంకెల జీతాలు... అలసట ఎరుగని జీవితాలు...సాఫ్ట్వేర్ జాబ్‌ను అత్యంతఆదరణీయ ఉద్యోగంగా మార్చింది ఇవేనా? కాదు కాదు ఇంకా చాలా ఉన్నాయి. జీతభత్యాలవిషయంలో మాత్రమే కాదుఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పించే పనిలోనూ పోటీపడుతున్నాయి. తనకు నచ్చిన, తాను మెచ్చిన కంపెనీని ఎంచుకునే సమర్ధులైన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాలను తీర్చిదిద్దుతున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు ‘ఇంటి కన్నా ఆఫీసే పదిలం’అనుకునేలా మార్చుతున్నాయి. ..:: శిరీష చల్లపల్లి ‘ఈ రోజు ఏం సినిమా చూద్దాం? రోమన్ హాలిడే అయితే ఓకే కదా?’, ‘లేదు బాస్ ది టూరిస్ట్ చూద్దాం’ ఇలాంటి చర్చలు సాగుతున్నాయంటే.. ఆ ఫ్రెండ్స్ ఏ సినిమా థియేటర్కో వెళుతున్నారనుకుంటాం. అయితే అది కంపెనీలోని ఇన్ హౌస్ థియేటర్లో అని తెలిస్తే ఔరా సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకోకుండా ఉండలేం. ఇవే కాదు... గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పనిచేసే చోటునే పసందైన విడిదిగా మార్చుతున్న క్రమంలో ఎన్నో సౌకర్యాలు.. మరెన్నో వసతులు.. జిమ్ టు స్విమ్... టాప్ క్లాస్ ఎక్విప్మెంట్తో అల్ట్రామోడ్రన్ జిమ్‌లు ఇప్పుడు దాదాపు అన్ని పెద్ద కంపెనీల్లో సర్వసాధారణం. అంతేకాదు వర్క్‌లోడ్‌తో అలసి సొలసిన ఉద్యోగులను సేదతీర్చేందుకు స్విమ్మింగ్ పూల్స్, స్టాఫ్‌కి అనుకోని ప్రమాదం సంభవిస్తుందేమోనని లైఫ్‌గార్డ్స్ కూడా సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యం కోసం వ్యాయామాలు మాత్రమే కాదు.. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అవసరమైతే అందించడానికి ఆన్సైట్ మెడికల్ స్టాఫ్ సైతం 24/7 రెడీ. ఆటలా పాటలా.. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదు.. అయితే అస్తమానం కంప్యూటర్లతో కుస్తీ పట్టే వారికి ఆటపాటల్ని పనిలో భాగం చేయడం కష్టం కదా. అందుకే దీనికి ప్రత్యేకంగా పలు కంపెనీల్లో బిలియర్డ్స్ వంటి ఇండోర్ గేమ్స్, పింగ్ పాంగ్.. ఉంటాయి. అంతేకాదు తమ ప్రియమైన పెట్ ఇంటి దగ్గర ఎలా ఉందో అని బెంగపడకుండా ఉండేందుకు అప్పుడప్పుడు పెట్ని సైతం తమతో పాటు తెచ్చుకునే అవకాశం ఉంది. హాయిగా వర్క్ బ్రేక్‌లో పెట్స్‌తో కాలక్షేపం చేస్తే.. వావ్.. వాటె వండర్ఫుల్ టైం ఇటీజ్.. అని అనుకోకుండా ఉండలేం కదా. ఈట్ స్ట్రీట్స్... స్టార్ హోటల్ ఫుడ్‌కి తగ్గకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు స్టాఫ్‌కి అందిస్తాయి. స్థాయీ భేదాలకు అతీతంగా 3 నుంచి 7 స్టార్ హోటల్ రేంజ్లో ఇవి ఉంటాయి. స్వయంగా మాత్రమే వండుకుని తినేవారికి కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. కాంటినెంటల్, ఇటాలియన్, మల్టీక్యుజిన్ రుచుల్ని ఆస్వాదించవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ మొదలుకుని డిన్నర్ దాకా సిద్ధంగా ఉంటాయి. క్యాంటీన్లలో ఆహారం తినేటప్పుడు పొరపాటున ఏమైనా దుస్తుల మీద పడితే వెంటనే క్లీన్ చేసి ఇవ్వడానికి లాండ్రీలు కూడా ఉంటున్నాయి. అవీ ఇవీ... ఫెస్టివల్ బోనస్‌లు, అప్రైజల్ బోనస్‌లు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇంటికి తీసుకెళ్లే సౌకర్యం, అప్రిషియేషన్ రూపంలో ఎక్స్పెన్సివ్ గాడ్జెట్స్ అందుతాయి. తల్లిదండ్రులతో సహా మొత్తం ఫ్యామిలీకి హెల్త్ బెనిఫిట్స్, సొడెక్సో షాపింగ్ కూపన్స్, మీల్ కూపన్స్ కూడా. నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ తీర్థయాత్రలు లేదా ఫారిన్ విజిట్‌కి వెళితే.. ఖర్చులు కూడా కంపెనీలే భరిస్తున్నాయి. క్లబ్స్, రిసార్ట్స్‌లో సభ్యత్వాలు గిఫ్ట్స్‌గా అందిస్తున్నాయి. ఫిమేల్ ఎంప్లాయ్‌కి మెటర్నిటీ లీవ్ ఇవ్వడం మామూలే. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో తల్లికి మాత్రమే కాదు తండ్రికి కూడా లీవ్ మంజూరు చేస్తున్నారు. గూగుల్‌లో అయితే డెలివరీ అయిన తల్లికి ఒకటిన్నర ఏడాది జీతం ఇస్తారట. తండ్రికి ఆర్నెల్ల జీతం ఇస్తారు. భళా...గూగుల్... మనకు ఏ ఇన్ఫర్మేషనైనా వెంటనే గూగుల్ గుర్తుకు వస్తుంది. టాప్ క్లాస్ ఫెసిలిటీస్ అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గూగుల్ కంపెనీయే గుర్తొస్తుంది. శాలరీ సంగతి అలా ఉంచి, ఈ సంస్థ తమ ఉద్యోగుల కోసం అందిస్తున్న ఫెసిలిటీస్ వల్లే ఆ కంపెనీలో జాబ్‌కి టెకీలు విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తారట. అదే విధంగా ఇన్ఫోటెక్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, టీసీఎస్.. ఇలా మరికొన్ని కంపెనీలు కూడా అత్యున్నత వసతులు కల్పిస్తున్న జాబితాలో ఉన్నాయి. క్రియేటివిటీకి జై... క్యాంటీన్, ఇతరత్రా సౌకర్యాల సంగతెలా ఉన్నా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, కల్చరల్ యాక్టివిటీ సెంటర్లు, స్పోర్ట్స్ ఏరియాలు.. ఇలా ఒకటొకటిగా కంపెనీలు తమ ఫెసిలిటీస్‌ని విస్తరిస్తుండటానికి ఇటీవల కార్పొరేట్ సంస్థల మధ్య పెరుగుతున్న క్రియేటివ్ వార్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. క్విజ్లు, డ్యాన్స్‌లు, ఫ్యాషన్ షోలు, కార్పొరేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇంకా ఇలాంటి టాలెంట్ బేస్డ్ కాంటెస్ట్‌లు వరుసగా జరుగుతుండడం, సిబ్బంది బాగా ఆసక్తి చూపిస్తుండడంతో ఈ తరహా వసతులు ఏర్పాటు చేయడం సంస్థలకు కూడా అవసరంగా మారింది. సిబ్బందిలోని క్రియేటివిటీ పెరగడం తమ సంస్థ పేరు ప్రఖ్యాతులకు కూడా ఉపయుక్తం అవుతోందని కంపెనీలు ఆశిస్తున్నాయి. -
వ్యాయామమే సగం బలం
సైక్లింగ్‌లో వండర్స్ సృష్టించే యువకుడిగా ఆదిత్య మెహతా సిటీలో చాలా మందికి తెలుసు. రోడ్డు ప్రమాదం కారణంగా ఒక కాలును కోల్పోయినా, ఒంటి కాలితోనే వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఎన్నో రికార్డ్స్ సృష్టిస్తున్న ఆదిత్య... తన మనోనిబ్బరానికి శారీరక సామర్థ్యమూ కారణమేనంటాడు. అంతా బాగున్నవాళ్లు సైతం ‘అబ్బా ఎక్సర్‌సైజ్‌లా తర్వాత చూద్దాంలే’ అంటూ బద్దకిస్తుంటే... ఈ యంగ్ సైక్లిస్ట్ మాత్రం రెగ్యులర్ వ్యాయామంతో తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు. ‘సిటీ ప్లస్’తో మాట్లాడుతూ... తన సైక్లింగ్ ట్రైనింగ్‌ను, ఫిట్నెస్ రొటీన్‌ను పంచుకున్నాడీ కుర్రాడు. సైక్లింగ్ ట్రైనింగ్... వారంలో తొలి రోజున 50 కి.మీ. సైక్లింగ్‌తో ప్రారంభమై, రెండో రోజున 5 కి.మీ. ఆల్ అవుట్, 5 కి.మీ. క్యాజువల్ రైడింగ్ చేస్తా. మొత్తం 4 సెట్లు కలిపి ఇది 40 కి.మీ. ఉంటుంది. మూడో రోజున క్యాజువల్ రైడింగ్ 50 కి.మీ. తరువాతి రోజున తాజ్‌కృష్ణ హోటల్లో 5- 8 సార్లు నిర్విరామంగా హిల్ ట్రైనింగ్ చేస్తా. ఐదో రోజున 50 కి.మీ. క్యాజువల్ రైడింగ్. మరుసటి రోజు 20 కి.మీ. స్పీడ్ వర్క్. తరువాతి రోజు రెస్ట్. సైక్లింగ్ సాధన అయిపోగానే ఆఫీస్.. అక్కడ వర్క్ మామూలే. జిమ్‌లో వర్కవుట్స్... సాయంత్రం 5.30 గంటల నుంచి గంటకు తక్కువ కాకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తా. ఒక రోజు యాబ్స్, చెస్ట్‌కి, రెండో రోజు సర్క్యూట్ ట్రైనింగ్, నెక్స్ట్ డే లోయర్స్, ఫోర్త్ డే షోల్డర్స్, ఐదో రోజు విశ్రాంతి. ఆరో రోజు ఆర్మ్స్, ట్రైసప్స్, ఏడో రోజు మళ్లీ రెస్ట్. జిమ్ నుంచి 8.30కు ఆఫీస్‌కు వెళ్లి అకౌంట్స్ క్లోజ్ చేస్తా. నైట్ పది గంటలకు సలాడ్స్‌తో డిన్నర్... ఆ తరువాత నిద్ర. ఇదీ నా షెడ్యూల్. వాళ్లకీ వర్కవుట్స్ ఉన్నాయి... ఏదైనా కారణం వల్ల హ్యాండీక్యాప్డ్‌గా మారినంత మాత్రాన జిమ్‌కు, వర్కవుట్స్‌కి దూరం కానవసరం లేదు. డాక్టర్ల సలహాలు తీసుకుంటూ, ఫిట్నెస్ ట్రైనర్ల సూచనలతో అందరిలాగానే ఎక్సర్సైజ్లు చేయవచ్చు. స్పెషల్‌గా డిజైన్ చేసిన వర్కవుట్ రొటీన్‌ను వీరు ఫాలో అయితే సరిపోతుంది. - గెవిన్ హాల్ట్, ట్రైనర్ -
న్యూ బిగినింగ్..!
మనసు పారేసుకోవడానికి వయసుతో పనిలేదని చెప్పకనే చెప్పాడు హాలీవుడ్ స్టార్ కీను రీవ్స్. యాభై ఏళ్ల ఈ హీరో బ్రిటిష్ మోడల్ బ్రూక్‌తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఇటీవల కాలిఫోర్నియాలోని ఓ జిమ్‌లో తారసపడ్డ వీరిద్దరూ కళ్లూ.. కళ్లూ కలిపి.. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని.. డేటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసుకున్నారట. ఇక అక్కడి నుంచి ‘సందడే సందడి’ అని ఓ ఆంగ్ల పత్రిక కథనం. రీసెంట్గా బాయ్‌ఫ్రెండ్ డేవిడ్ మాకింతోష్కు గుడ్‌బై చెప్పి మెంటల్‌గా కాస్త అప్సెట్ అయిన బ్రూక్‌కు రీవ్స్‌తో రొమాన్స్ ఎంతో రిలీఫ్నిస్తుందట! -
ఇల్లే స్వర్గం!
కష్టపడే వాళ్లు, వారాంతంలో ఒకసారి రిలాక్స్ అయితే చాలు, మరో వారానికి సరిపడ శక్తి వస్తుంది. అందుకే నేను వారంతాలలో రిలాక్స్ కావడానికి ప్రాధాన్యత ఇస్తాను. ముంబాయి మహానగరంలో రిలాక్స్ కావడం కష్టమే. ఎందుకంటే వారం రోజులూ, 24 గంటలు నగరం మేల్కొనే ఉంటుంది. అందుకే బయటికి వెళ్లడం కంటే ఇంట్లో గడపడానికి ఇష్టపడతాను. నేను రిలాక్స్ కావడానికి అవసరమైన సహకారాన్ని నా కుటుంబం అందిస్తుంది. వారాంతంలో కుటుంబసభ్యులందరితో కలిసి కబుర్లు చెప్పుకోవడంలో నాకెంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఫైవ్‌స్టార్ హోటల్లో సేద తీరడం కంటే కుటుంబసభ్యులతో గడపడంలోనే సంతోషం లభిస్తుంది. దాని నుంచే రిలాక్స్ అవుతుంటాను. ముంబాయిలో రోజుకో కొత్త రెస్టారెంట్ ప్రారంభమవుతుంటుంది. విచిత్రమేమిటంటే ఇక్కడ చైనీస్, ఇటలియన్... మొదలైన ఫుడ్‌లన్నీ దొరుకుతాయి... ఒక్క ఇండియన్ ఫుడ్ తప్ప! అందుకే భోజనం విషయంలో ఇంటికి ప్రాధాన్యత ఇస్తాను. నచ్చిన భోజనం నుంచి ఇచ్చే తృప్తి నుంచి కూడా రిలాక్స్‌గా ఫీలవుతాను. జిమ్‌లో రిలాక్స్ కావడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. - అనిల్ కపూర్ -
శారీరక పనికి ప్రాధాన్యత ఇవ్వండి
హెల్త్ టాక్ జిమ్‌కు వెళ్లడాన్ని మీ దినచర్యలో భాగంగా చూసుకోండి. పని ఒత్తిడి అనే నెపంతో జిమ్‌కు డుమ్మా కొట్టొద్దు. జిమ్‌లో రోజూ కనీసం రెండు గంటలు ఉండాలి. ‘టార్గెట్ వెయిట్’ను నిర్ణయించుకొని దాని ప్రకారం వర్కవుట్‌ను ప్లాన్ చేసుకోండి. వర్కవుట్‌లో షోల్డర్స్, ఆర్మ్స్, చెస్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. బాడీ యాక్టివిటీకి మార్షల్ ఆర్ట్స్, యోగా ఉపయోగపడతాయి. వాటిని వీలైనంత తర్వగా నేర్చుకోండి. స్వీట్లు, సాఫ్ట్డ్రింకులకు వీలైనంత దూరంగా ఉండండి. రోజుకు కనీసం ఒక్క పండైనా తినండి. పోషక విలువలున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. హార్మోన్ల అసమతూకానికి కారణమయ్యే స్టెరాయిడ్లకు చాలా దూరంగా ఉండండి. ఈత, పరుగు, ఔట్‌డోర్ గేమ్స్... మొదలైన వాటి ద్వారా ‘ఫిజికల్ యాక్టివిటీ’కి ప్రాధాన్యం ఇవ్వండి.