Samantha Praises Her Trainer Snehadesu As She Lifts 30 Kg Dumbbell - Sakshi
Sakshi News home page

Samantha: అంత పవర్‌ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత

Published Mon, Oct 18 2021 2:53 PM | Last Updated on Mon, Oct 18 2021 5:38 PM

Samantha praises herTrainer Snehadesu as she lifts 30 kg dumbbell - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరోయిన్‌ సమంత ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మేరకు జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను  సమంతా షేర్‌ చేసింది. ఏకంగా తన బరువులో సగమున్న డంబెల్‌తో స్క్వాట్‌లు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది. దీంతో ఫైటర్‌ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌  చేస్తున్నారు. ఆమె ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు.


జిమ్‌లో 30 కిలోల బరువున్న డంబెల్స్‌తో  కుస్తీ పడుతున్న వైనాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది సమంత. అంతేకాదు ఈ సందర్భంగా  తన కోచ్ డాక్టర్ స్నేహ దేసుకికి తనపై ఉన్న నమ్మకంపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. జిమ్‌లో లేక పోయినా భయపెడుతున్నారంటూ స్నేహనుద్దేశించింది వ్యాఖ్యానించింది. అందుకే  కేవలం మీకోసమే 30 కిలోల బరువెత్తాను అంటూ స్నేహ  శిక్షణా సామర్థ్యంపై ప్రశంసలు  కురిపించింది.

‘‘నా పైన ఇంత పవర్‌ ఎలా  వచ్చింది మీకు.  ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా.. మీరంటే భయం. అందుకే  మీకోసం.. నా బరువులో సగం ఉన్న 30 కిలోల డంబెల్‌తో ఇలా చేయడం సాధ్యమయ్యేది కాదు’’ అంటూ డాక్టర్ స్నేహకు ధన్యవాదాలు తెలిపింది. 

కాగా నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తరువాత, విమర్శలను వివాదాలను పట్టించుకోకుండా కరియర్‌లో ముందుకు సాగుతున్న సమంత తాజాగా రెండు ప్రాజెక్టులకు సైన్‌ చేసింది.  మరోవైపు 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' డిజిటల్ అరంగేట్రంలోనే  అక్కడ కూడా భారీక్రేజ్‌ సంపాదించింది. మెల్‌బోర్న్ 2021 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజిగా నటనకు ఆమె ఉత్తమ నటి (సిరీస్) అవార్డును కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement